rose petals
-
గులాబీ రేకులతో స్వీట్ : బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
గులాబీ పువ్వులు సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కంద్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేదం చెబుతోంది.గుల్కంద్ అనే పదం గుల్ నుండి వచ్చింది. దీని అర్థం పెర్షియన్ భాషలో 'పువ్వు' అరబిక్‌లో 'కంద్' అంటే 'తీపి'. ముఖ్యంగా ఈ వేసవిలో గులాబీ రేకుల జామ్ లేదా గుల్కంద్ వల్ల ఒంటికి చలవ చేస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఫిట్‌గా ఉంచే అద్భుతమైన టానిక్‌లా పనిచేసే గుల్కంద్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు.. లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గులాబీ రేకులు వెడల్పుమూత ఉన్న గాజు సీసా, లేదా జార్ యాలకులు గులాబీ రేకులను బాగా ఎండబెట్టాలి. ఎండిన వాటిని ఒక గాజు సీసాలో వేసి, దానికి కొద్దిగా చక్కెర, యాలకుల పొడి కలుపుకోవాలి. గాజు సీసాను ప్రతిరోజూ దాదాపు ఏడు గంటలపాటు ఎండలో ఉంచాలి. మళ్లీ రాత్రికి చెక్క స్పూన్‌తో లేదా తడిలేని గరిటెతో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా దాదాపు నెల రోజుల పాటు ఇలా చేయాలి. దీంతో జామ్‌లాగా ఇది తయారవుతుంది. దీన్ని పలు రకాల స్వీట్లలో వాడతారు. అలాగే ఫ్రూడ్ సలాడ్లలో వాడవచ్చు. కాస్త చల్లటి పాలు తీసుకుని అందులో ఒక చెంచా గుల్కంద్ వేసి తాగవచ్చు. అలాగే దీన్ని నేరుగా లేదా తమలపాకులతో కూడా తినవచ్చు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఈ గులాబీ గుల్కంద్ ఆయుర్వేద ప్రకారం పిత్త దోషాలకు చాలా మంచిది. వేడిని పుట్టిస్తుంది. చల్లగా ఉండేలాగా కూడా పనిచేస్తుంది దద్దుర్లు, నొప్పులు ,నొప్పులు వంటి వేడి-సంబంధిత లక్షణాలను తగ్గిస్తుంది , అరికాళ్ళు అరచేతులలో ఏవైనా మంటలను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇది కాలక్రమేణా కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందుకే దీన్ని తాంబూలంలో కూడా ఎక్కువగా వాడతారు. రక్తహీనతను నివారిస్తుంది, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి ఇది చాలా మంచిది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది కప్పు పాలలో వేసి రాత్రిపూట తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది చర్మం త్వరగా ముడతలు పడకుండా నివారిస్తుంది. మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది. గుల్కంద్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్రమైన అల్సర్లు, మలబద్ధకం, గుండె మంట సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. వేసవిలో గుల్కంద్ వాడటం వల్ల వడదెబ్బ, ముక్కు కారటం, తలతిరగడం వంటివి నివారించవచ్చు. బహిష్టు సమయంలో అధిక రక్తస్రావానికి గుల్కంద్ మంచిది. ముఖ్యంగా పీసీఓడీతో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచిది. థైరాయిడ్‌తో బాధపడేవారు కూడా ఈ జామ్ని చక్కగా తీసుకోవచ్చు -
యోధులారా.. వందనం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు త్రివిధ దళాలు ఆదివారం ఘనమైన రీతిలో సంఘీభావం ప్రకటించాయి. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. సుఖోయ్, మిగ్ వంటి యుద్ధ విమానాలు ప్రధాన నగరాల్లో ఫ్లై పాస్ట్‌లో పాల్గొన్నాయి. అలాగే సముద్ర తీరాల్లో యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో నిండిపోయాయి. కరోనా భయం వదిలి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలన్న స్ఫూర్తిని చాటాయి. ఆసుపత్రుల వద్ద సైనికులు ప్రత్యేక బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా పోలీసు స్మారకాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, గువాహటి, పట్నా, లక్నో, శ్రీనగర్, చండీగఢ్, భోపాల్, కోయంబత్తూరు, తిరువనంతపురం తదితర నగరాల్లో యుద్ధ విమానాల ఫ్లై పాస్టు ప్రజలను అబ్బురపరిచింది. వైమానిక దళం, నావికా దళానికి చెందిన హెలికాప్టర్లు ‘కరోనా’ ఆసుపత్రులపై పూల జల్లు కురిపించాయి. కరోనా యోధులకు మద్దతుగా త్రివిధ దళాలు నిర్వహించిన ప్రదర్శనల పట్ల హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వందనాలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్న యోధులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వైరస్ వ్యాప్తిని అంతం చేసే దిశగా ధైర్యంగా ముందుకు సాగుతున్న యోధులకు వందనాలు. మన సైనిక దళాలు వారికి గొప్పగా కృతజ్ఞతలు తెలిపాయి’ అంటూ ట్వీట్ చేశారు. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న ఆసుపత్రులపై పూలు చల్లుతున్న హెలికాప్టర్లు, సైనిక బ్యాండ్ ప్రదర్శన వీడియోను పోస్టు చేశారు. ఢిల్లీలో జాతీయ పోలీసు స్మారక స్థూపంపై పూల వర్షం కురిపిస్తున్న భారత వైమానిక దళం హెలికాప్టర్ -
కరోనా యోధులపై పూలవర్షం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపై పోరాటం చేస్తున్న కరోనా యోధులకు గౌరవ వందనంకు సంఘీభావం ప్రకటిస్తూ వారిపై పూలవాన కురిపించాలని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్‌రావత్ పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురింపించారు. వైద్యులు, పారామెడికల్, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా సాయుధ దళాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీస్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పించి వందన సమర్పరణతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. పోలీసు సేవలకు ప్రశంసగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చాపర్ పోలీస్ వార్ మెమోరియల్‌పై పూలవర్షం కురింపించింది. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల్లో కోవిడ్ ఆసుపత్రులపై వాయుసేన పూలవర్షం కురిపిస్తున్నారు. (జమాతే ప్రార్థనలు: మొత్తం సంఖ్య ఎంతో తెలుసా..!) గాంధీ ఆసుపత్రిపై పూల వర్షం హైదరాబాద్ : కరోనా సేవలందిస్తున్న గాంధీ ఆసుపత్రితో పాటు రాత్రి, పగలు తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు, వైద్యులు, పారామెడికల్, పారిశుద్య సిబ్బందికి వాయుసేన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తూ తమ సంఘీభావం ప్రకటించారు. వాయుసేన పూలవర్షం కురిపించిన అనంతరం వైద్యులు చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. కరోనా యోధులకు గౌరవ వందనం విశాఖపట్నం : విశాఖపట్నంలో కరోనా బాధితులకు సేవలందిస్తున్న ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రిపై వాయుసేన పూలవర్షం కురిపించారు. కరోన యోధులకు పూల జల్లులు, పుష్పగుచాలతో తమదైన రీతిలో అభినందనలు వెల్లువెత్తాయి. అనంతరం వైద్యులకు, నర్సులకు, పారమెడికల్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు తూర్పు నౌకదాలం ఏపి ఆఫీసర్ ఇంచార్జి కమాండర్ సంజీవ్ ఇస్సార్ ఫుష్ప గుచ్చాలు అందించారు. ఈ కార్యక్రమంలో చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్, ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్.పివి సుధాకర్ పాల్గొన్నారు. నేడు సాయంత్రం రెండు యుద్ధనౌకల్లో విద్యుత్ దీపాలు వెలిగించి నేవీ సిబ్బంది కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలపనున్నారు. -
గులాబి రేకుల ప్యాక్
న్యూ ఫేస్ కావలసినవి: గులాబి రేకుల పొడి (ఎండిన రేకులను గ్రైండ్ చేసుకోవాలి) - 2 టేబుల్ స్పూన్లు, పాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు - చిటికెడు తయారీ: ఓ బౌల్లో గులాబి రేకుల పొడిని వేసి, పాలు పోయాలి. అలాగే అందులో పసుపు కూడా వేసి బాగా కలపాలి. మిశ్రమం పొడిగా అనిపిస్తే కాసిన్ని పాలు లేదా రోజ్ వాటర్‌ను కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో జిడ్డుచర్మం, సన్ ట్యాన్ దూరమై, ముఖం కాంతిమంతంగా తయారవుతుంది. గులాబి రేకులను ఎండబెట్టి, పౌడర్‌గా చేసుకునేంత సమయం లేనప్పుడు... రేకులను పేస్ట్గానూ చేసి వాడొచ్చు. గులాబి రేకులలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి. అలాగే ఇందులోని విటమిన్-డి చర్మంపై మొటిమలు, నల్ల మచ్చలను దూరం చేస్తుంది. అలాగే ముడతలను తగ్గిస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. -
అందమైన అధరాల కోసం...
బ్యూటిప్స్ ♦ ముఖానికి నవ్వు ఎంత అందాన్నిస్తుందో... పెదవుల నాజూకుదనం ఆ నవ్వుకు మరింత అందాన్నిస్తుంది. కొందరి ముఖం చక్కని ఛాయతో ఉన్నా... పెదవులు మాత్రం నల్లగా ఉంటాయి. కొందరికి వాతావరణాన్ని బట్టి నల్లబడి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే సరి... ♦ కొన్ని గులాబి రేకులను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిలో కొంచెం తేనె, పాలమీగడ, వెన్న వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు పెదవులను మసాజ్ చేస్తే నలుపు పోతుంది. ♦ గులాబి రేకులను పాలలో వేసి నానబెట్టాలి. తర్వాత పేస్ట్ చేసి తేనె, చిటికెడు కుంకుమపువ్వు కలపాలి. దీన్ని పెదవులకు రాసి, పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ♦ క్యారెట్ రసాన్ని, బీట్రూట్ రసాన్ని సమపాళ్లలో కలిపి దానితో పెదవులపై సున్నితంగా పది నిమిషాల పాటు రుద్దాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజుకోసారి ఇలా చేస్తే రెండు వారాల్లో ఫలితం కనిపిస్తుంది. ♦ దానిమ్మగింజల్ని పేస్ట్ చేసి... అందులో కొద్దిగా పాల మీగడ, రోజ్ వాటర్ వేసి కలపాలి. దీనితో పెదవులను బాగా రుద్ది, ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఇలా చేస్తే నలుపు పోయి పెదవులు మంచి రంగులోకి మారతాయి. ♦ చెంచాడు స్ట్రాబెర్రీ జ్యూస్‌లో రెండు చెంచాల పెట్రోలియం జెల్లీ వేసి రోజూ రుద్దుకున్నా ఫలితం ఉంటుంది.