న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపై పోరాటం చేస్తున్న కరోనా యోధులకు గౌరవ వందనంకు సంఘీభావం ప్రకటిస్తూ వారిపై పూలవాన కురిపించాలని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్‌రావత్ పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురింపించారు. వైద్యులు, పారామెడికల్, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా సాయుధ దళాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీస్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పించి వందన సమర్పరణతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పోలీసు సేవలకు ప్రశంసగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చాపర్ పోలీస్ వార్ మెమోరియల్‌పై పూలవర్షం కురింపించింది. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల్లో కోవిడ్ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురిపిస్తున్నారు.
(జమాతే ప్రార్థనలు: మొత్తం సంఖ్య ఎంతో తెలుసా..!)
గాంధీ ఆసుపత్రిపై పూల వర్షం
హైదరాబాద్ : కరోనా సేవలందిస్తున్న గాంధీ ఆసుపత్రితో పాటు రాత్రి, పగలు తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు, వైద్యులు, పారామెడికల్, పారిశుద్య సిబ్బందికి వాయుసేన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తూ తమ సంఘీభావం ప్రకటించారు. వాయుసేన పూలవర్షం కురిపించిన అనంతరం వైద్యులు చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
కరోనా యోధులకు గౌరవ వందనం
విశాఖపట్నం : విశాఖపట్నంలో కరోనా బాధితులకు సేవలందిస్తున్న ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రిపై వాయుసేన పూలవర్షం కురిపించారు. కరోన యోధులకు పూల జల్లులు, పుష్పగుచాలతో తమదైన రీతిలో అభినందనలు వెల్లువెత్తాయి. అనంతరం వైద్యులకు, నర్సులకు, పారమెడికల్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు తూర్పు నౌకదాలం ఏపి ఆఫీసర్ ఇంచార్జి కమాండర్ సంజీవ్ ఇస్సార్ ఫుష్ప గుచ్చాలు అందించారు. ఈ కార్యక్రమంలో చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్, ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్.పివి సుధాకర్ పాల్గొన్నారు. నేడు సాయంత్రం రెండు యుద్ధనౌకల్లో విద్యుత్ దీపాలు వెలిగించి నేవీ సిబ్బంది కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment