పసుపులో దుంపలు ఊరే ప్రస్తుత సమయంలో దుంప తొలుచు ఈగ, దుంప కుళ్లు తెగులు ఆశించే అవకాశాలుంటాయి. ఇవి ఆశిస్తే దుంపల్లో నాణ్యతతో పాటు దిగుబడి తగ్గిపోతుంది. ఇవి ఆశించిన తర్వాత నివారణ చర్యలు చేపట్టేదానికన్నా ముందుగానే వేప పిండిని వాడితే ప్రయోజనం ఉంటుంది.
ముందస్తు చర్యలు
పసుపు మొక్క 40 రోజుల వయసున్నప్పుడు ఒకసారి, 120 రోజులప్పుడు మరొకసారి ఎకరాకు 250-300 క్వింటాళ్ల వేప పిండిని తడిగా ఉన్న నేలపై మొదళ్ల చుట్టూ చల్లాలి.
వేప పిండి నేలను అంటుకుంటుంది. తదుపరి ప్రతి నీటి తడిలోనూ వేప ఊట భూమిలోకి దిగుతుంది. ఇది పసుపు పంటకు దుంపకుళ్లు, దుంప పుచ్చు కలుగజేసే క్రిమికీటకాలు మొక్కల దరి చేరకుండా కాపాడుతుంది.
‘ఈగ’ను గమనిస్తే..
దుంపతొలుచు ఈగను పంటలో గమనించినట్లయితే ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి.
దుంపకుళ్లు తెగులు ఆశించినట్లయితే మడిలోని మురుగు నీటిని తీసేయాలి.
తెగులు ఆశించిన మొక్కలు దాని చుట్టు పక్కల ఉండే మొక్కల మొదళ్లు బాగా తడిచేట్లుగా లీటర్ నీటికి 3 గ్రా ముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని పోయాలి.
వచ్చే సీజన్‌కోసం..
వచ్చే ఏడాది పసుపు పంట వేసుకోవాలనుకునే రైతాం గం దుంపకుళ్లు తెగులు ఆశించకుండా కొన్ని చర్యలు చేపట్టాలి.
వేసిన పొలంలోనే పసుపు వేయకుండా వేరుశనగ, మొక్కజొన్న, జొన్న పంటలతో పంట మార్పిడి చేయడం ఉత్తమం.
లీటర్ నీటికి 3 గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ లేదా మాంకోజెబ్, 2 మిల్లీ లీటర్ల మోనోక్రొటోఫాస్ లీటర్ కలిపిన ద్రా వణంలో తెగులు సోకని విత్తనాన్ని 30 -40 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీరు మార్చి లీటరు నీటికి 5 గ్రా ముల ట్రైకోడర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి, నీడలో ఆరబెట్టాలి. తర్వాత నాటుకోవాలి.
కిలో ట్రైకోడర్మాను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండిలో కలిపి వారం పాటు అనువైన పరిస్థితిలో వద్ధి చేసి, నెలరోజులకు మొదటి తవ్వకం చేశాక నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి.
దుంపలు విత్తిన తర్వాత జీలుగ, జనుము, వెంపలి, కానుగ మొదలగు పచ్చి ఆకులు లేదా ఎండు వరి గడ్డి, చెరకు ఆకులను పొలంపై దుంపలు మొలకలు వచ్చేంతవరకు కప్పడం వల్ల తెగుళ్ల ఉధతిని కొంతవరకు తగ్గించవచ్చు.
‘పసుపు’ను కాపాడుకుందాం ఇలా
Published Tue, Nov 11 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement