న్యూఢిల్లీ: జియో–బీపీ 500వ పల్స్ ఈవీ–చార్జింగ్ స్టేషన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ ముకేశ్ అంబానీ, బీపీ సీఈవో ముర్రే ఆషిన్‌క్లాస్ గురువారం ప్రారంభించారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ ప్లాజా, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కి వచ్చే వారికి ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
రిలయన్స్–బీపీ కలిసి ఇంధనాల విక్రయం, చార్జింగ్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్‌గా జియో–బీపీని ఏర్పాటు చేశాయి. కంపెనీ అత్యంత వేగంగా ఈవీ చార్జింగ్ పాయింట్లను విస్తరించింది. ఏడాది వ్యవధిలోనే 1,300 నుంచి 5,000కు పెంచుకుంది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతమయ్యేందుకు జియో–బీపీ కృషి చేస్తున్నాయని అనంత్ అంబానీ తెలిపారు. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో వేగవంతమైన చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెడుతున్నట్లు ముర్రే వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment