Turmeric
-
వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు
వేసవి ఉష్ణోగ్రతలకు చర్మం పొడిబారిపోతుంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖం కూడా కళా విహీనంగా తయారవుతుంది. చర్మ, ముఖం సౌందర్య రక్షణలో శతాబ్దాల తరబడి కలబంద లేదా అలోవెరా విశిష్టంగా నిలుస్తోంది. వడదెబ్బ నుంచి ఉపశమనం మొదలు, మొటిమల నివారణలో బాగా పనిచేస్తుంది.అలోవెరాలో అనేక ఆరోగ్య లక్షణాలున్నాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి అద్భుతాలు చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంది. మరి అలోవెరా, ఇతర మూలికలు, పదార్థాలతో కలిసి వేసుకునే మాస్క్‌ల గురించి తెలుసుకుందామా?జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, కలబంద జెల్లో పాలీసాకరైడ్లు , గ్లైకోప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. గాయం మానడాన్ని వేగవంతం చేసేలా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి మంటను తగ్గించడానికి సాయ పడతాయి. ఇంకాకలబందలోని హైడ్రేటింగ్, యాంటీమైక్రోబయల్లక్షణాలు మొటిమలు, తామర లాంటి సమస్యల నివారణతోపాటు, చర్మం, పొడిబారడం, ఎర్రబారడం, పగుళ్లు, కాలిన గాయాలకు కూడా ప్రభావవంతంగా పనిస్తుందని అధ్యయనం పేర్కొంది.కలబంద ఫేస్ మాస్క్లుకలబంద - తేనె మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జులో 1 టీస్పూన్ తేనె కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసువాలి. ఇది చక్కటి హైడ్రేటింగ్ ఏజెంట్‌గా పనిచేసి పోషణనిస్తుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.కలబంద - పసుపు మాస్క్: పసుపు, తేనె లేదా రోజ్ వాటర్ వంటి మూలికలు , సుగంధ ద్రవ్యాలతో కలిపినప్పుడు, కలబంద చర్మ సంరక్షణ శక్తి కేంద్రంగా మారుతుంది. ముఖ్యంగా సేంద్రీయ పసుపు , కలబంద మాస్క్, నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మొటిమల మచ్చలను తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను చిటికెడు పసుపుతో కలపండి. 10 నిమిషాలు అలాగే ఉంచి సున్నితంగా కడగాలి. కలబంద -రోజ్ వాటర్ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్, టీస్పూన్ రోజ్ వాటర్ బాగా కలపాలి. దీన్ని ముఖంపై సమానంగా అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఎరుపును తగ్గించి, చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.కలబంద - నిమ్మకాయ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్లో కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి.దీన్ని ముఖానికి అప్లై చేసి, 10 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడిగేసుకోవాలి. (బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇది వాడకూడదు). నిమ్మకాయ నల్ల మచ్చలను క్రమంగా తగ్గిస్తుంది.కలబంద-గ్రీన్ టీ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్లో, చల్లని గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, క 15 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ మాస్క్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. యవ్వనమైన, అందమైన చర్మాన్ని అందిస్తుంది.కలబంద-కీరా మాస్క్: కలబంద జెల్లో తురిమిన కీరా కలిపి దీన్ని సున్నితంగా ముఖానికి అప్లై చేయాలి. చల్లటి నీటితో శుభ్రం చేయడానికి ముందు 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మాస్క్ చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది, అలసిపోయిన చర్మాన్ని డీపఫ్ చేయడానికి , హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. -
పసుపు @ 11 వెరైటీలు
పసుపు అంటే సాధారణంగా సేలం.. దుగ్గిరాల వంటి వంగడాలు గుర్తుకు వస్తుంటాయి. అరుదుగా పండే 11 రకాల దేశీ పసుపు రకాలను పండిస్తున్నారు మహిళా రైతు నడింపల్లి కవిత. కస్తూరి.. లకడాండ్.. నల్ల పసుపు.. రోమ్.. తెల్ల పసుపు.. చింతపల్లి.. సోనియా.. రాజాపూరి.. ప్రతిమ.. వీఐపీ(848), వీఐపీ (849) వంటి ప్రత్యేక పసుపు రకాలను ఆమె పండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో తనకున్న ఐదెకరాల వ్యవసాయక్షేత్రంలో మామిడిలో అంతర పంటగా ఈ రకాలను ఆమె సాగు చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా కవిత వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భీమవరం సమీపంలోని మొగల్లుకు చెందిన కవిత కుటుంబం హైదరాబాద్ గచ్చిబౌలిలో స్థిరపడ్డారు. వ్యవసాయంపై మక్కువ కలిగిన కవిత సంగారెడ్డి జిల్లాలో ఐదెకరా సొంత భూమిలో ఈ ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి చింతపల్లి రకం, మేఘాలయ, అస్సాం, డెహ్రాడూన్ తదితరప్రాంతాల నుంచి మరికొన్ని పసుపు రకాలను సేకరించిన కవిత గత మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. పసుపులో రారాజు కస్తూరి.. కస్తూరి రకం పసుపులో రారాజుగా పేరుంది. పసుపు నాణ్యతకుప్రామాణికమైన కర్క్మిన్ ఈ కస్తూరి రకంలో సుమారు 15 శాతం వరకు ఉంటుందన్నారామె. దీన్ని ఔషధాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. సుమారు 3 సంవత్సరాలు పెరిగిన కస్తూరి రకం పసుపునకు క్యాన్సర్‌ను కూడా నయం చేయగల ఔషధ సామర్థ్యం ఉంటుందని ఆమె చెబుతున్నారు. లకడాంగ్ రకం పసుపు ముఖ సౌందర్యానికి, చర్మ సౌందర్యానికి ఉపయోకరమన్నారు. పండించిన పసుపు కొమ్ములను ఉడికిస్తే ఔషధ గుణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పసుపు కొమ్ములను సోలార్ డ్రయ్యర్లో ఎండబెడుతున్నారు. పసుపును ΄÷డితో పాటు ద్రవ రూపంలోకి, ట్యాబ్లెట్ల రూపంలోకి కూడా మార్చుతున్నారు. పసుపు ఉత్పత్తులను అమెరికా, దుబాయ్ వంటి విదేశాల్లో నివాసం ఉండే పరిచయస్తులకు ఆమె ఇస్తున్నారు. వ్యవసాయం అంటే ఇష్టం.. ప్రకృతి వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం. అరుదైన పసుపు రకాలను సాగు చేయాలని అనుకొని సేకరిస్తున్నాను. ఇప్పటి వరకు 11 వెరైటీల పసుపును పండిస్తున్నాను. అస్సాం రకాన్ని కూడా సాగు చేయాలనుకుంటున్నాను. దేశీ ఆవులను పెంచుతూ పాలేకర్ పద్ధతిలో నేను చేస్తున్న వ్యవసాయానికి మా కుటుంబసభ్యులు ఎంతో సహకరిస్తున్నారు.– నడింపల్లి కవిత (76809 67818), పసుపు రైతు– పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
ముత్యమంత పసుపుతో బోలెడన్ని ప్రయోజనాలు
పసుపులో ఎన్నో పోషకాలు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా పసుపు వాడకం చాలా ఎక్కువ అయింది. ముఖ్యంగా పచ్చిపసుపును విరివిగా వాడుతున్నారు. అయితే ఎలా పడితే అలా కాకుండా పద్ధతి ప్రకారం పచ్చిపసుపును వాడటం వల్ల అధిక ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం... పసుపును కొన్ని ఆయుర్వేద ఔషధాలలో చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. వంటలో కూడా ఉపయోగిస్తారు. గ్లాసుడు వేడి పాలలో చిటికడు పసుపు కలుపుకుని తాగడం వల్ల ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, జలుబు, దగ్గు తగ్గుతాయి. శరీరంలో అధికంగా ఉన్న చెడు కొవ్వు కూడా కరిగిపోతుంది. అలాగని పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా వాడాలి!పచ్చి పసుపుతో ఆయుర్వేదిక్ టీలు, సూప్‌లు, స్మూతీస్ వంటివి తయారు చేసుకోవచ్చు. ఇది వంటకాలకు మంచి రంగు, రుచి, వాసనలను జత చేస్తుంది. అయితే పసుపు పొడిని మరిన్ని అవసరాలకు వాడొచ్చు. మారినేషన్, మసాలాలు, సాస్‌లు, డ్రింక్స్‌లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు.పసుపు టీ: రెండంగుళాల ΄ పొడవున్న తాజా పచ్చిపసుపు కొమ్మును తీసుకుని దాని మీదుండే పొరను తీసేయాలి. దానిని సన్నటి ముక్కలుగా తరుక్కోవాలి. స్టవ్ మీద మరుగుతున్న గ్లాసున్నర నీటిలో ఆ ముక్కలు వేయాలి. దానికి చిటికెడు మిరియాల పొడి, కాస్తంత బెల్లం తరుగు జతచేయాలి. కాగిన తర్వాత కొద్దిగా నెయ్యి లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కలిపి ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి దించి వడపోసి గ్లాసులో పోసుకుని టీలాగే సిప్ చేయాలి.స్మూతీస్‌లో కలపడం...పైనాపిల్, మ్యాంగో, ఇతర రకాల పండ్ల ముక్కలతో పాటు సన్నగా తురుమిన పచ్చి పసుపు కొమ్ము, కొబ్బరినీళ్లు, బాదం పాలు కలిపి చేసిన స్మూతీ తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగు తాయి. నిమ్మరసం, అల్లం రంసం, మిరియాల పొడి, కొబ్బరి నీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లలో చిటికడు పచ్చిపసుపు కలిపి వడకట్టి తాగితే జలుబు, దగ్గు, ఒంట్లో వాపులు తగ్గుతాయి. వెటిజబుల్ సలాడ్‌తో... టమోటా, దోస, బీర, బెండ, క్యారట్, బీట్రూట్, ముల్లంగి, స్ప్రింగ్ ఆనియన్స్ తదితర కూరగాయల ముక్కల మీద పసుపు, మిరియాలపొడి,చల్లుకుని తింటే మంచిది. పసుపు నీళ్లు... తేలికైన మార్గం ఏమిటంటే... తాజా పసుపు కొమ్మును పొట్టు తీసి ముక్కలుగా తరిగి వాటర్ బాటిల్లో వేయాలి. కొన్ని గంటల తర్వాత ఆ నీటిని తాగుతూ ఉంటే పసుపులో ఉన్న లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. -
తీసికట్టుగా ‘సుగంధాల’ సాగు
సాక్షి, హైదరాబాద్: ఎండు మిర్చి, పసుపు సాగులో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం.. ఇతర సుగంధ ద్రవ్యాల సాగులో తీవ్రంగా వెనుకబడిపోయింది. చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మొదలైన నిత్యం వంటింట్లో వినియోగించే 11 రకాల మసాలా దినుసులకు రాష్ట్రంలో కొరత ఏర్పడింది. చివరికి చింతపండును కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొంది. పసుపు, మిర్చి సాగులో మెరుగు రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో పసుపు ఎక్కువగా సాగవుతోంది. 56 వేల ఎకరాల్లో 1.74 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అవుతోందని ఉద్యానవన శాఖ లెక్కలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలో రోజువారీగా పసుపు వినియోగం 56.25 మెట్రిక్ టన్నులు. ఏటా రాష్ట్ర అవసరాలకు 23 వేల మెట్రిక్ టన్నులు సరిపోతుంది. మిగతాది ఎగుమతి అవుతోంది. అలాగే రాష్ట్రంలో సుమారు 2.78 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. ఏటా 5.73 మెట్రిక్ టన్నుల ఎండు మిరప ఉత్పత్తి అవుతోంది. మిరప ఉత్పత్తిలో ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో రోజువారీగా కారం వినియోగం 93 మెట్రిక్ టన్నులు. ఏటా రాష్ట్ర అవసరాలకు వాడేది 39 వేల మెట్రిక్ టన్నులు కాగా, మిగతా 5.34 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేస్తున్నారు. చింతపండు, అల్లం, వెల్లుల్లి కూడా దిగుమతే! లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, జీలకర్ర వంటి విలువైన సుగంధ ద్రవ్యాలను ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి. కానీ చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాల వంటివాటిని కూడా ప్రస్తుతం దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఏటా 61,564 మెట్రిక్ టన్నుల చింతపండును దిగుమతి చేసుకొంటున్నారు. రాష్ట్రంలో అల్లం 2,103 ఎకరాల్లో 20,489 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుండగా, వినియోగం మాత్రం 68,419 మెట్రిక్ టన్నులు ఉంటున్నది. 47,930 మెట్రిక్ టన్నుల మేర ఇతర రాష్ట్రాల నుంచి వస్తోంది. వెల్లుల్లి 27 ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది. 148 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తోంది. కానీ, వినియోగం మాత్రం 39,417 మెట్రిక్ టన్నుల మేర ఉంటోంది. అలాగే ధనియాలు కూడా రాష్ట్రంలో 13,532 మెట్రిక్ టన్నుల వినియోగం ఉండగా, పండుతున్న పంట 4,971 ఎకరాల్లో 2,431 మెట్రిక్ టన్నులే. లక్ష ఎకరాల్లో సుగంధ ద్రవ్యాల సాగు అవశ్యం రాష్ట్రంలో ప్రతిరోజు సగటున ఒక్కొక్కరు 21.21 గ్రాముల సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తారు. ఇలా రోజుకు 731 మె ట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా, ఏటా 2.63 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధని యాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు వంటి 11 సుగంధ ద్రవ్యాలు 1.78 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నది. ఈ డిమాండ్‌కు సరిపడా పంట రావాలంటే రాష్ట్రంలో ఇంకా 1.09 లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగుచే యాల్సి ఉంటుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. -
బ్రాహ్మి: ఇది.. మీ మెదడుకు మేతలాంటిది!
బ్రాహ్మి ప్రభావవంతమైన ప్రయోజనాలను కలిగిస్తోందని ‘జర్నల్ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్’ వెల్లడించింది. బ్రాహ్మితోపాటు మరో నాలుగింటిని కూడా తెలిపింది. బ్రాహ్మిని క్యాప్సూల్ రూపంలో, పౌడర్‌గానూ, నీటిలో మరిగించి టీ గా కూడా తీసుకోవచ్చు. ఇది దెబ్బతిన్న న్యూరాన్లను ఆరోగ్యవంతం చేసి నాడీ వ్యవస్థ నుంచి సాగాల్సిన సమాచార ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది.– అశ్వగంధ: మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాల నుంచి స్వస్థత పరిచి జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుందని ‘జర్నల్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్’ అధ్యయనంలో వెల్లడైంది. కార్టిసోల్ స్థాయులు పెరగడం వల్లనే ఒత్తిడి పెరుగుతుంది. అశ్వగంధ కార్టిసోల్ స్థాయులను తగ్గించి మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుతుంది. సమాచారాన్ని అందుకున్న తర్వాత మెడదు వేగంగా స్పందించి చేయాల్సిన పని మీద శ్రద్ధ, కార్యనిర్వహణ సమర్థతను మెరుగుపడుతుంది. అయోమయానికి గురికావడం తగ్గి ఆలోచనల్లో స్పష్టత చేకూరుతుంది. ఇది టాబ్లెట్, పౌడర్‌గా దొరుకుతుంది. నిద్ర΄ోయే ముందు పాలతో లేదా తేనెతో కలిపి తీసుకోవాలి.– పసుపు: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సుగుణాలుంటాయి. యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది. బ్రెయిన్ హెల్త్‌ని కూడా మెరుగు పరుస్తుందని ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ జీరియాట్రిక్ సైకియాట్రీ’ పేర్కొన్నది. దీనిని కూరల్లో వేసుకోవడం, జలుబు చేసినప్పుడు పాలల్లో కలుపుకుని తాగడం తెలిసిందే. నీటిలో పసుపు, మిరియాల పొడిని మరిగించి తాగితే జీవక్రియలు మెరుగుపడతాయి.– గోతుకోలా: దీనిని సెంట్రెల్లా ఏషియాటికా అంటారు. ఈ ఆకును ఆసియాలోని చాలా దేశాల్లో సలాడ్, సూప్, కూరల్లో వేసుకుంటారు. ఈ ఆకును నీటిలో మరిగించి టీ తాగవచ్చు. క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి. ఇది మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో రక్తప్రసరణ తగ్గడం వల్ల ఎదురయ్యే జ్ఞాపకశక్తి లోపం నివారణ అవుతుందని ‘జర్నల్ ఆఫ్ ఎథ్నోపార్మకాలజీ’ చెప్పింది. మధ్య వయసు నుంచి దీనిని వాడడం మంచిది.– గింకో బిలోబా: దీనిని చైనా వాళ్లు మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వార్ధక్యంలో ఎదురయ్యే మతిమరుపు (డిమెన్షియా) ను నివారిస్తుందని ‘కోష్రానే డాటాబేస్ ఆఫ్ సిస్టమిక్ రివ్యూస్’ తెలియ చేసింది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ్రపాపర్టీస్ మెదడు కణాల క్షీణతను అరికడతాయి. ఇవి కూడా మాత్రలు, పొడి రూపంలో దొరుకుతాయి. రోజూ ఈ పొడిని నీటిలో మరిగించి తాగితే వయసు మీరుతున్నా సరే మతిమరుపు సమస్య దరి చేరదు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
TG: షాకింగ్ ఘటన.. పసుపు లోడు లారీ హైజాక్
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి పసుపు లోడు లారీని హైజాక్ చేశారు. ఆర్టీఏ అధికారులమంటూ లారీని ఆపిన కేటుగాళ్లు.. డ్రైవర్‌పై మత్తు మందు చల్లి జన్నేపల్లి వైపు పసుపు లారీని తీసుకెళ్లారు.అక్కడ నుంచి పసుపు లోడును వేరే వాహనాల్లోకి తరలించే యత్నం చేశారు. పోలీసుల ఎంట్రీతో దుండగులు పారిపోయారు. పసుపు విలువ సుమారు రూ. 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. నిజామాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పసుపు ఆరోగ్యంపై ఇంతలా ప్రభావవంతంగా పనిచేస్తుందా?
పసుపుని వంటల్లో తప్పనిసరిగా వాడుతుంటాం. ఇది యాంటీ బయాటిక్‌లా పనిచేస్తుందని, దీని వల్ల ఎలాంటి వ్యాధులు దరి చేరవనేది అందరి నమ్మకం. ఇది మంచిదని తెలసుగానీ ఎంతలా ఆరోగ్యంపై ప్రభావవంతంగా పనిచేస్తుందనేది కచ్చితంగా తెలియదు. కానీ నిపుణులు ఈ పసుపుతో ఎన్ని రోగాలు నివారించొచ్చు అని నిర్థారించి మరి చెప్పుకొచ్చారు. ముఖ సౌందర్యం నుంచి వివిధ ఆరోగ్య సమస్యలను నివారించడం వరకు ఎంతలా ప్రభావవంతంగా ఉంటుందో వివరంగా తెలిపారు. అదెలోగో సవివరంగా నిపుణుల మాటల్లో తెలుసుకుందామా..!చైనీస్, మధ్య ప్రాచ్య వంటకాల్లో పసుపుకి సుదీర్ఘమైన చరిత్రను కలిగి ఉంది. దీన్ని ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమంటే..మంటను నివారిస్తుంది...పసుపులో కర్కుమిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద నిపుణుడు అనుపమ కిజక్కేవీట్టిల్ చెబుతున్నారు. ఎన్ఎఫ్-కే8 అనే అణువు శరీరంలోని వ్యక్తిగత కణాలలోని కేంద్రకం లేదా మెదడులోకి ప్రవేశించకుండా చేస్తుంది. తద్వారా మంటను ప్రేరేపించే జన్యువులు స్పందించకుండా నిరోధిస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లు, గాయాలు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లేదా టాక్సిన్స్ వంటి వాటి వల్ల వచ్చే మంటను ఇది తగ్గిస్తుంది. కేన్సర్‌కి చెక్..కేన్సర్‌ని పసుపు ప్రభావవంతంగా నిరోధించగలదని న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు పరిశోధకులు. అందుకోసం దాదాపు 12 వేల మందిపై పరిశోధన చేయగా 37% సానుకూల ఫలితాలను ఇచ్చింది. ఇది ప్రభావవంతమైన యాంటీ కేన్సర్ మందుగా పనిచేస్తుందని నిర్థారించారు. ముఖ్యంగా రోమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే ఆయా రోగులకు చేసే కీమోథెరపీ మెరుగ్గా పనిచేసేలా ఈ పసుపులో ఉండే కర్కుమిన్ సహాయపడుతుందని చెబుతున్నారు. డిప్రెషన్‌ని నివారిస్తుంది..పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తీవ్రమైన బాధ మెదడు మధ్య పరస్పర చర్యల కారణంగా మాంద్యంకి దారితీసి యాంటిడిప్రెసెంట్ థెరపీలకు స్పందిచలేని స్థితికి చేరుకునే విధంగా చేస్తుందని వెల్లడయ్యింది. అయితే పసుపులోని కర్కుమిన్ నిరాశను నిర్మూలించే శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుందని అధ్యయనంలో గుర్తించారు. అందుకోసం 60 మంది రోగులపై అధ్యయనం చేయగా..వారంతా డిప్రెషన్ ప్రభావం నుంచి మెరుగుపడినట్లు తేలింది. ఇక్కడ వారికి డిప్రెషన్‌కి సంబంధించిన మందులతో తోపాటు వెయ్యి మిల్లిగ్రాముల చొప్పున పసుపుని కూడా అందించారు. అందువల్లే సత్ఫలితాలను పొందగలిగారనేది గ్రహించాలి. మెదడు ఆరోగ్యానికి మంచిది..అల్జీమర్స్ వ్యాదిని నివారించడంలో పసుపు పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అందుకోసం పరిశోధకులు జంతువులపై జరిపిన అధ్యయనంలో తేలింది. జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడినట్లు తెలిపారు. ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తుంది..కీళ్ల వ్యాధులకు సంబంధించి 100 రకాలు ఉన్నాయి. ఇవన్నీ నొప్పి, వాపు, ధృఢత్వం, చలనశీలత కోల్పోవడం వంటి వాటికి దాతితీస్తాయి. పసుపు ఇలాంటి సమస్యలకు సమర్థవంతంగా చెక్‌పెడుతుంది. శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో రోజుకు మూడు సార్లు పసుపు సారం తీసుకుంటే..ఆర్థరైటిస్ లక్షణాలు తగ్గినట్లు గుర్తించారు. నొప్పులపై పసుపు చాల ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది..దీన్ని రోజూవారి ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సంబంధిత ప్రమాదాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ పసుపు క్రమ రహిత హృదయస్పందనలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఆస్పిరిన్ మాదిరిగా పసుపు రక్తాన్ని పలుచబరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. వర్కౌట్ల వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది..వ్యాయామాలు, పలు వర్కౌట్లు చేసేటప్పుడూ విపరీతమైన నొప్పులు వస్తాయి. వాటిని నివారించడంలో పసుపు బేషుగ్గా పనిచేస్తుంది. శాస్త్రవేత్తలు విపరీతమైన వర్కౌట్లు చేసే 59 మంది వ్యక్తులకు ఈ పసుపుని ఇవ్వగా ఎనిమిది వారాల తర్వాత వారిలో వ్యాయామం తర్వాత నొప్పులు తగ్గినట్లు తేలింది. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ లక్షణాలను కంట్రోల్ చేస్తుంది..ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అనేది ఒక మృగంలా ప్రవర్తించడం లేదా విచక్షణ రహితంగా ప్రవర్తించడం. ముఖ్యంగా మహిళలు ఋతుస్రావం సమయంలో ఈ లక్షణాలు తలెత్తుతుంటాయి. అలాంటి వారికి ఋతుస్రావం వచ్చే ఏడు రోజుల ముందు, ఆ తర్వాత వరకు ఈ పసుపుని సప్లిమెంట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. వారిలో తీవ్ర కోపంతో ప్రవర్తించే లక్షణాలు కంట్రోల్ అయ్యినట్లు గుర్తించారు పరిశోధకులు. కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది..శరీరంలోని కొలస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ప్రతిరోజూ 500 మిల్లిగ్రాముల మోతాదులో పసుపు తీసుకుంటే హెచ్‌డీఎల్ కొలస్ట్రాల్‌లో 33% పెరుగుదల, సీరం కొలస్ట్రాల్ దాదాపు 12% తగ్గినట్లు తేలింది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లక్షణాలను తగ్గిస్తుంది..పెద్ద ప్రేగులను ప్రభావితం చేసే వ్యాధి. దీనికారణంగా కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. వారికి ఈ పసుపు మాత్రలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి..మైగ్రేన్ తలనొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. నిపుణుల సలహా మేరకు తగు మోతాదులో తీసుకంటే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు.స్కిన్ డ్యామేజ్‌ని తగ్గిస్తుంది..మొటిమలు, మచ్చలను వంటి నివారిస్తుంది. చర్మ సంరక్షణలో పసుపు చాల కీలకపాత్ర పోషిస్తుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. బరువు అదుపులో ఉంటుంది..బరువుని తగ్గించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. నాన్‌వెజ్, అన్నం, కూరల్లో ఈ పసుపుని ఉయోగించడం వల్ల బరువు అదుపులో ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.(చదవండి: పారిస్ ఒలింపిక్స్ 2024: టీమ్ ఇండియా దుస్తులను డిజైన్ చేసేదేవరంటే..!) -
పసుపుతో అందం, ఆరోగ్యం, ఈ టిప్స్ ఎపుడైనా ట్రై చేశారా?
పసుపు శుభ్రపదమైందే కాదు ఆరోగ్యంకరమైంది. కూడా. అందుకే భారతీయ వంటకాల్లో, ఇతర ఆహార పదార్థాల తయారీలో విరివిగా వినియోగిస్తారు. వంటింట్లో దివ్యౌషధం పసుపు. యాంటీ బయాటిక్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్న పసుపు కేవలం ఆహార పదార్థాల్లోనే కాదు, సౌందర్య పోషణలోనూ చాలా ఉపయోగపడుతుంది.ఆరోగ్య ప్రయోజనాలు ⇒ పసుపును ఆహారంలో రెగ్యులర్ చేసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పు నుండి దూరంగా ఉండొచ్చట. ⇒ సేంద్రీయ పసుపు వాడటం వల్ల కొన్ని రకాల కేన్సర్లనుంచి కూడా దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతారు.⇒ చలికాలంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు పసుపు, తులసి, మిరియాల కషాయం బాగా పనిచేస్తుంది. ⇒ జలుబు చేసినపుడు వేడినీటిలో చిటికెడంత పసుపు వేసుకొని ఆవిరి పడితే ఉపశమనం లభిస్తుంది. ⇒ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడానికి పసుపు చక్కని పరిష్కారం.⇒ పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు పసుపు తోడ్పడుతుంది.పసుపుతో అందంపసుపు, పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని, బాగా ఎండిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ముఖంమృదువుగా కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఇదే మిశ్రమాన్న ఒంటికి నలుగులాగా కూడా వాడుకోవచ్చు. ముఖం మీది మచ్చలు తొలగి పోవాలంటే.. పసుపు, టమాటా గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.పసుపు, కలబంద గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే ముఖంపై ఉండే ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు.పసుపు, నిమ్మరసం, తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే ముఖంపై ఉండే డార్క్ స్పాట్స్ ,మొటిమలు పోతాయి.పసుపు, తాజా కలబంద గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే జిడ్డు చర్మం తొలగి ఫ్రెష్‌గా మారుతుంది. -
Beauty Tips: చర్మం కాంతివంతంగా మెరిసేలా.. ఈ బ్యూటీ టిప్స్!
దగదగా మెరిసే ముఖానికై చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మన ఇంట్లోనే ఉన్న పసుపు, కొబ్బరిపాలు, రోజ్‌వాటర్‌తో ముఖం కాంతివంతంగా మెరిసేలా చేయవచ్చని మీకు తెలుసా! అయితే ఇలా ప్రయత్నించి చూడండి..ఇలా చేయండి..టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్ పీల్ పౌడర్, కప్పు రోజ్‌వాటర్, టీస్పూను కొబ్బరిపాలు, ఆరు చుక్కల నిమ్మనూనెను తీసుకుని ఒక బౌల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌క్యూబ్స్ ట్రేలోపోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ క్యూబ్‌లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి.ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్‌క్యూబ్స్‌తో ఇరవై నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయాలి.ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగి తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్‌ను రాసుకోవాలి.ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకు΄ోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్పోయి ముఖం ప్రకాశవంతంగా... తాజాగా కనిపిస్తుంది.చర్మం జిడ్డు కారడం నియంత్రణలో ఉండడమేగాక, దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి.పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య ఛాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. -
సిమెంట్ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు!
బెల్లం, పసుపు, మెంతి ఆకు, వేప ఆకు... ఇదంతా ఇప్పుడు కిచెన్ మెటీరియల్ మాత్రమే కాదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఈ నిజానికి నిదర్శనం కోసం రాజస్థాన్ కెళ్లాల్సిందే. రాజస్థాన్ లోని అల్వార్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిప్రా సింఘానియా తన మేధను రంగరించి ఇల్లు కట్టుకుంది. అందరూ సిమెంట్, ఇసుక కలిపి ఇల్లు కడుతుంటే మీరెందుకిలా కట్టుకున్నారని అడిగితే ఆమె చెప్పే సమాధానమేమిటో చూద్దాం...‘‘మాది ఎడారి రాష్ట్రం. ఉష్ణోగ్రతలు వేసవిలో 41 డిగ్రీలకు చేరుతాయి, శీతాకాలంలో ఎనిమిది డిగ్రీలకు పడిపోతాయి. ఆ వేడిని భరించడమూ కష్టమే, అంత చలిని కూడా తట్టుకోలేం. ఇంటి నిర్మాణం ఈ ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే విధంగా ఉండాలని కోరుకున్నాను. అందుకోసం బురదమట్టి, సున్నపురాయిలో వేపాకులు బెల్లం, పసుపు, మెంతి ఆకు వంటి అనేక పదార్థాలను సమ్మిళితం చేసి ఇల్లు కట్టుకున్నాను. నిజానికి ఈ ఫార్ములా నేను కొత్తగా కనిపెట్టినదేమీ కాదు.ఇంటి లోపల అధునాతన సౌకర్యాలతో..భవన నిర్మాణంలో సిమెంట్ ఉపయోగించడానికి ముందు మనదేశంలో పాటించిన విధానాన్నే పునరుద్ధరించాను. ఇది రెండువేల చదరపు అడుగుల నిర్మాణం. పైకప్పు కేంద్రభాగం 23 అడుగుల ఎత్తు ఉంది. ఇందుకోసం స్వయంగా నేనే డిజైన్ గీసుకున్నాను. వేపాకు చెద పురుగుల నుంచి రక్షణనిస్తుంది. బెల్లం, మెంతిలోని జిగురుకు నిర్మాణ ముడిసరుకులో ఇతర వస్తువులను గట్టిగా పట్టుకునేటంతటి సామర్థ్యం ఉంటుంది.ఈ నిర్మాణంలో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తాయి. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే జీరో సిమెంట్ నిర్మాణం అన్నమాట’’ అని చెప్పారు శిప్రా సింఘానియా. ఈ విధమైన నిర్మాణ శైలి ఇప్పుడిప్పుడే అందరి దృష్టిలో పడుతోంది. బహుశా ఇక నుంచి ఆ ఇంటిని ‘శిప్రా సింఘానియా ఇల్లు’ అని చెప్పుకుంటారేమో. ఇంతకీ ఈ ఇల్లు ఎండను, చలిని ఎంత మేర తగ్గిస్తుందంటే వేడిని కనీసంగా ఎనిమిది డిగ్రీలు తగ్గిస్తుంది. శీతాకాలంలో పదహారు డిగ్రీలకు తగ్గకుండా కాపాడుతుంది.ఇవి చదవండి: 'నిద్ర'కూ ఓ స్టార్టప్.. సూపర్ సక్సెస్! -
పసుపు కోల్డ్ స్టోరేజ్ లో మంటలు
-
పసుపు ప్రాణాలను హరిస్తుందా? వెలుగులోకి షాకింగ్ విషయాలు
పసుపు శుభాకార్యలకే గాక ఆయుర్వేద పరంగా కూడా మంచి ఔషధ లక్షణాలు కలిగింది. ఇందులో అధికంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందువల్ల వంటల్లో తప్పనిసరిగా పసుపుని వాడతారు అందరూ. అలాంటి పసుపు కాస్తా సీసంలా మారి ప్రాణాలను హరిస్తుందంటూ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అందుకోసం బంగ్లాదేశం ప్రభుత్వం నడుబిగించి మరి పసుపు వాడకాన్ని నియంత్రించిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. నిజంగా పసుపు మంచిది కాదా? అది ప్రాణాంతకమైన సీసంలా మారుతుందా? తదితరాల గురించే ఈ కథనం! దక్షిణాసియా వాసులు విరివిగా వాడే వాటిలో ఈ పసుపు ఒకటి. ఇప్పుడది మంచిది కాదని, దీని వల్ల ప్రజలు చనిపోతున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. దీని కారణంగా చాలామంది ప్రజలు, చిన్నారుల, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్నట్లు పేర్కొంది. 2019లో ఈ పసుపు కారణంగా దాదాపు 1.4 మిలియన్ల మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డయేరియా డిసీజ్ రీసెర్చ్ బృందాలు, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంతో కలిపి చేసిన పరిశోధనాల్లో పసుపుకి సంబంధించిన పలు షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఈ పసుపు వినియోగం కారణంగా వ్యక్తుల శరీరంలోని రక్తంలో సీసం చేరి ఎలా ప్రాణాలు తీస్తుందో వివరించింది. ఇదేలా జరుగుతందని పలు అధ్యయనాలు జరపగా.. పసుపు కల్తీకి గురవ్వడం వల్ల అని తేలింది. ముఖ్యంగా హోల్‌సేల్ మార్కెట్లోని వ్యాపారులు పసుపుని పెద్ద ఎత్తున్న కల్తీ చేస్తున్నారని గుర్తించారు బంగ్లాదేశ్ అధికారులు. ఈ కల్తీకి అడ్డుకట్టవేసేలా బంగ్లాదేశ్ బజార్లలో పెద్ద ఎత్తున్న హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఈ కల్తీ పసుపు వినియోగానికి అడ్డుకట్ట వేసేలా ప్రచారం చేసింది. దీని ఫలితంగా రెండేళ్లో సుగంధ ద్రవ్యాల మార్కెట్లో పసుపు కల్తీ వ్యాప్తి కట్టడి చేస్తూ.. సున్నాకి తీసుకొచ్చింది. పసుపు మిల్లీ కార్మికుల రక్తంలోని సీసం స్థాయిలను చూసి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యే దీనిపై దృష్టిసారించే పరిశోధనలకు నాంది పలికింది. అప్పుడే పసుపు పెద్ద ఎత్తున కల్తీ అవుతున్నట్లు గుర్తించింది. దీనికి సత్వరమే అడ్డుకట్టవేసి లక్షలాది ప్రాణాలను కాపాడింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఈ కల్తీ కారణంగా ప్రపంచంలోని సుమారు 815 మంది మిలియన్ల మంది పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ ప్రాణాంతక లోహం బారిన పడుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఈ పరిస్థితి పేద దేశాల్లో పిల్లల్లో ఎక్కువుగా కనిపిస్తోందని వాషింగ్టన్‌లోని థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ పేర్కొంది. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన పసుపు ప్రకృతి ప్రసాదించిన ప్రసాదంగా సక్రమంగా వాడితే ఎంత మంచిదో దాన్ని కూడా కల్తీ చేసేందుకు యత్నిస్తే మన ప్రాణాలనే హరిస్తుందనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ. (చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!) -
నల్ల పసుపు గురించి విన్నారా? ఎన్ని వ్యాధులకు చెక్ పెడుతుందంటే..
పసుపు, వాటి దుంపలు మనం చూశాం. అది ఎన్ని ఔషధ గుణాలు కలిగిందో కూడా తెలుసు. కానీ నల్ల పసుపు గురించి ఎప్పుడైనా విన్నారా! అది కూడా మనం వాడే పసుపుకు ఎంతో విభిన్నంగా ఉంటుంది. కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. నల్ల పసుపును సాధారణంగా భారతదేశంలోని ఈశాన్య, మధ్యప్రదేశ్‌లో పండిస్తారు. నల్ల పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం కర్కుమా సీసియా. మణిపూర్, మరికొన్ని రాష్ట్రాల్లోని గిరిజన తెగల్లో ఈ మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. నల్లపసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. దీనిలో క్యాన్సర్ కణాలను నిరోధించే లక్షణాలు ఉన్నాయి. నల్ల పసుపు మీ ఆహారంలో తీసుకుంటే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.వివిధ ఆరోగ్య సమస్యలు ఉపశమనానికి ఎంతో దోహదం చేసే పసుపు క్యాన్సర్‌కు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని గత పరిశోధనలు చెప్పాయి. అయితే తాజాగా జీర్ణాశయ క్యాన్సర్‌ని నయం చేసే శక్తి పసుపు ఉన్న నేపథ్యంలో ఆరోగ్య నిపుణులుజీర్ణాశయ క్యాన్సర్ చికిత్సలో పసుపును వినియోగించే పద్ధతిని అభివృద్ధి చేసి సక్సెస్ అయ్యారు. సాధారణంగా పసుపు నల్ల మిరియాలు కలిపిన వేడి పాలను తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది అనేది అనాదిగా మనందరికీ తెలిసిన చిట్కా. భారతదేశంలో వేల ఏళ్ళుగా ఈ చిట్కాను అనుసరిస్తున్నారు. నల్ల పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు నల్ల పసుపులోని రైజోమ్ చేదు రుచిని కలిగి ఉంటుంది. దీన్ని ల్యూకోడెర్మా (మెలనిన్పిగ్మెంటేషన్కోల్పోవడం) మరియు పైల్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ పసుపు మిశ్రమం బెణుకులు, గాయాల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. గిరిజన స్త్రీలు రుతు క్రమ రుగ్మతలకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని సాంప్రదాయకంగా గిరిజన ప్రజలు జ్వరం, వాంతులు, విరేచనాలు, కణితులు, లైంగిక వ్యాధులు, మంట మొదలైనవాటి చికిత్సకు ఉపయోగిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆది తెగవారు నల్ల పసుపు రైజోమ్‌ను యాంటీ డయేరియాటిక్గా ఉపయోగిస్తున్నారు. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోహిత్ జిల్లాకు చెందిన ఖమ్మం తెగవారు నల్ల పసుపు దుంప తాజాపేస్ట్ను తేలు, పాముకాటుకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. నల్ల పసుపు బెండులను తరచుగా న్యుమోనియా, దగ్గు మరియు పిల్లలలో జలుబు కోసం కూడా చికిత్సకు ఉపయోగిస్తారు. రైజోమ్లు ల్యూకోడెర్మా, మూర్ఛ,క్యాన్సర్ మరియు హెచ్ఐవి / వ్యతిరేకంగా పని చేస్తాయి. మైగ్రేన్ నుంచి ఉపశమననాకి ఉపయోగిస్తారు. అస్సాంలో తాజా రైజో మ్రసాన్ని ఆవాల నూనెతో కలిపి పశువుల విరేచనాల చికిత్సకు ఉపయోగిస్తార (చదవండి: ఆల్కహాల్ మోతాదుకు మించితే చనిపోతారా? పాయిజిన్‌గా ఎలా మారుతుంది?) -
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం -
AP: పసుపు@రూ.11,750.. ప్రభుత్వ జోక్యంతో నెలలోనే రెట్టింపైన ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యలు ఫలించాయి. పసుపు ధర అమాంతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ధర లభిస్తుండడంతో రైతులు ఎంతో సంతోషిస్తున్నారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన దుగ్గిరాల పసుపు మార్కెట్లో శుక్రవారం క్వింటా పసుపు ధర రూ.11,750 పలికింది. ఈ స్థాయి ధర చరిత్రలో ఎన్నడూ లభించలేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఈసారి క్వింటా రూ.15 వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2022–23 సీజన్లో రాష్ట్రంలో 84 వేల ఎకరాల్లో పసుపు సాగవగా 4 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. సాధారణంగా 50 శాతం రాష్ట్ర పరిధిలో వినియోగిస్తుండగా, 20 శాతం పొరుగు రాష్ట్రాలకు, 30 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. 2022–23 సీజన్లో పసుపునకు కనీస మద్దతు ధర రూ.6,850గా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ధర తగ్గిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. టీడీపీ ఐదేళ్ల పాలనలో 28,563 మంది రైతుల నుంచి రూ.305 కోట్ల విలువైన 48,540 టన్నుల పసుపును సేకరిస్తే, 2019–20 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 28,724 మంది రైతుల నుంచి రూ.437.24 కోట్ల విలువైన 56,536 టన్నుల పసుపును సేకరించింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా దాదాపు రెండున్నరేళ్లపాటు పసుపు రైతుకు మంచి ధర లభించింది. ఒక దశలో క్వింటా రూ.10 వేలకుపైగా పలికింది. రబీ 2022–23 సీజన్ ప్రారంభంలో రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్య పలికిన పసుపు ధర ఆ తర్వాత మేలో అనూహ్యంగా ఎమ్మెస్పీ కన్నా దిగువకు పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకు తోడు దేశీయంగా పసుపు పంట ఒకేసారి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిçస్తున్న ప్రభుత్వం ధరలు తగ్గిన వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా పసుపు రైతుకు అండగా నిలిచింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి రైతుల నుంచి కనీస మద్దతు ధర రూ.6,850 చొప్పున పసుపు కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకేల ద్వారా 2,794 మంది రైతుల నుంచి రూ.34.39 కోట్ల విలువైన 5,020 టన్నుల పసుపును రైతుల నుంచి సేకరించింది. ప్రభుత్వ జోక్యంతో వ్యాపారులు కూడా పోటీపడి కనీస మద్దతు ధరకు మించి కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. దీంతో ధరలు మళ్లీ ఎమ్మెస్పీకి మించడంతో ప్రభుత్వం కొనుగోళ్లను నిలిపేసింది. క్వాలిటీని బట్టి ఈ ఏడాది జూన్‌లో క్వింటా రూ.5,300 నుంచి రూ.6,250 మధ్య పలికిన పసుపు జూలై వచ్చేసరికి రూ.8 వేల నుంచి రూ.10,511 మధ్య పలికింది. ఆగస్టులో గత ఏడాది క్వింటా రూ.5 వేల నుంచి రూ.6,300 మధ్య పలకగా, ప్రస్తుతం రూ.8,200 నుంచి రూ.11,750 పలుకుతోంది. పెట్టుబడి పోను రూ.5 లక్షలు మిగులుతోంది. మూడెకరాల్లో పసుపు వేశా. ఎకరాకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. మంచి దిగుబడి వచ్చింది. రెండునెలల కిందట రూ.5 వేలకు మించి పలకకపోవడంతో పెట్టుబడి కూడా దక్కదేమోనని ఆందోళన చెందాను. ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు చేయడంతో మళ్లీ ధరలు పెరిగాయి. శుక్రవారం 100 క్వింటాళ్లు మార్కెట్‌కు తీసుకొచ్చా. క్వింటా రూ.11,100 చొప్పున కొన్నారు. రూ.11 లక్షలకుపైగా ఆదాయం వచ్చింది. పెట్టుబడిపోను రూ.5 లక్షలకు పైగా మిగులుతోంది. చాలా ఆనందంగా ఉంది. – ఎస్.రాము, చింతమోటు, భట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా ఈ స్థాయి ధర ఎప్పుడూ రాలేదు ఒకటిన్నర ఎకరాలో సాగుచేశా. ఎకరాకు 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నెలన్నర కిందటి ధరతో పోలిస్తే రెట్టింపు ధర లభించింది. ప్రభుత్వం కొనడం మొదలు పెట్టిన తర్వాత రేటు పెరుగుతూ వస్తోంది. ఈరోజు 44 క్వింటాళ్ల పసుపు తీసుకొచ్చాను. క్వింటా రూ.11 వేలకు కొన్నారు. ఈ స్థాయి ధర గతంలో ఎప్పుడూ లభించలేదు. చాలా సంతోషంగా ఉంది. – ఎ.వెంకటసుబ్బయ్య, పోరుమామిళ్ల, వైఎస్సార్ జిల్లా ధర మరింత పెరిగే అవకాశం ప్రభుత్వ జోక్యంతోపాటు డిమాండ్‌కు తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. దుగ్గిరాల మార్కెట్ పరిధిలోని కోల్డ్ స్టోరేజ్‌ల్లో మూడులక్షల టన్నుల పసుపు ఉంది. రైతుల వద్ద మరో మూడులక్షల టన్నుల సరుకు ఉంది. కొల్లిపర, లంకల ఏరియా, సత్తెనపల్లి, పిడుగురాళ్లతో పాటు వైఎస్సార్ జిల్లా నుంచి రోజూ 30–40 లారీల పసుపు వస్తోంది. ధర మరింత పెరిగే అవకాశం ఉంది. – ఎన్.శ్రీనివాసరావు, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ యార్డు, దుగ్గిరాల ప్రభుత్వ జోక్యం వల్లే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సీఎం యాప్‌ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇలా ఈ సీజన్లో రూ.513.94 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాం. ప్రభుత్వ జోక్యం వల్లనే నెల తిరక్కుండానే పసుపునకు మంచి ధర లభిస్తోంది. మొక్కజొన్న క్వింటా రూ.2 వేలకు పైగా పలుకుతుండగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసుపు ధర క్వింటా రూ.11,750 పలుకుతోంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి -
‘ఏఐ’పంట!
కంచర్ల యాదగిరిరెడ్డి:నాగలి పోయి ట్రాక్టర్ వచ్చినప్పుడు.. యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు.ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో బాగున్నాయే అనుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం కొంత పుంజుకున్నా.. తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు.ఇలాంటి సమయంలోనే ‘చాట్ జీపీటీ’, దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా. మరి మొత్తంగా దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయానికి ఏం ఒనగూరుతుంది? అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50 శాతంపైనే. కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వం రకరకాల పథకాలు, లాభాలు చేకూరుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు తక్కువే. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్ ఓపెన్ ఏఐ సర్విస్ ద్వారా చాట్ జీపీటీ ఆధారంగా తయారైన‘జుగల్బందీ’చాట్‌బోట్ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్వేర్. వాట్సాప్ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్ బోట్ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ అందిస్తూండటం విశేషం. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడంకోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు. ప్రిడిక్టివ్ అనాలసిస్: వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వేసిన పంట ఎంత బాగా పండేది కచి్చతంగా చెప్పగలదు. దీన్నే ప్రిడిక్టివ్ అనాలసిస్ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. గరిష్టంగా దిగుబడులు: నేల, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఏ పంట వేస్తే గరిష్ట దిగుబడులు రాబట్టుకోవచ్చో గుర్తించగలదు. పంటల యాజమాన్య పద్ధతులను కూడా నిర్దిష్ట పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, సొంతంగా పంటల తాలూకు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ప్రిసిషన్ అగ్రికల్చర్: జనరేటివ్ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే.. అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్ అగ్రికల్చర్ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి. కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్ ఏఐను ఉపయోగిస్తే.. అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపు ణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కత్రిమ మేధ సాఫ్ట్వేర్లు వేగంగా గుర్తించగలవు. చాట్బోట్లు.. కాల్‌సెంటర్లు భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది. కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్ శాఖ వాట్సాప్ ఆధారిత చాట్‌బోట్ ఒకదాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్ ఏఐ (కిసాన్ జీపీటీ)’ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్ దేశాయ్ తెలిపారు.వాధ్వానీ ఏఐ అనే స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ కూడా జనరేటివ్ ఏఐ సాయంతో రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కిసాన్ కాల్‌సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. వ్యవసాయ రంగ నిపుణుల అనుభవాన్ని జనరేటివ్ ఏఐతో అనుసంధానించేందుకు తాము ప్రయతి్నస్తున్నట్లు వాధ్వానీ ఏఐ తెలిపింది. డిజిటల్ గ్రీన్ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్ ఏఐ’ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్‌బోట్ ద్వారా అందిస్తోంది. తెలంగాణలో ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరగా మార్కెటింగ్ చేసుకోవడానికి, తగిన ధర పొందడానికి ఇది వీలు కల్పిస్తోంది. -
పసుపు నాణ్యత లెక్క..2 నిమిషాల్లో పక్కా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ ఆరుగాలం కష్టపడి పండించిన పంట.అందులోనూ పొలాన్ని శ్రద్ధగా, శుచీశుభ్రంగా చూసుకుంటూ పండించే పసుపు పంట. దిగుబడి వచ్చాక మార్కెట్‌కు తీసుకొస్తే.. నాణ్యతపై కొర్రీలు.. ‘కర్క్యుమిన్’ శాతంపై సందేహాలు.. ల్యాబ్‌ల నుంచి రిపోర్టులు రావడానికి నాలుగైదు రోజులు.. వేచి ఉండలేక తక్కువ ధరకు అమ్ముకునే రైతులు..ఇన్నేళ్లుగా కనిపించిన దృశ్యమిది. మరి ఇప్పుడు.. మార్కెట్లో వెంటనే నాణ్యత పరీక్షలు.. నిమిషాల్లోనే ‘కర్క్యుమిన్’, తేమ శాతం లెక్కలు.. ఆన్లైన్లో పసుపు పంట విక్రయాలు.. రైతులకు మంచి ధరలు.. దీనంతటికీ కారణం ‘కృత్రిమ మేధ (ఏఐ)’తో కూడిన అత్యాధునిక యంత్రాలు. దేశంలోనే ముఖ్యమైన పసుపు మార్కెట్లలో ఒకటైన నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఈ సరికొత్త సాంకేతికత రైతులకు వరంగా మారింది. దేశంలోనే మొదటిసారిగా కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు ఇక్కడ ‘కర్క్యుమిన్ రీడింగ్ మెషీన్’ను ఏర్పాటు చేసింది. రెండేళ్ల కింద మొదలై.. పసుపులో కర్క్యుమిన్ ఆధారిత మార్కెటింగ్ దిశగా దేశంలోనే తొలిసారిగా నిజామాబాద్ మార్కెట్లో పునాది పడింది. రైతుల పసుపు పంటలోని కర్క్యుమిన్ శాతాన్ని స్థానికంగానే, త్వరగా తెలుసుకునేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వ సుగంధ ద్రవ్యాల బోర్డు ఇక్కడి మార్కెట్ యార్డులో ‘కర్క్యుమిన్ రీడింగ్ మెషీన్’ను ఏర్పాటు చేసింది. ‘ఏజీ–నెక్ట్స్’ సంస్థ తయారు చేసిన ఈ యంత్రం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఆధారంగా ‘క్లౌడ్ టెక్నాలజీ’తోనూ అనుసంధానం అవుతుంది. రైతులు తెచ్చిన పసుపులోని ఒక కొమ్మును పొడిచేసి, ఈ యంత్రంలో పెడితే.. కేవలం రెండు నిమిషాల్లోనే అందులోని కర్క్యుమిన్ శాతాన్ని వెల్లడిస్తుంది. ఇంతకుముందయితే.. పసుపు శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపేవారు, ఫలితాలు రావడానికి రెండు, మూడు రోజులు సమయం పట్టేది. ఇక పసుపులో తేమశాతాన్ని గుర్తించే యంత్రాన్ని సైతం గత ఏడాది ఇక్కడి మార్కెట్లో ఏర్పాటు చేశారు. పసుపు కొమ్ములను దంచి ముక్కలను ఇందులో వేస్తే.. కేవలం 5 నిమిషాల్లో తేమ శాతం తెలిసిపోతుంది. రైతులకు ఉచితంగా.. నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు పంట వచ్చే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కర్క్యుమిన్ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి శాంపిల్‌కు రూ.140 రుసుము వసూలు చేస్తున్నారు. అయితే మార్కెట్లో పసుపు అమ్మేందుకు వచ్చిన రైతుల నుంచి మాత్రం రుసుము తీసుకోవడం లేదు. వారి పసుపు కర్క్యుమిన్ శాతం ఫలితాలను ‘ఈ–నామ్’ సైట్లో నమోదు చేసి, సంబంధిత పసుపు విక్రయ లాట్‌కు అను సంధానం చేస్తున్నారు. ‘ఈ–నామ్’ సైట్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోని రైతులు అయినా.. ఇక్కడి పంటను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల కర్క్యుమిన్ శాతం ఎక్కువగా ఉన్న పసుపు రైతులకు మంచి ధర లభిస్తోందని అధికారులు తెలిపారు. కర్క్యుమిన్ పరీక్ష యంత్రం, దాని సాఫ్ట్వేర్, నిర్వహణ కలిపి మొత్తం రూ.50 లక్షలు అని వెల్లడించారు. నిజామాబాద్‌లో ఇది విజయవంతం కావడంతో ఇటీవలే మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోనూ ఏర్పాటు చేశారని చెప్పారు. ఏమిటీ ‘కర్క్యుమిన్’? పసుపులో తేమ శాతాన్ని తెలిపే యంత్రం పసుపులో ఉండే కీలక రసాయన పదార్థమే ‘కర్క్యుమిన్’. దీనితోనే పసుపు పంటకు ఆ రంగు వస్తుంది. ఆహారం నుంచి ఔషధాల దాకా.. రంగుల తయారీ సౌందర్య ఉత్పత్తుల దాకా.. దీని ప్రయోజనాలెన్నో. కర్క్యుమిన్కు యాంటీ బయాటిక్,యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు ఉంటాయని.. కేన్సర్ సహా ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణకు, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. -
Turmeric: మీకు ఈ సమస్యలు ఉంటే పసుపు అస్సలు వాడొద్దు!
భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా వాడే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో కూడా పసుపును ఔషధంగా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ బయోటిక్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు పసుపును కూడా మితంగానే వాడాలి. అధ్యయనం ప్రకారం రోజుకు ఒక టీ స్పూన్ పసుపు మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. ఒకవేళ మీరు దీర్ఘకాలంగా వ్యాధుల బారిన పడితే పసుపును వాడొద్దంటున్నారు నిపుణులు. ♦ పసుపు డయాబెటిక్ ఫేషెంట్స్కు అంత మంచిది కాదు అంటారు. ఎక్కువగా పసుపు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్ పెరుగుతుందట. ♦ పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించి పలు సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు కలగవచ్చు. ♦ ముఖ్యంగా ఐరన్ లోపంతో బాధపడుతున్న వాళ్లు పసుపును ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత అధికం అవుతుంది. ♦ కామెర్లు ఉన్నవారు పసుపుకు వీలైనంతగా దూరంగా ఉండాలి. లేకపోతే ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. ♦ కొందరు అలర్జీతో బాధపడుతుంటారు. అలాంటి వారు చాలా మితంగా పసుపును వాడాలి. లేదంటే అలర్జీ సమస్య తీవ్రమవుతుంది. ♦ కొందరికి శరీరంలో వేడి పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారు పసుపును ఎక్కువగా తినడం వల్ల మరింత వేడి పెరుగుతుంది. ♦ అధికంగా పసుపు వినియోగించడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
Beauty: అందుకే అవాంఛిత రోమాలు! ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉండేవి తింటే..
ప్రస్తుతకాలంలో అవాంఛిత రోమాలతో చాలామంది బాధపడుతున్నారు. అది అందమైన ముఖాన్ని అంద విహీనంగా చేస్తుంది. వాటిని చూసుకున్నప్పుడల్లా స్త్రీలు ఎంతో బాధని అనుభవిస్తుంటారు. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై అవాంఛిత రోమాలు పెరుగుతుంటాయి. ఏది ఏమైనా అవాంఛిత రోమాలు అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. దీనికి వాక్సింగ్, షేవింగ్, ఇతర చికిత్సలు చేయించటం వల్ల క్రమంగా మరింత పెరుగుతాయి. దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమి లేదు, కానీ కొన్ని సహజ నివారణలు ఉన్నాయి. అవేంటో చూద్దాం... పసుపు ►ఇది మనం ప్రతి రోజు మన వంటల్లో వాడేదే.. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు అవాంఛిత రోమాలును తొలగించి ముఖంలో తేజస్సుని, అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ►దీన్ని ఆయుర్వేదంలో ఒక ఔషధంలా ఉపయోగిస్తారు. ►పసుపుని శెనగపిండితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ►పసుపు రోమాలను తొలగించటమే కాకుండా వాటి పెరుగుదలను కూడా అదుపులో ఉంచుతుంది. ఇవి కూడా! ►వీటితోపాటుగా ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ రోమాలు వదిలించుకోవటంలో సహాయపడుతుంది. ►సరియైన ఆహారం తీసుకోకపోవడం వలన ఇది అధికమయ్యే ప్రమాదముంది. ►ముఖంపై అవాంఛిత రోమాల బెడద తగ్గాలంటే ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ►ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా అవిసెగింజలు, సోంపు, అల్ఫాల్ఫాలో ఉంటాయి. చదవండి: Heart Attack: బయట ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే.. Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
Recipe: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా
ఈ కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ఇంచుమించు ప్రతి ఒక్కరినీ తరచు జలుబు పీడిస్తుంటుంది. పిల్లలకు ఇష్టమైనవి వండినా సరే... నాలుకకు రుచి తెలియక మారాం చేస్తారు. రుచిగా... ఆరోగ్యంగా ఇలా వండి చూడండి.. పిల్లలలే కాదు, పెద్దలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. నువ్వుల అన్నం కావలసినవి: ►బియ్యం – 2 కప్పులు (అన్నం పలుకుగా వండాలి) ►నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు ►ఎండు మిర్చి– 4 ►మినప్పప్పు – టీ స్పూన్ ►పచ్చి శనగ పప్పు – టేబుల్ స్పూన్ ►ఆవాలు– అర టీ స్పూన్ ►పసుపు – అర టీ స్పూన్ ►వేరుశనగపప్పు – 2 టీ స్పూన్లు ►వెల్లుల్లి – 4 రేకలు ►ఇంగువ– చిటికెడు ►కరివేపాకు – రెండు రెమ్మలు ►నువ్వుల నూనె లేదా సాధారణ వంట నూనె– రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి తగినంత. తయారీ: మందపాటి పెనంలో పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, నువ్వులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి. చల్లారిన తరవాత మెత్తగా పొడి చేసి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచాలి మరొక వెడల్పాటి పెనంలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత వేరుశనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి కలిపి దించేయాలి. ఇందులో అన్నం, ఉప్పు, నువ్వుల మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇవి కూడా ట్రై చేయండి: Green Amla Juice: డయాబెటిస్‌ను అదుపులో ఉంచే గ్రీన్ ఆమ్ల జ్యూస్.. బీపీ క్రమబద్ధం చేసే డ్రింక్! Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ -
Beauty Tips: గ్రీన్ టీ.. బియ్యం పిండి, తేనె.. ముఖం మెరిసిపోయే చిట్కా
ముఖ చర్మం శుభ్రపడి.. నిగారింపు సంతరించుకోవాలంటే ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి! గ్రీన్ టీ మాస్క్! ►కప్పు గ్రీన్ టీలో రెండు స్పూన్ల బియ్యం పిండి, అరస్పూను తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ►20 నిమిషాలపాటు ఆరనిచ్చి, తరువాత ఐదు నిమిషాలపాటు ముఖంపైన గుండ్రంగా మర్దనా చేయాలి. ►ఆ తరువాత ముఖం కడుక్కోవాలి. ►వారానికి రెండు సార్లు ఈ మాస్క్ వేసుకుంటే ముఖ నిగారింపు మెరుగుపడుతుంది. లెమన్ మాస్క్! ►శనగపిండి, పసుపు, నిమ్మరసం, పచ్చిపాలను ఒక్కోస్పూను తీసుకుని మెత్తని పేస్టులా కలుపుకోవాలి. ►ఈ పేస్టును ముఖానికి రాసి మర్దనా చేసుకోవాలి. ►20 నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడగాలి. ►ఇలా చేయడం వల్ల ముఖచర్మం శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటుంది. చదవండి: Beauty Tips: బియ్యప్పిండి.. తేనె.. ట్యాన్ తగ్గుముఖం పట్టడం ఖాయం! ఇక పసుపుతో కలిపి పెడితే.. Health Tips: నట్స్, డార్క్ చాక్లెట్స్, అరటి పండ్లు తరచూ తింటున్నారా? డోపమైన్ అనే హార్మోన్ విడుదల చేసి.. -
Beauty: బియ్యప్పిండి.. తేనె.. ట్యాన్ తగ్గుముఖం పట్టడం ఖాయం!
Honey Pack Benefits: ట్యాన్ తొలగి ముఖారవిందం ద్విగుణీకృతం కావాలా? సహజసిద్దమైన నిగారింపుతో మెరిసిపోవాలా? అయితే, తేనెతో వీటిని కలిపి ముఖానికి అప్లై చేయండి. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. పెరుగుతో ►రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టేబుల్ స్పూను తేనె తీసుకుని బాగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ►పదిహేను నిమిషాల తరువాత కడగాలి. పసుపులో కలిపి ►టీ స్పూను తేనెలో అర టీస్పూను పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి ►ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ►ఈ రెండు ప్యాక్‌లను వారానికి మూడు సార్లు వేయడం వల్ల చర్మం మృదువుగా మారడమేగాక, ఆరోగ్యంగా ఉంటుంది. సహజసిద్ధ నిగారింపు ►రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి ►పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. ►బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకు పోయిన ట్యాన్ తగ్గుముఖం పడుతుంది. ►రోజ్ వాటర్ ముఖానికి సహజసిద్ధ నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది. చదవండి: Beauty Tips: ట్యాన్, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్.. ఇలా చేశారంటే Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
Beauty Tips: ఇలా చేస్తే.. ముఖం మెరిసిపోతుంది! బ్యూటీ సీక్రెట్ చెప్పిన హీరోయిన్
Tara Sutaria- Beauty Secret: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ముంబై భామ తారా సుతారియా. అరంగేట్రంలోనే తన అందంతో యువతను ఫిదా చేసింది. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇక మర్జావన్, తడప్, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన తారా.. తన మెరిసే మేనికి అమ్మ చెప్పిన చిట్కాలే కారణం అంటోంది. ముఖం చంద్రబింబంలా మెరవాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలని చెబుతోంది. నా బ్యూటీ సీక్రెట్ ఏమిటంటే! ‘‘నా బ్యూటీ సీక్రెట్ మంచినీళ్లు, మా నేర్పిన హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్. పెరుగులో తేనె, శనగపిండి, కాస్త పసుపు కలిపి ప్యాక్‌లా తయారు చేసుకుని మొహానికి అప్లయ్ చేస్తా. అది కాస్త డ్రై అవుతోంది అనుకున్నప్పుడు చన్నీళ్లతో కడిగేసుకుంటా! మొహంలోని అలసట మాయమైపోయి.. గ్లో వచ్చేస్తుంది! నిజానికి ఈ హోమ్ మేడ్ చిట్కా మా అమ్మమ్మది. మా అమ్మ ఫాలో అయ్యింది.. ఇప్పుడు నేను! ఫాలో అవుతున్నా’’ అంటూ అందం వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకుంది 26 ఏళ్ల తారా. చదవండి: Hair Care Tips: ముఖం జిడ్డుకారుతుందని పదేపదే షాంపుతో తలస్నానం చేస్తే! ఈ సమస్యలు తప్పవు! Beetroot Aloe Vera Gel: బీట్రూట్ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే ఈ క్రీమ్ రాసిన తర్వాత.. -
Beauty Tips: పసుపు ఐస్‌క్యూబ్‌లతో.. మచ్చలు, వైట్ హెడ్స్, ట్యాన్ మాయం!
ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ముఖ చర్మం జిడ్డుగా, మొటిమలు, బ్లాక్, వైట్ హెడ్స్ వల్ల నీరసంగా వడలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ పసుపు ఐస్‌క్యూబ్‌లతో మంచి పరిష్కారం లభిస్తుంది. ►టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్ పొడి, కప్పు రోజ్‌వాటర్, టీస్పూను కొబ్బరి పాలు, ఆరు చుక్కల నిమ్మ నూనెను తీసుకుని ఒక గిన్నెలో వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ఐస్‌క్యూబ్స్ ట్రేలో పోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ క్యూబ్‌లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్‌క్యూబ్స్‌తో ఇరవై నిమిషాలపాటు మర్దన చేయాలి. ►ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగి తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్‌ను రాసుకోవాలి. ►ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్ పోయి ముఖం ఫ్రెష్‌గా రేడియంట్‌గా కనిపిస్తుంది. ►చర్మం జిడ్డు కారడం నియంత్రణలో ఉండడమేగాక, దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. ► పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య చాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! Shilpa Shetty: పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్ అదే! -
Beauty Tips: పసుపు రాసి.. ఇలా చేశారంటే ముఖం నల్లబడుతుంది!
వేసవిలో పసుపుని ముఖానికి గానీ, ఒంటికి గానీ పట్టించాలనుకుంటే నేరుగా కాకుండా పెరుగు, శనగపిండిలలో పసుపు కలిపి పట్టించాలి. ఇలాచేస్తే చర్మానికి చల్లదనం అందుతుంది. పసుపు రాసుకుంటే ముఖం రంగు వస్తుందని చాలామంది పసుపు రాసుకుంటూ ఉంటారు. అయితే పసుపు రాసిన తరువాత కడిగేటప్పుడు సాధారణ నీటితో మాత్రమే కడగాలి. సబ్బు, ఫేస్‌వాష్‌లతో కడగకూడదు. వీటితో కడిగితే ముఖం ఉన్నరంగుకంటే మరింత నల్లగా మారుతుంది. పసుపుని చర్మానికి రాసి ఎక్కువ సమయం ఉంచుకోకూడదు. ఆరిన వెంటనే నీటితో కడిగేయాలి. ఇలా చేయకపోతే మచ్చలు, చారలు ఏర్పడతాయి. ఇక చర్మంపై ఉండే అవాంచిత రోమాలను పసుపు తొలగించడంలో ఎంతో సహాయ పడుతుంది. శెనగపిండిని కొద్దిగా పసుపు, పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు వాడటం వలన దుష్ప్రభావాలు తక్కువ. చదవండి👉🏾 Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! చదవండి👉🏾 Beauty Tips: క్యారెట్, నిమ్మకాయ, ఆలుగడ్డ.. మచ్చల్ని తరిమికొట్టే హోంమేడ్ క్రీమ్! -
గోల్డెన్ మిల్క్ తో వందలాది వ్యాధులకు చెక్..
-
పసుపు చిం‘ధర’ వందర
జగిత్యాల అగ్రికల్చర్: వాణిజ్య పంటలైన మిర్చి, పత్తికి మార్కెట్లో మంచి ధర లభిస్తుండగా, పసుపు ధరలు మాత్రం కొన్నేళ్లుగా పాతాళంలో ఉంటున్నాయి. చర్మ సౌందర్య సాధనాలు, రంగులు, ఆహార పరిశ్రమల్లో విరివిగా వాడే పసుపునకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటుంది. కానీ, ఆ మేరకు ఎగుమతులు లేక పంట పండించిన రైతులకు అనుకున్న స్థాయిలో ధరలు రావడం లేదు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడులు తగ్గగా, చేతికొచ్చిన పంటకు సైతం మార్కెట్లో ధర రాని పరిస్థితి నెలకొంది. దేశంలోనే తెలంగాణ టాప్ పసుపు పంట ఉత్పత్తిలో తెలంగాణ 3.13 లక్షల టన్నుల దిగుబడితో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర 2.26 లక్షల టన్నులు, కర్ణాటకలో 1.30 లక్షల టన్నులు, తమిళనాడు 0.86 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్ 0.73 లక్షల టన్నులు, మధ్యప్రదేశ్ 0.60 లక్షల టన్నులు, పశ్చిమబెంగాల్లో 0.45 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి అవుతోంది. తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మాత్రమే పసుపు ఎక్కువగా సాగవుతోంది. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో దాదాపు 50 వేల ఎకరాల్లో పంట వేస్తారు. దిగుబడులు అంతంతే.. ఈ ఏడాది అధిక వర్షాలతో పసుపు పంట దెబ్బతిన్నది. పంటలో ఎక్కువ రోజుల పాటు నీరు నిల్వ ఉండటంతో మొక్కలు చనిపోయాయి. దీనికి తోడు, దుంపకుళ్లు రోగం వచ్చి దిగుబడులు పడిపో యాయి. ఎకరానికి 35 క్వింటాళ్ల వరకు దిగుబడు లు వస్తాయనుకుంటే, కనీసం 15 నుంచి 20 క్విం టాళ్లు కూడా రాలేదు. రైతులు ఎకరాకు కనీసం ఒక లారీ పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువుకు రూ.25 వేలు ఖర్చు పెట్టారు. కలుపు తీత, ఎరువుల కోసం రూ.20 వేల వరకు ఖర్చు చేశారు. అలాగే పంట తవ్వేటప్పుడు, కొమ్ములు విరిచేటప్పుడు, ఉడకబెట్టేందుకు కూలీలకు ఎకరాకు రూ.30 వేల వరకు అవుతోంది. ఇలా..దాదాపు ఎకరాకు రూ.70–80 వేలు పెట్టుబడి పెట్టినా ఆ స్థాయిలో దిగుబడులు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు అంతంతే.. రాష్ట్రంలో పండిన పసుపును రైతులు నిజామాబాద్, వరంగల్ మార్కెట్లతో పాటు తమిళనాడులోని ఈరోడ్, సేలం, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు తీసుకెళ్తారు. అయితే, ధరలు మాత్రం క్వింటాల్ కొమ్ము పసుపునకు రూ.5–7 వేలు, మండ పసుపునకు రూ.4–6 వేలు మాత్రమే పలుకుతున్నాయి. దీంతో పెట్టుబడులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నిజామాబాద్ మార్కెట్‌కు 14,525 మెట్రిక్ టన్నుల పసుపు రాగా, ఈసారి 13,925 టన్నులు వచ్చింది. ఎగుమతులకు పెద్ద ఎత్తున అనుమతి ఇస్తేనే రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారస్తులు భావిస్తున్నారు. 1.71 లక్షల టన్నుల పసుపు మాత్రమే ఎగుమతి ప్రపంచవ్యాప్తంగా పసుపు ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అయితే, దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 2019–20లో 1.37 లక్షల టన్నులు, 2020–21లో 1.71 లక్షల టన్నుల పసు పు మాత్రమే ఎగుమతి అయింది. మిగిలిన పసు పును దేశీయంగానే ఉపయోగిస్తున్నారు. అయితే దేశీయంగా పెద్దగా డిమాండ్ లేక ధర రావడం లేదని, వీలైనంత ఎక్కువగా ఎగుమతులను ప్రోత్సహిస్తే మంచి రేటు వచ్చే అవకాశం ఉంటుందని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు. పంట లేదు.. ధర లేదు రెండెకరాల్లో పసుపు వేశా. వర్షాలతో పంట దెబ్బతిన్నది. 50 క్వింటాళ్లు దిగుబడి వస్తుందనుకుంటే 25 క్విం టాళ్లు మాత్రమే వచ్చింది. నిజామాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్తే క్వింటాల్‌కు రూ.5 వేలు చెల్లించారు. ఏమైనా అంటే పచ్చిగా ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. – తీపిరెడ్డి బాపురెడ్డి, పసుపు రైతు, లక్ష్మీపూర్, జగిత్యాల మద్దతు ధర చెల్లించాలి పసుపు పంట క్వింటాల్‌కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని పోరాడుతున్నాం. ఈ నేపథ్యంలోనే ప్ర భుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు గత పార్లమెంట్ ఎన్నికల్లో దాదా పు 175 మంది పసుపు రైతులం నిజామాబాద్‌లో పోటీ చేశాం. అయినా పసుపు రైతుల బతుకు మారలేదు. – పన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు, జగిత్యాల -
Diabetes: బ్లడ్ షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం మరొకటి అధిక బరువు. ఇటీవలి కాలంలో ఇవి చాలా సాధారణ సమస్యలుగా మారిపోయాయి. మారిన జీవన శైలి, ఆహార నియమాలు, జంక్ఫుడ్స్, ఇతర అనారోగ్యకరమైన జీవన పద్ధతులు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయి. అయితే మన కిచెన్‌లోని అతి సాధారణ మసాలా దినుసులు, మూలికలతో షుగర్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపులోకి తేవచ్చు. ఆ వివరాలేంటి ఒకసారి చూద్దాం. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటిగా మారిపోయింది. దీని వలన తీవ్రమైన సమస్యలు రావడంతో పాటు, ఒక్కోసారి శారీరక వైకల్యంతో బాడీపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా మనిషి సగటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. అయితే షుగర్ వ్యాధి బారిన పడినంత మాత్రాన బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు. తమ రోజు వారీ ఆహారం, తేలికపాటి వ్యాయామాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడు తూనే, శరీరంలో షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు చిట్కాలు పాటిస్తుండాలి. ముఖ్యంగా వంట ఇంట్లో మనకు అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాలు, ఇతర ఆయుర్వేద విలువలు కలిగిన మూలికలతో షుగర్ వ్యాధికి చెక్ చెప్పవచ్చు. అలాంటి వాటిలో దాల్చిన చెక్క, పసుపు, మెంతులు, జీలకర్ర, సోంపు ప్రధానంగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్‌కి రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు నిత్యం మనం వాడే వస్తువులు దోహదం చేస్తాయి. ముఖ్యంగా పసుపును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వ్యాధులనుంచి తప్పించే సహజసిద్ధమైన యాంటిబయోటిక్‌గా పనిచేసే పసుపును ప్రతీ ఒక్కరు తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. మన బాడీలోకి ప్రవేశించే ఏ రకమైన వైరస్ లేదా బాక్టీరియాతోనైనా మనకు తెలియకుండానే ఇది ఫైట్ చేసుంది. ఇక మధుమేహం విషయంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే కేవలం మాసాలా దినుసుగా మాత్రమే కాదు దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. దీన్ని మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడంతోపాటు, షుగర్ బాధితులు దాల్చిన చెక్క టీని తీసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క నీరు లేదా టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి గింజలు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం.ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు వడకట్టి ఈ నీటిని తాగాలి. లేదా ఆ మెంతులతో పాటు తీసుకున్నా మంచిదే. మనం రోజు పోపు దినుసులా వాడే జీలకర్ర కూడా సుగర్ లెవల్స్‌ను, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకోవచ్చు. సోంపులో ఉండే అనిథాల్ శరీరంలోని అనేక ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లను నివారిస్తుంది. సోపు గింజల్లో ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు మధుమేహ బాధితులకు మేలు చేస్తాయి. -
కేన్సర్‌కు పసుపు మందు!
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కేన్సర్ మహమ్మారికి మెరుగైన చికిత్సను రూపొందించే దిశగా ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)’శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఆధునిక చికిత్స పద్ధతులకు తోడుగా పసుపులో ఉండే అద్భుతమైన రసాయనం ‘కర్క్యుమిన్’ను వినియోగించడం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నట్టు గుర్తించారు. ప్రతిబంధకాలను అధిగమించి.. కీమోథెరపీ అవసరం లేకుండానే కేన్సర్‌కు చికిత్స చేసేందుకు ఇటీవలికాలంలో జన్యువులను స్విచ్ఛాఫ్ చేసే పద్ధతి ‘ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్ (ఆర్‌ఎన్‌ఏఐ)’అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఆర్ఎన్ఏఐను సురక్షితంగా, కేన్సర్ కణితులే లక్ష్యంగా ప్రయోగించే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ లేఖ దినేశ్ కుమార్ నేతృత్వంలోని సీసీఎంబీ శాస్త్రవేత్తల బృందం, నేషనల్ కెమికల్ లేబొరేటరీకి చెందిన పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి. పసుపులోని కర్క్యుమిన్ రసాయనంతో నానో నిర్మాణాలు కొన్నింటిని అభివృద్ధి చేశాయి. అవి ఆర్‌ఎన్‌ఏఐ (ఈపీహెచ్బీ4 ఎస్‌హెచ్ ఆర్ఎన్ఏ)లను సురక్షితంగా బంధించి ఉంచేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని నిర్దిష్ట కండరాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించవచ్చని తేల్చారు. పైగా కర్క్యుమిన్ జీవ సంబంధితమైనది కాబట్టి.. శరీరం శోషించుకోగలదని గుర్తించారు. రొమ్ము, పేగు కేన్సర్లు ఉన్న ఎలుకలకు ఈ మందును అందించినప్పుడు.. కేన్సర్ కణితుల పరిమాణం తగ్గిందని డాక్టర్ దినేశ్ తెలిపారు. -
గంధం పొడి, రోజ్ వాటర్, నిమ్మరసం.. నేచురల్ బ్లీచ్ తయారీ ఇలా!
Natural Face Bleaching Home Remedies: ముఖ చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, ముఖవర్చస్సుని మరింతగా మెరిపించడంలో ఫేషియల్ బ్లీచ్ బాగా పనిచేస్తుంది. కానీ రసాయనాలతో తయారైన బ్లీచ్ల వల్ల కొన్నిరకాల అలెర్జీలు, దద్దుర్లు వంటివి వచ్చి ముఖం పాడైపోతుంటుంది. ఇలాంటి సమస్యలేవి ఎదురుకాకుండా ఇంట్లోనే సులభంగా బ్లీచ్‌ను తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం... ►టీస్పూను పసుపు, టీస్పూను రోజ్ వాటర్, అర టీస్పూను నిమ్మరసం, పావు టీస్పూను గంధం పొడి ఒక గిన్నెలో తీసుకుని కలపాలి. ►ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు నానబెట్టుకోవాలి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. నానబెట్టిన మిశ్రమాన్ని బ్రష్ తో ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు ఆరనివ్వాలి. ►పది నిమిషాల తరువాత టొమాటో లేదా నిమ్మ చెక్కతో ముఖాన్ని గుండ్రంగా ఏడు నిమిషాలపాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ►తడిలేకుండా తుడిచి, ముఖానికి అలొవెరా జెల్‌ను అప్లై చేయాలి. పదిహేనురోజులకొకసారి ఇలా చేయడం వల్ల ముఖం మెరుపుని సంతరించుకుంటుంది. చదవండి: ‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా! -
పసుపు ఛాయకు.. సిరుల పరిమళం
వందల ఏళ్ల నుంచి ఇక్కడ పసుపు వ్యాపారం సాగుతోంది. పసుపు ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయి. పసుపు వ్యాపారులు కూడా అధికంగా ఉన్నారు. విశాఖ మన్యం 11 మండలాల్లో పండించే పసుపంతా మాడుగుల చేరుతుంది. ప్రాసెసింగ్ జరిగి సిరులు కురిపిస్తుంది. ఔషధ గుణాలున్న ఈ ఆర్గానిక్ పసుపు మంచి గిరాకీ కలిగి ఉండడమే కాదు..పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కరోనాను కూడా దరి చేరనివ్వలేదని దీని గొప్పతనాన్ని చెబుతున్నారు. విశాఖ మన్యంలో సేంద్రియ పద్ధతి పండించే పసుపులో ఔషధ గుణాలున్న కురుక్కుమిన్తో పాటు చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఓలంటయిల్ ఉంది. ఏజెన్సీలో రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా ఆవు పేడ, ఆవు పంచకంతో పండించే ఆర్గానిక్ పంట కావడం కూడా విశేషం. దీంతో ఇక్కడ ప్రాసెస్ అయ్యే పసుపునకు విదేశాల్లో మంచి గిరాకీ ఉందని చెబుతున్నారు. మిగతా ప్రాంతాల్లో పండించే పసుపులో కురుక్కుమిన్ 1.5 నుండి 2 శాతం ఉంటే మాడుగుల పసుపులో 5 శాతం కురుక్కుమిన్ ఉంది. అంతేకాకుండా ఆరెంజ్ ఎల్లో రంగులో ఈ పసుపు ఉంటుంది. ఈ రంగు ఉన్న పసుపును అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యమైనదిగా గుర్తిస్తారు. ఇక్కడ పసుపును స్త్రీలు ముఖానికి రాసుకున్నా మంట పుట్టదు..ముఖం మెరుపుఛాయ రావడం, వంటకాలలో ఉపయోగిస్తే రుచితో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 1500 కుటుంబాలకు జీవనోపాధి విశాఖ మన్యంలో పండించే పసుపు మాడుగులకు తీసుకు వస్తారు అక్కడ ప్రాసెసింగ్ చేసి శుభ్రపరిచిన తరువాత ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. సీజన్లో సుమారు 300 లారీలు పసుపును 200 మంది చిన్నా పెద్ద వ్యాపారులు మాడుగులలో కొనుగోలు చేస్తారు. ఇక్కడ పసుపును ఉడికించి డ్రమ్ముల్లో వేసి మంచి ఛాయ పసుపుగా తయారు చేసి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో వేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఈ విధంగా రైతుల దగ్గర నుంచి మార్కెట్‌కు వెళ్లే వరకు సుమారు 1500 కుటుంబాలు దీనిపై ఆధార పడి మనుగడ సాగిస్తున్నారు. ప్రతి ఏటా సుమారు రూ.200 కోట్ల మేరకు వ్యాపారం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. మాడుగులలో ఆరు పసుపు ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయి. పన్ను రాయితీ మేలు రూ.5 లక్షలు వ్యాపారం వరకు జీఎస్టీ రాయితీ ఇవ్వడం వల్ల చిరు పసుపు వ్యాపారులకు మేలు జరగనుంది. ప్రభుత్వ పరంగా పసుపు పరిశ్రమకు చేయూతను అందిస్తుంది. పసుపు రైతులకు ప్రోత్సాహకాలు అందజేయాలి. మాడుగుల పసుపునకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులుండడం వాస్తవమే. –బసవా పరమేష్, పసుపు వ్యాపారి, మాడుగుల కుర్కుమిన్ అధికం కుర్కుమిన్ అధికంగా ఉండే పసుపును తమిళనాడులో ఎక్కువగా ఇష్టపడతారు. కుర్కుమిన్ అధికంగా ఉండే పసుపుతో వంటకాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఔషధాలు ఉండడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఉంది. ప్రస్తుతం కిలో రూ.75 నుంచి రూ. 80 వరకు ధరలు పలుకుతున్నాయి. –దేవరాపల్లి శ్రీనివాసరావు, పసుపు వ్యాపారి పసుపు కేంద్రాలే జీవనాధారం మాడుగులలో తరతరాలుగా పలు కుటుంబాలు పసుపు తయారీతో జీవనోపాధి పొందుతున్నాయి. ఏజన్సీలో పండించే పసుపు నుంచి మాడుగులలో ప్రాసెసింగ్ జరిగే వరకు సుమారు 1500 కుటుంబాలకు జీవనాధారంగా మారింది. నిరంతరం పసుపులో పని చేయడం వలన మాకు కరోనా కూడా దరి చేరలేదు. –కోడూరు అప్పారావు, పసుపు కార్మికుడు, మాడుగుల -
శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..!
సైనస్, కీళ్ల నొప్పులు, అజీర్తి, జలుబు, దగ్గు.. శీతాకాలంలో పొంచి ఉండే రుగ్మతలు. వీటి నుంచి బయటపడేందుకు మీ వంటిట్లోనే చక్కని పరిష్కారం ఉంది. హాస్పిటల్ల చుట్టూ తిరగకుండా.. మీ ఆరోగ్యాన్ని మరింత పదిలంగా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. పసుపు అవును.. ఆహారంలో పసుపు తీసుకోవడంవల్ల చేకూరే మేలు అంతాఇంతా కాదు. పాలు, టీ వంటి పానీయాల్లో చిటికెడు పసుపును జోడించడం వల్ల చలికాలపు రుగ్మతల నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. మీ ఆహారంలో పసుపును భాగం చేస్తే చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. పసుపును ‘హాలిడే వెయిట్’ అని కూడా అంటారు. కొంతమంది సెలవురోజుల్లో ఆరోగ్యానికి హాని తలపెట్టే ఆల్కహాల్ వంటివి సేవించడం పరిపాటి. ఫలితంగా లివర్ దెబ్బ తినడం జరుగుతుంది. ఐతే పసుపులోని యాంటీఆక్సిడెంట్స్ మీ శరీరానికి లోపల్నుంచి చికిత్సనందిస్తుంది. శీతాకాలపు చలిని తట్టుకోవడానికి కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఐతే కొంతమంది వేడి పానీయాలను అధికంగా తీసుకుంటారు. ఇవి జీర్ణవ్యవస్థను ఇబ్బందిపెడతాయి. పసుపు ఆహారానికి రుచిని జోడించడమేకాకుండా, జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు తరచుగా ఆహారంలో పసును తీసుకోవడం వల్ల మీ చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపు కూడా వనకూరుతుంది. పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో అనేక వ్యాధుల నివారణలో పసుపు వినియోగించబడుతోందనే విషయం తెలిసిందే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చక్కని మందు మన వంటిటి పసుపే! కాబట్టి దీనిని తీసుకోవడం మర్చిపోకండే..! చదవండి: Depression: ఆ సమయంలో ఈ నాలుగూ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి.. జాగ్రత్త!! -
Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి..
ప్రాచీనకాలం నుంచి పసుపు మన జీవితాలతో ముడిపడి ఉంది. తాపనివారణ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ వరకు దీనిలోని ఔషధగుణాలను శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఏదిఏమైనప్పటికీ దీని ప్రయోజనాలు లెక్కకుమించి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐతే తాజాగా వివిధ రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడానికి, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో పసుపు ఏ విధంగా ప్రభావం చూపుతుందనే అంశంపై అనేక పరిశోధన అధ్యయనాలు దృష్టి సారించాయి. దీర్ఘకాలిక తాపం, క్యాన్సర్ అభివృద్ధికి మధ్య సహసంబంధం ఉన్నందువల్ల, పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వ్యాధితో పోరాడడంలో ప్రయోజనకరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చదవండి: The Singing Ringing Tree: ఈ చెట్టు మధురంగా పాడుతుందట..!.. వినాలంటే.. 2019లో న్యూట్రియంట్స్ అనే సైంటిఫిక్ జర్నల్ ప్రచురించిన నివేధికలో కూడా.. పసుపు రొమ్ము క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధిస్తుందని, కణితి పెరుగుదల మందగించేలా ప్రేరేపిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా ఊపిరితిత్తులు, పెద్దపేగు, క్లోమ.. వంటి కొన్ని ఇతర రకాల క్యాన్సర్లకు చికిత్సగా పసుపును వినియోగించడంపై పరిశోధనలు జరుగుతున్నాయని తెల్పింది. ఇప్పటికీ పరిశోధనల ఫలితాలు ఒక కొలిక్కిరాన్పటికీ, టెస్ట్ ట్యూబ్, జంతు అధ్యయనాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు ఈ నివేదిక తెల్పింది. చదవండి: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..! క్యాన్సర్ చికిత్సలో పసుపును ఉపయోగించడంలో అతిపెద్ద అడ్డంకి ఏంటంటే.. పసుపును ఎక్కువ మోతాదులో మానవ శరీరం గ్రహించలేకపోవడం. ఈ అడ్డంకిని అధిగమించడానికి ఫార్మకాలజిస్టులు కృషి చేస్తున్నారు. ఐతే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకు... పసుపును క్యాన్సర్‌కు చికిత్సగా ఉపయోగించడం కుదరదు. చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే.. -
ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా.. నిజమెంత?
ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా? ఈ విషయంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఆల్కహాల్ తీసుకోవడం ఎప్పటికీ ప్రమాదకరమే. ఆరోగ్య సమస్యలను రెండింతలు చేయడంలో ఆల్కహాల్ ముఖ్య భూమిక పోషిస్తుంది. 10 సెకండ్లు శ్వాస బిగబట్టి ఉంచగలిగితే కరోనా రానట్టేనా? శ్వాసకు సంబంధించిన వ్యాయామాలను బట్టి కరోనా వచ్చిందో లేదో నిర్ధారణ కాదు. కరోనా లక్షణాలున్నప్పటికీ 10 సెకండ్లు శ్వాస బిగబట్టగలిగితే వైరస్ లేనట్టేనని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. కేవలం ల్యాబ్ పరీక్షల ద్వారా మాత్రమే కరోనా ఉందో లేదో నిర్ధారణ అవుతుంది. బూట్ల ద్వారా కరోనా వస్తుందా? బూట్ల ద్వారా కరోనా వైరస్ సంక్రమించే అవకాశం చాలా తక్కువ. కానీ చిన్నపిల్లలు ఇంట్లో నేల మీద ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి బూట్లను ఇంటి ముందే వదిలేయడం మంచిది. బూట్ల లోపల ఉండే క్రిములకు సాధ్యమయినంత దూరంగా ఉండడమే మేలు. పసుపు తింటే కరోనా రాదా? పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహార పదార్థాల్లో పసుపును కలిపేది అందుకే. అయితే, పసుపు ఎక్కువగా తిన్నంత మాత్రాన కరోనా రాదనడం వాస్తవం కాదు. థర్మల్ స్కానర్లు కోవిడ్ నిగ్గు తేలుస్తాయా? వాస్తవానికి థర్మల్ స్కానర్ల ద్వారా కోవిడ్ ఉందో లేదో నిర్ధారణ కాదు. కేవలం శరీరం ఉష్ణోగ్రత ఎంత ఉందనేది తెలుస్తుంది. కరోనా సోకినవారిలో శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.. కాబట్టి ఎక్కువ బాడీ టెంపరేచర్ ఉన్న వారిని గుర్తించేందుకు థర్మల్ స్కానర్లు వాడుతారు. ఫలానా వయసున్న వారికే కరోనా వస్తుందనేది ఏమైనా ఉందా? కరోనా సోకడానికి, వయసుకు ఏమాత్రం సంబంధం లేదు. అన్ని వయసుల వారికి వారు తీసుకునే జాగ్రత్తల ఆధారంగానే కరోనా వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంటుంది. ఏ వయసు వారైనా భౌతిక దూరం పాటించడంతో పాటు ఎప్పటికప్పుడు చేతులు, ముఖాన్ని శుభ్రపరచుకోవడం, కచ్చితంగా మాస్కు ధరించడమే ముఖ్యం. 25 డిగ్రీల కన్నా ఎక్కువ ఎండ వల్ల వైరస్ సోకదా? కోవిడ్ సోకడానికి వాతావరణంతో సంబంధం లేదు. అధిక ఉష్ణోగ్రత ఉండే దేశాల్లో కూడా కరోనా కేసులు వస్తున్నాయి. సూర్యరశ్మిపై ఆధారపడడం కన్నా ఎప్పటికప్పుడు చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవడమే మంచిది. చదవండి: ఉదయం పెసరట్టు.. లంచ్‌లో బ్రౌన్ రైస్.. రాత్రికి రాగిముద్ద! కరోనా: గుడ్లు, చికెన్, చేపలు తినాలి .. శాకాహారులైతే కరోనా: ఏది నిజం.. ఏది అబద్ధం.. కేంద్రం వివరణ -
కరోనా ఎఫెక్ట్.. వెరైటీగా హల్ది వేడుక
కరోనా వైరస్ ఏ ముహుర్తాన జన్మించిందో కానీ ఈ ఏడాది పండుగలు, వేడుకలు అనే మాటే మర్చిపోయారు జనాలు. పెళ్లిల్లు జరిగినప్పటికి పెద్దగా జోష్ లేదు. కోవిడ్ నియమాల నేపథ్యంలో వివాహ వేడుక రూపరేఖలే మారి పోయాయి. తక్కువ మంది అతిథుల సమక్షంలో.. సామాజిక దూరం పాటిస్తూ చాలా సాధారణంగా జరిగాయి. ఈ క్రమంలో పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. హల్ది వేడుకకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుత పరిస్థితులను కళ్లకు కడుతుంది. ఉత్తర భారతదేశంలో వివాహానికి ముందు జరిపే ఈ వేడుకలో.. వధూవరులకు పవిత్రతకు చిహ్నంగా భావించే పసుపు ముద్దను పూస్తారు. ఈ ‘హల్ది’ వేడుకలో బంధుమిత్రులు పాల్గొని ఉత్సాహంగా వేడుక నిర్వహిస్తారు. (చదవండి: వావ్.. ఎంత క్యూట్‌గా ఉందో..!) Innovative Haldi ceremony with Social Distancing! This is a pre-wedding ceremony in India where Turmeric (haldi), oil & water are applied to the bride & groom by married women on the morning of the wedding. The mixture is believed to bless the couple before the wedding. #COVID19 pic.twitter.com/nHHYrVbOqa — Harjinder Singh Kukreja (@SinghLions) September 28, 2020 ఇక ఈ వీడియోలో కరోనా నిబంధనల ప్రకారం.. కాబోయే దంపతులను స్వయంగా తాకకుండా పెయింట్ వేయటానికి ఉపయోగించే రోలర్లతో వారికి పసుపు పూసారు. కాగా, ఆ సమయంలో అందరూ మాస్కులు ధరించటం గమనార్హం. ‘సామాజిక దూరంతో వినూత్న హల్ది వేడుక. ఇది భారతదేశంలో వివాహానికి ముందే జరిగే వేడుక, పసుపు (హల్ది), నూనె, నీరు కలిపిన మిశ్రమాన్ని వివాహం అయిన స్త్రీలు పెళ్లికి ముందు వధూవరులకు పూసి ఆశీర్వదించుతారు’ అంటూ ట్వీట్ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది. -
పసుపుతో మోకాళ్ల నొప్పులు దూరం..
న్యూఢిల్లీ: భారత దేశంలో విస్తృతంగా ప్రజలందరు ఉపయోగించే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఎంత ప్రాముఖ్యమైనదో తెలిసిందే. పసుపులోని అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ పదార్ధం ఉండడం ద్వారా అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పసుపుతో బ్యాక్టేరియా, వైరల్ ఇన్‌ఫైక్షన్స్ తగ్గుతాయని మనకు తెలిసు. కానీ మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సైతం తగ్గుతాయని ఆస్ట్రేలియాలోని టాస్మానియా విశ్వవిద్యాలయానికి చేసిన అధ్యయనంలో తేలింది. కాగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 70 మందిని కొన్ని వారాల పాటు పరీక్షించగా, బాధితులకు ఉపశమనం కలిగిందని తెలిపారు. అన్నల్ మెడిసిన్, జర్నల్ ఆఫ్ మెడిసిన అధ్యయన సంస్థలు సైతం పసుపుతో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని దృవీకరించాయి. భారత సంస్కృతిలోనే మెజారిటీ రోగాలకు పసుపును విరివిగా వాడేవారు. కానీ గత కొంత కాలంగా అల్లోపతి మందులను ఎక్కువగా వాడుతున్నారు. తాజాగా యాంటీ వైరల్ జబ్బులకు పసుపు ఎంత మేలు చేస్తోందో ఆయుర్వేద నిపుణులు తెలియజేయడంతో ప్రస్తుతం పసుపును విరివిగా వాడుతున్నారు. అయితే గతంలో కొందరు అల్లోపతి వైద్యులు కేవలం ఇంటి చిట్కాలకే ఉపయోగపడుతుందని భావించేవారు. కానీ విదేశీయుల అధ్యయనంలో కూడా పసుపు ద్వారా మోకాళ్ల నొప్పులు తగ్గనున్నట్లు తేల్చడం దేశ ఆయుర్వేధానికి ఎంతో ప్రయోజనకరం. పసుపును ఉపయోగించే విధానాలు -పసుపును పదార్ధాల రూపాల్లోనే కాకుండా మాత్రల రూపంలో కూడా ఉపయోగించవచ్చు -సాధారణంగా మన భారతీయుల వంటలలో పసుపును విరివిగా వాడుతుంటారు. పసుపులో లభించే కర్కుమిన్ పదార్ధం వల్ల ఎంతో లాభం -పాలలో పసుపును వేసి త్రాగితే అనేక రోగాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. -అదే విధంగా పసుపుతో కలిపిన టీ త్రాగినా ఆరోగ్య పటిష్టతకు ఎంతో లాభమని నిపుణులు సూచిస్తున్నారు. -
మార్కెట్ యార్డుకు పసుపు కళ
సాక్షి, నిజామాబాద్: జిల్లా వ్యవసాయ మార్కెట్లో పసుపు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించగా సుమారు రెండు నెలలుగా మార్కెట్ యార్డు మూతపడింది. బుధవారం నుంచి మార్కెట్ యార్డులో పసుపు పంట క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో మంగళవారం రోజునే రైతులు పసుపు పంటను యార్డుకు తీసుకొచ్చారు. కాగా ప్రతి రోజు 10 వేల బస్తాల పసుపు మాత్రమే క్రయవిక్రయాలు జరగనున్నాయి. చదవండి: ఉచిత ‘బియ్యం’ అందేనా! అంతకు మించి పసుపు పంటను మార్కెట్ యార్డులోకి అనుమతించడం లేదు. ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే రైతులు పసుపును మార్కెట్ యార్డుకు తీసుకురావాలని అధికారులు సూచించారు. దీంతో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రైతులు భారీగా పసుపును తీసుకొస్తున్నారు. భారీ ఎత్తున రైతులు తరలి వస్తుండటంతో సిబ్బంది టోకెన్లు ఇస్తూ మార్కెట్లోకి అనుమతిస్తున్నారు. కాగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పసుపునకు అనుమతి నిరాకరించారు. చదవండి: పోస్టు చేయడమే పాపమైంది... -
‘పసుపుకొమ్ములు కట్టుకోవాలి’ వార్త నిజం కాదు
సాక్షి, శంషాబాద్ రూరల్: పసుపు కొమ్ములు ధరించాలని చినజీయర్ స్వామి చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం అవాస్తవమని శ్రీఅహోబిల జీయర్ స్వామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా మహమ్మారి నివారణకు ముత్తైదువులు అమావాస్యలోపు ఏడు దారాలతో పుసుపుకొమ్ములు ధరించి, అమావాస్య తర్వాత తీసివేయాలని చినజీయర్ స్వామి చెప్పినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, వీటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. కరోనా వైరస్ కట్టడి కావాలంటే ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, భగవంతుడిని ధ్యానిస్తే మనకు మానసిక బలం చేకూరుతుందని వివరించారు. మానసిక ఒత్తిడి తగ్గడానికి భగవంతుని నామ స్మరణ చేయాలని, రోగ నివారణ కోసం వైద్య చికిత్స అవసరమని పేర్కొన్నారు. ‘ఆమె’ అష్టా చమ్మా ఎంత పని చేసిందంటే.. -
ఏపీ: పల్లెల్లో పంటల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో పంటల కొనుగోళ్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం శనగలు, కందులు, జొన్న, మొక్కజొన్న, పసుపు, అపరాల కొనుగోలుకు మండల స్థాయిలో కేంద్రాలను ఏర్పాటుచేసింది. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో రైతులు తమ పంటలను ఈ కేంద్రాలకు తరలించడానికి ఇబ్బందిపడే అవకాశాలు ఉండటంతో గ్రామస్థాయిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీంతో 786 కేంద్రాల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 700 కేంద్రాలను పెట్టగా.. మిగిలినవి రెండు మూడ్రోజుల్లో ఏర్పాటుకానున్నాయి. అంతేకాక.. ► ఈ కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చేసేందుకు రైతుల పేర్లను అధికారులు ముందుగా నమోదు చేసుకోవాలి. ► నిర్ణయించిన సమయం, తేదీల్లోనే రైతులు తమ పంటలను ఈ కేంద్రాలకు తరలించాలి. ► అలాగే, గతంలో రెండు, మూడు ఏజెన్సీలే పంటలను కొనుగోలు చేస్తే.. ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్కారు అనుమతిస్తోంది. మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయం ► రాష్ట్రంలో 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు 350 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ► 1.50 లక్షల మెట్రిక్ టన్నుల జొన్న కొనుగోలుకు 95 కేంద్రాలను ఏర్పాటుచేసింది. ► శనగలకు 185, కందులకు 140, పసుపుకు 11, అపరాలకు 5 కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ► ఇక క్వింటాల్ మొక్కజొన్నకు రూ.1,760 లు.. క్వింటాల్ జొన్నకు రూ.2,550లను ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ► ఇప్పటి దాకా రైతుల నుంచి కొనుగోలు చేసిన శనగల్లో 14,500 మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్ పౌర సరఫరాల శాఖకు సరఫరా చేస్తోంది. ► పంటను కొనుగోలు చేసే ఏజెన్సీలను వాటి ట్రాక్ రికార్డు ఆధారంగా ఖరారు చేశారు. గ్రామస్థాయిలో ఏర్పాట్లు పూర్తి: రద్యుమ్న, మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గ్రామస్థాయిలో చర్యలు తీసుకున్నాం. వర్షాలవల్ల పంట దెబ్బతినకుండా కొనుగోలు చేసిన పంటలను మండల కేంద్రాల్లోని గోదాములకు తరలిస్తాం. హమాలీల సమస్య లేకుండా వ్యవసాయ కార్మికులను ఏజెన్సీలు వినియోగించుకునే ఏర్పాటు కూడా చేశాం. కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు రైతులు ముందుగానే పేర్లను నమోదు చేసుకోవాలి. కరోనా: రోజుకు వెయ్యి పరీక్షలు! -
నలుగు వెలుగులు
స్నానం చేసే ముందు నలుగు పెట్టుకోవడం వల్ల చర్మం పొడిబారే సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చర్మసమస్యలూ దూరం అవుతాయి. నలుగు పిండి తయారుచేసే విధానం: పసుపు, ఆవపిండి, ఉలవ పిండి, మంచి గంధం, మారేడు పత్రాల పొడులను ఉపయోగించవచ్చు. వీటితో పాటు బియ్యపు పిండి, శనగపిండి గరుకుగా పొడి చేసి కలపాలి. ఈ పొడిలో నువ్వులనూనె కలపాలి. నలుగు పిండిమరీ తడిగా ఉండకూడదు. ఒంటికి పట్టించి, వ్యతిరేక దిశలో మర్ధనా చేయాలి. దీనివల్ల ఒంటికి అంటుకున్న మురికి, అవాంఛిత రోమాలు, మృతకణాలు తొలగిపోతాయి. చివర్లో కొంచెం నువ్వుల నూనె అద్దుకొని మేనికి రాసుకోవాలి. లేదంటే ఆవుపాల మీద మీగడ వాడుకోవచ్చు. వారానికి ఒకసారైనా ఒంటికి నలుగు పెట్టుకుంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. -
పెదవి పై నలుపు రంగు వస్తుంటే?!
కొందరికి హార్మోన్లలో మార్పుల వల్ల పై పెదవి మీద వెంట్రుకలు వస్తుంటాయి. లేదంటే పెదవి పై చర్మం నలుపుగా అవుతుంటుంది. ఈ సమస్యకు విరుగుడు ఉంది. ►థ్రెడింగ్, వ్యాక్సింగ్ వంటివి మేలైన పద్ధతులు. వీటితోపాటు.. చర్మం నలుపు తగ్గి, సాధారణ రంగులోకి రావాలంటే.. టొమాటో గుజ్జు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. టొమాటో సహజసిద్ధమైన బ్లీచ్లాగ పనిచేసి అవాంఛిత రోమాలను, నలుపును తగ్గిస్తుంది. ►టీ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి రాయాలి. పదిహేను నిమిషాలు ఉంచి, వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ►పసుపు, పాలు కలిపి చిక్కటి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని పెదవిపై నలుపుగా ఉన్న ప్రాంతంలో రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. ►కార్న్ ఫ్లోర్, గుడ్డులోని తెల్లసొన, పంచదార కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని రాసి, ఆరిన తర్వాత కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పై పెదమి మీద వచ్చే నలుపు, అవాంఛిత రోమాల సమస్య తగ్గుతుంది. ఇంటిప్స్ ►కూరగాయలు తరిగే కటింగ్ బోర్డ్ సరిగ్గా శుభ్రపడకపోతే వాసన వస్తుంటుంది. నిమ్మముక్కతో కటింగ్ బోర్డ్‌ను బాగా రుద్ది, అరగంటపాటు ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. ►వంటగదిని ఎంత శుభ్రం చేసినా దుర్వాసన వస్తూనే ఉందంటే సింకు దగ్గర పెట్టే చెత్తబుట్టను పట్టించుకోవడం లేదని అర్ధం. తగినన్ని నీళ్లలో బేకింగ్ సొడా కలిపి, ఆ మిశ్రమాన్ని చెత్తబుట్ట అడుగున పోయాలి. బ్రష్‌తో చెత్తబుట్ట లోపలి భాగాన్ని రుద్ది, గంటపాటు వదిలేయాలి. తర్వాత కడగాలి. మూడు టీ స్పూన్ల వెనీలా ఎసెన్స్ లీటర్ వేడి నీళ్లలో కలిపి చెత్తబుట్ట లోపలి భాగాన్ని శుభ్రపరచాలి. వారానికి ఒకసారైనా ఈ విధంగా చేస్తూ ఉంటే దుర్వాసన దూరం అవుతుంది. ►ఎంత శుభ్రపరిచినా సమస్యగా అనిపించేది రిఫ్రిజరేటర్. ఫ్రిజ్ షెల్ఫ్‌ల్లో పదార్థాలు పడిపోయి ఫంగస్ చేరుతుంటుంది. వారానికి ఒకసారైనా వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీళ్లతో ఫ్రిజ్ లోపలి భాగాన్ని తుడవాలి. ఒక డబ్బాలో కొద్దిగా బేకింగ్ సోడా, బొగ్గు లేదా కాఫీ గింజలు వేసి ఫ్రిజ్ లోపల ఒక మూలన ఉంచాలి. -
అవాంఛిత రోమాలు తొలగాలంటే...
