ఆర్టీసీ బస్సుల్లో బయోడీజిల్ ప్రయోగం
ఆర్టీసీ బస్సుల్లో బయోడీజిల్ ప్రయోగం
Published Thu, Aug 11 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
– ప్రయోగాత్మకంగా నాలుగు డిపోల్లో అమలు
– ప్రతి తొమ్మిది లీటర్ల డీజిల్‌లో ఒక లీటర్ కలిపి వినియోగం
– ప్రయోగాత్మకంగా నాలుగు డిపోల్లో అమలు
ఆళ్లగడ్డ: పర్యావరణానికి అనుకూలమైన జీవ ఇంధనం (బయోడీజిల్) వినియోగంపై ఏపీఎస్ ఆర్టీసీ దష్టి సారించింది. బయోడీజిల్ వినియోగంతో లాభనష్టాలను పరిశీలించేందుకు ప్రయోగాత్మకంగా అడుగులు వేసింది. పర్యావరణం పరిరక్షణతో పాటు సంస్థపై ఆర్థిక భారం కూడా కొంత తగ్గుతుందనే ఆలోచనతో అధికారులు ప్రయోగాన్ని ప్రారంభించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బయోడీజిల్ వాడకాన్ని కొంత కాలంగా వినియోగిస్తోంది. అక్కడ ఇప్పటికే 20 శాతం బయోడీజిల్, 80 శాతం డీజిల్‌తో బస్సులను నడుపుతుండగా ఇటీవల పూర్తిగా బయో డీజిల్ నడిచే బస్సులనూ కూడా ప్రవేశ పెట్టింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ బయోడీజిల్ వినియోగంపై దష్టి సారించారు. ప్రస్తుతం ఇక్కడ 10 శాతం బయోడీజిల్, 90 శాతం డీజిల్ వాడుతూ బస్సులను నడుపుతున్నారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై పరిశీలించేందుకు మొదటగా జిల్లాలోని ఆళ్లగడ్డ, ఆత్మకూరు, కోవెలకుంట్ల, ఆదోని –2 డిపోల్లో బయో డీజిల్ ప్రారంభించారు. డీజిల్ రూ. 57.60 కాగా బయో డీజిల్ రూ 55.53 (ప్రస్తుతానికి) కావడంతో ప్రతి లీటర్‌కు రూ 2.7 ఆదా అవుతోంది. ఈ లెక్కన ప్రతి వంద లీటర్లకు రూ.207 మిగులుతుందని అధికారులు చెబుతున్నారు.
పూర్తిస్థాయిలో పరిశీలన
ఆర్టీసీ బస్సులకు బయోడీజిల్ వినియోగం విషయంలో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా వినియోగిస్తు ఎటువంటి ప్రయోజనం ఉంది. కేఎంపీఎల్ తగ్గిందా.. పెరుగుతోందా.. ఇతర సాంకేతిక ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా... అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీని ఆధారంగా జిల్లాలోని మిగిలిన డిపోల్లో అమలు చేయడం, బయోడీజిల్ వినియోగ శాతం పెంచడం తదితర చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలో 82 బస్సులు ఉంగా. వీటిలో 79 బస్సులు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. ఇందులో అద్దె బస్సులు పోను 52 బస్సులకు బయోడీజిల్ వినియోగిస్తున్నారు. వీటికి రోజుకు సగటున 3000 నుంచి 3500 లీటర్ల వరకు డీజిల్ వినియోగిస్తున్నారు. ఈ లెక్కన నెలకు 1.05 లక్షల లీటర్ల డీజిల్ వాడుతుండగా ఇందులో సుమారు 10 వేల లీటర్లు బయో డీజిల్‌ను వినియోగిస్తున్నారు.
ప్రస్తుతానికి ఇబ్బందులు లేవు: కిరణ్‌కుమార్, డిపో మేనేజర్
ఐదు నెలలుగా బయోడీజిల్ వాడకంతో పెద్దగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రస్తుతానికి సంస్థ బస్సులకు మాత్రమే వినియోగిస్తున్నాం. అద్దె బస్సులకు వినియోగించడం లేదు. ఇంకా కొన్ని రోజులు పూర్తిగా పరిశీలించాల్సి ఉంది.
Advertisement
Advertisement