న్యూయార్క్‌ టు లండన్‌.. ప్రయాణం 3 గంటలే | London to New York in just 3 hours by sonic jet | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌ టు లండన్‌.. ప్రయాణం 3 గంటలే

Published Wed, Dec 6 2017 11:23 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

London to New York in just 3 hours by sonic jet - Sakshi

న్యూయార్క్‌: 2025 నాటికి న్యూయార్క్‌ నుంచి లండన్‌కు విమానం ప్రయాణం 3 గంటల్లో వెళ్లవచ్చు. ఈ దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు న్యూయార్క్‌ నుంచి లండన్‌కు విమానం మార్గం ద్వారా 7 గంటలకు పైగా సమయం పడుతోంది. బూమ్‌ సూపర్‌ సోనిక్‌ అనే సంస్థ సూపర్‌ సోనిక్‌ జెట్‌ విమానాన్ని తయారుచేస్తోంది. వచ్చే ఏడాది చివరినాటికి ఈ విమానాన్ని పరీక్షించనున్నారు.

జపాన్‌ కూడా 20 సూపర్‌సోనిక్‌ విమానాలను కొనుగోలు చేసేందుకు బూమ్‌ సూపర్‌సోనిక్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ విమానంలో ప్రయాణించేందకు ధర 2,500 డాలర్లు ఉండనుంది. ఈ విమానంలో మొత్తం 45–55 సీట్లు ఉంటాయని బూమ్‌ సంస్థ ప్రకటించింది. అయితే ఈ విమానం గంటకు దాదాపు 1451 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విమానం అందుబాటులోకి వస్తే న్యూయార్క్‌–లండన్‌ ప్రయాణం దాదాపు 3 గంటలు తగ్గనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement