super sonic
-
నిజామా? భూమ్మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంటలోనే...
ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించే సూపర్సోనిక్ జెట్ విమానాలను తలదన్నే విమానాలేవీ ఇంతవరకు లేవు. అయితే, త్వరలోనే అలాంటి విమానం అందుబాటులోకి రానుందని అమెరికన్ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ ‘వీనస్ ఏరోస్పేస్’ సంస్థ చెబుతోంది. ఇటీవల ఈ సంస్థ ‘స్టార్ గేజర్’ పేరిట తన విమానం నమూనాను విడుదల చేసింది. భూమ్మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంట లోగానే చేరుకోగల హైపర్ సోనిక్ విమానానికి రూపకల్పన చేస్తున్నట్లు ‘వీనస్ ఏరోస్పేస్’ ప్రకటించింది. దీనికోసం అమెరికా ప్రభుత్వం 1 మిలియన్ డాలర్లు ఇవ్వగా, ప్రైవేటు పెట్టుబడిదారుల నుంచి 33 మిలియన్ డాలర్ల నిధులు సేకరించనున్నట్లు తెలిపింది. పన్నెండు మంది ప్రయాణించే వీలున్న ఈ విమానం లాస్ ఏంజెలెస్ నుంచి టోక్యోకు గంట లోపే చేరుకోగలదని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. చదవండి👇 అత్యంత హాస్యభరితమైన జోక్ ఇది! అది ఏంటంటే? ఆ పూలను తాకితే చాలు.. ఓ అద్భుతాన్ని చూసిన ఫీలింగ్! -
బ్రహ్మోస్ మరింత శక్తివంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కొత్త వెర్షన్‌ను భారత్ అభివృద్ధి చేస్తోంది. వాయుమార్గాన ప్రయోగించే ఈ కొత్త వెర్షన్ బ్రహ్మోస్ 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి లక్ష్యాన్ని ఛేదించగలదని అంచనా. ఇప్పటివరకు దీని పరిధి దాదాపు 300 కిలోమీటర్లుంది. బ్రహ్మోస్ రేంజ్ ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూ వస్తున్నారని, సాఫ్ట్‌వేర్‌లో చిన్న మార్పుతో రేంజ్‌ను 500 కిలోమీటర్లు పెంచవచ్చని, తాజాగా దీని టార్గెట్ రేంజ్‌ను 800కిలోమీటర్లకు చేరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని సు– 30 ఎంకేఐ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రయోగిస్తారు. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద బ్రహ్మోస్ మిస్సైల్ అమర్చిన సు–30 విమానాలు 40 ఉన్నాయి. -
సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్: తక్కువ ఎత్తులో దూసుకొచ్చే బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగల స్వదేశీ సూపర్సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణిని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రయోగంలో భాగంగా పృథ్వీని శత్రు క్షిపణిలా మార్చి సూపర్సోనిక్ ఇంటర్సెప్టార్ క్షిపణికి లక్ష్యంగా నిర్దేశించారు. అబ్దుల్ కలాం దీవిలో ఏఏడీ (అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్) సూపర్సోనిక్ క్షిపణిని మోహరించారు. దీనిలోని రాడార్ల ద్వారా పృథ్వీకి సంబంధించిన సంకేతాలు అందుకున్న ఇంటర్సెప్టార్ క్షిపణి గాలిలోనే పృథ్వీని ఢీకొట్టింది. 7.5 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణిలో అధునాతన వ్యవస్థలున్నాయి. -
తిరుగులేని బ్రహ్మోస్
బాలాసోర్/న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ప్రయోగ సమయంలో సముద్రంలో అలలు తొమ్మిది మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయని, ప్రతికూల వాతావ రణంలోనూ నిర్దేశించిన మార్గంలో బ్రహ్మోస్ ప్రయాణించిందని, క్షిపణిలోని ముఖ్య భాగాలన్నీ కచ్చితత్వంతో పని చేశాయంది. దీన్నిబట్టి అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించ గలదని మరోమారు రుజువైందని పేర్కొంది. క్షిపణి జీవిత కాలాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా ప్రయోగం నిర్వహించామని, త్వరలోనే దీన్ని ఆర్మీకి అప్పగించనున్నామని వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా పేరొందిన బ్రహ్మోస్.. 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. -
సౌండ్‌లెస్ సూపర్సోనిక్
నాసా కోసం రూ.1610కోట్లు ఖర్చుచేసి లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారుచేయనున్న సూపర్సోనిక్ ‘ఎక్స్’ విమానం ఊహాచిత్రమిది. 55వేల అడుగుల ఎత్తులో, గంటకు 1,513 కి.మీ.ల వేగంలో దూసుకెళ్లేలా దీన్ని తయారుచేస్తున్నారు. ఇది వెళ్తున్నపుడు.. కారు తలుపు వేసినపుడు వచ్చేంత తక్కువ శబ్దమే వస్తుందని కంపెనీ చెబుతోంది. 94 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుండే ఈ విమానం బరువు 14,650 కేజీలు. -
న్యూయార్క్ టు లండన్.. ప్రయాణం 3 గంటలే
న్యూయార్క్: 2025 నాటికి న్యూయార్క్ నుంచి లండన్‌కు విమానం ప్రయాణం 3 గంటల్లో వెళ్లవచ్చు. ఈ దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు న్యూయార్క్ నుంచి లండన్‌కు విమానం మార్గం ద్వారా 7 గంటలకు పైగా సమయం పడుతోంది. బూమ్ సూపర్ సోనిక్ అనే సంస్థ సూపర్ సోనిక్ జెట్ విమానాన్ని తయారుచేస్తోంది. వచ్చే ఏడాది చివరినాటికి ఈ విమానాన్ని పరీక్షించనున్నారు. జపాన్ కూడా 20 సూపర్సోనిక్ విమానాలను కొనుగోలు చేసేందుకు బూమ్ సూపర్సోనిక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ విమానంలో ప్రయాణించేందకు ధర 2,500 డాలర్లు ఉండనుంది. ఈ విమానంలో మొత్తం 45–55 సీట్లు ఉంటాయని బూమ్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ విమానం గంటకు దాదాపు 1451 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విమానం అందుబాటులోకి వస్తే న్యూయార్క్–లండన్ ప్రయాణం దాదాపు 3 గంటలు తగ్గనుంది. -
సూపర్ సానిక్ బస్సు
హాలెండ్: బస్సు ప్రయాణమనగానే అందరికీ గుర్తుకొచ్చేది గంటల తరబడి ప్రయాణం. మధ్యలో మొరాయించడం. అయితే అందుకు భిన్నంగా అత్యంత వేగంగా రాకెట్లా రహదారులపై పరుగులు తీసే బస్సు హాలెండ్ దేశంలో తయారైంది. దీని ప్రయాణ వేగం ఎంతో తెలుసా. గంటకు 250 కిలోమీటర్లు. నమ్మబుద్ధి కావడం లేదు కదా. ఆ దేశానికి చెందిన ఏరోడైనమిక్ నిపుణుడు, మాజీ ఫార్ములా వన్ రేసర్ దీనిని తీర్చిదిద్దాడు. దీని తయారీకి ఏడు మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఇది దుబాయ్నుంచి బయల్దేరితే కేవలం 30 నిమిషాల్లో అబుధాభికి చేరుకోగలుగుతుంది. దీనిని అల్యూమినియం, కార్బన్ ఫైబర్, పాలికార్బనేట్లతో తయారుచేశారు. దీని పొడవు 15 మీటర్లు, వెడల్పు రెండున్నర మీటర్లు. ఐదు అడుగుల ఎత్తు. ఈ బస్సులో 23 మంది ప్రయాణించవచ్చు.