inspections
-
సర్కారు బడులపై కర్ర పెత్తనం!
సాక్షి, అమరావతి: విద్యార్థులకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం నెలకో కొత్త నాటకం ఆడుతోంది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు సహా పలు హామీలిచ్చిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఒక్క పథకం అమలు చేయకుండా కుంటి సాకులు వెదుకుతోంది. తాజాగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య వాస్తవంకంటే అధికంగా ఉందని, తప్పుడు ఎన్రోల్మెంట్పై చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరిస్తోంది. అంతేగాక, విద్యార్థుల సంఖ్యపై లెక్కలంటూ ప్రభుత్వ పాఠశాలలపై రెవెన్యూ శాఖకు పెత్తనం అప్పగించింది. విద్యార్థుల లెక్క తీసేందుకు ఎమ్మార్వో, ఎండీవో, ఇతర రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తోంది. వాస్తవానికి ఆధార్ నంబర్ ఆధారంగా విద్యార్థులను బడుల్లో చేర్చుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు యూడైస్‌తో సరిపోవడంలేదని, డ్రాప్ బాక్స్‌లో కనిపిస్తున్న 2,02,791 మంది విద్యార్థులు వాస్తవానికి లేకున్నా అదనంగా నమోదు చేశారని చెబుతోంది. వారందరినీ తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో బడి బయట పిల్లలను స్థానికంగా గ్రామ/వార్డు వలంటీర్లు, సచివాలయ విద్యా కార్యదర్శులు కలిసి గుర్తించేవారు. వారిని తిరిగి పాఠశాలల్లో చేరి్పంచే బాధ్యత తీసుకునేవారు. దీంతో డ్రాప్‌బాక్స్ ఖాళీగా ఉండేది. ప్రస్తుతం వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడంతో బడిబయటి పిల్లలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. డ్రాప్ బాక్స్ లెక్కలు బోగస్ అంటూ.. పాఠశాల విద్యా శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 37 లక్షల మంది చదువుతున్నారు. విద్యార్థుల చేరికలు, వారి ఆధార్ వివరాలను యూడైస్‌తో అనుసంధానం చేశారు. దీంతో అందరి పిల్లల వివరాలు చిరునామాలతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఓ విద్యార్థి వరుసగా 30 రోజులు బడికి హాజరు కాకపోతే ఆ వివరాలు పాఠశాల విద్య డేటా బేస్‌లోని ‘డ్రాప్‌బాక్స్’లోకి వెళ్లిపోతాయి. అంటే వారు డ్రాప్ అవుట్స్‌గా లెక్కించాలి. ఇలా ప్రతి పాఠశాలకు నెల రోజులకు మించి హాజరు కాని వారు 10 నుంచి 50 మంది వరకు ఉంటారని అంచనా.దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా డ్రాప్ బాక్స్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్య గతేడాది అక్టోబర్ నాటికి 2,02,791 మందికి చేరింది. ఇప్పుడు ఈ వివరాలను బోగస్ ఎన్‌రోల్‌మెంట్‌గా గుర్తించనుంది. ఇలా బోగస్ ఎన్రోల్మెంట్ చేసినందుకు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల ఒంగోలులో జరిగిన సమావేశంలో పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తీవ్రంగా హెచ్చరించారు. టీచర్ పోస్టులు పోకుండా కాపాడుకునేందుకు నకిలీ ఎన్రోల్మెంట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్ఎంలను హెచ్చరించారు. బోగన్ హాజరు వేసే హెచ్‌ఎంలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. బోగస్ హాజరును నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ అధికారుల బృందాలు ప్రతి పాఠశాలను తనిఖీ చేసేలా ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలపై తప్పుడు ముద్ర గత ప్రభుత్వంలో సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేది. అలాగే, ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున నగదు తల్లుల ఖాతాల్లో జమయ్యేది. దీంతో నిరుపేదలు సైతం తమ పిల్లలను బడులకు పంపేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ దాదాపు తగ్గిపోయాయి. ఒకవేళ ఎక్కడైనా డ్రాపవుట్స్ ఉంటే వలంటర్లు, సచివాలయ సిబ్బంది వారిని తిరిగి బడుల్లో చేర్చించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక బడి బయట పిల్లలను గుర్తించే బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించింది. పైగా తల్లికి వందనం కింద ఇస్తామన్న రూ.15 వేలు ఇవ్వనేలేదు.దీంతో చాలామంది నిరుపేదలు, కూలీలు పిల్లలను తీసుకుని ఉపాధి కోసం వలసపోయారు. పిల్లలు కూడా బాల కార్మికులుగా మారుతున్నారు. దీంతో బడుల్లో చేరిన విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగాయి. 2024 అక్టోబర్ నాటికి 2,02,791 మంది విద్యార్థులు డ్రాప్ బాక్స్‌లోకి చేరగా, ఈ మూడు నెలల్లో మరో 50 వేల మందికి పైగా పెరిగి ఉండవచ్చని అంచనా. కానీ, ఈ లెక్కలను బోగస్ అంటూ రెవెన్యూ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు లెక్క సరిపోవాలని, లేకుంటే కఠిచర్యలు తప్పవంటూ విద్యా శాఖ హెచ్చరించడంపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ, తాము తప్పు చేశామని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మెరుగుపడిన ‘ఫార్మా’ ప్రమాణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) అమలు చేస్తున్న కఠిన నిబంధనలను పాటించడంలో 2024లో భారతీయ ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున పురోగతి సాధించాయి. బయోలాజిక్స్, డ్రగ్స్, వైద్య పరికరాలు.. ఇలా విభాగం ఏదైనా యూఎస్ఎఫ్డీఏ తనిఖీల ప్రతికూల వర్గీకరణ (క్లాసిఫికేషన్) సంఖ్య ప్రస్తుత సంవత్సరంలో తగ్గడం విశేషం. 2023లో యూఎస్ఎఫ్డీఏ దేశవ్యాప్తంగా 225 తనిఖీలను నిర్వహించింది. ఇందులో 18 అధికారిక చర్య (అఫీషియల్ యాక్షన్), 117 స్వచ్ఛంద చర్య (వాలంటరీ యాక్షన్) కేసులకు దారితీసింది. నియంత్రణ సంస్థ 2024 నాటికి ప్రమాణాలను కఠినతరం చేసినప్పటికీ తనిఖీల సంఖ్య 206కి పడిపోయింది. అయితే అఫీషియల్ యాక్షన్ కేసులు 14, వాలంటరీ యాక్షన్ కేసులు 115కి తగ్గాయి. భారతీయ ఔషధ రంగం సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అధిక నాణ్యత, తయారీ పద్ధతులను పాటిస్తున్నాయనడానికి తగ్గిన ఈ కేసులే నిదర్శనం అని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ చెబుతోంది. మహమ్మారికి ముందు 2018తో పోలిస్తే 2019లో అఫీషియల్ యాక్షన్ కేసుల్లో 100 శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం. తనిఖీల ఆధారంగా.. తయారీ కేంద్రాలను యూఎస్ఎఫ్డీఏ తనిఖీ చేసినప్పుడు.. తనిఖీల ఆధారంగా ఫలితాలను వర్గీకరిస్తుంది. అభ్యంతకర పరిస్థితులు, కార్యకలాపాల్లో ఏదైనా లోపం ఉన్నట్లయితే అట్టి ఫెసిలిటీ వాలంటరీ యాక్షన్ వర్గీకరణను అందుకుంటుంది. తక్షణ నియంత్రణ చర్యలు తీసుకోకుండా లోపాలను స్వచ్ఛందంగా సరిదిద్దడానికి అవకాశం ఇస్తారు. ఎఫ్‌డీఏ నియంత్రణ సమావేశం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయవచ్చు. భద్రత, సంక్షేమం లేదా డేటా విశ్వసనీయతను గణనీయంగా ప్రభావితం చేసే తీవ్ర నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తిస్తే అఫీషియల్ యాక్షన్ కేసు నమోదు చేస్తారు. ఇటువంటి సందర్భాలలో అడ్మినిస్ట్రేటివ్, రెగ్యులేటరీ చర్యలకు ఎఫ్‌డీఏ సిఫార్సు చేస్తుంది. ఇందులో వార్నింగ్ లెటర్స్, దిగుమతి హెచ్చరికలు, ఆదేశాలు వంటి చట్టపర చర్యలు కూడా ఉండవచ్చు. తనిఖీ సమయంలో ఎటువంటి ఉల్లంఘనలు కనుగొనకపోతే నో యాక్షన్ ఇండికేట్గా వర్గీకరిస్తారు. తనిఖీ పూర్తయిన 45 నుండి 90 రోజులలోపు కంపెనీకి తుది తనిఖీ వర్గీకరణను యూఎస్ఎఫ్డీఏ తెలియజేస్తుంది.క్వాలిటీయే తొలి ప్రాధాన్యత..నాణ్యత ప్రమాణాలు, మెరుగైన కార్యాచరణ, నిబంధనలను చురుకుగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) పేర్కొంది. ‘నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిని పెంపొందించడంలో భారతీయ ఫార్మా కంపెనీలు గణనీయ కార్యాచరణను చేపట్టాయి. సీనియర్ నాయకత్వ బృందాలు ఆటోమేషన్, బలమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, కొనసాగుతున్న ఉద్యోగుల శిక్షణ ద్వారా నిరంతరంగా ప్రమాణాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాయి. కంపెనీలు నాణ్యతకు తొలి ప్రాధాన్యత ఇచ్చాయి.కచ్చితత్వం, సామర్థ్యాన్ని పెంపొందించడానికి తయారీ కేంద్రాల్లో అధునాతన ఆటోమేషన్ సాంకేతికతలను అమలు చేశాయి’ అని ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగ్గా చేయడానికి కట్టుబడి ఉన్నామని ఐపీఏ వెల్లడించింది. ‘ఈ పురోగతి భారత్‌లో నాణ్యతా ప్రమాణాలను ముందుకు తీసుకెళ్లాలనే మా నిబద్ధతను నొక్కి చెబుతోంది. నాణ్యమైన సంస్కృతిని బలోపేతం చేయడానికి, గ్లోబల్ బెంచ్‌మార్క్‌లతో సమం చేయడానికి నిరంతర ప్రయత్నంలో భాగంగా మేము దీనిని చూస్తాము’ అని వివరించింది.ప్రస్తుత సంవత్సరంలో దేశవ్యాప్తంగా యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు, కేసులు తగ్గిన నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల 2024–25 ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, 2024 జనవరి 1తో పోలిస్తే బీఎస్ఈలో మంగళవారం (డిసెంబర్ 31) నాటికి షేరు వృద్ధి, ధరను ఒకసారి పరిశీలిస్తే..డాక్టర్ రెడ్డీస్ ల్యాబో రేటరీస్ రూ.1,342 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ2లో నమోదైన రూ.1,480 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ. గ్లోబల్ జనరిక్స్ జోరుతో టర్నోవర్ సుమారు 17 శాతం వృద్ధి చెంది రూ.8,016 కోట్లకు చేరింది. షేరు ధర 19.28 శాతం దూసుకెళ్లి రూ.1,388.25 వద్ద స్థిరపడింది. అరబిందో ఫార్మా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.6 శాతం అధికమై రూ.817 కోట్లు నమోదు చేసింది. ఎబిటా 11.6 శాతం దూసుకెళ్లి రూ.1,566 కోట్లుగా ఉంది. టర్నోవర్ 8 శాతం పెరిగి రూ.7,796 కోట్లకు చేరింది. షేరు ధర 23.61 శాతం ఎగసి రూ.1,335.20 వద్ద ముగిసింది.గ్లాండ్ ఫార్మానికరలాభం 16 శాతం క్షీణించి రూ.163 కోట్లకు వచ్చి చేరింది. ఆదాయం రూ.1,373 కోట్ల నుంచి రూ.1,405 కోట్లకు పెరిగింది. షేరు ధర 6.21 శాతం క్షీణించి రూ.1,788.60లు తాకింది.నాట్కో ఫార్మానికరలాభం అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 83 శాతం ఎగసి రూ.676 కోట్లు సాధించింది. టర్నోవర్ రూ.1,031 కోట్ల నుంచి రూ.1,371 కోట్లకు చేరింది. షేరు ధర 69.73 శాతం వృద్ధి చెంది రూ.1,387 వద్ద స్థిరపడింది.గ్రాన్యూల్స్ ఇండియా నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 4.79 శాతం తగ్గి రూ.97 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 19.49 శాతం క్షీణించి రూ.956 కోట్లకు వచ్చి చేరింది. షేరు ధర 43.76 శాతం అధికమై రూ.591.80 వద్ద ముగిసింది. దివీస్ ల్యాబొరేటరీస్ నికరలాభం రూ.510 కోట్లు సాధించింది. 2023–24లో ఇదే త్రైమాసిక లాభం రూ.348 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.1,909 కోట్ల నుంచి 22.5 శాతం పెరిగి రూ.2,338 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 54 శాతం వృద్ధి చెంది రూ.722 కోట్లను తాకింది. షేరు ధర 55.89 శాతం పెరిగి రూ.6,099.75లకు చేరింది. -
EY ఉద్యోగి మృతి ఘటన: పుణె ఆఫీసులో తనిఖీలు
పుణె: యర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కంపెనీ సీఏ అన్నా సెబాస్టియన్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికమైన అని ఒత్తిడి కారణంగానే మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయ అధికారులు పూణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. మృతికి సంబంధించి ఆధారాల సేకరణ కోసం అధికారులు ఆఫీసు, పరిసరాల్లో సోదాలు నిర్వహించారు. ‘‘తనిఖీలో మా అధికారులు ఆఫీసు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో లభించిన ఆధారాలపై స్పందించేందుకు కంపెనీకి ఏడు రోజుల గడువు ఇచ్చాం. జూలైలో పెరయిల్ మరణం చుట్టూ చోటుచేసుకున్న అంశాల నివేదికను సిద్ధం చేసి ఒక వారంలో రాష్ట్ర కార్మిక కమిషనర్‌కు సమర్పించాలని ఆదేశించాం. అనంతరం ఆ పరిశీలన కొనుకొన్న ఆధారాలపై నివేదికను కేంద్రానికి పంపుతాం. ఈ ఘటనపై కేంద్రం విచారణ జరపనుంది’ అని పేర్కొన్నారు.మరోవైపు.. పని ఒత్తిడి కారణంగా ఆమె మృతిచెందినట్లు వస్తున్న ఆరోపణలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఆమె మరణానికి, కంపెనీ పనిభారానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కంపెనీ ఉద్యోగుల సంక్షేమానికి పటిష్టమైన నియమాలు, పద్దతుల అమలు తాము ఎప్పటినుంచో కట్టుబడి ఉన్నామని పేర్కొంది.చదవండి: EY మహిళా ఉద్యోగి మృతి : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల దుమారం -
ఆదిలాబాద్ జిల్లాలోని విత్తన గౌడౌన్లలో తనిఖీలు
-
శాంతిభద్రతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తనిఖీలు, ఆస్తుల జప్తు జరుగుతున్న విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 3న సీఎస్, డీజీపీలతో సమీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగు పర్చాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు. సీజర్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలను అప్రమ్తతం చేయాలని, జిల్లా పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపర్చాలన్నారు. ప్రతి సరిహద్దు చెక్ పోస్టు వద్ద కనీసం ఒక కెమేరాతో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌ను ఉంచాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం నిత్యావసర సేవల్లో ఉండే 33 విభాగాలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. వీటిలో ముఖ్యంగా పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్ తదితర శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి తప్పనిసరి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉందని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అయితే నేరుగా గానీ, ఎన్కోర్ పోర్టల్ ద్వారా గానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో అప్రమ్తతంగా ఉండాలని, ఎలాంటి దుర్ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ ఘటనలకు సంబంధించిన వాస్తవ నివేదికను వెంటనే తమకు పంపాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం–7, వివరాలు సరిదిద్దేందుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం–8లను చట్టబద్ధమైన విధానంలో ఈ నెల 26లోపు పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజూ తొమ్మిది నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించొద్దన్నారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్ హరేంధిరప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రక్తం, ప్లాస్మా ఫర్ సేల్!
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ బ్లడ్ బ్యాంకుపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వాటిని నిల్వచేస్తున్నట్టు గుర్తించారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ దందాకు సంబంధించి పలు కీలక వివరాలు సేకరించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారికి మానవ రక్తం, ప్లాస్మా, సీరం అక్రమంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు లభించాయి. డీసీఏ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటన, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్లాస్మా, సీరం రీప్యాకింగ్ చేసి.. డీసీఏ అధికారులు శుక్రవారం మూసాపేట్ భవానీనగర్‌లోని ఓ రెసిడెన్షియల్ భవనంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ’హేమో సర్విస్ ల్యాబోరేటరీస్’లో సోదాలు చేపట్టారు. భారీగా హ్యూమన్ ప్లాస్మా బ్యాగులను గుర్తించారు. అదే ఆవరణలో ఉన్న ఫ్రీజర్లలో సీసాల్లో నిల్వ చేసిన సీరం, మానవ రక్తం గుర్తించారు. ఆర్.రాఘవేంద్ర నాయక్ దీనిని నడుపుతున్నట్టు గుర్తించారు. నాయక్ ఎనిమిదేళ్లుగా ప్లాస్మాను సేకరిస్తున్నట్టు కనుగొన్నారు. అనధికారిక పద్ధతుత్లో వివిధ బ్లడ్ బ్యాంక్‌ల నుంచి రక్తం సేకరించి, దాన్నుంచి ప్లాస్మా, సీరం తీసి రీ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లో ఉన్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారు ఉల్ షిఫాలోని అబిద్ అలీఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్‌లో ఉన్న ఆర్ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్టు డీసీఏ అధికారుల వద్ద రాఘవేంద్ర నాయక్ అంగీకరించారు. రూ.700కు కొని రూ.3,800కు విక్రయం తెలంగాణ, ఏపీలోని పలు బ్లడ్ బ్యాంకుల నుంచి ఒక్కో యూనిట్ రక్తాన్ని రూ.700కు కొని రూ.3,800 వరకు విక్రయిస్తున్నట్టు కనుగొన్నారు. ఇలా రాఘవేంద్ర 2016 నుంచి ఆరువేల యూనిట్లకుపైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా, సీరం విక్రయించినట్టు డీసీఏ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఆక్టిమస్ బయోసైన్స్, హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలోని క్లియాన్స్ ల్యాబ్స్, పుణేలోని క్లినోవి రీసెర్స్ ప్రై.లిమిటెడ్, బెంగళూరులోని జీ7 సినర్జీస్ ప్రై.లిమిటెడ్, మైక్రో ల్యాబ్స్, నార్విచ్ క్లినికల్ సర్విసెస్ ప్రై.లిమిటెడ్, ఐడీఏ మల్లాపూర్‌లోని శిల్పా మెడికా లిమిటెడ్, మదీనగూడలోని జెన్‌రైస్ క్లినికల్ ప్రై.లిమిటెడ్, చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్‌లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. సోదాల్లో భాగంగా హెచ్ఐవీ, ఇతర టెస్టింగ్ కిట్లు, పలు డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో డీసీఏ డిప్యూటీ డైరెక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎన్.సహజ, ఎం చంద్రశేఖర్, పి.సంతోష్ సీహెచ్ కార్తీక్ శివచైతన్య తదితరులు పాల్గొన్నారు. -
ఫామ్‌హౌస్‌లపై విజిలెన్స్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించింది. ఫామ్‌హౌస్‌ల ముసుగులో కరెంట్ చౌర్యానికి పాల్పడుతున్న అక్రమార్కులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటుగా ఉన్న వ్యవసాయ క్షేత్రాలు, వాటిలోని విద్యుత్ బోర్లు, భారీ నిర్మాణాలు, రిసార్టులు, క్రీడా మైదానాలు, క్లబ్ హౌస్‌ల్లో విద్యుత్ విజిలెన్స్ బృందాలు తనిఖీలు ప్రారంభించాయి. వాటికి సరఫరా అవుతున్న కరెంట్‌పై ఆరా తీయడంతోపాటు వ్యవసాయం ముసుగులో కరెంట్ దోపిడీకి పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు సంస్థకు వాటిల్లిన నష్టాలను జరిమానా రూపంలో తిరిగి రాబట్టడమే కాకుండా ఆయా వినియోగదారులకు లోడును బట్టి మీటర్లు కూడా జారీ చేస్తున్నారు. సాగు ముసుగులో వ్యాపారాలు హైదరాబాద్ శివార్లలో పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు పెద్దఎత్తున వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. వాటి చుట్టూ భారీ ప్రహరీలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కొంతమంది వాటిలో పండ్లు, కూరగాయలు, పూలతోటలు సాగు చేస్తుండగా, మరికొంత మంది ఫామ్‌హౌస్ పేరుతో విలాసవంతమైన భవనాలు నిర్మించి సినిమా షూటింగ్‌లు, బర్త్‌డే పార్టీలు, వీకెండ్ పార్టీలకు అద్దెకు ఇస్తున్నారు. మరికొంతమంది ఏకంగా రిసార్ట్లు, క్లబ్ హౌస్ లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. వీరు ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు కల్పించిన ఉచిత విద్యుత్ సదుపాయా న్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. కొంతమందైతే ఏకంగా బోర్ల నుంచి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా హోటళ్లు, వసతి గృహాలు, బహుళ అంతస్తుల భవనాలకు సరఫరా చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పంటసా గు ముసుగులో కరెంట్ చౌర్యానికీ పాల్పడుతున్నారు. ఫలి తంగా డిస్కం పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతోంది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకే.. గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో మొత్తం 61,40,795 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 50,99,190 గృహ, 8,22,821 వాణిజ్య, 36,440 పారిశ్రామిక, 1,82,344 ఇతర (వ్యవసాయ కనెక్షన్లు రంగారెడ్డి జిల్లాలో 1,17,417 ఉండగా, మేడ్చల్‌లో 21,491 వరకు) కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 2,500 మెగావాట్ల విద్యుత్ వినియోగమవుతోంది. వేసవిలో ఈ డిమాండ్ 3800 నుంచి 4000 మెగావాట్లు దాటుతోంది. అయితే డిస్కం సరఫరా చేస్తున్న విద్యుత్‌కు, మీటర్ రీడింగ్ నమోదు ద్వారా నెలవారీగా సంస్థకు వస్తున్న బిల్లులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. ఇప్పటికే గృహ, వాణిజ్య కనెక్షన్లపై అంతర్గత తనిఖీలు చేపట్టిన డిస్కం తాజాగా వ్యవసాయ కనెక్షన్లపైనా ఆరా తీస్తోంది. దీంతో అధికారులు సర్కిళ్ల వారీగా విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీలు చేయిస్తున్నారు. డీఈకి షోకాజ్ నోటీసులు ఇటీవల డిస్కం సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి ముషారఫ్ ఫరూఖీ నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు అంతర్గత నష్టాలపై ప్రధానంగా దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లను పరుగెత్తించడంతో పాటు ఆయ న కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులకు స్పందించని ఇంజనీర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గచ్చిబౌలి డీఈ సహా పలువురు ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘాల ముసుగులో ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా పెద్ద మొత్తంలో బిల్లుల ఎగవేతకు పాల్పడిన యూనియన్లపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. డిస్కం సరఫరా చేస్తున్న ప్రతీ యూనిట్‌ను పక్కాగా లెక్కించేందుకు ఫీడర్లకు సెన్సర్లను ఏర్పాటు చేసే యోచనలో సీఎండీ ఉన్నట్లు సమాచారం. -
పైసలు... తీసుకెళ్లాలంటే పరేషాన్!
వీరేందర్ హయత్‌నగర్‌లో కిరాణా స్టోర్ నిర్వహిస్తున్నాడు. దసరా సీజన్ కావడంతో దుకాణంలోకి సరుకులు తెచ్చేందుకు రెండ్రోజుల క్రితం మార్కెట్‌కు బయలుదేరాడు. చింతలకుంట సమీపంలో రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. అతని వెంట ఉన్న రూ.2.30 లక్షల నగదును సీజ్ చేశారు. కిరాణా దుకాణం నిర్వాహకుడినని, సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్తున్నట్లు చెప్పినా ఫలితం లేక పోయింది. దుకాణంలో రోజువారీ సేల్స్ తాలూకు డబ్బులు కావడంతో సంబంధిత పత్రాలు లేవు.దీంతో నగదును వెనక్కు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఒక వ్యక్తి సగటున రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లే అవకాశం ఉండదు. నిర్దేశించిన మొత్తం కంటే పైసా ఎక్కువున్నా అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించాలి. లేకుంటే సదరు నగదును సీజ్ చేస్తారు. పక్కా ఆధారాలను చూపించినప్పుడు ఆ డబ్బును రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం.. దీనిపై క్షేత్రస్థాయి లో అవగాహన లేకపోవడంతో చాలామంది నగదును తీసుకెళ్తూ పట్టుబడుతున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కోట్లాది రూపాయలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల సంఘం విధించిన రూ.50 వేల గరిష్ట పరిమితి నిబంధన వల్ల సామాన్యులు పలు సందర్భాల్లో ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ చిల్లర వర్తకంలో నగదు లావాదేవీలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. హోల్‌సేల్‌తోపాటు రిటైల్ మార్కెట్లోనూ నగదు లావాదేవీలు పెద్దసంఖ్యలోనే జరుగుతున్నాయి. అలా నగదు లావాదేవీలు జరిగినప్పుడు దుకాణా దారులు చాలాచోట్ల రసీదులు ఇవ్వడం లేదు. హోల్‌సేల్ దుకాణాల్లో వస్తువుల కొనుగోలుకు రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. డిజిటల్ లావాదేవీలు మేలు: ప్రస్తుతం దసరా పండుగ సీజన్ నడుస్తోంది. చిల్లర వ్యాపారులు పలు అవసరాలకు నగదు లావాదేవీలు సాగిస్తుంటారు. అంతేగాకుండా సరుకుల కొనుగోలుకు జనాలు సైతం నగదు తీసుకెళ్తుంటారు. ఇవేగాకుండా వైద్య, వ్యాపార అవసరాల నిమిత్తం అప్పులు తెచ్చుకోవడం లాంటివి చేస్తుంటారు. వీటికి లిఖిత పూర్వక ఆధారాలేమీ ఉండవు. చేబదులు రూపంలో తీసుకునే మొత్తానికి ఎలాంటి రసీదు ఉండదు. మరోవైపు వైద్య ఖర్చులు, శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లే వారు, కాలేజీ ఫీజులు చెల్లించే వాళ్లు తమ వెంట రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు చేస్తున్న తనిఖీల్లో ఎక్కువగా ఇలాంటివే ఎక్కువ వెలుగు చూస్తున్నాయి. అందువల్ల ఈ పరిస్థితుల్లో నగదును తీసుకెళాల్సి ఉంటే సరైన ఆధారాలను వెంట ఉంచుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. లేకుంటే సమీప బ్యాంకులో నగదు డిపాజిట్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం మంచిదని అంటున్నారు. -
ఒకే రోజు రూ.78 కోట్ల జప్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రికార్డు స్థాయిలో రూ.78.03 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.243.76 కోట్లకు పెరిగిపోయింది. కాగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.87.92 కోట్లు. ఒక్క రోజు 6వేల లీటర్ల మద్యం జప్తు తాజాగా రూ.1.21 కోట్లు విలువ చేసే 6132 లీటర్ల మద్యం జప్తు చేశారు. దీంతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం మద్యం 65,223 లీటర్లు కాగా, దీని విలువ రూ.10.21 కోట్లు. గురువారం రూ.16.77లక్షలు విలువ చేసే 103.165 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న గంజాయి 2950 కిలోలకు పెరిగింది. దీని విలువ రూ.7.72 కోట్లు. ఇప్పటి వరకు మరో రూ.7.72 కోట్లు విలువ చేసే ఇతర మత్తు పదార్థాలను జప్తు చేశారు. గురువారం రూ.57.67 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. 83కిలోల బంగారం పట్టివేత అందులో 83.046 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినం ఉంది. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల విలువ రూ.120.40 కోట్లకు ఎగబాకింది. ఇందులో 181 కిలోల బంగారం, 693కిలోల వెండి, 154.45 క్యారెట్ల వజ్రాలున్నాయి. గురువారం రూ.8.84 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి తదితర వస్తువులను పట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన ఇలాంటి వస్తువుల విలువ రూ.17.84 కోట్లకు చేరింది. హైవేపై రూ.750 కోట్ల నగదు కలకలం అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులోని 44వ జాతీయ రహదారిపై ఏకంగా రూ.750 కోట్ల నగదు పట్టుబడినట్లు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. ’’రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కేరళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ యూబీఐకి నగదును బదిలీ చేస్తున్నట్టు మంగళవారం రాత్రి సమాచారం వచ్చింది. ఈ మేరకు జిల్లా నుంచి ఆర్డీఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, డీఎస్పీ అధికారులు విచారణ చేసేందుకు స్పాట్‌కు వెళ్లి, నగదుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత పోలీస్ ఎస్కార్ట్‌తో నగదును హైదరాబాద్‌లోని యూబీఐకి చేరినట్లు నిర్ధారణ చేసుకున్నాము’’’ అని క్రాంతి ఆ ప్రకటనలో వివరించారు. అయితే ఎంత మేరకు నగదు ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
అడుగడుగునా ‘కట్టల’ పాములు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో రూ.కోట్ల విలువైన నగదు, మద్యం, వెండి, బంగారం పట్టుబడుతు న్నాయి. ఈ నెల 9న రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటినుంచి మంగâý వారం ఉదయం వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం రూ.130 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ని కల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడి ంచారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియో జకవ ర్గాల పరిధిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేర కు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీ సులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 373 ఫ్లయింగ్ స్క్వా డ్లు, 374 స్టాటిక్ సర్వైవలెన్స్ టీమ్‌లు, 95 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. డబ్బే డబ్బు! ఎలాంటి అధికారిక గుర్తింపు పత్రాలు లేకుండా తర లిస్తున్న రూ.71.55 కోట్ల స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి వికాస్‌రాజ్ వివరించారు. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం మొత్తం విలువ రూ.7.75 కోట్లు ఉంటుందన్నారు. 1694 కిలోల గంజాయి విలువ రూ.4.58 కోట్లు, పట్టుబడిన బంగారు, వెండి మొత్త విలువ రూ. 40.08 కోట్లు ఉంటుందని వివరించారు. ఇందులో మొత్తం 72.267 కిలోల బంగారం, 429.107 కిలోల వెండి, 42.03 క్యారట్ల వజ్రాలు న్నాయని స్పష్టం చేశారు. ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి విలువ మొత్తం రూ.6.29 కోట్లు అని వికాస్‌రాజ్ తెలిపారు. ఈనెల 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ ఉదయం 9 గంటల వరకు మొత్తం రూ.21.84 కోట్ల విలువైన వస్తువులు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పా రు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియమా వళి అమల్లో ఉన్న రోజుల్లో రూ.103 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం, వెండి, ఇతర వస్తు వులు స్వాధీనం చేసుకోగా.. ఈసారి ఇప్పటికే ఆ మొత్తం విలువ రూ.130 కోట్లు దాటడం విశేషం. 5,529 ఆయుధాలు స్వాధీనం: డీజీపీ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా 5,529 లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ కార్యాలయం తెలి పింది. వీటితోపాటు మరో మూడు అక్రమ ఆయు ధాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. 5,252 బైండోవర్ కేసులలో మొత్తం 17,128 మందిని బైండోవర్ చేసినట్టు వెల్లడించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన 184 మందిపై 56 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించింది. -
పట్టుకున్న నగదు, వస్తువులు రూ. 37 కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చినప్పటి నుంచీ పెద్ద ఎత్తున నగదు, బంగారం, మద్యం, మత్తు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మొత్తంగా 1,196 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. తనిఖీల కోసం 89 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 169 ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వివరించింది. ఇప్పటివరకు కమిషన్ నేతృత్వంలో సాగిన నిఘా, స్వాదీనాలు, కేసుల వివరాలను వెల్లడించింది. ఆ వివరాల మేరకు.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.20,43,38,375 నగదును, రూ.14,65,50,852 విలువైన బంగారం, వెండి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.86,92,533 విలువైన 31,730 లీటర్ల మద్యం, వెయ్యి కిలోల నల్లబెల్లం, 501 కిలోల అల్లం స్వాధీనం చేసుకున్నారు. రూ.89,02,825 విలువైన 310 కిలోల గంజాయిని తనిఖీల్లో పట్టుకున్నారు. ప్రలోభాలకు గురి చేసేందుకు తరలిస్తున్నారనే అనుమానంతో 7,040 కిలోల బియ్యం, 440 చీరలు, 80 కుట్టు మెషీన్లు, 87 కుక్కర్లు, ఒక కారును స్వా«దీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.22,51,963. మొత్తంగా నగదు, వస్తువులన్నీ కలిపి విలువ రూ.37,07,36,548 అని కమిషన్ గుర్తించింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనపై 34,388 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ♦ గురువారం హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.33.55 లక్షలను, జూబ్లీహిల్స్‌లో మణిపూర్‌కు చెందిన మహిళ నుంచి రూ. 5.50 లక్షలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అబిడ్స్ ప్రాంతంలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి రూ. 5 లక్షల నగదు, అమీర్‌పేటలో మరొకరి నుంచి రూ. 9.9 లక్షలను, మియాపూర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి 448.96 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ♦ నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురంలో చేపట్టిన వాహన తనిఖీల సందర్భంగా ఎలాంటి పత్రాలు చూపకుండా తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును సీజ్ చేశారు. ♦ మేడిపల్లి పోలీసులు నారపల్లి వెంకటాద్రి టౌన్షిప్ వద్ద వాహన తనిఖీల్లో రూ.13.50 లక్షలు, హబీబ్‌నగర్ పోలీసులు సీతారామ్‌భాగ్ ఎక్స్ రోడ్డులో ఓ వ్యక్తి నుండి రూ.6.95 లక్షలు నగదును స్వా«దీనం చేసుకున్నారు. -
నోట్ దిస్ పాయింట్.. రూ.50 వేల వరకు తీసుకెళ్లేందుకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ సోమవారం వెలువడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు విభాగం ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలుచేయడం ప్రారంభించింది. ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి వినియోగించే అక్రమ మద్యం, నగదుపై డేగకన్ను వేసింది. సోమ, మంగళవారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ.15 కోట్లకు పైగా నగదు, కిలోల కొద్దీ బంగారం, వెండి స్వా«దీనం చేసుకుంది. ఎన్నికల క్రతువు ముగిసేవరకు ఈ తనిఖీలు సాగనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వృత్తి, వ్యాపార, క్రయవిక్రయాల కోసం నగదు తరలించే వారిలో అనేక సందేహాలున్నాయి. కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పోలీసులు కోరుతున్నారు. రూ.50 వేలకు మించితే... ఓ వ్యక్తి తన వెంట రూ.50 వేల వరకు మాత్రమే నగదును తీసుకెళ్లవచ్చు. అంతకుమించిన మొత్తం తీసుకెళ్లాలంటే దాని మూలాలను నిరూపించే ఆధారాలు కచ్చితంగా కలిగి ఉండాలి. వ్యాపారులు దానికి సంబంధించిన పత్రాలు, లావాదేవీల బిల్లులు కలిగి ఉండాల్సిందే. సాధారణ వ్యక్తులు తీసుకెళ్తుంటే బ్యాంకు నుంచి డ్రా చేసిన పత్రాలు లేదా ఆ నగదు ఎక్కడ నుంచి వచి్చందో, ఎందుకు వినియోగిస్తున్నామో చెప్పడానికి అవసరమైన ఇతర ఆధారాలు చూపించాలి. ♦ రూ.2 లక్షలకు మించిన నగదు తలింపును మాత్రం పోలీసు, రెవెన్యూ, ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆ మొత్తం తమ వద్దకు ఎలా వచి్చంది? ఏం చేయబోతున్నారు? అనే వాటికి ఆధారాలు చూపాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో పోలీసులు నగదు స్వా ధీనం చేసుకుంటారు. ఇలా సీజ్ చేసిన నగదు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటే అది జిల్లా ఎన్నికల అధికారి నియమించే కమిటీ వద్దకు వెళ్తుంది. ♦ నలుగురు సభ్యులతో ఉండే ఈ జిల్లా కమిటీ ఎదుట నగదు యజమాని హాజరై నగదు మూలం, అవసరాలకు సంబంధించి వివరణ ఇవ్వాలి. దీనిపై కమిటీ సంతృప్తి చెందితే నగదు తిరిగి అప్పగిస్తుంది. లేదంటే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఆదేశిస్తుంది. ♦ పోలీసులు స్వాదీనం చేసుకున్న నగదు రూ.10 లక్షలకు మించితే విషయం ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. నగదును స్వా«దీనం చేసుకునే ఆ అధికారులు బాధ్యులకు నోటీసులు జారీ చేస్తారు. వారిచ్చే సమాధానాన్ని వివిధ కోణాల్లో పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటారు. ♦ కొత్త బంగారం, వెండి నగలు, వస్తువులతోపాటు గిఫ్ట్ ఆర్టికల్స్, కుక్కర్లు, క్రికెట్ కిట్స్ వంటి సామగ్రి విలువ రూ.10 వేలకు మించితే పోలీసులు స్వా«దీనం చేసుకుంటారు. యజమానులు వాటిని వ్యాపార నిమిత్తం తరలిస్తున్నట్లు పత్రాలు చూపించి, నిరూపించుకుంటేనే తిరిగి అప్పగిస్తారు. లేదంటే విషయం ఎన్నికల అధికారుల వద్దకు వెళ్తుంది. ♦ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సైతం తాము ఖరీదు చేసే ప్రచార, ఇతర సామగ్రికి సంబంధించి విక్రేతలకు రూ.10 వేల కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేయకూడదు. అంతకంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేయాలంటే చెక్కులు, ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలి. అభ్యర్థి లేదా అతని ఏజెంట్ కూడా రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు. ♦ పోలీసులు స్వా«దీనం చేసుకున్న నగదు (రూ.50 వేలలోపు అయినా), వస్తువులు (రూ.10 వేల కంటే తక్కువ విలువైనవి అయినా) ఓటర్లను ప్రలోభ పెట్టడానికని ఆధారాలు లభిస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. బాధ్యులపై ఐపీసీ 171(బీ) రెడ్‌విత్ 171(సీ) సెక్షన్లతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 123 ప్రకారం వీటిని రిజిస్టర్ చేసి దర్యాప్తుచేస్తారు. బాధ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే అవకాశమూ ఉంది. -
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు.. పట్టుబడ్డ రూ. 2 కోట్ల 47 లక్షలు..
సాక్షి నెట్ వర్క్: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వివిధ ప్రాంతాల్లో సరిగ్గా లెక్క చూపని, సరైన పత్రాల్లేని రూ. 2,47,30,500 నగదు, కేజీ 600 గ్రాముల బంగారం పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆయా నగదును, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆగాపల్లి వద్ద మంచాల మండలం లోయపల్లికి చెందిన కె.శ్రీనివాస్ కారులో రూ.20 లక్షలు, కూకట్‌పల్లికి చెందిన సీహెచ్ రాజశేఖర్‌రెడ్డి కారులో రూ.2లక్షలు పట్టుబడ్డాయి. చిక్కడపల్లి: నిర్మల్ జిల్లా బైంసా ప్రాంతానికి చెందిన శ్రీధర్ తన కియా కారులో కేజీ బంగారం తీసుకువెళ్తుండగా గాం«దీనగర్ స్టేషన్ పరిధిలో పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రూ.58 లక్షల విలువైన ఆ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపిస్తే అందజేస్తామని లేకపోతే ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. హిమాయత్‌నగర్ వై జంక్షన్లో దోమలగూడ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో వెంకటరమణ అనే ద్విచక్రవాహనదారుడు నుంచి రూ.1,75,000 స్వాదీనం చేసుకున్నారు. చైతన్యపురి: బైక్‌లపై వెళ్తున్న దిల్సుఖ్నగర్ వీవీనగర్‌కు చెందిన బిరాదార్ సిద్ధేశ్వర్, సరూర్‌నగర్ ఇంద్రహిల్స్‌కు చెందిన బి.శంకర్‌రెడ్డి నుంచి రూ.60 లక్షల నగదును చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చెక్‌పోస్టు వద్ద స్వా«దీనం చేసుకున్నారు. చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరులో బ్యాంక్ ఉద్యోగి చీర్యాల సాయికుమార్ కారులో రూ. 45 లక్షలు ఉండటంతో ఆ డబ్బును సీజ్ చేశారు. అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మరబండపాలెం వద్ద ధాన్యం వ్యాపారి చింతకుంట్ల కోటేశ్వరరావుకు చెందిన కారులో రూ.7లక్షల 30వేలు లభ్యమయ్యాయి. రామగిరి: నల్లగొండ జిల్లా తిప్పర్తి వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన కుంచాల సుధాకర్ కారులో పోలీసులు రూ.8 లక్షల 50 వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.18,39,500, అంతారం స్టేజీ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.7.40 లక్షలు , కొత్తూరు బైపాస్ (వై జంక్షన్)వద్ద రూ.8.85 లక్షల నగదు, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో రూ. 5.11 లక్షల నగదును పోలీసులుస్వాదీనం చేసుకున్నారు. చైతన్యపురి: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తపేట చౌరస్తాలో గోషామహల్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సునీల్ జహంగీర్ నుంచి రూ. 7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విజయనగర్‌కాలనీ: గోల్కొండ టోలిచౌకీలోని అప్సర్ కాలనీకి చెందిన మహ్మద్ అశ్వాక్ ద్విచక్రవాహనంలో రూ.6 లక్షలు ఉన్నట్లు ఆసిఫ్‌నగర్ పోలీసులు గుర్తించారు. జియాగూడ: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని పురానాపూల్ చౌరస్తాలో నార్సింగికు చెందిన ఆనంద్ నుంచి సుమారు 30 లక్షల విలువచేసే 600 గ్రాముల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్ద కామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు కారులో వస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 50 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. -
రూ. కోట్లకొద్దీ డబ్బు, బంగారం స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ఎన్నికల్లో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, నాకా బందీలు పెట్టి సోదాలు నిర్వహించారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. వాటిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. రాజధాని పరిధిలో... బషీర్‌బాగ్ నిజాం కళాశాల వద్ద వాహన తనిఖీ ల్లో ఓ బంగారం దుకాణానికి చెందిన, ఎలాంటి పత్రాల్లేని 7 కిలోల బంగారం, 295 కిలోల వెండిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 7.5 కోట్లు ఉండొచ్చని చెప్పారు. పురానాపూల్ వద్ద బేగంబజార్‌కు చెందిన ఒకరి నుంచి రూ.15 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని చైతన్యపురి పరిధిలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ.25 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో షాద్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి సంతోష్ చంద్రశేఖర్ (48) నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా లాల్‌పహాడ్ చౌరస్తా వద్ద తనిఖీల్లో 2 కిలోల బంగారం, రూ. 1.22 లక్షలు పట్టుబడ్డాయి. ఆగాపురా హమీద్ కేఫ్ చౌరస్తాలో షాహీన్ నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ నుంచి రూ. 5 లక్షలు, బేగంబజార్‌కు చెందిన దినేష్ ప్రజాపతి నుంచి రూ.12 లక్షల నగదు స్వాదీనం. షేక్‌పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలు సీజ్. వనస్థలిపురం పరిధిలో ఓ కారులో సంరెడ్డి భరత్‌రెడ్డి తీసుకెళ్తున్న రూ. 5.16 లక్షలు స్వాధీనం. గోపాలపురం పీఎస్ పరిధిలోని ఓ లాడ్జీలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డ రూ. 4 లక్షలు. పంచశీల క్రాస్ రోడ్స్ వద్ద గోపి అనే వ్యక్తి నుంచి రూ. 9.3 లక్షలు స్వాదీనం. వివిధ జిల్లాల్లోనూ... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి బీడీఎల్ చౌరస్తా వద్ద తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ. 9,38,970తో పాటు గాయత్రి ఆస్పత్రి వద్ద తనిఖీల్లో మరో కారులో తరలిస్తున్న రూ.71,50,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. అలాగే షాద్‌నగర్ టోల్ ప్లాజా వద్ద సంగారెడ్డికి చెందిన నగేష్ నుంచి రూ.7 లక్షలతోపాటు షాద్‌నగర్‌లోని జీహెచ్ఆర్ కాలనీకి చెందిన అశోక్ బైక్‌పై తీసుకెళ్తున్న రూ. 11.50 లక్షలను సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి వద్ద తనిఖీల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన వ్యాపారి కారులో తరలిస్తున్న రూ. 5.40 లక్షల నగదును స్వా«దీనం చేసుకొన్నారు. ఏపీకి చెందిన వారి నుంచి వైరాలోని చెక్‌పోస్టు వద్ద రూ.5లక్షలు, తల్లాడ సూపర్ మార్కెట్ యజమాని కొత్తూరి సైదకుమార్ రూ. 5 లక్షలను సీజ్ చేశారు. మధిర వద్ద తనిఖీల్లో కోనా గోపాలరావు అనే వ్యక్తి నుంచి రూ.12.65 లక్షలను సీజ్ చేశారు. -
‘న్యూస్‌క్లిక్’లో పోలీసుల సోదాలు
న్యూఢిల్లీ: చైనా అనుకూల సమాచారాన్ని భారత్‌లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీ స్థాయిలో నగదును స్వీకరించిందన్న ఆరోపణలపై ఆన్లైన్ న్యూస్‌పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’పై ఢిల్లీ పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. సంస్థకు సంబంధించిన ఆఫీసులతోపాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బందికి సంబంధించిన ఇళ్లలోనూ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకులు, ఎడిటర్–ఇన్–చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థా, హెచ్ఆర్ చీఫ్ అమిత్ చక్రవర్తిని మొదట ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత ఇద్దరినీ అరెస్ట్‌చేశారు. 100 ప్రాంతాల్లో ఏకంగా 500 మంది ఢిల్లీ పోలీసులు ఒకేసమయంలో దాడిచేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ముంబైలలో ఈ సోదాలు జరిగాయి. సోదాలు చేయాల్సిన వ్యక్తులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చెందిన ఢిల్లీలోని నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఆయనకు సహాయకునిగా ఉండే శ్రీనారాయణ్ కుమారుడు సుమిత్ ఇదే న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తుండటంతో ఏచూరీ ఇంట్లోనూ పోలీసు తనిఖీలు కొనసాగాయి. దీంతో ఏచూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని సంస్థ ముఖ్య కార్యాలయంలోని వారిని ప్రశ్నించాక ఆ ఆఫీస్‌కు పోలీసులు సీలువేశారు. విదేశీ ప్రయాణాలు, పౌరసత్వ(సవరణ) చట్టంపై షాహీన్‌బాగ్ వద్ద చెలరేగిన ఆందోళనలు, రైతుల ఉద్యమాలు తదితరాలపై జర్నలిస్టులను 25 అంశాలపై ప్రశ్నించామని పోలీసులు వెల్లడించారు. న్యూస్‌క్లిక్‌కు నిధులు ఎలా వస్తున్నాయనే కోణంలో గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యూస్‌క్లిక్ కార్యాలయాల్లో సోదాలు చేయడం తెల్సిందే. ఈ విషయంలో ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అందించిన సమాచారంతోనే మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, నేరమయ కుట్ర సెక్షన్ల కింద కొత్తగా కేసు నమోదుచేసి దాడులు చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, హార్డ్ డిస్‌్కలు, ఫ్లాష్ డ్రైవ్‌లను స్వాదీనం చేసుకున్నారు. ఆగస్ట్ 17న అత్యంత కఠిన ఉగ్రవ్యతిరేక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక )చట్టంకింద నమోదైన కేసు ఆధారంగానే కొత్తను నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేశారు. చైనాతో సంబంధం ఉన్న కొన్ని సంస్థల నుంచి గత మూడేళ్లకాలంలో రూ.38.05 కోట్ల నగదు న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు ముట్టిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నగదులో కొంత మొత్తం పాత్రికేయులు గౌతమ్ నవ్లఖా, తీస్తా సీతల్వాడ్లకు చేరినట్లు ఆరోపిస్తోంది. విపక్షాల తీవ్ర విమర్శలు మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ సహా పలు విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తూర్పారబట్టాయి. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాసహా పలు మీడియా సంఘాలు పోలీసు దాడులను ఖండించాయి. మోదీ సర్కార్‌ను విమర్శించే పాత్రికేయులపై ప్రభుత్వం కత్తిగట్టిందని ఆక్షేపించాయి. -
మాయమవుతున్న రూ.కోట్ల విలువైన పీడీఎస్ బియ్యం
సాక్షి, హైదరాబాద్/మెదక్: ‘మెదక్‌లోని పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్‌కు ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన బియ్యంలో 362 టన్నుల మేర తేడా వచ్చింది. అంటే రూ.3 కోట్ల విలువైన 18 లారీల బియ్యం లెక్క దొరకడం లేదు. వీటితో పాటు 700 బేల్స్ గన్నీ బ్యాగులు లేవు. 320 టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) చెడిపోయాయి. మొత్తంగా ఈ మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన అక్రమాల విలువ సుమారు రూ.6 కోట్లు. ఆకస్మిక తనిఖీలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి..’పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం రాష్ట్ర స్థాయి అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో స్వయంగా పోస్ట్ చేసిన వివరాలు ఇవి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎంఎల్ఎస్ పాయింట్లలో వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించి శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆయన ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. నిఘా కరువు..రికార్డుల్లేవు రైస్ మిల్లుల నుంచి సీఎంఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరతాయి. ఇక్కడి నుంచి ప్రజా పంపిణీ పథకం (పీడీఎస్) కింద ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళతాయి. అక్కడి నుంచే జిల్లాల్లోని అన్ని రేషన్ దుకాణాలకు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు సరఫరా అవుతాయి. అయితే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరైన నిఘా, రికార్డుల వ్యవస్థ ఉండటం లేదు. రాష్ట్రంలో 171 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, చాలాచోట్ల అధికారులు లేరు. ఔట్ సోర్సింగ్ కింద నియామకమైన డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)ల పర్యవేక్షణలో నడుస్తున్నాయి. సెపె్టంబర్ 8న సంస్థ చైర్మన్ మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేసినప్పుడు రెండేళ్లుగా అక్కడ స్టాక్ పాయింట్ ఇన్చార్జి లేడని, కేవలం డీఈవో ద్వారానే కోట్ల రూపాయల విలువైన బియ్యం పంపిణీ, సరఫరా ప్రక్రియ కొనసాగుతోందని తేలింది. అక్కడున్న 1,520 బ్యాగుల సన్నబియ్యం తినడానికి పనికిరాకుండా పోవడాన్ని కూడా గుర్తించారు. గోదాముల నుంచే మొదలు.. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం వచ్చే సమయంలోనూ భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లతో మిల్లర్లు కుమ్మౖMð్క బియ్యం లోడ్లను పక్కదారి పట్టిస్తున్నట్లు ఇప్పటికే పలు సంఘటనల్లో బయటపడింది. గత ఏప్రిల్ మొదటి వారంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ఎఫ్‌సీఐ గోదాం నుంచి సుల్తానాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు 5 లారీల్లో బియ్యం పంపించారు. కానీ 420 బస్తాల చొప్పున ఉన్న 3 లారీలు మాత్రమే గోదాంకు చేరాయి. మిగతా 2 లారీలు కాట్నపల్లి వద్ద ఉన్న ఓ రైస్ మిల్లులో అన్లోడ్ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లేఖ ద్వారా తెలియజేశారు. సంస్థ ప్రధాన కార్యాలయానికి సంబంధం లేకుండా పెద్దపల్లిలో సీఎంఆర్‌కు అదనంగా 30 వేల టన్నుల బియ్యం తీసుకున్నట్లు తేలిందని కూడా వివరించారు. ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరపాలని కోరారు. ఇక ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం పంపించే క్రమంలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టమవుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో కూడా భారీ మొత్తంలో బియ్యం మాయం అవుతున్నాయి. మెదక్‌తో పాటు రామాయంపేట, తూప్రాన్ ఎంఎల్ఎస్ పాయింట్లలో 10 వేల క్వింటాళ్లకు పైగా పీడీఎస్, సన్న బియ్యం లెక్క తేలకుండా పోయినట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ స్టాక్ పాయింట్ల ఇన్చార్జిలపై కేసులు కూడా నమోదయ్యాయి. పట్టించుకోని అధికారులు తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. 171 ఎంఎల్ఎస్ పాయింట్లలో కనీసం 150 చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని, జిల్లా స్థాయిల్లోని అధికార యంత్రాంగం అండతో బియ్యం య థేచ్ఛగా గాయబ్ అవుతున్నాయని సంస్థకు చెందినవారే అంగీకరించడం గమనార్హం. -
పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్’ X ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సంస్థలో కీలక హోదా ల్లో ఉన్న ఉన్నతాధికారులకు, సంస్థ బాధ్యతలు చూసేందుకు నియమితులైన ‘సార్’కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపాదించి న పనులేవీ సంస్థలో జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని ‘సార్’ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోమంటే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్, సీ ఎంఆర్ అప్పగింత మొదలు మిల్లులు, ఎంఎల్ఎస్ పాయింట్లపై విజిలెన్స్ దాడులు, రేషన్ దుకాణా లకు బియ్యం సరఫరాలో అవకత వకల వరకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం మొద లు అధికారుల బదిలీల వరకు పలు అంశాలపై విభేదా లు సంస్థ సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారాయి. మిల్లుల్లో తనిఖీలు .. విజిలెన్స్ దాడులు రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో రైస్‌మిల్లుల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయి, సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో కొన్ని నెలల క్రితం మిల్లర్ల అక్రమాలను నిగ్గు తేల్చే పేరుతో ప్రభుత్వ ప్రతినిధిగా ‘సార్’ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో స్థానిక విజిలెన్స్, జిల్లా అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఏ మిల్లులో ఎంత లోటు ఉంది, ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డాయనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఉన్నత స్థాయిలో అధికారులు అడ్డుకున్నారని ఆయ న ఆరోపిస్తున్నారు. అయితే ఎండీకి గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం ఇవ్వకుండా ‘రహస్య ఎజెండా’తో ‘సార్’ తనిఖీలు చేశారని సంస్థ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. తనిఖీల పేరుతో దందాలు సాగుతున్నాయనే అనుమానాలే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరిగే ఎంఎల్ఎస్ పాయింట్లకు విజిలెన్స్ సిబ్బందిని పంపిస్తూ దాడుల పేరుతో భయపెడుతున్నారని, తనను ప్రసన్నం చేసుకున్న వారిని వదిలేసి, లేదంటే బెదిరిస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సీఆర్ఓ భవనానికి బ్రేక్ సికింద్రాబాద్‌లోని చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్ఓ) భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాల ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సార్’ భావించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మిల్లర్ల ‘సహకారం’తో రూ.2 కోట్లతో నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఈఈని ప్రతిపాదనలు అడిగితే, ఆయన కేవలం రూ.70 లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చారు. తర్వాత సదరు డీఈఈ డిప్యుటేషన్ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కరీంనగర్లో పనిచేసిన ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను డీఈఈగా తెచ్చేందుకు ‘సార్’ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీన్ని కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే వాదన విన్పిస్తుండగా, మిల్లర్ల ‘సహకారం’తో భవన నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. 11 మంది సిబ్బంది ఆరుకు కుదింపు కీలక పదవిలో చేరిన తర్వాత ‘సార్’ తన పేషీలో 11 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అయి తే సంస్థ ఎండీ.. వారి సంఖ్యను ఏకంగా ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మేరకు ఆదేశాలు వచ్చినా సిబ్బందిని తగ్గించే నిర్ణయం అమలుకాకపోవడంపై సంస్థలో చర్చ జరుగుతోంది. ఔట్సోర్సింగ్ నియామకాలకు నో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేనివిధంగా పౌరసరఫరాల సంస్థలో 800 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ‘సార్’ చేసిన సిఫారసులను అధికారులు ఆమోదించడం లేదని సమాచారం. ప్రధాన కార్యాలయంలో ఉండే లీగల్ అడ్వయిజర్ తరహాలో జిల్లాకో లీగల్ అడ్వయిజర్‌ను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఉన్నతాధికారి అంగీకరించలేదని తెలుస్తోంది. మూడు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, మరి కొందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న డీఎంలు, ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని ‘సార్’ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల ఆరోపణలు ఇదే సమయంలో ‘సార్’పై పలు ఆరోపణలు సంస్థలో విన్పిస్తుండటం గమనార్హం. త్వరలో డిప్యుటేషన్ పూర్తయ్యే డీజీఎం–అడ్మిన్, డీజీఎం – ఫైనాన్స్ పోస్టుల నియామకం కోసం బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద పంపించి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంలో నలుగురు రైస్ మిల్లర్లు బేరం కుదిర్చారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. -
ఉన్నతాధికారి నివాసంలో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి/కైకలూరు: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్డబ్ల్యూఆర్ఐఎస్) జాయింట్ సెక్రటరీ కె.డి.వి.ఎం.ప్రసాద్‌బాబు నివాసం, కార్యాలయాల్లో, కైకలూరు మండలం గుమ్మళ్లపాడులోని ఆయన బావ అందుగుల రూబెన్ ఇంట్లోను బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఆయన ఆదాయానికిమించి భారీగా ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు. 1991లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఆయన తరువాత హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సీఐగా పదోన్నతులు పొందారు. 2007లో గ్రూప్–1 అధికారిగా ఎంపికైన ఆయన ఖజానా శాఖలో ఏటీవోగా చేరారు. కృష్ణా జిల్లా డీఆర్డీఏ పీవోగా, ఖజానా శాఖ విజయవాడ డివిజనల్ అధికారిగా, కృష్ణాజిల్లా ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేశారు. ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఏలూరులో రెండు ప్లాట్లు, విజయవాడ పోరంకిలో రెండు ప్లాట్లు, ఏలూరులోని మాదేపల్లిలో ఆర్సీసీ ఇల్లు, ఒక భవనం, హైదరాబాద్ భూదాన్ పోచంపల్లిలో జి+2 భవనం, పామర్రులో ప్లాట్, దెందులూరులో వ్యవసాయ భూమి, మూడు ఫోర్ వీలర్లు, రెండు టూ వీలర్ వాహనాలు, 500 గ్రాముల బంగారం, ఎల్ఐసీ పాలసీలు, మౌనిక ఆక్వా ఫామ్స్‌లో రూ.కోటి పెట్టుబడి, ఇతర వ్యక్తుల నుంచి రూ.26 లక్షల ప్రామిసరీ నోట్లు కలిగి ఉన్నట్టు గుర్తించారు. బుధవారం రాత్రి వరకు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రసాద్ భార్య స్వగ్రామం గుమ్మళ్లపాడు కావడంతో అక్కడ తనిఖీలు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రకాశం జిల్లాలో నిందితుల పేర్లను తొలగించడానికి కొనకనమిట్ల ఎస్ఐ కె.దీపిక తరఫున రూ.45వేలు లంచం తీసుకుంటూ కానిస్టేబుల్ పి.నర్సింహరావు ఏసీబీకి చిక్కారు. హెచ్.ఎం.పాడు మండలం రాజగారిపల్లెకు చెందిన ఎ. నరసింహ, అతడి కుటుంబసభ్యుల పేర్లను 498 (అ) కేసులో ముద్దాయిలుగా పోలీసులు పేర్కొన్నారు. వారిపేర్లను ముద్దాయిల జాబితా నుంచి తొలగించేందుకు ఎస్ఐ కె.దీపిక రూ.60 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అనంతరం ఎస్ఐ దీపిక ఆదేశాల మేరకు బాధితుల నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటున్న కానిస్టేబుల్ కె.నరసింహరావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. నిందితులు ఎస్ఐ దీపిక, కానిస్టేబుల్ నర్సింహరావును ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. -
ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఎగబాకడం, రైతుల నుండి పెరిగిన డిమాండ్, తగ్గిన సరఫరా కారణంగా దేశంలో ఎక్కువైన ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కేంద్రం దృష్టిసారించింది. రానున్న ఖరీఫ్ సీజన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలకు దిగింది. బ్లాక్‌మార్కెటింగ్ అరికట్టేందుకు కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 370 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. తెలంగాణలో నాలుగు యూరియా డైవర్షన్ యూనిట్లలో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక మిశ్రమ యూనిట్లో తనిఖీలు చేశాయి. మరో వారం పాటు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయి. తనిఖీల సందర్భంగా గుజరాత్, కేరళ, హరియాణా, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏకంగా 70,000 బస్తాల నకిలీ యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా 30 ఎఫ్ఐఆర్లు నమోదుకాగా, 112 మిశ్రమ తయారీదారులను డీఆథరైజ్ చేసినట్లు వెల్లడించింది. దాదాపు రూ. 2,500 ఖరీదు చేసే 45 కిలోల యూరియా బస్తాను రైతులకు వ్యవసాయ అవసరాలకు రాయితీపై రూ.266కే కేంద్రం అందిస్తోంది. అయితే డిమాండ్‌కు సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో సబ్సిడీ ధరకు యూరియాను పొందలేకపోతున్న రైతన్నలు మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. -
ఫార్మా కంపెనీలకు కేంద్రం భారీ షాక్!
నాసిరకం మందులు తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలపై కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలకు ఉపక్రమించింది. నాణ్యత లేమి డ్రగ్స్‌ను తయారు చేసిన 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను రద్దుతో పాటు తయారీని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 26 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు అందించింది. భారత్‌కు చెందిన ఫార్మా కంపెనీలు నకిలీ మందులు విదేశాలకు విక్రయిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఫార్మా కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర పోలీసులు, కేంద్ర బృందాలతో దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 76 ఫార్మా కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. ప్రపంచ దేశాల్లో భారత్‌లో తయారు చేసిన డ్రగ్స్ వినియోగించడం కారణంగా పలువురు మరణించడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత ఫిబ్రవరి నెలలో గుజరాత్‌కు చెందిన జైడస్ లైఫ్ సైన్సెస్ (Zydus Lifesciences) సంస్థ కీళ్ల నొప్పుల్ని నయం చేసే జనరిక్ మెడిసిన్ తయారు చేసి యూఎస్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహిస్తుంది. ఆ ఔషదాలున్న 55 వేల బాటిళ్లను రీకాల్‌కు పిలుపునిచ్చింది. గత ఏడాది నోయిడాకి చెందిన మరియన్ బయోటెక్ ఫార్మా సంస్థ నకిలీ దగ్గు మందును తయారు చేసింది. ఇక్కడి ఫార్మా కంపెనీలో తయారైన దగ్గుమందు తాగిన 21 మంది పిల్లల్లో 18 మంది మరణించారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆరోపణలతో రంగంలోకి దిగిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ అధికారులు మరియన్ బయోటెక్ ఫార్మాలో శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు. ఆ టెస్ట్‌లలో 22 రకాల మరియన్ బయోటెక్ తయారు చేసిన డ్రగ్స్ నాసిరకంగా ఉన్నాయని గుర్తించారు. ఇలా ఫార్మా కంపెనీలపై వరుస ఫిర్యాదులు రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఫార్మా కంపెనీల్లో సోదాలు జరిపి చర్యలు తీసుకుంటుంది. -
వెలుగులోకి ‘చీట్’ ఫండ్స్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/తిరుపతి: చిట్‌ఫండ్ కంపెనీల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొద్దిరోజులుగా రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. అక్టోబర్ 21, 31 తేదీల్లో డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులతో కలిసి రెండు విడతలుగా తనిఖీలు చేసి పలు అవకతవకలను గుర్తించింది. దానికి కొనసాగింపుగా మంగళవారం రాష్ట్రంలోని 18 సంస్థల్లో తనిఖీలు చేసింది. ప్రాథమిక పరిశీలనలో ఆయా కంపెనీల 2021–22 బ్యాలెన్స్ షీట్లను పరిశీలించినప్పుడు పెద్దఎత్తున నిధులు దారి మళ్లినట్టు గుర్తించారు. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా వేలానికి ముందే చందాదారుల నుంచి చిట్ సొమ్మును కట్టించుకుంటూ దానికి 5 శాతం వడ్డీని చెల్లిస్తున్నట్టు తేలింది. చిట్ పాడుకున్న చందాదారుల నుంచి గ్యారంటీ తీసుకుంటున్న కంపెనీలు, తాము చిట్‌ను పాడినప్పుడు మాత్రం ప్రభుత్వానికి గ్యారంటీ చూపించడంలేదని స్పష్టమైంది. చందాదారులు ఆలస్యంగా చిట్ సొమ్ము కట్టారనే సాకు చూపించి పెనాల్టీలు వసూలు చేసి దానికి జీఎస్టీ చెల్లించకపోవడం, పెనాల్టీల పేరుతో చందాదారుల నుంచి ఎక్కువ సొమ్మును వసూలు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉల్లంఘనలెన్నో! పలు చిట్ కంపెనీలు 1982 చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు తనిఖీల్లో స్పష్టమైంది. చిట్ల సొమ్మును ఇతర కార్యకలాపాలకు మళ్లించినట్టు గుర్తించారు. చిట్ల సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, రుణాలు ఇవ్వడం ద్వారా ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఈ సొమ్ముతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా చెందిన చిట్ల సొమ్మును అనుబంధంగా కంపెనీలకు మళ్లించి వాడుకుంటున్నాయి. అకౌంట్ల నిర్వహణ, వ్యాపార రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. మార్గదర్శిలోనూ సోదాలు విశాఖ జిల్లాలోని మార్గదర్శితో పాటు ఇతర చిట్‌ఫండ్ కంపెనీల్లో రికార్డులను అధికారులు పరిశీలించారు. నిధుల మళ్లింపుపై ఆరా తీశారు. తిరుపతిలోని మార్గదర్శి కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించి చిట్స్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించుకుంటున్నారని, ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని తేల్చారు. -
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు
-
ఆరోపణలొస్తే ఎప్పుడైనా తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్ జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. ఏదైనా కాలేజీపై నిర్ధిష్ట ఆరోపణలువస్తే ఎప్పుడైనా తనిఖీలు చేస్తామని పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో కొత్త కోర్సులు ప్రవేశపెడితే, వాటికి సంబంధించిన ల్యాబ్‌లు, కోర్సులకు సరిపడా బోధన సిబ్బంది ఉన్నారా.. లేదా? అనేది పరిశీలించాకే అనుబంధ గుర్తింపు ఇస్తామని వెల్లడించింది. ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీలపై ‘145 కాలేజీ లు.. మూడు రోజుల్లోనే తనిఖీలపై అనుమానా లు’శీర్షికతో మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన కథనం లో వాస్తవం లేదని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ స్పష్టంచేశారు. కాలేజీల్లో సిబ్బందికి వేతనాలు ఇస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించామని తెలిపారు. కొన్నేళ్లుగా నడుస్తున్న పాత కాలేజీల్లో సివిల్, మెకానికల్ కోర్సులకు సంబంధించి ల్యాబొరేటరీలు, అధ్యాపకుల వ్యవస్థ ఉంటుందని, అలాంటప్పుడు వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. పెరిగిన కంప్యూటర్ కోర్సులకు ల్యాబ్స్, బోధించే సిబ్బంది సక్రమంగా ఉన్నారా? లేదా? అనే అంశంపైనే తాము దృష్టిపెట్టినట్టు వివరించారు. నిజనిర్ధారణ కమిటీలు సమర్పించిన డేటాతో సంతృప్తిచెంది, కాలేజీల్లో ఉన్న లోపాలను యాజమాన్యాలకు వివరించకుండా, వారికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని, అనుబంధ గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గతేడాది నుంచి నిజనిర్ధారణ కమిటీలు ఎత్తిచూపిన లోపాలను కాలేజీ మేనేజ్మెంట్లకు చూపి, వాటిని సరిచేసుకునేలా కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. -
రాధ మిస్సింగ్ కేసు: ఎన్ఐఏ అదుపులో హైకోర్టు అడ్వకేట్ శిల్ప
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్‌లో ఎన్ఐఏ(NIA) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మెడికల్ విద్యార్థి రాధ మిస్సింగ్ కేసులో భాగంగా ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, రాధను శిల్ప.. మావోయిస్టుల్లో చేర్చారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ఏక కాలంలో అధికారులు మూడు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా.. పలు డాక్యుమెంట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో శిల్పను ఎన్ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శిల్పను ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. కాగా, మెదక్ జిల్లా చేగుంటలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టు నేత శంకర్ కొడుకు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే, మూడున్నర సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో రాధ అదృశ్యమైంది. రాధను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మే 31వ తేదీన కేసు రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని NIA కు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైతన్య మహిళా సంఘం నేతలపై, మావోయిస్టు అగ్రనేతలు గాజర్ల రవి, అరుణలపై NIA కేసు నమోదు చేసింది. ఇది కూడా చదవండి: జైలుకు మరో 10 మంది ఆందోళనకారులు -
ఈ నెల 18 నుంచి 21 వరకు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో తనిఖీలు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవల్లో నాణ్యత పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ద్వారా అందుతున్న సేవల్లో నాణ్యతను పరిశీలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. శనివారం నుంచి నాలుగు రోజులపాటు విలేజ్ క్లినిక్‌లలో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహించి సేవలపై ఆరా తీయనున్నారు. చదవండి: AP: సచివాలయాలు సూపర్.. కేంద్ర మంత్రి ప్రశంసలు ప్రత్యేక యాప్ రూపకల్పన వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో తనిఖీల కోసం ఏపీహెచ్ఎస్ఎస్పీ–ఎస్సీ–హెచ్డబ్ల్యూసీ పేరిట ప్రత్యేక యాప్‌ను వైద్య ఆరోగ్య శాఖ రూపొందించింది. ప్రత్యేక బృందాలు పరిశీలించాల్సిన అంశాలతో ఓ ప్రశ్నావళి రూపొందించారు. తనిఖీల్లో వెల్లడైన అంశాల ఆధారంగా లోటుపాట్లను సరిదిద్దేలా చర్యలు చేపట్టనున్నారు. సొంతూరిలోనే మెరుగైన వైద్యం గ్రామ స్థాయిలోనే ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్యం అందించే లక్ష్యంతో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున 10,032 క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆరు వేలకు పైగా క్లినిక్‌లు అందుబాటులోకి రాగా వీటి ద్వారా గర్భిణులు, చిన్నారులు.. నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ, అంటు వ్యాధుల నివారణ లాంటి 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులు గ్రామాల్లోనే అందుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రూ.1,692 కోట్లతో 1,498 భవనాలకు మరమ్మతులు, 8,534 కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. మరమ్మతులు ఇప్పటికే పూర్తయ్యాయి. బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగిన ఎంఎల్‌హెచ్‌పీ వీటిల్లో సేవలందిస్తున్నారు. ఇప్పటికే 8,347 మంది ఎంఎల్‌హెచ్‌పీల నియామకం పూర్తయింది. సగటున రోజూ క్లినిక్‌లలో 23 ఓపీలు, ఎనిమిది పరీక్షలు నమోదు అవుతున్నాయి. టెలిమెడిసిన్ ద్వారా క్లినిక్‌లలో స్పెషలిస్ట్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. నిత్యం సగటున 4,500 మంది టెలిమెడిసిన్ వైద్య సేవలు పొందుతున్నారు. తనిఖీల్లో వీటిపై దృష్టి ♦అర్హులైన వైద్యుల ద్వారా క్లినిక్‌లలో రోగులకు టెలిమెడిసిన్ సేవలు అందుతున్నాయా? ♦జీవన శైలి జబ్బుల స్క్రీనింగ్‌పై ఏఎన్ఎం, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ)లకు శిక్షణ పూర్తయిందా? ♦అవసరమైన ఔషధాల జాబితాలోని 70% మందులు అందుబాటులో ఉన్నాయా? ♦ప్రజలకు 12 రకాల వైద్య సేవలు సమగ్రంగా అందుతున్నాయా? -
ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, భద్రతా సిబ్బంది పనితీరును తరుచూ పర్యవేక్షించాలని కలెక్టర్లను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలతోనే ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని సూచించారు. గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య సేవలపై మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు స్పందించాలని సూచించారు. అధునాతన పరికరాల కొనుగోలు, వాటి నిర్వహణను ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. పీహెచ్‌సీల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకు అన్ని బయోమెడికల్ పరికరాల నిర్వహణను కాంట్రాక్ట్ పద్ధతిలో చేపడుతున్నట్లు చెప్పారు. అదనంగా కావాల్సిన మహాప్రస్థానం వాహనాల విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆర్డీవో, డీఎస్పీలతో కూడిన కమిటీలు ప్రైవేట్ వాహనాల మాఫియాను అడ్డుకోవడంతోపాటు స్థానిక ఆపరేటర్లతో చర్చించి వాహనాల రేట్లను అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందులు, మహాప్రస్థానం వాహనాలు, శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్, వ్యాక్సినేషన్, బయోమెట్రిక్ హాజరు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై ఆరా తీశారు. -
ఆకస్మిక తనిఖీలు చేస్తా: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. సమయపాలన పాటించని, విధినిర్వహణలో అలసత్వం వ హించే వైద్యులు, ఉద్యోగులపట్ల కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని విభా గాల్లో ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు పెంచాలని సూచించా రు. శనివారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రసూతి, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ సహా అన్ని విభాగాల్లో ఆరోగ్యశ్రీ కింద మరింత ఎక్కువగా వైద్య సేవలు అందించాలన్నారు. సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలు ఎక్కువ జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈఎన్టీ, డెర్మటాలజీ సేవలను మరింత మెరుగుపర్చి, సమీప గ్రామాల్లో ఈఎన్టీ క్యాంపులు ఏర్పాటు చేసి సేవలు అందించాలని సూచించారు. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున జిల్లా స్థాయిలోనే అత్యవసర సేవలు అందించేలా చూడాలని, అనవసరంగా హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేయవద్దన్నారు. అత్యవసర సేవలు అన్ని వేళలా అందించేందుకు వీలుగా అనస్థీషియా విభాగం క్రియాశీలకంగా ఉండాలని, వారానికి ఒక విభాగం వారీగా సూపరింటెండెంట్లు సమీక్షలు నిర్వహించాలన్నారు. పీడియాట్రిక్ విభాగంలోనూ ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు పెరగాలని చెప్పారు. -
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
-
చైనా మొబైల్ కంపెనీలకు షాక్! సోదాలు చేస్తోన్న ఐటీ శాఖ
న్యూఢిల్లీ: భారత మొబైల్ ఫోన్స్ పరిశ్రమలో దూకుడుగా ఉన్న చైనా కంపెనీలకు షాక్ తగిలింది. చైనాకు చెందిన ఒప్పో, షావొమీ, వన్‌ప్లస్ మొబైల్ కంపెనీల కార్యాలయాలు, ఉన్నతాధికారుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టు నిఘా విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కంపెనీలపై చాలా కాలంగా ఐటీ నిఘా ఉన్నట్టు తెలుస్తోంది. కచ్చితమైన సమాచారంతోనే కంపెనీల సీఈవోలు, ఇతర ప్రతినిధులను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గ్రేటర్ నోయిడా, కోల్‌కత, గువాహటి, ఇందోర్‌తోపాటు పలు ప్రాంతాల్లో 24కుపైగా కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉత్పత్తుల సరఫరా, విక్రయం, ఆర్థిక సేవల్లో ఉన్న కొన్ని కంపెనీలూ ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేసినట్టు నిరూపించే డిజిటల్ సమాచారాన్ని గుర్తించి, సీజ్ చేసినట్టు సమాచారం. ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్టు ఒప్పో వెల్లడించింది. భారతీయ చట్టాలకు అనుగుణంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నట్టు షావొమీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో టెలికం పరికరాల విక్రయంలో ఉన్న చైనాకు చెందిన జడ్‌టీఈపైనా ఐటీ తనిఖీలు జరిగాయి. -
తమిళనాడులో కేంద్రం కొత్త ఆట.. రసవత్తరంగా రాజ్‌భవన్ రాజకీయం..!
తమిళనాడులో కేంద్రం ‘కొత్త’ ఆట మొదలు పెట్టిందా..? నూతన గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని డీఎంకే ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాలనుకుంటోందా..? రాజ్‌భవన్ కేంద్రంగా రసవత్తర రాజకీయానికి తెరతీసిందా..? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఢిల్లీలో తొలిసారి కేంద్ర పెద్దలను కలిసి వచ్చిన గవర్నర్.. మంగళవారం విస్తుగొలిపే ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. సాక్షి, చెన్నై: తమిళనాడులో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై తనకు వివర ణ ఇవ్వాలని గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరయన్బును ఆదేశించారు. ప్రభుత్వ పాలనలో రాజ్‌భవన్ జోక్యంతో రాష్ట్రంలో రాజకీయ వివాదం రాజుకుంది. శాఖల వారీగా పథకాల సమీక్షకు సిద్దంకావాలని గవర్నర్ ఆర్ఎన్ రవి జారీచేసిన ఆకస్మిక ఆదేశాలు తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీ పర్యటన అనంతరం.. రిటైర్డు ఐపీఎస్ అధికారైన ఆర్ఎన్ రవి ఈనెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ, సీనియర్ మంత్రులను కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తనకు వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఆకస్మిక ఉత్తర్వులు జారీచేయడం, ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బుకు ఉత్తరం రాయడం చర్చనీయాంశమైంది. గవర్నర్ తరపున ఆయన కార్యదర్శి అన్ని ప్రభుత్వశాఖల అధికారులకు మంగళవారం ఉత్తరాలు పంపారు. ( చదవండి: అన్నాడీఎంకేలో మళ్లీ కోల్డ్ వార్.. ‘పళని’ ఎత్తు.. ‘పన్నీరు’ పైఎత్తు) అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వశాఖల పనితీరు, ఆయా శాఖల పరిధిలోని పథకాల అమల్లో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలని గవర్నర్ ఆశిస్తున్నారు. గవర్నర్ కోరుతున్న వివరాలను తెలియజేసేందుకు సిద్ధంగా ఉండండి. కంప్యూటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దృశ్యరూపాలను తయారు చేసుకోండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ముందు ఆయా పథకాల తీరుపై చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. ఇందుకు సంబంధించి తేదీ, సమయాన్ని మరలా తెలియజేస్తాం’’ ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. దురుద్దేశ పోకడ: టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి రాష్ట్ర ప్రభుత్వ పథకాల తీరుపై వివరణ కోరడం వెనుక గవర్నర్ దురుద్దేశపోకడ దాగి ఉందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గవర్నర్ చర్య ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమీక్షించే అధికారం గవర్నర్‌కు లేదన్నారు. రాష్ట్రపతి ఆదేశాలను అనుసరించి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేరు గానీ.. ఆయన ప్రజల చేత ఎన్నుక కాలేదని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత సీఎంకు, మంత్రివర్గానికి మాత్రమే ఉంటుందని చెప్పారు. గవర్నర్ ఆదేశాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు. ఆర్ఎన్ రవి నియామకం రోజున తలెత్తిన సందేహాలు ప్రస్తుతం నిజమవుతున్నాయని అన్నారు.‘‘రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనలో అడ్డంకులు సృష్టించేందుకు, కేంద్రప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కోసం గవర్నర్ ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏజెంటుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. పథకాల సమీక్ష నిర్ణయాన్ని గవర్నర్ వెనక్కుతీసుకోకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది’’ అని కేఎస్ అళగిరి హెచ్చరించారు. గవర్నర్ తీరు వల్ల రాష్ట్రంలో రెండు పాలనా కేంద్రాలు, గందరగోళ పరిస్థితి ఉత్పన్నం కాగలవని తమిళనాడు మైనార్టీ కమిషన్ చైర్మన్ పీటర్ ఆల్బెన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనలో గవర్నర్ జోక్యం చేసుకోరాదన్నారు. స్టాలిన్ ఏం చేస్తారో..? అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన సమయాల్లో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు పథకాలపై వివరణ ఇస్తారనే ఆశిస్తున్నారు. అయితే ఇందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనుమతిస్తారా..? అనే అనుమానాలు కూడా తలెత్తాయి. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ స్వచ్ఛభారత్ పథకం కింద జిల్లాల్లో పర్యటించి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇందుకు డీఎంకే శ్రేణులు గవర్నర్ చర్యను నిరసిస్తూ నల్లజెండాల ప్రదర్శన చేపట్టారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా గవర్నర్ తనదైన శైలిలో సమీక్షలు కొనసాగించారు. భన్వారీలాల్ పురోహిత్ బదిలీకాగానే ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఆర్ఎన్ రవి సైతం అదే పోకడలను అనుసరించడం రాజకీయ కలకలానికి దారితీసింది. అయితే గవర్నర్ ఆదేశాలపై ప్రభుత్వం నుంచి సీఎం స్టాలిన్ సహా ఎవ్వరూ స్పందించ లేదు. చదవండి: సిటీ బస్సులో సీఎం స్టాలిన్.. కాన్వాయ్ ఆపి మరీ.. -
సబ్ రిజిస్రార్ కార్యాలయాల్లో తనిఖీలు
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్/జమ్మలమడుగు రూరల్: నకిలీ చలానాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తీసిన చలానాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటివరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల గుట్టు బయటపడింది. అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో ఈ కుంభకోణం జరిగినట్టు తేలింది. ఎక్కువగా పశ్చిమ గోదావరిలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాలు బయటపడగా రూ.28.58 లక్షలు పక్కదారి పట్టాయి. విజయనగరం జిల్లాలోని 6 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.36.14 లక్షలు తేడా వచ్చింది. కృష్ణా జిల్లాలోని 6 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.4.20 కోట్లు, గుంటూరు జిల్లాలో 5 కార్యాలయాల్లో రూ.9.25 లక్షలు దారి మళ్లాయి. వైఎస్సార్ జిల్లాలో రెండు ఆఫీసుల్లోనే నకిలీ చలానాలు గుర్తించినా రూ.1.29 కోట్ల మొత్తం తేడా వచ్చింది. విశాఖ జిల్లాలోని రెండు కార్యాలయాల్లో రూ.1.39 కోట్లు దారి మళ్లాయి. మొత్తంగా ప్రభుత్వ ఖజానాలో జమ కావాల్సిన రూ.8.13 కోట్లు పక్కదారి పట్టినట్టు గుర్తించారు. ఇందులో రూ.4.62 కోట్లను ఇప్పటికే రికవరీ చేశారు. వైఎస్సార్, విశాఖ, విజయవాడ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో మొత్తం సొమ్మును రికవరీ చేయగా.. మిగిలిన జిల్లాల్లో రికవరీ జరగాల్సి ఉంది. 38 కార్యాలయాల్లో ఇప్పటివరకు 14 మందిని విధుల నుంచి తప్పించారు. అందులో 9మంది సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న డాక్యుమెంట్ రైటర్లు, ఇతరులపై 33 కేసులు నమోదు చేశారు. రెండేళ్లుగా రిజిస్ట్రేషన్ అయిన 60 లక్షలకుపైగా డాక్యుమెంట్లను తనిఖీ చేసేందుకు ప్రణాళిక రూపొందించిన అధికారులు ఇప్పటికే చాలావరకు తనిఖీలు పూర్తి చేశారు. ఒంగోలులోనూ నకిలీ చలానాల కలకలం ప్రకాశం జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వారం రోజులుగా విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ పి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో 18 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ జాయింట్–1, జాయింట్–2 పరిధిలో నకిలీ చలానాల ద్వారా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తేల్చారు. మొత్తం 71 రిజిస్ట్రేషన్ల ద్వారా 77 ఈ–చలానాలను సృష్టించారు. వీటిద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.26,74,850 మొత్తాన్ని చెల్లించకుండానే నకిలీ చలానాల ద్వారా మోసం చేసినట్టు తేలింది. ఇప్పటివరకు బయటపడిన నకిలీ చలానాలన్నీ ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉండే డాక్యుమెంట్ రైటర్ కాజా పవన్‌కుమార్ ఒక్కడే చేసినట్టు నిర్ధారణ అయింది. రూ.26,74,850 మొత్తం రాబట్టామని ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ జాయింట్–2 షేక్ జాఫర్ తెలిపారు. పవన్‌కుమార్ పరారీలో ఉన్నాడని, అతనిపై పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశామని చెప్పారు. జమ్మలమడుగులో ఏసీబీ సోదాలు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. కడప ఏసీబీ డీఎస్పీ పి.కంజాక్షన్ ఆధర్వంలో సీఐలు టి.రెడ్డెప్ప, ఎస్.రామాంజనేయులు, కృష్ణమోహన్ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ కంజాక్షన్ మాట్లాడూతూ ముందస్తు సమాచారం మేరకు సోదాలు నిర్వహించామని చెప్పారు. కార్యాలయ ఆవరణలో అనధికారికంగా ఉన్న ఐదుగురు దస్తావేజు లేఖరుల నుంచి రూ.84,040 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యాలయంలో అవకతకలు జరిగాయా అనే కోణంలో కక్షిదారులను విచారించారు. -
భారత ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు
న్యూఢిల్లీ: తాలిబన్ల మాటలకు చేసే చేష్టలకి ఎక్కడా పొంతన కుదరడం లేదు. దేశంలో విదేశీ ప్రతినిధులకు, కార్యాలయాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పిన వారు తమ నీచ బుద్ధిని బయట పెట్టుకున్నారు. అఫ్గాన్‌లో భారత దౌత్య కార్యాలయాల్ని తాత్కాలికంగా మూసేసినప్పటికీ తాలిబన్లు తనిఖీలు నిర్వహించారు. కీలక పత్రాలేమైనా దొరుకుతాయేమోనని కార్యాలయాల్లో అణువణువూ గాలించారు. కాందహార్, హెరాత్‌లో ఉన్న భారత కాన్సులేట్లలో బుధవారం తాలిబన్లు సోదాలు నిర్వహించి కార్యాలయం అంతటినీ చిందరవందర చేసి పడేశారు.ఆ కార్యాలయాల ఆవరణల్లో పార్క్ చేసి ఉన్న వాహనాలను తమ వెంట తీసుకువెళ్లినట్టు శుక్రవారం దౌత్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు. (చదవండి: ‘ఇంటికి పో, అక్కడే ఉండు, ఇంకెప్పుడూ రాకు’) ‘‘మేము ఈ విషయం ముందే ఊహించాం. తాలిబన్లు భారత కాన్సులేట్లను అణువణువు తనిఖీ చేశారు. కీలక పత్రాలేమైనా లభిస్తాయేమోనని గాలించారు. మేము పార్క్ చేసిన వాహనాలను తీసుకువెళ్లి పోయారు’’అని అ అధికారి వెల్లడించారు. సోదాలకు కొద్ది రోజుల ముందే అఫ్గాన్‌లో భారత రాయబారి సిబ్బందికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని తాలిబన్ రాజకీయ విభాగం నుంచి సందేశం వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా భారత్ దౌత్య సిబ్బంది, భద్రతా అధికారుల్ని వెనక్కి తీసుకు వచ్చేసింది. 31 వరకు వేచి చూసే ధోరణి అఫ్గానిస్తాన్‌లో ఏర్పాటయ్యే ప్రభుత్వంపై తాలిబన్లకు ఈ నెల 31 వరకు ఎలాంటి ప్రకటన చేసే ఉద్దేశం లేదని అఫ్గాన్ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా తన సైనిక బలగాలను ఈ నెల 31లోగా ఉపసంహరిస్తామని చెప్పడంతో అప్పటివరకు వారు వేచి చూసే ధోరణిలో ఉంటారని ఆ అధికారి తెలిపారు. అమెరికా బలగాల ఉపసంహరణ గడువు వరకు తాలిబన్లు చేసేదేమీ లేదన్నారు. ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని కొత్త ప్రభుత్వంలో చేర్చుకుంటామని తాలిబన్లు చెప్పినా మాటపై నిలబడతారన్న నమ్మకం ఎవరికీ లేదు. -
గ్రామ, వార్డు సచివాలయాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
సాక్షి, అమరావతి: డీజీపీ ఆదేశాల మేరకు డీఐజీలు, ఎస్పీలు ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అందిస్తున్న సేవలతో పాటు గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, వారి విద్యార్హతలు, వారు అందించే సేవలను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నుంచి స్వయంగా వివరాలను తెలుసుకున్నారు. సచివాలయాల పరిధిలో నివసించే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అర్హత కలిగిన వారికి అందేలా చేస్తున్న చర్యలను పరిశీలిస్తున్నారు. సచివాలయాల పరిధిలో నివసిస్తున్న మహిళల రక్షణకు, సైబర్ నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మహిళా పోలీసులు అధికారులకు వివరించారు. మహిళా పోలీసుల సేవలతో ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువయ్యేందుకు అవసరమైన చర్యలు, కార్యాచరణ చేపడతామని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారులు తెలిపారు. -
ఏపీ: అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ కొరడా
సాక్షి, అమరావతి: అనకాపల్లి ప్రాంతంలో బడా కంపెనీలు ఇష్టారాజ్యంగా చేస్తున్న అక్రమ తవ్వకాలపై మైనింగ్ విజిలెన్స్ విభాగం విరుచుకుపడింది. రాష్ట్రంలోని అన్ని విజిలెన్స్ బృందాలు అక్కడకు చేరుకుని మూడురోజులుగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ తనిఖీల్లో నవయుగ కన్స్ట్రక్షన్స్, మధుకాన్, వాణి గ్రానైట్స్ కంపెనీల అరాచకాలు బయటపడ్డాయి. ప్రస్తుతం 15 రోడ్ మెటల్ క్వారీల్లో తనిఖీలు జరుగుతున్నాయి. అందులో 10 నవయుగ కంపెనీవే. అనకాపల్లి మండలం ఊడేరు సర్వే నంబరు 211లో నవయుగ కంపెనీకి 10 క్వారీలున్నాయి. వీటికి సంబంధించి 35 హెక్టార్లలో తవ్వకాలు జరుపుతున్నారు. 2 జెయింట్ క్రషర్స్‌తో నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తవ్వుతున్నారని అధికారులు గుర్తించారు. ఎన్ని క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ తవ్వకానికి రాయల్టీ కట్టారు, ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారో లెక్కిస్తున్నారు. రాయల్టీ కట్టిన దానికంటె ఎక్కువగా పెద్దస్థాయిలో తవ్వినట్లు తేలింది. ఈ క్వారీల్లో ఇంకా అనేక ఉల్లంఘనలను నిర్ధారించారు. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కంపెనీకి అనకాపల్లి మండలం మార్టూరులో సర్వే నంబర్ 1లో ఉన్న 3 క్వారీల్లో అక్రమాలు గుర్తించారు. ఈ క్వారీల్లో 50 అడుగుల లోతువరకు నీళ్లు ఉండడంతో ఎంత మెటల్ తవ్వారో కొలవడం ఇబ్బందికరంగా మారింది. అనుమతి లేకుండా చాలాలోతు నుంచి పేలుళ్లు జరిపి తవ్వకాలు జరపడంతో భారీగోతులు ఏర్పడ్డాయి. ఇలాంటిచోట ఎంత మెటల్ తవ్వారో లెక్కించడానికి బ్యాటరీ మెట్రిక్ పరికరాన్ని తెప్పిస్తున్నారు. సాధారణంగా ఎలక్ట్రానిక్ ప్రాసెస్ స్టేషన్ (ఈపీఎస్) పరికరంతో తవ్వకాలను కొలుస్తారు. డీజీపీఎస్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. కానీ మధుకాన్ క్వారీల్లో వాటితో కొలతలు వేయడానికి వీల్లేని స్థాయిలో తవ్వకాలు జరపడంతో సముద్రంలో ఇసుక డ్రెడ్జింగ్ సమయంలో ఉపయోగించే బ్యాటరీ మెట్రిక్ పరికరాన్ని తెప్పిస్తున్నారు. అనకాపల్లి మండలం మామిడిపాలెం సర్వే నంబరు 109లో వాణి గ్రానైట్స్ తనకున్న రెండు క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ 15 క్వారీల్లో డ్రోన్ సర్వే కూడా చేయనున్నారు. మొత్తం 25 క్వారీలపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మొదట ఈ 15 క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. 2, 3 రోజుల్లో వీటిలో తనిఖీలు పూర్తిచేసి అక్రమాలను రికార్డు చేసి జరిమానా విధించనున్నారు. ఉల్లంఘనలు మరీ శృతిమించితే అనుమతుల రద్దుకు సిఫారసు చేసే అవకాశం ఉంది. రాజకీయ ఒత్తిళ్లు.. అధికారుల సహాయ నిరాకరణ వైఎస్సార్ కడప–చిత్తూరు, కర్నూలు–అనంతపురం, ప్రకాశం–నెల్లూరు–గుంటూరు, కృష్ణా–తూర్పు–పశ్చిమగోదావరి,విశాఖ–విజయనగరం–శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మైనింగ్ విజిలెన్స్ బృందాలు ఈ తనిఖీలు చేస్తున్నాయి. తనిఖీల్లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని వాటికి నేతృత్వం వహించిన మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. వారం, పదిరోజులు తనిఖీలు కొనసాగుతాయన్నారు. తనిఖీలు ఆపేందుకు ఆయా కంపెనీలు స్థానిక రాజకీయ నాయకుల నుంచి విజిలెన్స్ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. స్థానిక మైనింగ్ అధికారులు విజిలెన్స్ బృందాలకు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు సమాచారం. ఫైళ్లు ఇవ్వకపోవడంతోపాటు విజిలెన్స్ బృందాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయా కంపెనీల ప్రతినిధులకు చెబుతున్నట్లు తెలిసింది. అక్రమార్కులను వదలం గనుల్లో అక్రమ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. నిబంధనల ప్రకారమే తవ్వకాలు జరపాలి. ఉల్లంఘించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. ఉత్తరాంధ్రలో మైనింగ్ తవ్వకాలు చాలాచోట్ల ఇష్టారీతిన జరుగుతున్నాయి. విజిలెన్స్ బృందాల తనిఖీల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. అక్రమార్కులు అందరినీ బయటకులాగి చర్యలు తీసుకుంటాం. – వి.జి.వెంకటరెడ్డి, మైనింగ్ డైరెక్టర్ -
ఆకస్మిక తనిఖీలకొస్తా: సీఎం కేసీఆర్
►రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. పాజిటివిటీ రేటు 1.47 శాతానికి తగ్గింది. కరోనా పూర్తిగా తగ్గాక మరో విడత పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడతా. ►పల్లెలు, మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే–అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నట్టు నాకు సమాచారం ఉంది. వాటిపై చర్యలు తీసుకోవాలి. ►మున్సిపాలిటీల బడ్జెట్ తయారీలో కలెక్టర్లు భాగస్వాములు కావాలని కోరాం. వారు ఎలా భాగస్వాములవుతున్నారో పరిశీలిస్తున్నాం. ►పురపాలక శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్లు ఇకపై పట్టణాలు, గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రగతి తీరును పరిశీలించాలి. సాక్షి, హైదరాబాద్: పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్వయంగా ఆకస్మిక తనిఖీలను చేపడతానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలుస్తున్నా ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు. నిర్దేశిత బాధ్యతలను నిర్వర్తించడంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, అధికారులు ఎందుకు విఫలమవుతున్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. పల్లె/పట్టణ ప్రగతి అమలుపై శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ‘పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను నిత్యం కొనసాగించాలి. ఈ విషయంలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉద్యోగులు అలసత్వానికి తావివ్వకూడదు. మీకు పూర్తి సమయమివ్వాలనే నేను ఇన్ని రోజులు పర్యటన చేపట్టలేదు. రెండేళ్లు గడిచిపోయాయి. ఇక నేను రంగంలోకి దిగక తప్పదు. తాత్సారం, అలసత్వం, నిర్లక్ష్యం వహించినట్లు నా పర్యటనలో గుర్తిస్తే ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదు... క్షమించేదీ లేదు. కఠిన చర్యలు తీసుకుంటం’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అదనపు కలెక్టర్ల పనితీరు బాగోలేదు.. ‘అదనపు కలెక్టర్లు ఆశించిన రీతిలో సామర్థ్యాన్ని నిరూపించుకోవట్లేదు. వారి నుంచి చాలా ఆశించా’ అని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెలు, పట్టణాలను బాగు చేయడానికి నియమించిన అదనపు కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉండాలని ఆదేశించారు. డీపీవోలు, కింది స్థాయి ఉద్యోగులను ఆ దిశగా ఉత్సాహపరుస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షించేందుకు 13న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారు (డీపీవో)లతో ప్రగతి భవన్లో భేటీ కానున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందన్నారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత మరో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ప్రగతిపై చార్టులు పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిపై వేర్వేరు చార్టులను రూపొందించాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, మంచినీటి సరఫరా, బతికిన మొక్కల శాతం, గ్రామ సభల నిర్వహణ, స్థానిక ఎంపీవోల హాజరు, అందులో వారు గ్రామ ప్రగతికి తీసుకున్న చర్యలు, ఎన్నిసార్లు గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ ప్రగతి నివేదికలపై జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను చార్టుల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చెత్త సేకరణ, డంపు యార్డులు, వైకుంఠధామాల నిర్మాణ స్థితి, బోరు బావులు పూడ్చడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాక్టర్ల కిస్తులు కడుతున్న తీరు, కరెంటు బిల్లుల వసూలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు జీతాల చెల్లింపు, డ్రైనేజీలు, నాలాల క్లీనింగ్, శాకాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణం వంటి అంశాలను చార్టుల్లో చేర్చాలన్నారు. ఉత్తమ గ్రామాలు, మండలాలు, అధ్వానంగా ఉన్న గ్రామాలు, మండలాలను గుర్తించి వాటికి గల కారణాలను చార్టుల్లో పేర్కొనాలని ఆదేశించారు. మంచి చెడులను రెండింటిని ప్రాతిపదికగా తీసుకుని చార్టును తయారు చేసి, ఆకస్మిక తనిఖీల్లో తనకు అందచేయాలని సీఎస్‌ను ఆదేశించారు. పురపాలక శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్లు ఇకపై పట్టణాలు, గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రగతి తీరును పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీపీవోలు కూడా పల్లె పర్యటనలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చార్టులు.. గ్రామాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు సీజన్లవారీగా తీసుకోవాల్సిన చర్యలతో చార్ట్ తయారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ‘వానాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు, చలికాలంలో స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు, ఎండాకాలంలో డయేరియా వంటి వ్యాధులు వస్తుంటయి. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులను అరికట్టడం చాలా కీలకం. ఇందుకు పంచాయితీరాజ్, మున్సిపల్, వైద్యశాఖలు సమన్వయంతో పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. వానాకాలం నేపథ్యంలో తాగునీటి సరఫరా ట్యాంకులను శుద్ధి చేయాలని సూచించారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు ... పల్లెలు, మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే–అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నట్టు తనకు సమాచారం వుందని, వాటిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీల బడ్జెట్ రూపకల్పనలో కలెక్టర్లు భాగస్వాములు కావాలని కోరామని, ఏ మేరకు అవుతున్నారని ఆరా తీశారు. చదవండి: మొక్కలు ఎందుకు ఎండిపోయాయ్.. కొత్తవి నాటండి: కేసీఆర్ -
ప్రైవేట్ ఆసుపత్రులు: రెండోసారి తప్పు చేస్తే క్రిమిన్ కేసులు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో టాస్క్‌ఫోర్స్ విస్తృత తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని 35 ఆస్పత్రులకు రూ.2.86 కోట్ల జరిమానా విధించారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 55 ఆస్పత్రులకు రూ.3.61 కోట్ల జరిమానా విధించారు. రెండోసారి కూడా తప్పు చేస్తే క్రిమిన్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. ఏ ఆసుపత్రిలోనైనా 50 శాతం బెడ్లు ప్రభుత్వం నిర్ధేశించిన కేటగిరీలో భర్తీ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియ కోసం 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సమాచారాన్ని అందివ్వాలన్నారు. నోడల్ అధికారులు, ఆసుపత్రి పర్యవేక్షుకులదే పూర్తి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. చదవండి: జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! -
ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్
గుంటూరు ఎడ్యుకేషన్: ‘విద్యార్థుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ.. కనీస వసతులు కూడా కల్పించరా’ అంటూ నారాయణ జూనియర్ కాలేజీపై ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరు శివారులోని పెదపలకలూరులో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీ హాస్టల్ క్యాంపస్‌లో కమిషన్ సభ్యులు వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్, బి.ఈశ్వరయ్య ఆకస్మిక తనిఖీలు చేశారు. క్యాంపస్‌లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిచెన్‌లో టమోటాలు, క్యాబేజీ సహా కుళ్లిన కూరగాయలను అలాగే ఉంచడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు వసూలు చేస్తూ.. విద్యార్థులకు పరిశుభ్రతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని కూడా అందించలేరా? అని ప్రశ్నించారు. మీ ఇంట్లో పిల్లలను ఇలాగే చూస్తారా అంటూ సిబ్బందిని నిలదీశారు. తమ పిల్లలకు సరైన సదుపాయాలను కల్పించడం లేదని, దీనిపై ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఈ సందర్భంగా వాపోయారు. కమిషన్ సభ్యులు స్పందిస్తూ.. కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లలను చేర్చవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమకు ఆటవిడుపు కూడా లేకుండా తరగతులకే పరిమితం చేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ‘విద్యార్థులకు వారంలో ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వరా? ఏడు రోజుల పాటు ఉదయం 7 నుంచి రాత్రి 9.30 వరకు తరగతులు నిర్వహిస్తారా!’ అంటూ కమిషన్ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ఐవో కార్యాలయంలో కమిషన్ సభ్యులు నారాయణరెడ్డి, ప్రసాద్, ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. నారాయణ కాలేజీ యాజమాన్యానికి నోటీసు జారీ చేస్తామని చెప్పారు. యాజమాన్యం సరైన రీతిలో స్పందించకపోతే.. కాలేజీని మూసివేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. కాగా, ఇప్పటి వరకు 40 కాలేజీలకు నోటీసులు జారీ చేశామన్నారు. జూనియర్ కాలేజీల నిర్వహణను ఇంటర్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. ఆర్ఐవో రామచంద్రరావు పనితీరు సరిగాలేదన్నారు. చదవండి: నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ -
అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
సాక్షి, విజయవాడ: మూడు రోజులుగా కార్పొరేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు తెలిపారు. ఇప్పటివరకు 360 విద్యాసంస్థలు తనిఖీ చేశామని.. 50 కాలేజీలు, 25 స్కూళ్లపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేశామని పేర్కొన్నారు. ‘‘ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. గతేడాది ట్యూషన్ ఫీజులో 30 శాతం తగ్గించి మాత్రమే ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: వింత వ్యాధిపై సీఎం జగన్ సమీక్ష) ప్రభుత్వాదేశాలను కొన్ని కార్పొరేట్ కాలేజీలు పట్టించుకోలేదు. కనీస సౌకర్యాలు కూడా లేకుండా అధిక ఫీజులు వసూలు చేశారు.అధిక ఫీజు వసూలు చేసిన కాలేజీలు తిరిగి డబ్బును విద్యార్థులకు ఇచ్చేయాలి. అలా చేస్తే చర్యలు తీసుకోకుండా ఆలోచిస్తామని’’ ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తే 91502 81111 కాల్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అధిక ఫీజుల వసూలుపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంతారావు హెచ్చరించారు. చదవండి: కదిలిన సంక్షేమ రథ చక్రాలు -
మావోయిస్టుల బంద్‌తో అప్రమత్తం
సాక్షి, మంచిర్యాల: బూటకపు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానిత ప్రాంతాల్లో విçస్తృతంగా తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని రోజులుగా దళ సభ్యులు సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్న అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరంలో డ్రోన్ కెమెరాలతో నిఘా వేశారు. మరోవైపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ.. ప్రతీకార చర్యలు తప్పవని కుమురంభీం మంచిర్యాల జిల్లా కమిటీ కార్యదర్శి భాస్కర్ పేరుతో ప్రకటన విడుదల కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నెల 19న కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకుముందు పలుమార్లు దళ సభ్యులు పోలీసులకు ఎదురుపడ్డారు. ఆ సమయంలో మావోయిస్టులు వదిలిపెట్టిపోయిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ఇర్నార్–పెదపాల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలకు తారసపడిన మావోలు కాల్పులు జరపగా.. సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఒక మావోయిస్టు మృతి చెందాడు. -
పెండింగ్ అంటే గిట్టదు!
వరంగల్ అర్బన్ : పెండింగ్ అంటే తనకు ఏ మాత్రం గిట్టదని.. నిబంధనల మేరకు పైళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిందేనని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో శనివారం ఆమె టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యా రు. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన భవన నిర్మాణాలు, ఫైళ్లు, అపార్టుమెంట్లు, ల్యాండ్ యూసేజ్, మార్టిగేజ్, అడ్వర్టజ్మెంట్ ఫీజుల తదితర అంశాలపై ఇన్చార్జ్ సీపీ నర్సింహ రా ములు, ఏసీపీలు గణపతి, ప్రకాశ్‌రెడ్డితో ఆరా తీశారు. పైళ్ల పరిష్కారానికి ఆన్లైన్ ఉపయోగిస్తున్నందున జాప్యం ఉండకూడదన్నారు. ప్రకటన బోర్డుల ఏర్పాటులో కఠినంగా వ్యవహరించాలని, అనధికార భవనాల వివరాలను డివిజ న్ల వారీగా అందచేయాలన్నారు. ఏసీపీ సాంబయ్య, టీపీఎస్ బషీర్, టీపీబీఓలు పాల్గొన్నారు. తనిఖీలతో హల్చల్! కమిషనర్ పమేల సత్పతి తనిఖీలతో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా శనివారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుధ్ధ్యం పనులెలా సాగుతున్నాయి.. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ తీరుపై ఆరా తీశారు. గ్రేటర్ పరిధిలోని 40, 43 డివిజన్లలో పర్యటన సందర్భంగా ఇళ్ల ఎదుట, రోడ్ల మీద చెత్త ఉండడంతో స్థానికులను మందలించారు. అలాగే, డ్రెయినేజీలు, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకపోవడంపై శానిటరీ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, నరేందర్‌ను కమిషనర్ మందలించారు. ఆర్అండ్బీ భవనంలో మద్యం ఖాళీ బాటిళ్లు, చెత్త చెదారం ఉండడాన్ని గుర్తించిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్ మిర్యాలాకర్ దేవేందర్ కమిషనర్ తనిఖీ చోటకు చేరుకొని పలుసమస్యలను వివరించారు. దీంతో శిథిలావస్థకు చేరిన చోట నూతన డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈ సారంగంను కమిషనర్‌ను ఆదేశించారు. ఇక వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని షీ–టాయిలెట్‌ను కమిషనర్ పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, ఫాతిమా నగర్లో పబ్లిక్ టాయిలెట్‌ను పరిశీలించారు. వడ్డేపల్లి బండ్ తనిఖీ సందర్భంగా పిచ్చిమొక్కలు పెరగడాన్ని గుర్తించిన కమిషనర్ సీహెచ్ఓ సునీతను ప్రశ్నించారు. తాను సెలవులో ఉన్నానని చెప్పగా.. మరొకరికి బాధ్యతలు అప్పగించాలే తప్ప పనులు పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. డీఈలు సంతోష్‌కుమార్, రవికిరణ్ పాల్గొన్నారు. -
ఇలా అయితే రోగులు ఎందుకు వస్తారు?
సోంపేట: ఆస్పత్రి విధుల్లో సమయపాలన పాటించకపోతే రోగులు ఎందుకు వస్తారని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని బారువ సామాజిక ఆస్పత్రి సిబ్బందిని కలెక్టర్ జె.నివాస్ హెచ్చరించారు. ఆయన మంగళవారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, నిర్వహ ణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గదులు శిథిలావస్థలో ఉండడం, కనీస పరిశుభ్రత పాటించకపోవడంపై సూపరింటెండెంట్ బాలకృష్ణను ప్రశ్నించారు. రెండు రోజుల్లోగా పరిశుభ్రం చేసి, ఫొటోలు కలెక్టరేట్‌కు పంపించాలని ఆదేశించారు. నెలకు నాలుగే ప్రసవాలా..? ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు బారువ ఆస్పత్రిలో 23 ప్రసవాలు మాత్రమే జరగడంపై కలెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడి రోగులు పలాస, సోంపేట ఎందుకు వెళ్తున్నారని అడిగారు. నెలకు నాలుగే ప్రసవాలా అని ప్రశ్నిస్తూ వచ్చే నెల నుంచి సంఖ్య పెరగకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలో మరుగుదొడ్డి, వాషింగ్ మెషీన్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి వచ్చేటప్పటికీ ఈ సమస్యలు ఉండకూడదని వైద్యాధికారికి తెలిపారు. మందులు అందుతున్నాయా..? తనిఖీ సందర్భంగా రోగులతో కలెక్టర్ మాట్లా డారు. కనకయ్య అనే రోగితో మాట్లాడుతూ మందులు సక్రమంగా వేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని ప్రభుత్వ నిధులతో అంబులెన్స్ ద్వారా శ్రీకాకుళం తరలించి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. సమయపాలన తప్పనిసరి అనంతరం ఆయన వైద్య సిబ్బంది హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించి నివ్వెరపోయారు. అందరూ విధులకు గంట ఆలస్యంగా రావడంపై ప్రశ్నించారు. రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు ఇక్కడ ఉండరని, వేరే ఆస్పత్రికి వెళ్తారని సిబ్బంది కలెక్టర్‌తో చెప్పారు. ఎంఎల్ఓ సింహాద్రి బెహరా, వైద్య మిత్ర ఆనంద్ పాణిగ్రహి ఇద్దరే సమయపాలన పాటించడంతో వారిని అభినందించారు. ఆర్డీవో ఐ.కిశోర్ బాబు, తహసీల్దార్ ఎం.రవి జోసెఫ్, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ హాస్నైన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
15 గ్రాముల పాప్‌కార్న్ తక్కువ.. రూ.10వేల జరిమానా
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని స్వర్ణ కళామందిర్(సినిమా థియేటర్)లో తూనికలు, కొలతల శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. థియేటర్ క్యాంటీన్లో 60 గ్రాముల పాప్‌కార్న్‌ను రూ.40తో అమ్ముతుండగా.. తక్కువగా వస్తోందని ప్రేక్షకులు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో తనిఖీలు చేసి.. క్యాంటిన్ యజమానిపై కేసు నమోదు చేశారు. 60 గ్రాముల పాప్‌కార్న్‌లో 15 గ్రాములు తక్కువగా వస్తోందని గుర్తించి రూ.10వేల జరిమానా విధించినట్లు అధికారి తెలిపారు. నిర్దేశిత ధరల కంటే అదనంగా అమ్మినా, తూకంలో మోసం చేసినా కఠిన చర్యలు ఉంటాయని విజయ్ కుమార్ హెచ్చరించారు. -
పెట్రోల్ బంకుల్లో కల్తీ దందా
సాక్షి, వరంగల్ : పెట్రోల్ బంకుల యజమానులు చాలాచోట్ల వాహనదారులను నిలువునా దోచేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా పలు బంకుల్లో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. కుదిరితే కొలతల్లో కోత పెట్టి ఇంధనాన్ని కాజేయడం.. లేదంటే కల్తీకి పాల్పడుతూ వినియోగదారుల జేబుకు చిల్లులు పెడుతున్నారు. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరల భారంతో నలిగిపోతున్న వినియోగదారులను పెట్రోల్ బంకుల నిర్వాకం మరింత కుంగదీస్తోంది. వాహనదారుడి కళ్లముందే ఏళ్లుగా మాయాజాలం జరుగుతుండగా కళ్లు మూసుకున్న యంత్రాంగం... ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉరుకుల పరుగుల మీద ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టాయి. పెట్రోల్ బంకులపై ఇవే ఫిర్యాదులు చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొలత పూర్తి కాకుండానే పంపు ఆపేయడం, వేగంగా ట్యాంకు నింపడం.. అదే సమయంలో కొలతను సూచించే ఎలక్ట్రానిక్ మెషిన్‌పై చేయి అడ్డుపెట్టడం వంటి మోసాలకు సిబ్బంది పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదేమిటనీ ప్రశ్నిస్తే బంకు సిబ్బంది ఎలక్ట్రానిక్ యంత్రాలతో మోసాలకు తావులేదంటూ సర్దిపుచ్చడమే గాక వాహనదారులతో ఎదురు గొడవకు దిగుతున్నారు. చిల్లర డబ్బులతో పాటు ఇంధనాన్ని కాజేస్తూ, నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారన్న ఫిర్యాదులు కూడాన్నాయి.. లీటర్ పెట్రోల్, డీజిల్‌లో 30 నుంచి 50 మి.లీ. మేర కోత పెట్టడంతో పాటు కిరోసిన్, నీళ్లు కలుపుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలు బంకులపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో వినియోగదారులు తమ వాహనాలకు మరమ్మతులు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా, పెట్రోల్‌బంకుల్లో వసతుల విషయానికోస్తే అన్నీ గాలికొదిలేశారు. ఆయిల్ కంపెనీల అధికారులు పట్టించుకోకపోవడం.. తూనికలు కొలతల శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందునే సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయని వాహనచోదకులు విమర్శిస్తున్నారు. బంకుల్లో ఉచిత గాలియంత్రం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, తాగునీరు ఇలాంటివేమీ కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. నామమాత్రంగా ప్రతేక్య బృందాల తనిఖీలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో హెచ్పీసీ, బీపీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్తాన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర కంపెనీలకు చెందిన 267 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు సాగుతున్నాయి. అయితే కొన్ని పెట్రోల్ బంకుల్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఫిర్యాదులు ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్న ఫిర్యాదులు సంబం«ధిత శాఖల అధికారులపై ఉన్నాయి. నామమాత్రంగా తనిఖీ ముగించి రికార్డులు సృష్టించుకోవడం.. శాంపిళ్లు సేకరించడం తప్ప కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలే కానరావడం లేదు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బంకుల్లో జరుగుతున్న కల్తీ, తూకంలో మోసాలను అరికట్టేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులతో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్త బృందాలుగా ఏర్పడి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అయితే, ఈ సమయంలో రాజకీయ పలుకుబడి, నేపథ్యం ఉన్న వారి బంకుల జోలికి వెళ్లకుండా కొన్ని పెట్రోల్బంకుల్లోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి శాంపిళ్లను సేకరించారు. ఈ సందర్భంగా మొత్తం 267 బంకులకు 55 బంకుల్లో తనిఖీ చేసిన అధికారులు 23 బంకుల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని నిర్ధారించి చర్యలకు ప్రతిపాదించారు. కాగా, ఈ విషయమై పౌరసరఫరాల శాఖ వరంగల్ అర్బన్ జిల్లా ఇన్చార్జ్ అధికారితో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తనిఖీలు నిర్వహించాం.. కల్తీ జరిగితే కఠిన చర్యలు వరంగల్ అర్బన్ జిల్లాలోని పెట్రోల్‌బంకుల్లో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నేతృత్వాన ప్రత్యేక తనిఖీలు నిర్వహించాం. తూనికలు – కొలతల శాఖతో పాటు పౌరసరఫరాల శాఖ, ఆయా బంకులకు సంబంధించిన కంపెనీల ప్రతినిధులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రతీ విషయాన్ని పరిశీలించి తేడాలు ఉన్న చోట ఆయా శాఖల అధికారులు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పెట్రోల్ బంక్‌ల్లో అసౌకర్యాలు, కల్తీలను ఉపేక్షించేది లేదు. – అనిల్‌కుమార్, లీగల్ మెట్రాలజీ అధికారి, వరంగల్ అర్బన్ జిల్లా -
రూ. 20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు సమీపంలో ఉన్న రాగామాకుల కుంట వద్ద మంగళవారం ఉదయం టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక స్మగ్లర్ పట్టుబడ్డాడు. ఆధికారులు అతన్ని అరెస్టు చేసి సుమారు రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ స్మగ్లర్ తమిళనాడు రాష్ట్రంలోని జమునామత్తూరుకు చెందిన స్వామినాథన్‌గా గుర్తించారు. కాగా ఎర్రచందనం కూలీలు తనిఖీ చేసే టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో అధికారులు రాళ్లదాడిని ప్రతిఘటించి కుంబింగ్ కొనసాగిస్తున్నారని సమాచారం. -
తోక చుక్క
ఆటో దిగి ఎదురుగా హాస్పిటల్ వైపు చూశాను. పల్లెటూర్లో ఇంత హాస్పిటల్ ఊహించడం కష్టమే. మూడు అంతస్తుల్లో బాగా కట్టారు. లోపల రిసిప్షన్. పక్కనే ఓ.పి పేషంట్స్ కోసం కొన్ని కుర్చీల వరుసలు. మనుషులు పెద్దగా లేరు. నిజంగా ఇది మంచి హాస్పిటలేనా? లేకుంటే డాక్టర్ ఇక్కడకు ఎలా రికమండ్ చేస్తుంది? అసలు మామగారు దీని బిల్ కట్టగలరా? మనసులో ఏదో దిగులు! భయం! లోపల ఏదో కుంగుబాటు. చటుక్కున కూర్చున్నాను. పెళ్లయిన పదేళ్ల తరువాత ఇంటికి వస్తున్న చిన్నారి సంతానం. ఇలా ఇంత టెన్షన్‌కు గురిచేస్తుందనుకోలేదు.పెళ్లయి ఒక్కో ఏడాది గడుస్తూ ఉండేకొద్దీ మొదలయ్యాయి ఆరాలు! సంతానం లేదనగానే బోలెడు సలహాలు, డాక్టర్ల చిరునామాలు. తిరుగుడే తిరుగుడు. చివరికి నాన్న కూడా ‘అసలు నువ్వు సంసారం చేస్తున్నావురా?’ అనగానే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీని పరిస్థితి. చేయని తప్పుకి సమాజంలో శిక్ష అనుభవిస్తున్న మాకు దేవుడు ఇస్తున్న వరం ఇది. ఆ చిట్టి తల్లికి ఏమైనా అయితే!! ఊహించుకోవడానికే భయమేసింది. అవునూ.. మహితకి ఎలా ఉందో! ఎప్పుడూ పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచన. ఇంత బాధ లోపల పడుతూ ఉంటుంది. తన ప్రాణం కదా నిజానికి ముఖ్యమైనది. ఛ! ఆ ఇన్స్పెక్షన్ లేకుంటే ఇప్పుడు భార్యను వదిలి వెళ్లి ఉండేవాడు కాదు. అయినా ఇలా వెంటనే కాంప్లికేటెడ్ అవుతుందని ఎవరైనా అనుకున్నారా! ఇంకా డెలివరీకి రోజులు ఉన్నాయి కదా.తల్లి, బిడ్డ ఎలా ఉంటారో! రెండు కొండలను గుండెలపై అదుముతున్నంత టెన్షన్! ముందు రిసెప్షన్లో అడిగి ఆలస్యం చేయకుండా మహిత దగ్గరకు వెళ్ళాలి. కుర్చీ నుండి లేస్తూ ఎదురుగా గోడపై ఫోటో చూశాను. ఫోటో కింద డాక్టర్ దివ్య అంజలి. పక్కన డిగ్రీలు. ఏదో చల్లదనం ఆ నవ్వులో. బాధ తగ్గిపోయినట్లు అనిపించింది. ఇంత పెద్ద హాస్పిటల్‌కి ఈమె ఓనర్. చిన్న వయసులాగే ఉంది. ఇంత హాస్పిటల్ అంటే చాలా ఆస్తి ఉండి ఉంటుంది. అయినా బాగా సంపాదిస్తూ ఉంటారు. లేకుంటే ఇంత హాస్పిటల్ ఇంత ఎక్విప్మెంట్తో నడపడం సాధ్యం కాదు.ఉన్నట్లుండి ఆలోచన, ఇంత ఫీజ్ మావయ్య మాత్రం ఎలా కడతాడు? పోనీ నా ఇల్లయినా అమ్మేస్తాను. మహిత కంటే, బేబీ కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. దూరంగా లోపల నుండి మావయ్య కనిపించాడు. ఒక్క పరుగున చేరాడు. మాట్లాడుతూ ఉంటే వారించాను. ‘ఇక్కడే ఉండండి.రిసిప్షన్లో ఒక సంతకం చేసి వస్తాను.’ అంటూ లేచి కిటికీ లోపల నుండి బయటకు చూశా. దూరంగా గ్యారేజ్‌లో రెండు చక్కటి కార్లు. కార్ల గురించి తెలీకపోయినా ఆకర్షిస్తూ ఉన్నాయి. అలాగే చూస్తూ ఉంటే, ‘మేడమ్‌కి కార్లంటే చాలా ఇష్టం. ఏ కొత్తవి వచ్చినా పాతవి మార్చేస్తారు,’ మాటలు వినబడి పక్కకు చూశా. నవ్వుతూ చెప్తోంది సిస్టర్. ఇక్కడ అందరిలోనూ ఏదో ప్రత్యేకత! ‘మరి మేడమ్ హజ్బెండ్?’ ఫోటోలో చూసిన శ్రీమతి విశేషణాన్ని గుర్తుచేసుకుంటూ అడిగా. ‘లేడు,’ సమాధానం ఇందాకటంత సున్నితంగా లేదు. ‘చనిపోయారా?’‘కాదు.’ ఇక మాట్లాడటం ఇష్టం లేనట్లు వెళ్ళిపోయింది. ‘ఈవిడే వదిలేసిందిలే!’ వెనక్కి చూస్తే ఒక పెద్దావిడ. మాటలు కొనసాగించింది. ‘ఈవిడే వదిలేసింది. ఈమె స్వేచ్ఛకి అడ్డుగా ఉంటాడని. ఈవిడ ఇష్టం వచ్చినట్టు ఇష్టమయిన వారితో టూర్లు తిరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి గోవా, ఒక్కోసారి హృషికేష్,ఎక్కడికిబడితే అక్కడికి. ఎవరితో పోతుందో! ఎందుకు పోతుందో! అడిగేవారు ఎవరు? హాస్పిటల్‌కి కూడా ఇష్టమొచ్చినట్టు వస్తుంది. కేస్ కష్టం అయితేనే వస్తుంది. మొగుడి పెత్తనం లేకుంటే ఆడది ఇలాగే ఉంటుంది. ఏం చేస్తాం.. ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయని డాక్టర్స్ ఇక్కడికి పంపుతారు కేసులు.’ నిజమే మేం కూడా అలాగే వచ్చాం. ఆవిడ చెప్పిన చెత్త విషయాలతో డాక్టర్ మీద గౌరవం పోయింది. ఇక్కడ బాగా చూస్తారు అన్న మాట ధైర్యం ఇచ్చింది. ఇలాంటి హాస్పిటల్లో మహిత, పాప ఉండకూడదు.పుట్టగానే తీసుకెళ్లిపోవాలి. ఇటుగా వస్తున్న మావయ్యకు ఎదురెళ్లా. ‘మావయ్యా! ఫీజ్ గురించి బాధపడకండి. నా ఇల్లు అమ్మేస్తాను.’ అన్నా. నవ్వాడు మావయ్య. ‘అవసరం లేదులేండి అల్లుడుగారు.. ఇక్కడ జీవనదానం పథకం ఉంది. దానిలో మన పేరు వ్రాసారు.’ నా మొహంలో ప్రశ్నార్థకం చూసి, ‘ఎవరైనా డబ్బు ఉన్నవారికి ఇక్కడ పిల్లలు పుడితే వారు ఇంకో ఇద్దరు లేదా ముగ్గురు శిశువుల జననానికి డొనేషన్ ఇస్తారు. మన ఫీజ్ అందులో మినహాయించు కుంటున్నారు. సంతకం పెట్టేసాను. అమ్మాయిని ఆపరేషన్‌కి తీసుకెళ్తారు పదండి.’ అన్నాడు. పరుగులాంటి నడకతో మావయ్య వెనుకే వెళ్లాను. థియేటర్లోకి వెళుతూ మహిత నా వేపు చూసింది. తల చిన్నగా ఊపింది ‘బాగున్నాను’ అన్నట్లు. సిస్టర్ తెచ్చిన షీట్లో ఆపరేషన్‌కి అంగీకారం తెలుపుతూ సంతకం పెట్టాను. కొన్ని నిముషాలు గడిచాయో లేదో సిస్టర్స్ కంగారుపడుతూ బయటకు వచ్చి హెడ్‌తో ఏదో చెబుతున్నారు. ఆమె తలూపుతూ ఆలోచిస్తోంది. భయంగా ‘ఏమైంది?’ అని అడిగాను. ఏమీ చెప్పడం లేదు ఎవ్వరూ. ‘లేదు. పెద్ద డాక్టర్ రావాల్సి వచ్చేట్లు ఉంది. ఇది తనకు రిలాక్సింగ్ టైమ్.’ ఆలోచిస్తూ అంది. డాక్టర్స్‌కు రిలాక్స్ ఏమిటి? అసలు ఆమె మనిషేనా? కోపమొచ్చింది.‘బ్లడ్ ఎన్ని పాకెట్స్ ఉన్నాయి?’ అన్న మాటకు ఉలిక్కిపడి వెనక్కి చూశామంతా. వెనుక పెద్ద డాక్టర్! దివ్య అంజలి. ప్రసన్నంగా ఉంది. ఇంత టెన్షన్లో ఆమె అలా ఉండటం నాకు విసుగనిపించింది! ఎందుకు టెన్షన్ పడదు ఈవిడ! మనుషుల ప్రాణాలంటే చులకన కాబోలు!లోపలికి వెళుతూ.. ‘ఇంకో బ్లడ్ పాకెట్ రెడీ చేయండి,’ అనేసి వెళ్ళిపోయింది.‘దొరికిందా?’ అడిగాను లోపలికి వెళుతున్న సిస్టర్ని. ‘లేదు. మీ ఆవిడ గ్రూప్ రేర్. ఉన్నవి సరిపోతే ఫర్వాలేదు. లేకుంటే ఏం చేస్తారో మేడమ్..’ అంటూ వెళ్ళిపోయింది. థియేటర్ దగ్గర హడావుడి. లోపలికి పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఒకటే హడావుడి. ఎవరికి ప్రమాదం? పెద్ద ప్రాణానికా? చిన్న ప్రాణానికా? పదేళ్ల తరువాత తన రూపంగా వస్తున్న పసిగుడ్డు. పక్కకు చూశాను. తలవేలాడేసి మావయ్య కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. పక్కన వాళ్ళ పెద్దక్క. దిగులుగా చూస్తూ పైకి చేతులు మొక్కుతూ ఉంది. ఈ వయసులో ఆయనకు మహిత దూరం అయితే! అవును అసలు మహిత లేకుండా నేనుండగలనా? ఒక్కక్షణం గుండె పట్టేసినట్లుగా ఉంది. లేదు మహితే కావాలి. అడిగితే ఇదే చెప్పాలి. లోపల నుండి ‘పాప,’ అని నవ్వుతూ చేతిలో బేబీని పెట్టింది సిస్టర్. కలా? నిజమా?నా చేతిలో బిడ్డ మీద దృష్టి లేదు. ‘మహితకు ఎలా ఉంది?’ అని అడిగాను. ‘తను బాగానే ఉంది. ఇంకో అరగంటలో మీరు చూడవచ్చు,’ అంది. నాకు ఇదంతా కలగా ఉంది.. మీద పడుతుందనుకున్న ఆకాశం వీపు చల్లగా నిమిరినట్లు. మెల్లిగా నా చేతుల్లోకి చూశాను. చిన్ని వేళ్ళను విప్పుతూ నన్నే కళ్ళు విప్పి చూస్తూ ఉంది. నమ్మలేకపోతున్నాను. ‘అదిగో నాన్న ముక్కే,’ పక్కనే ఉన్న పిన్నిగారి గొంతు. ‘ఏదో ఒకటి.. ఇద్దరూ బాగున్నారు చాలు!’ మావయ్య గొంతులో ఆనందం. ఏదో కలలాగే ఉంది. నిజానికి దుఃఖాన్ని ఎన్నో విధాలుగా కొలుస్తుంటాము కానీ ఆనందాన్ని కొలవలేం, ఊహించలేం. అనుభవించాల్సిందే! మెల్లిగా ఆ చిన్నారి చేయి నిమిరాను. అది నాదే. అచ్చంగా నాకోసం దేవుడు పంపిన వరం. నాదంటే నాదే. ఎలా ఉబికాయో కళ్ళ నుండి నాకే తెలీకుండా, పిల్లను తాకి హాయ్ చెబుతున్నాయి నా కన్నీళ్లు. ‘చెప్పండి సిస్టర్.. ఇంత ఆనందాన్ని ఇచ్చిన మీకు ఏమి ఇవ్వాలి?’ అడిగాను. నవ్వింది. ఇక్కడ ప్రతి మొహంలో ఏదో ప్రత్యేకత! ‘నాకు కాదు.. పెద్ద మేడంగారికి చెప్పండి. తను ఇప్పుడే రెండు ఆపరేషన్స్ చేసి వెళ్లినా మీకోసం మళ్ళీ వచ్చింది. ఇంకా తన బ్లడ్ కూడా ఇచ్చింది.’ అంది సిస్టర్. నిజంగా ఆమె అంత మంచిదా? నమ్మబుద్ధి కావడంలేదు. ‘మరి భర్తను ఎందుకు వదిలేసింది?’ తెలీని కుతూహలం. మౌనంగా ఉంది. ‘మనుషుల ప్రాణాలు వ్యాపారం చేయాలి అనుకునేవాళ్లు మేడమ్‌కి నచ్చరు.’ అంది కాసేపటికి. ‘పోనీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా!’ నా అజ్ఞానికి నాకే జాలేసినా అడిగాను. ‘వ్యక్తిత్వం నిర్మించుకుంటూ ఎదిగే వాళ్లకి మగవాళ్ల తోడు అవసరం లేదు. జ్ఞానాన్ని పంచుకునే మనిషి తోడు తప్ప. మేడమ్‌కి అలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మేడమ్‌కి జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసు. తన జీవితాన్ని పక్కవారికి ఎలా ఉపయోగించాలో తెలుసు!’ఒక్కసారి నాలోని ఆలోచనలు అన్నీ అవమానంతో తలదించుకున్నాయి. ఇప్పుడు అర్థమయింది.. అక్కడ ఉన్నవాళ్లలోని ప్రత్యేకత ఏమిటో! బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తూ సమాజానికి ఉపయోగపడే వారిలో ఉండే ఆత్మవిశ్వాసం. ‘నా మనవరాలికి దివ్య అని పేరుపెట్టుకుంటాము తల్లి. అంతే కాదు.. నేను నామకరణం చేసే ఆడపిల్లలకి దేవుని పేరు కంటే ముందు దివ్య అని పేరు పెట్టమని అడుగుతాను. ఇక ఆడపిల్ల ఎలా జీవించాలో వారికి నేర్పాల్సిన అవసరం ఉండదు.’ చేతులు జోడించి చెప్పాడు మావయ్య. నేను డాక్టర్ ఫొటో వైపు చూసి చేతులు జోడించాను. ఇప్పుడు అక్కడ నాకు ఒక తోకచుక్క కనిపిస్తూ ఉంది. అది మెరుస్తూ తన కక్ష్యలో తాను వెళుతూ ఉండే చుక్క. వెనుక ధూళి మీద మెరిసే వెలుతురు బట్టి మనమే తోకను ఊహించుకుంటాము. అరిష్టం అనుకుంటాము. నిజానికి దానిలోని జీవమే, భూమిమీద తొలి జీవంలో ఉందని శాస్త్రవేత్తలు చెబితే అది మన పుట్టుకకు దేవత కానీ అరిష్టం ఎప్పటికీ కాదు. చెడు అంతా మన చూపులోదే! నా నమస్కారాలు పట్టించుకోనట్లు ఆ ఫొటోలో దేవత నవ్వుతూనే ఉంది. - వాయుగుండ్ల శశికళ -
1.4 కోట్ల మందిపై నిఘా!
వాషింగ్టన్: నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లాలనుకునేవారు దరఖాస్తు సమయంలో గత ఐదేళ్ల సోషల్ మీడియా, ఫోన్, ఈ మెయిల్ వివరాలు వెల్లడించాలన్న ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం ఏడాదికి దాదాపు 1.47 కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. టూరిజం, వైద్య చికిత్స, వ్యాపారం కోసం జారీచేసే వీసాలు, హెచ్–1బీ, స్టూడెంట్ వీసాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. అమెరికా విదేశాంగ శాఖ రూపొందిస్తున్న కొత్త నియమావళి ప్రకారం వీరంతా తమ వ్యక్తిగత వివరాల్ని అమెరికాకు బహిర్గతం చేయడం తప్పనిసరి. సోషల్ మీడియా వివరాలు, పాస్‌పోర్ట్ నంబర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లు, విదేశీ ప్రయాణాల వివరాలూ చెప్పాలి.ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసేవారిని సోషల్ మీడియా వివరాల్ని అడుగుతామని, ఈ నిర్ణయం ఏడాదికి 7 లక్షలపై ప్రభావం చూపనుందని గత సెప్టెంబర్‌లో అమెరికా వెల్లడించింది. అయితే ఆ ప్రతిపాదనను మరింత విస్తరించి 1.4 కోట్ల నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు వర్తింపచేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం దరఖాస్తుదారుడు మొత్తం 20 సోషల్ మీడియా ఫ్లాట్‌పాంల ఖాతాల వివరాలు తెలపాలి. వాటిలో అమెరికా నుంచి నడుస్తున్న ఫేస్బుక్, ఫ్లికర్, గూగుల్ ప్లస్, ఇన్‌స్ట్రాగాం, లింక్డిన్, మై స్పేస్, పింట్రెస్ట్, రెడిట్, టంబ్లర్, ట్విటర్, వైన్, యూట్యూబ్‌లు ఉండగా.. చైనా సైట్లు డౌబన్, క్యూక్యూ, సైనా వైబో, టెన్సెంట్ వైబో, యుకు, రష్యా సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వీకే, ట్వూలు ఉన్నాయి. క్షుణ్నంగా తనిఖీలు.. క్షుణ్నంగా తనిఖీ చేశాకే అమెరికాలోకి అనుమతిస్తామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ పగ్గాలు చేపట్టాక.. గతేడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా అన్ని కాన్సులేట్ కార్యాలయాల్లో దరఖాస్తుల తనిఖీని మరింత కట్టుదిట్టం చేయాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. ఇప్పుడు వ్యాపార అవసరాలతో పాటు టూరిస్ట్ పర్యటనకు అమెరికా వెళ్లాలనుకునే వారికి కూడా ఈ తనిఖీల్ని కట్టుదిట్టం చేయనున్నారు. ఈ నిర్ణయం భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికోలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వీసా లేకుండా అమెరికాలోకి ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న 40 దేశాలపై ఈ నిబంధనలు ఎలాంటి ప్రభావం చూపబోవు. వీటిలో ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలున్నాయి. నిష్ఫల ప్రయత్నం.. తాజా నిబంధనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది మంది వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా వివరాలు సేకరించాలనుకోవడం నిష్ఫల, సమస్యలు సృష్టించే ప్రయత్నమని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ డైరెక్టర్ హినా షంషీ అన్నారు. ఇది వ్యక్తిగత అంశాల్లోకి చొరబడడమే కాకుండా అర్థరహిత నిర్ణయమని డ్రెక్సెల్ యూనివర్సిటీలో అసోసియేట్ లా ప్రొఫెసర్ అనిల్ ఖాల్హన్ చెప్పారు. ప్రైవేటు ఖాతాల సమాచారం ఇవ్వాలని బలవంతం చేయడానికి తాము వ్యతిరేకమని ఇంతకు ముందే చెప్పామని అందులో ఎలాంటి మార్పులేదని ఫేస్బుక్ పేర్కొంది. -
పాఠశాలల్లో వసతులపై మే నుంచి తనిఖీలు
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి వాటిపై చర్యలు చేపట్టేందుకు ఈ ఏడాది మే నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ చెప్పారు. బాలల హక్కులను పరిరక్షించే అంశంపై న్యాయసేవా సదన్‌లో గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల నిర్వహణకు అనుమతులిచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు, పుస్తకాల రూపంలో దోపిడీ చేస్తే సహించేది లేదన్నారు. విద్యార్థులకు తగిన నిష్పత్తిలో మరుగుదొడ్లు, క్రీడామైదానం, రెండు అంతస్తులకు మించిన భవనాల్లో స్కూళ్లు నడపకుండా చూడటం, అన్ని అంతస్తుల్లో తాగునీటి సౌకర్యం, అగ్నిప్రమాదాల నుంచి రక్షణకు చర్యలు తదితర ప్రభుత్వ నిబంధనలు పాటించిన స్కూళ్లకు మాత్రమే అనుమతులివ్వాలన్నారు. లేని వసతులు ఉన్నట్లు రికార్డుల్లో చూపించి, అనుమతిస్తే అందుకు అధికారులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ అంశాలపై తల్లిదండ్రులు, ఇంకెవరైనా అన్యాయం జరుగుతోందని భావిస్తే వారికి తెలిసిన న్యాయవాది లేదా జిల్లా న్యాయసేవా సంస్థ ద్వారా తమను సంప్రదించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లకుండానే హాజరైనట్లు చూపిస్తున్నారని, అటువంటి వారిపై భవిష్యత్‌లో చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. డీఆర్వో ఆర్.రాజ్‌కుమార్, ఏఎస్పీ ఏ.వి.రమణ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ భువనగిరి కృష్ణవేణి, డీఈఓ నాగమణి, ఫ్యామిలీ కోర్టు జడ్జి భీమారావు, జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి ఎం.శ్రీహరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్లో విజిలెన్స్ తనిఖీలు
హాలియా (నాగార్జునసాగర్) : హాలియా మార్కెట్ యార్డులో మంగళవారం విజిలెన్స్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. మార్కెట్ యార్డులోని వాణిజ్య సముదాయం గోడౌన్లలో కొంతమంది ట్రేడర్లు సుమారు రెండు వేల బస్తాల కందులు అక్రమ నిల్వలు ఉంచారనే ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కేసీ ప్రమీల, విజిలెన్స్ ఎస్ఐ గౌస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కొంతమంది వ్యాపారులు కర్ణాటక గుల్భార్గా ప్రాంతం నుంచి కందులు కొనుగోలు చేసి మార్కెట్ యార్డులోని గోడౌన్లలో నిల్వ ఉంచారు. యార్డులో మొత్తం 13 దుకాణాలు ఉండగా 8 దుకాణాల్లో తనిఖీ చేయగా మూడు దుకాణాల్లో కందులు నిల్వలు బిల్లులు, స్టాక్ రిజిష్టర్లు తనిఖీ చేశారు. కాగా మిగిలిన దుకాణాల వ్యాపారులు స్థానికంగా లేకపోవడంతో బుధవారం తనిఖీలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు దుకాణాలకు సీల్ వేశారు. వ్యాపారులు అక్కడ రైతుల వద్ద కొనుగోలు చేశారా? లేక మధ్యవర్తి వద్దనా అన్న పూర్తి వివరాలు బుధవారం తేలే అవకాశం ఉంది. తనిఖీల్లో మార్కెట్ కార్యదర్శి శ్రీనాథరాజు రెవెన్యూ కార్యదర్శి శ్యాం పలువురు అధికారులు ఉన్నారు. మార్కెట్లో త్వరలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో వ్యాపారులు నిల్వ చేసిన కందులపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. -
20 వేల పన్ను రిటర్ను పత్రాలపై విచారణ
న్యూఢిల్లీ: నోట్లరద్దుకు ముందు, తర్వాత ఆదాయాల్లో భారీ తేడాలు ఉన్నాయనే అనుమానంతో 20,572 పన్ను రిటర్ను పత్రాలను సమగ్రంగా తనిఖీ చేయాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. అలాగే పన్ను ఎగవేశారనే అనుమానం ఉన్న మరో లక్ష కేసులను కూడా విచారించనున్నట్లు అధికారులు సోమవారం చెప్పారు. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ అక్టోబరు చివరి నాటికి రూ.1,883 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వెల్లడించింది. మొత్తం 541 బినామీ ఆస్తులను అధికారులు జప్తు చేయగా, వాటిలో అహ్మదాబాద్ కార్యాలయం పరిధిలో 136, భోపాల్ పరిధిలో 93 ఉండటం గమనార్హం. బినామీ ఆస్తులను కలిగిఉన్న వారిపై ఐటీ కఠిన చర్యలు కొనసాగుతాయని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర వెల్లడించారు. -
ఆస్పత్రిలో జెడ్పీ చైర్పర్సన్ తనిఖీలు
లబ్బీపేట(విజయవాడ తూర్పు): ప్రభుత్వాస్పత్రి డొల్లతనం మరోసారి బయటపడింది. ప్రాణాపాయస్థితిలో చికిత్స కోసం క్యాజువాలిటీకి వచ్చిన రోగికి వెంటిలేటర్ అవసరం కాగా, అందుబాటులో లేకపోవడంతో రెండు గంటలపాటు అలాగే వదిలేశారు. ఆ సమయంలో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ దృష్టి ఆ రోగిపై పడింది. అతనికి ఏమైందని ప్రశ్నించగా, శ్యాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని, వెంటిలేటర్ పెట్టాల్సి ఉన్నా అందుబాటులో లేవని చెపుతున్నట్లు బంధువులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె వైద్యులను నిలదీశారు. క్యాజువాలిటీలో రెండు వెంటిలేటర్లు ఉండగా, ఒకటి పనిచేయడం లేదని, మరొకటి వేరే రోగికి పెట్టినట్లు తెలిపారు. వెంటనే రోగిని వెంటిలేటర్‌పై ఉంచాలని ఆదేశించడంతో ట్రామా కేర్‌లో ఉన్న వెంటిలేటర్‌ను తీసుకు వచ్చి ఆ రోగికి పెట్టారు. అనంతరం సిటీ స్కాన్‌తోపాటు, అవుట్ పేషెంట్ విభాగాన్ని అనూరాధ పరిశీలించి, రోగులను సమస్యలు తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. మోకీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు ఎందుకు నిర్వహించడం లేదని ఆర్ధోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ డి.వెంకటేష్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాక పోవడంతో నిర్వహించలేకపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వచ్చంధ సంస్థల సేవలు అభినందనీయం ప్రభుత్వాస్పత్రిలో శ్రీ వాసవీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా చపాతిలు అందించడం అభినందనీయమన్నారు. ఆమె చపాతీ తయారీ ప్లాంటును సందర్శించి వారు అందిస్తున్న సేవలు ప్రసంశించారు. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో సైతం ఇలాంటి పథకం అమలు చేసేందుకు కృషి చేయాలని సేవా సమితి నిర్వాహకులకు సూచించారు. ఆమె వెంట ప్రభుత్వాస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భీమేశ్వర్, ఆర్ఎంఓ డాక్టర్ గీతాంజలి, డాక్టర్ భవానీశంకర్, అభివృద్ధి కమిటీ సభ్యులు దివి ఉమామహేశ్వరరావు, ముమ్మినేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలపై తనిఖీలు ముమ్మరం
కర్నూలు(అగ్రికల్చర్): నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేసేందుకు ఒక వైపు విజిలెన్స్ అధికారులు, మరోవైపు వ్యవసాయాధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. తెల్లబంగారం... విత్తు కలవరం అనే శీర్షికన బుధవారం సాక్షి దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ నేపధ్యంలో అధికారులు స్పందించారు. కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్‌కుమార్‌రెడ్డి తదితరులు.. కర్నూలు నగరంలోని నవత, ఎస్ఆర్ఎంటీ తదితర ట్రాన్స్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించారు. కోడుమూరు తదితర ప్రాంతల్లోనూ తనిఖీలు సాగాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల నిర్వహించిన దాడుల్లో ఎమ్మిగనూరు మండలంలో 60 ప్యాకెట్ల నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామంలో అమ్మకానికి సిద్ధంగా చేసిన రూ.5లక్షల విలువ చేసే నాలుగు క్వింటాళ్ల నకిలీ బీటీ విత్తనాలను స్థానిక వ్యవసాయాధికారి స్వాధీనం చేసుకున్నారు. మే నెల 26న కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటులోని పోలీసు కాలనీ నకిలీ విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి. నంద్యాలలో రూ.34 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు పట్టుబడటం సంచలనం రేపింది. పత్తిలో 95 శాతం బీటీ రకాలనే సాగు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నకిలీ విత్తనాలు ఇప్పటికే తరలివెల్లినట్లు సమాచారం. నకిలీ బీటీ పత్తి విత్తనాలు సీజ్ నంద్యాలఅర్బన్: స్థానిక విజయ డెయిరీ సమీపంలోని వెంకటేశ్వర సీడ్స్ విత్తన కేంద్రంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నకిలీ బీటీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. జిల్లా విజిలెన్స్ అధికారి బాబురావు ఆదేశాల మేరకు విజిలెన్స్ సీఐ జగన్మోహన్రెడ్డి, ఏడీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. సీడ్ ప్రాసెసింగ్‌కు అనుమతులు లేకుండా సీడ్ కంట్రోల్ నిబంధనలు అతిక్రమించి నకిలీ బీటీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు రూ.11.76లక్షల విలువ చేసే 28 క్వింటాళ్ల బీటీ పత్తి విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. అయితే బండిఆత్మకూరుకు చెందిన రైతు కావేరి బీటీ పత్తి విత్తనాలను సీడ్ విత్తనాల ప్రాసెసింగ్‌కు ఇక్కడ నిల్వ ఉంచినట్లు వెంకటేశ్వర సీడ్స్ యజమాని విజిలెన్స్ అధికారులకు వివరించారు. రైతుకు సంబంధించిన వివరాలు తెలపకపోవడంతో సంచుల్లో ఉంచిన సీడ్ మొత్తాన్ని సీజ్ చేసి టెక్కె మార్కెట్‌యార్డులోని మార్క్‌ఫెడ్ కేంద్రానికి తరలించారు. సీడ్ యజమానిపై 6ఏ కేసు నమోదు చేశామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. వీరి వెంట ఏఓ అయూబ్‌బాషా, విజిలెన్స్ సిబ్బంది మునిస్వామి, ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
ఉప్పల్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్: ఉప్పల్ బస్టాండ్‌లో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. బస్టాండ్ ఆధునీకరణకు అవసరమైన నిధులను కేటాయిస్తామని మంత్రి చెప్పారు. స్థానికంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉప్పల్‌లో నిర్మించిన రైతు బజార్‌తో పాటు మినీస్టేడియంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ పాల్గొన్నారు. -
రహదారి దిగ్బంధం
పోలీసు వలయంలో రాజీవ్ రహదారి వంటిమామిడి వద్ద చెక్‌పోస్టు, విస్తృత తనిఖీలు భారీగా మోహరించిన బలగాలు పర్యవేక్షించిన డీఐజీ, కలెక్టర్, ఎస్పీ వర్గల్/ములుగు: రాజీవ్ రహదారిని పోలీసులు దిగ్బంధించారు. జిల్లా సరిహద్దు వంటిమామిడి వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. వరుసగా రెండోరోజైన మంగళవారం రోజంతా తనిఖీ లను కొనసాగించారు. మల్లన్న సా గర్ నిర్వాసితులకు సంఘీభావంగా కాంగ్రెస్ నేతలు వస్తున్నారనే సమాచారంతో చెక్ పోస్టు భారీగా బలగాలను మోహరించారు. ప్రతి వాహనా న్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వంటిమామిడి వద్ద ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు తనిఖీలు కొనసాగాయి. మహబూబ్‌నగర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి డీఎస్పీలు శ్రీధర్, నాగరాజు, తిరుపతయ్య ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 150 మందికిపైగా పోలీసులు తనిఖీ లు చేపట్టారు. మహిళా నేతలను అరెస్ట్ చేసేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులను రంగంలోకి దింపారు. వర్షంలోనూ కొనసాగించారు. అనుమానితులను ఏ ఒక్కరిని వదలకుండా ఆర్టీసీ బస్సులను, కార్లను, ఇతర వాహనాలను సైతం తనిఖీ చేశారు. చెక్‌పోస్టును సందర్శించిన డీఐజీ, కలెక్టర్, ఎస్పీ వంటిమామిడి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును మంగళవారం ఉదయం హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకు¯ŒS సబర్వాల్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సందర్శించారు. అక్కడి పరిస్థితి సమీక్షించారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి దాదాపు గంటపాటు చెక్ పోస్టు వద్దే ఉండి పరిస్థితి అంచనా వేస్తూ పోలీసులకు తగు ఆదేశాలిచ్చారు. -
విజయవాడ స్టేషన్లో రైల్వే జీఎం తనిఖీలు
విజయవాడ (రైల్వేస్టేషన్): దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా శుక్రవారం విజయవాడ స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఉదయం మచిలీపట్నం స్టేషన్లో తనిఖీచేసిన ఆయన తిరుగు ప్రయాణంలో విజయవాడ స్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై నున్న ప్రయాణికుల వెయిటింగ్ హాల్, వివిధ ఆహార పదార్ధాల స్టాళ్లను తనిఖీ చేశారు. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై నున్న ఎస్కలేటర్ పనిచేయక పోవడంతో తక్షణం మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. రాబోవు కష్ణా పుష్కరాలకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటినుంచే ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టాలని డీఆర్ఎం అశోక్‌కుమార్‌ను ఆదేశించారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
వారానికి ఒక రోజు స్కూళ్లలో తనిఖీలు
బడివేళల మార్పు వెంటనే అమలు.. డీఈఓల సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత, ప్రమాణాలు పెంపు, మెరుగైన విద్యా బోధన అందించే క్రమంలో క్షేత్ర స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు వారంలో ఒకరోజు పాఠశాలల తనిఖీలు, సమీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలోని డీఈవోలు, డిప్యూటీఈవోల సమావేశం జరిగింది. వివిధ సర్వేల్లో విద్యార్థులకు చదవడం, రాయడం కూడా రానీ పరిస్థితులపై ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ జగన్నాధరెడ్డి అధికారులతో సమీక్షించారు. చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డీఈవోలు డిప్యూటీఈవోల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ పరిస్థితులపై తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చారు. అయితే ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన, అభివృద్ధిపైనే ప్రధాన దృష్టిసారించనున్నారు. -
తనిఖీల లోగుట్టు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెండ్రోజుల క్రితం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల బృందం కీసర మండలం నాగారంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని సందర్శించింది. అక్కడ లోపాలను గుర్తించిన ఆ బృందం సభ్యులు.. ఆస్పత్రి సిబ్బందిపై చిందులేశారు. ఆస్పత్రి గుర్తింపు గడువు ముగి యడం.. మిషన్ల రెన్యూవల్ గడువు కూడా పూర్తి కావడంతో హడావుడి చేశారు. వసూళ్ల పర్వానికి తెరలేపారు. చివరకు ఉద్యోగ సంఘం నేత ఒకరు రంగప్రవేశం చేయడంతో సీన్ కాస్త రివర్సయ్యింది. ఇలా వసూలు చేసి.. అలా వెనక్కి ఇచ్చి ప్రైవేటు ఆస్పత్రిని సందర్శించిన అధికారుల బృందం గుర్తింపు గడువు ముగిసిం దని తేల్చింది. అదేవిధంగా ఆస్పత్రిలోని స్కానింగ్ మిషన్లకు సైతం రెన్యూవల్ చేయించలేదని నిర్ధారణకు వచ్చింది. దీంతో మిషన్లు సీజ్ చేస్తామంటూ హడావుడి చేయడంతో ఆస్పత్రి సిబ్బం ది ఈ విషయాన్ని ఆస్పత్రి ఎండీ (మేనేజింగ్ డెరైక్టర్)కు వివరించారు. కొంత మొత్తాన్ని అధికారులకు ఇవ్వాలంటూ ఆయన ఆదేశించడంతో.. ఆ మొత్తాన్ని అధికారికి ముట్టజెప్పారు. దాంతో అధికారుల బృందం అక్కడ్నుంచి జారుకుంది. ఆస్పత్రి ఎండీ వెంటనే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడికి ఫోనులో చెప్పడం.. ఆయన నేరుగా తనిఖీ బృందంపై ఆగ్రహించడంతో సీను కాస్త రివర్సయ్యింది. వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చేయాలని తనిఖీ బృందం నిర్ణయించి.. సమీపంలో ఉన్న పీహెచ్‌సీలోని హెల్త్ అసిస్టెంట్‌తో ఆ మొత్తాన్ని తిరిగి ఆస్పత్రికి పంపించారు. అయితే అందు లో రూ.500 తగ్గించి ఇవ్వడం కొసమెరుపు. ఇలాంటి సీన్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు కొత్తేమీ కాదు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ కేంద్రాలపై రోజూ తనిఖీల పేరుతో దాడులు చేయడం, ఆ తర్వాత వసూళ్లకు దిగడం సాధారణమైంది. తనిఖీ బృందంలో అధికారులు కాకుండా సంబంధంలేని కార్యాలయ క్లరికల్ సిబ్బంది పాల్గొనడం గమనార్హం. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, జిల్లా యంత్రాంగం సైతం దృష్టి సారించకపోవడంతో ఈ వ్యవహారం సాఫీగా సాగుతోంది. నివేదికలకు మంగళం వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 684 స్కానింగ్ కేంద్రాలున్నాయి. హైదరాబాద్ నగరానికి చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, అత్యాధునిక వసతులున్న ఆస్పత్రులన్నీ శివారు మండలాల్లో ఉండడంతో జిల్లాలో అత్యధికంగా స్కానింగ్ కేంద్రాలున్నాయి. అయితే వీటిలో చాలావరకు అనుమతి లేకుండానే కొనసాగుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. అయితే ప్రతి స్కానింగ్ కేంద్రంలో నిర్వహించే స్కానింగ్, గర్భిణులకు చేపట్టే పరీక్షలకు సంబంధించి వివరాలను క్రమం తప్పకుండా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు నివేదిక రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఈ తంతు మచ్చుకు కూడా కన్పించదు. మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వివరాలు ఇస్తున్నారంటూ అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లా కార్యాలయానికి మాత్రం ఇప్పటివరకు నివేదికలు రాలేదని డీఎంహెచ్ఓ సుధాకర్ నాయుడు ‘సాక్షి’తో పేర్కొన్నారు. నిద్రపోతున్న తనిఖీ బృందం! లింగనిర్ధారణ నిరోదక చట్టం (పీఎన్డీటీ) అమలు జిల్లాలో అటకెక్కింది. సాధారణంగా ఈ చట్టం అమలులో భాగంగా ఎప్పటికప్పుడు స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. అదే విధంగా ప్రత్యేక అధికారులతో కూడిన తనిఖీ బృందంతో డెకాయ్ ఆపరేషన్ చేయాలి. అయితే జిల్లాలో ఈ డెకాయ్ ఆపరేషన్లు చేపట్టిన దాఖలాలు లేవు. పనిఒత్తిడి నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించే తీరికలేదంటూ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమర్థించుకుంటున్నారు. నాకు సంబంధం లేదు నేను రెండ్రోజుల క్రితం కీసరలోని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు సందర్శించి పరిశీలించిన మాట వాస్తవమే. అయితే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వ్యాక్సిన్ల నిల్వ, ఇతర అంశాలపై తనిఖీ చేశా. జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తున్నా. కానీ ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ల్యాబ్ సిబ్బంది నుంచి డబ్బులు తీసుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు సరికావు. నేను సీమాంధ్రవాడిని కావడంతో కొందరు గిట్టని వాళ్లు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. - సుధాకర్ నాయుడు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి -
ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణంలో అపరిశుభ్రతపట్ల ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే సిబ్బంది తమపై వ్యవహారించే తీరుపై ఈ సందర్భంగా రోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆసుపత్రి సిబ్బందిపై కలెక్టర్ మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన శానిటరీ ఇన్స్పెక్టర్, వాటర్మెన్లను సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆర్‌ఎంవోకు మెమో జారీ చేశారు.