
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కొత్త వెర్షన్‌ను భారత్ అభివృద్ధి చేస్తోంది. వాయుమార్గాన ప్రయోగించే ఈ కొత్త వెర్షన్ బ్రహ్మోస్ 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి లక్ష్యాన్ని ఛేదించగలదని అంచనా. ఇప్పటివరకు దీని పరిధి దాదాపు 300 కిలోమీటర్లుంది. బ్రహ్మోస్ రేంజ్ ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూ వస్తున్నారని, సాఫ్ట్‌వేర్‌లో చిన్న మార్పుతో రేంజ్‌ను 500 కిలోమీటర్లు పెంచవచ్చని, తాజాగా దీని టార్గెట్ రేంజ్‌ను 800కిలోమీటర్లకు చేరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని సు– 30 ఎంకేఐ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రయోగిస్తారు. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద బ్రహ్మోస్ మిస్సైల్ అమర్చిన సు–30 విమానాలు 40 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment