
దగదగా మెరిసే ముఖానికై చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మన ఇంట్లోనే ఉన్న పసుపు, కొబ్బరిపాలు, రోజ్‌వాటర్‌తో ముఖం కాంతివంతంగా మెరిసేలా చేయవచ్చని మీకు తెలుసా! అయితే ఇలా ప్రయత్నించి చూడండి..
ఇలా చేయండి..
టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్ పీల్ పౌడర్, కప్పు రోజ్‌వాటర్, టీస్పూను కొబ్బరిపాలు, ఆరు చుక్కల నిమ్మనూనెను తీసుకుని ఒక బౌల్‌లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌క్యూబ్స్ ట్రేలోపోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఈ క్యూబ్‌లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి.
ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్‌క్యూబ్స్‌తో ఇరవై నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయాలి.
ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగి తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్‌ను రాసుకోవాలి.
ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకు΄ోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్‌పోయి ముఖం ప్రకాశవంతంగా... తాజాగా కనిపిస్తుంది.
చర్మం జిడ్డు కారడం నియంత్రణలో ఉండడమేగాక, దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి.
పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య ఛాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment