groundnut
-
భారీగా తగ్గిన... నూనె గింజల సాగు
ఆహార పంటల తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే నూనె గింజల సాగు ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. ఖరీఫ్‌లో ఈ పంటల సాధారణ విస్తీర్ణమే 20 లక్షల ఎకరాలు. దాంట్లో వేరుశనగ, 18.30 లక్షల ఎకరాలుండగా, ఆముదం, నువ్వులు, సన్‌ఫ్లవర్, సోయాబీన్ వంటి ఇతర నూనెగింజల పంటలన్నీ కలిపి 1.77 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఖరీఫ్–2024 సీజన్లో 17.25 లక్షల ఎకరాల్లో వేరుశనగ, ఇతర పంటలన్నీ కలిపి సాగు చేయాలని నిర్ధేశించగా.. కేవలం 8.45 లక్షల ఎకరాలే సాగయ్యింది. – సాక్షి, అమరావతిఆశించిన స్థాయిలో వర్షాలు కురిసినా..రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో కృష్ణ, గోదావరి, వంశధార, నాగావళి నదులకు వరదలు పోటెత్తాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపించాయి. భూగర్భ జలాలన్నీ ఎగసి పడుతున్నాయి. వాస్తవానికి నూనె గింజల పంటలు కూడా రికార్డు స్థాయిలో సాగవ్వాలి. కానీ ఊహించని రీతిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు తోడు భారీ వర్షాలు ఈ పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మరొకపక్క ప్రభుత్వ అలసత్వం తోడవడంతో నిర్ధేశించిన లక్ష్యంలో సగం కూడా సాగవని పరిస్థితి నెలకొంది. సాగుకు దూరమైన వేరుశనగ రైతురాష్ట్రంలో ఏటా 18 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యే వేరుశనగ ఈసారి కేవలం 7.17 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. వేరుశనగ పంట అత్యధికంగా రాయలసీమ జిల్లాల్లోనే సాగవుతుంది. ఈ జిల్లాల్లో 13.50 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, కేవలం 6.95 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇతర నూనె గింజల పంటలను పరిశీలిస్తే సన్‌ఫ్లవర్ సాధారణ విస్తీర్ణం 13వేల ఎకరాలు కాగా, 3785 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఆ తర్వాత నువ్వులు సాధారణ విస్తీర్ణం 50వేల ఎకరాలు కాగా, సాగైంది కేవలం 20వేల ఎకరాలే. ఆముదం సాధారణ విస్తీర్ణం 92వేల ఎకరాలు కాగా, 88వేల ఎకరాల్లోనే సాగయ్యింది. సీమలో సగానికి తగ్గిన సాగువర్షాభావ పరిస్థితుల వలన రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ స్థానంలో సుమారు 3 లక్షల ఎకరాలకు పైగా ప్రత్యామ్నాయ పంటలు సాగవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క రాయలసీమ జిల్లాలోనే 3.50లక్షల ఎకరాలు వేరుశనగ పంట వేయలేని పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ కనీస మద్దతు ధర రూ.6,783 కాగా, ప్రస్తుతం కనిష్ట ధర రూ.3,300 ధర ఉండగా, గరిష్టంగా రూ.7వేల వరకు పలుకుతోంది. వర్షాభావ పరిస్థితులకు తోడు ధర లేకపోవడం, తెగుళ్ల బారిన పడడం, పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోవడం ఈసారి వేరుశనగ విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల పంటల సాగును ప్రోత్సహించేలా రాయితీపై మినీ కిట్స్ ఇచ్చేవారు. ఆర్బీకేల ద్వారా అన్ని రకాలుగా అవసరమైన చేయూతనిచ్చేవారు. సాగులో అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహించే వారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదని రైతులు వాపోతున్నారు. -
‘భారత్’ బ్రాండ్ శనగపప్పుకి డిమాండ్
న్యూఢిల్లీ: ధరల కట్టడి వ్యూహంలో భాగంగా కేంద్రం ‘భారత్’ బ్రాండ్ కింద విక్రయిస్తున్న శనగపప్పుకి గణనీయంగా ఆదరణ లభిస్తోంది. ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మార్కెట్లో పావు వంతు వాటా దక్కించుకుంది. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే రేటు తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడుతోందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. భారత్ బ్రాండ్ శనగపప్పు ధర కిలోకి రూ. 60గా ఉండగా, ఇతర బ్రాండ్స్ రేటు సుమారు రూ. 80 వరకు ఉంటోందని పేర్కొన్నారు. 2023 అక్టోబర్‌లో ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ బ్రాండ్ శనగపప్పు 2.28 లక్షల టన్నుల మేర అమ్ముడైందని, నెలకు సగటున 45,000 టన్నుల అమ్మకాలు నమోదవుతున్నాయని సింగ్ చెప్పారు. ప్రాథమికంగా 100 రిటైల్ పాయింట్స్‌తో మొదలుపెట్టి నేడు 21 రాష్ట్రాల్లోని 139 నగరాల్లో 13,000 పైచిలుకు మొబైల్, ఫిక్సిడ్ రిటైల్ అవుట్‌లెట్స్ స్థాయికి ఇది విస్తరించిందని ఆయన చెప్పారు. నాఫెడ్, కేంద్రీయ భండార్ వంటి సంస్థల ద్వారా ప్రభుత్వం శనగపప్పు విక్రయాలు చేపట్టడం ఇదే ప్రథమం. ఈ ఏజెన్సీలు శనగలను సబ్సిడీ రేటుపై కేజీకి రూ. 47.83 చొప్పున కొనుగోలు చేసి వాటిని మిల్లు పట్టి, పాలిష్ చేసి కేజీకి రూ. 60 చొప్పున భారత్ బ్రాండ్ కింద విక్రయిస్తాయి. కేంద్రం ఇప్పటికే భారత్ బ్రాండ్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గోధుమ పిండిని విక్రయిస్తుండగా, బియ్యం విక్రయాలు కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. -
వివిధ నూతన రకాల సాగులో రైతుల ఆసక్తి
-
మార్కెట్లోకి కొత్త విత్తనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు కొత్త వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. వరిలో 4, మినుములో 2, వేరుశనగ, పెసర, పొగాకులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 వంగడాలను బుధవారం వ్యవసాయ శాఖ స్పెషల్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మార్కెట్లోకి విడుదల చేశారు. వీటిని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నెల్లూరు, బాపట్ల, తిరుపతి, మారుటేరు, నంద్యాల, గుంటూరు లాం పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటి ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రదర్శించడంతో పాటు వీటి వినియోగాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్.ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ సీడ్స్ ఎ.సుబ్బరావిురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగలో.. టీసీజీఎస్ 1522: ఈ వంగడం కదిరి–6కు ప్రత్యామ్నాయం. తిరుపతి 4 ఎక్స్, కదిరి 9 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం ఖరీఫ్‌లో 100 నుంచి 103 రోజులు, రబీలో 103 నుంచి 106 రోజులు. దిగుబడి హెక్టార్‌కు ఖరీఫ్‌లో 3.328 టన్నులు, రబీలో 4.031 టన్నులు. ఆకుమచ్చ, తుప్పు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. కాయ నుంచి పప్పు దిగుబడి 75–76 శాతం, నూనె 48.5 శాతం, 100 గింజల బరువు 45–47 గ్రాములు, గింజలు లేతగులాబీ రంగులో ఉంటాయి. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. పొగాకులో.. ఏబీడీ 132(నంద్యాల పొగాకు–2): ఈ వంగడం నంద్యాల పొగాకు–1కు ప్రత్యామ్నాయం. లైన్ 3–58–38, ఎక్స్ లైన్ (190–27–5–7–32), ఎక్స్ (303–3–38–13–11–40) రకాల నుంచి అభివృద్ధి చేశారు. ఇది తక్కువ హాని కారకాలను కలిగి ఉంటుంది. కిలో ఆకు ధర రూ.85 నుంచి రూ.90 పలుకుతుంది. ఒరోబాంకీని మధ్యస్థంగా తట్టుకోవడమేకాదు.. ఆకు కోత వరకు పచ్చగా ఉండి.. అధిక వర్షపాత పరిస్థితులను తట్టుకుంటుంది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో బీడీ పొగాకు సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్‌లో సాగుకు అనుకూలం. పెసరలో.. ఎల్జీజీ 630: ఈ వంగడం ఎల్జీజీ 460, ఐపీఎం 2–14, టీఎం 96–2 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్జీజీ 460 ఎక్స్ పీ 109 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులను పూర్తిగా తట్టుకునే రకం. ఒకేసారి కోత కోయటానికి అనువైనది. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. మినుములో.. టీబీజీ 129: ఈ వంగడం ఎల్బీజీ 752కు ప్రత్యామ్నాయం. దీనిని పీయూ 31 ఎక్స్ ఎల్బీజీ 752 నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 1.60 నుంచి 1.80 టన్నులు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. ఎల్బీజీ 904: ఈ వంగడం ఎల్బీజీ 752, 787, పీయూ 31, టీబీజీ 104, జీబీజీ 1 రకాలకు ప్రత్యామ్నాయం. ఎల్బీజీ 645 ఎక్స్ టీయూ 94–2 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంట కాలం 85 నుంచి 90 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 2.20 నుంచి 2.50 టన్నులు. పల్లాకు తెగులుతో పాటు కొంత మేర తలమాడుతట్టుకునే రకం. గింజలు మధ్యస్థ లావుకలిగి మెరుస్తుంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లకు అనుకూలం. నూతన వంగడాలు.. వాటి ప్రత్యేకతలు బీపీటీ 2841: ఈ వంగడం బర్మా బ్లాక్, కాలాబట్టి సాంప్రదాయ బ్లాక్ రైస్‌కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–7029, ఐఆర్జీసీ 18195, ఎంటీయూ–1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 130 నుంచి 135 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 5.50 నుంచి 6 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపుతో పాటు దోమపోటును కొంతమేర తట్టుకుంటుంది. గింజలు పగిలిపోవడం తక్కువ. ముడి బియ్యానికి అనుకూలం. మధ్యస్థ సన్న గింజ రకం. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. బీపీటీ 2846: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1061, ఐఆర్ 78585–64–2–4–3–1 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 నుంచి 150 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. అగ్గితెగులు, మెడవిరుపు, దోమపోటు, ఎండాకు తెగులును కొంతమేర తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై వాలిపోదు. మధ్యస్థ సన్న గింజ రకం. నిండు గింజల శాతం ఎక్కువ. ఏపీలో కృష్ణా, సదరన్ జోన్లలో ఖరీఫ్ సాగుకు అనుకూలం. ఎన్‌ఎల్‌ఆర్ 3238: బయో ఫోర్టిఫైడ్ స్వల్పకాలిక వరి రకమిది. బీపీటీ–5204, ఎంటీయూ 1010 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 120 నుంచి 125 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. ఇది కూడా చేనుపై వాలిపోదు. పాలిష్ చేసిన బియ్యంలో జింక్ మోతాదు 27–72 పీపీఎంగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి నాణ్యతతో ఉంటాయి. అగ్గితెగులు, మెడవిరుపులను కొంత మేర తట్టుకుంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగుకు అనుకూలం. ఎంటీయూ 1271: ఈ వంగడం బీపీటీ 5204కు ప్రత్యామ్నాయం. ఎంటీయూ–1075, 1081 రకాల నుంచి అభివృద్ధి చేశారు. పంటకాలం 140 రోజులు. దిగుబడి హెక్టార్‌కు 6.50 నుంచి 7 టన్నులు. దోమ, ఎండాకు తెగులును కొంత మేర తట్టుకుంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. ఇది కూడా చేనుపై వాలిపోదు. నిండు గింజల శాతం ఎక్కువ. సాగునీటి వసతులున్న లోతట్టు, అప్ల్యాండ్స్లో ఖరీఫ్ సాగుకు అనుకూలం. -
గుంటూరు కారం కథ తెలుసా అసలు.?
బంగాళాదుంప , మొక్క జొన్న , వేరుశెనగ , పైన్ ఆపిల్ , నారింజ , పొగాకు , బాదం , బెండకాయ , సపోటా , బొప్పాయి , మిరపకాయ , జీడిపప్పు, .. ఇవి లేని జీవితాన్ని ఊహించండి ! అంటే … మసాలా దోస , మిర్చి బజ్జి , వేరుశనిగ చట్నీ , బెండకాయ పులుసు , జీడీ పప్పు ఉప్మా … ఇవన్నీ ఉండవన్న మాటే కదా ! “ అహో ఆంధ్ర భోజా ! .. శ్రీకృష్ణ దేవా రాయా ! శిలలపై శిల్పాలు చెక్కించావు .. కానీ గుంటూరు కారం రుచి చూడలేదు .. ఉడిపి మసాలా దోస రుచి తెలియదు. ఏంటి ప్రభు? అని టైం మెషిన్ లో వెనక్కు వెళ్లి అడిగితే .." నేనేమి చేసేది మా కాలానికి ఈ పంటలు లేవు అంటాడు. ఎందుకంటే ఈ పంటలను , అటు పై పోర్చుగీస్ వారు, లాటినా అమెరికా దేశాలనుంచి సేకరించి మన దేశంలో ప్రవేశపెట్టారు. మరి ఆ రోజుల్లో మనాళ్ళు మసాలా దినుసులుగా ఏమి వాడేవారు? అల్లం , పసుపు , ఆవాలు , దాల్చిన చెక్క , ఏలకులు , లవంగాలు, ధనియాలు, ఇంగువ , మెంతులు ... ఇవన్నీ మన పంటలే . వీటిని మసాలా దినుసులుగా వాడేవారు ! అదండీ గుంటూరు కారం కథ ! కేవలం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర . నల్ల మిరియాలు అనాదిగా ఇండియా లో పండించేవారు. దాన్ని పోర్చుగీస్ వారు ఎగుమతి చేసుకున్నారు. ఇప్పుడు రాజ్యమేలుతున్న ఎన్నో వంటకాలు మనవి కాదు, కానీ తొందరగానే మన జీవితాలను పెనవేసుకుపోయాయి. మార్పు సహజం .. కానీ కొత్తొక వింత కాదు . పాతొక రోత కాదు. ఏది మంచి ? ఏది చెడు అని- నా వక్తిగత అభిప్రాయం కాకుండా సామజిక శాస్త్రం - మానవ శాస్త్రం - జీవ శాస్త్రం కోణం నుంచి శాస్త్రీయ విశ్లేషణలు చేస్తున్నా. వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర విశ్లేషకులు, ప్రముఖ విద్యావేత్త -
వేరుశనగలో ‘విశిష్ట’మైనది
సాక్షి, అమరావతి: వేరుశనగ రైతులకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తీపి కబురు అందించింది. బెట్ట పరిస్థితులు.. ఆకుమచ్చ తెగులును తట్టుకోవడమే కాకుండా.. 15 శాతం అదనంగా గింజ దిగుబడినిచ్చే కొత్త వంగడం టీసీజీఎస్–1694 (విశిష్ట) రకాన్ని రానున్న ఖరీఫ్ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. గతేడాది విడుదల చేసిన టీసీజీఎస్–1694 (విశిష్ట) ప్రయోగాత్మక సాగు విజయవంతం కావడంతో ఖరీఫ్ నుంచి పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారం కింద కదిరి–6 (కే–6), నారాయణి, ధరణి, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో టీఏజీ–24, కే–6 రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ.. ఈ రకాలు బెట్ట (నీటి ఎద్దడి)ని తట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు వీటి దిగుబడులపై టిక్కా ఆకుమచ్చ తెగులు తీవ్ర ప్రభావం చూపుతోంది. తెగుళ్ల నివారణకు రెండు, మూడుసార్లు ఖరీదైన శిలీంధ్ర నాశిని మందులను పిచికారీ చేయాల్సి రావడం రైతులకు భారంగా పరిణమించింది. గింజ శాతంలో కదిరి లేపాక్షిని మించి.. రాష్ట్రంలో ఖరీఫ్‌లో 16.85 లక్షల ఎకరాలు, రబీలో 2.35 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగవుతోంది. వర్షాధార భూముల్లో బెట్ట, తెగుళ్లను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడంలో భాగంగా.. అధిక దిగుబడి ఇచ్చేలా తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం టీసీజీఎస్–1694 (విశిష్ట) వంగడాన్ని రూపొందించింది. కదిరి–6, ఐసీజీ (ఎఫ్డీఆర్ఎస్)–79 రకాలను సంకరపరచడం ద్వారా దీనిని అభివృద్ధి చేశారు. 2022లో విడుదల చేసిన ఈ విత్తనాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలను సాధించారు. ఇది 25 రోజుల వరకు బెట్టను తట్టుకోగలదు. జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందిన కదిరి లేపాక్షి హెక్టార్‌కు 20నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. గింజ దిగుబడి 60 శాతం దాటడం లేదు. కొత్తగా అభివృద్ధి చేసిన విశిష్ట రకం మాత్రం బెట్ట, ఆకుమచ్చ తెగులును తట్టుకోవడంతోపాటు గింజ దిగుబడి శాతం 72నుంచి 75 శాతం నమోదవడం రైతులకు లాభించే అంశం. దీని విశిష్టతలివీ ♦ పంటకాలం 100–105 రోజులు (ఖరీఫ్), 105–110 రోజులు (రబీ). ♦పొడవు 31–37 సెం.మీ. (ఖరీఫ్), 28–30 సెం.మీ. (రబీ). ♦హెక్టారుకు సగటు దిగుబడి 22–25 క్వింటాళ్లు (ఖరీఫ్), 25–30 క్వింటాళ్లు (రబీ). ♦ 100 గింజల బరువు 42–45 గ్రాములు. గింజ శాతం 72–75.. నూనె శాతం 50. ♦ పైరు లేత ఆకుపచ్చ రంగులో సన్నగా పొడవుగా ఉంటుంది. ♦ఊడలు ఒకేసారి దిగడం వల్ల కాయలు ఒకేసారి పక్వానికి వస్తాయి. ♦ గింజలు లేత గులాబీ రంగులో గుండ్రంగా నున్నగా ఉంటాయి. బెట్ట, తెగుళ్లను తట్టుకుంది మాది సముద్ర తీర ప్రాంతం. ఇప్పటివరకు టీఏజీ–24 రకాన్ని ఎక్కువగా సాగు చేశా. కాయల దిగుబడి 16–20 క్వింటాళ్లకు మించి రాలేదు. దాదాపు ప్రతి సీజన్లో ఆకుమచ్చ తెగులు బారినపడటంతో సాగు ఖర్చులు భారంగా ఉండేవి. విశిష్ట రకాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేశా. టీఏజీ–24తో పోలిస్తే పంట కాలం 7నుంచి 10 రోజులు ఆలస్యమైనా బెట్ట, తెగుళ్లను తట్టుకుంది. గింజ నాణ్యత చాలా బాగుంది. సగటు దిగుబడి 22 క్వింటాళ్లు వచ్చింది. – మధుసూదనరావు, రామతీర్థం, నెల్లూరు జిల్లా గింజ దిగుబడి 75 శాతం నమోదైంది కే–6 రకం సాగు చేస్తే ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండేది. కదిరి లేపాక్షి రకాన్ని కూడా సాగు చేశా. అది ఎకరాకు 13 æక్వింటాళ్లు వచ్చింది. చీడపీడల ఉధృతి కాస్త తట్టుకున్నప్పటికీ గింజ శాతం తక్కువగా నమోదైంది. ఇప్పుడు విశిష్ట రకాన్ని సాగు చేశా. ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కానీ.. గింజ శాతం 75గా నమోదైంది. గింజ నాణ్యత కే–6 రకాన్ని పోలి ఉండడంతో మార్కెట్ ధరకు ఢోకా లేదు. – అల్లాబక్షు, తోపుదుర్తి, అనంతపురం వర్షాభావ ప్రాంతాలకు అనుకూలం టీసీజీఎస్–1694 (విశిష్ట) వర్షాభావ ప్రాంతాల్లో సాగుకు ఎంతో అనువైనది. ఎకరాకు 50 కేజీల విత్తనం సరిపోతుంది. శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఎరువులు, పురుగుల మందులు వినియోగిస్తే పెట్టుబడి ఎకరాకు రూ.25 వేలకు మించదు. పంటకాలంలో రెండుసార్లు ఎకరాకు అరకిలో సూక్ష్మ ధాతువులు వేస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు. మదర్ సీడ్ ఉత్పత్తి చేస్తున్నాం. వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తిస్థాయి విత్తనం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ సీడ్స్ కృషి చేస్తోంది. – డాక్టర్ ఎ.ప్రసన్న రాజేష్, ప్రధాన శాస్త్రవేత్త, వేరుశనగ పరిశోధనా కేంద్రం -
పెరిగిన వేరుశనగ సాగు
4.10 లక్షల హెక్టార్లకు చేరుకున్న విస్తీర్ణం మరో 1.10 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు అనంతపురం అగ్రికల్చర్: వేరుశనగ పంట విస్తీర్ణం 4.10 లక్షల హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయశాఖ తాజాగా తయారు చేసిన నివేదిక ప్రకారం వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 6.04 లక్షల హెక్టార్లు కాగా...ప్రస్తుతం 4.10 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. ఇందులో నీటి వసతి కింద 12 వేల హెక్టార్లు, వర్షాధారంగా 3.98 లక్షల హెక్టార్లలో విత్తుకున్నారు. మరో 1.10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఇతరత్రా పంటలు సాగులో ఉన్నాయి. మొత్తమ్మీద ఈ ఖరీఫ్‌లో 8.01 లక్షల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ ఇప్పటివరకు అన్ని పంటలు కలిపి 5.20 లక్షల హెక్టార్లు సాగులో ఉన్నాయి. ఇంకా ప్రత్యామ్నాయ పంటలు వేసే అవకాశం ఉన్నందున విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వేరుశనగ తర్వాత 48 వేల హెక్టార్లలో కంది, 30,100 హెక్టార్లలో పత్తి , 10,600 హెక్టార్లలో మొక్కజొన్న, 6,600 హెక్టార్లలో ఆముదం, 2,200 హెక్టార్లలో జొన్న, 2,700 హెక్టార్లలో సజ్జ , 1,600 హెక్టార్లలో కొర్ర, 1,100 హెక్టార్లలో ఉలవ వేశారు. ఇక వరి పంట ప్రస్తుతానికి 3,400 హెక్టార్లలో నాట్లు వేయగా ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. -
వేరుశనగ 60 శాతం
సాధారణ సాగు 8.01 లక్షల హెక్టార్లు వేరుశనగ సాధారణ సాగు 6.04 లక్షల హెక్టార్లు సాగయిన పంట : 3.80 లక్షల హెక్టార్లు ప్రస్తుత ఖరీఫ్ సాగు : 4.55 లక్షల హెక్టార్లు అనంతపురం అగ్రికల్చర్: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ అతి కష్టం మీద సాగుతోంది. వర్షాలు అదును దాటి కురుస్తుండటంతో పంటల సాగు విషయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఒక అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన పంట వేరుశనగ 6.04 లక్షల హెక్టార్లకు గాను ఎట్టకేలకు 3.60 లక్షల హెక్టార్లలో సాగయింది. అంటే 60 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేయడంతో.. ఒకవేళ దెబ్బతిన్నా పెట్టుబడి రాయితీ(ఇన్పుట్ సబ్సిడీ) మంజూరుకు మార్గం సుగమమైంది. గత జూన్‌లో 63.9 మిల్లీమీటర్లకు గాను 59.2 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో వేరుశనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే కీలకమైన జూలై నెలలో వరుణుడు ముఖం చాటేయడంతో సాగు పడకేసింది. జూలైలో 67.4 మిల్లీమీటర్లకు గాను 55 శాతంతక్కువగా 31.4 మిల్లీమీటర్లకే పరిమితమైంది. నైరుతి రుతు పవనాలు, అల్ప పీడనాలు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఆగస్టు 5వ తేదీ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న తదితర అన్ని పంటలు ఎండుముఖం పట్టాయి. ఇక ఈ ఏడాది మొదట్లోనే కరువు రక్కసి అనంత రైతులను ఉక్కిరిబిక్కిరి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం రెయిన్గన్ల పేరిట కొద్ది రోజులు హడావుడి చేసినా ఒక్క ఎకరా వేరుశనగ పంటను కూడా కాపాడలేకపోయారు. ఆగస్టు 5 తర్వాత వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఐదారు మండలాల్లో భారీ వర్షపాతం నమోదయింది. ఆగస్టులో 88.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా 96.3 మిల్లీమీటర్లు నమోదయింది. ఇదంతా 15 రోజుల్లో కురిసిన వర్షమే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎండుతున్న పంటలకు జీవం వస్తోంది. అయితే వేరుశనగలో శనగపచ్చ పురుగు, పత్తిలో ప్రమాదకరమైన గులాబిరంగు పురుగు, ఆముదంలో నామాల పురుగు, మొక్కజొన్నలో తామర పురుగు బెడద కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యామ్నాయం అంతంతే.. ఆరు లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు వేయించాలని వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించినా అందులో సగం విస్తీర్ణంలో కూడా పంటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు. అయితే వేరుశనగ 3.60 లక్షల హెక్టార్లు, కంది 43వేల హెక్టార్లు, ప్రత్తి 24 వేల హెక్టార్లు, ఆముదం 6వేల హెక్టార్లు, మొక్కజొన్న 8,400 హెక్టార్లలో వేయడంతో ఖరీఫ్ విస్తీర్ణం 57 శాతం పూర్తయింది. ఇక ప్రత్యామ్నాయం 20 శాతం విస్తీర్ణంలో సాగులోకి వచ్చే అవకాశం ఉండగా.. మొత్తం మీద 20 శాతం విస్తీర్ణం ఈ సారి బీడు భూములుగా మిగిలిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జొన్న, పెసలు, అలసంద, ఉలవ తదితర పంటలు వేస్తున్నారు. సెప్టెంబర్‌లో కూడా ఈ పంటలు వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 30 మండలాల్లో తగ్గిన వేరుశనగ వేరుశనగ పంట 60 శాతం విస్తీర్ణంలో సాగులోకి వచ్చినా 30 మండలాల్లో 50 శాతం లోపు విస్తీర్ణంలో వేశారు. ఆత్మకూరు, బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం, అమరాపురం, అగళి, గుడిబండ, బుక్కపట్టణం, కదిరి, నల్లమాడ, గాండ్లపెంట తదితర మండలాల్లో విస్తీర్ణం బాగా పెరిగింది. శింగనమల, గుత్తి, రామగిరి, ఉరవకొండ, వజ్రకరూరు, రొళ్ల, మడకశిర, డి.హిరేహాల్, కనేకల్లు, రాయదుర్గం, బొమ్మనహాల్, కుందుర్పి, కంబదూరు, రాప్తాడు, రొద్దం, పెనుకొండ, తాడిపత్రి, నార్పల, ఎన్పీ కుంట, తలుపుల తదితర మండలాల్లో వేరుశనగ విస్తీర్ణం తక్కువగా ఉంది. ప్రస్తుత ఖరీఫ్‌లో పంటల సాగు –––––––––––––––––––––––––––––––––––– పంట సాధారణ సాగు సాగులోని విస్తీర్ణం (హెక్టార్లలో) (హెక్టార్లలో) –––––––––––––––––––––––––––––––––––– వేరుశనగ 6,04,100 3,60,120 కంది 50,570 43,259 ప్రత్తి 46,161 24,840 ఆముదం 13,292 6,029 మొక్కజొన్న 18,768 8,388 జొన్న 12,560 1,220 వరి 22,169 2,267 సజ్జ 2,191 2,441 రాగి 1,420 842 కొర్ర 3,217 1,224 ఉలవ 6,335 818 పెసర 6,357 729 అలసంద 1,320 249 -
రసం పీల్చు పురుగు నివారిస్తే లాభదాయకమే
- వేరుశనగ, ప్రత్తిలో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి – ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త రవీంద్రనాథరెడ్డి అనంతపురం అగ్రికల్చర్: జూన్, జూలైలో ఖరీఫ్ పంటలు సాగు చేసిన ప్రాంతాల్లో ఆశించిన చీడపీడలు, పురుగులు, తెగుళ్ల నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆచార్య ఎన్జీరంగా వర్శిటీ అనుబంధ రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. + జూన్‌లో వేసిన వేరుశనగ పంటలో రసంపీల్చు పురుగులు ఆశించడం జరిగింది. దీనికి కారణమైన తామర పురుగుల నివారణకు ఎకరాకు 320 మి.లీ మోనోక్రోటోఫాస్ + ఒక లీటర్ వేపనూనె + ఒక కిలో సబ్బు పొడి 200 లీటర్ల నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. పేనుబంక, పచ్చదోమ ఆశించిన ప్రాంతాల్లో ఎకరాకు 400 మి.లీ డైమిథోయేట్ లేదా 400 మి.లీ మిథైల్ ఓ డెమటాన్ లేదా 40 గ్రాములు థయోమిథాక్సామ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. + ప్రత్తి పంటలో కూడా రసంపీల్చు పురుగు కనిపిస్తోంది. తొలిదశలో ఆశించిన పురుగు నివారణకు కాండం మీద పూత పద్ధతిని పాటించాలి. అలాగే 30, 45 రోజుల సమయంలో మోనోక్రోటోఫాస్ మందుతోనూ 60 రోజుల సమయంలో ఇమిడాక్లోప్రిడ్ మందుతో పిచికారీ చేసుకోవాలి. కాండం, పూత పద్ధతి ద్వారా పచ్చదోమ, పేనుబంక, పిండినల్లిని అదుపు చేయవచ్చు. + మొక్కజొన్న వేసిన ప్రాంతాల్లో కాండం తొలుచు పురుగు ఆశించింది. ఎకరాకు 320 మి.లీ మోనోక్రోటోఫాస్ 36 ఎస్ఎల్ లేదా 60 మి.లీ కోరజన్ రేనాక్షిపైర్ 200 లీటర్ల నీటికి కలిపి పైరు మొలకెత్తిన 10 నుంచి 12 రోజుల సమయంలో పిచికారీ చేసుకుంటే మేలు. + కందిలో ఒత్తుగా ఉన్న మొక్కలను తీసేయాలి. కొన్ని చోట్ల ముక్కు పురుగు లేదా కొమ్మ పురుగు ఆశించింది. నివారణకు ఎకరాకు 5 కిలోల మలాథియాన్ పొడి మందు చల్లుకోవాలి. + వేరుశనగ పంటకు సమయం ముగిసినందున వర్షం వస్తే ఆగస్టు నెలలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. అందులో భాగంగా ఎర్రనేలల్లో కంది, జొన్న, సజ్జ, అలసంద, ఉలవ, ఆముదం, పెసర, అనుములు అనువుగా ఉంటాయి. అలాగే తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, ఉరవకొండ, బెళుగుప్ప, విడపనకల్, కనేకల్లు, పెద్దవడుగూరు, తాడిపత్రి, పుట్లూరు, యాడికి తదితర నల్లరేగడి కలిగిన ప్రాంతాల్లో కంది, జొన్న, ప్రత్తి ఆగస్టు 15 వరకు వేసుకోవచ్చు. తర్వాత కొర్ర, పెసర, ఆముదం పంటలు వేసుకోవచ్చు. -
ముగిసిన విత్తన వేరుశనగ పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్: ఎట్టకేలకు విత్తన వేరుశనగ పంపిణీకి అధికారులు ముగింపు పలికారు. పంట సాగుకు సమయం ముగుస్తున్నా విత్తన పంపిణీ కొనసాగిస్తుండంపై విమర్శలు వెల్లువెత్తడంతో గురువారం నుంచి పంపిణీని నిలపివేశారు. అయినప్పటికీ వ్యవసాయశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించకపోవడం విశేషం. వర్షాభావ పరిస్థితులు కారణంగా పంట సాగు పడకేయడంతో పాటు సాగు సమయం జూలై 31వ తేదీగా శాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మే 24వ తేదీ ప్రారంభించిన విత్తన పంపిణీ 53 రోజులు పాటు కొనసాగించి 54వ రోజు గురువారం పంపిణీ నిలిపివేశారు. మొత్తమ్మీద జిల్లాకు కేటాయించిన 4.01 లక్షల క్వింటాళ్లలో 2,88,878 మంది రైతులకు 3,32,655 క్వింటాళ్లు ఇచ్చారు. 53 రోజులు పంపిణీ చేసినా ఇంకా 69 వేల క్వింటాళ్లు మిగిలిపోయాయి. కందులు, బహుధాన్యాల కిట్లు, మొక్కజొన్న పంపిణీ మరికొద్ది రోజులు కొనసాగిస్తామని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. -
వేరుశనగ విత్తుకు జూలై మంచి సమయం
– సమగ్ర యాజమాన్యంతో అధిక దిగుబడులు – కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్ జాన్‌సుధీర్ అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగ పంట విత్తుకునేందుకు జూలై నెలంతా మంచి సమయమని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త తిమ్మప్ప తెలిపారు. ముందస్తుగా వేసుకోవడం వల్ల ఆగస్టులో బెట్ట పరిస్థితులు ఏర్పడితే పంట దిగుబడులు తగ్గిపోతాయన్నారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. నేలలు, విత్తన రకాలు : ఇసుకతో కూడిన గరప నేలలు, ఎర్ర నేలలు, చల్కా నేలలు అనుకూలం. ఎక్కువ బంకమన్ను ఉన్న నల్లరేగడి భూముల్లో వేయకపోవడం మేలు. కే–6 రకంతో పాటు అవకాశం ఉంటే కొత్త రకాలైన కే–9, కదిరి అమరావతి, కదిరి హరితాంధ్ర, ధరణి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. కే–9 రకం బెట్టను తట్టుకుంటుంది. ఆకుమచ్చ, వేరుకుళ్లు తెగులును తట్టుకుంటుంది. రసంపీల్చు దోమ, తామర పురుగులు, నులిపురుగులు, ఎర్రనల్లిని అధిగమిస్తుంది. అత్యధిక నూనె శాతం, అత్యధిక గింజ వస్తుంది. కదిరి అమరావతి, హరిత్రాంధ్ర రకాలు బెట ఆకుమచ్చ, రసంపీల్చు దోమ, తామర పురుగులను తట్టుకుంటాయి. ధరణి రకం 35 రోజుల వరకు బెట్టను తట్టుకుంటుంది. మొక్కలు మధ్యస్తంగా ఉంటాయి. నేల నుంచి వ్యాప్తి చెందే తెగుళ్లు నివారించుకోవచ్చు. విత్తన శుద్ధి : కాండంకుళ్లు వైరస్ తెగులు, మొవ్వకుళ్లు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాల్లో ఒక కిలో విత్తనానికి 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. అలాగే ఒక గ్రాము టిబుకొనజోల్‌తో విత్తనశుద్ధి చేసుకుంటే నెలలోపు వచ్చే వేరుకుళ్లు తెగులును నివారించుకోవచ్చు. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి అరబెట్టిన తర్వాత ట్రైకోడెర్మావిరిడీ శిలీంద్రనాశినితో శుద్ధి చేసుకుని విత్తుకోవాలి. పంట విత్తడానికి ట్రాక్టరుతో నడిచే ఆటోమేటిక్ వేరుశనగ గొర్రు లేదా ఎద్దులతో నడిచే ఆటోమేటిక్ విత్తన గొర్రును వాడాలి. ఈ గొర్రు ఉపయోగించడం వల్ల 10 కిలోల విత్తన ఆదాతో పాటు కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు. ఎరువులు : భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువులు వేసుకోవాలి. ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోలు సింగిల్ సూపర్‌పాస్ఫేట్, 33 కిలోలు పొటాష్ ఎరువులు వేయాలి. విత్తిన 45 రోజుల తర్వాత ఎకరాకు 200 కిలోలు జిప్సం వేసుకుంటే నాణ్యత, దిగుబడులు పెరుగుతాయి. విత్తుకున్న 48 గంటల్లోగా ఎకరాకు ఒక లీటర్ అలాక్లోర్ (50 శాతం), లేదా 1.3 నుంచి 1.6 లీటర్లు పెండీమిథాలీన్ (30 శాతం) లేదా 1.25 నుంచి 1.50 లీటర్ బుటాక్లోర్ (50 శాతం) ఏదో ఒకటి 200 లీటర్ల నీటికి కలిపి పొలంలో పిచికారి చేసుకోవాలి. 20 రోజుల సమయంలో కూలీల సమస్య ఉంటే కలుపు మొక్కలు రెండు మూడు ఆకుల దశలో ఉన్నపుడు ఎకరాకు 300 మి.లీ ఇమాజితఫిర్ (10 శాతం) లేదా 300 మి.లీ క్విజలోఫాప్ ఇథైల్ (5 శాతం) 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. విత్తుకున్న 45 రోజుల తర్వాత పొలంలో కలుపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
జిల్లా వ్యాప్తంగా విత్తన పంపిణీ
– వేరుశనగకు డిమాండ్ అంతంత మాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): విత్తనాల పంపిణీ బుధవారం జిల్లా వ్యాప్తంగా మొదలయింది. కందులు, మినుములు తదితర వాటికి ధరలు రావడం వల్ల అన్ని రకాల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మొదటి రోజుతో పోలిస్తే బుధవారం వేరుశనగకు కొంతమేర డిమాండ్ కనిపించింది. అయితే ఊహించిన స్థాయిలో డిమాండ్ లేదని వివిధ మండలాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. వర్షాలు లేకపోవడం వల్ల విత్తనాలు పొందేందుకు రైతులు ముందుకురావడం లేదని తెలుస్తోంది. సబ్సిడీ పోను చెల్లించాల్సిన ధర మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉండటం కూడ రైతులు సబ్సిడీ వేరుశనగ తీసుకునేందుకు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో 2838 క్వింటాళ్లు వేరుశనగ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక కర్నూలు మండలంలో 146 ప్యాకెట్ల వేరుశనగ, 50 ప్యాకెట్ల కందులు పంపిణీ చేశారు. -
వేరుశనగకు జూలై అనుకూలం
అనంతపురం అగ్రికల్చర్ : వర్షాధారంగా వేసే వేరుశనగ పంట సాగుకు జూలై అనుకూలమని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. జూన్‌లో వేసుకుంటే ఆగస్టు నెలలో ఏర్పడే బెట్ట పరిస్థితుల కారణంగా పంట దిగుబడులు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి జిల్లాలో ఈ ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం ఎనిమిది లక్షల హెక్టార్లు కాగా అందులో ప్రధానపంట వేరుశనగ ఆరు లక్షల హెక్టార్లుగా ఉంది. మిగతా రెండు లక్షల హెక్టార్లలో కంది, పత్తి, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న, ఆముదం, వరి, పెసర, ఉలవ, అలసంద తదితర పంటలు వేసే అవకాశం ఉంది. అననుకూల వర్షాలు, మరికొన్ని కారణాల వల్ల పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉన్న వేరుశనగ ద్వారా ఏటా రైతులు నష్టపోతున్నారు. అయితే కొన్ని యాజమాన్య చర్యలు పాటిస్తే వేరుశనగ నుంచి మంచి పంట దిగుబడులు పొందవచ్చు. + వేరుశనగ జూన్‌లో సాగు చేయడం వల్ల ఆగస్టులో ఏర్పడే బెట్ట పరిస్థితుల వల్ల ఊడలు, కాయ ఊరే దశలో వర్షాలు లేక పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. జూలైలో వేసుకోవడం వల్ల ఆగస్టులో బెట్ట ఏర్పడినా సెప్టెంబర్‌లో కురిసే వర్షాలకు పంట కోలుకుని మంచి పంట దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని రైతులు దృష్టిలో పెట్టుకుని వర్షాధారంగా వేరుశనగ జూలైలో వేసుకుంటే మేలు. + వేరుశనగ విత్తడానికి ‘అనంత’ గొర్రును వాడటం ద్వారా మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు, సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు దూరం ఉంటుంది. దీని వల్ల చదరపు మీటరులో 33 మొక్కలు ఉంటాయి. ఎకరాకు 60 కిలోలు విత్తనం అవసరం. 7:1 లేదా 11:1 లేదా 15:1 నిష్పత్తిలో వేరుశనగ+కంది వేసుకుంటే మేలు. వేరుశనగ పొలం చుట్టూ నాలుగు సాళ్లు జొన్న లేదా సజ్జ వేసుకుంటే వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 3 గ్రాములు డైథేన్ ఎం–45 లేదా 1 గ్రాము కార్బండిజమ్ లేదా 4 గ్రాములు ట్రైకోడెర్మావిరిడీ పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో నాలుగు నుంచి ఐదు టన్నుల పశువుల ఎరువు లాంటి సేంద్రియ పోషకాలతో పాటు 18 కిలోల యూరియా, 100 కిలోల సూపర్‌పాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ఎరువులు విత్తే సమయంలో వేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైన మేరకు జిప్సం, జింక్‌సల్ఫేట్, బోరాన్ లాంటి సూక్ష్మపోషకాలు (మైక్రోన్యూట్రియంట్స్) వేయాలి. -
తొలిరోజు వెలవెల
