ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతకాలంలో అవాంఛిత రోమాలతో చాలామంది బాధపడుతున్నారు. అది అందమైన ముఖాన్ని అంద విహీనంగా చేస్తుంది. వాటిని చూసుకున్నప్పుడల్లా స్త్రీలు ఎంతో బాధని అనుభవిస్తుంటారు. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై అవాంఛిత రోమాలు పెరుగుతుంటాయి.
ఏది ఏమైనా అవాంఛిత రోమాలు అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. దీనికి వాక్సింగ్, షేవింగ్, ఇతర చికిత్సలు చేయించటం వల్ల క్రమంగా మరింత పెరుగుతాయి. దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమి లేదు, కానీ కొన్ని సహజ నివారణలు ఉన్నాయి. అవేంటో చూద్దాం...
పసుపు
►ఇది మనం ప్రతి రోజు మన వంటల్లో వాడేదే.. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు అవాంఛిత రోమాలును తొలగించి ముఖంలో తేజస్సుని, అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
►దీన్ని ఆయుర్వేదంలో ఒక ఔషధంలా ఉపయోగిస్తారు.
►పసుపుని శెనగపిండితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
►పసుపు రోమాలను తొలగించటమే కాకుండా వాటి పెరుగుదలను కూడా అదుపులో ఉంచుతుంది.
ఇవి కూడా!
►వీటితోపాటుగా ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ రోమాలు వదిలించుకోవటంలో సహాయపడుతుంది.
►సరియైన ఆహారం తీసుకోకపోవడం వలన ఇది అధికమయ్యే ప్రమాదముంది.
►ముఖంపై అవాంఛిత రోమాల బెడద తగ్గాలంటే ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
►ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా అవిసెగింజలు, సోంపు, అల్ఫాల్ఫాలో ఉంటాయి.
చదవండి: Heart Attack: బయట ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే..
Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే..
Comments
Please login to add a commentAdd a comment