vinyasalu
-
ముగిసిన మలబార్–2024 విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈ నెల 8న ప్రారంభమైన మలబార్–2024 విన్యాసాలు శనివారం ముగిశాయి. హార్బర్, సీ ఫేజ్‌లో మొత్తం రెండు దశల్లో విన్యాసాలు జరిగాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్) నౌకాదళాలు సీ ఫేజ్‌లో నిర్వహించిన సముద్ర ఉపరితల, గగన తల విన్యాసాలు శత్రుదేశాలకు హెచ్చరికలు పంపినట్లుగా సాగాయి. చివరి రోజున బంగాళాఖాతంలో యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్‌డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలు జరిగాయి. విన్యాసాలు ఆద్యంతం అలరించాయి. అనంతరం నాలుగు దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ముగింపు సమావేశం జరిగింది. ఏ సమస్య వచ్చినా.. కలిసి ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతికత, శిక్షణ, అవగాహన, సహకారం తదితర అంశాలపై కలిసి పనిచేయాలని తీర్మానిస్తూ.. మలబార్–2024కి వీడ్కోలు పలికారు. -
ట్రాక్టర్‌తో విన్యాసం.. అతడి ప్రాణం తీసింది
చండీగఢ్: ట్రాక్టర్‌తో విన్యాసం చేస్తూ ఓ వ్యక్తి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా సర్చుర్లో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. సుఖ్‌మన్‌దీప్ సింగ్(29) గ్రామంలో జరుగుతున్న ఉత్సవంలోని మైదానంలో ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తున్నాడు. స్టంట్స్‌లో నిపుణుడైన సుఖ్‌మన్‌దీప్ ముందుగా తన ట్రాక్టర్ రెండు చక్రాలను గాల్లోకి లేపి కిందికి దిగాడు. ఆ వాహనం గిరగిరా తిరుగుతుండగానే తిరిగి టైరుపైకి కాలుపెట్టి డ్రైవర్ సీట్లో కూర్చునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాలు జారీ ట్రాక్టర్ వెనుక చక్రాల కిందపడిపోయాడు. వేగంగా తిరుగుతున్న ట్రాక్టర్ అతడిపైకి పలుమార్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇలాంటి తరహా వినాస్యాలు చేయకుండగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. The Punjab Government should impose a ban on such activities at events. A young man, Sukhmanjeet Singh, aged 29, lost his life while performing stunts on a tractor. He raised the front wheels, pressed the rear tires into the soil, and got down from the tractor while it was… pic.twitter.com/w8DVAN1b3u — Gagandeep Singh (@Gagan4344) October 29, 2023 -
నావికా దీప్తి.. నవదళానికి స్ఫూర్తి
కాకినాడలో ఎన్సీసీ కేడెట్ల ‘ఎ డే ఎట్ సీ’ విశాఖ నుంచి వచ్చి యుద్ధనౌక ‘ఘరియాల్’ ఉత్తేజభరితంగా నావికాదళ కదన విన్యాసాలు కాకినాడ రూరల్ : కడలిలో.. కదిలే అలలపై కట్టిన కోటలాంటిది నావికాదళం. దేశ రక్షణలో ఆ బలగాల భాగస్వామ్యం గణనీయమైనది. శత్రుదేశాలతో సమరం సాగించే సందర్భాల్లో కాక.. ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజలను ఆదుకునే కృషిలోనూ వారి పాత్ర కీలకమైనది. ఆదివారంపెద్దాపురంలో 12 రోజుల పాటు నిర్వహించే ఎన్సీసీ శిక్షణా కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 320 మంది విద్యార్థులు.. ‘ఎ డే ఎట్సీ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం కాకినాడ తీరాన నావికాదళం కృషిని తెలుసుకున్నారు. విద్యార్థులంతా ఉదయమే కాకినాడ సీ పోర్టుకు చేరుకొన్నారు. తమ కోసం విశాఖపట్నం నుంచి వచ్చిన ఐఎన్ఎస్ ఘరియాల్ యుద్ధ నౌకపై సముద్రంలో విహరించారు. నేవీ అధికారులు తమ విభాగం దేశానికి అందించే సేవలు, ఆపదల్లో, ప్రకృతి వైపరీత్యాల్లో చేసే సహాయ కార్యక్రమాలను వివరించారు. వారు అందజేస్తున్న సేవలను విద్యార్థులకు వివరించారు. యుద్ధ సమయాల్లో ఒక ఓడ నుంచి మరో ఓడకు చేరి శత్రువులను దెబ్బతీసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపారు. నావికాదళం దైనందిన కార్యకలాపాలు, వారికి ఇచ్చే శిక్షణ, దళం నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు చూపే తెగింపు, శత్రువుల దాడిని తిప్పికొట్టడంలో ప్రదర్శించే పోరాటపాటవం వంటి విన్యాసాలు విద్యార్థులను ఉత్తేజపరిచాయి. విద్యార్థులు కూడా తమ నందేహాల్ని, కుతూహలాన్నీ నావికా సిబ్బందిని అడిగి తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఎల్సీఎస్ నాయుడు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఎన్సీసీ విద్యార్థులకు నావెల్, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సేవలు తెలుసుకోవల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇటువంటి సందర్శన వారికి ఎంతో ప్రేరణనిస్తుందని, త్రివిధదళాల్లో చేరాలన్న భావనను కలిగిస్తుందని అన్నారు. ఐఎన్ఎస్ ఘరియాల్ యుద్ధనౌక కెప్టెన్ ఎస్కే సింగ్ విద్యార్థులకు నావికాదళం విశిష్టతను, వారు చేస్తున్న సేవలను వివరించారు. ప్రతి రెండేళ్లకోసారి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని కెప్టెన్ జి.వివేకానంద వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ (9) గ్రూప్ కెప్టెన్ సుధాంశ తదితరులు పాల్గొన్నారు.