- 58 మండలాల్లో విత్తన వేరుశనగ పంపిణీ - రైతులు రాకపోవడంతో బోసిపోయిన కౌంటర్లు - 2,335 క్వింటాళ్లు మాత్రమే విక్రయం - 5 మండలాలకు చేరని విత్తనకాయలు - కళ్యాణదుర్గంలో ‘అధికార’ జోక్యంతో పంపిణీ నిలిపివేత అనంతపురం సెంట్రల్ : ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ కొనుగోలుకు రైతులు తొలిరోజు పెద్దగా ఆసక్తి చూపలేదు. మొత్తం 58 మండలాల్లో పంపిణీ చేపట్టగా.. 2,335 క్వింటాళ్ల విత్తనకాయలు మాత్రమే తీసుకెళ్లారు. కరువు ప్రభావంతో రైతుల చేతుల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో వేరుశనగ కొనుగోలుకు ముందుకు రాలేదు. బుధవారం రాయదుర్గంలో రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, సమాచారశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు విత్తన పంపిణీ ప్రారంభించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ మొదలుపెట్టారు. విత్తన పంపిణీపై వ్యవసాయ శాఖ వద్ద ముందస్తు ప్రణాళికలు లేవన్న విషయం కొట్టొచ్చినట్లు కన్పించింది. ఇతర కార్యక్రమాల నిమిత్తం మంగళవారం జిల్లాకు వచ్చిన ఇన్చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా కళ్యాణదుర్గంలో లాంఛనంగా ప్రారంభించిన అధికారులు.. రాత్రికి రాత్రే ధరలు ఖరారు చేసి బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పంపిణీ మొదలుపెట్టారు. దీంతో పంపిణీ విషయం చాలామంది రైతులకు చేరలేదు. కొంతమందికి చేరినా చేతిలో డబ్బు లేక విత్తనం తీసుకోవడానికి రాలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా అన్ని విత్తన పంపిణీ కేంద్రాలు వెలవెలబోయాయి. అరకొరగా వచ్చిన రైతులు ప్రశాంతంగా విత్తనకాయలు తీసుకొని వెళ్లారు. ఒక్కో రైతుకు గరిష్టంగా నాలుగు బస్తాల చొప్పున అందించారు. తొలిరోజు 2,132 మంది రైతులు వేరుశనగ కొనుగోలు చేశారు. అధికార పార్టీ నేతలు చెప్పిన ఏజెన్సీలకు పంపిణీ బాధ్యతలు కట్టబెట్టలేదనే ఉద్దేశంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విత్తన పంపిణీ నిలుపుదల చేయించారు. దీంతో ఆయా మండలాల్లో విత్తన పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. కనగానపల్లిలో పంపిణీని బంద్ నేపథ్యంలో వామపక్ష నాయకులు అడ్డుకున్నారు. బుక్కరాయసముద్రంలో పరిశీలనకు వచ్చిన అనంతపురం ఆర్డీఓ మలోలను వామపక్ష నాయకులు ఘెరావ్ చేశారు. ముందస్తు ప్రణాళికల్లో వ్యవసాయ శాఖ విఫలం వ్యవసాయ శాఖ ప్రణాళికాలోపం వల్ల మండల స్టాకు పాయింట్లకు సరిపడా విత్తనకాయలు చేరలేదు. ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, వజ్రకరూరు, తనకల్లు మండలాలకు ఇప్పటికీ బస్తా కూడా విత్తనకాయలు అందలేదు. మిగిలిన వాటికీ అరకొరగానే చేరాయి. జిల్లాకు 4.59 లక్షల క్వింటాళ్ల విత్తన కాయలు అవసరం. ఇప్పటి వరకూ 1.80 లక్షల క్వింటాళ్లు మాత్రమే చేరాయి. అధికారులు మాత్రం 3.79 లక్షల క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.అయితే.. ఆ మేరకు స్టాకు పాయింట్లకు చేరలేదు. హడావుడిగా నిర్ణయించడంతో పాటు రైతుల వద్ద సమయానికి డబ్బు సమకూరకపోవడంతో తొలిరోజు పెద్దగా రాలేదు. రెండు, మూడురోజుల్లో విత్తన పంపిణీ పుంజుకునే అవకాశముంది. బుధవారం పంపిణీ మొదలుకాని ఐదు మండలాల్లో గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ సంయుక్త సంచాలకుడు (జేడీఏ) శ్రీరామమూర్తి తెలిపారు. అన్ని మండలాలకు సరిపడా విత్తనకాయలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. -
విత్తన పంపిణీలోనూ.. అధికార పెత్తనం
– పంపిణీ బాధ్యతల కోసం జోరుగా పైరవీలు – పలు మండలాల్లో ‘తముళ్ల’ మధ్యనే పోటీ అనంతపురం అగ్రికల్చర్ : విత్తన వేరుశనగ పంపిణీలోనూ రాజకీయ పెత్తనం ఎక్కువవుతోంది. బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ కోసం ఓ వైపు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు పంపిణీ బాధ్యతలు దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు పైరవీలు చేస్తున్నారు. ఈసారి నాలుగు బస్తాలు ఇవ్వనున్నట్లు ఇటీవల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విత్తన కేటాయింపులు 3.50 లక్షల నుంచి 4.01 లక్షల క్వింటాళ్లకు పెరిగాయి. ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్‌తో పాటు వాసన్ అనే ఎన్జీవో ద్వారా విత్తనకాయ సేకరిస్తున్నారు. ఇప్పటికే 3.20 లక్షల క్వింటాళ్లు వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టాక్ పాయింట్లకు చేర్చారు. ప్రభుత్వం నుంచి విత్తన ధరలు, రాయితీలు ఖరారు కాగానే పంపిణీ తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. ఎలాగైనా ఈనెలాఖరు నాటికి మొదటి విడత పంపిణీ పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు బాగానే ఉన్నా... మండలాల్లో పంపిణీ చేసే బాధ్యతలు తమకే ఇవ్వాలంటూ అధికార పార్టీకి చెందిన నేతల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఒక క్వింటాపై రూ.50 కమిషన్ ఉండటంతో ఎక్కువ కేటాయింపులు కలిగిన మండలాలు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వ్యవసాయశాఖ, సేకరణ సంస్థల అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తున్నారు. 10 వేల క్వింటాళ్లు కలిగిన మండలాల్లో వంద శాతం పంపిణీ జరిగితే రూ.5 లక్షల వరకు కమిషన్ వస్తుంది. అందులో అన్ని రకాల ఖర్చులు సగం పోయినా సగమైనా మిగులుతుంది. ఖర్చులు తగ్గించుకుంటే 70 శాతం వరకు కమిషన్ రూపంలో మిగులుతుందనే ఆలోచనతో పైరవీలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలదే హవా గతంలో చాలా వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్), రైతు సేవా కేంద్రాలు (ఆగ్రోస్) ఎక్కువగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి వాటిని చాలా వరకు పక్కన పెట్టేశారు. అంతో ఇంతో కమీషన్ వస్తుందనే ఆశతో తెలుగు తమ్ముళ్లు రంగంలో దిగడంతో నువ్వా...నేనా...? అన్నట్లు వారి మధ్యనే చాలా చోట్ల పోటీ ఏర్పడింది. పంపిణీ చేయడానికి వీలుగా ఎలాంటి అనుభవం లేకున్నా ఇప్పటికిపుడు సీడ్ లైసెన్స్ పొందేందుకు ఎగబడుతున్నారు. తమ వారికి అవకాశం కల్పించాలంటూ కీలక నేతలు సిఫారసు చేస్తుండటంతో వ్యవసాయశాఖ అధికారులు, ఏజెన్సీలకు చెందిన అధికారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది పంపిణీ చేసిన విత్తన వేరుశనగకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము దాదాపు రూ.1 కోటి వరకు తమ్ముళ్లు కట్టకుండా దర్జాగా తిరుగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చోటామోటా నేతలు పంపిణీ బాధ్యతలు దక్కించుకునే యత్నాల్లో ఉన్నాయి. ఆయా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలదే సర్వాధికారంగా సాగుతున్నట్లు సమాచారం. వారు చెప్పిందే వేదంగా అధికార యంత్రాంగం కూడా ముందుకు సాగుతోందన్న విమర్శలున్నాయి. -
ఇవి తింటే గుండె చాలా పదిలం!
న్యూయార్క్: వేరుశనగ విత్తనాలు తింటే గుండెకు మంచిదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పల్లీలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండెపోటు ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆరోగ్యంగా ఉన్నవారు, ఊబకాయంతో బాధపడుతున్న 15 మంది పురుషులపై పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. వీరిలో కొంతమందికి నియమబద్ధంగా రోజుకు 85 గ్రాముల వేరుశనగలను అందించారు. ఇంకొంతమందికి ఇచ్చే ఆహారంలో అన్ని పోషకాలు ఉండి వేరుశనగలు లేకుండా ఇచ్చారు. అలా ఇచ్చిన తరువాత వారి రక్తనమునాలలో లైపిడ్, లైపిడ్ ప్రోటీన్, ఇన్సులిన్ స్థాయిలను 30, 60, 120, 240 నిముషాలకోసారి పరిశీలించారు. వేరు శనగ విత్తనాలు తీసుకున్న వారు, తీసుకోని వారిని పోల్చిచూస్తే విత్తనాలు తీసుకున్నవారి రక్తనమూనాలో ట్రైగ్లిసరైడ్స్ 32 శాతం తగ్గినట్లు గమనించారు. అంతేగాక ధమనులు మరింత ఆరోగ్యంగా ఉండి ఎక్కువ వ్యాకోచాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది. వేరుశనగ విత్తనాలు తీసుకుంటే అలాంటి సమస్య తగ్గుతుందని యూనివర్సిటీ ప్రొఫెసర్ పెన్నీ క్రిస్ ఎథిరన్ తెలిపారు. -
కాండం, మొవ్వకుళ్లుతో జాగ్రత్త
– వేరుశనగ రైతులు అప్రమత్తంగా ఉండాలి - కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్ ఎం.జాన్‌సుధీర్ అనంతపురం అగ్రికల్చర్ : వేరుశనగకు కాండంకుళ్లు, మొవ్వకుళ్లు సోకకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు. రబీలో జిల్లావ్యాప్తంగా దాదాపు 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగైన వేరుశనగ పంట వివిధ దశల్లో ఉందన్నారు. వేరుశనగకు ప్రమాదకరమైన కాండంకుళ్లు, మొవ్వకుళ్లు లాంటి వైరస్ తెగుళ్లు వ్యాపించి నష్టం కలగజేసే అవకాశం ఉన్నందున వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకోవాలని ఆయన సూచించారు. కాండంకుళ్లు తెగులు ఈ వైరస్ తెగులు ఆశించిన వేరుశనగ మొక్క లేత ఆకులపై తర్వాత ఆకు ఈనెలపై నల్లని మాడు పట్టిన మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు క్రమేణా తొడిమెలు, కాండంకు విస్తరిస్తాయి. కాండాన్ని ఆశించిన మచ్చలు పైకిపాకి మొవ్వను ఆశించి చంపేస్తాయి. నెలలోపు వయస్సున్న వేరుశనగ మొవ్వలకు ఆశిస్తే చనిపోతాయి. మరికొన్ని మొక్కలు గిడసబారి, వచ్చిన కాయలు కూడా నల్లగా తయారవుతాయి. ఈ తెగులు తామరపురుగులు, వైరస్ కణాలు కలిగి వున్న కలుపు మొక్కలైన మురిపిండాకు, తుత్తుర బెండ, ఉత్తరేణి, జిల్లేడు, కుక్కవామింట, వెర్రిమిరప, చెంచలి కూర, తుమ్మి, వయ్యారిభామ, గడ్డిచామంతి ద్వారా వ్యాప్తి చెందుతాయి. కలుపు మొక్కల పుప్పొడి రేణువులు గాలి లేదా తామర పురుగుల ద్వారా వేరుశనగకు ఆశిస్తాయి. తెగులును తట్టుకునే శక్తి వేరుశనగ లేదు. పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కలను పూతకు రాకమునుపే ఏరివేసి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ ఏపుగా పెరిగే సజ్జ, జొన్న, మొక్కజొన్న 8 సాళ్లు రక్షణ పంటలుగా వేసుకోవాలి. దీని వల్ల కలుపు మొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, తామర పురుగులను రక్షణ పంటలు నిలువరిస్తాయి. విత్తే సమయంలో కిలో విత్తనానికి 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తనశుద్ధి చేస్తే 30 రోజుల వరకు ఇలాంటి వైరస్ తెగులు వ్యాప్తి చెందవు. తద్వారా కాండంకుళ్లు తెగులు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. మొవ్వకుళ్లు తెగులు: వేరుశనగ పంటలో ఈ తెగులు ఎపుడైనా సోకుతుంది. నెల రోజుల్లోగా ఆశిస్తే పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఆకుల మీద పసుపు పచ్చని పాలిపోయిన వలయాలు (రింగ్‌స్పాట్) ఏర్పడుతాయి. మొవ్వ పాలిపోయి నల్లగా మారుతుంది. ఆకులు చిన్నవిగా మెలితిరగడం, వివిధ రంగుల మచ్చలు కలిసి పాలిపోతుంది. కణుపుల మధ్య దూరం తగ్గి, గిడసబారిపోతుంది. త్రిప్స్ అనే రసంపీల్చు పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. మొవ్వకుళ్లు తెగులు నివారణకు సకాలంలో కలుపు మొక్కలు నాశనం చేసుకోవాలి. విత్తనశుద్ధి పాటించి మొక్కల సాంద్రత సరిగా ఉండేలా చేసుకోవాలి. అంతర పంటలుగా సజ్జ లేదా జొన్న వేసుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే రక్షణ పంటలుగా కూడా 8 సాళ్లు సజ్జ, జొన్న వేసుకుంటే మేలు. తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున తొలిదశలో 0.4 మి.లీ.ఇమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. -
రబీ వేరుశనగలో సస్యరక్షణ
