నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజిలో ఆన్లైన్లో జరుగుతున్న పసుపు ట్రేడింగ్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ డిమాండ్ చేశారు. తమిళనాడులోని ఎండీఎంకే పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్కు వినతిపత్రం ఇచ్చారు.
ఎన్.సి.డి.ఇ.ఎక్స్.లో జరుగుతున్న పసుపు ట్రేడింగ్లో చాలా అక్రమాలున్నాయని ఆయన ఆరోపించారు. అసలు రైతులకు తగిన ధర రానందువల్ల పసుపును వెంటనే ఆన్లైన్ ట్రేడింగ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పసుపు అభివృద్ధి బోర్డును ఏర్పాటుచేసి, కనీసం క్వింటాలుకు 9వేల రూపాయల కనీస ధర నిర్ణయించాలని ప్రధానమంత్రిని గణేశమూర్తి కోరారు. అఖిలభారత పసుపు రైతుల సంఘాల సమాఖ్య చైర్మన్ పి.కె. దైవసిగమణి కూడా పసుపును ఫ్యూచర్స్ ట్రేడింగ్ నుంచి మినహాయించాలని కోరారు.
ఆన్లైన్లో పసుపు ట్రేడింగ్పై సీబీఐ విచారణకు ఎంపీ డిమాండ్
Published Tue, Sep 10 2013 11:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
Advertisement