Tunnel construction
-
ఒక సొరంగం.. రూ.16.96 లక్షల కోట్లు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్ నగరాల మధ్య దూరం 3 వేల మైళ్లు(4,828 కిలోమీటర్లు). విమానంలో కాకుండా సముద్రంలో నౌకలపై ప్రయాణించాలంటే రోజుల తరబడి సమయం పడుతుంది. కానీ, సముద్రంలో కేవలం గంట సమయంలో ప్రయాణించే అవకాశం వస్తే? నిజంగా అద్భుతం. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు కీలక నగరాలను అనుసంధానించడానికి అట్లాంటిక్ మహాసముద్రంలో సొరంగం(టన్నెల్) నిర్మించాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. ఇది సాధారణ సొరంగం కాదు. వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీతో నిర్మించే సొరంగం. ఈ ప్రాజెక్టుకు రూ.16.96 లక్షల కోట్లకుపైగా(20 ట్రిలియన్ డాలర్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా అమల్లోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర గర్భ టన్నెల్‌గా రికార్డుకెక్కడం ఖాయం. ప్రస్తుతం ఉత్తర యూరప్‌లో ఫెమార్న్బెల్ట్ సొరంగం నిర్మాణ దశలో ఉంది. డెన్మార్క్, జర్మనీని అనుసంధానించే ఈ సొరంగం 2029లో అందుబాటులోకి రానుంది. ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్ అండ్ రైల్ టన్నెల్‌గా రికార్డు సృష్టించబోతోంది. మరోవైపు దక్షిణ యూరప్‌లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. గ్రీస్, టర్కీని కలిపేలా సముద్రంపై కొత్త వంతెన నిర్మించబోతున్నారు. -
కార్మికులను కాపాడాం... గుణపాఠాలో!
ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల పరిరక్షణ చర్య విజయవంతంగా ముగిసింది. పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో దాదాపు 17 రోజులపాటు చిక్కుకున్న కార్మికులందరినీ భారతీయ, విదేశీ నిపుణులు ఉమ్మడిగా సురక్షితంగా బయటికి తీయగలిగారు. హిమాలయ ప్రాంతంలో ఒక పెద్ద అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. సిల్క్యారా సొరంగంలో జరిగిన విపత్తు... పెళుసైన కొండ ప్రాంతాలలో చేపట్టే భారీ స్థాయి ప్రాజెక్టులకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కఠినతరమైన భూభాగంలో కార్యకలాపాల భద్రతపైనా, అలాంటి ప్రాజెక్టులకు అవసరమైన విపత్తు సంసిద్ధతపైనా కూడా ప్రశ్నలను లేవనెత్తింది. హిమాలయ పర్యావరణ వ్యవస్థను కోలుకోలేని నష్టం నుండి రక్షించడానికి ఈ సొరంగ ప్రమాద ఘటన మరో మేల్కొలుపు కావాలి. బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి ముఖ్యమైన మతపరమైన పుణ్యక్షేత్రాలను కలుపుతూ, అన్ని వాతావరణాల్లో పనిచేసే నాలుగు లేన్ల రహదారిని నిర్మించాలనే లక్ష్యంతో, ప్రతిష్టా త్మకమైన చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా సొరంగాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టును పర్యావరణ సంఘాలు విమర్శించాయి. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశాయి. అనేక ప్రభుత్వ కమిటీలు ప్రాజెక్టును వివిధ కోణాల్లో పరిశీలించి, దానికి అనుమతిని ఇచ్చాయి. అయితే ప్రస్తుత సొరంగ ప్రమాద ఘటన హిమాలయ ప్రాంతంలో ఇటువంటి ప్రాజెక్టులను చేపట్టడంపై అన్ని సందేహాలను, భయాలను పునరుద్ధరించింది. సొరంగాలు ఉత్తమ మార్గమే అయినా... అడవుల విధ్వంసాన్ని నివారించడానికి, పర్యావరణ హానిని తగ్గించడానికి సొరంగ నిర్మాణం ఒక మంచి ఎంపికగా కనిపి స్తున్నప్పటికీ, సొరంగం పరిమాణం చాలా ముఖ్యమైనది. పొడవాటి సొరంగాల వల్ల కలిగే నష్టాన్ని కొండలు తట్టుకోగలవా? చిన్న సొరంగాలను నిర్మించడంపై ప్రాజెక్ట్ బృందాలు ఆలోచించాలి. రహదారులు లేదా జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం పొడవైన నిర్మాణాలను నిర్మించే ముందు సొరంగ తవ్వకం కలిగించే పర్యావరణ ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయాలి. అనాలోచితంగా చేసే సొరంగ నిర్మాణం భూగర్భ జల వనరులను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో కొండచరియలు విరిగిపడతాయి కూడా. విశాలమైన సొరంగాల తయారీ కోసం చేసే పేలుళ్లు ప్రమాదకరమైన పర్యావరణ పరిణామాలకు కారణమవుతాయి. విపత్తు సంసిద్ధతతోపాటు, నిర్మాణ సంస్థలు తీసుకునే భద్రతా జాగ్రత్తలు మరొక సమాధానం లేని ప్రశ్నగా ఉంటున్నాయి. సిల్క్యారా ప్రాజెక్ట్‌లో ప్రమేయం ఉన్న కంపెనీలు, ప్రభుత్వ సంస్థల వైపు నుండి లోపాలు ఉంటే వాటిని పూర్తి స్థాయి విచారణ మాత్రమే వెల్లడిస్తుంది. కొండల్లో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు, హైవేలు, పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దాదాపు రెండు దశాబ్దాలుగా చర్చలు సాగుతున్నాయి. నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో పర్యావరణ సంఘాల సుదీర్ఘ ఆందోళన తర్వాత, రెండు భారీ ప్రాజెక్టులను నిలిపివేశారు. పైగా కొత్త, పెద్ద ప్రాజెక్టులు ఏవీ చేపట్టలేదు. అయితే గత దశాబ్దంలో, కొండలపై నిర్మాణ కార్యకలాపాలను పునరుద్ధరించారు. భద్రతా సమస్యలు, పర్యావరణ సమీక్షల కోసం పిలుపులను విస్మరించారు. తప్పనిసరి పర్యావరణ ప్రభావ అంచనా వంటి వివిధ చట్టాలు, నిబంధనలను సంబంధిత ఏజెన్సీలు, ప్రభుత్వాలు తీవ్రంగా పలుచన చేసిపడేశాయి లేదా దాటవేశాయి. ఈలోగా, వాతావరణ మార్పుల కారణంగా పర్యా వరణ ప్రమాదాలు పెరిగాయి. దీని ఫలితంగా తీవ్రమైన వాతావరణ ఘటనలు, విపత్తులు సంభవిస్తాయి. సంసిద్ధత ఉందా? కొండల్లోని ప్రాజెక్టుల భద్రత, విపత్తులను ఎదుర్కొనే సంసి ద్ధతను పూర్తిగా పరిష్కరించడం అనేది మరొక ప్రధాన సమస్య. సొరంగ ప్రమాదాలకు గల కారణాలపై శ్రద్ధ చూపడం, నిర్మాణ స్థలాల వద్ద భద్రతను నిర్ధారించడం చాలా కీలకం. గతంలో ఉత్తరా ఖండ్‌లో జరిగిన సంఘటనలతో పాటు, ఇటీవల సిక్కింలో జరిగిన హిమనీనద సరస్సు ఉప్పెన వరద సంబంధిత విపత్తు ద్వారా కూడా ఇది బాగా నిరూపితమైంది. తక్కువ సాంకేతిక, భద్రతాపరమైన నిర్వహణ, అలాగే వర్ష మేఘాల విస్ఫోటనం, కొండ చరియలు విరిగి పడటం మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయి. అన్ని స్థాయిలలో శిక్షణ, భద్రతా నిర్వహణపై తగిన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక సాంకేతిక, శాస్త్రీయ సమస్యలను ప్రణాళికా దశలోనే అధ్యయనం చేసి పరిష్కరించాలి. సిల్క్యారా–బడ్‌కోట్ సొరంగం కోసం నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ప్లానింగ్, కన్సల్టెన్సీ సేవలను అందిస్తున్న యూరప్‌కు చెందిన బెర్నార్డ్ గ్రుప్పే సంస్థ, ‘‘సొరంగాన్ని తవ్వడం ప్రారంభమైనప్పటి నుండి, టెండర్ డాక్యుమెంట్లలో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాలా సవాలుగా ఉన్నా యని నిరూపితమయ్యాయి. ఆ విధంగా అమలు దశ ప్రారంభంలో చేపట్టిన తదుపరి అన్వేషణే దాని చర్యల ఫలితాలను నిర్ధారిస్తుంది’’ అని వెల్లడించింది. అటువంటి ప్రాజెక్టులను ఆమోదించే ముందు సమగ్రమైన భౌగోళిక అధ్యయనాల అవసరాన్ని ఇది సూచిస్తుంది. కేవలం ప్రమాదమా? కార్మికుల రక్షణ కోసం సొరంగం లభ్యత వంటి భద్రతా నియ మాలను, నిబంధనలను నిర్మాణ సంస్థలు అనుసరించి ఉంటే, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చాలా ముందుగానే రక్షించి ఉండ వచ్చు. ఇప్పుడు ఇలాంటి ప్రమాదం సంభవించినందున, ఇటీవలి సంవత్సరాలలో రాష్ట్రం అనేక విపత్తులను ఎదుర్కొన్న వాస్తవాన్ని బట్టి త్వరితగతిన కార్మికుల పరిరక్షణ కార్యకలాపాలకు వ్యవస్థలు ఉండాలి. సంబంధిత అన్ని ఏజెన్సీలు పరిస్థితిని ఎలా నిర్వహించాలనే అంశంపై తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని పంచుకోవాలి. సిల్క్యారా సొరంగ విపత్తును కేవలం ప్రమాదంగా పరిగణించి హిమాలయాల్లో యధావిధిగా వ్యవహారాలను కొనసాగించడం తప్పు. కోలుకోలేని నష్టం నుండి హిమాలయ పర్యావరణాన్ని కాపాడ టానికి ఇది మరో మేల్కొలుపు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు అని పేర్కొంటున్న వాటి గురించి మనం అసౌకర్యమైన ప్రశ్నలు అడగవలసి ఉంటుంది. 900 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవే, ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులు (కనీసం ఒక డజను సొరంగాల నిర్మాణంతో కూడి ఉంటాయి), పర్యాటకాన్ని నిస్సంకోచంగా ప్రోత్సహించడం (ఇది కొండలను మోసుకెళ్లే సామర్థ్యాన్ని మించి ఉంటోంది), జల విద్యుత్ ప్రాజెక్టుల భారీ స్థాయి అభివృద్ధి... ఇలా అన్నింటిపై ఒక పునరాలోచన అవసరం. కొండల్లోని ప్రజలకు విద్యుత్తు, ఉపాధి లేదా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆనందించే లేదా అందుబాటులో ఉండే ఇతర సౌకర్యాలు లేకుండా చేయాలని దీని అర్థం కాదు. పర్యా వరణా నికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇవన్నీ ఎలా సాధిస్తామన్నదే కీలక ప్రశ్న. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాల్‌కు తగ్గట్టుగా దీన్ని ఎలా సాధిస్తాం? సిల్క్యారాలో జరిగినటువంటి విషాద సంఘ టనల పట్ల మనకు ఒక సమగ్ర దృక్పథం లేకుండా ఎంతమాత్రమూ ముందడుగు వెయ్యలేం. వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత,దినేష్ సి. శర్మ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Uttarkashi tunnel collapse rescue: పీడకల... అగ్నిపరీక్ష
