చలికాలంలో చాలా మంది తమ ముఖాలు అందంగా కనిపించేలా ప్రయత్నాలు చేస్తుంటారు. చలి తీవ్రతతో.. ముఖం నిగారింపు తగ్గడం, పెదవులు పొడిబారిపోవడం, కళ్లకింద నల్లరంగు చారలు ఏర్పడటంలాంటి సమస్యలు కనిపిస్తూంటాయి. వీటిని అధిగమించడానికి మరెన్నో ప్రయత్నాలు చేస‍్తుంటారు. కొందరు తెలియని ఫేస్‌క్రీమ్స్ వాడి లేని సమస్యలను కొనితెచ్చుకుంటారు. మరి వీటినుండి బయటపడాలంటే ఈ చిన్న చిన్న బ్యూటిప్స్‌ని వాడితే చాలు. అవేంటో చూద‍్దాం.
రోజ్ వాటర్, తేనెతో..
రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. చక్కగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తగ్గుముఖం పడుతుంది. రోజ్ వాటర్ ముఖానికి సహజసిద్ధ్ద నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది.
ఇంగువతో నిగారింపు..
రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో స్పూను తేనె, చిటికెడు ఇంగువ, స్పూను రోజ్‌వాటర్ వేసి చక్కగా కల΄ాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి ఇరవై నిమిషాల΄ాటు ఆరబెట్టాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ΄్యాక్‌ను వారంలో రెండుసార్లు వేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు ΄ోతాయి. చర్మం ΄÷డిబారడం తగ్గి ముఖం కాంతిమంతమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment