BrahMos supersonic cruise missile
-
Defense Deals: రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు ఒప్పందాలు
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, అత్యాధునిక రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, మిగ్–29 జెట్ విమానాలకు ఏరో ఇంజిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం రూ.39,125 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో ఒకటి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్(బీఏపీఎల్)తో రెండు, లార్సెన్ అండ్ టూబ్రోతో రెండు ఒప్పందాలు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్ అరమానె సమక్షంలో శుక్రవారం ఆయా సంస్థల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ‘సైనిక బలగాల పోరాట సామర్థ్యాన్ని మరింత ఇనుమడింప జేసే ఈ ఒప్పందాలు దేశీయ సంస్థల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తాయి. భవిష్యత్తులో విదేశీ పరికరాల తయారీపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి’అని రక్షణశాఖ తెలిపింది. ఒప్పందంలో భాగంగా భారత్– రష్యాల జాయింట్ వెంచర్ బీఏపీఎల్ నుంచి 200 బ్రహ్మోస్ క్షిపణులను రక్షణశాఖ కొనుగోలు చేయనుంది. -
బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించిన నేవీ
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. నేవీకి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మర్ముగోవాపై నుంచి ప్రయోగించినట్లు ఆదివారం వెల్లడించారు. ఐఎన్ఎస్ మర్ముగోవాతోపాటు బ్రహ్మోస్ క్షిపణి కూడా దేశీయంగా తయారైనవేనని చెప్పారు. సముద్రజలాలపై మన నావికాదళ శక్తిని, దేశ ఆత్మనిర్భరతకు చాటిచెప్పే పరిణామమని వివరించారు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు వేగంతో ఇది దూసుకెళ్లిందన్నారు. భారత్–రష్యా ఉమ్మడిగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతోపాటు భూమిపై నుంచి సైతం ప్రయోగించేందుకు వీలున్న బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తోంది. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని భారతీయ నావికా దళం ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ– డీఆర్డీఓ దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి షిప్ లాంచ్డ్ వెర్షన్‌ను అరేబియా సముద్రంలో పరీక్షించినట్లు సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. భారత్–రష్యా సంయుక్త భాగస్వామ్య బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, విమానాలు, ఓడలతోపాటు నేలపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేస్తోంది. బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు. వీటిని భారత్ ఎగుమతి కూడా చేస్తోంది. ఇందుకు సంబంధించి గత ఏడాది ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి యాంటీ షిప్ వెర్షన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో భారత్ విజయవంతంగా ప్రయోగించింది. -
ఫైటర్ జెట్ నుంచి దూసుకెళ్లిన ‘బ్రహ్మోస్’ మిసైల్
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలు పెరుగుతున్న వేళ రక్షణ రంగ సామర్థ్యాన్ని మెరుగుపరిచే మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది భారత్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి పరీక్షించింది భారత వాయుసేన. గగనతలం నుంచి దూసుకెళ్లిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. ‘సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ బంగాళకాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో భూతల, సముద్రంలోని సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్ధ్యాన్ని వైమానిక దళం సాధించింది. సుఖోయ్-30ఎంకేఐతో ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ మిసైల్‌ను జత చేయడం ద్వారా భారత వైమానిక దళానికి వ్యూహాత్మక బలాన్ని చేకూర్చింది. భవిష్యత్తులో ఎదురయ్యే యుద్ధాల్లో పైచేయి సాధించే అవకాశాన్ని కల్పించింది.’ - భారత రక్షణ శాఖ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత వాయుసేన ట్విట్టర్లో షేర్ చేసింది. ఎయిర్‌ఫోర్స్, నేవీ, డీఆర్డీఓ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్లు భారత వాయుసేన తెలిపింది. మరోవైపు.. యుద్ధ విమానం నుంచి క్షిపణులను పరీక్షించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనూ ఇలాంటి పరీక్షలు నిర్వహించారు. 290 కిలోమీటర్ల రేంజ్ నుంచి 350 కిలోమీటర్లుకు పెంచిన మిసైల్‌ను సుఖోయ్ ఫైటర్ నుంచి ప్రయోగించి విజయం సాధించింది వాయుసేన. The IAF successfully fired the Extended Range Version of the Brahmos Air Launched missile. Carrying out a precision strike against a Ship target from a Su-30 MKI aircraft in the Bay of Bengal region, the missile achieved the desired mission objectives. pic.twitter.com/fiLX48ilhv — Indian Air Force (@IAF_MCC) December 29, 2022 ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
బ్రహ్మోస్ మరింత శక్తివంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కొత్త వెర్షన్‌ను భారత్ అభివృద్ధి చేస్తోంది. వాయుమార్గాన ప్రయోగించే ఈ కొత్త వెర్షన్ బ్రహ్మోస్ 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి లక్ష్యాన్ని ఛేదించగలదని అంచనా. ఇప్పటివరకు దీని పరిధి దాదాపు 300 కిలోమీటర్లుంది. బ్రహ్మోస్ రేంజ్ ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూ వస్తున్నారని, సాఫ్ట్‌వేర్‌లో చిన్న మార్పుతో రేంజ్‌ను 500 కిలోమీటర్లు పెంచవచ్చని, తాజాగా దీని టార్గెట్ రేంజ్‌ను 800కిలోమీటర్లకు చేరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని సు– 30 ఎంకేఐ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రయోగిస్తారు. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద బ్రహ్మోస్ మిస్సైల్ అమర్చిన సు–30 విమానాలు 40 ఉన్నాయి. -
బ్రహ్మోస్ సక్సెస్
బాలాసోర్ (ఒడిశా): ప్రపంచంలోనే అత్యంత వేగమైన బ్రహ్మోస్ సూపర్ క్రూయిజ్ క్షిపణిని భారత శాస్త్రవేత్తలు సోమవారం విజయ వంతం గా ప్రయోగించారు. ఒడిశా తీరంలోని చాం దీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లాంచ్ ప్యాడ్ 3లోని మొబైల్ లాంచర్ ద్వారా ఉదయం 10.40 గంటలకు క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు డీఆర్ డీవో వెల్లడించింది. బ్రహ్మోస్ జీవిత కాలాన్ని పొడిగించేందుకుగాను తాజా ప్రయోగాన్ని చేపట్టినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించిన సాంకేతికతను డీఆర్డీవో, బ్రహ్మోస్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తొలిసారి భారత్‌లో అభివృద్ధి చేశారు. ప్రస్తుత ప్రయోగంతో ఇండియన్ ఆర్మీకి మిస్సైల్స్ కోసం చేయాల్సిన ఖర్చు భారీగా తగ్గనుంది. మిస్సైల్ వినియోగ కాలాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతూ దీని సాంకేతికతలో మార్పులు చేశా రు. జీవిత కాలాన్ని పొడిగించిన భారతదేశ మొ దటి క్షిపణి బ్రహ్మోస్ కావడం గమనార్హం. భూ మిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన.. ఇలా త్రివిధ దళా ల్లో ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువు గా ఉండే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ దేశ భద్రతకు సేవలందిస్తోంది. -
స్వదేశీ సీకర్‌తో ‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్
సాక్షి, హైదరాబాద్/పోఖ్రాన్/న్యూఢిల్లీ: రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులకు అనువైన ఆర్ఎఫ్ సీకర్ల తయారీలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు విజయం సాధించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ టెస్ట్‌రేంజ్‌లో గురువారం ఉదయం ఈ సీకర్లను అమర్చిన బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. క్షిపణులు తమ లక్ష్యాన్ని కచ్చితత్వంతో గుర్తించడంలో ఈ సీకర్లు అత్యంత కీలకమైనవి. హైదరాబాద్ శివార్లలో ఉన్న డీఆర్డీవో కేంద్రంలో తయారైన ఈ సీకర్లను గురువారం తొలిసారి బ్రహ్మోస్ క్షిపణిలో ప్రయోగించి మంచి ఫలితాలు రాబట్టారు. మూడు నెలల క్రితం ఈ క్షిపణులను సుఖోయ్ –30 యుద్ధవిమానాల ద్వారా విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. 2.5 టన్నుల బరువుతో 8.4 మీటర్ల పొడవుండే బ్రహ్మోస్ 300 కేజీల వార్హెడ్లను మోసుకుపోగలదు. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించగల ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 3457.44 కి.మీ(2.8 మ్యాక్) వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణిని గంటకు 6,174 కి.మీ(5 మ్యాక్) వేగంతో వెళ్లేలా ఇటీవల అప్‌గ్రేడ్ చేశారు. గతేడాది భారత్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్(ఎంటీసీఆర్)లో చేరిన నేపథ్యంలో బ్రహ్మోస్ పరిధిని 400 కిలోమీటర్లకు పెంచడంపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం దృష్టి సారించారు. స్వావలంబన దిశగా.. రక్షణ రంగంలో స్వావలంబన అన్నది భారత్ చిరకాల వాంఛ. పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించడంతో అగ్రరాజ్యాలు భారత్‌కు సాంకేతిక బదిలీపై ఆంక్షలు విధించాయి. దీంతో దేశరక్షణకు సంబంధించి పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినప్పటకీ అవి పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పటికీ మనం క్షిపణులకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఆర్ఎఫ్ సీకర్ల ద్వారా బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దులో పాకిస్తాన్, చైనాలు కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో బ్రహ్మోస్ క్షిపణుల్ని సుఖోయ్–30 యుద్ధవిమానాలకు అమర్చడం సరైన నిర్ణయమేనని రక్షణరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు స్వదేశీ సీకర్ అమర్చిన బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. -
సుఖోయ్‌కు బ్రహ్మోస్
న్యూఢిల్లీ: రష్యన్ తయారీ సుఖోయ్–30 యుద్ధవిమానాల్లో సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను అమర్చే ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 40 సుఖోయ్ యుద్ధవిమానాలకు ఈ క్షిపణుల్ని అమర్చనున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రక్రియ 2020 నాటికల్లా పూర్తికావొచ్చన్నాయి. సుఖోయ్–30 యుద్ధవిమానం ద్వారా తొలిసారి బ్రహ్మోస్‌ను నవంబర్ 22న ప్రయోగించిన సంగతి తెలిసిందే. సుఖోయ్‌ల్లో బ్రహ్మోస్ క్షిపణుల్ని అమర్చే ప్రక్రియను ప్రభుత్వరంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేపట్టింది. తాజాగా సుఖోయ్ యుద్ధవిమానాల్లో ఈ మార్పులు చేపడితే.. సముద్రంపై, భూభాగాలపై ఉన్న సుదూర లక్ష్యాల్ని ఛేదించగల సామర్థ్యం వాయుసేనకు సమకూరుతుంది. భారత్–రష్యా రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి ధ్వనికంటే 3 రెట్లు వేగంగా దూసుకుపోతుంది. 2.5 టన్నుల బరువున్న ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. -
వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం!
-
చరిత్ర సృష్టించిన బ్రహ్మోస్
న్యూఢిల్లీ: వాయు సేనలో సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను ప్రవేశపెట్టేందుకు గొప్ప ముందడుగు పడింది. ఇది వరకే భూ ఉపరితలం, సముద్రం నుంచి పరీక్షించిన ఈ క్షిపణిని బుధవారం యుద్ధ విమానం సుఖోయ్–30 నుంచి తొలిసారి విజయవంతంగా ప్రయోగించారు. దీంతో బ్రహ్మోస్ త్రివిధ దళాల్లో పనిచేసేందుకు తన సమర్థతను చాటుకున్నట్లయింది. ఈ పరిణామంపై రక్షణ శాఖ, ఐఏఎఫ్ హర్షం వ్యక్తం చేశాయి. పరీక్ష జరిగిన తీరును రక్షణ శాఖ వివరిస్తూ...గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని సుఖోయ్–30 నుంచి బ్రహ్మోస్‌ను ప్రయోగించగా, క్షిపణి ఇంజిన్ రెండు దశల్లో మండి నేరుగా లక్ష్యాన్ని చేరుకుందని తెలిపింది. సుఖోయ్‌లో బ్రహ్మోస్‌ను అమర్చడం సవాలుతో కూడుకున్న పని అని ఐఏఎఫ్ వెల్లడించింది. ఇందుకోసం సుఖోయ్‌లో మెకానికల్, ఎలక్ట్రికల్, సాఫ్ట్వేర్ పరంగా పలు మార్పులు చేశామని పేర్కొంది. వాయుసేనకు అమూల్యం.... తాజాగా బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని బ్రహ్మోస్ ఛేదించడం... ఆకాశం నుంచి ఆ క్షిపణిని ప్రయోగించే వాయుసేన సామర్థ్యాన్ని తేటతెల్లం చేస్తోందని రక్షణ శాఖ పేర్కొంది. ఈ తరగతికి చెందిన క్షిపణిని ప్రయోగించిన తొలి వాయుసేన తమదేనని ఐఏఎఫ్ ప్రకటించింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో సముద్రం లేదా నేలపై ఉన్న సుదూర లక్ష్యాలను చాలా కచ్చితత్వంతో ఛేదించేందుకు బ్రహ్మోస్ తమకు ఎంతో దోహదపడుతుందని తెలిపింది. బ్రహ్మోస్, సుఖోయ్–30ల కాంబినేషన్ వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొంది. ‘ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ చరిత్ర సృష్టించింది. తొలిసారి సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయాణించి బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది’ అని రక్షణ శాఖ ప్రకటన జారీచేసింది. చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని హర్షం... సుఖోయ్ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. బ్రహ్మోస్ ప్రత్యేకతలు... ► 290 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ధ్వనివేగం కంటే మూడురెట్ల అధిక వేగంతో కచ్చితంగా ఛేదించగలదు. ► ఆర్మీ, నౌకాదళం ఉపయోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు 3 టన్నులు కాగా, వాయుసేన ప్రయోగించే క్షిపణి మాత్రం 2.5 టన్నులే ఉంటుంది. అయినా సుఖోయ్–30 యుద్ధ విమానం మోసే అత్యధిక బరువున్న క్షిపణి ఇదే. ► సుఖోయ్ యుద్ధవిమానం ఒకసారికి ఒక క్షిపణినే తీసుకెళ్లగలదు. ► బ్రహ్మోస్‌ను అడ్డుకునేందుకు ప్రత్యర్థి యుద్ధనౌకలు క్షిపణులను ప్రయోగించేలోగానే బ్రహ్మోస్ ఆ నౌకలను ధ్వంసం చేస్తుంది. ► క్షిపణిని ప్రయోగించిన వెంటనే సుఖోయ్ విమానం తిరుగు ప్రయాణమవుతుంది. ► ప్రస్తుతం ప్రపంచంలోని ఏ యుద్ధనౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు. ► ప్రస్తుతం 290 కిలో మీటర్లుగా ఉన్న లక్షిత దూరాన్ని 450 కిలోమీటర్లకు పెంచేందుకు బ్రహ్మోస్ క్షిపణుల రూపురేఖలు, సాంకేతికతలో మార్పులు చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు. ► క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లోకి భారత్ ప్రవేశంతో ఈ క్షిపణుల పరిధిని పెంచడం సులువు కానుంది. ► మరో 40 సుఖోయ్–30 యుద్ధ విమానాలు బ్రహ్మోస్‌ను మోసుకెళ్లగలిగేలా వాటికి అవసరమైన మార్పులు చేయడంతోపాటు ఇంకో 272 విమానాలు సమకూర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. భారత్‌కు బ్రహ్మస్త్రమే భూమిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన...ఇలా త్రివిధ దళాల్లో ఎవరైనా, ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువుగా ఉండే సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ అందుబాటులోకి వచ్చింది. మూడు చోట్ల నుంచి ప్రయోగానికి అనువుగా ఉండేలా హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ క్షిపణిలో మార్పులు చేసింది. రష్యాకు చెందిన పీ–700 ఒనిక్ సూపర్సోనిక్ క్షిపణి ఆధారంగా మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)–రష్యా ఎన్‌పీఓఎంలు సంయుక్తంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధిచేశాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కో నదుల పేర్లను కలిపి ఈ క్షిపణికి బ్రహ్మోస్గా నామకరణం చేశారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘విమానం - క్షిపణి’ సక్సెస్
బెంగళూరు: క్షిపణి వ్యవస్థలో భారత్ మరో మైలురాయి అందుకుంది. విమానానికి క్షిపణి అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. శనివారం ఎస్‌యూ-30 ఎంకేఐ విమానం 2,500 కేజీల బరువున్న బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని మోస్తూ గాలిలోకి ఎగిరింది. ఈ క్షిపణి 290 కి.మీల దూరంలో ఆకాశం నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రయోగం సఫలమవ్వడంతో ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ ఉన్న ఏకైక దేశంగా భారత్ అవతరించింది. ఈ ప్రయోగంలో వింగ్ కమాండర్లు ప్రశాంత్ నాయర్, ఎంఎస్ రాజులు విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లారు. ఎన్నో విమానాలను పరీక్షించి అనేక అంశాలను పరిశీలనలోకి తీసుకుని ఈ విమానాన్ని తయారు చేసినట్లు హెచ్ఏఎల్ చైర్మన్ సువర్ణరాజు తెలిపారు. మేకిన్ ఇండియాకు, విమానయాన రంగంలో మనం సాధిస్తున్న వృద్ధికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణుల కోసమే ఈ విమానాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. -
‘బ్రహ్మోస్’ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి మరోసారి సత్తా చాటింది. తొలిసారిగా సాల్వో మోడ్ (ఒకేసారి సమాంతరంగా క్షిపణులను ప్రయోగించడం) పద్ధతిలో నిర్వహించిన పరీక్షలో కూడా ఈ క్షిపణి విజయం సాధించింది. అరేబియా సముద్రంలో నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రిఖండ్పై నుంచి రెండు క్షిపణులతో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైందని గురువారమిక్కడ డీఆర్డీవో అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఒకేసారి ఎనిమిది క్రూయిజ్ క్షిపణులను కూడా ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఘన, ద్రవ ఇంధనంతో నడిచే బ్రహ్మోస్ క్షిపణిని సైన్యం, నేవీల్లో ఇదివరకే ప్రవేశపెట్టారు. ఇది 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. వాయుసేనలో ప్రవేశపెట్టనున్న బ్రహ్మోస్ వెర్షన్‌కు తుది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇండో-రష్యన్ కంపెనీ బ్రహ్మోస్ ఏరోస్పేస్ దీనిని అభివృద్ధిపర్చింది.