న్యూయార్క్, లండన్ మధ్య సముద్రంలో నిర్మించాలని యోచన
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ నగరాల మధ్య దూరం 3 వేల మైళ్లు(4,828 కిలోమీటర్లు). విమానంలో కాకుండా సముద్రంలో నౌకలపై ప్రయాణించాలంటే రోజుల తరబడి సమయం పడుతుంది. కానీ, సముద్రంలో కేవలం గంట సమయంలో ప్రయాణించే అవకాశం వస్తే? నిజంగా అద్భుతం. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు కీలక నగరాలను అనుసంధానించడానికి అట్లాంటిక్ మహాసముద్రంలో సొరంగం(టన్నెల్) నిర్మించాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. ఇది సాధారణ సొరంగం కాదు. వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీతో నిర్మించే సొరంగం.
ఈ ప్రాజెక్టుకు రూ.16.96 లక్షల కోట్లకుపైగా(20 ట్రిలియన్ డాలర్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా అమల్లోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర గర్భ టన్నెల్‌గా రికార్డుకెక్కడం ఖాయం. ప్రస్తుతం ఉత్తర యూరప్‌లో ఫెమార్న్‌బెల్ట్ సొరంగం నిర్మాణ దశలో ఉంది. డెన్మార్క్, జర్మనీని అనుసంధానించే ఈ సొరంగం 2029లో అందుబాటులోకి రానుంది. ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్ అండ్ రైల్ టన్నెల్‌గా రికార్డు సృష్టించబోతోంది. మరోవైపు దక్షిణ యూరప్‌లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గ్రీస్, టర్కీని కలిపేలా సముద్రంపై కొత్త వంతెన నిర్మించబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment