సాక్షి, నిజామాబాద్: జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో పసుపు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించగా సుమారు రెండు నెలలుగా మార్కెట్ యార్డు మూతపడింది. బుధవారం నుంచి మార్కెట్ యార్డులో పసుపు పంట క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో మంగళవారం రోజునే రైతులు పసుపు పంటను యార్డుకు తీసుకొచ్చారు. కాగా ప్రతి రోజు 10 వేల బస్తాల పసుపు మాత్రమే క్రయవిక్రయాలు జరగనున్నాయి. చదవండి: ఉచిత ‘బియ్యం’ అందేనా!
అంతకు మించి పసుపు పంటను మార్కెట్ యార్డులోకి అనుమతించడం లేదు. ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే రైతులు పసుపును మార్కెట్ యార్డుకు తీసుకురావాలని అధికారులు సూచించారు. దీంతో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రైతులు భారీగా పసుపును తీసుకొస్తున్నారు. భారీ ఎత్తున రైతులు తరలి వస్తుండటంతో సిబ్బంది టోకెన్‌లు ఇస్తూ మార్కెట్‌లోకి అనుమతిస్తున్నారు. కాగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పసుపునకు అనుమతి నిరాకరించారు. చదవండి: పోస్టు చేయడమే పాపమైంది...
మార్కెట్ యార్డుకు పసుపు కళ
Published Wed, May 27 2020 11:42 AM | Last Updated on Wed, May 27 2020 11:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment