పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష సక్సెస్‌ | ISRO successfully conducts 3rd and final landing experiment of Reusable Launch | Sakshi
Sakshi News home page

పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష సక్సెస్‌

Published Mon, Jun 24 2024 5:14 AM | Last Updated on Mon, Jun 24 2024 5:15 AM

ISRO successfully conducts 3rd and final landing experiment of Reusable Launch

మూడోసారి విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో 

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/సాక్షి, బెంగళూరు: గతంతో పోలిస్తే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని వరసగా మూడోసారీ విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ఆదివారం ప్రకటించింది. రీ యూజబుల్‌ లాంఛ్‌ వెహికల్‌(ఆర్‌ఎల్‌వీ) అభివృద్ధిలో సంక్లిష్టమైన సాంకేతికతను ఇస్రో సముపార్జించిందని ఈ ప్రయోగం మరోసారి నిరూపించింది.

 ఆకాశం నుంచి కిందకు విడిచిపెట్టాక గమ్యం దిశగా రావడం, ల్యాండింగ్‌ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం, వేగంగా ల్యాండ్‌ అవడం వంటి పరామితులను పుష్పక్‌గా పిలుచుకునే ఈ ఆర్‌ఎల్‌వీ ఖచి్చతత్వంతో సాధించిందని ఇస్రో ఆదివారం పేర్కొంది. ల్యాండింగ్‌ ఎక్స్‌పరిమెంట్‌(ఎల్‌ఈఎక్స్‌–03) సిరీస్‌లో మూడోది, చివరిదైన ఈ ప్రయోగాన్ని ఆదివారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఇస్రో వారి ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో జరిపారు. 

మొదట పుష్పక్‌ను భారత వాయుసేకు చెందిన చినూక్‌ హెలికాప్టర్‌లో రన్‌వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. అది సరిగ్గా రన్‌వే వైపు ఖచి్చతత్వంతో దూసుకొచ్చి అతి గాలులున్న ప్రతికూల వాతావరణంలోనూ సురక్షితంగా ల్యాండ్‌ అయింది. తక్కువ ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టడం వల్ల ల్యాండింగ్‌ సమయంలో దాని వేగం గంటకు 320 కి.మీ.లు పెరిగింది.

 సాధారణంగా ల్యాండింగ్‌ జరుగుతున్నపుడు వాణిజ్య విమానం గంటకు 260 కి.మీ.లు, యుద్ధవిమానమైతే గంటకు 280 కి.మీ.ల వేగంతో ల్యాండ్‌ అవుతాయి. ల్యాండ్‌ కాగానే బ్రేక్‌ పారాచూట్‌ విచ్చుకోవడంతో పుష్పక్‌ వేగం గంటకు 100 కి.మీ.లకు తగ్గిపోయింది. ల్యాండింగ్‌ గేర్‌ బ్రేకులు వేయడంతో పుష్పక్‌ ఎట్టకేలకు స్థిరంగా ఆగింది. పుష్పక్‌ స్వయంచాలిత రడ్డర్, నోస్‌ వీల్‌ స్టీరింగ్‌ వ్యవస్థలను సరిగా వాడుకుందని ఇస్రో పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement