పుణె: యర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కంపెనీ సీఏ అన్నా సెబాస్టియన్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికమైన అని ఒత్తిడి కారణంగానే మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయ అధికారులు పూణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. మృతికి సంబంధించి ఆధారాల సేకరణ కోసం అధికారులు ఆఫీసు, పరిసరాల్లో సోదాలు నిర్వహించారు.
‘‘తనిఖీలో మా అధికారులు ఆఫీసు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో లభించిన ఆధారాలపై స్పందించేందుకు కంపెనీకి ఏడు రోజుల గడువు ఇచ్చాం. జూలైలో పెరయిల్ మరణం చుట్టూ చోటుచేసుకున్న అంశాల నివేదికను సిద్ధం చేసి ఒక వారంలో రాష్ట్ర కార్మిక కమిషనర్‌కు సమర్పించాలని ఆదేశించాం. అనంతరం ఆ పరిశీలన కొనుకొన్న ఆధారాలపై నివేదికను కేంద్రానికి పంపుతాం. ఈ ఘటనపై కేంద్రం విచారణ జరపనుంది’ అని పేర్కొన్నారు.
మరోవైపు.. పని ఒత్తిడి కారణంగా ఆమె మృతిచెందినట్లు వస్తున్న ఆరోపణలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఆమె మరణానికి, కంపెనీ పనిభారానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కంపెనీ ఉద్యోగుల సంక్షేమానికి పటిష్టమైన నియమాలు, పద్దతుల అమలు తాము ఎప్పటినుంచో కట్టుబడి ఉన్నామని పేర్కొంది.
చదవండి: EY మహిళా ఉద్యోగి మృతి : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల దుమారం
Comments
Please login to add a commentAdd a comment