
వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ సామర్థ్యం కూడా తగ్గుతుంటుంది. అది సర్వసాధారణం. అయితే అలా కాకుండా బాడీపై వచ్చే వృద్ధాప్య లక్షణాలకు ఎలా అడ్డుకట్టవేస్తామో అలాగే బ్రెయిన్ సామర్థ్యం వృద్ధాప్యం బారిన పడకుండా ఎలా సంరక్షించుకోవాలనే దిశగా శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజా అధ్యయనంలో చాలా అవాక్కయ్యేలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంపెడుమంది పిల్లలు ఉంటే బాధ్యతలు ఎక్కువై మతిమరుపు, త్వరితగతి వృద్ధాప్యం బారినపడటం జరుగుతుదనేవారు. కానీ అది అవాస్తమట. పరిశోధన ఏం చెబుతుందో తెలిస్తే.. అసలు ఇదెలా అని విస్తుపోవడం ఖాయం. మరీ పరిశోధనలో వెలుగు చూసిన ఆ షాకింగ్ విషయాలేంటో చూద్దామా..!.
ఈ సరికొత్త పరిశోధన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS)లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం పిల్లలను కలిగి ఉన్నవాళ్లకు మెదడు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుందని తేల్చింది. అందుకోసం శాస్త్రవేత్తలు దాదాపు మూడు వేల మందికిపైగా తల్లిదండ్రుల మెదడు పనితీరుపై పరిశోధనలు చేయగా ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అలసట, ఒత్తిడి అనేవి తల్లిదండ్రులైన వాళ్లలో కంటే పిల్లలు లేని తల్లిదండ్రులలోనే ఎక్కువగా కనిపించాయట. పిల్లలు ఉండటం అనేది వ్యక్తిగత జీవితాన్ని సుసంపన్నం చేసి అహ్లదభరితంగా చేస్తుందట. సాధారణంగా పేరెంట్స్ శారీరక శ్రమని పరస్పర సహకారంతో సునాయసంగా అధిగమించగలుగుతారని పరిశోధన నొక్కి చెబుతోంది.
ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రుల మెదడు మంచి క్రియెటివిటి కనెక్టివిటీని కలిగి ఉంటుందని కూడా పేర్కొంది అధ్యయనం. ఈ పరిశోధనలలో తల్లిదండ్రుల్లో తండ్రిని మినహాయించాయి. ఎందుకంటే వారు శారీరకంగా గర్భం ధరించరు, ప్రసివించరు, తల్లిపాలు ఇవ్వరు కాబట్టి తల్లులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కోన్నారు పరిశోధకులు. అయితే ఈ అధ్యయనంలో దాదాపు 17 వేలకు పైగా పురుషులు కూడా పాల్గొన్నారని అన్నారు.
అయితే ఈ పరిశోధన పిల్లల పుట్టుక, వారి పెంపకం, పెరిగిన అదనపు బాధ్యతలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నాయి. అయితే లేటు వయసులో తల్లిదండ్రులైన వారిలో తక్కువ మెరుగైన ఫలితాలే కనిపించాయన్నారు. తల్లిదండ్రులుగా వారి పిల్లల బాధ్యతే వారి మెదడుని వృద్ధాప్యం బారిన పడకుండా శ్రీరామరక్షలా కాపాడతుందని అధ్యయనం చెబుతోంది.
అంతేగాదు ఈ పరిశోధనకు కీలకమైన శాస్త్రవేత్త అవ్రామ్ హోమ్స్ ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంతలా వారి మెదుడు సురక్షితంగా ఉంటుందని చెప్పడం విశేషం. ఇది వరకు పిల్లల బాధ్యతల కారణంగా జుట్టు ఊడిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటివి జరుగతాయని ప్రగాడంగా భావించేవారు అంతా. అయితే అదంతా అవాస్తమని కొట్టిపారేసింది తాజా అధ్యయనం.
కానీ ఈ అధ్యయనంలో పాల్గొన్నవారంతా యూకేకి చెందిన వాళ్లే కావడంతో మరిన్ని కచ్చితమైన ఫలితాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెంట్స్‌పై పరిశోధన చేయాల్సి ఉందని అన్నారు శాస్త్రవేత్తలు. దీంతోపాటు పిల్లల పెంపకం అనేది బ్రెయిన్ వృధ్యాప్యాన్ని ఎలా నివారిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. ఈ పరిశోధన గనుక నిజమైతై ఒటరితనం, చిత్తవైకల్యం వంటి సమస్యలను ఎలా అధిగమించాలనేందుకు కచ్చితమైన పరిష్కారం కనుగొనేందుకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు.
(చదవండి: పదకొండేళ్లకే బీఎస్సీ, 21 ఏళ్లకే పీహెచ్‌డీ..! మాజీ సీఎం లాలు యాదవ్, ప్రదాని మోదీ..)
Comments
Please login to add a commentAdd a comment