గులాబి రేకుల ప్యాక్
న్యూ ఫేస్
కావలసినవి: గులాబి రేకుల పొడి (ఎండిన రేకులను గ్రైండ్ చేసుకోవాలి) - 2 టేబుల్ స్పూన్లు, పాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు - చిటికెడు
తయారీ: ఓ బౌల్‌లో గులాబి రేకుల పొడిని వేసి, పాలు పోయాలి. అలాగే అందులో పసుపు కూడా వేసి బాగా కలపాలి. మిశ్రమం పొడిగా అనిపిస్తే కాసిన్ని పాలు లేదా రోజ్ వాటర్‌ను కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో జిడ్డుచర్మం, సన్ ట్యాన్ దూరమై, ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.
గులాబి రేకులను ఎండబెట్టి, పౌడర్‌గా చేసుకునేంత సమయం లేనప్పుడు... రేకులను పేస్ట్‌గానూ చేసి వాడొచ్చు. గులాబి రేకులలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి. అలాగే ఇందులోని విటమిన్-డి చర్మంపై మొటిమలు, నల్ల మచ్చలను దూరం చేస్తుంది. అలాగే ముడతలను తగ్గిస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.