meil
-
పది రోజుల్లో పనులు షురూ‘
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాలకు మరో ముందడుగు పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐల్) అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఈ క్యాంపస్‌ను నిర్మించేందుకు అంగీకరించింది. అంతేకాదు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇందుకు రూ.200 కోట్ల భూరి విరాళాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 8న అకాడమిక్, పరిపాలన, ల్యాబొరేటరీ, గ్రంథాలయం, పార్కింగ్, ఫుడ్‌కోర్టు, 700 మంది కూర్చొనే సామర్థ్యం గల ఆడిటోరియం, భద్రతా సిబ్బంది వసతి గృహాలు, క్రీడా మైదానాల పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీఎస్ఐఐసీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగాలు ఆయా భూములను సేకరించి, చదును చేసి వర్సిటీకి అప్పగించాయి. 17 కోర్సులు.. ఏటా 20 వేల మందికి శిక్షణకందుకూరు మండలం మీర్ఖాన్పేట సర్వే నంబర్ 112లోని 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ నిర్మాణానికి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వర్సిటీలో ఫార్మా, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్, ప్యాకింగ్, హార్డ్‌వేర్, ఎలక్ట్రీషిన్ వంటి 17 రంగాల్లోæ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్, మూడేళ్ల డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ ఆన్లైన్/ ఆఫ్‌లైన్ కోర్సులను అందించనున్నారు.ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ కోర్సులను నిర్వహించనున్నారు. ఏటా 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ బిల్లు–2024’ను కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే .గవర్నర్/ సీఎం ఈ వర్సిటీకి చాన్స్‌లర్‌గా వ్యవహరించనున్నారు. వీసీ సహా 15 మందితో పాలకమండలి ఉంటుంది. ఇందులో ఏడుగురు సభ్యులు పరిశ్రమలకు చెందిన వారే ఉంటారు. వర్సిటీ మూడేళ్ల నిర్వహణకు రూ.312 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. రూ.170 కోట్లు కేవలం కోర్సుల ఫీజుల రూపంలో సమకూరనున్నాయి. -
మంగోలియాలో మేఘా భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియాలో మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా అత్యాధునిక ముడిచమురు శుద్ధి కేంద్రాన్ని నిర్మించనుంది. డీల్ విలువ సుమారు రూ. 5,400 కోట్లు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 15 లక్షల టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేయనుందని కంపెనీ ప్రకటించింది. మేఘా ఇంజనీరింగ్ ఇప్పటికే మంగోలియాలో రూ.6,500 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులను చేపట్టింది. మంగోలియా రాజధాని ఉలాన్బటోర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎంఈఐఎల్, మంగోల్ రిఫైనరీ స్టేట్ ఓన్డ్ ఎల్ఎల్సీ మధ్య ఒప్పందం జరిగింది. మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వా మ్యం అయినందుకు గర్వంగా ఉందని ఎంఈఐఎల్ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. -
రూ. 8,200 కోట్లతో మేఘా ఈవీ ప్లాంటు! బీవైడీతో కలిసి ఏర్పాటు యోచన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంటు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ భాగస్వామ్యంలో తెలంగాణలో ఈ ఫెసిలిటీని స్థాపించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే ప్లాంటుకు కావాల్సిన స్థలం, ఇతర సౌకర్యాల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంఈఐఎల్, బీవైడీ సంప్రదించనున్నాయి. ప్రతిపాదిత ప్రణాళిక కార్యరూపం దాలిస్తే ప్లాంటు కోసం ఇరు సంస్థలు కలిసి సుమారు రూ.8,200 కోట్లు వెచ్చించనున్నాయి. మేఘా అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఇప్పటికే బీవైడీ సాంకేతిక భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ బస్‌లను తయారు చేస్తోంది. అలాగే తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్‌ల తయారీకై 150 ఎకరాల స్థలాన్ని ఒలెక్ట్రా కొనుగోలు చేసింది. (తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్) అత్యాధునిక రీతిలో ఏటా 10,000 ఈ–బస్‌లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో ఇది రానుంది. ఎలక్ట్రిక్ టిప్పర్ల తయారీలోకి సైతం ఒలెక్ట్రా ఎంట్రీ ఇచ్చింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు, త్రిచక్ర, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలనూ పరిచయం చేయాలన్నది కంపెనీ ప్రణాళిక. ఇది కూడా చదవండి: Koushik Chatterjee: కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం -
మేఘా కంపెనీకి రూ.500 కోట్ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ ఐకామ్ టెలి తాజాగా భారత రక్షణ శాఖ నుంచి రూ. 500 కోట్ల ఆర్డర్ చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా 5/7.5 టన్నుల రేడియో రిలే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కంటైనర్స్ 1,035 యూనిట్లు సరఫరా చేయనుంది. రక్షణ శాఖతో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఐకామ్ టెలి గురువారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే డెలివరీలు ప్రారంభం అవుతాయని వివరించింది. -
ఐకామ్ ప్లాంటులో కారకల్ ఆయుధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధునాతన ఆయుధాల తయారీ, సరఫరాలో ప్రపంచస్థాయి దిగ్గజం కారకల్ ఇంటర్నేషనల్‌తో హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ టెలీ సాంకేతిక బదిలీ ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈలోని అబుదాబిలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రై-సర్వీస్ డిఫెన్స్ ఎగ్జిబిషన్లలో ఒకటైన ఐడీఈఎక్స్ 2023 కార్యక్రమంలో మంగళవారం ఇరు సంస్థల మధ్య డీల్ కుదిరింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఐకామ్.. భారత రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాల తయారీలో భాగస్వామిగా ఉంది. తాజా డీల్ ప్రకారం హైదరాబాద్ ప్లాంటులో కారకల్ టెక్నాలజీతో చిన్న పాటి ఆయుధాలను తయారు చేస్తామని ఐకామ్ టెలి ఎండీ పి.సుమంత్ తెలిపారు. క్షిపణులు, కమ్యూనికేషన్స్, ఈడబ్ల్యూ సిస్టమ్స్, రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టిక్స్, మందుగుండు, షెల్టర్లు, డ్రోన్, కౌంటర్–డ్రోన్ సిస్టమ్స్‌ను ఐకామ్ ఇప్పటికే తయారు చేస్తోంది. 1989లో ప్రారంభమైన ఐకామ్‌కు హైదరాబాద్ శివారులో 110 ఎకరాల్లో ప్లాంటు ఉంది. -
బిహార్‌లో మేఘా ప్రాజెక్టు పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచి నీటి సరఫరా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. హర్ ఘర్ గంగాజల్ మొదటి దశ పనులతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన బోధ్ గయా, గయా, రాజ్‌గిర్ నగరాల తాగునీటి కష్టాలు తీరిపోనున్నాయి. శుద్ధి చేసిన గంగాజలాలు ఇకపై ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా గంగా నదీ జలాలు అందుబాటులో లేని ఈ ప్రాంతాలకు వరద నీటిని తాగునీరుగా మార్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వరద నీటిని ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లలో నింపి, శుద్ధిచేసి 365 రోజులు ప్రజలకు తాగునీరు సరఫరా చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టులో భాగంగా 151 కిలోమీటర్ల పొడవు పైప్‌లైన్, నాలుగు వంతెనలతోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. -
హైదరాబాద్: మేఘా గ్యాస్ ఇక ఎంసీజీడీపిఎల్
-
మేఘా గ్యాస్ ఇక ఎంసీజీడీపిఎల్
హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ పేరు మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (MCGDPL)గా మారింది. దేశంలో వివిధ నగరాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD)ని మేఘా గ్యాస్ ఇప్పటివరకు నిర్వహిస్తోంది. ఇక నుంచి మేఘా గ్యాస్ బదులు ఎంసీజీడీపిఎల్ కంపెనీ ఇక నుంచి అన్ని రకాల అనుమతులున్న అధీకృత సంస్థగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ను చేపడుతుంది. ఇప్పటి వరకు మేఘా గ్రూప్ లో ఒక విభాగంగా ఉన్న మేఘా గ్యాస్‌కున్న అనుమతులన్నింటినీ ఎంసీజీడీపిఎల్ కి బదిలీ చేయాలంటూ ఎంఈఐఎల్ చేసిన అభ్యర్థనను పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ఆమోదించింది. ఇక నుంచి మేఘా గ్యాస్ కు ఉన్న అన్ని కార్యకలాపాలు, పరిపాలనా విధులతో సహా అన్ని వ్యవహారాలు ఎంసీజీడీపిఎల్ కిందకు వస్తాయి. దేశంలోని 10 రాష్ట్రాలు, 62 జిల్లాల్లోని 22 భౌగోళిక ప్రాంతాలలో కంపెనీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను ఎంసీజీడీపిఎల్ ఇక నుంచి అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్యకలాపాలను మేఘా గ్యాస్ ఇప్పటికే చేపట్టింది. ఇక నుంచి ఎంసీజీడీపిఎల్ వీటిని చేపడుతుంది. ఇప్పటికే 2000 కి.మీ మేర MDPE లైన్ మరియు 500 కి.మీ పైగా స్టీల్ పైప్లైన్లను వివిధ ప్రాంతాలలో మేఘా గ్యాస్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 60కి పైగా సీఎన్జీ స్టేషన్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీ నిర్వహిస్తోంది. 80 వేలకు పైగా గృహాలకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్‌ను అందిస్తున్నది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం కంపెనీ ఇప్పటికే రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. మరో రూ.10,000 కోట్లను వచ్చే ఐదేండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. -
అమ్మకానికి కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థ వాటా, కొనుగోలు రేసులో మేఘా ఇంజినీరింగ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీఈఎంఎల్లో 26 శాతం వాటా కొనుగోలుకు సంబంధించి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్), టాటా మోటర్స్, అశోక్ లేల్యాండ్, భారత్ ఫోర్జ్ తదితర సంస్థలు షార్ట్‌లిస్ట్ అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా వాటితో పాటు ఈ నాలుగు సంస్థలు.. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) సమర్పించాయి. వీటికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) డాక్యుమెంట్‌ను జారీ చేయడం సహా బీఈఎంఎల్ డేటా రూమ్, ఉత్పత్తి కేంద్రాలను సందర్శించేందుకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. చైనా, పాకిస్తాన్‌తో వ్యాపార సంబంధాలేమైనా ఉంటే వెల్లడించాలంటూ కూడా ఆయా సంస్థలకు సూచించినట్లు పేర్కొన్నాయి. పృథ్వీ మిసైల్ లాంచర్ వంటి మిలిటరీ హార్డ్‌వేర్‌ను తయారు చేసే బీఈఎంఎల్ రక్షణ..ఏరోస్పేస్, మైనింగ్.. నిర్మాణం, రైల్..మెట్రో వంటి మూడు ప్రధాన విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల్లో తొమ్మిది ప్లాంట్లు ఉన్నాయి. బీఈఎంఎల్లో కేంద్రానికి 54 శాతం వాటాలు ఉన్నాయి. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఇందులో కొంత భాగాన్ని విక్రయించడంతో పాటు యాజమాన్య హక్కులను కూడా బదలాయించే ఉద్దేశ్యంతో జనవరి 4న ప్రభుత్వం ఈవోఐలను ఆహ్వానించింది. ఈవోఐలను సమర్పించేందుకు మార్చి 1 ఆఖరు తేదీగా ముందు ప్రకటించినా ఆ తర్వాత దాన్ని 22 వరకూ పొడిగించారు. నీలాచల్ ఇస్పాత్ నిగమ్ కొనుగోలుకు సంబంధించి కూడా షార్ట్‌లిస్ట్ అయిన సంస్థల్లో ఎంఈఐఎల్ ఉంది. -
ఈవీ ట్రాన్స్‌కు భారీ కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ ఈవీ ట్రాన్స్ ఓ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకుంటోంది. ఒక రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన టెండర్లలో 1,400 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాకు లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. మరో 700 బస్సులను అందించేందుకూ పోటీ పడుతోంది. ఈ రవాణా సంస్థకు అద్దె ప్రాతిపదికన 12 ఏళ్లపాటు బస్సులను నడుపుతారు. ఆర్డర్ (లెటర్ ఆఫ్ అవార్డ్) చేతికి రాగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నుంచి 1,400 బస్సులను ఈవీ ట్రాన్స్ కొనుగోలు చేయనుంది. ఈ బస్సుల విలువ రూ.2,450 కోట్లు. డీల్ కార్యరూపం దాలిస్తే ఒలెక్ట్రాకు ఇదే అతిపెద్ద ఆర్డర్‌గా నిలవనుంది. ఈవీ ట్రాన్స్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ రెండూ కూడా మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీలు. -
తగ్గేదేలే అంటున్న మేఘా.. ఆ సెక్టార్లో సక్సెస్ బాట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓఎన్జీసీకి రిగ్స్ సరఫరాను వేగవంతం చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద ఉన్న ఓఎన్జీసీ చమురు క్షేత్రానికి 2,000 హెచ్‌పీ సామర్థ్యం గల అత్యాధునిక ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్‌ను అందించింది. ఇది 3,000 హెచ్‌పీ సామర్థ్యంతో పనిచేసే సంప్రదాయ రిగ్ కన్నా అధిక పనితీరును కనబరుస్తుందని ఎంఈఐఎల్ రిగ్స్ ఇంచార్జ్ సత్యనారాయణ తెలిపారు. ‘6,000 మీటర్ల లోతు వరకు ఇది తవ్వగలదు. ఇప్పటి వరకు 10 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్స్‌ను ఎంఈఐఎల్ సరఫరా చేసింది. ఇందులో మూడు ఇప్పటికే పనిచేస్తున్నాయి. మిగిలిన ఏడు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ రిగ్స్ మరో నాలుగైదు వారాల్లో ఓఎన్జీసీ చమురు క్షేత్రాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయి. పోటీ బిడ్డింగ్‌లో 47 రిగ్స్ సరఫరాకై ఓఎన్జీసీ నుంచి ఆర్డర్‌ను ఎంఈఐఎల్ దక్కించుకుంది’ అని ఎంఈఐఎల్ రిగ్స్ ఇంచార్జ్ సత్యనారాయణ వివరించారు. -
ప్రపంచంలోనే పవర్ ఫుల్ ఆయిల్ రిగ్‌లు ఏపీ ఓఎన్జీసీకి సరఫరా..!
నిర్మాణరంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్‌లను తయారు చేసి రికార్డ్ సృష్టించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్‌లను విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలకు వినియోగిస్తుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) నుంచి రూ.6000 కోట్ల విలువైన 47 ఆయిల్ రిగ్ ఆర్డర్ పొందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలోని ఓఎన్జీసీకి మరో రిగ్‌ను అందజేసింది. ఇది అత్యాధునిక స్వదేశీ ఆయిల్ రిగ్. 2,000 హెచ్‌పీ సామర్ధ్యం గల రిగ్ 3,000 హెచ్‌పీ సామర్ధ్యం గల సంప్రదాయ రిగ్లకు సమానమైన పనితీరును కనబరుస్తుంది. ఇది 6,000 మీటర్ల(6 కి.మీ) లోతు వరకు భూమిలోకి డ్రిల్ చేయగలదు. "మేక్ ఇన్ ఇండియా" & "ఆత్మనీర్ భర్ భారత్" కార్యక్రమాల కింద స్వదేశీ టెక్నాలజీతో అత్యంత సమర్థవంతమైన ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్‌లను తయారు చేస్తున్న తొలి దేశీయ ప్రైవేట్ కంపెనీ ఎంఈఐఎల్. చమురు నిక్షేపాలను వెలికి తీసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ రిగ్‌లు అత్యంత వేగంతో భూ పొరలను సులభంగా తవ్వుతుంది. వీటిని పూర్తిగా ఆటోమేటేడ్ టెక్నాలజీతో రూపొందించారు. సమీప భవిష్యత్తులో మనదేశంలో చమురు, సహజవాయువు రంగాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనేది తమ లక్ష్యమని డ్రిల్మెక్ ఛైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వివరించారు. అస్సాం (సిబ్సాగర్, జోరహత్), ఆంధ్రప్రదేశ్ (రాజమండ్రి), గుజరాత్ (అహ్మదాబాద్, అంకాలేశ్వర్, మెహసనా మరియు క్యాంబే), త్రిపుర (అగర్తలా), తమిళనాడు (కరైకల్) లోని ఓఎన్జీసీ ఆయిల్ డ్రిల్లింగ్ క్షేత్రాలకు ఎంఈఐఎల్ అన్ని రిగ్‌లను తయారు చేసి సరఫరా చేస్తుంది. మేఘా గ్రూప్ ఆధ్వర్యంలో తొలిసారిగా దేశీయంగా వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ, హైదరాబాద్‌లలోని కేంద్రాల్లో రిగ్‌లను డ్రిల్మెక్ ఉత్పత్తి చేస్తోంది. చమరు ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో వీటి అవసరం ఎంతగానే ఉంటుంది. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే!) -
పుణె రోడ్స్ మీద 150 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు సందడి..!
-
పుణె రోడ్స్ మీద 150 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు సందడి..!
పూణే: హైదరాబాద్ నగరానికి చెందిన ఒలెక్ట్రా గ్రీన్ కంపెనీ తయారు చేసిన 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాకుండా, పూణేలోని బనర్ ప్రాంతంలో నిర్మించిన అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ స్టేషన్ కేంద్రాన్ని కూడా మోడీ ఒక కార్యక్రమంలో ప్రారంభించినట్లు ఈ-బస్సుల తయారీసంస్థ ఒలెక్ట్రా గ్రీన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒలెక్ట్రా ప్రస్తుతం పూణే మహానగర్ పరివర్తన్ మహామండల్ లిమిటెడ్(పిఎమ్ పిఎంఎల్) కోసం నగరంలో 150 ఈ-బస్సులను నడుపుతోంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్'లో భాగమైన ఈ సంస్థ పూణేతో పాటు సూరత్, ముంబై, సిల్వాస్సా, గోవా, నాగ్ పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్ నగరాలలో తన సేవలను అందిస్తుంది. ఈ బస్సుల పట్ల మెట్రో నగరాల్లోని ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నట్లు రవాణా సంస్థలు తమకు తెలిపాయని సంస్థ పేర్కొంది. "పూణే నగరంలో ప్రస్తుతం నడుస్తున్న 150 బస్సులకు మరో 150 ఎలక్ట్రిక్ బస్సులను జోడించడం ఒలెక్ట్రాకు గర్వంగా ఉంది. సమర్థవంతమైన ఎలక్ట్రిక్ ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఒలెక్ట్రా కట్టుబడి ఉంది" అని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ తెలిపారు. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు ఛార్జ్‌కి 250-300 కిలోమీటర్ల అద్భుతమైన పరిధిని అందిస్తుంది. Olectra C9 3000 ఎన్ఎమ్ టార్క్, 480 బీహెచ్ పి పవర్ ఉత్పత్తి చేయగలవు. ఇవి రెండు 180 kW లిథియం-అయాన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా శక్తిని పొందుతాయి. ఇందులో లభించే ఫాస్ట్ ఛార్జింగ్‌తో 2-3 గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇందులో ఒకేసారి 45-49 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. సుదూర ప్రయాణానికి ఇది సరైన బస్సు. ప్రయాణికుల భద్రత కోసం సీసీటివి కెమెరాలను కూడా ఉన్నాయి, ప్రతి సీటుకు అత్యవసర బటన్, యుఎస్బి సాకెట్ కూడా ఉంది. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. పెట్టుబడి రూ.లక్ష లాభం రెండున్నర కోట్లు) -
మేఘా చేతికి 15 సిటీ గ్యాస్ ప్రాజెక్టులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (పీఎన్జీఆర్బీ) నిర్వహించిన 11వ రౌండ్ బిడ్డింగ్‌లో అత్యధిక సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్‌లను మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) దక్కించుకుంది. పీఎన్జీఆర్బీ 19 రాష్ట్రాల్లోని 215 జిల్లాల్లో విస్తరించిన 65 జియోగ్రాఫికల్ ఏరియాలకు బిడ్స్ నిర్వహించింది. 61 ఏరియాలకు బిడ్స్ దాఖలు అయ్యాయి. ఇందులో మేఘా గ్యాస్ 15, అదానీ టోటల్ గ్యాస్ 14, ఐఓసీఎల్ 9, బీపీసీఎల్ 6 పొందగా మిగిలిన వాటిని ఇతర సంస్థలు చేజిక్కించుకున్నాయి. మొత్తం జియోగ్రాఫికల్ ఏరియాల్లో 24.6 శాతం వాటాతో ఎంఈఐఎల్ అగ్రభాగాన ఉంది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. 61 జియోగ్రాఫికల్ ఏరియాలకు సుమారు రూ.80,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని పీఎన్జీఆర్బీ భావిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో మేఘా..: కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణలో సీజీడీ ప్రాజెక్టులను మేఘా గ్యాస్ దక్కించుకుంది. తెలంగాణలో జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జియోగ్రాఫికల్ ఏరియాలు ఉన్నాయి. ఇప్పటికే నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్‌లైన్ నిర్మాణంతోపాటు 32 సీఎన్జీ స్టేషన్లను మేఘా గ్యాస్ ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్నాటకలోని తూముకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చడంతోపాటు వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌ను మేఘా అందిస్తోంది. -
మంచు కొండల్లో మేఘా అద్భుతం
న్యూఢిల్లీ: జోజిలా సొరంగ మార్గం పనులు వేగవంతంగా చేస్తున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) వెల్లడించింది. ఇందులో భాగంగా టనల్ 1లోని ట్యూబ్ 2 తవ్వకం పనులను పూర్తి చేసినట్లు తెలిపింది. దీని పొడవు సుమారు 472 మీటర్లు. ఇప్పటికే సుమారు 448 మీటర్ల పొడవున్న ట్యూబ్ 1 పనులు పూర్తయినట్లు కంపెనీ పేర్కొంది. 2వ టనల్ పనులు జరుగుతున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది. దట్టమైన మంచు పేరుకుపోవడంతో దాదాపు ఆరు నెలల పాటు లడఖ్–శ్రీనగర్ మధ్య రాకపోకలు కష్టతరంగా మారతాయి. ఈ నేపథ్యంలో అన్ని సీజన్లలోనూ ప్రయాణాలకు వీలు కల్పించే జోజిలా టనల్ ప్రాజెక్టును ఎంఈఐఎల్ 2020 అక్టోబర్‌లో దక్కించుకుంది. దీని విలువ సుమారు రూ. 4,600 కోట్లు. -
స్టాక్ మార్కెట్లో తెలుగు కంపెనీ సత్తా.. ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట
Multibagger Olectra Greentech: స్టాక్ మార్కెట్ అంటేనే ఉత్తరాది పెత్తనం. అందులోనూ గుజరాతీల హవానే ఎక్కువ. ప్రధాన స్టాక్‌మార్కెట్ ముంబైలో ఉండటంతో మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌కి చెందిన వారి మాటే అక్కడ ఎక్కువగా చెల్లుబాటు అవుతోంది. కానీ వారందరిని తలదన్నెలా లాభాల పంట పండిస్తూ అందరీ దృష్టిని ఆకర్షిస్తోంది తెలుగు వ్యక్తులు స్థాపించిన ఒలెక్ట్రా కంపెనీ. కేవలం ఏడాది వ్యవధిలోనే రూపాయికి పది రూపాయల లాభం చూపించి మల్టీ బ్యాగర్‌గా గుర్తింపు పొందింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో స్మాల్‌క్యాప్ కెటగిరిలో ఉన్న ఈ కంపెనీ షేర్లు ఏడాది కాలంగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది 2020 నవంబరు 9న ఈ కంపెనీ ఒక్క షేరు విలువ రూ.59.55 దగ్గర ట్రేడ్ అయ్యింది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి 2021 నవంబరు 9 మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి ఈ కంపెనీ ఒక్క షేరు విలువ ఏకంగా రూ.649.90 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 991 శాతం షేరు విలువ పెరిగింది. నికరంగా ఒక్కో షేరు ధర రూ.590 పెరిగింది. కోటికి పది కోట్ల రూపాయలు ఏడాది కిందట లక్ష రూపాయలు ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారికి కేవలం ఏడాది వ్యవధిలోనే సుమారు పది లక్షల రూపాయల వరకు లాభం వచ్చినట్టయ్యింది. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి పది కోట్ల రూపాయలను అందించింది. ఈ సీజన్లో మల్టీబ్యాగర్ షేర్లలో ఒకటిగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నిలిచింది. కొత్తగా షేర్ మార్కెట్లోకి వచ్చిన వారికి స్టాక్ మార్కెట్లో లాభాల రుచిని చూపించింది. ప్రభుత్వ ప్రోత్సహకాలు వాతావరణ కాలుష్యం తగ్గించాలనే నినాదం ఎప్పటి నుంచో వినిపిస్తున్నా ఆచరణలో పెట్టింది తక్కువ. కానీ కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వాయు కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. ఫేమ్ 1, ఫేమ్ 2 పేరుతో ఈవీలకు ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో ఈవీలకు ఒక్కసారిగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో ఒలెక్ట్రా ఉండటం ఈ కంపెనీ షేర్లకు వరంలా మారింది. పెట్రోలు ధరలు ప్రభుత్వ విధానాలు సానుకూలంగా ఉండటానికి తోడు చమురు ధరలు సైతం ఒలెక్ట్రా వృద్ధికి పరోక్షంగా సాయం అందించాయి. గత ఏడాది కాలంగా పెట్రోలు, డీజిలు ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతుంటంతో సామాన్యులు సైతం పెట్రోలు, డీజిల్‌కి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈవీ రంగంలో రోజుకో స్టార్టప్ వెలుగులోకి వస్తుంది. ఈవీ రంగంలో స్టార్టప్‌లకే పరిస్థితే ఎంతో ఆశజనకంగా ఉండగా.. 1992 నుంచి మార్కెట్లో ఉన్న ఒలెక్ట్రాకు అది మరింతగా లాభించింది. అందువల్లే ఇన్వెస్టర్లు ఒలెక్ట్రాపై నమ్మకం చూపించారు. ఏడాది కాలంగా షేరు వ్యాల్యూ పెరుగుతున్నా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తూనే ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా హైడ్రోమెకానిక్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా అనే భారీ ప్రాజెక్టులు చేపడుతోంది మేఘా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. తెలుగు వారు స్థాపించిన మేఘా సంస్థ సబ్సిడరీలో ఒకటి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ. హైదరాబాద్ కేంద్రంగా 1992లో ఈ సంస్థను స్థాపించారు. పాలిమర్ ఇన్సులేలర్లు, ఎలక్ట్రిక్ బస్సులను ఈ కంపెనీ తయారు చేస్తోంది. మార్కెట్లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. ఇటీవల ఈవీల వాడకం పెరగడంతో ఒక్కసారిగా ఒలెక్ట్రా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇప్పటి వరకు దక్షిణాదికి చెందిన ఐటీ, ఫార్మా కంపెనీలే హవా కొనసాగించగా ఇప్పుడు మాన్యుఫ్యాక్చరింగ్ విభాగం నుంచి ఒలెక్ట్రా సంచలనం సృష్టిస్తోంది. చదవండి: ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒలెక్ట్రాకు 100 బస్సుల ఆర్డర్ -
తిరుమల గిరులకు కొత్త హంగులు.. కొండ మీదకి ఎలక్ట్రిక్ బస్సులు
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిరుమల గిరుల్లో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా తిరుమల - తిరుపతిల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఏపీఎస్ఆర్టీసీ ఒప్పందం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డరు దక్కించుకుంది. ఫేమ్–2 స్కీము కింద ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ అవార్డును ఒలెక్ట్రా అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్‌కు ఏపీఎస్ఆర్టీసీ జారీ చేసింది. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు రూ. 140 కోట్లు. 12 నెలల కాలంలో బస్సులను డెలివరీ చేయాలి. తిరుపతి కేంద్రంగా కాంట్రాక్టు వ్యవధిలో బస్సుల మెయింటెనెన్స్‌ను ఒలెక్ట్రా నిర్వహిస్తుంది. నిర్దిష్ట మోడల్ ప్రకారం ఈ కాంట్రాక్టు 12 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. ఈ బస్సులను తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి నిర్వహిస్తారు. 