పసుపును సంప్రదాయకంగా ముఖానికి రాసుకుంటారు. ఇది మన చర్మం పై ఉండే అవాంచిత రోమాలను తొలగించడంలో ఎంతో సహాయ పడుతుంది. శెనగపిండిని కొద్దిగా పసుపు, పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే ఎంతో ప్రభావవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు వాడటం వలన ఎలాంటి దుష్పభ్రావాలు ఉండవు. చక్కెర మిశ్రమంతో... ఇది కొంచం తక్కువ ఖర్చుతో ఇళ్లలో వ్యాక్సింగ్ చేసుకునే ఒక పద్దతి. కొద్దిగా చక్కెర లో కొంచెం తేనె మరియు నిమ్మ రసం కలిపి ఈ మిశ్రమం ముఖంపై రాసుకోవాలి. దీన్ని ఒక క్లాత్ తో తొలగించాలి. ఈ చిట్కా చాలా బాగా పని చేస్తుంది. ఎగ్ మాస్క్ గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి అందులో చెంచాడు పంచదార, అర చెంచాడు మొక్కజొన్న పిండి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖం పై రాసుకుని కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత ఒక మాస్క్ లా మారిన దీన్ని మెల్లగా తీసివేస్తే దానితోపాటు ఈ అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. ఈ పద్ధతి మంచి ఫలితాలనిస్తుంది కానీ కొద్దిగా నొప్పి ఉండచ్చు. -
రాణిస్తాన్ వంట గది
ఇవిగో రాజస్తాన్ వంటలు.స్నాక్‌స్నాక్‌లో రాజసం కనపడుతుంది.మీ ఇంటి రాజావారి కోసం ...రాణీవారు ప్రేమగా వండితే...అవి రాణిస్తాన్ వంటకాలు కావా మరి! ఘేవార్ కావలసినవి నెయ్యి – అర కప్పు; ఐస్ క్యూబ్ – 1 (పెద్దది); మైదా పిండి – 2 కప్పులు; పాలు – అర కప్పు; చల్లటి నీళ్లు – 3 కప్పులు; నిమ్మరసం – ఒక టీ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; డ్రై ఫ్రూట్స్ తరుగు – అలంకరించడానికి తగినన్ని; మిఠాయి రంగు – చిటికెడు; పంచదార పాకం కోసం: పంచదార – ఒక కప్పు; నీళ్లు – పావు కప్పు తయారీ ►ఒక పాత్రలో అర కప్పు నెయ్యి వేసి, ఆ నేతిని ఐస్ క్యూబ్‌తో బాగా రుద్దాలి ►నెయ్యి బాగా తెల్లగా అవుతుంది ∙రెండు కప్పుల మైదా పిండి వేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలపాలి ►అర కప్పు చల్లటి పాలు జత చేసి మరోమారు కలపాలి ∙ఆ తరవాత మరో మూడు కప్పుల చల్లటి నీళ్లు, ఒక టీ స్పూను నిమ్మరసం వేసి దోసె పిండిలా కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ►గరిటెడు పిండి తీసుకుని, కాగిన నూనెలో కొద్దికొద్దిగా ఆగుతూఆగుతూ వేస్తుండాలి ►మధ్యలో రంధ్రం ఉండేలా జాగ్రత్తపడాలి ►బంగారురంగులోకి వచ్చే వరకు వేయించి, కాడలాండి దానితో ఘేవార్ను ప్లేట్లోకి తీసుకోవాలి (నూనె కారిపోయేలా నిలబెట్టాలి) ►ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి. పంచదార పాకం తయారీ ►ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి స్టౌ మీద సన్నని మంట మీద సుమారు ఐదు నిమిషాలు ఉంచాలి ►మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙మిఠాయి రంగు, కుంకుమ పువ్వు, ఏలకుల పొడి జతచేసి బాగా కలిపి, తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి ►తయారుచేసి ఉంచుకున్న ఘేవార్ల మీద గరిటెడు పంచదార పాకం సమానంగా పోయాలి ►డ్రైఫ్రూట్స్‌తో అలంకరించాలి. గులాబ్ శక్రీ కావలసినవి చిక్కటి పాలు – ఒక లీటరు; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; అరటి పండు గుజ్జు – ఒక కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు; ఏలకుల పొడి – కొద్దిగా; డ్రై ఫ్రూట్స్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – 3 టేబుల్ స్పూన్లు తయారీ ►ఒక గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి, మరిగించాలి (పాలు సగానికి ఇగిరిపోవాలి) ►కొద్దికొద్దిగా నిమ్మ రసం జత చేస్తూ, పాలు విరిగేవరకు కలుపుతుండాలి ∙పాలు విరిగినట్లు తెలియగానే ఇక నిమ్మరసం వేయక్కర్లేదు ∙అరటి పండు గుజ్జు జత చేసి కలపాలి ∙పంచదార కూడా జత చేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి బాగా చల్లారాక కుంకుమ పువ్వు వేసి కలపాలి ∙డ్రై ఫ్రూట్స్ తరుగు, అరటి పండు ముక్కలతో అలంకరించి అందించాలి. చుర్మా కావలసినవి గోధుమ పిండి – ఒక కప్పు; నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు; నూనె – ఒకటిన్నర కప్పులు; పాలు – తగినన్ని; బొంబాయి రవ్వ – 4 టేబుల్ స్పూన్లు; పంచదార లేదా బెల్లం పొడి – అర కప్పు; డ్రైఫ్రూట్స్ తరుగు – 4 టేబుల్ స్పూన్లు ►ఒక పెద్ద పాత్రలో గోధుమ పిండి, బొంబాయి రవ్వ వేసి కలపాలి ►నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి జత చేసి ఉండలు రాకుండా జాగ్రత్తగా చేతితో కలపాలి ►కొద్దికొద్దిగా పాలు పోస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి ►తడి వస్త్రంతో మూత వేయాలి ►పిండి గట్టిపడ్డాక, చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ►ఒక్కో బాల్ని చేతిలోకి తీసుకుని కొద్దిగా ఒత్తాలి ►ఈ విధంగా అన్నిటినీ ఒత్తుకోవాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాచాలి ►ఒక్కో ఉండను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►బాగా చల్లారాక ఈ బాల్స్‌ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పెద్ద పాత్రలోకి, ఈ పొడి వేసి, కరిగించిన నెయ్యిని, బెల్లం పొడి జత చేసి బాగా కలపాలి ∙డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి వెంటనే అందించాలి. ఆనియన్ కచోరీ కావలసినవి స్టఫింగ్ కోసం నూనె – 3 టీ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను (చేతితో మెదపాలి); సోంపు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; తరిగిన పచ్చిమిర్చి – 1; అల్లం ముద్ద – అర టీ స్పూను; ఉల్లి తరుగు – ఒక కప్పు; మిరప కారం – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; గరంమసాలా – అర టీ స్పూను; ఆమ్చూర్ పొడి – పావు టీ స్పూను; పంచదార – పావు టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; శనగ పిండి – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. పూరీ పిండి కోసం మైదా పిండి – 2 కప్పులు; బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ ►ఒక పాత్రలో రెండు కప్పుల మైదా పిండి, ఒక టేబుల్ స్పూను బొంబాయి రవ్వ, అర టీ స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి ►రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి జత చేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలపాలి ►రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి జత చేయాలి ►అర కప్పు నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి ►ఒక టీ స్పూను నూనె వేసి బాగా కలిపి, తడి వస్త్రంతో కప్పేసి 20 నిమిషాలు ఉంచేయాలి. ఆనియన్ స్టఫింగ్ ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక జీలకర్ర, ధనియాలు, సోంపు, ఇంగువ వేసి దోరగా వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►మంట బాగా తగ్గించాలి ►పావు టీ స్పూను పసుపు, మిరప కారం, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, పంచదార, ఉప్పు జత చేసి బంగారురంగులోకి వచ్చేవరకు కలియబెట్టాలి ►పావు కప్పు సెనగ పిండి జతచేసి మరోమారు కలపాలి ►కొత్తిమీర జత చేసి కలిపితే, ఆనియన్ స్టఫింగ్ సిద్ధమైనట్లే ►కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ►ఒక్కో ఉండను తీసుకుని చేతితో పల్చగా ఒత్తాలి ∙తయారుచేసి ఉంచుకున్న ఆనియన్ స్టఫింగ్ ఒక టీ స్పూను తీసుకుని, ఒత్తిన పూరీ మధ్యలో ఉంచి, అన్నివైపులా మూసేసి, చేతితో కొద్దిగా అదమాలి ►ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న కచోరీలను నూనెలో వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►టమాటా సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. దిల్ కుశాల్ కావలసినవి సెనగ పిండి – 2 కప్పులు; నెయ్యి – ఒక కప్పు; పచ్చి కోవా తురుము – ఒక కప్పు ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పంచదార పాకం కోసం: పంచదార – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; పాలు – 2 టేబుల్ స్పూన్లు; అలంకరించడం కోసం: పిస్తా తరుగు – తగినంత తయారీ. ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ►శనగ పిండి జత చేసి దోరగా వేయించాలి ►మిగిలిన నెయ్యి వేసి మరోమారు కలిపి, బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా కలుపుతూ వేయించాలి ►పచ్చి కోవా తురుము, ఏలకుల పొడి జత చేసి మరో పది నిమిషాలు కలిపి దింపి చల్లారనివ్వాలి. పంచదార పాకం ►ఒక పాత్రలో పంచదార, నీళ్లు వేసి స్టౌ మీద ఉంచి పది నిమిషాల పాటు మరిగించాలి ►రెండు టేబుల్ స్పూన్ల పాలు జత చేసి తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి ►చల్లారిన శనగ పిండి మిశ్రమం మీద ఈ పాకం పోసి బాగా కలపాలి ►ఒక పళ్లానికి నెయ్యి పూసి, ఈ మిశ్రమాన్ని ఆ పళ్లెంలో పోయా లి ►పిస్తా తరుగు, బాదం తరుగులను పైన చల్లి, సుమారు ఐదు గంటల పాటు ఆరబెట్టాక, చాకుతో ముక్కలు కట్ చేసి అందించాలి. పాపడ్ కీ సబ్జీ కావలసినవి నూనె – 4 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; కశ్మీరీ మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; అప్పడాలు – 4; ఉప్పు – పావు టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; కసూరీ మేథీ – ఒక టీ స్పూను; సన్నగా తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు. తయారీ ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక నాలుగు టీ స్పూన్ల నూనె వేసి కాచాలి ►ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి ►అర టీ స్పూను పసుపు, ఒక టీ స్పూను మిరప కారం, అర టీ స్పూను ధనియాల పొడి జత చేసి, సన్నటి మంట మీద వేయించాలి ►బాగా వేగిన తరువాత ఒక కప్పుడు నీళ్లు, ఒక కప్పుడు చిలికిన పెరుగు జత చేయాలి ►అన్నీ బాగా కలిసేవరకు ఆపకుండా కలుపుతుండాలి ►వేయించిన అప్పడాలను ముక్కలుగా చేసి ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలపాలి ►పావు టీ స్పూను ఉప్పు జత చేసి రెండు నిమిషాలు ఉడికించాలి ►అర టీ స్పూను గరం మసాలా, ఒక టీ స్పూను కసూరీ మేథీ, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి కలిపి దింపేయాలి ►ఈ సబ్జీ చపాతీలలోకి రుచిగా ఉంటుంది. గట్టే కీ సబ్జీ కావలసినవి శనగ పిండి – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 4 టేబుల్ స్పూన్లు; ఆనియన్ పేస్ట్ కోసం ఉల్లి తరుగు – అర కప్పు; వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను; అల్లం తరుగు – అర టీ స్పూను; నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు; గ్రేవీ కోసం జీలకర్ర – ఒక టీ స్పూను; లవంగాలు – 3; దాల్చిన చెక్క ముక్క – చిన్నది; ఏలకులు – 2; ఎండు మిర్చి – 2; పెరుగు – ఒక కప్పు; ఇంగువ – చిటికెడు; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూను; గట్టేలను ఉడికించిన నీళ్లు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు గట్టే తయారీ ఒక పాత్రలో రెండు కప్పుల శనగ పిండి వేయాలి ∙కొద్దిగా ఇంగువ, పావు టీ స్పూను పసుపు, అర టీ స్పూను వాము, అర టీ స్పూను మిరప కారం, ఒక టీ స్పూను ధనియాల పొడి, ఒక టీ స్పూను ఉప్పు వేసి కలపాలి ∙మూడు టేబుల్ స్పూన్ల నూనె, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు జత చేసి అన్నీ బాగా కలిసేవరకు కలియబెట్టాలి ∙నీళ్లు పోసి పిండి గట్టిగా వచ్చేలా సుమారు పది నిమిషాల పాటు కలపాలి అవసరాన్ని బట్టి నీళ్లు జత చేసి, పూరీ పిండిలా తయారుచేసుకోవాలి ∙అలా చేయడం వలన గట్టేలను తేలికగా ఒత్తుకోవచ్చు. ఉడికించడం... ఒక పాత్రలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి కలిపి ఉంచుకున్న శనగ పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక్కో ఉండను పొడవుగా కడ్డీలా ఒత్తి, అంగుళం పొడవుగా ముక్కలు చేయాలి తగినన్ని ముక్కలను మరుగుతున్న నీటిలో వేయాలి ∙బాగా ఉడికి, పైకి తేలిన తరువాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆనియన్ పేస్ట్ తయారీ మిక్సీ చిన్న జార్లో ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేయాలి గ్రేవీ తయారీ ఒక పాత్రలో ఒక కప్పు పెరుగు వేసి మెత్తగా అయ్యేవరకు బాగా గిలక్కొట్టాలి గట్టేను ఉడికించిన కప్పు వేడినీళ్లను పక్కన ఉంచాలి ఉడికించిన గట్టేలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి సన్నని మంట మీద వేడి చే యాలి జీలకర్ర, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఏలకులు, బిర్యానీ ఆకు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ఆనియన్ పేస్ట్ జత చేసి మరోమారు వేయించి దింపేయాలి గిలక్కొట్టిన పెరుగు వేసి బాగా కలిపి మళ్లీ స్టౌ మీద ఉంచి మంట బాగా తగ్గించాలి పెరుగును ఆపకుండా కలుపుతుండాలి బాగా ఉడికిన తరువాత పసుపు, మిరప కారం, ధనియాల పొడి, ఇంగువ వేసి కలియబెట్టాలి ►గట్టేకు ఉడికించిన నీళ్లను జత చేయాలి ∙తగినంత ఉప్పు వేసి కలపాలి ►గ్రేవీ బాగా ఉడికిన తరువాత గట్టే ముక్కలను అందులో వేసి మృదువుగా కలపాలి ∙గ్రేవీ బాగా చిక్కబడ్డాక దింపేసి, కొత్తిమీర తరుగుతో అలంకరించాలి ∙రోటీలతోను, పరోటాలతోను తింటే రుచిగా ఉంటుంది. -
జూన్ 18 నుంచి పసుపు వర్క్‌షాప్
సాక్షి, హైదరాబాద్: పసుపు రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్పైసెస్ బోర్డ్ సంయుక్తంగా జూన్ 18 నుంచి హైదరాబాద్‌లో వర్క్ షాప్‌ను నిర్వహించనున్నాయి. ఈ మేరకు బుధవారం స్పైస్ బోర్డ్ ప్రతినిధులు ఎంపీ కవితను కలిసి పసుపు పంట సాగులో మెళకువలు, పంట నిల్వ, మార్కెటింగ్ సౌకర్యాలు సహా ఇతర దేశాలకు ఎగుమతి వంటి అంశాలపై చర్చించారు. అదేవిధంగా బాల్కొండ నియోజక వర్గంలోని వేల్పూరు పడగల్లో ఏర్పాటు అవుతున్న స్పైస్ పార్క్‌లో ప్రత్యేక టర్మరిక్ సెల్ , పార్కులో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. వర్క్‌షాప్‌లో పసుపు పండించే రైతులు, పసుపు ఎగుమతి దారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఫిక్కీ ప్రతినిధులు పాల్గొంటారు. నిజామాబాద్, మహబూ బాబాద్, కేసముద్రం, మహారాష్ట్రలోని సంగ్లీ, తమిళనాడులోని ఈరోడ్, సేలం, కేరళలోని అలెప్పీ మార్కెట్ చైర్మన్లను సమావేశానికి ఆహ్వానిస్తారు. ప్రత్యేక టర్మరిక్ సెల్ ఏర్పాటు ద్వారా పసుపు రైతులకు నాణ్యమైన పసుపు వంగడాలు, ప్రాసెసింగ్‌కు అవసరమైన బాయిలర్ పరికరాలు సమకూరుతాయి. రైతులకు కావాల్సిన సలహాలు శాస్త్రవేత్తలు అందిస్తారు. -
ఢిల్లీలో ధర్నా చేయండి
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటుకు రైతులతో కలసి ఢిల్లీలో ధర్నా చేయాలని యోగా గురువు బాబా రాందేవ్ సూచించారు. మంగళవారం ఎంపీ కవిత కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుం దని చెప్పారు. తెలంగాణ ఉద్యమ తరహాలో నిరసనలు చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. ఇదివరకే ఎంపీ కవిత ప్రధాన మంత్రికి , కేంద్ర మంత్రులను కలసి వినతులు సమర్పించారని అయినా కేంద్రం స్పందించడం లేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తనవంతు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ యోగా ప్రస్తుత జీవనశైలికి ఎంతో ఉపయోగకరమన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. బాబా రాందేవ్ 3 రోజుల పాటు జిల్లాలో ఉచిత యోగా శిక్షణ ఇవ్వడం గర్వకారణమన్నారు. -
మెదడుకు కూడా!
పసుపుతో మేనికి మెరుపు వస్తుందనే సంగతి చాలాకాలం నుంచే మన దేశంలోని మహిళలకు తెలుసు. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నట్లు పలు ఆధునిక పరిశోధనలు కూడా తేల్చాయి. పసుపుతో మేనికి మాత్రమే కాదు, మెదడుకు కూడా మేలు జరుగుతుందని ఒక తాజా పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఆహారంలో భాగంగా పసుపును తరచూ వాడుతున్నట్లయితే జ్ఞాపక శక్తి దాదాపు ముప్పయి శాతం మేరకు మెరుగుపడుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తేల్చారు. ఆహారంలో పసుపు వినియోగం వల్ల జ్ఞాపకశక్తి క్షీణతకు దారితీసే అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ గ్యారీ స్మాల్ వెల్లడించారు. పద్దెనిమిది నెలల పాటు రోజుకు 90 మిల్లీగ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు ఆహారంలో పసుపు తీసుకున్న వృద్ధుల మెదడు పనితీరులో గణనీయమైన మెరుగుదలను తమ పరిశోధనల్లో గుర్తించామని ఆయన తెలిపారు. -
ఈనామ్‌కు ఎగనామం
రైతుల ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ–నామ్ విధానాన్ని అమలు చేస్తోంది. పంటలను దేశంలో ఎక్కడి నుంచైనా కొనుగోలుదారులు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేలా ఈ విధానాన్ని నిజామాబాద్ శ్రద్దానంద్‌గంజ్‌లో అమలు చేస్తోంది. ఇలాంటి ఈ–నామ్ విధానం ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులకు ఎగనామం పెడుతున్నారు. యథేచ్ఛగా పసుపు జీరో దందాకు తెరలేపారు. మార్కెట్‌యార్డుకు వస్తున్న పసుపును ఈ–నామ్ విధానంలో నమోదు చేయకుండా నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఈ పసుపును తమ ఫ్యాక్టరీలకు తరలించి పన్ను ఎగవేస్తున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: పసుపుపై ఐదుశాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒక శాతం మార్కెట్ ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం పసుపు ధర క్వింటాలుకు సగటున రూ.7000 పలుకుతోంది. ఇలా వంద క్వింటాళ్ల పసుపు విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుంది. ఈ మొత్తంపై జీఎస్టీ ఐదు శాతం చొప్పున రూ.35 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒక శాతం చొప్పున మార్కెట్ ఫీజు రూ. ఏడు వేలు. ఈవిధంగా మొత్తం వంద క్వింటాళ్ల పసుపుపై రూ.42 వేలు చెల్లించాలి. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డుకు గుంటూరు జిల్లా దుగ్గిరా ల, అనంతపూర్, కడప, కర్నూలు జిల్లాలో మైదుకూరు వంటి ప్రాంతాల నుంచి పసుపు వస్తోంది. గతేడాది కొనుగోలు చేసి నిల్వ చేసిన పసుపును వ్యాపారులు నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు తెచ్చి విక్రయిస్తున్నా రు. ఈ పసుపును ఈ–నామ్లో నమోదు చేయకుండా కొందరు వ్యాపారులు నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ఇలా జీరోలో కొనుగోలు చేసిన పసుపును తరలించి పన్ను ఎగవేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు వెయ్యి క్వింటాళ్ల వరకు పాత పసుపు మార్కెట్‌యార్డుకు వస్తోంది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో జీరో దందాకు తెరలేచింది. ఎగవేత జరుగుతోంది ఇలా.. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెట్‌యార్డుకు తెస్తే ముందుగా యార్డ్ ఇన్‌గేట్ వద్ద సరుకు, రైతు, కమీషన్ ఏజెంట్ వివరాలను నమోదు చేస్తారు. సరుకు ప్లాట్‌ఫాం మీద కుప్ప పోశాక మార్కెట్ సిబ్బంది వచ్చి లాట్ నెంబరు కేటాయిస్తారు. కొనుగోలుదారులు ఈ సరుకు కుప్పలను పరిశీలించి లాట్ నెంబర్లను ఆధారంగా ఆయా సరుకుకు ధరను ఈనామ్ పోర్టల్ ఆన్లైన్ లో కోట్ చేస్తారు. ఎక్కువ ధరకు కోట్ చేసిన వ్యాపారికి సరుకును తూకం వేసి ఇస్తారు. ఈ మేరకు వ్యాపారి రైతులకు డబ్బులు చెల్లిస్తారు. అయితే ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి వస్తున్న పసుపును ఈనామ్ విధానంలో నమోదు చేయడం లేదు. నేరుగా కొనుగోలు చేసి మార్కెట్‌యార్డు నుంచి బయటకు తరలిస్తున్నారు. దీం తో జీఎస్టీతో పాటు, ఇటు మార్కెట్ఫీజుకు కూడా ఎగనామం పడుతోంది. మార్కెట్ ఫీజు ఎగవేత విషయమై ‘సాక్షి’ మార్కెటింగ్‌శాఖ గ్రేడ్–2 కార్యదర్శి రవీందర్ వివరణ కోరగా.. తాను ఇన్చార్జిగా ఉన్నానని, రెండు రోజు ల్లో విధుల్లో చేరనున్న కార్యదర్శిని సంప్రదించాలని సెలవిచ్చారు. తనకేమీ తెలియదన్నారు. జీఎస్టీ ఎగవేత విషయమై రాష్ట్ర పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ నర్సింహరావు వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి అను మతి ఉంటేనే తాము తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు. -
ముగిసిన పసుపు కొనుగోళ్లు
నంద్యాల అర్బన్: స్థానిక మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ద్వారా గత 40 రోజులుగా నిర్వహిస్తున్న పసుపు కొనుగోళ్లు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నంద్యాల మార్క్‌ఫెడ్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ.. రూ.35కోట్లతో ఇప్పటి వరకు 5,200క్వింటాళ్ల పసుపును కొనుగోలు చేశామన్నారు. కొనుగోళ్లకు సంబంధించిన 2, 463మంది రైతుల నుంచి టోకెన్లు తీసుకున్నామని, 2, 370 రైతులకు సంబంధించిన పసుపును కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈనెల 18 వరకు రైతులకు రావాల్సిన నగదును వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన నగదును రెండు మూడురోజుల్లో వారం రోజుల్లో జమ అయ్యేలా చూస్తామన్నారు. కొనుగోళ్ల కొనసాగింపుకు సంబంధించిన సమాచారం అధికారుల నుంచి రాలేదని స్పష్టం చేశారు. -
85 వేల టన్నుల పసుపు కొనుగోలు లక్ష్యం
నంద్యాల అర్బన్ : మార్క్‌ఫెడ్‌ల ద్వారా 85 వేల టన్నుల పసుపును కొనుగోలు చేసేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని మార్క్‌ఫెడ్ జీఎం శివకోటిప్రసాద్ తెలిపారు. స్థానిక టెక్కె మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ద్వారా నిర్వహిస్తున్న పసుపు కొనుగోళ్లను బుధవారం మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జీఎం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కడప, నంద్యాల, ఉదయగిరి, దుగ్గిరాళ్ల, వేమూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్‌ల ద్వారా పసుపు కొనుగోళ్లు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 15 వేల టన్నుల పసుపును కొనుగోలు చేసి రూ.94 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామన్నారు. అదే విధంగా మార్క్‌ఫెడ్‌ల ద్వారా 87 వేల టన్నుల కందులను కొనుగోలు చేసి రూ.450 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములు లేకపోవడంతో మిరప పంటను కొనుగోలు చేయలేకపోయామని చెప్పారు. నెలాఖరు వరకు పసుపు కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల మార్కెట్ యార్డుకు పసుపు రైతుల తాకిడి అధికమైందని, మరో ఆరు కాటాలు తెప్పించి పసుపు కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. అమ్మకాలు జరిగిన రెండు మూడురోజుల్లో రైతుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. సీనియర్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ సంజీవరెడ్డి, నంద్యాల మార్క్‌ఫెడ్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, మహేశ్వరరెడ్డి, రవి పాల్గొన్నారు. -
పసుపుకుప్పపై ప్రాణం పోయింది
ధర పడిపోవడంతో రైతు తీవ్ర మనోవేదన - గుండెపోటుకు గురై కన్నుమూత - నిజామాబాద్ మార్కెట్‌యార్డులో ఘటన - కొనుగోళ్లు నిలిపేయాలని రైతుల ఆందోళన.. - హమాలీకి గాయాలు.. పలువురిపై కేసు నమోదు సాక్షి, నిజామాబాద్/సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): పసుపునకు ధర పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావన్న వేదనతో ఓ రైతు గుండె ఆగింది. నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు అమ్మకానికి తెచ్చిన రైతు దాసరి చిన్న గంగారాం(65) అదే పసుపుకుప్పపై పడి మృత్యువాత పడిన ఘటన బుధవారం వేకువ జామున జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండికి చెందిన దాసరి చిన్న గంగారాం తన పెద్దకుమారుడైన పెద్ద రాజన్నకు చెందిన 15 బస్తాల పసుపును విక్రయించేందుకు మంగళవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చారు. పంటను పరిశీలించిన వ్యాపారులు సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో క్విం టాలుకు రూ.3,881 ధర నిర్ణయిం చారు. ఈ ధరకు విక్రయిస్తే పెట్టుబడులు కూడా రాలేదనే నిరాశతో రాత్రి భోజనం కూడా చేయకుండానే పడుకున్నాడని తోటి రైతులు పేర్కొన్నారు. రాత్రంతా మధనపడిన చిన్న గంగా రాం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తాను తెచ్చిన పసుపు కుప్ప వద్దకు వచ్చి నిద్రపోయాడు. నిద్రలోనే సుమారు 4.30 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి పసుపు రాశిపై కుప్పకూలాడు. ఉదయం 6 గంటలైనా నిద్రలేవకపోవడంతో సహచర రైతులు లేపేందుకు ప్రయత్నించగా, చనిపోయి ఉన్నాడు. తోటి రైతులు వెంటనే కుటుంబసభ్యులు, మార్కెట్ అధికారులు, పోలీసులకు సమాచార మిచ్చా రు. పోలీసులు వచ్చి రైతు మృతికిగల కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఆందోళన పసుపు రైతు దాసరి చిన్న గంగారాం మార్కెట్ యార్డులోనే మృతి చెందడంతో పసుపు రైతు లుS ఆందోళనకు దిగారు. కార్యాలయంలో ఫర్నిచర్‌ను ధ్వసం చేశారు. యార్డులోని కమీషన్ ఏజెంట్లు, ఖరీదుదారుల దుకాణాలను మూసేయించారు. యార్డులో కొనుగోళ్లను నిలిపేయాలని రైతులు డిమాండ్ చేశారు. మార్కెట్లో ఏజెంట్లు, వ్యాపారులు కుమ్మక్కై ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు మార్కెటింగ్‌శాఖ అధికారులు కూడా వంతపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పసుపునకు కనీస మద్దతు ధర రూ.పదివేలు నిర్ణయిం చాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చేంతవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని డిమాండ్ చేశారు. తక్కువ ధర వచ్చిందనే బెంగతో రైతు మృతి చెందినా కనీసం కమీషన్ ఏజెంట్, మార్కెట్ అధికారులు సంఘటనాస్థలానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారని రైతులు పేర్కొంటున్నారు. రైతులు ఒకవైపు యార్డులోని క్షేత్ర కార్యాలయం (ఫీల్డ్ ఆఫీస్) ముందు ఆందోళన చేస్తున్న తరుణంలో పోలీసులు చిన్న గంగారాం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. రైతుల ఆందోళన సందర్భంగా యార్డులో పని చేస్తున్న హమాలీ నర్సయ్యకు గాయాలయ్యాయి. దీన్ని నిరసిస్తూ హమాలీలు యార్డులో పనులు నిలిపేశారు. ఈ ఘటనపై పలువురిపై మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొనుగోళ్లు తిరిగి ప్రారంభించాలని మార్కెటింగ్ అధికారులు, కమీషన్ ఏజెంట్లు హమాలీలతో చర్చలు జరిపారు. మంత్రి హరీశ్‌రావు ఆరా.. నిజామాబాద్ మార్కెట్‌యార్డులో బుధవారం జరి గిన ఘటనపై రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరా తీశారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. జరిగిన ఘటనపై పూర్తి వివరాలతో మార్కెటింగ్‌శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మార్కెట్‌యార్డులో మరణించిన రైతులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా కోసం ప్రతిపాదనలు పంపామని మార్కెట్‌యార్డు కార్యదర్శి సంగయ్య తెలిపారు. రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా: ఎంపీ కవిత సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మార్కెట్‌యార్డులో పసుపు రైతు మృతి చెందిన ఘటనపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న గంగారాం కుటుంబానికి రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటన తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ యోగితారాణా మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావుతో ఫోన్లో చర్చించి మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం అందేలా చేశారు. -
నల్ల మట్టికి భళే డిమాండ్
పంటపొలాల్లో వేయిస్తున్న రైతులు భూసారం పెంపునకు దోహదం మోర్తాడ్ (బాల్కొండ) : జొన్నకోతలు పూర్తయ్యాయి. ఆ భూముల్లో ఖరీఫ్‌లో పసుపు విత్తేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దుక్కి దున్నడం పూర్తిగా, ఆయా భూముల్లో భూసారం పెంచేందుకు నల్లమట్టి వేస్తున్నారు. దీంతో నల్లమట్టికి భారీగా డిమాండ్ ఏర్పడింది. రబీలో సాగు చేసిన ఎర్రజొన్న, మొక్కజొన్న కోతలు పూర్తి కావడంతో రైతులు ఆయా భూముల్లో నల్లమట్టి వేయిస్తున్నారు. వాణిజ్య పంటలను ఎక్కువగా పండించే మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్, ఆర్మూర్, నందిపేట్, జక్రాన్‌పల్లి, ధర్పల్లి మండలాల్లోని రైతులు భూసారం పెంపుపై దృష్టి సారించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వద్ద సదర్మాట్ ప్రాజెక్టు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న పంట పొలాల్లో నల్లమట్టి సమృద్ధిగా లభిస్తోంది. పంట పొలాలను కోల్పోతున్న రైతులు ఎంతో కొంత సంపాదించుకోవడానికి ఇదే మార్గం అని భావించి నల్లమట్టిని విక్రయిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో నల్లమట్టిని నింపి, అవసరం ఉన్న రైతులకు విక్రయిస్తున్నారు. నిర్మల్ ప్రాంతంతో పాటు భీమ్‌గల్ మండలంలోని బెజ్జోరా చెరువులోనూ నాణ్యమైన నల్లమట్టి లభిస్తుంది. ఇక్కడి గ్రామాభివృద్ధి కమిటీ నల్లమట్టి విక్రయానికి టెండర్ నిర్వహించి, ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. లారీ నల్లమట్టికి రూ.5 వేల నుంచి రూ.6 వేలు, ట్రాక్టర్ అయితే రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. పంట పొలాల దూర భారాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలో మార్పు చేస్తున్నారు. సాధారణంగా మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టే చెరువుల పునరుద్ధరణలో భాగంగా నల్లమట్టిని ఉచితంగా తరలించుకునే వీలుంది. అయితే ఈసారి సమృద్ధిగా వర్షాలు కురియడంతో చాలా చెరువుల్లో నీరు బాగా నిండింది. దీంతో చాలా చెరువుల్లో నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో నల్లమట్టి తీసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వేర్వేరు ప్రాంతాల నుంచి రైతులు తమ పొలాలకు నల్ల మట్టి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పడిపోతున్న తరుణంలో, త్వరలోనే అక్కడి నుంచి కూడా నల్లమట్టి తరలించే అవకాశం కలుగుతుందని రైతులు చెబుతున్నారు. నల్లమట్టితో భూసారం అభివృద్ధి చెంది పంటల దిగుబడి బాగా వస్తుందని, అందుకే రూ.వేలు వెచ్చి కొనుగోలు చేస్తున్నామని వారు పేర్కొంటున్నారు. -
రూ.75 లక్షలకు టోకరా?
నిజామాబాద్ మార్కెట్లో పసుపు వ్యాపారి పరారీ లబోదిబోమంటున్న కమీషన్ ఏజెంట్లు, రైతులు నిజామాబాద్ : నిజామాబాద్ మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోలుదారుడు సుమారు రూ.75 లక్షలకు టోకరా వేశాడు. యార్డులో పసుపు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఉడాయించినట్లు కమీషన్ ఏజెంట్లు, కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా ఈ వ్యాపారి ఆచూకీ లభించకపోవడంతో సోమవారం వెలుగులోకి వచ్చింది. పసుపు కొనుగోలు చేసి, డబ్బులు చెల్లించకుండా ఉడాయించడంతో కమీషన్ ఏజెంట్లు, రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై బాధిత ఏజెంట్లు, కొందరు రైతులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యాపారి నాలుగైదేళ్లుగా పసుపు కొనుగోలు చేస్తున్నాడు. ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా పసుపు కొనుగోళ్లు జరిపాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి కొనుగోలు చేసిన పసుపునకు డబ్బులు చెల్లిస్తూ వచ్చిన ఆయన, వారం రోజుల నుంచి కొనుగోలు చేసిన పసుపునకు డబ్బుల చెల్లింపులు నిలిపివేశారు. శనివారం, ఆదివారం పసుపు కొనుగోళ్లు లేకపోవడంతో ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం నుంచి ఈ వ్యాపారి కమీషన్ ఏజెంట్లకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన ఇంటికి వెళ్లి ఆరా తీయగా, కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆ వ్యాపారి పరారైనట్లు కమీషన్ ఏజెంట్లు భావిస్తున్నారు. బాధితుల్లో రైతులు ఈ వ్యాపారి బాధితుల్లో కొందరు రైతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది కమీషన్ ఏజెంట్ల వద్ద పసుపు కొనుగోళ్లు చేసి, చేతులెత్తేనట్లు తెలిసింది. వీరంతా సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరికి ఎంతెంత టోకరా వేసి వెళ్లాడని చర్చించుకున్నట్లు సమాచారం. మంగళవారం బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలే.. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు టోకరా పెట్టడం ఇది కొత్తేమీ కాదు. కానీ.. ఈ పదేళ్లలో ఈ తరహా ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. 2004కు ముందు సుమారు 10 మంది వరకు వ్యాపారులు ఇలా ఉడాయించారు. అనంతరం ఐపీఈతో నిజామాబాద్ నగరానికి వచ్చి దర్జాగా ఇతర వ్యాపారాలు చేసుకున్నారు. సుమారు పదేళ్ల అనంతరం ఇప్పుడు మళ్లీ మార్కెట్ యార్డులో వ్యాపారి టోకరా వెలుగులోకి రావడంతో వ్యాపార, వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యాపారి టోకరా వేయడంపై మార్కెటింగ్‌శాఖ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బిసి బేళ భేష్
బిసి బిసిగా అంటే... వేడి వేడిగా! బేళా అంటే... పప్పుల్లా పంటికింద నలుగుతూ సరదాగా! హోల్ మొత్తం హోల్ భేషుగ్గా! కర్ణాటక కనడానికీ వినడానికీ తినడానికీ పసందుగా! మీన్ కరీ చేప వంటకాలలో ప్రత్యేకంగా చెప్పుకోదిగినది. కావల్సినవి చేప ముక్కలు - అర కేజీ కొత్తిమీర - టేబుల్ స్పూన్ ధనియాలు - అర టీ స్పూన్ అల్లం తరుగు - టీ స్పూన్ వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్ ఉల్లిపాయ - 1; ఉప్పు - తగినంత ఎండు కొబ్బరి - 5 టేబుల్ స్పూన్లు మెంతులు - అర టీ స్పూన్ ఆవాలు - పావు టీ స్పూన్ కారం - టేబుల్ స్పూన్ నూనె - 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు - రెమ్మ; పచ్చిమిర్చి - 5 తయారీ శుభ్రపరుచుకున్న చేపలను పసుపు, కారం వేసి కలిపి పక్కనుంచాలి. మూకుడులో నూనె వేడి చేసి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొబ్బరి తరుము, కరివేపాకు, ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. చల్లారిన తర్వాత మిశ్రమం మెత్తగా నూరుకోవాలి.మరొక మూకుడులో నూనె వేసి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.మరికొద్దిగా పసుపు, కారం వేసి దోరగా అయ్యేంతవరకు వేయించాలి. దీంట్లో మెత్తగా తయారుచేసుకున్న మిశ్రమం, ఉప్పు, కప్పు నీళ్లు పోసి మరో 10 నిమిషాలు ఉడికించాలి.కలిపి ఉంచుకున్న చేప ముక్కలను వేసి 15 నిమిషాల సేపు ఉడికించాలి. చివరగా చిన్న మూకుడులో టీ స్పూన్ నెయ్యి వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి పోపు పెట్టి, ఆ మిశ్రమాన్ని కూరలో కలిపి, దించాలి. కోసంబరి సలాడ్ ఈ సలాడ్‌ను పప్పు-దోసకాయతో తయారుచేస్తారు. ఈ సలాడ్‌ను మరే పదార్థంతోనూ కలపనక్కర్లేదు. ఉడిపి పాకశాలలో ఇది తప్పనిసరి వంటకం. కావల్సినవి: పెసరపప్పు - పావు కప్పు దోసకాయ - 1; క్యారట్ - 1 క్యాప్సికమ్, టొమాటో - 2 (సన్నగా తరగాలి. తగినన్ని వేసుకోవచ్చు) నిమ్మకాయ - సగం ముక్క; ఉప్పు - తగినంత పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు పోపుకి.. నూనె - టీ స్పూన్; కరివేపాకు - రెమ్మ ఆవాలు - అర టీ స్పూన్ అల్లం తరుగు - టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి - 1 లేదా 2 (సన్నగా తరగాలి) తయారీ పెసరపప్పును కడిగి, గంటసేపు నానబెట్టాలి. తర్వాత పూర్తిగా వడకట్టి పక్కనుంచాలి. దోసకాయను ముక్కలుగా కట్‌చేసి (చేదు లేకుండా చూసుకోవాలి), క్యారట్, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఇంగువ వేసి కలపాలి. దీంట్లో వడకట్టిన పప్పు పోసి కలపాలి. పప్పు ఉడుకుతుండగా ఉప్పు, నిమ్మరసం కలపాలి. చివరలో కొబ్బరి తురుము కలిపి, దించాలి. ఆరోగ్యవంతమైన కర్ణాటక సంప్రదాయ సలాడ్‌ను అలాగే వడ్డించవచ్చు. రోటీతో కూడా తినొచ్చు. మైసూర్ పాక్ కర్ణాటకలో ప్రధాన నగరమైన మైసూర్ స్వీట్ ఇది. ఈ రుచికరమైన స్వీట్ భారతీయ ప్రధాన స్వీట్లలో ఒక్కటిగా నిలిచింది. కావల్సినవి: శనగపిండి - ముప్పావు కప్పు; పంచదార - 4 కప్పులు; నెయ్యి - రెండున్నర కప్పులు తయారీ: ముందుగా శనగపిండిని జల్లించాలి. స్టౌ మీద మూకుడు పెట్టి వేడి చేయాలి. దీంట్లో పంచదార వేసి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. పంచదార కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తి కరిగాకా అందులో అర కప్పు నెయ్యి పోస్తూ మెల్లగా కలపాలి. దీంట్లో శనగపిండి పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి.మిశ్రమం ఉడుకుతుండగా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. మిశ్రమం బాగా వేగిందనడానికి మంచి సువాసన వస్తుంది. అప్పుడు మంట తీసేసి, వెడల్పాటి బేసిన్లో అడుగున నెయ్యి రాసి, శనగపిండి మిశ్రమాన్ని పోసి, వెడల్పుగా చేయాలి. కత్తితో చతురస్రాకారంలో కట్ చేసి, చల్లారనివ్వాలి. మిశ్రమం పూర్తిగా చల్లారాక ముక్కలుగా ఉన్న పాక్‌ని తీసి సర్వ్ చేయాలి. బిసి బేళ బాత్ కావల్సినవి: అన్నం - కప్పు; కందిపప్పు - అర కప్పు పసుపు - పావు టీ స్పూన్; నీళ్లు - 6 కప్పులు ఉప్పు - తగినంత; నూనె - అర టీ స్పూన్ క్యాబేజీ తరుగు - కప్పు; వంకాయయ - 1; బీన్స్ - 5 (సన్నగా తరగాలి మిశ్రమం తయారీకి... బిసి బెలా బాత్ పొడి - 4 టేబుల్ స్పూన్లు (ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, లవంగాలు, మిరియాలు, అనాసపువ్వు, యాలకులు, మరాఠీమొగ్గ, మెంతులు, గసగసాలు, పచ్చికొబ్బరి.. తగినన్ని తీసుకొని, వేయించి, పొడి చేసుకోవాలి) ఎండుకొబ్బరి - ముప్పావు కప్పు; చింతపండు - నిమ్మకాయ పరిమాణం బెల్లం తరుగు - టీ స్పూన్; నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు పోపుకి... నూనె - టీ స్పూన్; ఆవాలు - అర టీ స్పూన్ కరివేపాకు - రెమ్మ; ఇంగువ - చిటికెడు తయారీ అన్నం- ఉడికిన పప్పు, (బియ్యం-పప్పు కలిపి ఒకేసారి ఉడికించవచ్చు) కూరగాయలు, ఉప్పు, పసుపు, అర టీ స్పూన్ నూనె, 6 కప్పుల నీళ్లు పోసి సన్నని మంట మీద ఉడికించాలి. మిశ్రమం అంతా గుజ్జుగా అయ్యేంతవరకు ఉడికించాలి. నీళ్లు పడితే మరికొన్ని కలుపుకోవచ్చు. బిసిబేళ బాత్ పొడి, కొబ్బరి తురుము, చింతపండు గుజ్జు కలిపి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమంలో 2 కప్పుల నీళ్లు, కొద్దిగా ఉప్పు కలిపి కడాయిలో పోసి ఉడికించాలి. దీంట్లో బెల్లం తరుగు వేసి కలుపుతూ 5 నిమిషాలు ఉంచాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఉప్పు సరిపోయిందో లేదో సరిచూసుకొని ఆవాలు, కరివేపాకు, ఇంగువతో పెట్టిన పోపు మిశ్రమాన్ని మెత్తగా ఉడికిన అన్నం-పప్పు మిశ్రమంలో వేసి కలిపి, దించాలి. వడ్డించేముందు ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వాంగీ బాత్ అన్నం ఇతర కూరగాయలతో కలిపి చేసే వంటకాలు కర్ణాటకలో విరివిగా చూడచ్చు. వాటిలో వంకాయతో చేసే వాంగీ బాత్ చాలా ప్రసిద్ధం. కావల్సినవి అన్నం - 2 కప్పులు; ఉల్లిపాయ - 1 శనగ పప్పు - 2 టేబుల్ స్పూన్లు ఆవాలు - పావు టీ స్పూన్ నూనె - టేబుల్ స్పూన్ ఎండుమిర్చి - 4 ధనియాల పొడి - టీ స్పూన్ ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు వంకాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు ఉప్పు - తగినంత తయారీ కడాయిలో నూనె వేసి, వేడయ్యాక శనగపప్పు, ఆవాలు, కొబ్బరి పొడి వేసి వేయించాలి. దీంట్లో ఉల్లిపాయ తరుగు వేసి వేగాక, వంకాయ ముక్కలు వేయాలి. తగినంత ఉప్పు వేసి 2-3 నిమిషాలు వేగనిచ్చి, అందులో అన్నం వేసి కలపాలి. విడిగా చిన్న మూకుడులో నూనె వేసి, జీలకర్ర, 2 ఎండుమిర్చి, చిటికెడు పసుపు, రెమ్మ కరివేపాకు వేసి పోపు పెట్టి, ఈ మిశ్రమాన్ని వాంగీబాత్లో కలపాలి. అలంకరణకు చివరగా కొద్దిగా కొత్తిమీర వేయచ్చు. వడ్డించడానికి వాంగీబాత్ సిద్ధం. చికెన్ ఘీ రోస్ట్ మాంసాహార వంటకాలలో నెయ్యితో చేసే ఈ వంటకం కన్నడిగుల ప్రత్యేకం. కావల్సినవి: చికెన్ ముక్కలు - కేజీ పెరుగు - అర కప్పు; పసుపు - అర టీ స్పూన్ నిమ్మరసం - టీ స్పూన్ ఉప్పు - తగినంత బెల్లం తురుము - టీ స్పూన్ కరివేపాకు - 2 రెమ్మలు; ఎండుమిర్చి - 10 పండుమిరపకాయలు - 3; నల్ల మిరియాలు - 5 లవంగాలు - 5; మెంతులు - టీ స్పూన్ జీలకర్ర - అర టీ స్పూన్ ధనియాలు - టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు - 5 టేబుల్ స్పూన్లు తయారీ గిన్నెలో శుభ్రపరిచిన చికెన్ ముక్కలు వేసి పెరుగు, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి, మూత పెట్టి 2 గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి.ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు వేయించి, చల్లారాక పొడి చేసుకోవాలి. దీంట్లో చింతపుండు గుజ్జు, వెల్లుల్లి వేసి మిశ్రమాన్ని మెత్తగా నూరాలి. మందపాటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, స్టౌను హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నుంచి చికెన్ ముక్కలను తీసి కాగుతున్న నెయ్యిలో వేసి కలపాలి. చికెన్ ముక్కలు దేనికది విడిపోయేంతవరకు మంట అలాగే ఉంచి, తర్వాత తగ్గించాలి.తయారుచేసుకున్న చింతపండు గుజ్జు మిశ్రమం చికెన్‌లో వేసి 25-30 నిమిషాలు ఉడికించాలి. చివరగా కరివేపాకు వేసి దించాలి. కర్టెసీ: జి.వి.రమేష్, షెఫ్ నొవొటెల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ -
కొల్లిపరలో విరగపండిన కేరళ పసుపు
దేశవాళీ పసుపు రకాలు నాణ్యతను కోల్పోతున్నాయి. పంటల్లో లక్ష్మిగా రైతులు పరిగణించే పసుపును తెగుళ్లు దెబ్బతీస్తున్నాయి. గిరాకీకి కారణమైన కుర్కుమిన్ శాతం తగ్గిపోతోంది. విచక్షణా రహితంగా రసాయన ఎరువుల వాడకం, కొత్త తరహా విత్తనం కోసం ప్రయత్నాలు కొరవడటం ఇందుకు కారణం. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై ఆధారపడిన ధరల్లో నాణ్యత లేని పసుపుకు ఆదరణ త గ్గిపోతోంది. ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. వెరసి పసుపు పంట సాగు రైతులకు సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో అందుబాటులోకి వచ్చిన కేరళ తరహా విత్తనం నాటి, సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన గుంటూరు జిల్లా అభ్యుదయ రైతులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. పసుపు సాగులో కొత్త ఆశలకు నాంది పలికారు. కేరళలోని కాలికట్లో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలికి అనుబంధంగా గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ (ఐఐఎస్ఆర్) మేలైన పసుపు వంగడాలు ఏసీసీ-48, ఏసీసీ-79లను రూపొందించింది. వీటిపి ప్రయోగాత్మకంగా సాగు చేయగా చక్కని దిగుబడులు వచ్చాయి. కొల్లిపర మండలం వల్లభాపురం అభ్యుదయ రైతు వంగా సాంబిరెడ్డి ఈ రెండు రకాలను ఎకరం విస్తీర్ణంలో సాగు చేశారు. 60 సెంట్లలో వేసిన ఏసీసీ-48 రకం పసుపు చేను ఇటీవలే దున్నారు. ఒక్కో పసుపు దుంప సైజు ఆశ్చర్యం గొలిపే రీతిలో ఉండటాన్ని చూసి, అక్కడకు వచ్చిన ఐఐఎస్ఆర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి.ప్రాశత్ సహా తోటి రైతులంతా అబ్బురపడ్డారు. సెంటుకు 3 బానల దిగుబడి.. 5 శాతం కుర్కుమిన్! సహజంగా పసుపు సాగుచేసే రైతులకు ఒక సెంటు విస్తీర్ణానికి పచ్చి పసుపు 1-2 బానల దిగుబడి వస్తుంది. కుర్కుమిన్ శాతం 2-2.5 శాతం ఉంటోంది. తాజాగా తవ్విన ఏసీసీ-48 రకం పసుపు 3 బానల దిగుబడి రాగా, ఇందులో కుర్కుమిన్ 4.5-5 శాతం ఉంటుందని స్వయంగా పరిశీలించిన డాక్టర్ ప్రాశత్ చెప్పారు. ప్రయోగాత్మకంగా వేసిన ఈ పంటను సేంద్రియ విధానంలో సాగు చేయడంతో మంచి ఫలితం వచ్చిందన్నారు. 2017 జూన్ నాటికి ఈ వంగడాలను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. నూతన పసుపు ఏసీసీ-48 వంగడం విశిష్టతలు.. ► కుర్కుమిన్ శాతం ఎక్కువ. ► పైరు ఎత్తుగా, గుబురుగా పెరిగి, దుంప నుండి మరో మూడు వరకు పిలకలు, వాటికి మంచి సైజులో ఉండే కొమ్ములు వచ్చాయి. ► సేంద్రియ పద్థతిలో సాగుకు అనుకూలం. ► {పత్యేక పరిస్థితుల్లోనూ దిగుబడులు తగ్గని పరిస్థితి. ► సాధారణ పసుపు రకాల పంటకాలం 275 రోజులు. ఈ రకం పసుపు 210 రోజుల్లోనే చేతికి వచ్చేస్తుంది. ఎకరానికి 300 కిలోల విత్తనం చాలు.. ► సాధారణంగా రైతులు ఎకరానికి 1,350 కిలోల పసుపు విత్తనం వేస్తుంటే కొత్త రకం విత్తనం 300 కిలోలు మాత్రమే నాటారు. దీంతో ఖర్చు తగ్గింది. ► {పత్యేకంగా తయారు చేసిన గొర్రుతో బెడ్లను ఏర్పాటు చేశారు. దీని కారణంగా వర్షం కురిసినపుడు, తుపాన్లు వచ్చినప్పుడు వర్షపు నీరు పొలంలోంచి త్వరితగతిన వెళ్లిపోతుంది. ► {పత్యేకంగా తయారు చేసుకున్న బెడ్లపై త్రికోణం ఆకారంలో.. కూలీల చేత పసుపు కొమ్ములను ముక్కలు చేసి నాటించారు. ఎటు చూసినా అడుగు దూరం ఉండేలా నాటారు. బెడ్ మధ్య భాగంలో డ్రిప్ లేటరల్స్ ఏర్పాటు చేశారు. ► మాగిన పశువుల ఎరువు, గొర్రెల ఎరువు, గడ్డీ గాదంతో సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువును మాత్రమే వాడారు. ► దుంప పుచ్చు రాకుండా చూసేందుకు.. డ్రిప్ ద్వారా అల్లం పేస్టు, ఆముదం నూనె మొక్కలకు పంపించారు! ► ఆకులపై ఎటువంటి రసాయనాలు పడకుండా చూసుకున్నారు. పొలం చుట్టూ అవిశె చెట్లను నాటారు. ► సెంటుకు మూడు బానల మేర దిగుబడి వచ్చే అవకాశం ఉందని తోటి రైతులు సైతం చెబుతున్నారు. కేరళలో నూతన పసుపు రకాలను అభివృద్ధి చేసిన ఐఐఎస్ఆర్, ప్రయోగాత్మకంగా సాగుచేసే బాధ్యతను గుంటూరు జిల్లా గుండిమెడ గ్రామంలోని ఆదర్శ రైతు శాస్త్రవేత్త పిడికిటి చంద్రశేఖర్ ఆజాద్‌కు అప్పగించింది. అజాద్ తనకు పరిచయస్తులైన గుండిమెడలోని భీమిరెడ్డి భాస్కరరెడ్డి, వడ్డేశ్వరం రైతు సుధాకర్, వల్లభాపురం రైతు వంగా సాంబిరెడ్డికి విత్తనాన్ని అందజేసి, సాగుకు ప్రోత్సహించారు. వీరిలో పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన సాంబిరెడ్డే తక్కువ ఖర్చుతో అద్భుతమైన దిగుబడి సాధించటం విశేషం. - ఉయ్యూరు సాంబిరెడ్డి, కొల్లిపర, గుంటూరు జిల్లా పూర్తి సేంద్రియ పద్ధతిలోనే కొత్త విత్తనం అభివృద్ధి! కొత్త రకం విత్తనం అభివృద్ధి ఒకే ప్రాంతంలో జరిగితే మంచి గుర్తింపు వస్తుంది. అందరూ సేంద్రియ పద్ధతిలోనే సాగు చేయాలి. పైరుపై ఎలాంటి రసాయనాలు పడకుండా కాపాడుకొంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. రైతులు పరస్పరం సహకరించుకోవాలి. అట్లా అయితేనే ఆశించినట్టుగా పసుపులో కొత్త విత్తనం అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. అందుకే కేవలం కొల్లిపర మండల గ్రామాల్లోని రైతులకు మాత్రమే ఈ రకం పసుపు విత్తనం ఇవ్వాలని భావిస్తున్నాను. - వంగా సాంబిరెడ్డి (97041 46562),వల్లభాపురం, కొల్లిపర, గుంటూరు జిల్లా -
జెనెటిక్స్‌తో సరిపోలిన ఆయుర్వేదం
సాక్షి, హైదరాబాద్: భారత సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం ప్రకారం వ్యాధులను వాత, పిత్త, కఫ ప్రకారం గుర్తిస్తారు. ఈ మూడింటి సమాహారమే ప్రాకృతి. ఈ మూడింటి విభజన జెనిటిక్స్‌తో సరిపోలినట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) సీనియర్ శాస్త్రవేత్త కె.తంగరాజ్ కనుగొన్నారు. ప్రాకృతి ప్రకారం ఆయన 3,416 మందిని స్క్రీనింగ్ చేసి 262 మందిని పరిశోధనకు తీసుకున్నారు. వారిని జినోమ్ వైడ్ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్పిజం (ఎన్‌ఎన్‌పీ) ద్వారా విశ్లేషణ చేశారు. దీని ప్రకారం ఆయుర్వేదంలోని వాత, పిత్త, కఫాలు జన్యువుల ఆధారంగానే విభజన జరిగినట్లు నిర్ధారిం చారు. వందల ఏళ్ల క్రితం జెనెటిక్ సైన్స్ లేకున్నా ఆయుర్వేదం ఆ ప్రకారమే ఉండటం భారతీయుల గొప్పతనమని తేలింది. ఉస్మానియా వర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ ఆధ్వర్యంలో ‘న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ డయాగ్నసిస్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్’ అంశంపై జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా తంగరాజ్ తన పరిశోధన వివరాలు వెల్లడించారు. ఆయుర్వేదానికి జెనిటిక్ ఆధారం ఉందా? లేదా? అన్న అంశంపై పరిశోధన చేశానన్నారు. తాను విశ్లేషణకు తీసుకున్నవారి డీఎన్ఏల ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. ఎన్జీఎస్తో ముందే గుర్తించవచ్చు... నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్స్ (ఎన్జీఎస్) ద్వారా ముందే వ్యాధి నిర్థారణకు రావచ్చని జెనిటిక్ శాఖ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మాదిరెడ్డి సుజాత చెప్పారు. క్యాన్సర్, షుగర్, ఇతర వ్యాధులను ఎన్జీఎస్ ద్వారా రెండు మూడేళ్లు ముందే గుర్తించవచ్చన్నారు. కొందరికి అబార్షన్స్ అవుతుంటాయి. దానికి జన్యుపరమైన కారణాలేంటో ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ప్రొఫెసర్లు ఎ.జ్యోతి, జి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పసుపుతో విష పదార్థాలకు చెక్... బియ్యం, పప్పులు, నూనె గింజలు, కూరగాయలను నిల్వ చేస్తే వాటిపై ఏస్పర్జిల్లస్ అనే ఫంగస్ ఏర్పడుతుంది. ఆ ఫంగస్ అల్ఫాటాక్సిన్-బి1 అనే విషపదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాంటి విషపదార్థం పరిమితికి మించి సోకిన ఆహారధాన్యాలను తింటే మనిషి డీఎన్ఏలో మార్పులు వచ్చి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదాలు అధికంగా ఉంటాయని బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ బి.శశిధర్రావు వెల్లడించారు. భారత్‌లో ఆహార ధాన్యాలను వండేప్పుడు పసుపు వాడటం వల్ల అల్ఫాటాక్సిన్-బి1కు చెక్ పెట్టవచ్చని తన పరిశోధనలో తేలిందన్నారు. ఎలుకల మీద చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడిందన్నారు. ఇదిలావుండగా రైతులు పురుగుమందులను నేరుగా స్ప్రే చేయడం వల్ల వారి జన్యువులపై ప్రభావం చూపి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని డాక్టర్ పద్మజ తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. -
పసుపుతో పచ్చగా పదికాలాలు..
మన దేశంలో వివిధ వంటకాల్లో విరివిగా వాడే పసుపుతో పచ్చగా పదికాలాలు బతికేయవచ్చని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. పసుపులో యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు వివిధ దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఇదివరకే తేలింది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం ఇవ్వడంలో, కేన్సర్‌ను నిరోధించడంలో కూడా పసుపు ప్రశస్తంగా పనిచేస్తుందని ఒక తాజా పరిశోధనలో తేలింది. అల్జిమర్స్ డిసీజ్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు, జీవక్రియలకు సంబంధించిన వ్యాధులపై పసుపు అద్భుతంగా పనిచేస్తుందని అమెరికాలోని ఎం.డి. అండర్సన్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, అందువల్ల పలు వ్యాధులను సమర్థంగా అరికట్టగలదని చెబుతున్నారు. -
పసుపు, వేరుశనగకు రికార్డు ధర
వరంగల్ సిటీ: వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పసుపు, వేరుశనగకాయకు బుధవారం రికార్డు ధర పలికింది. మార్కెట్‌కు సుమారు 145 క్వింటాళ్ల పసుపు రాగా.. 22 క్వింటాళ్లు తెచ్చిన వంగ రాజు అనే రైతుకు క్వింటాకు రూ.7,601 రికార్డు ధర పలికింది. రెండేళ్లుగా పసుపు మార్కెట్లో క్వింటా ధర రూ.4,500 దాటలేదు. 2012లో మాత్రం క్వింటా పసుపు రూ.9 వేల వరకు ధర పలికింది. కాగా, మార్కెట్‌కు 128 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. రుణావత్ కోటి అనే రైతు తెచ్చిన 16 క్వింటాళ్ల కాయకు క్వింటాకు గరిష్టంగా రూ.5,230 రికార్డు ధర పలికింది. మూడేళ్లుగా వేరుశనగ ధర ఏ రోజు కూడా క్వింటాకు రూ.4,300 దాటలేదు. మొత్తంగా పసుపు, పల్లికాయకు ఈ సీజన్లోనే అత్యధిక రికార్డు ధర పలికినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నారుు. ఈ ధరలు మరో వారంలో మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. -
‘పసుపు’ను కాపాడుకుందాం ఇలా
పసుపులో దుంపలు ఊరే ప్రస్తుత సమయంలో దుంప తొలుచు ఈగ, దుంప కుళ్లు తెగులు ఆశించే అవకాశాలుంటాయి. ఇవి ఆశిస్తే దుంపల్లో నాణ్యతతో పాటు దిగుబడి తగ్గిపోతుంది. ఇవి ఆశించిన తర్వాత నివారణ చర్యలు చేపట్టేదానికన్నా ముందుగానే వేప పిండిని వాడితే ప్రయోజనం ఉంటుంది. ముందస్తు చర్యలు పసుపు మొక్క 40 రోజుల వయసున్నప్పుడు ఒకసారి, 120 రోజులప్పుడు మరొకసారి ఎకరాకు 250-300 క్వింటాళ్ల వేప పిండిని తడిగా ఉన్న నేలపై మొదళ్ల చుట్టూ చల్లాలి. వేప పిండి నేలను అంటుకుంటుంది. తదుపరి ప్రతి నీటి తడిలోనూ వేప ఊట భూమిలోకి దిగుతుంది. ఇది పసుపు పంటకు దుంపకుళ్లు, దుంప పుచ్చు కలుగజేసే క్రిమికీటకాలు మొక్కల దరి చేరకుండా కాపాడుతుంది. ‘ఈగ’ను గమనిస్తే.. దుంపతొలుచు ఈగను పంటలో గమనించినట్లయితే ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. దుంపకుళ్లు తెగులు ఆశించినట్లయితే మడిలోని మురుగు నీటిని తీసేయాలి. తెగులు ఆశించిన మొక్కలు దాని చుట్టు పక్కల ఉండే మొక్కల మొదళ్లు బాగా తడిచేట్లుగా లీటర్ నీటికి 3 గ్రా ముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని పోయాలి. వచ్చే సీజన్‌కోసం.. వచ్చే ఏడాది పసుపు పంట వేసుకోవాలనుకునే రైతాం గం దుంపకుళ్లు తెగులు ఆశించకుండా కొన్ని చర్యలు చేపట్టాలి. వేసిన పొలంలోనే పసుపు వేయకుండా వేరుశనగ, మొక్కజొన్న, జొన్న పంటలతో పంట మార్పిడి చేయడం ఉత్తమం. లీటర్ నీటికి 3 గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ లేదా మాంకోజెబ్, 2 మిల్లీ లీటర్ల మోనోక్రొటోఫాస్ లీటర్ కలిపిన ద్రా వణంలో తెగులు సోకని విత్తనాన్ని 30 -40 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీరు మార్చి లీటరు నీటికి 5 గ్రా ముల ట్రైకోడర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి, నీడలో ఆరబెట్టాలి. తర్వాత నాటుకోవాలి. కిలో ట్రైకోడర్మాను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండిలో కలిపి వారం పాటు అనువైన పరిస్థితిలో వద్ధి చేసి, నెలరోజులకు మొదటి తవ్వకం చేశాక నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి. దుంపలు విత్తిన తర్వాత జీలుగ, జనుము, వెంపలి, కానుగ మొదలగు పచ్చి ఆకులు లేదా ఎండు వరి గడ్డి, చెరకు ఆకులను పొలంపై దుంపలు మొలకలు వచ్చేంతవరకు కప్పడం వల్ల తెగుళ్ల ఉధతిని కొంతవరకు తగ్గించవచ్చు. -
మేఘమా మురిపించకే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గత ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు 2014 ఖరీఫ్ సీజన్‌కు కార్యాచరణను రూపొందించారు. 3,20,761 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు వేస్తారని అంచనా వేశారు. జిల్లాలో ప్రధానంగా వరి, సోయా సాగు అధికంగా ఉంటుంది. ఆ తర్వాత పసుపు, చెరుకును పండిస్తారు. ఈ నేపథ్యంలో 3.21 లక్షల హెక్టా ర్లకుగాను 12,4625 హెక్టార్లలో వరి, 70910 హెక్టార్లలో సోయా, 57,630 హెక్టార్లలో మొక్కజొన్న, 11508 హెక్టార్లలో పసుపు వేయనుండగా.. మిగతా హెక్టార్లలో కందులు, పెసర, చెరకు తదితర పంటలు వేస్తారని అంచనా వేశారు. ఇందుకోసం ఏపీ సీడ్స్, హాకా, ఏపీ అయిల్‌ఫెడ్ ద్వారా 70 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు, 3,650 క్వింటాళ్ల మొక్కజొన్నలతోపాటు మొత్తం 79,800 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 2,42,685 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరముంటాయని కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న వ్యవసాయశాఖ ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే అందుకు భిన్నంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సాగును కొనసాగించలేక, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లలేక రైతులు అయోమయంలో ఉన్నారు. తగ్గిన వర్షపాతం.. ప్రాజెక్టులపైనే భారం గతేడాదితో పోలిస్తే జిల్లాలో వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ వర్షపాతం, గత రెండేళ్లలో నమోదైన వర్షపాతంతో పోల్చితే పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో వరి, సోయా తదితర పంటలకు స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపాలనుకున్నా ప్రాజెక్టులపై భారం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టం ఆశాజనకంగానే ఉన్నా ఆయకట్టు రైతులు భవిష్యత్ పరిణామాలకు భయపడుతు న్నారు. సాధారణ వర్షపాతం జిల్లాలో 849 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు 233.6 మి.మీటర్లు నమోదు కావాల్సి ఉంది. 2012లో ఇదే సీజన్లో 178.70 మి.మీటర్లు, 2013 సంవత్సరంలో 301.90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 91.80 మి.మీ. నమోదైంది. 59 శాతం వర్షపాతం మైనస్‌గా ఉం డటం రైతులకుఆందోళన కలిగిస్తోంది. ఇదిలా వుంటే శ్రీరాంసాగర్‌లో 1091 ఫీట్లకు 1067.60 ఫీట్ల వరకు నీరు ఉన్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. నిజాంసాగర్‌లో1405 ఫీట్లకు 1392.78 ఫీట్లుగా నమోదు కాగా.. ప్రత్యామ్నాయ పంటలకు ప్రాజెక్టుల నీరు ఏ మేరకు వినియోగం అవుతుందన్న చర్చ జరుగుతోంది. -
గ్రేడింగ్ చెరిపివేతపై రైతుల ఆగ్రహం
కేసముద్రం మార్కెట్లో గంటన్నరపాటు నిలిచిన పసుపు వేలం పాటలు కేసముద్రం : మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పసుపు రాశులకు సెక్యూరిటీ గార్డులు వేసిన గ్రేడింగ్‌లను వ్యాపారులు చెరిపివేసి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో రైతులు గొడవకు దిగారు. దీంతో రైతులు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం పెరిగి పసుపు వేలం పాటలు నిలిచి పోయాయి. సోమవారం మార్కెట్‌కు సుమారు 2వేల బస్తాల పసుపు అమ్మకానికి వచ్చింది. మొదట సెక్యూరిటీ గార్డులు వచ్చిన పసుపు రాశులకు గ్రేడింగ్ విధానాన్ని సూచిస్తూ ఏ,బీ, సీ, ఇంటూ, ఎం ఇంటూ అనే గుర్తులు వేశారు. వాటి ప్రకారం వేలంపాటలు నిర్వహించాల్సిన వ్యాపారులు గ్రేడింగ్ తప్పు పడిందంటూ పలు రాశుల వద్ద గుర్తులను చెరిపివేసి ధరలను నిర్ణయిస్తూ వచ్చారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ మహమూద్‌పట్నం గ్రామానికి చెందిన రైతు వెంకటాచారి నిలదీయగా వ్యాపారులు అతనితో వాగ్వాదానికి దిగారు. ఇలాగైతే తాము కొనుగోళ్లు జరపలేమంటూ వ్యాపారు లు వేలంపాటలు నిలిపివేసి వెళ్లిపోయారు. అనంతరం మార్కెట్ అధికారులు జోక్యం చేసుకున్నా లాభంలేకుండా పోయింది. దీంతో రైతు లు మరింత ఆగ్రహానికి గురయ్యారు. నాణ్యతను బట్టి ధరలు నిర్ణయించడంలేదం టూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు వ్యాపారులను ఒప్పించి గంటన్నర తర్వాత వేలంపాటలు ప్రారంభించారు. సోమవారం పసుపు క్వింటాలుకు గరిష్ట ధర రూ.5605, కనిష్ట ధర రూ.4300, గోళ రకానికి గరిష్టంగా రూ.5400, కనిష్టంగా రూ.4050 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
‘అమ్మ హస్తానికి’ ఫ్రాక్చర్
మూడు నెలలుగా అరకొరగా సరకుల పంపిణీ రెండు నెలలుగా అందని చింతపండు, పసుపు, కారం నెల రోజులుగా వంట నూనె నిలిపివేత ఈ నెల కూడా పంపిణీ అనుమానమే నర్సీపట్నం, న్యూస్‌లైన్: గత ప్రభుత్వం ప్రచారాస్త్రంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం అటకెక్కినట్టే కనిపిస్తోంది. గత ఏడాది ఉగాది రోజున ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ఏడాదైనా ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది. ప్రచారం కోసమే పథకం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్, ఇతర మంత్రుల ఫొటోలను విరివిగా వాడుకున్న ఈ పథకాన్ని కేవలం ప్రచార అస్త్రంగానే వాడుకున్నారు తప్ప సక్రమంగా అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. మూడు నెలలుగా వినియోగదారులకు ప్రభుత్వం అరకొరగా సరుకులు పంపిణీ చేస్తూ నెట్టుకొస్తోంది. మూడు నెలల క్రితం నుంచిసరుకుల కొరత ఏర్పడింది. ప్రారంభంలో ఉప్పు, గోధుమ పిండి సరఫరాను నిలిపివేసి, తరువాత పునరుద్ధరించారు. రెండు నెలలుగా చింతపండు, పసుపు, కారం పం పిణీ నిలిపివేశారు. గత నెల నుంచి వంట నూనె కూడా పంపిణీకి నోచుకోలేదు. నూనె కొరత ఈ నెల కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పంచదారపై ఇచ్చే రాయితీని కేంద్రం మూడు నెలల క్రితమే నిలిపివేసింది. ఎన్నికల ముందు పంచదార పంపిణీ నిలిపివేయడం మంచిది కాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారాన్ని భరి స్తూ ఈ మూడు నెలలూ నెట్టుకొచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చాక దీనిపై ఒక నిర్ణయం తీసుకోకుంటే పంచదార పంపిణీ సైతం నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సాక్షాత్తూ అధికారులే అంటున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల కుటుంబాలు ఈ సరుకులపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలు పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పసుపు రైతుకు ఊరట
కేసముద్రం,న్యూస్‌లైన్ : కేసముద్రం మండల కేంద్రంలోని వ్యవసాయమార్కెట్‌లో శుక్రవారం పసుపు (కాడి) క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,151ధర పలి కింది. ఏప్రిల్‌లో పసుపు అమ్మకాలు ప్రారంభం కాగా.. మొదట్లో గరిష్ట ధర రూ.7,000, కనిష్టంగా రూ. 6,000తో కొనుగోళ్లు జరిగారుు. అనంతరం ధర క్వింటాల్‌కు రూ.3,000 నుంచి రూ. 4,000 వరకు పలుకుతూ వచ్చింది. ఈ క్రమంలో మార్కెట్‌కు శుక్రవారం 150 బస్తాలు అమ్మకానికి రాగా... క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,151, కనిష్టంగా రూ.5,070తో మార్కెట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. గత ఖరీఫ్‌లో పండించిన పసుపునకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో కొందరు రైతులు దాచిపెట్టుకున్నారని, వాటినే ఇప్పుడు అమ్ముకుంటున్నారని మార్కెట్ అధికారులు తెలిపారు. అదేవిధంగా పసుపు గోళా రకం క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.5,304, కనిష్ట ధర రు.5,105 పలికినట్లు వారు వెల్లడించారు. కొంత మేరనైనా ధర పెరగడంతో పసుపు రైతులు ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఆన్లైన్లో పసుపు ట్రేడింగ్‌పై సీబీఐ విచారణకు ఎంపీ డిమాండ్
నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజిలో ఆన్లైన్లో జరుగుతున్న పసుపు ట్రేడింగ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ డిమాండ్ చేశారు. తమిళనాడులోని ఎండీఎంకే పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఎన్.సి.డి.ఇ.ఎక్స్.లో జరుగుతున్న పసుపు ట్రేడింగ్‌లో చాలా అక్రమాలున్నాయని ఆయన ఆరోపించారు. అసలు రైతులకు తగిన ధర రానందువల్ల పసుపును వెంటనే ఆన్లైన్ ట్రేడింగ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పసుపు అభివృద్ధి బోర్డును ఏర్పాటుచేసి, కనీసం క్వింటాలుకు 9వేల రూపాయల కనీస ధర నిర్ణయించాలని ప్రధానమంత్రిని గణేశమూర్తి కోరారు. అఖిలభారత పసుపు రైతుల సంఘాల సమాఖ్య చైర్మన్ పి.కె. దైవసిగమణి కూడా పసుపును ఫ్యూచర్స్ ట్రేడింగ్ నుంచి మినహాయించాలని కోరారు.