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. సొరంగంలో తమకు ఎదురైన భయానక అనుభవాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్న తీరును పలువురు కార్మికులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. సొరంగంలో తామంతా కష్టసుఖాలు కలబోసుకున్నామని, మిత్రులుగా మారామని చెప్పారు. ఆడిన ఆటలు, పాడుకున్న పాటల గురించి తెలియజేశారు. సొరంగంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని జార్ఖండ్‌లోని ఖిరాబేడా గ్రామానికి చెందిన అనిల్ బేడియా(22) అనే కార్మికుడు వెల్లడించాడు. ‘‘నవంబర్ 12న సొరంగంలో మేము పనిలో ఉండగా, హఠాత్తుగా కొంత భాగం కూలిపోయింది. భారీ శబ్ధాలు వినిపించాయి. మేమంతా లోపలే ఉండిపోయాం. బయటకు వచ్చే దారి కనిపించలేదు. ఎటు చూసినా చిమ్మచీకటి. అక్కడే సమాధి కావడం తథ్యమని అనుకున్నాం. మొదటి రెండు రోజులపాటు బతుకుతామన్న ఆశ లేకుండాపోయింది. క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాం. బయట పడడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందు ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా అదొక పీడకల, అగ్ని పరీక్ష. సొరంగం పైభాగంలోని రాళ్ల సందుల నుంచి పడుతున్న ఒక్కో చుక్క నీటిని ఒడిసిపట్టుకొని చప్పరించాం. మా దగ్గరున్న బొరుగులతో 10 రోజులపాటు కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం. ఆ తర్వాత అధికారులు పైపు గుండా పండ్లు, భోజనం, నీళ్ల సీసాలు మాకు అందించారు. ప్రమాదం జరిగాక 70 గంటల తర్వాత అధికారులు మాతో మాట్లాడారు. అప్పుడే ప్రాణాలపై మాలో ఆశలు మొదలయ్యాయి. మేమంతా కలిసి నిత్యం దేవుడిని ప్రార్థించేవాళ్లం. చివరకు దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు. మొదట్లో కష్టంగా గడిచింది సొరంగంలో తాము చిక్కుకున్నట్లు తెలియగానే ఆందోళనకు గురయ్యామని ఉత్తరాఖండ్‌లోని చంపావత్ గ్రామానికి చెందిన పుష్కర్‌సింగ్ ఐరే అనే కార్మికుడు చెప్పాడు. మొదట్లో చాలా కష్టంగా గడిచిందని, చనిపోతామని అనుకున్నామని, క్రమంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తొలుత సరైన ఆహారం లేదు, బయటున్నవారితో మాట్లాడే వీలు లేదని అన్నాడు. ఒంటిపై ఉన్న బట్టలతోనే 17 రోజులపాటు ఉండాల్సి వచి్చందని, స్నానం చేయలేదని, సొరంగం లోపలంతా అపరిశుభ్రంగా మారిందని తెలియజేశాడు. ప్లాస్టిక్ షీట్లపై నిద్రించామని పేర్కొన్నాడు. ఆహారం, నీరు అందిన తర్వాత ఊపిరి పీల్చుకున్నామని చెప్పాడు. కాలక్షేపం కోసం పేకాడామని, కాగితాలను క్రమపద్ధతిలో చింపుతూ ఉండేవాళ్లమని వివరించాడు. సాక్సులతో బంతులు చేసి, చోర్–సిఫాయి ఆట ఆడామని, పాటలు పాడుకున్నాం తెలిపాడు. నిత్యం యోగా, వాకింగ్ చేశాం.. సొరంగం నుంచి బయటకు వచి్చన 41 మంది కార్మికులతో మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సొరంగంలో ఉన్నప్పుడు నిత్యం యోగా, వాకింగ్ చేశామని, తద్వారా మనోస్థైర్యం సడలకుండా జాగ్రత్తపడ్డామని, ఆత్మవిశ్వాసం పెంచుకున్నామని ప్రధానమంత్రికి కార్మికులు తెలియజేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల్లో చిక్కుకుంటే మన ప్రభుత్వం కాపాడిందని, స్వదేశంలోనే ఉన్న తామెందుకు భయపడాలని భావించామని అన్నారు. రిషికేశ్ ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు సిల్క్యారా టన్నెల్ నుంచి బయటకు వచి్చన కార్మికులను బుధవారం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు హెలికాప్టర్లో తరలించారు. డిజాస్టర్ వార్డులో చేర్చి, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మానసిక పరిస్థితి కూడా పరీక్షిస్తామని, అవసరమైన వారికి తగిన చికిత్స అందిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆరోగ్యం కుదుటపడిన వారిని ఇళ్లకు పంపిస్తామని వెల్లడించారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధులను కూడా సిల్క్యారా నుంచి బస్సుల్లో ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. కార్మికుల గ్రామాల్లో సంబరాలు ఖిరాబేడా గ్రామం నుంచి మొత్తం 13 మంది యువకులు సొరంగం పనుల కోసం ఉత్తరకాశీకి చేరుకున్నారు. అదృష్టం ఏమిటంటే వారిలో ముగ్గురు మాత్రమే సొరంగంలో చిక్కుకున్నారు. బాధితులుగా మారిన మొత్తం 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. ఖిరాబేడాలో అనిల్ బేడియా తల్లి 17 రోజులపాటు తల్లడిల్లిపోయింది. కుమారుడు జాడ తెలియక ఆందోళనకు గురైంది. ఇంట్లో వంట చేసింది లేదు. ఇరుగు పొరుగు అందించిన భోజనంతో కడుపు నింపుకుంది. ఎట్టకేలకు కుమారుడు అనిల్ బేడియా సొరంగం నుంచి బయటకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ బేడియా(55)కు పక్షవాతం. ఏకైక కుమారుడు రాజేంద్ర సొరంగం నుంచి బయటపడడంతో అతని ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రశంసలందుకున్న నాగపూర్ నిపుణుల సేవలు సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. నిపుణులు తమవంతు సేవలందించారు. కార్మికులకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా, కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరగకుండా వీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ డబ్ల్యూసీఎల్కు నిపుణులు సొరంగం వద్దే మకాం వేశారు. భారీ యంత్రాలతో తవ్వకం పనులు చేపట్టడంతో సొరంగం లోపల కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతుండేవి. ప్రమాదకర స్థాయికి చేరగానే యంత్రాలను ఆపించేవారు. వారి సేవలు ప్రశంసలందుకున్నాయి. సొరంగంలో కార్మికులు భుజాలపై ఎత్తుకున్నారు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల్లో ఢిల్లీకి చెందిన ఫిరోజ్ ఖురేïÙ, యూపీకి చెందిన మోను కూమార్ తొలుత సొరంగంలోని కార్మికుల వద్దకు చేరుకున్నారు. తమను చూడగానే కార్మికులు ఆనందంతో భుజాలపై ఎత్తుకున్నారని ఫిరోజ్ వెల్లడించాడు. ‘‘మాకు పండ్లిచ్చారు. పేర్లు అడిగారు. అరగంట పాటు సొరంగంలో ఉన్నాం’’ అని మోను కూమార్ చెప్పాడు. తాము కార్మికుల వద్దకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం వచ్చారని పేర్కొన్నాడు. కార్మికులను కాపాడినందుకు తాము డబ్బులేమీ తీసుకోలేదని తెలియజేశాడు. తల్లిదండ్రుల ఫొటో చూస్తూ కాలం గడిపా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీ జిల్లా భైరాంపూర్కు చెందిన 25 ఏళ్ల మంజీత్ చౌహాన్ సిల్క్యారా టన్నెల్లో చిక్కకొని, 17 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అతడి రాకతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. మంజీత్ తల్లిదండ్రులు భైరాంపూర్లో ఉంటున్నారు. అతడి సోదరుడు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రుల ఫొటో మంజీత్ వద్ద ఉంది. ఆ ఫొటో చూస్తూ ధైర్యం తెచ్చుకొని సొరంగంలో కాలం గడిపానని, ఒత్తిడిని అధిగమించానని చెప్పాడు. ‘‘సొరంగం లోపలిభాగం కూలిన సమయంలో అక్కడికి కేవలం 15 మీటర్ల దూరంలోనే పని చేస్తున్నాను. తొలుత అసలేం జరిగిందో అర్థం కాలేదు. క్రమంగా అది పీడ కలగా మారింది. ప్రమాదం జరిగాక మొదటి 24 గంటలు చాలా కష్టంగా గడిచాయి. మేమంతా భయందోళనకు గురయ్యాం. ఆకలి, దాహం, నీరసం, నిరాశ వంటివి అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాలుగు అంగుళాల పైపు గుండా అధికారులు ఆహారం, నీరు పంపించిన తర్వాత మా మానసిక స్థితి మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలియడంతో మాలో మనోధైర్యం పెరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగాం. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని నాన్నకు చెప్పా. ఫోన్ వాల్‌పేపర్‌లో నా తల్లిదండ్రుల ఫొటో చూస్తూ ఉండిపోయేవాడిని. ప్రాణాలపై ఆశ కోల్పోకుండా అది ఉపయోగపడింది. సొరంగంలో అటూ ఇటూ నడుస్తూ ఉండేవాళ్లం. పైపు గుండా అధికారులు పంపించిన పప్పు నాకెంతో నచ్చింది. సొరంగంలో చిక్కుకున్న మేమంతా ఒకరికొకరం మంచి మిత్రులుగా మారిపోయాం. మా కష్ట సుఖాలు తెలియజేసుకున్నాం. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేకపోవడం పట్ల విచారంగా ఉంది. ఇంటికెళ్లిన తర్వాత మ్యాచ్ హైలైట్స్ చూస్తా’’ అని మంజీత్ చౌహాన్ ఉత్సాహంగా చెప్పాడు. సొరంగం పనులు కొనసాగుతాయి ఉత్తరాఖండ్‌లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగం పనులు కొనసాగుతాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. కూలిపోయిన ప్రాంతంలో మరమ్మతులు, సేఫ్టీ ఆడిట్ ముగిసిన తర్వాత పనులు యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభంచిన 900 కిలోమీటర్ల ‘చార్ధామ్ యాత్ర ఆల్ వెదర్ రోడ్’ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా టెన్నల్‌ను నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్‌ధామ్‌లో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానించడానికి కేంద్రం రూ.12,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నాలుగు క్షేత్రాలను చుట్టిరావడానికి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 27న శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2020 మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరుగుతోంది. కేబినెట్ భేటీలో మోదీ భావోద్వేగం సిల్క్యారా సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచి్చంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ మంగళవారం రాత్రి సమావేశమైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను తలచుకొని ప్రధానమంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పారు. కార్మికులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు స్వయంగా ఆరా తీశారని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. దేశ విదేశాల్లోని భారతీయులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. -
సిల్క్యారా చేస్తున్న హెచ్చరిక
మానవ సంకల్పం ముందు శిఖరం తలొంచింది. పదిహేడు రోజులుగా కోట్లాదిమంది దేశ ప్రజానీకం మాత్రమే కాదు... దేశదేశాల పౌరులూ పడిన ఆరాటం, ఆత్రుత ఫలించాయి. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగం కుప్పకూలటంతో 422 గంటలపాటు బందీలైన 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం సురక్షితంగా బయటపడ్డారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నిపుణులు మొదలుకొని వైద్య నిపుణుల వరకూ అందరికందరూ రాత్రింబగళ్లు సమన్వయంతో సాగించిన కృషి ఒక ఎత్తయితే...అత్యంత కష్టసాధ్యమైన ర్యాట్ హోల్ మైనింగ్‌లో నిపుణులైన కార్మికులు చివరి 12 మీటర్ల పొడవునా వున్న శిథిలాలను ఎంతో ఓపిగ్గా, జాగ్రత్తగా తొలగించటం మరో ఎత్తు. వెరసి బందీలైనవారంతా క్షేమంగా బాహ్యప్రపంచాన్ని చూడగలిగారు. ఇలాంటి సంక్లిష్ట సందర్భాల్లో చిక్కుకున్నవారిలో సమూహ చేతన ఎంతమాత్రమూ సడలరాదన్నది మనస్తత్వ నిపుణుల మాట. బందీల్లో కనీసం ఒక్కరికైనా సద్యోజనిత నాయకత్వ లక్షణం వుంటే తప్ప ఇలాంటి సామూహిక చేతనకు అవకాశం వుండదు. 2010లో చిలీ రాగి గనుల్లో పదివారాలు చిక్కుకున్న కార్మికులైనా... మరో ఏడెనిమిదేళ్లకు ఉత్తర థాయ్‌లాండ్‌లోని కొండ గుహల్లోకి వరద నీరు ప్రవేశించటంతో పదకొండు రోజులపాటు చిక్కుకున్న ఫుట్‌బాల్ టీమ్ పిల్లలైనా క్షేమంగా బయటపడటానికి కారణం ఇదే అంటారు. భయానక పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా నాలుగో రోజు వరకూ ప్రాణాలు నిలుపుకోగలిగితే మానసికంగా వారు దృఢంగా వున్నట్టేనని, ఆ తర్వాత వారు దేన్నయినా సునాయాసంగా అధిగమిస్తారని మనస్తత్వ నిపుణులు చెబుతారు. వెలుపలి ప్రపంచంలో కోట్లాదిమంది పడుతున్న తపనకు బందీలైన ఆ 41 మంది కార్మికుల దృఢచిత్తం తోడవటం వల్లనే ఇదంతా సవ్యంగా పూర్తయింది. ఆ కార్మిక కుటుంబాల మాటేమోగానీ... అశేష ప్రజానీకం ఆశానిరాశాల్లో ఊగిసలాడిన తీరు మాత్రం మరిచిపోలేనిది. మినుకు మినుకుమంటున్న ఆశలు, అంతలోనే గంపెడు నిరాశలో ముంచే పరిణామాలూ ఈ పదిహేడురోజులూ ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆ కార్మికులు బయటికిరావటం నూటికి నూరుపాళ్లూ సాధ్యమేనని మంగళవారం సాయంత్రానికిగానీ ధ్రువపడలేదు. బందీలను విడిపించటానికి భారీ యంత్రాలను వినియోగించి కొండను తొలుస్తున్న క్రమంలో ఈనెల 16న సంభవించిన భూకంపం అన్ని రకాల ప్రయత్నాలపైనా నీళ్లుజల్లింది. ఒక దశలో పైపును అమరుస్తుండగా భారీ పగుళ్ల శబ్దాలు విన బడ్డాయి. ఈలోగా 25 టన్నుల భారీయంత్రమైన అగర్ మెషిన్‌తో తవ్వుతుండగా శిథిలాల్లో ఇరుక్కున్న ఇనుప రాడ్లు తగిలి దాని బ్లేడ్లు తెగిపడ్డాయి. ఇక ర్యాట్‌హోల్ మైనింగ్ నిపుణులు రంగంలో దిగితే తప్ప ఇది పూర్తికాదని నిర్ధారించుకుని మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ల నుంచి వారిని రప్పించారు. అయితే ఈ ఆనందోత్సాహాల సందడిలో అసలు విషయం మరుగున పడకూడదు. అపార ఖనిజ సంపద వున్న దేశాలన్నిటా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటానికీ, ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేందుకూ ప్రభుత్వాలు తపిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యావరణానికి కలుగుతున్న చేటు సరే, మనుగడ కోసం మరేదీ చేయలేక ప్రాణాలకు తెగించి గనుల్లో పనిచేస్తున్న బడుగు జీవులు సమిధలవుతున్నారు. చాన్నాళ్ల క్రితమే ఎన్జీటీ నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ సిల్క్యారాలో కార్మికుల ప్రాణాలు కాపాడటానికి దోహదపడిన మాట నిజమే అయినా...ఇప్పటికీ చట్టవిరుద్ధంగా అలాంటి మైనింగ్ సాగుతున్నదని ఈ ఎపిసోడ్ నిరూపించింది. కేవలం ఒక మనిషి పాకుకుంటూ వెళ్లగలిగేంత కంత తవ్వుకుంటూ భూగర్భం మూలల్లో వున్న బొగ్గు లేదా ఇతర ఖనిజాలనూ సేకరించటం ఈ కార్మికుల పని. ఈ క్రమంలో ఎక్కడైనా పైకప్పు కూలిందంటే వాళ్ల బతుకులు ముగిసినట్టే. గనుల పరిసర ప్రాంతాల్లో వుంటున్నవారికే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నప్పుడు నేరుగా అందులోకి ప్రవేశించి నిత్యం ఆ దుమ్మూ ధూళితో సావాసం చేసేవారికి ఎంత ముప్పు కలుగుతుందో వేరే చెప్పనవసరం లేదు. ఇక భూమి కుంగిపోవటం, భూగర్భ జలాలు కలుషితం కావటంవంటి పర్యావరణ సమస్యలకు అంతే లేదు. ఇంతా చేసి ఇలాంటి కార్మికుల శ్రమంతా భారీ యంత్రపరికరాలపై పెట్టుబడులూ, అనుమతులు, రాయల్టీ చెల్లింపులూ లేకుండా చట్టవిరుద్ధంగా దోపిడీచేసే మైనింగ్ మాఫియాల పాలవుతోంది. కార్పొరేట్ల లాభార్జనకు దోహదపడుతోంది. హిమశిఖరాలు ఆల్ప్ పర్వతశ్రేణిలా పురాతనమైనవి కాదు. అవి ఆరున్నరకోట్ల సంవత్సరా లనాటివైతే, హిమశిఖరాల వయసు నాలుగుకోట్ల సంవత్సరాలు మించదు. అందువల్లే వాటి భూగర్భంలో నిరంతర చలనం, ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రత కొనసాగుతున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీతో సహా 51 శాతం నేల కుంగుబాటు ప్రాంతంలో వున్నదని జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్స్ పత్రిక చాన్నాళ్ల క్రితం తెలిపింది. ఇక్కడి కొండల్లో మట్టి, రాళ్లు కలిసి వుండటం వల్ల ఈ కుంగుబాటు ప్రమాదం ఎక్కువ. గత కొన్నేళ్లుగా జోషీమuŠ‡ కుంగుబాటు, ఇతర ప్రాంతాల్లో సైతం భూమి నెర్రెలుబారటం ప్రమాదకర సంకేతాలందిస్తోంది. చార్ధామ్ యాత్రికులకూ, పర్యాటకులకూ అనుకూలంగా వుంటుందని 900 కిలోమీటర్ల మేర చార్ధామ్ హైవే నిర్మాణం చేపట్టారు. సిల్క్యారా సొరంగ నిర్మాణం దానిలో భాగమే. ఇవిగాక ఎన్నో జల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టులను సమీక్షించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సిల్ క్యారా ఉదంతం మనల్ని హెచ్చరిస్తోంది. అప్రమత్తం కావటం మనకే మంచిది. -
Uttarakhand tunnel collapse: నిట్టనిలువుగా డ్రిల్లింగ్ మొదలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు మరో ప్రణాళికను పట్టాలెక్కించాయి. రెండు మూడు రోజులుగా శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను ప్రస్తుతానికి పక్కనబెట్టేశారు. కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను ఆదివారం మధ్యాహ్నం మొదలు పెట్టారు. ‘మొదలెట్టి నిలువుగా 20 మీటర్లకుపైగా డ్రిల్లింగ్ చేశాం. భారీ బండలు లాంటివి అడ్డుప డకపోతే నవంబర్ 30వ తేదీకల్లా డ్రిల్లింగ్ పూర్తి అయ్యే అవకాశ ముంది. 85 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశాక సొరంగం పైకప్పుకు చేసిన కాంక్రీట్, ఉక్కు రాడ్ల నిర్మాణాన్ని ఛిద్రం చేసి మార్గం సుగమం చేయాల్సి ఉంది’’ అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సభ్యుడు మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చెప్పారు. ‘‘ఇప్పటికి మొత్తంగా ఆరు రకాల రెస్క్యూ ప్లాన్లను అమలుచేశాం. అయినా సరే మొదటిదే అన్నింటికన్నా ఉత్తమం, సురక్షితం. సమాంతరంగా తవ్వే ప్లాన్‌ను మళ్లీ అమలుచేస్తాం. దాదాపు 62 మీటర్ల మేర సొరంగం కూలింది. ఇందులో 47 మీటర్ల వరకు శిథిలాల గుండా ఆగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ చేశాం. కూలినభాగంలోని కాంక్రీట్ నిర్మాణ రాడ్లు.. డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను ముక్కలుచేశాయి. దాంతో 47 మీటర్లవరకు ఉన్న మెషీన్‌ను వెనక్కి లాగాం. 15 మీటర్లు లాగాక మెషీన్ విరిగిపోయి ముక్కలు లోపలే ఉండిపోయాయి. ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో ముక్కలను విడివిడిగా కట్‌చేసి బయటకు తీస్తున్నాం. 23 మీటర్లవరకు ముక్కలను తొలగించాం. మొత్తం పొడవునా బ్లేడ్ల ముక్కలను తీయడానికి ఒక రోజంతా పట్టొచ్చు. ముక్కలన్నీ తీసేశాక అదే మార్గంలో భారత సైన్యంలోని మద్రాస్ యూనిట్ ఇంజనీర్లు, ట్రెంచ్‌లెస్ ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్‌గా తవ్వడం మొదలుపెడుతుంది’’ అని వివరించారు. ‘‘ 62 మీటర్ల శిథిలాల గుండా ఇప్పటికే 47 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయింది. మెషీన్ బ్లేడ్లు తొలగించాక మిగతా 15 మీటర్లను మ్యాన్యువల్‌గా తవ్వితే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చు’’ అని ఆయన వెల్లడించారు. గత 14 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తెచ్చేందుకు సహాయక సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఛార్‌ధామ్ ప్రాజెక్టులో భాగంగా రోడ్డుమార్గంలో ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు సిల్క్యారా–బార్కోట్ మార్గంలో సొరంగం నిర్మిస్తుండగా నవంబర్ 12వ తేదీన లోపల కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు రెండు కిలోమీటర్ల పొడవైన భాగంలో చిక్కుకుపోయారు. -
Uttarkashi tunnel collapse: డ్రిల్లింగ్కు భారీ అవాంతరం
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఒకటి రెండు రోజుల్లో కార్మికులు సొరంగం నుంచి బయటకొస్తారన్న ఆశలకు గండి పడింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేస్తున్న ఆగర్ మెషీన్ డ్రిల్లింగ్‌ను నిలిపేశారు. శిథిలాల్లో ఉన్న ఇనుప కడ్డీలు డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను నాశనం చేయడమే ఇందుకు అసలు కారణం. సొరంగం అంతర్గత నిర్మాణంలో వాడిన ఇనుప కడ్డీలు సొరంగం కూలాక శిథిలాల్లో చిందరవందరగా పడి ఆగర్ మెషీన్ ముందుకు కదలకుండా అడ్డుపడుతున్నాయి. దీంతో డ్రిలింగ్ వేళ మెషీన్ బ్లేడ్లన్నీ ధ్వంసమయ్యాయి. డ్రిల్లింగ్ ప్లాన్‌ను పక్కనబెట్టి ఇక మాన్యువల్‌గా తవ్వాలని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇంకా దాదాపు 12 మీటర్లమేర శిథిలాల గుట్టను తొలగించాల్సి ఉంది. ‘‘ఇదంతా తొలగించి కార్మికులను బయటకు తెచ్చేందుకు ఇంకొన్ని రోజులు/వారాలు పట్టొచ్చు’ అంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సభ్యుడు, మాజీ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నాయిన్ చేసిన మీడియా ప్రకటన కార్మికుల కుటుంబాల్లో భయాందోళనలు పెంచేసింది. క్రిస్మస్ పండుగ లోపు కార్మికులను రక్షిస్తామంటూ అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ చెప్పడంచూస్తుంటే ఈ మొత్తం ప్రక్రియకు నెలరోజులు పట్టేట్టు ఉందని తెలుస్తోంది. ‘ మరో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంది. కొండ పైనుంచి నిట్టనిలువునా డ్రిల్లింగ్ వచ్చే 24–36 గంటల్లో మొదలెడతాం’’ అని సయ్యద్ చెప్పారు. ‘ 25 మీటర్ల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేసేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్‌ను తెప్పిస్తున్నాం’ అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఘటనాస్థలిలో చెప్పారు. డ్రిల్లింగ్‌ను నిలిపేయడంతో డ్రిల్లింగ్ చోటుదాకా వెళ్లి తాజా పరిస్థితిని ధామీ పర్యవేక్షించారు. లోపలికి ల్యాండ్‌లైన్, ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ ప్రస్తుతానికి కార్మికులు క్షేమంగా ఉన్నారు. అయితే లోపల ఉన్న కార్మికుల మానసిక స్తైర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు సహాయకంగా లూడో వంటి బోర్డ్ ఆట వస్తువులతోపాటు మొబైల్ ఫోన్లను పంపించారు. నిరంతరం మాట్లాడేందుకు వీలుగా ‘ల్యాండ్‌లైన్’ను పంపుతున్నారు. ఇప్పటికే ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్సే్ఛంజ్‌ను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటుచేసింది. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వాడుతున్నారు. -
Uttarkashi tunnel collapse: సొరంగం పనులకు మళ్లీ ఆటంకం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని సిల్ క్యారా సొరంగంలో 12 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే పనులకు శుక్రవారం మళ్లీ అవరోధం ఏర్పడింది. గురువారం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన డ్రిల్లింగ్‌ను 25 టన్నుల భారీ ఆగర్ యంత్రంతో శుక్రవారం తిరిగి ప్రారంభించారు. అయితే, కొద్దిసేపటికే మరోసారి సమస్యలు రావడంతో నిలిపివేశారు. వాటిని సరిచేసి మళ్లీ పనులు ప్రారంభించినా గంటలోనే మళ్లీ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. కూలిన శిథిలాల గుండా సొరంగంలోకి ఒకదానికొకటి వెల్డింగ్‌తో కలిపిన స్టీలు పైపులను పంపించి, వాటిగుండా కార్మికులను వెలుపలికి తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రెండు రోజులుగా ఏర్పడుతున్న అంతరాయాలు టన్నెల్ వద్ద ఆత్రుతగా ఎదురుచూస్తున్న కార్మికుల సంబంధీకుల్లో ఆందోళన రేపుతోంది. అయితే, మిగిలి ఉన్న 5.4 మీటర్ల మేర శిథిలాల్లో డ్రిల్లింగ్కు అవరోధాలు ఎదురుకాకపోవచ్చని ప్రత్యేక రాడార్ ద్వారా తెలిసిందని అధికారులు తెలిపారు. ఇలా ఉండగా, టన్నెల్ నుంచి వెలుపలికి వచ్చాక కార్మికులకు వైద్య పరీక్షలు చేసి, ఆ వెంటనే గ్రీన్ కారిడార్ ద్వారా ఆస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గఢ్వాల్ రేంజ్ ఐజీ కేఎస్ నంగ్యాల్ చెప్పారు. -
Uttarkashi Tunnel: డ్రిల్లింగ్ పనులకు మళ్లీ ఆటంకం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో ఇంకొన్ని మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చన్న ఆశల నడుమ అనుకోని అవాంతరం ఎదురైంది. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన ‘వేదిక’కు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. బిగించిన వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచి్చతమైన దిశలో డ్రిల్లింగ్ సాధ్యపడదు. అప్పుడు అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు. ‘ మరికొన్ని గంటల్లో లేదా రేపటి కల్లా ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది’ అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నయిన్ గురువారం సాయంత్రం చెప్పారు. ‘మనం చేస్తున్నది యుద్ధంలాంటిదే. ఖచి్చతంగా ఫలానా సమయంలోగా ఈ ఆపరేషన్ పూర్తిచేసి అందర్నీ బయటకు తెస్తామని ముందుగానే జోస్యం చెప్పడం సరైన విధానం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు సొరంగం వద్దే ఉండి, లోపలున్న కారి్మకులను బయటకు తీసుకువచ్చే విషయంలో రిహార్సల్ చేస్తున్నారని హస్నయిన్ తెలిపారు. కారి్మకులను బయటకు తీసుకొచ్చే క్రమంలో అనుకోని విధంగా కాల హరణం జరుగుతున్నందున సమాంతర డ్రిల్లింగ్‌లో అనుకోని అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టామన్నారు. ఇందుకోసం అదనంగా యంత్రాలను తెప్పిస్తున్నామని వివరించారు. బార్కోట్ వైపు నుంచి డ్రిల్లింగ్ పనులను 9.10 మీటర్ల మేర పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు. డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న టన్నెల్ ప్రాంతం -
గుడ్‌న్యూస్.. రాత్రి వరకు సొరంగంలో చిక్కుకున్న కూలీలు బయటకి!
ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం నుంచి బాధిత కార్మికులను కాపాడే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న నలబై ఒక్క మంది కార్మికులను బయటకు తీసే పనులు చివరి దశకు చేరుకున్నాయి. సొరంగంలోని కార్మికులను వెలికి తీసేందుకు సహాయ బృందాలు కేవలం 12 మీటర్ల దూరంలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. నేటి రాత్రి 11. 30 గంటలలోపు మిగిలిన డ్రిల్లింగ్ పూర్తి చేసి కూలీలను బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పనులన్నీ ఆశావహంగా సాగుతున్నాయని చెబుతున్నాయని, అమెరికాకు చెందిన డ్రిల్లింగ్ మిషన్ మరో ఆరు మీటర్ల శిథిలాలను తొలగించినట్లు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక అధికారి భాస్కర్ ఖుల్బే పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘మేము మరో ఆరు మీటర్లు ముందుకు వెళ్లగలిగామని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. మరో రెండు గంటల్లో తదుపరి దశకు సద్ధమవుతున్నాం. అతి తక్కువ సమయంలోనే మిగిలిన పనిని పూర్తి చేయగలమని భావిస్తున్నాం’ అని మీడియాతో చెప్పారు. ఇప్పటి వరకు 67శాతం డ్రిల్లింగ్ పూర్తయినట్లు తెలిపారు. మరోవైపు రెస్క్యూ సిబ్బంది కార్మికుల కోసం పడకలను అధికారులు సిద్ధం చేశారు. అలాగే టన్నెల్ బయట 20 అంబులెన్స్‌లను రెడీగా ఉంచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కాసేపట్లో ఘటనాస్థలికి చేరుకునే అవకాశం ఉంది. చదవండి: Rajasthan Elections 2023: ఇక్కడ 651 మంది అభ్యర్థులు కోటీశ్వరులే! #WATCH | NDRF personnel enter Silkyara tunnel as operation to rescue 41 trapped workers intensifies, in Uttarakhand pic.twitter.com/f9LCO5PBun — ANI (@ANI) November 22, 2023 సహాయక చర్యలు కీలక దశకు చేరుకోవడంతో తమ రాష్ట్రానికి చెందిన 15 మంది కార్మికులను వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటిస్తే.. వారిని విమానంలో తరలించడానికి సిద్ధంగా ఉన్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది. డెహ్రాడూన్ నుంచి రాంచీకి విమానంలో తరలించనున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ప్రమాదం జరిగి పది రోజులు కావొస్తుంది. చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందిస్తున్నారు. ఫోన్లు కూడా పంపించి వారితో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌తో సహా ఐదు ప్రభుత్వ ఏజెన్సీలు ఈ భారీ ప్రయత్నానికి పూనుకున్నాయి. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | A machine that was stuck yesterday due to the road being narrow, has now reached the Silkyara tunnel site where rescue operations to bring out the trapped workers are underway. pic.twitter.com/KbN6OvYdFC — ANI (@ANI) November 22, 2023 -
ఆగిన టన్నెల్ తొలిచే పనులు...ప్రమాదంలో 40 మంది ప్రాణాలు!
ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లో టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న 40 మంది కార్మికులను కాపాడే రెస్క్యూ పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. డ్రిల్లింగ్ మెషిన్ మళ్లీ మొరాయించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. టన్నెల్లోకి వెడెల్పైన స్టీల్ పైపులను పంపి చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారీ యంత్రంతో ఆరు రోజులుగా డ్రిల్లింగ్ చేస్తున్నారు. టన్నెల్ డ్రిల్లింగ్ చేస్తూ శుక్రవారం ఆగిపోయిన యంత్రం రెండోది కావడం గమనార్హం. గురువారం ఒక యంత్రం డ్రిల్లింగ్ చేస్తూ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అధికారులు మూడో యంత్రాన్ని ఇండోర్ నుంచి వాయు మార్గంలో తీసుకువస్తున్నారు. ఈ యంత్రం శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకోనున్నట్లు సమాచారం. కాగా, ఆదివారం(నవంబర్ 12) ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో చార్దామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 4 కిలోమీటర్ల టన్నెల్‌లోని ఓ భాగం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేస్తేన్న 40 మంది కార్మికులు టన్నెల్ కింద చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్, ఆహారపదార్థాలు, నీరు పంపిస్తున్నారు. ఇప్పటివరకు వారంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదీచదవండి..ఆ ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు : హర్యానా హై కోర్టు -
120 గంటలుగా సొరంగంలోనే.. కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోసొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. ప్రమాదం జరిగి అయిదు రోజులు కావొస్తుంది. గత 120 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 40 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు ఒక్క కార్మికుడు కూడా సురక్షితంగా బయటకు రాలేకపోయారు. దీంతో సొరంగం లోపల బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కార్మికుల ఆరోగ్యం, క్షేమంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు 24 మీటర్ల వరకు శిథిలాలను రక్షణ బృందాలు తొలగించారు. నాలుగు పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్, నీరు, ఆహారం అందిస్తున్నారు. థాయ్‌లాండ్, నార్వేకు చెందిన ఎలైట్ రెస్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీటిలో 2018లో థాయ్‌లాండ్‌లోని గుహలో చిక్కుకున్న పిల్లలను విజయవంతంగా రక్షించిన రెస్యూటీమ్‌లు కూడా ఉన్నాయి. 50 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పైపులను శిథిలా గుండా సొరంగంలోకి పంపిస్తున్నారు. దీనిద్వారా కార్మికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కూలిపోయిన సొరంగం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్యాలిసౌర్ విమానాశ్రయానికి ‘అమెరికన్ ఆగర్’ మిషన్ (విడదీసిన భాగాలు) చేరుకుంది. కూలిపోయిన సొరంగం నుంచి శిథాలల గుండా మార్గాన్ని తవ్వడానికి ఈ యంత్రం ఉపయోగించనున్నారు. ఇది గంటకు 5 మీటర్ల బండరాళ్లను తొలగిస్తుంది,. కాగా నవంబర్ 12న (ఆదివారం) ఉదయం ఉత్తరకాశీలో చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సిల్క్యారా టన్నెల్లో కొంతభాగం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈఘటనలో సొరంగం పనిచేస్తున్న 40 మంది కార్మికులు శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. సొరంగం ప్రవేశ ద్వారం నుంచి 200 మీటర్ల దూరంలో వారంతా చిక్కుకుపోయారు. శిథిలాలు ముందు 50 మీటర్ల వరకు పడిపోయాయి. గత నాలుగు రోజులుగా వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు సొరంగంలో చిక్కుక్ను కార్మికుల ఆరోగ్యంపై వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి మనుగడ, భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారినట్లు చెబతుఉన్నారు. సుదీర్ఘకాలంగా నిర్బంధంలో ఉండటం వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతారని మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు వంటి పరిసర పరిస్థితులు వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలిపారు. భూగర్భంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల అపస్మారక స్థితికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. నిర్మాణంలోని వస్తువులు తమపై పడటం వల్ల తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. వారిని బయటకు తీశాక కూడా సమగ్ర పునరావాసం అవసరమని పేర్కొన్నారు. -
బ్యూటిఫుల్ వీడియోతో గడ్కరీకి ఆనంద్ మహీంద్ర వినతి
న్యూఢిల్లీ: ఆసక్తికర వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర. తాజాగా మరో అందమైన, అద్భుత ట్రీ టన్నల్ (ట్రన్నల్) దృశ్యాలతో కూడిన వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా.. దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న గ్రామీణ రహదారుల వెంట ఇలాంటి చెట్లను నాటి ‘ట్రన్నల్స్’ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ‘నాకు సొరంగాలు(టన్నల్స్) అంటే చాలా ఇష్టం. కానీ, నిజంగా ఇలాంటి ‘ట్రన్నల్స్’ గుండా వెళ్లడానికి ఇష్టపడతాను. కొత్తగా నిర్మించే గ్రామీణ రహదారుల వెంట చెట్లు నాటి ఇలాంటి ట్రన్నల్స్‌ను మనం నిర్మించగలమా నితిన్ గడ్కరీ జీ?’ అంటూ రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి రెండు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 37వేలకుపైగా లైకులు వచ్చాయి. ‘ప్రపంచంలోనే సహసిద్ధ టన్నల్’ అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. ‘రోడ్డుపై ఉష్ణోగ్రతలను ఈ టన్నల్స్ తగ్గిస్తాయి’ అని మరొకరు పేర్కొన్నారు. మరోవైపు.. ఆనంద్ మహీంద్ర ట్వీట్‌కు స్పందించారు కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేది. ‘వృక్షాలు బలంగా లేకపోతే వాహనాలపై పడతాయి. హైవేలపై పడి ప్రయాణాలకు ఆటంకం కలిగిస్తాయి. ఇది ఆ ప్రాంతంలోని మట్టి, వాతావరణ పరిస్థితులు, చెట్ల రకాలపై ఆధారపడి ఉంటుంది. భద్రత అనేది సమస్య కానప్పుడు ఇది చాలా అందంగా కనిపిస్తుందని చెప్పగలను.’ అంటూ పేర్కొన్నారు. I like tunnels, but frankly, I’d much rather go through this kind of ‘Trunnel’ …@nitin_gadkari ji, can we plan to purposefully plant some of these trunnels on the new rural roads you are building? https://t.co/6cE4njjGGi — anand mahindra (@anandmahindra) August 27, 2022 ఇదీ చదవండి: Anand Mahindra: ఆనంద్ మహీంద్ర అద్భుతమైన పోస్ట్: నెటిజన్లు ఫిదా -
విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు...సొరంగ ‘మార్గం
సాక్షి హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, కేబుల్ బ్రిడ్జి, అండర్‌పాస్‌లు, స్టీల్‌బ్రిడ్జిలు వంటి పనులు విజయవంతంగా పూర్తిచేసిన జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడిక సొరంగ మార్గాలపై దృష్టి సారించారు. హైదరాబాద్‌లో గతంలో లేనటువంటి వివిధ మార్గాలను అందుబాటులోకి తెస్తున్న వారు ప్రస్తుతం సొరంగ మార్గాల నిర్మాణాలకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకనుగుణంగా ఇప్పటికే జూబ్లీహిల్స్ నుంచి పంజగుట్ట వరకు భూగర్భంలో సొరంగ మార్గానికి (వయా కేబీఆర్ పార్క్) టెక్నికల్ కన్సల్టెంట్ల కోసం టెండర్లు పిలిచారు. ఖాజాగూడ గుట్టను తొలిచి అక్కడ మరో సొరంగ మార్గానికి సమాయత్తమవుతున్నారు. మంత్రి కేటీఆర్ ఆసక్తితో.. కేబీఆర్ పార్కు కింద నుంచి సొరంగమార్గానికి మంత్రి కేటీఆర్ ఆసక్తి కనబరచడంతో, ఖాజాగూడ సొరంగానికీ నిధులు కోరుతూ ప్రభుత్వం ముందుంచారు. ఎస్సార్డీపీ పనులకు సంబంధించి తొలి ప్రతిపాదనల మేరకు అయిదు ఫేజ్‌ల్లో ప్రణాళికలు రూపొందించారు. క్షేత్రస్థాయి పరిస్థితులతోపాటు ఇతరత్రా కారణాలతో వివిధ ఫేజ్‌ల్లో ఉన్న పనుల్లో ఆటంకాలు లేని పనుల్ని చేపట్టారు. కొన్ని పూర్తయ్యాయి. కొన్ని పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుతం వాటన్నింటినీ ఫేజ్– 1 గానే పరిగణిస్తూ, కొత్తగా ఫేజ్–2లో చేపట్టేందుకు 14 పనుల్ని ప్రతిపాదించారు. వాటిలో ఖాజాగూడ సొరంగమార్గం ప్రముఖంగా ఉంది. ఫేజ్– 2లోని పనుల మొత్తం అంచనా వ్యయం రూ.3515 కోట్లు కాగా, అందులో రూ. 1080 కోట్లు ఈ సొరంగ మారానికే ఖర్చు కానుంది. మిగతా 13 పనుల్లో పాతబస్తీకీ తగిన ప్రాధాన్యమిచ్చారు. శాస్త్రిపురం జంక్షన్‌నుంచి ఇంజన్‌బౌలి వరకు రూ.250 కోట్లతో రోడ్డు విస్తరణ, బెంగళూర్ హైవే నుంచి శాస్త్రిపురం వరకు రూ.150 కోట్లతో రోడ్డు విస్తరణ పనుల్ని కొత్తగా చేర్చారు. వీటితోపాటు కొన్ని పాత ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. జీహెచ్ఎంసీ పాలకమండలి ఆమోదం కోసం ఈ నెల 12న జరగనున్న సభలో వీటిని ఉంచే అవకాశం ఉంది. (చదవండి: ప్రత్యామ్నాయ ఫ్రంట్ దిశగా..!) -
మంచుకొండల్లో అద్భుత నిర్మాణం! ఎంఈఐఎస్ అరుదైన రికార్డు
హైదరాబాద్: మౌలిక రంగ నిర్మాణ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అరుదైన మైలురాయిని చేరుకుంది. 18 కిలోమీటర్ల పొడవైన జొజిలా టన్నెల్స్ మార్గంలో 5 కిలోమీటర్ల మేర సొరంగ నిర్మాణ పనులను పూర్తి చేసింది. రికార్డు స్థాయిలో 14 నెలల్లోనే దీన్ని సాధించినట్టు ఎంఈఐఎల్ ప్రకటించింది. జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్హెచ్ఐడీసీఎల్) నుంచి ఈ ప్రాజెక్టును ఎంఈఐఎల్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్ మార్గం అయిన ఇది పూర్తయితే, శ్రీనగర్–లద్దాక్ మధ్య ఏడాది పొడవునా ఎలాంటి అవాంతరాల్లేకుండా రవాణాకు వీలు కలుగుతుంది. జొజిలా టన్నెల్స్ పరిధిలో నీల్‌గ్రార్ 1, 2, జోజిలా ప్రధాన సొరంగం నిర్మాణాన్ని అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనూ వేగంగా అమలు చేస్తున్నట్టు ఎంఈఐఎల్ తెలిపింది. ఇందులో నీల్ గ్రార్ టన్నెల్ 1లో 915 మీటర్లకు గాను మొత్తం పని పూర్తయింది. నీల్ గ్రార్ టన్నెల్ 2 లో 3907 మీటర్లకు గాను 2573 మీటర్ల పని పూర్తయింది. ఇక, జోజిలా ప్రధాన టన్నెల్ లో 13145 మీటర్లకు గాను 1523 మీటర్ల పని పూర్తయింది. మొత్తం 18 కిలోమీటర్ల టన్నెల్ పనులకు 5 కిలోమీటర్ల టన్నెల్ పనులను అతి స్వల్ప వ్యవధిలోనే మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేయటం విశేషం. -
మంచు కొండల్లో మేఘా అద్భుతం
న్యూఢిల్లీ: జోజిలా సొరంగ మార్గం పనులు వేగవంతంగా చేస్తున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) వెల్లడించింది. ఇందులో భాగంగా టనల్ 1లోని ట్యూబ్ 2 తవ్వకం పనులను పూర్తి చేసినట్లు తెలిపింది. దీని పొడవు సుమారు 472 మీటర్లు. ఇప్పటికే సుమారు 448 మీటర్ల పొడవున్న ట్యూబ్ 1 పనులు పూర్తయినట్లు కంపెనీ పేర్కొంది. 2వ టనల్ పనులు జరుగుతున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది. దట్టమైన మంచు పేరుకుపోవడంతో దాదాపు ఆరు నెలల పాటు లడఖ్–శ్రీనగర్ మధ్య రాకపోకలు కష్టతరంగా మారతాయి. ఈ నేపథ్యంలో అన్ని సీజన్లలోనూ ప్రయాణాలకు వీలు కల్పించే జోజిలా టనల్ ప్రాజెక్టును ఎంఈఐఎల్ 2020 అక్టోబర్‌లో దక్కించుకుంది. దీని విలువ సుమారు రూ. 4,600 కోట్లు. -
సరిహద్దులో చైనా కొత్త ఎత్తుగడ
న్యూఢిల్లీ: డోక్లాం పీఠభూమి ప్రాంతంలో అన్ని కాలాలలో రహదారి మార్గం సుగమం చేసుకోవడానికి రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను చైనా వేగవంతం చేసినట్లు ఎన్డీటీవీ సేకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా వెల్లడయ్యింది. ఈ ప్రాంతంలో 2017లో చైనా భారత్ మధ్య 70 రోజుల పాటు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలోని చైనా నిర్మాణ కార్మికులు ఉపరితల సొరంగమార్గాన్ని 500 మీటర్ల వరకు పొడిగించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. శీతాకాలంలో ఈ మార్గం అంతా మంచుతో కప్పబడి ఉంటుందని, దానికోసమే ఏ కాలంలోనైనా ప్రయాణించేలా ఈ రవాణా సౌకర్యాన్ని పెంచుకున్నట్లు స్పష్టమౌతోందని సైనిక నిపుణులు భావిస్తున్నారు. డోక్లాం పీఠభూమి తమ భూభాగంలోనిదేనంటూ చైనా, భూటాన్ ప్రకటించుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్, భూటాన్‌కి మద్దతిస్తోంది. -
ఆసియాలోనే పొడవైన టన్నెల్ పనులు ప్రారంభం
న్యూఢిల్లీ: ఆసియాలోని అతి పొడవైన జోజిలా టన్నెల్ పనులను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణాకు ఉపయోగపడేలా ఈ టన్నెల్ ను మేఘా ఇంజినీరింగ్ నిర్మిస్తోంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ రహదారి ఏర్పాటవుతోంది. కార్గిల్ ప్రాంతాన్ని కాశ్మీర్ లోయతో కలిపేలా జోజిలా టన్నెల్ పనులను ఎంఈఐఎల్ చేపట్టింది. ఈ సొరంగం పొడవు 14.15 కి.మీ.లు కాగా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనది. ఇది ఆసియా రెండు దిశలలో పొడవైన సొరంగం. ‘ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయడంలో ఎంతో పేరుగాంచిన ఎంఈఐఎల్ ఈ రహదారిని నిర్మాణ పనులను కూడా నాలుగేళ్ళలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాలని’ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా ఈ సొరంగ నిర్మాణం పూర్తయితే లద్దాఖ్, శ్రీనగర్ మధ్య ఏడాది పొడవునా ప్రయాణించవచ్చు. ఈ రెండింటి మధ్య ప్రయాణం దాదాపు 3.30 గంటలు పడుతుంది ఈ రహదారి నిర్మాణంతో 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. 11,578 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ లో మంచు కారణంగా స్తంభించింది. జోజిలా సొరంగం నిర్మాణంతో శ్రీనగర్, లేహ్ మధ్య సంవత్సరమంతా కనెక్టివిటీతో జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల ఆర్థిక, సామాజిక- సాంస్కృతిక ఏకీకరణకు ఈ రహదారి దోహదపడుతుంది. (చదవండి: ‘చనిపోయాడు.. కానీ ఆత్మ విడిచిపెట్టలేదు’) దాదాపు 33 కిలోమీటర్ల జోజిలా రహదారిని 2 విభాగాలుగా నిర్మిస్తున్నారు. మొదటి విభాగంలో 18.63 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేసి నిర్మించాలి. రెండో విభాగంలో జోజిల్లా టన్నెల్ ను 14.15 కిలోమీటర్ల మేర రెండు రహదారుల లైన్ గా 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు నిర్మిస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ టన్నెల్, రహదారిని నిర్మిస్తోంది. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఎమెర్జెన్సీ లైటింగ్, ఆటోమెటిక్ లైటింగ్, మెసేజ్ సిగ్నలింగ్, ఎమెర్జెన్సీ టెలిఫోన్, రేడియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో గంటకు 80 కి.మి. వేగంతో ప్రయాణించవచ్చు. జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. ముఖ్యంగా శీతాకాలంలో ఆరు నెల్లపాటు శ్రీనగర్- లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీకి సంబంధించిన వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే వ్యయంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. The watershed moment in the road history of the UTs of Jammu & Kashmir & Ladakh is finally here. Today virtually initiated the 'ceremonial blast' of #ZojilaTunnel in the presence of MoS @Gen_VKSingh Ji,... pic.twitter.com/iYMKdOzlNM — Nitin Gadkari (@nitin_gadkari) October 15, 2020 -
పథకం ప్రకారమే పాక్, చైనా కయ్యం
న్యూఢిల్లీ: సరిహద్దు విషయంలో దాయాది దేశం పాకిస్తానే కాదు చైనా సైతం తరచూ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య గత ఐదు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే, ఒక పథకంలో(మిషన్) భాగంగానే పాక్, చైనా సరిహద్దు వివాదాలు సృష్టిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. ఆయన సోమవారం 44 నూతన వారధులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. లద్దాఖ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ వారధులు ఉన్నాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్, చైనా దేశాలతో భారత్‌కు 7,000 కిలోమీటర్ల సరిహద్దు ఉందని తెలిపారు. భారత్‌కు ఇబ్బందులు కలిగించాలని ఉత్తర దిశ నుంచి పాకిస్తాన్, తూర్పు దిశ నుంచి చైనా ఒక పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నూతన బ్రిడ్జీలతో ఆయా వ్యూహాత్మక ప్రాంతాలకు మన సైనికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వారు సులువుగా అక్కడికి చేరుకోగలుగుతారని వెల్లడించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాకిస్తాన్, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లు వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటూనే భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్మించనున్న 450 మీటర్ల సొరంగ మార్గం నెచిపూ టన్నెల్ నిర్మాణానికి ఆయన ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌ను రాజ్‌నాథ్ ప్రశంసించారు. -
అందుబాటులోకి అటల్ టన్నెల్
రోహ్తాంగ్: హిమాలయ పర్వత సానువుల్లో ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గా(టన్నెల్)న్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, లేహ్ మధ్య 46 కి.మీ. దూరాన్ని ఈ సొరంగ మార్గం తగ్గిస్తుంది. 9.02 కి.మీ.ల పొడవైన ఈ టన్నెల్ వల్ల ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపో తుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య, ఎన్నో సవాళ్లనెదుర్కొని ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది. దేశ రక్షణలో అత్యంత వ్యూహాత్మకమైన ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన మోదీ దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి కన్న కలలు సాకారమయ్యాయని అన్నారు. ఇదే సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం దేశ భద్రతా ప్రయోజనాలపై రాజీ పడిందని దుయ్యబట్టారు. అటల్ సొరంగం, తేజాస్ యుద్ధ విమానాల తయారీ మొదలైన వాటిని గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ‘మాకు దేశ భద్రతే అత్యంత ముఖ్యం. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. 26 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనిని మా ప్రభుత్వం ఆరేళ్లలో చేసింది. కేవలం సైనిక అవసరాలే కాదు, లేహ్, లద్దాఖ్ ప్రాంత ప్రజల బతుకు అవసరాలు కూడా ఈ సొరంగం తీరుస్తుంది’అని మోదీ అన్నారు. అటల్ టన్నెల్‌గా పేరు మార్పు 2000 సంవత్సరం జూన్ 3న వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2002 మే 26న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో దీనిని పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో నిర్మాణం సాగలేదు. మొదట్లో దీనిని రోహ్తాంగ్ సొరంగం అని పిలిచేవారు. 2019లో దీనికి అటల్ సొరంగం అని పేరు మార్చారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈ టన్నెల్ నిర్మాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. సొరంగం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది. సొరంగం విశేషాలు ► సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగమిది. నిర్మాణ వ్యయం రూ.3,300 కోట్లు. ► ఒకటే ట్యూబ్‌లో, డబుల్ లేన్‌తో ఈ సొరంగాన్ని నిర్మించారు. రోజూ 3వేల కార్లు , 1500 లారీలు రాకపోకలు సాగిం చేలా నిర్మించారు. దీంట్లో వాహనాల గరిష్టవేగం గంటకు 80 కి.మీ. ► సరిహద్దుల్లో రక్షణ పరంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా మిలటరీ సామగ్రిని తరలించడానికి ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది. ► భారీగా మంచు కురవడం వల్ల ఏడాదిలో ఆరునెలలు లేహ్ ప్రాంతవాసులకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సొరంగ మార్గంతో అక్కడ ప్రజలు కూడా ప్రయాణించే అవకాశం వచ్చింది. -
మేఘా చేతికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది. హిమాలయాల్లోని జమ్మూకాశ్మీ ర్–లద్దాఖ్‌లోని జోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణ టెండర్లలో కంపెనీ లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. నేషనల్ హైవేస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైనాన్స్ బిడ్లను శుక్రవారం తెరిచింది. ప్రాజెక్టు వ్యయం రూ.4,509.50 కోట్లు. మొత్తం పనిని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా చేపట్టాల్సి ఉంటుంది. మొదట 18.50 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేయాలి. 2 కిలోమీటర్లు, 0.5 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలను (టన్నెల్స్) నిర్మించాలి. అలాగే జోజిల్లా టన్నెల్‌ను 14.15 కిలోమీటర్ల మేర రెండు వరుసల్లో రోడ్డును 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తులో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతన రీతిలో, క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సిహెచ్.సుబ్బయ్య తెలిపారు. ప్రాజెక్టును 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లద్దాఖ్ లేహ్ ప్రాంతంలో ఉన్న రహదారిని ఏడాదిలో 6 నెలలపాటు పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్‌కు రహదారి టన్నెల్ నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. మొత్తం మూడు సంస్థలు పోటీపడ్డాయి. -
బ్లాస్టింగ్‌తో పొంచి ఉన్న ముప్పు
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ప్యాకేజీ పనుల్లో భాగంగా కొనసాగుతున్న అండర్ టన్నెల్(సొరంగం) పనుల్లో వినియోగిస్తున్న బ్లాస్టింగ్ వల్ల కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌కు ప్రకంపనలు వస్తున్నాయని లిఫ్ట్‌ను నిర్వహిస్తున్న పటేల్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏడాది క్రితమే ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. సొరంగం పనుల్లో కంట్రోల్ బ్లాస్టింగ్ కాకుండా ఎక్కువ సామర్థ్యంతో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ శబ్దానికి సమీపంలో ఉన్న కేఎల్ఐ మొదటి లిఫ్ట్ వద్ద భూమి కంపించి ఇప్పటికే లిఫ్ట్ వద్ద అద్దాలు పగిలిపోవడంతో పాటు, భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తవచ్చనే ఉద్దేశంతో కేఎల్ఐ అధికారులకు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం వారు పరిశీలించారు. బెంగళూరుకు చెందిన ఎన్ఐఆర్ఎం ప్రతినిధులతో బ్లాస్టింగ్ తీవ్రతను పరీక్షించారు. అయితే బ్లాస్టింగ్ తీవ్రత కేఎల్ఐ లిఫ్ట్ వద్ద పెద్దగా ప్రభావం చూపడం లేదని అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే అక్కడ పనిచేస్తున్న వారు మాత్రం బ్లాస్టింగ్ వల్ల లిఫ్ట్‌కు ప్రమాదం పొంచి ఉందని, బ్లాస్టింగ్ తీవ్రత తగ్గించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి నివేదించిన అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. కేఎల్ఐ లిఫ్ట్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు.. పాలమూరు–రంగారెడ్డి సొరంగం పనుల్లో ఎక్కువ సామర్థ్యంతో కూడిన కెమికల్‌ను వినియోగిస్తూ బ్లాస్టింగ్ చేయడం వల్ల భూగర్భంలో ఉన్న కేఎల్ఐ లిఫ్ట్‌కు ప్రకంపనలు వస్తున్నాయని, దానివల్ల లీకేజీలు, స్లాబ్క్రాక్లు, అద్దాలు పగిపోవడం వంటివి జరుగుతున్నాయని లిఫ్ట్ నిర్వాహకులు ఏడాది క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ అదే పరిస్థితి తలెత్తడంతో మూడు నెలల క్రితం కేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం పాలమూరు–రంగారెడ్డి సీఈ రమేష్, ఈఈ విజయ్‌కుమార్, ఎస్ఈ అంజయ్య, ఈఈలు, డీఈలు, ఏఈలు కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌ను పరిశీలించారు. బెంగళూర్ నుంచి ఎన్‌ఐఆర్‌ఎంకు ప్రతినిధులను పిలించి పాలమూరు–రంగారెడ్డి టెన్నెల్ పనుల్లో బ్లాస్టింగ్ చేయించి ప్రత్యేక పరికరం ద్వారా కేఎల్ఐ లిఫ్ట్‌లో వచ్చే తీవ్రతను పరీక్షించారు. అయితే పెద్దగా ప్రభావం చూపడం లేదని తేల్చినట్లు సమాచారం. స్వల్పంగా ప్రకంపనలు కనిపిస్తున్నాయని తేల్చినట్లు తెలిసింది. ఈ విషయం సీఈ రమేష్‌ను వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా చెప్పేందుకు ఇష్టపడలేదు. జనరల్ విజిట్ వెల్లడించారు. బ్లాస్టింగ్ వల్ల కేఎల్ఐ లిఫ్ట్‌కు పెద్దగా ఇబ్బంది ఉండదంటూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అధికారులు, కేఎల్ఐ అధికారులు వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ–1 పనుల్లో భాగంగా కొనసాగుతున్న సొరంగం పనులు 1,300 మీటర్లు కొనసాగించాల్సి ఉంటుంది. కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగిస్తేనే చుట్టుపక్కల పెద్దగా ఇబ్బంది ఉండదు. కేఎల్ఐ మొదటి లిఫ్ట్‌లో ఐదు పంపులు ఉన్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కేఎల్ఐ మొదటి లిఫ్ట్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని మొదటి ప్యాకేజీ పనులు చేస్తున్న కంపెనీ వారికి కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగించే విధంగా ఆదేశించాలని అక్కడి వారు అభిప్రాయ పడుతున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షించి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. 2005లో రూపకల్పన శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 25 టీఎంసీల మిగులు జలాలను తీసుకునే ప్రతిపాదనలతో 2005లో కేఎల్ఐ ప్రాజెక్టును రూ.2,990 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును మూడు లిఫ్ట్‌లుగా విభజించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మొదటి లిఫ్ట్, పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ వద్ద రెండో లిఫ్ట్, నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి వద్ద మూడో లిఫ్ట్‌ను నిర్మించారు. మొదటి లిఫ్ట్ నుంచి 13వేల ఎకరాలకు, రెండో లిఫ్ట్ నుంచి 47 వేల ఎకరాలకు, మూడో లిఫ్ట్ నుంచి 2.80 లక్షల ఎకరాలకు కలిపి మొత్తం 3.40 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కేఎల్ఐ కాల్వల సామర్థ్యం పెంచుకోవడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తేనే కేఎల్ఐ ద్వారా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. -
ఎస్ఎల్బీసీ పూర్తికి మరో రెండేళ్లు
సాక్షి, హైదరాబాద్: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎస్ఎల్బీసీ) సొరంగ పనుల పూర్తికి మరో రెండేళ్లకుపైగా పట్టే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదీజలాలను వినియోగించుకొని తెలంగాణలోని అవిభాజ్య మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు పురుడుపోసుకున్నది. 2020 అక్టోబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపూర్తి చేసి తీరుతామంటూ పనులు చేపట్టిన జయప్రకాశ్ అసోసియేట్ అనే సంస్థ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి సొరంగం పనుల్లో ఎప్పుడూ ఓ ఆటంకం ఎదురవుతోంది. తాజాగా టన్నెల్ బోరింగ్ మిషన్ పాడవడంతో దాని మరమ్మతులకు మరో రూ.60కోట్లు అడ్వాన్స్ కోరగా ప్రభుత్వం అందుకు సమ్మతించింది. అవాంతరాలు.. జాప్యం 2004లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు రూ.2,813 కోట్లతో టెండర్లు పిలవగా 2005 ఆగస్టులో రూ.1,925 కోట్లకు జయప్రకాశ్ అసోసియేట్ ఏజెన్సీ పనులు దక్కించుకుంది. ఈ పనులను 2010 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా, భూసేకరణ సమస్యలు, వరదల కారణంగా పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. పనుల ఆలస్యం కారణంగా వ్యయం రూ.4,200 కోట్లకు పెరిగింది. ఇందులో ఇప్పటివరకు రూ.2,200 కోట్లు ఖర్చు చేశారు. మిగతా పనులు కొనసాగుతుండగా, ఇటీవల ఔట్లెట్ టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురైంది. ఈ బోరింగ్ మిషన్ బేరింగ్, కన్వెయర్బెల్టు పాడవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ బోరింగ్ మిషన్ మరమ్మతులకే ఏడు నెలలు పట్టనున్న నేపథ్యంలో డెడ్లైన్లో పనుల పూర్తి సాధ్యమా అన్నదానిపై అనేక సందేహాలున్నాయి. -
జోజిలా సొరంగ మార్గానికి శ్రీకారం..
శ్రీనగర్ : భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా, అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న జోజిలా సొరంగ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు శ్రీనగర్, జమ్మూలలో పలు రోడ్డు మార్గాల నిర్మాణ కార్యక్రమాలు ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్, కార్గిల్, లేఖ్లను కలుపుతూ నిర్మిస్తున్న జోజిలా సొరంగ మార్గాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణానికి అనుకూలించే విధంగా నిర్మిస్తున్నారు. ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతాల్లో 14.15 కిలోమీటర్ల మేర నిర్మించనున్న జోజిలా మార్గం.. దేశంలో అత్యంత పొడవైన, ఆసియాలోని అత్యంత పొడవైన ద్విదిశాత్మక(టూ వే) సొరంగ మార్గంగా నిలవనుంది. సముద్ర మట్టం నుంచి 11,578 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ వద్ద సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు భారత ప్రభుత్వం 6, 800 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. అత్యాధునిక టెక్నాలజీతో.. శ్రీనగర్, కార్గిల్, లేఖ్ల మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను మెరుగుపరచడమే లక్ష్యంగా నిర్మిస్తున్న జోజిలా సొరంగ మార్గ నిర్మాణానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. నిరంతరాయ విద్యుత్ సప్లై, ఫుల్లీ ట్రాన్స్వెర్స్ వెంటిలేషన్ సిస్టమ్, సీసీటీవీ మానిటరింగ్, ట్రాఫిక్ లాగింగ్ ఎక్విప్మెంట్, వేరయబుల్ మెసేజ్ సైన్స్, టన్నెల్ రేడియో సిస్టమ్ ద్వారా భద్రతా ప్రమాణాల స్థాయి పెంచనున్నారు. కాగా ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా 14.15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 3 గంటల 5 నిమిషాల సమయం పడుతోంది. అయితే జోజిలా పాస్ సొరంగ మార్గ నిర్మాణం పూర్తైతే కేవలం 15 నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. -
యాసంగికి ‘అనంతగిరి’ నీళ్లు
ఇల్లంతకుంట (మానకొండూర్): వచ్చే యాసం గికి అనంతగిరి రిజర్వాయర్ నీళ్లు అందిస్తామని నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం– 10వ ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో 3.5 టీఎంసీల రిజర్వాయర్, ఆనకట్ట పనులతోపాటు, తిప్పాపూర్ వద్ద టన్నెల్ నిర్మాణం, సర్జుఫుల్‌లో విద్యుత్ మోటార్ల బిగింపు పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతగిరి రిజర్వాయర్ నుంచి పంట కాల్వల ద్వారా 30 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని చెప్పారు. రెండేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రికార్డుస్థాయిలో చేపట్టామని, పంప్‌హౌస్‌లు, బ్యారేజీల నిర్మాణం వేగవంతంగా సాగుతోందన్నారు. లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోబోతున్నామని మంత్రి చెప్పారు. మరో 25 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తి చేస్తే అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. అనంతగిరి రిజర్వాయర్‌లో భాగమైన నాన్ ఓవర్ ఫుల్ స్పిల్ వే 3 లక్షల పైచిలుకు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామన్నారు. మరో 14 వేల క్యూబిక్ మీటర్ల పనులు వారంలోగా పూర్తవుతాయని చెప్పారు. 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ జాప్యంపై మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, 46 కిలోమీటర్ల దూరం నుంచి నిర్మిస్తున్న విద్యుత్ టవర్ల పనులను వర్షకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాలని హరీశ్ సూచించారు. తిప్పాపూర్ సర్జుఫుల్‌లో నాలుగు మోటార్ల బిగింపు పనులు ఏకకాలంలో చేపట్టామని, సర్జుఫుల్‌లో గేట్ల నిర్మాణాలను మరో 45–50 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అనంతగిరి నిర్వాసితులు కోరుకున్న విధంగా ప్యాకేజీ వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. -
శరవేగంగా రైల్వే సొరంగం పనులు
8 కిలోమీటర్లు పొడవు రూ.470.29 కోట్ల వ్యయం రాపూరు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి కడప జిల్లా ఓబులవారిపల్లి వరకు నిర్మించనున్న రైల్వే మార్గంలో భాగంగా నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మాధవయ్యపాళెం( రాపూరు సమీపంలోని వెలుగొండల్లో ) వద్ద రైల్వే సొరంగమార్గ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వెలుగొండల్లో అటువైపు వైఎస్సార్ జిల్లా ఇటు వైపు నెల్లూరు జిల్లా ఉండడం తెలిసిందే. ఇప్పటికే రెండు జిల్లాలను కలుపుతూ రాపూరు–చిట్వేలి మార్గమధ్యలో ఘాట్ రోడ్డు నిర్మించారు. నూతనంగా రైల్వే సొరంగ మార్గానికి ప్రభుత్వం రూ.470.29 కోట్లు కేటాయించడంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మార్గం సుమారు 8 కిలోమీటర్ల పోడవు ఉంటుందని రైల్వే వికాస్ నిగామ్ లిమిటెడ్ అధికారులు తెలిపారు. చెర్లోపల్లి వద్ద పనుల నిర్వహణ: వైఎస్సార్ జిల్లా చిట్వేలి మండలం చెర్లోపల్లి గ్రామ వెలుగొండల్లో రైల్వే సొరంగం మార్గ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు కిలో మీటరు, రాపూరు సమీప అడవుల్లో 750 మీటర్లు పూర్తయ్యాయి. రెండేళ్లల్లో పూర్తికావచ్చు: రాపూరు–చిట్వేలి మార్గ మధ్యలో నిర్మిస్తున్న సొరంగం సుమారు 2 సంవత్సరాల్లో పూర్తి కావచ్చని రైల్వే అధికారులు చెప్పారు. పనులు పూర్తయితే ఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నంకు ఇనుపఖనిజం, ముగ్గురాళ్లు నేరుగా కృష్ణపట్నంకు తరలించవచ్చన్నారు.