
కాలుష్యంతో మీ ముఖం నల్లబడటంగానీ, మొటిమలతోగానీ ఇబ్బందికి గురవుతుందా..? అయితే ఈ బ్యూటీ టిప్స్ మీకోసమే..! అవేంటో చూద్దాం.
ఇలా చేయండి..
ఆపిల్ ముక్కతో ముఖమంతా మృదువుగా రబ్ చేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ముఖంలోని అదనపు జిడ్డు తొలగిపోవడంతో మొటిమలు తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది.
కీరా రసంలో రోజ్‌వాటర్, నిమ్మరసం కలపాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ముఖానికి రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది.
ఇవి చదవండి: నిజమే..! తాను తొమ్మిదేళ్ల సూపర్ రేసర్!!