న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణిని భారతీయ నావికా దళం ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ– డీఆర్‌డీఓ దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి షిప్ లాంచ్డ్ వెర్షన్‌ను అరేబియా సముద్రంలో పరీక్షించినట్లు సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు.
భారత్–రష్యా సంయుక్త భాగస్వామ్య బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, విమానాలు, ఓడలతోపాటు నేలపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేస్తోంది. బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు. వీటిని భారత్ ఎగుమతి కూడా చేస్తోంది. ఇందుకు సంబంధించి గత ఏడాది ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి యాంటీ షిప్ వెర్షన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో భారత్ విజయవంతంగా ప్రయోగించింది.
Comments
Please login to add a commentAdd a comment