
పసుపుతో మేనికి మెరుపు వస్తుందనే సంగతి చాలాకాలం నుంచే మన దేశంలోని మహిళలకు తెలుసు. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నట్లు పలు ఆధునిక పరిశోధనలు కూడా తేల్చాయి. పసుపుతో మేనికి మాత్రమే కాదు, మెదడుకు కూడా మేలు జరుగుతుందని ఒక తాజా పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఆహారంలో భాగంగా పసుపును తరచూ వాడుతున్నట్లయితే జ్ఞాపక శక్తి దాదాపు ముప్పయి శాతం మేరకు మెరుగుపడుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో తేల్చారు.
ఆహారంలో పసుపు వినియోగం వల్ల జ్ఞాపకశక్తి క్షీణతకు దారితీసే అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ గ్యారీ స్మాల్ వెల్లడించారు. పద్దెనిమిది నెలల పాటు రోజుకు 90 మిల్లీగ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు ఆహారంలో పసుపు తీసుకున్న వృద్ధుల మెదడు పనితీరులో గణనీయమైన మెరుగుదలను తమ పరిశోధనల్లో గుర్తించామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment