నల్ల పసుపు గురించి విన్నారా? ఎన్ని వ్యాధులకు చెక్‌ పెడుతుందంటే.. | Which Is The Most Expensive Haldi, Know Why Black Turmeric Costly And Its Benefits In Telugu - Sakshi
Sakshi News home page

Benefits Of Black Turmeric: నల్ల పసుపు గురించి విన్నారా? ఎన్ని వ్యాధులకు చెక్‌ పెడుతుందంటే..

Published Thu, Oct 5 2023 5:07 PM | Last Updated on Thu, Oct 5 2023 5:39 PM

Black Turmeric Costly Haldi And Its Benefits - Sakshi

 పసుపు, వాటి దుంపలు మనం చూశాం. అది ఎన్ని ఔషధ గుణాలు కలిగిందో కూడా తెలుసు. కానీ నల్ల పసుపు గురించి ఎప్పుడైనా విన్నారా! అది కూడా మనం వాడే పసుపుకు ఎంతో విభిన్నంగా ఉంటుంది. కానీ దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. నల్ల పసుపును సాధారణంగా భారతదేశంలోని ఈశాన్య, మధ్యప్రదేశ్‌లో పండిస్తారు. నల్ల పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం కర్కుమా సీసియా. మణిపూర్, మరికొన్ని రాష్ట్రాల్లోని గిరిజన తెగల్లో ఈ మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. నల్లపసుపులో కర్కుమిన్‌ అనే పదార్థం ఉంటుంది.

దీనిలో క్యాన్సర్‌ కణాలను నిరోధించే లక్షణాలు ఉన్నాయి. నల్ల పసుపు మీ ఆహారంలో తీసుకుంటే క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.వివిధ ఆరోగ్య సమస్యలు ఉపశమనానికి ఎంతో దోహదం చేసే పసుపు క్యాన్సర్కు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని గత పరిశోధనలు చెప్పాయి. అయితే తాజాగా జీర్ణాశయ క్యాన్సర్‌ని నయం చేసే శక్తి పసుపు ఉన్న నేపథ్యంలో ఆరోగ్య నిపుణులుజీర్ణాశయ క్యాన్సర్ చికిత్సలో పసుపును వినియోగించే పద్ధతిని అభివృద్ధి చేసి సక్సెస్ అయ్యారు. సాధారణంగా పసుపు నల్ల మిరియాలు కలిపిన వేడి పాలను తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది అనేది అనాదిగా మనందరికీ తెలిసిన చిట్కా. భారతదేశంలో వేల ఏళ్ళుగా ఈ చిట్కాను అనుసరిస్తున్నారు. 

నల్ల పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు

  • నల్ల పసుపులోని రైజోమ్ చేదు రుచిని కలిగి ఉంటుంది.  దీన్ని ల్యూకోడెర్మా (మెలనిన్పిగ్మెంటేషన్కోల్పోవడం)  మరియు పైల్స్ చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఈ పసుపు మిశ్రమం బెణుకులు, గాయాల చికిత్సకు ఉపయోగిస్తున్నారు.
  • గిరిజన స్త్రీలు రుతు క్రమ రుగ్మతలకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని సాంప్రదాయకంగా గిరిజన ప్రజలు జ్వరం, వాంతులు, విరేచనాలు, కణితులు, లైంగిక వ్యాధులు, మంట మొదలైనవాటి చికిత్సకు ఉపయోగిస్తారు.
  • అరుణాచల్ప్రదేశ్‌లోని ఆది తెగవారు నల్ల పసుపు రైజోమ్‌ను యాంటీ డయేరియాటిక్‌గా ఉపయోగిస్తున్నారు. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోహిత్‌ జిల్లాకు చెందిన ఖమ్మం తెగవారు నల్ల పసుపు దుంప తాజాపేస్ట్‌ను తేలు, పాముకాటుకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
  • నల్ల పసుపు బెండులను తరచుగా న్యుమోనియా, దగ్గు మరియు పిల్లలలో జలుబు కోసం కూడా చికిత్సకు ఉపయోగిస్తారు.
  • రైజోమ్‌లు ల్యూకోడెర్మా, మూర్ఛ,క్యాన్సర్ మరియు హెచ్‌ఐవి / వ్యతిరేకంగా పని చేస్తాయి.
  • మైగ్రేన్ నుంచి ఉపశమననాకి ఉపయోగిస్తారు.
  • అస్సాంలో తాజా రైజో మ్రసాన్ని ఆవాల నూనెతో కలిపి పశువుల విరేచనాల చికిత్సకు ఉపయోగిస్తార

(చదవండి: ఆల్కహాల్‌ మోతాదుకు మించితే చనిపోతారా? పాయిజిన్‌గా ఎలా మారుతుంది?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement