basin
-
Beauty: అందుకే అవాంఛిత రోమాలు! ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉండేవి తింటే..
ప్రస్తుతకాలంలో అవాంఛిత రోమాలతో చాలామంది బాధపడుతున్నారు. అది అందమైన ముఖాన్ని అంద విహీనంగా చేస్తుంది. వాటిని చూసుకున్నప్పుడల్లా స్త్రీలు ఎంతో బాధని అనుభవిస్తుంటారు. సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై అవాంఛిత రోమాలు పెరుగుతుంటాయి. ఏది ఏమైనా అవాంఛిత రోమాలు అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. దీనికి వాక్సింగ్, షేవింగ్, ఇతర చికిత్సలు చేయించటం వల్ల క్రమంగా మరింత పెరుగుతాయి. దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమి లేదు, కానీ కొన్ని సహజ నివారణలు ఉన్నాయి. అవేంటో చూద్దాం... పసుపు ►ఇది మనం ప్రతి రోజు మన వంటల్లో వాడేదే.. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు అవాంఛిత రోమాలును తొలగించి ముఖంలో తేజస్సుని, అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ►దీన్ని ఆయుర్వేదంలో ఒక ఔషధంలా ఉపయోగిస్తారు. ►పసుపుని శెనగపిండితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ►పసుపు రోమాలను తొలగించటమే కాకుండా వాటి పెరుగుదలను కూడా అదుపులో ఉంచుతుంది. ఇవి కూడా! ►వీటితోపాటుగా ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ రోమాలు వదిలించుకోవటంలో సహాయపడుతుంది. ►సరియైన ఆహారం తీసుకోకపోవడం వలన ఇది అధికమయ్యే ప్రమాదముంది. ►ముఖంపై అవాంఛిత రోమాల బెడద తగ్గాలంటే ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ►ఫైటో ఈస్ట్రోజెన్లు అధికంగా అవిసెగింజలు, సోంపు, అల్ఫాల్ఫాలో ఉంటాయి. చదవండి: Heart Attack: బయట ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే.. Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
వంకాయ బోండా.. భలే రుచి.. ఇలా తయారు చేసుకోండి!
సాయంకాలం వేళ భిన్న రుచులు ఆస్వాదించాలనుకునే వాళ్లు ఇలా వంకాయ బోండా ట్రై చేసి చూడండి! వంకాయ బోండా తయారీకి కావలసినవి: ►వంకాయలు – 10 (కాడలు తీయకుండా గుత్తివంకాయల్లా కట్ చేసుకుని, నూనెలో దోరగా వేయించి తీసుకోవాలి) ►ఉల్లిపాయ – 1(ముక్కలు కట్ చేసుకోవాలి) ►నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు ►జీలకర్ర – అర టీ స్పూన్ ►నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు ►కారం – 1 టీ స్పూన్ ►ఉప్పు – తగినంత ►శనగపిండి – 1 కప్పు ►బియ్యప్పిండి – పావు కప్పు ►వాము – అర టీ స్పూన్ ►పసుపు – చిటికెడు ►తినే సోడా – కొద్దిగా ►నీళ్లు – సరిపడా ►నూనె – డీప్ ఫ్రైకి చాలినంత తయారీ: ►ముందుగా నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ►నిమ్మరసం, అర టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఒక బౌల్ తీసుకుని అందులో.. శనగపిండి, బియ్యప్పిండి, వాము(చేత్తో నలపాలి), పసుపు, అర టీ స్పూన్ కారం, తినే సోడా, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలియతిప్పాలి. ►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచగా కలుపుకోవాలి. ►ఇప్పుడు చల్లారిన వంకాయల్లో ఉల్లిపాయ మిశ్రమం పెట్టుకుని.. వాటిని శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. ►వేడి వేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, టొమాటో కచప్ వంటివి జోడించి తింటే భలే రుచిగా ఉంటాయి ఈ బోండాలు. ఇవి కూడా ట్రై చేయండి: Recipes: పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్ లడ్డు Potato Popcorn Recipe: పొటాటో పాప్‌కార్న్ ట్రై చేయండిలా! -
Beauty Tips: బెల్లం వాష్‌తో ముఖం మీది ముడతలకు చెక్!
బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే కారకాలే కాదు.. అందాన్ని ఇనుమడింపజేసే గుణాలు కూడా ఉన్నాయి. బెల్లంతో తయారు చేసిన ఫేస్ వాష్ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను తగ్గిస్తుంది. బెల్లంతో పాటు శనగపిండి, పెరుగు కలిపి తరచుగా ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయండి! ►చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, టీస్పూను నీళ్లుపోసి మరిగించాలి. ►బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి, టీస్పూను పెరుగు వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాలపాటు గుండ్రంగా మర్దన చేయాలి. ►ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ►ముఖాన్ని పొడిగా తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాసుకోవాలి. ►ఈ ఫేస్‌వాష్‌ను వాడడం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది. ►వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి. చదవండి: Benefits Of Tamarind Syrup: చింతపండు సిరప్‌ను ముఖానికి రాసుకున్నా, నేరుగా తాగినా సరే! అద్భుత ప్రయోజనాలు! Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! -
Recipe: హర్యానా స్టైల్.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా!
హర్యానా స్టైల్.. నోరూరించే శనగపిండి మసాలా రోటీ తయారీ విధానం తెలుసుకుందాం! శనగపిండి మసాలా రోటీ తయారీకి కావలసినవి: ►శనగపిండి – కప్పు ►గోధుమ పిండి – కప్పు ►పసుపు – అర టీస్పూను ►వాము – టీస్పూను ►ఉప్పు – టీస్పూను ►పెరుగు – అరకప్పు మసాలా: ►కారం – అరటీస్పూను ►జీలకర్ర పొడి – అరటీస్పూను ►ధనియాలపొడి – అరటీస్పూను ►నెయ్యి – టేబుల్ స్పూను. తయారీ.. ►గోధుమపిండి, శనగపిండి, పసుపు, వాము, ఉప్పులను గిన్నెలో వేయాలి. ►దీనిలో పెరుగు అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకుని ముద్దలా కలుపుకోని ఇరవై నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. ►మసాలా కోసం తీసుకున్న అన్ని పొడులు, నెయ్యిని గిన్నెలో వేసి చక్కగా కలపుకుని పక్కనపెట్టుకోవాలి. ►పిండిముద్దను ఉండలు చేయాలి. ►ఒక్కో ఉండను పిండి చల్లుకుంటూ గుండ్రని చపాతీలా వత్తుకోవాలి. ►ఈ చపాతీపై కలిపిపెట్టుకున్న మసాలా మిశ్రమం వేసి త్రికోణాకృతిలో మడతపెట్టి మరోసారి చక్కగా వత్తుకోవాలి. ►రోటీని రెండువైపులా నెయ్యి చల్లుకుంటూ చక్కగా కాల్చుకుంటే శనగపిండి మసాలా రోటీ రెడీ. ఇవి కూడా ట్రై చేయండి: Saag Chicken Recipe: హర్యానా వంటకం.. సాగ్ చికెన్ తయారీ ఇలా! -
సాగునీరు పుష్కలం..ఆయకట్టు సస్యశ్యామలం
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలసముద్రం చెరువు ఆయకట్టు విస్తీర్ణం 600 ఎకరాలు. మూడేళ్ల నుంచి చెరువులో నీరు లేక ఖరీఫ్‌లో పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పనులలో భాగంగా చెరువు ఆధునికీకరణకు రూ.5 కోట్లు మంజూరు చేసింది. శరవేగంగా పనులు చేపట్టడంతో చాలా వరకు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కురిసిన వర్షాలకు చెరువు నిండింది. దీంతో ఆయకట్టు రైతులు వరినాట్లు వేశారు. వరి పంట కోతకు వచ్చింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండా తూటికాడ, నాచు, పేరుకుపోయిన పూడిక.. చెరువులో నీరు నిల్వక.. ఆయకట్టు భూములకు నీరందక.. పంటలు చేతికొచ్చేవి కావు. ఈ క్రమంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువును ఆధునికీకరించారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి పంటలకు పుష్కలంగా నీరందుతోంది. రైతు మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. శాశ్వత పనులతో రైతుకు ప్రయోజనం బాలసముద్రం చెరువు అభివృద్ధి పనులతో రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. కట్టను బలోపేతం చేశారు. మిషన్ కాకతీయతో అలుగుకు శాశ్వత మరమ్మతులు చేపట్టంతో చుక్క నీరు కూడా వృథాగా పోవడంలేదు. జలకళతో చెరువు నిండు కుండలా కనిపిస్తోంది. రెండు పంటలకు సాగునీరు ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆయకట్టు పరిధి మొత్తం వరిసాగు చేశారు. -
కోటి ఎకరాల ఆయకట్టు
ఇదే కేసీఆర్ లక్ష్యం: హరీశ్‌రావు ► అందుకోసం ఇంజనీర్లా కృషి చేస్తున్నారు ► ఏఎమ్మార్పీ లో లెవల్ కెనాల్ ప్రజలకు అంకితం ► సభా వేదికపై జగదీశ్-జానా సంవాదం ► టీఆర్ఎస్ ప్రభుత్వంతో జానా కూడా లబ్ధి పొందారంటూ జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలు ► తానేమీ పొందలేదన్న విపక్ష నేత ► మీరెందుకు గెలవలేదన్న సభికులను నవ్వుల్లో ► ముంచెత్తిన జానా వ్యాఖ్యలు సాక్షి, నల్లగొండ: ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించి, రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)లో అంతర్భాగమైన లో లెవల్ కెనాల్ (ఎల్ఎల్సీ)ను నల్లగొండ జిల్లా పెదవూర మండలం పుల్యా తండా వద్ద బుధవారం ఆయన ప్రజలకు అంకితం చేశారు. అనంతరం సీఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే కె.జానారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని గుర్తు చేశారు. అందులో రైతన్నకు గుండెకాయలాంటి సాగునీటిని సాకారం చేసేందుకు కేసీఆర్ ఓ ఇంజనీర్లా పనిచేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, తామంతా సమష్టిగా పని చేసి పూర్తి చేస్తున్నామన్నారు. లో లెవల్ కెనాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి ప్రాజెక్టుల శంకుస్థాపనలే మిగిలాయన్నారు. లో లెవల్ కెనాల్‌కు సంబంధించిన చిన్న చిన్న పనులను పూర్తి చేసి వచ్చే ఏడాది కల్లా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లిస్తామని చెప్పారు. శ్రీరాంసాగర్ రెండో దశ పనులను కూడా వచ్చే ఏడాది కల్లా పూర్తి చేసి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చివరి ఆయకట్టుకు కూడా నీళ్లిస్తామని వివరించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో యాసంగికి కూడా నీరిస్తామని, అయితే, రైతులు వరి పంట కన్నా ఆరుతడి పంటలు వేసుకోవడమే మేలని సూచించారు. ఏ పంట వేసినా మార్చి 31 కల్లా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరారు. జానా-జగదీశ్‌రెడ్డి సంవాదం ప్రసంగాల సందర్భంగా జానారెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి నడుమ సంవాదం చోటుచేసుకుంది. జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణ వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వారికి లో లెవల్ కెనాల్‌ను పూర్తి చేయడమే సమాధానమన్నారు. ‘‘తెలంగాణ వచ్చింది గనకే రెండున్నరేళ్లలో పనులు పూర్తయ్యాయి. లేదంటే మరో 20, 30 ఏండ్లు పట్టేవి. లో లెవల్ కెనాల్ పనులు ప్రారంభమై 19 ఏళ్లు కావ స్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాలూ దీన్ని నిర్లక్ష్యం చేశాయి’’ అన్నారు. జానా స్పందిస్తూ, కెనాల్‌కు పంప్‌హౌస్ పనులు ప్రారంభమై ఏడేండ్లే అరుయిందన్నారు. ఏడేండ్లయినా సరే వాటిని తామే పూర్తి చేశామని జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందని మనిషి లేడన్నారు. జానారెడ్డి కూడా లబ్ధి పొందారని చమత్కరించారు. దీనికి స్పందించిన జానా, తానేమీ లబ్ధి పొందలేదని చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ, ‘‘గత ప్రభుత్వాల హయాంలో ఎండాకాలంలో కరెంటు లేక జానారెడ్డి ఇంట్లో జనరేటర్లు నడిచేవి. ఆ లెక్కన ఆయనకిప్పుడు కనీసం 100-200 లీటర్ల డీజిల్ అయినా మిగిలే ఉంటుంది. దీన్ని ప్రతిపక్ష నాయకులతో సహా అందరూ అంగీకరించాల్సిందే’’ అని అన్నారు. పరస్పరం గౌరవించుకుంటే మంచిది: జానా అనంతరం ప్రసంగించిన జానా తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ‘‘గత ప్రభుత్వాలు చేసిన పనులనే టీఆర్ఎస్ కొనసాగించి పూర్తి చేసింది. అందుకు వారు అభినందనీయులు’’ అని అన్నారు. ‘‘ఎల్ఎల్సీ నిర్మాణానికి రూ.220 కోట్లు ఖర్చయితే అందులో కేవలం రూ.32 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ ఇచ్చింది. అందులో నూ రూ.10 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అంటే నికరంగా టీఆర్ఎస్ ఇచ్చింది రూ.22 కోట్లే. మిగతా మొత్తాన్ని గత ప్రభుత్వాలే ఖర్చు చేశాయి’’ అని వ్యాఖ్యానించారు. ఎవరు చేసినా అందరూ పరస్పరం గౌరవించుకుని, సమన్వయం తో ముందుకెళ్లాలే తప్ప తామే అంతా చేశామని చెప్పడం కూడా సరైంది కాద న్నారు. ‘‘టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తామే పూర్తి చేశామంటున్నారు. అసలు మేం మొదలుపెట్టకపోతే వీళ్లు పూర్తి చేసేవా రా?’’ అని ప్రశ్నించారు. ఈ సమయంలో సభికుల్లో ఒకరు జానానుద్దేశించి ‘అయితే ఎన్నికల్లో మీరెదుకు గెలవలేదు?’ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుందని జానా అన్నారు. ‘‘ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంద రూ హిల్లరీ గెలుస్తారని చెప్పారు. కానీ ట్రంప్ గెలిచాడు’’ అని చమత్కరించ డంతో సభా ప్రాంగణం నవ్వులతో నిండి పోయిది. కార్యక్రమంలో నల్లగొండ, భువనగిరి ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, అటవీ అభివృద్ధి కార్పొరే షన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భాస్కరరావు, కూసుకుంట్ల ప్రభా కర్‌రెడ్డి, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నల్లవాగుకు ఖరీఫ్ కళ..
రైతన్నకు వరప్రదాయిని మధ్య తరహా ప్రాజెక్టు కలే్హర్ : నల్లవాగు ఆయకట్టు భూములకు ‘ఖరీఫ్’ కళ వచ్చింది మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులకు నల్లవాడు ప్రాజెక్టు వరప్రదాయిని. జూలై, అగస్టు నెలల్లో నల్లవాగు ఎగువభాగంలోని కర్ణాటక, కంగ్టి మండలంలో అడపాదడపగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగుపై నుంచి నీళ్లు పారుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 ఫీట్లు. పూర్తి నీటి నిల్వ 776.13 ఎంసీఎఫ్‌టీలు, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 1491.5 ఫీట్లుగా ఉంది. కుడి కాల్వ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్(కె), కష్ణాపూర్, ఇందిరానగర్, కలే్హర్ వరకు 4,100 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామాల్లో 1,230 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఇటివల ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు సాగు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు కింద రైతులు సోయాబీ¯ŒS, మొక్కజొన్న పంటలు వేశారు. కొందరు రైతులు వరి సాగు చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటలు సాగుకు నోచుకుంటున్నాయి. ప్రత్యామ్నాయంగా కాల్వల మరమ్మతు పనులు కలే్హర్ మండలంలోని సుల్తానాబాద్ వద్ద 1967లో రూ. 98లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడి, నీటి పారుదల శాఖా మంత్రి శీలం సిద్ధారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. నల్లవాగు ప్రాజెక్టు సాగు నీటి విడుదలకు ముందు శిథిలం కావడంతో వాటిని బాగు చేసి ఆయకట్టు అంతట సాగు నీరందించాలని రైతులు ప్రభుత్వన్ని కోరుతున్నారు. ఇటీవలే రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. ప్రాజెక్టును పూర్తిగా అధునికరిస్తామని మంత్రి హరీశ్‌రావు రైతన్నలకు భరోసా కల్పించారు. దీంతో ఆయకట్టు కింది రైతుల్లో ‘ఆశలు’ చిగురించాయి. ఆయకట్టుకు సక్రమంగా సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కృషి మేరకు ప్రభుత్వం రూ. 13 లక్షలు మంజూరు చేసింది. ప్రత్యామ్నాయంగా కాల్వల్లో పేరుకున్న పూడిక, పిచ్చి మొక్కలు తొలగించారు. కాల్వలకు జలకళ సంతరించుకుంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. -
ప్రాణహిత కన్నా మేడిగడ్డ మిన్న
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: గోదావరి పరీవాహకంలో లభించే ప్రతి నీటిచుక్కను సద్వినియోగం చేసుకుని, సమగ్ర అభివృద్ధిని సాధించడం కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేస్తున్నామని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. నిర్ణీత 160 టీఎంసీల నీటిని మళ్లించేందుకు తమ్మిడిహెట్టి బ్యారేజీ అనువుగా లేకపోవడం, ఈ బ్యారేజీ ఎత్తుతో జరిగే ముంపును మహారాష్ట్ర అంగీకరించకపోవడం వంటి కారణాలతోనే ప్రత్యామ్నాయంగా ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుకు నాంది పలికామన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై కొందరు నిపుణులు, విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించిన వివరాలను, కేంద్ర జల సంఘం సూచనలు, మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ మధ్య జరిగిన సంప్రదింపులు తదితర వివరాలను వెల్లడించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. లభించేది 40 టీఎంసీలే తమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తుతో నిర్మిం చాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర వ్యతిరేకిస్తోంది. ఆ ఎత్తులో 1,852 ఎకరాల ముంపు ఉంటుందని, దాన్ని అంగీకరించబోమని 2013 జనవరి 21న తెలంగాణకు స్పష్టం చేసింది. 2014 జూలై 23న మంత్రి స్థాయిలో నేను స్వయంగా మహారాష్ట్ర వెళ్లి చర్చలు జరిపాను. 2015 ఫిబ్రవరి 17న సీఎంల స్థాయిలో చర్చలు జరిగాయి. గోదావరిలో 160 టీఎంసీలు తీసుకునేందుకు అభ్యంతరం లేదని చెప్పిన మహా రాష్ట్ర.. ముంపును మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ సమయంలోనే తమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదంటూ కేంద్ర జల సంఘం 2015 మార్చిలో రాష్ట్రానికి లేఖ రాసింది. 152 మీటర్ల ఎత్తులో 5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి రోజుకు 1.8 టీఎంసీల చొప్పున నీటిని మళ్లించగలిగితేనే నిర్ణీత 160 టీఎంసీలు తీసుకోవచ్చని... కానీ అక్కడ పూర్తి లభ్యతే 165 టీఎంసీలని, మళ్లించడానికి అనువైన నీరు 100 నుంచి 110 టీఎంసీలేనని చెప్పింది. అదీగాక తమ్మిడిహెట్టి పూర్తిగా వన్యప్రాణుల అభయారణ్యం ప్రాంతంలో ఉంది. దాన్ని పట్టించుకోకుండా అప్పటి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఈ నిర్మాణం పూర్తి ఏకపక్షంగా చేపడుతున్నారని, ఈ పనులు ఫలప్రదం కావని 2013 అక్టోబర్ 15న అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్రానికి లేఖ రాశారు కూడా. అయితే మహారాష్ట్ర తొలి నుంచీ చెబుతున్న 148 మీటర్ల ఎత్తులో 1.8 టీఎంసీలను మాత్రమే నిల్వ చేసుకోగలం, 40 టీఎంసీలను మాత్రమే మళ్లించగలం. అందుకే పుష్కలంగా నీరున్న మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించాలని నిర్ణయించాం. దీనిద్వారా నిర్ణీత 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్ కింది 20 లక్షల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంది. 152 మీటర్లకు ప్రామాణికతే లేదు తమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు ఎందుకు తగ్గించారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నిజానికి ఆ ఎత్తుకున్న ప్రామాణికత ఏమిటో కాంగ్రెస్ నేతలు చెప్పాలి. 152 మీటర్ల ఎత్తుకు కాల్వల డిజైన్లు చేసిన కాంగ్రెస్ నేతలు, ఆ ఎత్తుపై మహారాష్ట్రను ఎందుకు ఒప్పించలేకపోయారు. 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టే అంశం 2012లో చేసుకున్న ఒప్పందంలో ఎక్కడైనా ఉందా కాంగ్రెస్ నేతలే చెప్పాలి. ఆదిలాబాద్‌లో 2లక్షల ఎకరాలకు.. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న బ్యారేజీతో ఆదిలాబాద్ జిల్లాలో 2లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. 14.4 టీఎంసీల ప్రాణహిత నీటిని నిర్ణీత ఆయకట్టుకు అందించేలా వ్యాప్కోస్ నివేదిక అందజేసింది. గతంలో తమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించగా... ఇప్పుడు మరో 1.44 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వనున్నాం. ‘పాలమూరు’ ద్వారా రంగారెడ్డికి అదనపు ఆయకట్టు కొత్తగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డి జిల్లాలో 4.35 లక్షల ఎకరాలకు సాగు నీరందించి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రాణహిత పథకం కింద ఈ జిల్లాలో కేవలం 2.10లక్షల ఎకరాలకే నీరిచ్చేలా ప్రణాళికలు వేశా రు. కానీ రీఇంజనీరింగ్‌తో 4.35 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల ద్వారా 2.75 లక్షల ఎకరాలు, డిండి నుంచి లక్ష ఎకరా లు, ప్రాణహిత నుంచి గోదావరి ద్వారా 70 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. -
ఆయకట్టు..కనికట్టు
అభివృద్ధి పేరిట ప్రభుత్వం హడావుడి చేయడం.. అందుకు తగినట్లుగా అధికారులు అంకెల గారడీ చేయడం పరిపాటిగా మారింది. వాస్తవ విషయానికొస్తే.. కాగితాల్లో చూపిన లెక్కలేవీ కార్యరూపం దాల్చని పరిస్థితి. ఇదేమంటే ప్రభుత్వం ఏమి చేస్తారంటే నివేదిక రూపంలో పంపామని.. అమలు తమ చేతుల్లో లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో అదనపు ఆయకట్టు అభివృద్ధి ఈ కోవకే చెందుతుంది. కర్నూలు సిటీ: కరువు నేలపై కన్నీళ్లు పారించయినా ఈ ఏడాది అదనపు ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయింది. ఆ మేరకు జల వనరుల శాఖ అధికారులు జిల్లా వాస్తవ పరిస్థితి తెలిసీ.. రెండంకెల అభివృద్ధి పేరిట సాగునీటి ప్రాజెక్టుల కింద అదనపు ఆయకట్టు అభివృద్ధికి గత జూన్‌లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఏడాది జిల్లాలోని వివిధ కాలువ కింద 1.92 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేస్తామని అందులో వెల్లడించారు. ఇందులో ఎస్ఆర్బీసీ కింద 1,703 ఎకరాలు, తెలుగుగంగ కింద 39,160, హంద్రీనీవా కింద 73వేలు, గురురాఘవేంద్ర కింద 37వేలు, సిద్ధాపురం ఎత్తిపోతల కింద 21,300, చిన్ననీటి పారుదల శాఖ పరిధిలోని చెరువుల కింద 20వేల ఎకరాలను అదనంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అయితే జిల్లాలో వివిధ కాల్వల కింద మొత్తం 7,79,136 ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇందులో గత ఏడాది వివిధ కారణాలతో 4.28 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారు. మిగిలిన ఆయకట్టును అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ఆయా ప్రాజెక్టుల పనులు సక్రమంగా చేపట్టకపోవడమే అందుకు కారణమైంది. అలాంటప్పుడు అదనపు ఆయకట్టు అభివృద్ధి ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకమైంది. ఈనెల 13న నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశం(ఐఏబీ)లోనూ అదనపు ఆయకట్టు ఊసే కరువైంది. ప్రభుత్వానికి ప్రతిపాదించిన విధంగా అదనపు ఆయకట్టు ప్రస్తావనే లేకుండా సమావేశం సాగింది. సగం ఆయకట్టుకే గతి లేదు.. తుంగభద్ర దిగువ కాల్వ కింద ఖరీఫ్, రబీ సీజన్లలో స్థిరీకరించిన ఆయకట్టు 1,51,134 ఎకరాలు. ఇందులో రెండు సీజన్లకు కలిపి 60వేల ఎకరాలకు మించి నీరివ్వలేకపోతున్నారు. కాల్వను పూర్తి స్థాయిలో ఆధునీకరించకపోవడం, కన్నడిగుల జలచౌర్యాన్ని నిలువరించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కేసీ కాల్వ కింద జిల్లాలో 1,84,209 ఎకరాలకు గాను 1.50 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. కెనాల్ డిస్ట్రిబ్యూటరీలకు మరమ్మతులు చేయకపోవడం వల్ల చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరు సరఫరా కావడం లేదు. శ్రీశైలం కుడి గట్టు కాలువ కింద 1వ బ్లాక్ నుంచి 16 బ్లాకుల వరకు 1,53,936 ఎకరాల ఆయకట్టు ఉం డగా.. గతేడాది ఖరీఫ్‌లో 1వ బ్లాకు నుంచి 11 బ్లాకు వరకు 81879 ఎకరాలు, 12 నుంచి 16 వరకున్న బ్లాకులకు 33,150 ఎకరాల ఆయకట్టు సాగయింది. ప్రస్తుతం ఈ కాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెండింగ్ పనులు పూర్తయితే తప్ప.. పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందని పరిస్థితి. తెలుగుగంగా కాల్వ కింద మొత్తం 1,14,500 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇందులో 75,340 ఎకరాల ఆయకట్టు మాత్రమే యేటా సాగవుతోంది. కెనాల్‌కు డిస్ట్రిబ్యూటరీ ఉన్నా.. పిల్ల కాలువలు లేకపోవడంతో 39,160 ఎకరాలకు నీరు కరువైంది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద జిల్లాలో 80వేల ఎకరాల ఆయకట్టు ఉంది. డిస్ట్రిబ్యూటరీలు, సబ్ కెనాల్స్, పిల్ల కాలువలు లేకపోవడం, ఇందుకు అవసరమైన భూములను సేకరించకపోవడంతో గతేడాది ప్రతిపాదించిన 14,500 ఎకరాలను ఈ ఏడాది కూడా ప్రతిపాదించడంతో సరిపెట్టారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద 50వేల ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా.. ప్రాజెక్టు కింద చేపట్టిన ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి కాకపోవడంతో 13వేల ఎకరాలకే పరిమితమవుతోంది. చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువుల కింద 84వేల ఎకరాలు గాను, 40 వేలకు మించి సాగు కావడం లేదు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు వల్ల 16వేల ఎకరాలు అదనంగా ఆయకట్టును అభివృద్ధి చేయాలని అధికారులు ప్రతిపాదించారు. వర్షాలు కురిస్తేనే అదనపు ఆయకట్టు వర్షాలు సమృద్ధిగా కురిసి జలశయాలు నిండితేనే అదనపు ఆయకట్టు అభివృద్ధి చెందుతుంది. ఒక్క కాల్వల ద్వారానే కాకుండా చెక్‌డ్యాంలు, ఫారంపాండ్స్, చెరవుల ద్వారా భూగర్భ జలాలు పెరిగితే ఆయకట్టు మెరుగవుతుంది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద చేపట్టిన మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా మాత్రమే అదనపు ఆయకట్టు అబివృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఆయకట్టు అభివృద్ధికి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. - చిట్టిబాబు, చీఫ్ ఇంజనీర్