సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్‌లో ఎన్‌ఐఏ(NIA) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు అడ‍్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మెడికల్ విద్యార్థి రాధ మిస్సింగ్ కేసులో భాగంగా ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, రాధను శిల్ప.. మావోయిస్టుల్లో చేర్చారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు.
ఏక కాలంలో అధికారులు మూడు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా.. పలు డాక్యుమెంట్లను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో శిల్పను ఎన్‌ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శిల్పను ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. కాగా, మెదక్ జిల్లా చేగుంటలోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టు నేత శంకర్ కొడుకు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
అయితే, మూడున్నర సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో రాధ అదృశ్యమైంది. రాధను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మే 31వ తేదీన కేసు రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని NIA కు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైతన్య మహిళా సంఘం నేతలపై, మావోయిస్టు అగ్రనేతలు గాజర్ల రవి, అరుణలపై NIA కేసు నమోదు చేసింది.
ఇది కూడా చదవండి: జైలుకు మరో 10 మంది ఆందోళనకారులు
Comments
Please login to add a commentAdd a comment