experment
-
పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/సాక్షి, బెంగళూరు: గతంతో పోలిస్తే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని వరసగా మూడోసారీ విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ఆదివారం ప్రకటించింది. రీ యూజబుల్ లాంఛ్ వెహికల్(ఆర్ఎల్వీ) అభివృద్ధిలో సంక్లిష్టమైన సాంకేతికతను ఇస్రో సముపార్జించిందని ఈ ప్రయోగం మరోసారి నిరూపించింది. ఆకాశం నుంచి కిందకు విడిచిపెట్టాక గమ్యం దిశగా రావడం, ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం, వేగంగా ల్యాండ్ అవడం వంటి పరామితులను పుష్పక్‌గా పిలుచుకునే ఈ ఆర్ఎల్వీ ఖచి్చతత్వంతో సాధించిందని ఇస్రో ఆదివారం పేర్కొంది. ల్యాండింగ్ ఎక్స్పరిమెంట్(ఎల్ఈఎక్స్–03) సిరీస్‌లో మూడోది, చివరిదైన ఈ ప్రయోగాన్ని ఆదివారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఇస్రో వారి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో జరిపారు. మొదట పుష్పక్‌ను భారత వాయుసేకు చెందిన చినూక్ హెలికాప్టర్లో రన్‌వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. అది సరిగ్గా రన్‌వే వైపు ఖచి్చతత్వంతో దూసుకొచ్చి అతి గాలులున్న ప్రతికూల వాతావరణంలోనూ సురక్షితంగా ల్యాండ్ అయింది. తక్కువ ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టడం వల్ల ల్యాండింగ్ సమయంలో దాని వేగం గంటకు 320 కి.మీ.లు పెరిగింది. సాధారణంగా ల్యాండింగ్ జరుగుతున్నపుడు వాణిజ్య విమానం గంటకు 260 కి.మీ.లు, యుద్ధవిమానమైతే గంటకు 280 కి.మీ.ల వేగంతో ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ కాగానే బ్రేక్ పారాచూట్ విచ్చుకోవడంతో పుష్పక్ వేగం గంటకు 100 కి.మీ.లకు తగ్గిపోయింది. ల్యాండింగ్ గేర్ బ్రేకులు వేయడంతో పుష్పక్ ఎట్టకేలకు స్థిరంగా ఆగింది. పుష్పక్ స్వయంచాలిత రడ్డర్, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థలను సరిగా వాడుకుందని ఇస్రో పేర్కొంది. -
ట్రాక్టర్‌తో విన్యాసం.. అతడి ప్రాణం తీసింది
చండీగఢ్: ట్రాక్టర్‌తో విన్యాసం చేస్తూ ఓ వ్యక్తి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా సర్చుర్లో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. సుఖ్‌మన్‌దీప్ సింగ్(29) గ్రామంలో జరుగుతున్న ఉత్సవంలోని మైదానంలో ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తున్నాడు. స్టంట్స్‌లో నిపుణుడైన సుఖ్‌మన్‌దీప్ ముందుగా తన ట్రాక్టర్ రెండు చక్రాలను గాల్లోకి లేపి కిందికి దిగాడు. ఆ వాహనం గిరగిరా తిరుగుతుండగానే తిరిగి టైరుపైకి కాలుపెట్టి డ్రైవర్ సీట్లో కూర్చునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాలు జారీ ట్రాక్టర్ వెనుక చక్రాల కిందపడిపోయాడు. వేగంగా తిరుగుతున్న ట్రాక్టర్ అతడిపైకి పలుమార్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇలాంటి తరహా వినాస్యాలు చేయకుండగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. The Punjab Government should impose a ban on such activities at events. A young man, Sukhmanjeet Singh, aged 29, lost his life while performing stunts on a tractor. He raised the front wheels, pressed the rear tires into the soil, and got down from the tractor while it was… pic.twitter.com/w8DVAN1b3u — Gagandeep Singh (@Gagan4344) October 29, 2023 -
పత్తి విత్తన పరిశోధనలు పెరగాలి
నంద్యాలరూరల్: పత్తి విత్తనంపై పరిశోధనలు పెరగాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఎన్‌వీనాయుడు కోరారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విజన్ 2030 లక్ష్యంగా పత్తి విత్తన పరిశోధనలపై శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏడీఆర్ గోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు అతిథిగా డాక్టర్ నాయుడు హాజరై మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలు పత్తి విత్తన పరిశోధనల్లో ముందున్నాయని, వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన పత్తి విత్తన వంగడాల ఆవిష్కరణకు సంసిద్ధం కావాలని కోరారు. అందు కోసమే విజన్ డాక్యుమెంట్ 2030పేరుతో శాస్త్రవేత్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పత్తి సాగు అధికంగా ఉందని, రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. దిగుబడుల్లో మాత్రం గుంటూరు జిల్లానే ముందుంటుందని, ఈ వ్యత్యాసానికి కారణాలు కనుగొనాలని సూచించారు. భూసార పరీక్షలు ఆధారంగానే ఎరువులు వాడే పద్ధతిని రైతులకు తెలియజేయాలని చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నూతన వంగడాలు, యాజమాన్య పద్ధతులు, చెరుకు, చిరుధాన్యాల సాగు, వాటిపై వివరించారు. ఏడీఆర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రైతుల ముంగిటకు నూతన వంగడాలను ఆవిష్కరించారని, అందులో పత్తి, వరి, శనగ, పొద్దుతిరుగుడు, కొర్ర, జొన్న, ఎంతో ప్రాచుర్యం పొందాయని వివరించారు. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఏడు నూతన వంగడాల ఆవిష్కరణలో నాలుగు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి శాస్త్రవేత్తలు ఆవిష్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం డ్రైల్యాండ్ అగ్రికల్చర్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ పద్మలత, సీనియర్ పత్తి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ చెంగారెడ్డి, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రామారెడ్డి, డాక్టర్ జోసెఫ్‌రెడ్డి, తదితర సీనియర్, జూనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో బయోడీజిల్ ప్రయోగం
– ప్రయోగాత్మకంగా నాలుగు డిపోల్లో అమలు – ప్రతి తొమ్మిది లీటర్ల డీజిల్‌లో ఒక లీటర్ కలిపి వినియోగం – ప్రయోగాత్మకంగా నాలుగు డిపోల్లో అమలు ఆళ్లగడ్డ: పర్యావరణానికి అనుకూలమైన జీవ ఇంధనం (బయోడీజిల్) వినియోగంపై ఏపీఎస్ ఆర్టీసీ దష్టి సారించింది. బయోడీజిల్ వినియోగంతో లాభనష్టాలను పరిశీలించేందుకు ప్రయోగాత్మకంగా అడుగులు వేసింది. పర్యావరణం పరిరక్షణతో పాటు సంస్థపై ఆర్థిక భారం కూడా కొంత తగ్గుతుందనే ఆలోచనతో అధికారులు ప్రయోగాన్ని ప్రారంభించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బయోడీజిల్ వాడకాన్ని కొంత కాలంగా వినియోగిస్తోంది. అక్కడ ఇప్పటికే 20 శాతం బయోడీజిల్, 80 శాతం డీజిల్‌తో బస్సులను నడుపుతుండగా ఇటీవల పూర్తిగా బయో డీజిల్ నడిచే బస్సులనూ కూడా ప్రవేశ పెట్టింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ బయోడీజిల్ వినియోగంపై దష్టి సారించారు. ప్రస్తుతం ఇక్కడ 10 శాతం బయోడీజిల్, 90 శాతం డీజిల్ వాడుతూ బస్సులను నడుపుతున్నారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై పరిశీలించేందుకు మొదటగా జిల్లాలోని ఆళ్లగడ్డ, ఆత్మకూరు, కోవెలకుంట్ల, ఆదోని –2 డిపోల్లో బయో డీజిల్ ప్రారంభించారు. డీజిల్ రూ. 57.60 కాగా బయో డీజిల్ రూ 55.53 (ప్రస్తుతానికి) కావడంతో ప్రతి లీటర్‌కు రూ 2.7 ఆదా అవుతోంది. ఈ లెక్కన ప్రతి వంద లీటర్లకు రూ.207 మిగులుతుందని అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో పరిశీలన ఆర్టీసీ బస్సులకు బయోడీజిల్ వినియోగం విషయంలో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా వినియోగిస్తు ఎటువంటి ప్రయోజనం ఉంది. కేఎంపీఎల్ తగ్గిందా.. పెరుగుతోందా.. ఇతర సాంకేతిక ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా... అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా జిల్లాలోని మిగిలిన డిపోల్లో అమలు చేయడం, బయోడీజిల్ వినియోగ శాతం పెంచడం తదితర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో 82 బస్సులు ఉంగా. వీటిలో 79 బస్సులు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. ఇందులో అద్దె బస్సులు పోను 52 బస్సులకు బయోడీజిల్ వినియోగిస్తున్నారు. వీటికి రోజుకు సగటున 3000 నుంచి 3500 లీటర్ల వరకు డీజిల్ వినియోగిస్తున్నారు. ఈ లెక్కన నెలకు 1.05 లక్షల లీటర్ల డీజిల్ వాడుతుండగా ఇందులో సుమారు 10 వేల లీటర్లు బయో డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇబ్బందులు లేవు: కిరణ్‌కుమార్, డిపో మేనేజర్ ఐదు నెలలుగా బయోడీజిల్ వాడకంతో పెద్దగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రస్తుతానికి సంస్థ బస్సులకు మాత్రమే వినియోగిస్తున్నాం. అద్దె బస్సులకు వినియోగించడం లేదు. ఇంకా కొన్ని రోజులు పూర్తిగా పరిశీలించాల్సి ఉంది.