న్యూఢిల్లీ: జోజిలా సొరంగ మార్గం పనులు వేగవంతంగా చేస్తున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్) వెల్లడించింది. ఇందులో భాగంగా టనల్ 1లోని ట్యూబ్ 2 తవ్వకం పనులను పూర్తి చేసినట్లు తెలిపింది. దీని పొడవు సుమారు 472 మీటర్లు. ఇప్పటికే సుమారు 448 మీటర్ల పొడవున్న ట్యూబ్ 1 పనులు పూర్తయినట్లు కంపెనీ పేర్కొంది. 2వ టనల్ పనులు జరుగుతున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది.
దట్టమైన మంచు పేరుకుపోవడంతో దాదాపు ఆరు నెలల పాటు లడఖ్–శ్రీనగర్ మధ్య రాకపోకలు కష్టతరంగా మారతాయి. ఈ నేపథ్యంలో అన్ని సీజన్‌లలోనూ ప్రయాణాలకు వీలు కల్పించే జోజిలా టనల్ ప్రాజెక్టును ఎంఈఐఎల్ 2020 అక్టోబర్‌లో దక్కించుకుంది. దీని విలువ సుమారు రూ. 4,600 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment