test launched
-
పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/సాక్షి, బెంగళూరు: గతంతో పోలిస్తే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని వరసగా మూడోసారీ విజయవంతంగా పరీక్షించినట్లు ఇస్రో ఆదివారం ప్రకటించింది. రీ యూజబుల్ లాంఛ్ వెహికల్(ఆర్ఎల్వీ) అభివృద్ధిలో సంక్లిష్టమైన సాంకేతికతను ఇస్రో సముపార్జించిందని ఈ ప్రయోగం మరోసారి నిరూపించింది. ఆకాశం నుంచి కిందకు విడిచిపెట్టాక గమ్యం దిశగా రావడం, ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖచ్చితంగా ఎంచుకోవడం, వేగంగా ల్యాండ్ అవడం వంటి పరామితులను పుష్పక్‌గా పిలుచుకునే ఈ ఆర్ఎల్వీ ఖచి్చతత్వంతో సాధించిందని ఇస్రో ఆదివారం పేర్కొంది. ల్యాండింగ్ ఎక్స్పరిమెంట్(ఎల్ఈఎక్స్–03) సిరీస్‌లో మూడోది, చివరిదైన ఈ ప్రయోగాన్ని ఆదివారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఇస్రో వారి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో జరిపారు. మొదట పుష్పక్‌ను భారత వాయుసేకు చెందిన చినూక్ హెలికాప్టర్లో రన్‌వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టారు. అది సరిగ్గా రన్‌వే వైపు ఖచి్చతత్వంతో దూసుకొచ్చి అతి గాలులున్న ప్రతికూల వాతావరణంలోనూ సురక్షితంగా ల్యాండ్ అయింది. తక్కువ ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టడం వల్ల ల్యాండింగ్ సమయంలో దాని వేగం గంటకు 320 కి.మీ.లు పెరిగింది. సాధారణంగా ల్యాండింగ్ జరుగుతున్నపుడు వాణిజ్య విమానం గంటకు 260 కి.మీ.లు, యుద్ధవిమానమైతే గంటకు 280 కి.మీ.ల వేగంతో ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ కాగానే బ్రేక్ పారాచూట్ విచ్చుకోవడంతో పుష్పక్ వేగం గంటకు 100 కి.మీ.లకు తగ్గిపోయింది. ల్యాండింగ్ గేర్ బ్రేకులు వేయడంతో పుష్పక్ ఎట్టకేలకు స్థిరంగా ఆగింది. పుష్పక్ స్వయంచాలిత రడ్డర్, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థలను సరిగా వాడుకుందని ఇస్రో పేర్కొంది. -
గగన్ యాన్ టెస్ట్ లాంచ్ విజయవంతం
-
ఆర్ఎల్వీ పరీక్ష విజయవంతం
సూళ్ళూరుపేట/సాక్షి బెంగళూరు: గగన్‌యాన్ ప్రాజెక్టు పరిశోధనా పరీక్షల్లో భాగంగా రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటనామస్ ల్యాండింగ్ మిషన్(ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్) రాకెట్ ప్రయోగ పరీక్షలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కుందాపురం సమీపంలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్)లో ఈ పరీక్ష చేపట్టారు. భారత వైమానిక దళానికి సంబంధించిన చినోక్ అనే హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ రాకెట్‌ను ఉదయం 7.10 గంటలకు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఆర్ఎల్వీ–ఎల్ఈఎక్స్లోని మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్ కమాండ్ ఆధారంగా రాకెట్ తిరిగి 7.40 గంటలకు భూమిపై నిర్దేశిత ప్రాంతంలో క్షేమంగా ల్యాండయ్యింది. ముందస్తుగా సిద్ధం చేసి రూపొందించిన నేవిగేషన్, గైడెన్స్, నియంత్రణ వ్యవస్థల సహాయంతో ఈ మానవ రహిత లాంచింగ్ వాహనం ఎలాంటి ఆటంకం లేకుండా భూమిపైకి చేరింది. ఈ ప్రయోగంలో ఇస్రోతోపాటు డీఆర్డీవో, భారత వైమానిక దళం కూడా భాగస్వామిగా మారింది. ప్రపంచంలోనే మొదటిసారిగా హెలికాప్టర్ సహాయంతో ఆర్ఎల్వీ లాంటి రాకెట్‌ను ఆకా«శంలో వదిలి, తిరిగి విజయవంతంగా భూమి మీదకు చేర్చిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలకే దక్కిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఆర్ఎల్వీ ప్రాజెక్టు నిర్వహణ బృందాన్ని ఆయన అభినందించారు. 2016 మే 23న ఆర్ఎల్వీ–టీడీ పేరుతో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024 ఆఖరుకు గగన్‌యాన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించిన ఇస్రోకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రయోగ రాకెట్ ల్యాండ్ అయిన దృశ్యం -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని భారతీయ నావికా దళం ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ– డీఆర్డీఓ దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి షిప్ లాంచ్డ్ వెర్షన్‌ను అరేబియా సముద్రంలో పరీక్షించినట్లు సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. భారత్–రష్యా సంయుక్త భాగస్వామ్య బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, విమానాలు, ఓడలతోపాటు నేలపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేస్తోంది. బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు. వీటిని భారత్ ఎగుమతి కూడా చేస్తోంది. ఇందుకు సంబంధించి గత ఏడాది ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి యాంటీ షిప్ వెర్షన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో భారత్ విజయవంతంగా ప్రయోగించింది. -
అగ్ని5కి ఆఖరి టెస్ట్.. ఇక చైనాకు చెక్!
-
అగ్ని -5 క్షిపణి పరీక్ష విజయవంతం
-
అగ్ని5కి ఆఖరి టెస్ట్.. ఇక చైనాకు చెక్!
భువనేశ్వర్: స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్ రిసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రూపొందించిన అగ్ని-5 ఖండాంతర క్షిపణిని మరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో గల కలామ్ ఐల్యాండ్ నుంచి సోమవారం ఉదయం శాస్త్రవేత్తలు ఈ క్షిపణిని పరీక్షించారు. ఈ అగ్ని-5 క్షిపణి 5వేల నుంచి ఆరు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇంకా చెప్పాలంటే ఉత్తర చైనాలోని ఏప్రాంతాన్నైనా అగ్ని-5లక్ష్యంగా చేసుకోగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి దాదాపు 1500 కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది. ఈ క్షిపణికి పరీక్ష జరపడం ఇది నాలుగోసారి. గతంలో జరిపిన మూడు పరీక్షలు విజయవంతమయ్యాయి. తాజాగా జరిపిన పరీక్ష కూడా విజయవంతం కావడంతో ఇక సైన్యం చేతిలోకి క్షిపణి వెళ్లనుంది. మూడంచెల స్టేజ్ ఉండే అగ్ని-5.. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పక్కాగా ఛేదించగలదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించారు. అయితే దీని రేంజ్ 8వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందనేది అనధికారిక సమాచారం. ఇప్పటికే భారత అమ్ములపొదిలో అగ్ని-1(700 కిలోమీటర్లు), అగ్ని-2(2వేల కిలోమీటర్లు), అగ్ని-3(2500 కిలోమీటర్లు), అగ్ని-4(3500 కిలోమీటర్ల లక్ష్య ఛేదన) క్షిపణులు ఉన్నాయి. ఈ పరీక్ష విజయవంతమైనందున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డీఆర్డీవోకు అభినందనలు తెలిపారు. అగ్ని-5 కొన్ని అంశాలు 1. 5,500 నుంచి 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తునీయలు చేయగల ఖండాంతర క్షిపణి అగ్ని-5 2. దేశీయంగా సిద్ధం చేస్తున్న క్షిపణుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ క్షిపణిని డీఆర్డీవో రూపొందించి పర్యవేక్షిస్తోంది. 3.అగ్ని 5కు అణు సామర్థ్యం ఉంది. 1,500 కేజీల పేలుడు పదార్థాలను ఒకేసారి తీసుకెళ్లగలుగుతుంది 4. అగ్ని క్షిపణుల వరుసలో ఇది ఐదో తరంది. ఇప్పటికే భారత అమ్ములపొదిలో అగ్ని 1, 2, 3,4 ఉన్నాయి 5.అగ్ని 5 పూర్తి స్థాయి సామర్థ్యంతో విజయం సాధిస్తే సుదూరంలోని శత్రువులను ఈ క్షిపణిచే తుదముట్టించే అవకాశం ఉంటుంది. 6.అగ్ని 5 క్షిపణిని 2012, 2013, 2015లో పరీక్షించారు 7.నేడు ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో జరిగిన పరీక్షే ఇక ఆఖరిది. 8.తాజా పరీక్ష విజయవంతం అయితే, దీనిని వ్యూహాత్మక బలగాలు తొలుత ఉపయోగించి అనంతరం మిలటరీకి అప్పగిస్తారు.