![Inter City Electric Bus Service Between Pune - Mumbai - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/14/Electric-Bus.jpg.webp?itok=tVXiLgpj)
ముంబై: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్(ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ అయిన ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్ ఈవీట్రాన్స్ పుణే-ముంబై మధ్య ‘పూరి బస్’ పేరుతో సర్వీసులను ప్రారంభించింది. నగరాల మధ్య (ఇంటర్‌సిటీ) ఎలక్ట్రిక్ బస్‌లు అందుబాటులోకి రావడం దేశంలో ఇదే తొలిసారి అని సంస్థ బుధవారం ప్రకటించింది. 12 మీటర్ల పొడవున్న ఈ బస్‌లో డ్రైవర్‌తో కలిపి 47 మంది కూర్చోవచ్చు. ఒకసారి చార్జింగ్‌తో 350 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఆధునిక టీవీ, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైఫై, ప్రతి సీట్‌కు ఇన్‌బిల్ట్ యూఎస్‌బీ చార్జర్ సౌకర్యం ఉంది. (చదవండి: మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. కుర్రకారు ఫిదా కావాల్సిందే!)
యూరప్ ప్రమాణాలతో ఫైర్ డిటెక్షన్, సప్రెషన్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్, ప్యానిక్ అలారం, ఎమర్జెన్సీ లైటింగ్ సిస్టమ్ వంటి భద్రత హంగులు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్, సూరత్, సిల్వస్సా, గోవా, డెహ్రాడూన్‌లో మొత్తం 400లకుపైగా ఎలక్ట్రిక్ బస్‌లను నడుపుతున్నట్టు ఈవీట్రాన్స్ జీఎం సందీప్ రైజాడా తెలిపారు. డీజిల్ బస్సుతో పోల్చితే, పూరి ఎలక్ట్రిక్ బస్సును నిర్వహించడానికి అత్యంత తక్కువ వ్యయం కావడం వల్ల ఇంటర్ సిటీ బస్ ఆపరేటర్లకు ఆర్థికంగా చాలా ఆదా అవుతుంది. ఈ బస్సును లీ ఐయాన్ ఫాస్సేట్ బ్యాటరీ అమర్చడం ద్వారా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ట్రాఫిక్, ప్యాసింజర్ లోడ్‌లను బట్టి 350 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేస్తున్నది.
Comments
Please login to add a commentAdd a comment