50 బస్సులను తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో, మరో 50 బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదనపల్లి పట్టణాలకు ఇంటర్సిటీ సర్వీసులుగా నడుపుతారు. కొత్త ఆర్డర్‌తో కంపెనీ ఆర్డర్ బుక్ సుమారు 1,450 బస్సులకు చేరింది. కాలుష్యం తగ్గిపోతుంది ‘సమర్థమంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలకు ఒలెక్ట్రా కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు ఆపరేట్ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, పుణె తదితర నగరాల్లో మా బస్సులు నడుస్తున్నాయి‘ అని ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ చైర్మన్ కేవీ ప్రదీప్ తెలిపారు. మేఘా గ్రూపు నుంచి ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ (ఎంఈఐఎల్) గ్రూప్‌లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భాగంగా ఉంది. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణలోని షాబాద్ మండలంలోని పారిశ్రామిక పార్కులో 150 ఎకరాల స్థలాన్ని టీఎస్ఐఐసీ కేటాయించినట్లు స్టాక్ ఎక్సేంజీలకు ఒలెక్ట్రా తెలిపింది. బస్సు ప్రత్యేకతలు.. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ ఎయిర్ కండీషన్డ్ బస్సుల్లో డ్రైవర్ కాకుండా 35 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్, ప్రతి సీటుకు యూఎస్బీ సాకెట్ వంటి సదుపాయాలు ఉంటాయి. లిథియం అయాన్ బ్యాటరీలతో పని చేసే ఈ బస్సులు ఒక్కసారి చార్జి చేస్తే ట్రాఫిక్, ప్రయాణికుల సంఖ్యను బట్టి దాదాపు 180 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తాయి. చదవండి:ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా? -
‘మేఘా’ వితరణ
మంగళగిరి: గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్నారై ఆసుపత్రికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ రెండు అంబులెన్స్‌లను వితరణగా అందజేసింది. ఎంఈఐఎల్ సంస్థ డైరెక్టర్ పి.సుధారెడ్డి బుధవారం అంబులెన్స్‌ల తాళాలను ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.నరసరాజు, ప్రిన్సిపల్ లక్ష్మిలకు అందజేశారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ.. మేఘా సంస్థ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డు నిర్మించామని, పలు ఆసుపత్రులకు అవసరమైన అంబులెన్సులను అందించటంతో పాటు గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎంఈఐఎల్ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై ఆసుపత్రికి తమ సంస్థ అందజేసిన అంబులెన్స్‌లలో ఐసీయూకు అవసరమైన సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎన్నారై ఆస్పత్రి సీఈవో వెంకట ఫణిదర్, ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ కోశాధికారి టీసీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
దేశంలోనే తొలిసారి.. నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్ సర్వీస్
ముంబై: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్(ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ అయిన ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్ ఈవీట్రాన్స్ పుణే-ముంబై మధ్య ‘పూరి బస్’ పేరుతో సర్వీసులను ప్రారంభించింది. నగరాల మధ్య (ఇంటర్సిటీ) ఎలక్ట్రిక్ బస్‌లు అందుబాటులోకి రావడం దేశంలో ఇదే తొలిసారి అని సంస్థ బుధవారం ప్రకటించింది. 12 మీటర్ల పొడవున్న ఈ బస్‌లో డ్రైవర్‌తో కలిపి 47 మంది కూర్చోవచ్చు. ఒకసారి చార్జింగ్‌తో 350 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఆధునిక టీవీ, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైఫై, ప్రతి సీట్‌కు ఇన్‌బిల్ట్ యూఎస్బీ చార్జర్ సౌకర్యం ఉంది. (చదవండి: మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. కుర్రకారు ఫిదా కావాల్సిందే!) యూరప్ ప్రమాణాలతో ఫైర్ డిటెక్షన్, సప్రెషన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్, ప్యానిక్ అలారం, ఎమర్జెన్సీ లైటింగ్ సిస్టమ్ వంటి భద్రత హంగులు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్, సూరత్, సిల్వస్సా, గోవా, డెహ్రాడూన్‌లో మొత్తం 400లకుపైగా ఎలక్ట్రిక్ బస్‌లను నడుపుతున్నట్టు ఈవీట్రాన్స్ జీఎం సందీప్ రైజాడా తెలిపారు. డీజిల్ బస్సుతో పోల్చితే, పూరి ఎలక్ట్రిక్ బస్సును నిర్వహించడానికి అత్యంత తక్కువ వ్యయం కావడం వల్ల ఇంటర్ సిటీ బస్ ఆపరేటర్లకు ఆర్థికంగా చాలా ఆదా అవుతుంది. ఈ బస్సును లీ ఐయాన్ ఫాస్సేట్ బ్యాటరీ అమర్చడం ద్వారా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ట్రాఫిక్, ప్యాసింజర్ లోడ్లను బట్టి 350 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేస్తున్నది. -
ఈ ఏడాదే ఓఎన్జీసీకి 23 రిగ్గులు: మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వదేశీ పరిజ్ఞానంతో కంపెనీ తయారు చేసిన రిగ్గు విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తోందని మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గురువారం వెల్లడించింది. మరో రిగ్గు ఓఎన్జీసీకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రిగ్గుల విక్రయం ద్వారా రానున్న రోజుల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా రూ.14,800 కోట్ల విలువ గల వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోనున్నామని మేఘా అనుబంధ కంపెనీ, ఆయిల్ రిగ్గుల తయారీలో ఉన్న డ్రిల్ మెక్ చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఓఎన్జీసీకి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో డిసెంబరుకల్లా 23 అప్పగిస్తామన్నారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ సొంతం చేసుకుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, కాకినాడతోపాటు ఇటలీ, యూఎస్‌లోని ప్లాంట్లలో వీటిని తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 70కి పైగా రిగ్గులను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. 1500 హెచ్‌పీ సామర్థ్యం గల రిగ్గు అత్యాధునిక హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. 4,000 మీటర్ల లోతు వరకు సులభంగా, వేగంగా తవ్వుతుందని ఆయిల్ రిగ్స్ డివిజన్ అధిపతి కృష్ణ కుమార్ తెలిపారు. -
ఆక్సిజన్ ట్యాంకర్లు వచ్చేశాయి..
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి 11 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా బ్యాంకాక్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా శనివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆ సంస్థ అందజేసింది. వెంటనే ఈ ట్యాంకర్లను ఆక్సిజన్‌ను నింపుకొని రావడానికి సీఎస్ ఒడిశాకు పంపించారు. మేఘా సంస్థ నుంచి మొదటి విడతగా 3 ట్యాంకర్లు హైదరాబాద్‌కు వచ్చాయని, బంగాళాఖాతంలో వాతావరణ అస్థిరత ఉన్న దృష్ట్యా మిగిలిన ట్యాంకర్లు 3 నుండి 4 రోజుల్లో వస్తాయని సీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఆక్సిజన్ ప్లాంట్లు, స్టోరేజ్ యూనిట్ల నిర్మాణం, ట్యాంకర్ల సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఒక్కో ట్యాంకర్ తయారీకి మూడు నెలలు.. సాధారణంగా ఒక్కో క్రయోజెనిక్ ట్యాంకర్ తయారీకి దేశంలో మూడునెలల సమయం పడుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఆక్సిజన్ అత్యవసరమైన నేపథ్యంలో విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నట్లు మేఘా సంస్థ ఉపాధ్యక్షుడు పి.రాజేశ్‌రెడ్డి వివరించారు. ఈ ట్యాంకర్లను నగరానికి తీసుకుని రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారాన్ని అందించాయని తెలిపారు. దేశంలో క్రయోజెనిక్ ట్యాంకర్ల కొరతను గుర్తించి, విదేశాల నుంచి పూర్తి ఖర్చు తమ సంస్థనే భరించి తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే బొల్లారంలోని తమ ప్లాంట్‌నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, ఎంఈఐఎల్ జీఎం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
భారత్‌కు మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, హైదరాబాద్: భారత్‌కు థాయ్‌లాండ్ నుంచి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు రానున్నాయి. యుద్ధ ప్రతిపాదికన ట్యాంకుల దిగుమతికి అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్లో 1.40 లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ వుంటుంది. దేశంలో తొలిసారిగా అధిక సంఖ్యలో దిగుమతి చేస్తున్నారు. సామాజిక సేవ బాధ్యతలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ(ఎంఈఐఎల్) థాయ్‌లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను భారత్‌కు దిగుమతి చేస్తోంది. తొలి విడతగా ఆర్మీ విమానంలో మూడు ట్యాంకులు శనివారం హైదరాబాద్ చేరుకున్నాయి. బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు ప్రత్యేకంగా డిఫెంస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆక్సిజన్ ట్యాంకర్లను రప్పించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి ఈ ఆక్సిజన్ ట్యాంకర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఉచితంగా ఇవ్వనుంది. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యమని మేఘా ఇంజనీరింగ్ సంస్థ పేర్కొంది. చదవండి: మరో కీలక కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ Corona: వ్యాక్సిన్ కోసం వేరే దేశాలకు! -
ఆక్సిజన్ సరఫరాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్
సాక్షి, హైదరాబాద్ : కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిమ్స్, అపోలో, సరోజినిదేవి వంటి ఆస్పత్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఆక్సిజన్ అందించమని అభ్యర్థనలు వచ్చాయి.. వచ్చిందే తడవుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను భారీ స్థాయిలో ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ సేకరణ కోసం భద్రాచలంలోని ఐటీసీ, హైదరాబాద్‌లోని డిఆర్‌డివోతో ఆఘమేఘాల మీద ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కోవిడ్ రోగులు ఆక్సిజన్ సమస్యతో సతమతమవుతున్నారు. ఆక్సిజన్ అందక రోజుకు కొన్ని వందల మంది కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల సహకారంతో ఆక్సిజన్ అవసరమయ్యే అన్ని హాస్పిటల్స్‌కు ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ప్రభుత్వం సహకారంతో వివిధ హాస్పిటల్స్ కు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయనుంది. కోవిడ్ రోగుల అవసరాలకు అనుగుణంగా నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఆక్సిజన్ బెడ్లను పెంచుతూ పోతోంది. ప్రస్తుతం 180 నుంచి 500 బెడ్లకు పెంచారు. పెంచిన బెడ్లకు అనుగుణంగా నిమ్స్ లో రోజుకు 50 బి.టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (ఒక్కొక్క సిలిండర్ 7000 లీటర్లు) ఏర్పాటు అవసరం అవుతుందని నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్ ఎంఈఐఎల్ సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే సరోజిని దేవి కంటి ఆసుప్రతికి రోజుకు దాదాపు 200 సిలిండర్లను అందించబోతుంది మేఘా సంస్థ. ఇక అపోలో హాస్పిటల్స్‌కు ప్రతి రోజు 100 సిలిండర్లు, కేర్ హైటెక్ కు 50 సిలిండర్లను సరఫరా చేయనుంది. ఇక భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్ విజ్ఞప్తి మేరకు సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. చదవండి: షిప్పింగ్ కార్పొరేషన్ వేటలో మేఘా డీఆర్డీవో టెక్నాలజీ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 30 నుంచి 40 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ మొత్తాన్ని డి.ఆర్.డి.వో కల్నల్ బి.ఎస్. రావత్, డా. రాఘవేంద్ర రావు పర్యవేక్షించనున్నారు. మొత్తానికి డి.ఆర్.డి.వో సహకారంతో మేఘా ఇంజనీరింగ్ 35 లక్షల లీటర్ల ఆక్సిజన్ మేఘా సంస్థ ఆస్పత్రులకు సరఫరా చేస్తుంది. ఈ మేరకు ఆయా హాస్పిటల్ నుంచి అభ్యర్థనలు వచ్చాయి. వీటికి అనుగుణంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి సరఫరా చేయనుంది మేఘా సంస్థ. ఇక భద్రాచలం ఐటీసీ నుంచి రోజుకు 30 మెట్రిక్ టన్నుల క్రయోజనిక్ ఆక్సిజన్ ను తీసుకొని ఎంఈఐఎల్ సంస్థ లిక్విడ్ ఆక్సిజన్ గా మార్చనుంది. ఇందుకు అనుగుణంగా భద్రాచలం ఐటీసీ దగ్గర ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ క్రయోజనిక్ ఆక్సిజన్ లభ్యమవుతోంది. స్పెయిన్‌లో ఉన్న ఎంఈఐఎల్కు సంబంధించి కర్మాగారం నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను దిగుమతి చేసేందుకు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అక్కడి ఫ్యాక్టరీ నుంచి 10 నుంచి 15 ట్యాంకులను ఇక్కడి ఆక్సిజన్ నిల్వ, సరఫరా అవసరాల నిమిత్తం ఉపయోగించుకునేందుకు యుద్ధ ప్రాతిపాదికన తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. అదే సమయంలో ఎంఈఐఎల్ కు సంబంధించిన నగర శివారులోని పరిశ్రమల్లో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను యుద్ధ ప్రతిపాదికన తయారు చేసి అందించేందుకు కూడా సంసిద్ధత తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్ లతో పాటు డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వ పరిశీలన, అనుమతి అనంతరం వాటి తయారీకి వెంటనే రంగంలోకి దిగుతుంది. -
షిప్పింగ్ కార్పొరేషన్ వేటలో మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో (ఎస్సీఐ) ప్రభుత్వ వాటా కొనుగోలుకు శక్తి కలిగిన కంపెనీల జాబితాలో హైదరాబాద్‌కు చెందిన మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్టక్చర్ (ఎంఈఐఎల్) నిలిచింది. ఎంఈఐఎల్‌తోపాటు యూఎస్‌కు చెందిన సేఫ్సీ, ఎన్నారై రవి మెహరోత్రా నేతృత్వంలోని కన్సార్షియం షార్ట్ లిస్ట్ అయిన జాబితాలో ఉన్నాయి. ఎస్‌సీఐలో ప్రభుత్వ వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన ఈ మూడు కంపెనీలు టెక్నికల్, ఫైనాన్షియల్ ప్రమాణాల విషయంలో అర్హత సాధించాయి. షిప్పింగ్ కార్పొరేషన్లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 63.75% వాటాను విక్రయిస్తోంది. ఈ వాటాను దక్కించుకున్న సంస్థ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం ఆ తర్వాత మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. 1961 అక్టోబరు 2న ఏర్పాటైన ఎస్సీఐ.. భారత్‌లో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీగా ఎదిగింది. సరుకు, ప్రయాణికుల రవాణా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ పెద్ద ఎత్తున బల్క్ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ప్రొడక్ట్ ట్యాంకర్స్, కంటైనర్ వెసెల్స్, ప్యాసింజర్/కార్గో వెసెల్స్, ఎల్పీజీ, అమోనియా క్యారియర్లను సొంతంగా కలిగి ఉంది. డిసెంబరు త్రైమాసికంలో షిప్పింగ్ కార్పొరేషన్ రూ.841 కోట్ల టర్నోవర్‌పై రూ.103 కోట్ల నికరలాభం ఆర్జించింది. కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.43 % ఎగసి రూ.115.75 వద్ద స్థిరపడింది.