
పసుపును సంప్రదాయకంగా ముఖానికి రాసుకుంటారు. ఇది మన చర్మం పై ఉండే అవాంచిత రోమాలను తొలగించడంలో ఎంతో సహాయ పడుతుంది. శెనగపిండిని కొద్దిగా పసుపు, పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే ఎంతో ప్రభావవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు వాడటం వలన ఎలాంటి దుష్పభ్రావాలు ఉండవు.
చక్కెర మిశ్రమంతో...
ఇది కొంచం తక్కువ ఖర్చుతో ఇళ్లలో వ్యాక్సింగ్ చేసుకునే ఒక పద్దతి. కొద్దిగా చక్కెర లో కొంచెం తేనె మరియు నిమ్మ రసం కలిపి ఈ మిశ్రమం ముఖంపై రాసుకోవాలి. దీన్ని ఒక క్లాత్ తో తొలగించాలి. ఈ చిట్కా చాలా బాగా పని చేస్తుంది.
ఎగ్ మాస్క్
గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి అందులో చెంచాడు పంచదార, అర చెంచాడు మొక్కజొన్న పిండి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖం పై రాసుకుని కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత ఒక మాస్క్ లా మారిన దీన్ని మెల్లగా తీసివేస్తే దానితోపాటు ఈ అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. ఈ పద్ధతి మంచి ఫలితాలనిస్తుంది కానీ కొద్దిగా నొప్పి ఉండచ్చు.
Comments
Please login to add a commentAdd a comment