అనంతపురం అగ్రికల్చర్ : రబీ వేరుశనగకు ఆశించే తెగుళ్లు, చీడపీడల నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. పంట విత్తుకునేందుకు సమయం ముగిసిందన్నారు. సాగుచేసినవారు నీటి నిర్వహణ, కలుపు నివారణ, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే పంట దిగుబడులు లభిస్తాయన్నారు. ప్రస్తుతం వేరుశనగకు రసంపీల్చు పురుగులు, పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సస్యరక్షణ చర్యలు +తామర పురుగుల నివారణకు ఎకరాకు 320 మి.లీ మోనోక్రోటోఫాస్ + ఒక లీటర్ వేపనూనె+ ఒక కిలో సబ్బుపొడి 200 లీటర్ల నీటికి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. పేనుబంక, పచ్చదోమ నివారణకు ఎకరాకు 400 మిల్లిలీటర్ల డైమిథోయేట్ లేదా 400 మిల్లిలీటర్ల మీథైల్ డెమటాన్ లేదా 60 మిల్లిలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. + యూరియా ఎక్కువగా వాడినా, నీటి తడులు ఎక్కువగా ఇచ్చినా పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టం కలుగజేస్తుంది. నివారణకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉనికి, ఉధృతిని అంచనా వేయాలి. వీటి వల్ల రెక్కల పురుగులను ఆకర్షించవచ్చు. అలాగే ఎకరా వేరుశనగ పొలంలో 30 నుంచి 40 వరకు ఆముదం మొక్కలు ఎర పంటగా వేసుకోవాలి. గ్రుడ్లు చిన్నవిగా ఉన్నపుడు 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారి చేయాలి. పూర్తీగా నివారించడానికి ఎకరాకు 400 మిల్లిలీటర్ల క్వినాల్ఫాస్ లేదా ఒక లీటర్ వేపనూనె 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఎదిగిన లార్వాలను 200 గ్రాములు థయోడికార్బ్ లేదా 200 మిల్లిలీటర్ల నొవాల్యురాన్ మందు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. -
వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. బుధవారం లాంఛనంగా ప్రారంభించినా గురువారం కొద్దిగా కొనుగోళ్లు జరిగాయి. ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో అనంతపురం, కళ్యాణదుర్గం, గుత్తి, తాడిపత్రి, పెనుకొండ, కదిరి, ధర్మవరం మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వేరుశనగకు ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,220 ప్రకారం ప్రకటించిన విషయం తెలిసిందే. అదే ధరతో కొనుగోళ్లు జరుపుతున్నట్లు ఆయిల్‌ఫెడ్ అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రచారం లేకుండా కేంద్రాలు ప్రారంభించడంతో వెలవెలబోయాయి. అవుటన్ 65 శాతం అంతకన్నా ఎక్కువ ఉంటేనే కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పంట వేసి పండించినట్లు తహశీల్దార్ / ఏఓ / వీఆర్వోల ద్వారా ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్ సమర్పించాల్సి ఉందన్నారు. 65 శాతం అవుటన్ ఉండాలనే నిబంధన పెట్టడంతో రైతులకు ఇబ్బందిగా పరిణమించింది. -
జిల్లాలో 4 వేరుశనగ కొనుగోలు కేంద్రాలు
- రూ.4220తో కొనుగోలుకు ఆయిల్‌ఫెడ్ సిద్ధం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వేరుశనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం క్వింటాలు కనీస మద్దతు ధరగా రూ.4220గా ప్రకటించింది. మార్కెట్లో చాల వరకు ఈ ధర కంటే తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆయిల్ ఫెడ్ రంగం సిద్ధం చేసింది. నాఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ఫశ్రీడ్ కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుంది. వేరుశనగ సాగు ఎక్కువగా ఉన్న ఆదోని, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయిల్‌ఫెడ్ జిల్లా ఇన్చార్జీ అంకిరెడ్డి తెలిపారు. కేంద్రాలను ఎప్పుడు ప్రారంభించేది ఒకటి, రెండు రోజుల్లోలో తెలియజేస్తామన్నారు. -
రూ.20 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి
ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి అనంతపురం అగ్రికల్చర్: వర్షాభావంతో దెబ్బతిన్న వేరుశనగ పంటకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సీపీఎం అనుబంధ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.పెద్దిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కరువు సహాయక చర్యలు చేపట్టాలనే డిమాండ్తోస్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ 2010 నుంచి వరుసగా కరువు పరిస్థితులు ఏర్పడుతుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రుణమాఫీ సక్రమంగా అమలు చేయకుండా ఇన్పుట్æసబ్సిడీ పూర్తిగా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందన్నారు. ఈ ఏడాది కూడా 6.09 లక్షల హెక్టార్లలో వేసిన వేరుశనగ పంట తుడిచిపెట్టుకుపోవడంతో రైతులకు రూ.వందల కోట్లు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా కరువు జిల్లాగా ప్రకటిస్తున్నా జిల్లా రైతులకు ఒరిగిందేమీలేదన్నారు. ఈ సారైనా తక్షణం కరువు సహాయక చర్యలు చేపట్టి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయశాఖ డీడీఏ చంద్రానాయక్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సంఘం నాయకులు కదిరెప్ప, ఆదినారాయణ, హనుమంతరెడ్డి, నారాయణ, మాధవరెడ్డి, నారాయణస్వామి, నాగమ్మ, రామక్క పాల్గొన్నారు. -
రైతు కుదేలు
– రబీలో చీడపీడలు – ఖరీఫ్‌లో వర్షాభావం – అందని ఇన్పుట్ సబ్సిడీ – వెంటాడుతున్న రుణపాశం – బంగారంపై రుణాలివ్వద్దంటున్న ప్రభుత్వం – అయోమయంలో అన్నదాతలు చిత్తూరు (అగ్రికల్చర్) : జిల్లాలోని రైతులు నష్టాలను చవిచూస్తూ కుదేలవుతున్నారు. గత రబీసీజన్‌లో వరి పంటకు చీడపీడలు సోకడంతో దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ పంట పూర్తిగా చేజారిపోయింది. ఏ సీజన్‌కు ఆ సీజన్లో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సాధారణంగా జిల్లాలో 2.11 లక్షల హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. రబీలో అత్యధికంగా తూర్పు మండలాల్లో వరి సాగుచేయగా, ఖరీఫ్‌లో పడమటి మండలాల్లో వేరుశనగను సాగుచేస్తారు. దశాబ్ద కాలంగా తీవ్ర వర్షాభావంతో పంటల సాగు అంతంత మాత్రంగా ఉంటోంది. గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు దాదాపుగా అన్ని చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. భూగర్భ జలాలు పెరిగాయి. రైతులు గత రబీ సీజన్లో పంటల సాగుపై ఆసక్తి చూపారు. చీడపీడల బెడద గత రబీలో జిల్లా వ్యాప్తంగా 80 వేల హెక్టార్లలో వరి సాగుచేశారు. పంట ఏపుగా పెరగడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావొచ్చని అందరూ భావించారు. అయితే పంట చేతికందే సమయంలో చీడపీడలు వరి కంకులను నాశనం చేశాయి. దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల మేరకు దిగుబడి తగ్గిపోయింది. చేజారిన వేరుశనగ ప్రస్తుత ఖరీఫ్‌లో సాగవుతున్న వేరుశనగ పంటకు సాగునీరు లేక పూర్తిగా చేజారింది. జిల్లాలో 1.21 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగుచేశారు. 50 రోజులుగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంట దాదాపుగా ఎండిపోయింది. ప్రభుత్వం రెండు వారాల క్రితం వేరుశనగకు రెయిన్‌గన్స్ ద్వారా తడులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. రైతులకు దాదాపు రూ.130 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు నిపుణులు చెబుతున్నారు. అందని ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్ణక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. 2013–14కి గాను రైతులకు 98 వేల హెక్టార్లలకు రూ.90 కోట్ల మేరకు, 2014–15కి గాను 1.1 లక్షల హె క్టార్లకు రూ.108 కోట్ల మేరకు ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం అందించాల్సి ఉంది. కానీ ఇంతవరకు చిల్లిగవ్వకూడా రైతులకు విదల్చలేదు. దీంతో వారు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. వెంటాడుతున్న రుణపాశం 2013 డిసెంబర్ నాటికి 8,70,321 మంది రైతులు రూ.11,780.25 కోట్ల మేర బ్యాంకర్లకు బకాయి పడ్డారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు మాటలు నమ్మి చాలా మంది రైతులు మోసపోయారు. అనేక ఆంక్షల కారణంగా జిల్లాలో 4,53,773 మంది రైతులే రుణమాఫీకి అర్హత సాధించారు. వీరికి కూడా స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ పేరుతో నిబంధనలు పెట్టి వడ్డీలకు కూడా చాలని విధంగా రుణమాఫీ చేశారు. అప్పులు ఏమాత్రం తీరకపోగా మరిన్ని కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. బంగారు రుణాలపై ఆంక్షలు బంగారంపై తీసుకునే వ్యవసాయ రుణాల వల్ల రుణమాఫీలో సమస్యలు వస్తున్నాయని, కావున సాగుకు బంగారంపై రుణాలివ్వద్దంటూ ఈ నెల 13న నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు తేల్చిచెప్పారు. ఫలితంగా చాలా మంది రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. బ్యాంకు రుణాల పరపతి పూర్తిగా దెబ్బతింది. ఈ ఏడాదికి కేటాయించిన రూ.2,500 కోట్ల మేర రుణ లక్ష్యం అధికమించే పరిస్థితులు కనిపించడం లేదు. -
పచ్చి మోసం
రైతులను దగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు సంఘం చర్చా వేదికలో వక్తలు అనంతపురం సప్తగిరి సర్కిల్ : రైతులను పచ్చిగా మోసం చేస్తున్నారని రైతు సంఘం ఏర్పాటు చేసిన చర్చావేదికలో వక్తలు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘ఎండిన వేరుశనగ పంట–రెయిన్గన్లు’ అనే అంశంపై స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం చర్చా వేదిక నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.పెద్దిరెడ్డి అధ్యక్షత వహిం చారు. ఆయన మాట్లాడుతూ రక్షక తడుల పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్నారు. రక్షకతడితో పంటను మాత్రం రక్షించలేక పో యారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ రెయిన్గన్ల సృష్టికర్తే తానేనన్నుట్టు చం ద్రబాబు రైతులను నమ్మిస్తున్నారని ఆరోపించారు. వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కరువును ఎలా ఎదుర్కోవాలి, శాశ్వత నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనను పూర్తిగా విస్మరిం చారన్నారు. చంద్రబాబు రైతులను ద గా చేస్తున్నారన్నారు. కూలీలకు పను లు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాయలసీమలో 22 లక్షల ఎకరాల్లో వేరశనగను సాగుచేశారన్నారు. ఇందులో ఆగస్టులోనే 12 లక్షల ఎకరాల్లోని పంట సరైన సమయంలో నీరు అందక చేజారిందన్నారు. మొత్తం పంటను రక్షించడానికి 8 టీఎంసీల నీరు అవసరమవుతాయన్నారు. అంతనీటిని ఎక్కడి నుంచి తెచ్చారని, ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రక్షకతడుల ద్వారా రైతులకు చెందిన రూ.199 కోట్ల పంటను రక్షించగలిగామని, రూ. 59 కోట్ల 62 లక్షల విలువ చేసే ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వానికి మిగులుబాటు చేశామని చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. ఇలాంటి ప్రకటనల ద్వారా ఇన్పుట్ సబ్సిడీ ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా లో వేరుశనగ ను చేర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. వాతావరణాన్ని గ ణించడానికి ఉన్న వెదర్స్టేçÙన్లు ఎక్కడా పనిచేయడం లేదన్నారు. ప్రతి ఏడాది జూన్æ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదు కాకపోతే పంటకు జరిగిన నష్టాన్ని వెల కట్టి రైతుల ఖాతాలకు ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం జమ చేయాలని డి మాండ్ చేశారు. విజయవాడ నుంచి బులెటిన్ విడుదల చేసి రక్షించామని తప్పుడు మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకట చౌదరి, కదలిక ఎడిటర్ ఇమాం, సీపీఐ ఎమ్ ఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రమణ, సీపీఐ కార్యవర్గ సభ్యులు కా టమయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య నాయకులు రామక్రిష్ణ, రైతు సంఘం నాయకులు రామాంజినేయులు, చంద్రశేఖర్‌రెడ్డి, సుబ్బిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
వేరు‘శని’గ..
దేవనకొండ మండలంలోని లక్కందిన్నె గ్రామానికి చెందిన రైతు మల్లేష్ ఈ ఏడాది తనకున్న ఐదెకరాల్లో వేరుశనగ సాగు చేపట్టాడు. వర్షాభావంతో పంట ఎండిపోగా మంగళవారం సాగు చేసిన చేతులతోనే దున్నేశాడు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ముందస్తు వర్షాలకు 22,236 హెక్టార్లలో వేరుశనగ పంట సాగయింది. ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో రైతుల కంట్లో కన్నీటి సుడి తిరిగింది. ఈ రోజు.. రేపు.. అని ఎదురుచూడటంతోనే పంటంతా ఎండిపోయింది. ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వం రెయిన్గన్ల పేరిట హడావుడి చేయడం తప్పిస్తే.. ఒక్క ఎకరానూ తడపలేకపోయింది. చేసేది లేక దాదాపు 836 హెక్టార్లలో పంటను దున్నేశారు. కనీసం పశువులకు మేతగానైనా ఉపయోగపడుతుందనే ఆశతో ఆశలను వదిలేసుకుంటున్నారు. – దేవనకొండ -
చేజారిన వేరుశనగ
–90శాతం ఎండిపోయిన పంట –40వేల హెక్టార్లలో పంటపై ఆశలు లేనట్టే – రెయిన్గన్లతో తడులు అంతంతమాత్రమే – సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం – ఆఖరు నిమిషంలో హడావుడి – రంగంలోకి మంత్రులు, ఐఏఎస్‌లు చిత్తూరు: జిల్లాలో నెలకున్న తీవ్ర వర్షాభావంతో వేరుశనగ పంట చేజారిపోయింది. ఈ ఖరీఫ్‌కు సాగవుతున్న వేరుశనగ పంటలో దాదాపు 90 శాతం పంట ఎండిపోయింది. రైతులకు చేయూతగా చేపట్టాల్సిన సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఎండిపోయిన పంటను కాపాడుతామంటూ రెయిన్గన్లతో ఇస్తున్న తడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నెల రోజులుగా వర్షాభావంతో వేరుశనగ ఎండిపోతుంటే చోద్యం చూసిన ప్రభుత్వం ఆఖరునిమిషంలో ఎండిపోయిన పంటను కాపాడేస్తామంటూ ముఖ్యమంత్రి జిల్లాకు విచ్చేసి హడావుడి చేశారు. ఇందులోభాగంగా జిల్లాలో కరువు నివారణ చేపట్టేందుకు రంగంలోకి రాష్ట్ర మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులను దింపారు. జిల్లావ్యాప్తంగా ఏటా ఖరీఫ్ సీజన్‌కు 2.11లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వేరుశనగతో పాటు వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తారు. అందులో వేరుశనగ మాత్రం 1.36లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలోనే మోస్తరుగా వర్షపాతం నమోదు కావడంతో జిల్లావ్యాప్తంగా రైతులు 1.31లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నెల రోజులుగా తీవ్ర వర్షాభావం నెలకొనడంతో 90 శాతం మేరకు పంట పూర్తిగా ఎండిపోయి ఆకులు సైతం రాలిపోయే దశకు చేరుకుంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం వేరుశనగ పంటను ఆదుకునేందుకు సకాలంలో సహాయ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వేరుశనగ పంటకు వరుసగా రెండు వారాల పాటు వర్షం పడకపోతే ప్రభుత్వం దీనిపై స్పందించి సత్వర చర్యలు చేపట్టేందుకు సన్నద్ధం కావాల్సి ఉంది. దాదాపు 20 రోజుల పాటు పంట ఎండిపోతున్నా అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుకు రాలేదు. జిల్లావాసి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ పరిస్థితులపై ఏమాత్రం పట్టించుకోకపోగా కష్ణాపుష్కరాలు, వేడుకల్లో ఈనెల 24వతేది వరకు గడిపారు. తరువాత తీరిగ్గా జిల్లాకు రెండు రోజుల క్రితం విచ్చేసిన చంద్రబాబు ఇక్కడ వేరుశనగ పంట దుస్థితి చూసి ఈ విషయాన్ని నా దష్టికి తీసుకురాకపోవడం అధికారులు, మంత్రులదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో వ్యవహరించడం విశేషం. రెయిన్గన్లతో తడులు అంతంతమాత్రమే వారం రోజులుగా వ్యవసాయశాఖాధికారులు రెయిన్గన్లతో పంటకు ఇస్తున్న తడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. 80వేల హెక్టార్ల మేరకు వేరుశనగ పంట పది రోజుల క్రితమే బాగా ఎండుముఖం పట్టింది. వ్యవసాయాధికారులు మాత్రం 962 రెయిన్గన్లు, 251 జనరేటర్లను తెప్పించి ఇప్పటికీ 10వేల హెక్టార్లలో మాత్రమే తడులు చేపట్టారు. దీంతో 40వేల హెక్టార్ల మేరకు ఇప్పటికే పంట చేజారిపోయింది. మిగిలిన పంట కూడా ఒకటి రెండు రోజుల్లో తడులివ్వకపోతే రైతులు పంటను వదులుకోవాల్సిన దుస్థితి. అంతా హడావుడే.. పంట ఎండిపోయిన తరువాత జిల్లాకు విచ్చేసిన సీఎం హడావుడిగా చర్యలను ప్రకటించారు. 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఆరుగురు మంత్రులను, 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను, 45 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీరంతా పూర్తిగా పంట ఎండిపోయిన 11 నియోజకవర్గాల పరిధిలోని 49 మండలాల్లోని పంటలను పరిశీలించి సత్వరం కాపాడే చర్యలు చేపడుతారని ముఖ్యమంత్రి ప్రకటించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కంటితుడుపు చర్యలుగా రైతులు పేర్కొంటున్నారు. -
సాగు నీటి ఉద్గారాలు తగ్గేదెలా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం దిగుడు బావుల కన్నా ఎక్కువగా బోర్లపైనే ఆధారపడి ఉంది. ప్రధాన పంటలైన వరి, చెరకు, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయల సాగులో విద్యుత్తు ఎంతెంత ఖర్చవుతోంది? ఎంతెంత పరిమాణంలో ఉద్గారాలు వెలువడుతున్నాయి? భూతాపాన్ని అతిగా పెంచేస్తున్న ఈ ఉద్గారాలను తగ్గించుకునే పద్ధతులేవి? భూమిలో నుంచి తోడిన నీటిని ఏ యే పంటకు, ఏ యే విధంగా వాడుకుంటే విద్యుత్తు వాడకం, ఉద్గారాలు తగ్గుతాయి? ఇటువంటి ఆసక్తికరమైన అంశాలపై కొంచెం లోతుగా తెలుసుకోవాలంటే.. హైదరాబాద్ సంతోష్‌నగర్‌లోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ (క్రీడా) ప్రధాన శాస్త్రవేత్తలు డా. కె. శ్రీనివాసరెడ్డి, డా. వి. మారుతి చేసిన అధ్యయనం వివరాలను పరిశీలించాల్సిందే! ప్రపంచ నీటి వారోత్సవాల (ఆగస్టు 28 - సెప్టెంబర్ 2) సందర్భంగా.. ‘సాగుబడి’ పాఠకులకు ఈ అధ్యయనం వివరాలను అందిస్తున్నాం.. ప్రపంచ వ్యాప్తంగా భూగర్భ జలాల వినియోగం 3,800 క్యూబిక్ కిలో మీటర్లు ఉండగా.. అందులో 70 శాతం వ్యవసాయానికే వాడుతున్నాం. భూగర్భ జలాలు ఒక మీటరు లోతుకు తగ్గిపోయాయంటే అర్థం ఏమిటంటే.. మరో మీటరు ఎక్కువ లోతులో నుంచి నీరు తోడుకోవాల్సి వస్తున్నదని! ఆ మేరకు విద్యుత్తు ఎక్కువ ఖర్చవడంతోపాటు.. కర్బన వాయు ఉద్గారాలు (ఒక మీటరు లోతు నీటికి 6%) ఎక్కువగా వాతావరణంలోకి వెలువడుతున్నాయి. వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తున్నాయి. నీటిని పొలంలో పారించడం కన్నా డ్రిప్, స్ప్రింక్లర్, రెయిన్గన్లు వాడినప్పుడు.. నీటి వినియోగ సామర్థ్యం సుమారు 30 నుంచి 70 శాతం మేరకు ఉండడమే కాకుండా.. ఇంధనం 12-44 శాతం ఆదా అవుతుంది. కానీ, పంపు ద్వారా నీటిని తోడి.. పంట పొలంలో నీటిని పారగడితే.. అధిక పరిమాణంలో కర్బన వాయు ఉద్గారాల విడుదలకు దోహదం చేస్తుంది. సాధారణంగా వెయ్యి క్యూబిక్ మీటర్ల నీటిని ఒక మీటరు ఎత్తుకు తీసుకెళ్లడానికి గంటకు 2.73 కిలోవాట్ల శక్తి ఖర్చవుతుంది. అడుగంటిన భూగర్భ జలాలను ఒక మీటరు ఎక్కువ లోతు నుంచి తోడడానికి వాడే ఇంధన వనరులు పెరగడం వల్ల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు సుమారు 6 శాతం ఎక్కువ విడుదలయ్యే ప్రమాదం ఉంది. మెరుగైన పద్ధతుల్లో సాగునీటిని వాడడం ద్వారా ఉద్గారాలను 40 శాతం దాకా తగ్గించే వీలుంటుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోని మూడు (తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ) ప్రాంతాల్లో ముఖ్య పంటలైన వరి, మొక్కజొన్న, చెరకు, కూరగాయలు, వేరుశనగలో ఉపరితల నీటి పారుదల, రెయిన్‌గన్, స్ప్రింక్లర్, డ్రిప్ మొదలైన నీటిపారుదల పద్ధతుల నీటి ఉత్పాదకత (వాటర్ ప్రొడక్టివిటీ) ను, ఖర్చయ్యే శకి ్త, వెలువడే కర్బన వాయు ఉద్గారాల (సీఓ2 ఎమిషన్స్)పై చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. బోరు బావుల సంఖ్య క్రమేణా పెరుగుతుంటే, దిగుడుబావుల సంఖ్య తగ్గుతున్నది. భూగర్భ జల అభివృద్ధి సంస్థ పూర్వపు లెక్కల ప్రకారమే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరమూ సుమారు 50 వేల కొత్త బోర్లు వేస్తున్నారు. వరుస కరువులతో ఇప్పుడు డెల్టా ప్రాంతాల్లోనూ బోర్లు జోరుగా వేస్తున్నారు. అయితే, దిగుడు బావితో పోల్చితే బోరు బావి వల్ల రెట్టింపు ఉద్గారాలు వెలువడుతున్నాయి. లైనింగ్ చానళ్ల నీటితో వరి సాగు మేలు: మూడు (తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ) ప్రాంతాల్లోనూ వరిని నీటిని నిల్వగట్టే పద్ధతిలో పండిస్తుంటారు. ఈ పద్ధతిలో ఎక్కువ ఉద్గారాలు వెలువడతాయి. బోరుబావుల నీటితో ఈ పద్ధతిలో వరి సాగు చేసినప్పుడు హెక్టారు (సుమారు రెండున్నర ఎకరాలు)కు, గంటకు 10.36 మెగావాట్ల శక్తి ఖర్చవుతుండగా.. హెక్టారులో నెలకు 1.6 టన్నుల బొగ్గుపులుసు వాయువు విడుదలవుతుంది. అయితే, దిగుడు బావుల నీటి వాడకానికయ్యే విద్యుత్తు ఖర్చు హెక్టారుకు గంటకు 5.18 మెగావాట్లు కాగా, హెక్టారుకు నెలలో 0.8 టన్నుల బొగ్గుపులుసు వాయువు విడుదలవుతున్నట్లు అంచనా. వరిలో నీటిని నిల్వగట్టే పద్ధతిలో నీటి పంపిణీలో సామర్థ్యం 30 శాతం మాత్రమే. కాబట్టి, వరి సాగుకు బోరు, దిగుడు బావుల నీటి వాడకాన్ని తగ్గించి, లైనింగ్ ఉన్న చానళ్లతో కాలువ నీటిని వాడితే.. వెలువడే ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చు. కోస్తాలో బోర్ల కింద మొక్కజొన్న: నీటిని పారించే పద్ధతిలో బోరు బావుల నీటితో మొక్కజొన్న పండిస్తే సాగునీటి పంపిణీ సామర్థ్యం 30 శాతానికి తగ్గింది. గంటకు హెక్టారుకు 4.53 మెగావాట్ల విద్యుత్తు ఖర్చయింది. హెక్టారుకు నెలకు 1.05 టన్నుల బొగ్గుపులుసు వాయువు ఉద్గారాలు వెలువడుతున్నట్లు అధ్యయనంలో తెలిసింది. కానీ, రెయిన్‌గన్, స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా.. బోరుబావి నీటితో మొక్కజొన్న పండిస్తే నీటి వాడుక సామర్థ్యం 35 నుంచి 37.5 శాతం దాకా పెరుగుతుంది. హెక్టారుకు గంటకు 3.63 నుంచి 3.87 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఖర్చవుతుందని అధ్యయనంలో తేలింది. తద్వారా బొగ్గు పులుసు వాయువు ఉద్గారాలు నెలకు హెక్టారుకు సుమారు 0.80 నుంచి 0.91 టన్నులకు తగ్గింది. ఇక దిగుడు బావుల నీటితో మొక్కజొన్న పండిస్తే విద్యుత్తు వాడకం, ఉద్గారాల బెడద సగానికి సగం తగ్గిపోతుంది. కోస్తాంధ్రలో మొక్కజొన్నను బోరు బావుల కింద రెయిన్‌గన్ లేదా స్ప్రింక్లర్లతో సాగు చేయడం ఉత్తమం. డ్రిప్‌తో చెరకు సాగు ఉత్తమం: తెలుగు రాష్ట్రాల్లోనూ చెరకు పంట ఎక్కువగా బోరుబావుల నీటితోనే పండిస్తున్నారు. డ్రిప్‌తో చెరకు సాగు చేస్తే 31.1 శాతం మేరకు ఉద్గారాలు తగ్గించవచ్చు. చెరకు పంటలానే కూరగాయలను ఎక్కువగా బోర్ల కిందే పండిస్తున్నారు. నీటిని పారించే పద్ధతిలో కూరగాయలను పండిస్తే హెక్టారుకు నెలకు సుమారు 1.47 టన్నుల ఉద్గారాలు వెలువడే ప్రమాదం ఉంది. రెయిన్ గన్‌తో 14%, స్ప్రింక్లర్తో 18%, డ్రిప్‌తో 26.3% మేర ఉద్గారాలను తగ్గించే వీలుంది. వేరుశనగకు స్ప్రింక్లర్లు మేలు: రాయలసీమ, తెలంగాణలలో ఒకానొక ముఖ్య పంట వేరుశనగ. నీటిని పారించే పద్ధతిలో నెలకు హెక్టారుకు 800 కిలోల ఉద్గారాలు వెలువడతాయి. రెయిన్గన్లు వాడి 13% వరకు, స్ప్రింక్లర్లు వాడి 16% మేరకు ఉద్గారాలు తగ్గించుకోవచ్చు. ఈ మూడు ప్రాంతాల్లోనూ వరిని ఆరుతడి పంటగా, శ్రీ పద్ధతిలో సాగు చేయడం మేలు. మొక్కజొన్న, వేరుశనగ పంటలను బోరుబావుల కింద పండించేటప్పుడు స్ప్రింక్లర్లు లేదా రెయిన్గన్లు వాడటం ఉత్తమం. చెరకు, కూరగాయలను డ్రిప్ ద్వారా పండిస్తే నీటిని ఆదా చేయడంతోపాటు ఉద్గారాలను తగ్గించవచ్చు. కూరగాయలను డ్రిప్‌తో పండిస్తే ఉద్గారాలు తగ్గుతాయి. (డా. శ్రీనివాసరెడ్డి ఫోన్: 99480 71805 ఈ మెయిల్ ksreddy.1963@gmail.com) ‘కర్బన ఉద్గార ముద్ర’ అంటే? ఒక ప్రాంతంలో మనుషులు చేసే పనుల వల్ల ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్హౌస్ వాయువుల మొత్తాన్ని బొగ్గు పులుసు వాయు సమాన పరిమాణంలో చెప్పడాన్ని ‘కర్బన వాయు ఉద్గార ముద్ర (సీఓ2 ఫుట్ ప్రింట్)’ అంటారు. ఆయా ప్రాంతాల్లో పండించే వివిధ పంటలు, నీటిపారుదల పద్ధతులను బట్టి వాటి కర్బన వాయు ఉద్గార ముద్రను అంచనా వేయవచ్చు. -
వద్దంటే వాన..!
► తీవ్రమవుతున్న కలుపు, చీడపీడల సమస్యలు ► జిల్లాలో 1,14, 480 హెక్టార్లలో పంటల సాగు కర్నూలు(అగ్రికల్చర్): తేమ ఆరని విధంగా వర్షాలు పడుతుండటంతో పంటల్లో కలుపు, చీడపీడల సమస్యలు పెరుగుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 6.21 లక్షల హెక్టార్లు. ఈ నెల 25 వరకు 1,14,480 హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేశారు. వేరుశనగ, కంది ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యాయి. ఇప్పటి వరకు వేరుశనగ 40,583, కంది 34,390 హెక్టార్లలోను సాగు అయ్యాయి. పత్తి సాగు 23,121 హెక్లార్లకే పరిమితం అయింది. ఈ పంటల్లో ఒకవైపు కలుపు సమస్య, మరోవైపు పురుగులు, తెగుళ్లు ప్రబలడంతో రైతులు వాటిని నివారించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.2 మిమీ ఉండగా 150.4మిమీ వర్షపాతం నమోదు అయింది. బనగానపల్లె, కోడుమూరు మినహా మిగిలిన అన్ని మండలాల్లో సాధారణాన్ని మించి వర్షాలు కురిశాయి. నందవరంలో సాధారణం కంటే 338 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కొత్తపల్లిలో అత్యధికంగా 28.2 మిమీ వర్షపాతం నమోదైంది. -
ఆశల సాగు
కరుణించిన వరుణుడు ఊపందుకున్న వ్యవసాయ పనులు వేరుశనగ, వరి నాట్లలో బిజీబిజీ మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఖరీఫ్ ప్రారంభంలోనే వరుణుడు పలకరించడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పటికే 40వేల హెక్టార్లలో వేరుశనగ విత్తగా, మరో 30వేల హెక్టార్లలో వరి నాట్లు వేసేందుకు సన్నద్ధమయ్యారు. చెరుకు, కూరగాయలు, చిరుధాన్యాల పంటల సాగుకూ దుక్కులు సిద్ధం చేస్తున్నారు. చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. పది రోజుల కిందట కురిసిన వర్షాలకు సిద్ధమైన దుక్కుల్లో వేరుశనగ విత్తడం మొదలు పెట్టారు. మరికొన్ని చోట్ల అడుసు దుక్కులు సిద్ధం చేసి నాట్లువేసేందుకు సమాయత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 2.11 లక్షల హెక్టార్ల వరకు సాగుచేయాల్సి ఉంది. వ ర్షాధార వాణిజ్య పంటగా 1.36 లక్షల హెక్టార్లలో వేరుశనగ, 75 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. ఊపందుకున్న వేరుశనగ విత్తే పనులు వేరుశనగ పంట అత్యధికంగా పడమటి మండలాల్లో సాగవుతోంది. ఈ నెల మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో దుక్కులు సిద్ధం చేశారు. ఇందుకు తగ్గట్టుగా ఖరీఫ్ ప్రారంభంలోనే వ్యవసాయశాఖ అధికారులు సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు 75 వేల క్వింటాళ్ల వరకు పంపిణీ చేయడంతో రైతులు దాదాపు 40 వేల హెక్టార్లలో వేరుశనగ విత్తేశారు. ఆ తర్వాత రెండు వారాలపాటు వర్షాలు కనుమరుకు కావడంతో వ్యవసాయ పనులు కొంత మందగించాయి. మళ్లీ చిగురించిన ఆశ నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వేరుశనగతోపాటు వివిధ పంటల సాగుపై ఆశలు చిగురించాయి. ఇప్పటికే సిద్ధంగా ఉన్న దుక్కుల్లో వేరుశనగ విత్తడం మొదలు పెట్టారు. దీంతోపాటు వివిధ రకాల పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. 30వేల హెక్టార్లలో వరి సాగు జిల్లాలో వరి సాగుకు రైతులు అత్యధికంగా మొగ్గుచూపుతున్నారు. ఖరీఫ్‌లో 13 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వరి సాగుచేయాల్సి ఉండగా ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో దాదాపు 30 వేల హెక్టార్లలో వరినాట్లు వేసేందుకు సిద్ధమైనట్టు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన 40 వేల హెక్టార్లలో చెరుకు, కూరగాయలు, చిరుధాన్యాల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. -
ఫసల్‌బీమా వర్తింపజేయాలి
► వేరుశనగ రైతులను ఆదుకోవాలి ► రైతుసంఘం నాయకుల డిమాండ్ ► సీపీఐ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం అనంతపురం అగ్రికల్చర్/ అర్బన్ : ఫసల్ బీమా యోజనను వేరుశనగ పంటకు వర్తింపజేయకపోవడంపై వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ అనుబంధ రైతుసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా వేరుశనగ సాగు చేసే జిల్లా అనంతపురమని, ఇక్కడ తరచూ కరువు పరిస్థితుల వల్ల రైతులు పంట నష్టపోతూనే ఉన్నారని పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న వాతావరణ ఆధారిత పంటల బీమా వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగమూ లేకుండా ఉందని తెలిపాయి. ఈ పరిస్థితుల్లో అంతోఇంతో ప్రయోజనం ఒనగూరే ఫసల్‌బీమాను వేరుశనగ పంటకు వర్తింపజేయాల్సిందేనని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. జిల్లాలో భారీస్థాయిలో పరిహారం అందించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే వేరుశనగ పంటను బీమా జాబితా నుంచి తప్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులేడు రామచంద్రారెడ్డి విమర్శించారు. ఫసల్‌బీమా వర్తింపజేయకపోతే జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. అంతేకాకుండా వాతావరణ బీమా పథకాన్నే కొనసాగిస్తూ ప్రీమియం మొత్తాన్ని రూ.530 నుంచి రూ.750కు పెంచేశారని, ఇది రైతులపై మరింత భారం మోపడమేనని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ఫసల్‌బీమా యోజనలో వేరుశనగ పంటను చేర్చకపోవడాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని టవర్‌క్లాక్ వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పథకంలో వేరుశనగని చేర్చేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ పంట ప్రధానంగా పండిస్తున్నారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోకుండా వేరుశనగ పంటని బీమా నుంచి మినహాయించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి, నగర కార్యదర్శి లింగమయ్య తదితరులు పాల్గొన్నారు. ఫసల్తో భరోసా కల్పించాలి వరుస కరువులతో కుదేలవుతున్న వేరుశనగ రైతులకు ఫసల్ బీమా యోజన వర్తింపజేసి భరోసా కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలో అత్యధికంగా పండించే వేరుశనగని ఫసల్ బీమాలో చేర్చకుండా పత్తిపంటను చేర్చడం వెనుక ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోందన్నారు. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు. ఫసల్ బీమాలో వేరుశనగను చేర్చాలి ఫసల్ బీమా యోజనలో వేరుశనగ పంటని చేర్చాలని సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం స్థానిక గణేనాయక్ భవన్లో సంఘం నాయకులతో కలిసి జిల్లా కార్యదర్శి పి.పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వేరుశనగని ఫసల్ బీమా యోజనలో చేర్చితే రైతుకు న్యాయం జరుగుతుందన్నారు. పథకంలో వేరుశనగ పంట చేర్చే విషయంపై జిల్లా మంత్రులు స్పందించాలన్నారు. సమావేశంలో సహాయ కార్యద ర్శులు జంగాలపల్లి పెద్దన్న, చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు తలారి రామాంజినేయులు, నాగేశ్, కదిరప్ప, తదితరులు పాల్గొన్నారు. -
విత్తు కొనలేక
అందుబాటు లేని సబ్సిడీ వేరుశనగ విత్తన కాయల ధరలు కాయలతో పాటు జిప్సం కొనాలంటున్న అధికారులు ప్రారంభంలోనే తడిసి మోపెడవుతున్న పెట్టుబడులు వేరుశనగ విత్తన కాయలను రైతులు కొనలేకపోతున్నారు. రాయితీపై అందిస్తున్న కాయలకు ప్రభుత్వం అధిక ధర నిర్ణయించింది. మరోవైపు తప్పని సరిగా జిప్సం కొనుగోలు చేయాలని అధికారులు మరింత భారం మోపుతున్నారు. విత్తన విక్రయ కేంద్రాల వైపు వెళ్లేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఆ కేంద్రాలన్నీ వెలవెలపోతున్నాయి. ప్రారంభంలోనే పెట్టుబడి తడిసి మోపెడవుతుండడంతో ఆశించిన మేర సాగుచేయలేమని రైతులు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు (అగ్రికల్చర్): ప్రతి ఏటా జిల్లా రైతులు ఖరీఫ్ సీజనులో వర్షాధార పంటగా వేరుశనగ సాగుచేస్తారు. ఈ ఏడాది ముందస్తుగా తొలకరి వర్షం కురిసింది. 1.36 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటికే 50 శాతం మంది రైతులు దుక్కులు సిద్ధం చేసుకుని సాగుకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వం రాయితీపై అందించే విత్తన కాయల ధరలు అధికంగా ఉండడంతో అన్నదాతల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ధర అధికం.. జిప్సం తప్పనిసరి ప్రయివేటు మార్కెట్లో కిలో వేరుశనగ విత్తన కాయలు రూ.52ల ధరతో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కిలో కాయలకు రూ.50 చొప్పున ధర నిర్ణయించింది. ఆ లెక్కన 30 కిలోల బస్తా రూ.1,500కు అందిస్తోంది. వేరుశనగ విత్తన కాయలతో పాటు ప్రతి రైతు తప్పనిసరిగా రెండు క్వింటాళ్ల మేరకు జిప్సం కొనుగోలు చేయాలని మరో మెలిక పెట్టింది. మోయలేని భారం ఎకరాకు రూ. 3,361లు వెచ్చించాలి. ఈ లెక్కన దుక్కులు దున్నడం నుంచి పంట చేతికందే వరకు ఎకరాకు కనీసం రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సివస్తోంది. ఒకవేళ ఆమేరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనా ప్రకృతివైపరీత్యాలతో ఆశించిన మేరకు దిగుబడి వస్తుందని నమ్మకం లేదు. దీంతో ఆలోచనలో పడ్డ రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ కాయలను కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. వేరుశనగ సాగుచేయాలంటే రైతులు ఆరంభంలోనే అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఎకరా సాగు చేయాలంటే రెండు బస్తాల విత్తనకాయలకు రూ.3 వేలు అవుతుంది.రెండు క్వింటాళ్ల జిప్సంకు రూ.336లు, విత్తనశుద్ధి మందుకు రూ.25లు వంతున ప్రారంభంలోనే ఎకరాకు రూ. 3,361లు వెచ్చించాలి. ఈ లెక్కన దుక్కులు దున్నడం నుంచి పంట చేతికందే వరకు ఎకరాకు కనీసం రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సివస్తోంది. ఒకవేళ ఆమేరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనా ప్రకృతివైపరీత్యాలతో ఆశించిన మేరకు దిగుబడి వస్తుందని నమ్మకం లేదు. దీంతో ఆలోచనలో పడ్డ రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశనగ కాయలను కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఈ ధర గిట్టుబాటు కాదు ప్రభుత్వం ఇస్తున్న వేరుశనగ కాయల ధర ఎక్కుగా ఉంది. ఇదే ధరకు బయట మార్కెట్లో కూడా కాయలు దొరుకుతున్నాయి. ప్రభుత్వం అందించే సబ్సిడీ పేరుకు మాత్రమే. -కె.సుబ్రమణ్యం, రైతు, బలిజపల్లి, పెనుమూరు మండలం జిప్సం బలవంతంగా ఇస్తున్నారు జిప్సం కొంటేనే విత్తన కాయలను ఇస్తామని అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేదిలేక అధిక భారమైనా కాయలతో పాటు జిప్సం కొన్నాను. -మార్టిన్, కౌలు రైతు, వసంతాపురం, గుడిపాల మండలం -
జోరుగా నకిలీ దందా
►రైతులకు కుచ్చుటోపీ.. ►అనుమతి లేని వేరుశనగ విత్తనాల విక్రయం ►పట్టించుకోని అధికారులు దుగ్గొండి : గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు నకిలీ వేరుశనగ విత్తనాలు అంటుగడుతున్నారు. ఇవి నాణ్యమైన విత్తనాలని, ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నామని చెపుతూ అనుమతి లేని సీడ్స్‌ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని మహ్మదాపురం గ్రామంలో స్థానికంగా ఉండే ఓ ఫెర్టిలైజర్ షాపు డీలర్ ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి ట్యాగ్-24 రకం వేరుశనగ విత్తనాలంటూ రైతులకు మాయమాటలు చెప్పి వాస్తవ ధరకన్నా రూ.600 పెంచి అమ్ముతున్నాడు. ఎలాంటి బిల్లులు ఇవ్వడం లేదు. ఇప్పటికే గ్రామంలో వెయ్యి బస్తాల(దాదాపు 300 క్వింటాళ్ల) విత్తనాలు విక్రయించినట్లు తెలిసింది. అయితే కర్నూలు విత్తనాలు అని చెప్పి వరంగల్ మార్కెట్ పరిధిలోని ఓ వేరుశనగ వ్యాపారి వద్ద కొనుగోలు చేసి ట్యాగ్ -24 పేరుతో ముద్రించిన బ్యాగుల్లో నింపి విక్రయిస్తున్నాడని సమాచారం. అధిక ధరకు నాణ్యతలేని విత్తనాలు విక్రయిస్తున్నారని వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి దయాకర్‌ను వివరణ కోరగా ఇతర ప్రాంతాల నుంచి వేరుశనగ విత్తనాలు తెచ్చి విక్రయిస్తున్నారని గత రెండు రోజుల క్రితమే రైతుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. బిల్లులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేస్తే తమ బాధ్యత లేదన్నారు. చట్టవిరుద్ధంగా విత్తనాలు విక్రయిస్తున్న డీలర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఖరీఫ్‌కు అరకొర కేటాయింపులు
► విత్తన గండం ► జిల్లా అధికారుల ప్రతిపాదన ► 77111.56 క్వింటాళ్లు మంజూరు 43700 క్వింటాళ్లే.. ► వేరుశనగ 35వేల క్వింటాళ్లకే పరిమితం ► పెట్టుబడుల సమస్య తీవ్రం కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ నెల రోజుల క్రితం నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా ఖరీఫ్‌కు విత్తన కొరత పొంచి ఉంది. పత్తికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలపై మొగ్గు చూపుతున్నా.. విత్తన కేటాయింపులు అంతంత మాత్రమే కావడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఖరీఫ్ సాధారణ సాగు 6,21,156 హెక్టార్లు. వర్షాలు సక్రమంగా కురిస్తే 7లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. గత ఏడాది ఎప్పుడూ లేని విధంగా పత్తిని గులాబిరంగు పురుగు తీవ్రంగా నష్టపరచడంతో ఈసారి రైతులు ఆ పంటకు దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయంగా కొర్ర, వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పెట్టుబడి తక్కువ పంటలపై మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ సీజన్‌కు 77111.56 క్వింటాళ్ల విత్తనాలు ఇవ్వాలని జిల్లా అధికారులు వ్యవసాయ శాఖ కమిషనర్‌ను కోరగా 43,700 క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. ఖరీఫ్‌లో వరి 79,018 హెక్టార్లు.. మొక్కజొన్న 30154 హెక్టార్లు.. కంది 48,228 హెక్టార్లు.. ఆముదం 4,406 హెక్టార్లు.. పత్తి 1,92,248 హెక్టార్లు.. వేరుశనగ 1,04,237 హెక్టార్లు.. ఉల్లి 20746 హెక్టార్లు.. కొర్ర 13613 హెక్టార్లు, జొన్న 14062 హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది. వేరుశనగ కేటాయింపు 35వేల క్వింటాళ్లే.. ఖరీఫ్‌లో వేరుశనగ 1.04 లక్షల హెక్టార్లు సాగవనుంది. హెక్టారుకు రెండు క్వింటాళ్ల వేరుశనగ అవసరం. గత ఏడాది వర్షాభావం వల్ల వేరుశనగ దిగుబడి తగ్గింది. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేసే వేరుశనగపైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లాకు కనీసం లక్ష క్వింటాళ్లు అవసరం కాగా.. జిల్లా వ్యవసాయ అధికారులు 62,499 క్వింటాళ్లు కావాలని కోరారు. అయితే ప్రభుత్వం కె-6 రకం 15వేల క్వింటాళ్లు, కె-9 రకం 6వేలు, ధరణి రకం 10వేలు, అనంత రకం 4వేల క్వింటాళ్ల చొప్పున మొత్తం 35వేల క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. ఇవి 25వేల హెక్టార్లకు కూడా సరిపోని పరిస్థితి. ఇక పచ్చిరొట్ట ఎరువులయిన పిల్లిపెసర, దయంచ విత్తనాలు కూడా అంతంతమాత్రంగానే కేటాయించారు. ఖరీఫ్‌లో వేరుశనగ డిమాండ్ దృష్ట్యా కొందరు దళారీలు రైతుల వద్ద కొని సిద్ధం చేసుకున్నారు. విత్తన సమయంలో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వేరుశనగ సేకరణపై మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్, ఏపీ సీడ్స్ ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడం గమనార్హం. ఖరీఫ్‌కు 3,32,054 టన్నుల ఎరువులు ఖరీఫ్ సీజన్‌కు 3,32,054 టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు కమిషనర్‌కు నివేదించారు. యూరియా 111255 టన్నులు, డీఏపీ 64474 టన్నులు, ఎంఓపీ 16200 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 140125 టన్నులు అవసరం అవుతాయని ప్రతిపాదించారు. రైతులకు పంట రుణాలు దక్కేనా.. రైతులకు ప్రధాన సమస్య పెట్టుబడులు. వరుస కరువు నేపథ్యంలో ఈసారి పెట్టుబడులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి బ్యాంకులపైనే. ఖరీఫ్‌లో రూ.2794.65 కోట్లు.. రబీలో రూ.1333.25 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు రైతులకు రుణాలు దక్కుతాయా అనేది ప్రశ్నార్థకం. -
ఈ-పాస్ ద్వారా విత్తన వేరుశనగ పంపిణీ
ఏప్రిల్ మొదటికి 3.90 లక్షలక్వింటాళ్లు సేకరించాలి కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం అగ్రికల్చర్ : ఈ సారి ఖరీఫ్‌లో ఈ-పాస్ విధానం ద్వారా రైతులకు రాయితీ విత్తన వేరుశనగ పంపిణీకి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోనశశిధర్ వ్యవసాయ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తిని ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక రెవెన్యూభవన్‌లో విత్తన సేకరణ, పంపిణీ అంశంపై జేసీ-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్‌తో కలిసి వ్యవసాయశాఖ, సేకరణ ఏజెన్సీలు, ఎన్జీవోలతో సమీక్షించారు. అర్హులైన ప్రతి రైతుకూ 33 శాతం రాయితీతో 90 కిలోల(మూడు బస్తాలు) చొప్పున విత్తనకాయలు అందజేసేందుకు ఈ సారి కొత్త పద్ధతి అవలంబించనున్నట్లు తెలిపారు. ఎఫ్పీ షాపుల్లో మాదిరి ఆన్లైన్ బయోమెట్రిక్, ఈ -పాస్ పద్ధతి ద్వారా చేపట్టేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ సారి జిల్లాకు కేటాయించిన 3.90 లక్షల క్వింటాళ్ల కే-6, కే-9, ధరణి రకాల విత్తనకాయలను ఏప్రిల్ మొదటి నాటికి నిల్వ చేయాలని సేకరణ ఏజెన్సీలైన ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్‌లను ఆదేశించారు. గతేడాది విత్తన సేకరణ ఆలస్యం కావడంతో పంపిణీ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ఈసారి అవి పునరావృతం కాకుండా ఉండాలంటే ముందస్తుగా సరఫరా చేయాలన్నారు. ప్రస్తుత రబీలో కమ్యూనిటీ మేనేజ్మెంట్ సీడ్ సిస్టం (సీఎంఎస్ఎస్) కింద సాగు చేసిన వేరుశనగ ద్వారా 63,900 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ఇది జిల్లా సరిహద్దులు దాటకుండా ఇక్కడే కొనుగోలు చేయాలని ఆదేశించారు. విత్తన సేకరణ, పంపిణీ ప్రక్రియ ఈ సారి సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీడీఏలు, ఏడీఏలు, ఏవోలు, సేకరణ ఏజెన్సీల అధికారులు, ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మెత్తని కత్తి... మైదా!
తిండి గోల ఆరోగ్యం బాగా లేకపోతే బ్రెడ్ తినిపిస్తాం. పుట్టిన రోజుకు కేక్ కట్ చేసి సంబరం చేసుకుంటాం. పండగ రోజున కాజానో, బొబ్బట్లో, గులాబ్జామూన్తోనో ఆనందాన్ని పంచుకుంటాం. బ్రెడ్, కేక్, గులాబ్‌జామూన్ ... వీటి తయారీలో మైదా అనే ఒక మృదువైన పిండిపదార్థాన్ని వాడతారు. బాగానే ఉంది కానీ, ఈ పిండిని ఎలా తయారుచేస్తారో తెలుసా! గోధుమలను మిల్లులో బాగా పాలిష్ చేసి, రసాయనాలు కలిపి దీనిని తయారుచేస్తారు. రసాయనాల వల్ల పిండి బాగా తెల్లగా, మెత్తగా మారిపోతుంది. దీంతో దీనిని బ్లీచ్డ్, రిఫైండ్ ఫ్లోర్ అని కూడా అంటుంటారు. మైదాలో అలొక్సన్ అనే విషపూరితమైన రసాయనం వాడుతారని, అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుందని, దీనిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యసమస్యలు వస్తాయనే విమర్శలు అంతటా అధికంగా ఉన్నాయి. మైదాలో ఉపయోగించే రసాయనాలపై చైనాలో కొన్నేళ్ల క్రితం నుంచే నిషేధం ఉంది. మైదా మధ్య, ఉత్తర ఆసియా వంటకాలలో అధికంగా వాడతారు. మన దగ్గరైతే వాల్‌పోస్టర్లు అతికించడానికీ,. పరోటాలు చేయడానికీ మైదానే ఉపయోగిస్తారు. అలాగే బేకరీ పదార్థాలలోనూ మైదా అధికంగా వాడతారు. గోధుమలను ఎక్కువగా పండించే యూరప్, అమెరికా దేశాలలో ఈ పిండిని అధికంగా ఉపయోగిస్తారు. క్రీ.స్తు పూర్వం 6 వేల ఏళ్ల క్రితమే ఈ దేశాలలో పిండి వాడకం ఉంది. పారిశ్రామిక రంగం ఊపందుకున్న నాటి నుంచి మరీ ముఖ్యంగా 1940 నుంచి 1990ల కాలంలో పిండి నిల్వ ఉండటానికి ఎన్నో పద్ధతులు అవలంబిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మైదా మరింత మెత్తగా మన ఆరోగ్యాన్ని కోస్తూ వస్తోంది. కాబట్టి, మైదాతో తయారయ్యే పదార్థాలను తీసుకోవడం కొంత తగ్గించడమే మేలు. -
దుర్భిక్షం.. దండయాత్ర
జిల్లాలో కరువు రక్కసి కరాళ నృత్యం చేస్తోంది.. ఏ రైతును కదిపినా కన్నీళ్లే. ఇలాంటి కరువు ఎప్పుడూ చూడలేదంటూ నిట్టూర్పులే. పది మందికి పట్టెడన్నం పెట్టే అన్నదాతలు, కూలీలుగా మారుతున్నారు. కనీసం ఉపాధి పనులు కూడా దొరక్క పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు. - వరుస కరువులతో అన్నదాత కుదేలు - ఎండుతున్న వేరుశనగ - తీవ్ర మవుతున్న పశుగ్రాసం కొరత - కబేళాలకు తరలుతున్న పశువులు - ప్రభుత్వ చేయూత కరువు - పడమటి మండలాల్లో సాగు దారుణం - కుప్పం నియోజక వర్గంలో - భారీ సంఖ్యలో వలసలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఈ ఏడాది వర్షాలు రైతన్నను ఊరించి ఉసూరుమనిపించాయి. అప్పులు చేసి.. అష్ట కష్టాలు పడి వేరుశనగ పంటసాగు చేసిన రైతుకు చివరకు అప్పుల మూటే మిగిలింది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడులు నామమాత్రంగానే వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చివరకు అన్నదాతకు గుండె కోతను మిగుల్చుతున్నాయి. సీఎం సొంత ఇలాకా కుప్పంలోనే భారీ సంఖ్యలో వలసలు ఉండటం గమనార్హం. ఇంకా జిల్లాలో వలసలు పడమటి మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. మూగ జీవాలకు సైతం పశుగ్రాసం లేక కబేళాలకు తరలుతున్నాయి. ప్రభుత్వం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. కొంతమంది ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లి గడ్డి తెచ్చుకుని పశువులను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితిని తలుచుకుని పాడి రైతు తల్లడిల్లిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడి చెట్లు సైతం నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికే 10 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఎండిపోయాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమి పట్టదన్నట్లు వ్యవహారిస్తోంది. ప్రత్యామ్నాయమే శరణ్యం... - ఆగస్టు నెలలో 117.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవా ల్సి ఉండగా 109.7మిల్లిమీటర్ల వర్షపాతం కురిసింది. - జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో ఎన్నడూ లేని రీతిలో 1500 అడుగుల మేరకు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న 80 శాతం మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. - సకాలంలో వర్షాలు కురవకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు వేరుశనగ పంటను వేయలేకపోయారు. - దీంతో ప్రత్యామ్నాయంగా ఉలువలు, పెసలు, ఉద్దులు జొన్నలు రాగి పంటలను సాగు చేస్తున్నారు. - తూర్పు ప్రాంతాల్లో... ఎన్నడూ లేని విధంగా తూర్పు మండలాల్లో సైతం తాగు నీటి ఎద్దడి నెలకొంది. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసే పరిస్థితులు నెలకొన్నాయి. - తొట్టంబేడు, బీఎన్ కండ్రిగ, వరదయ్య పాళ్యం సత్యవేడు మండలాల్లో వరి సాగు గణనీయంగా తగ్గింది. జిల్లాలో తూర్పు మండలాల్లో ఖరీప్‌లో వరి పంటను 15,365 హెక్టార్లల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 6132 హెక్టారుల్లో మాత్రమే సాగు చేశారు. - సరైన సమయం వర్షలు కురవకపోవడంతో వరి నారు పోసేందుకు రైతులు మొగ్గుచూపడం లేదు. ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎండుతున్న పంటలు... - వేరుసెనగ పంట 1,38,375 హెక్టార్లకు గానూ 1,05,869 హెక్టార్లలో సాగు చేశారు. ఇటీవల కురిసిన అరకొర వర్షానికి పైరు పచ్చగా మారిన కాయలు మాత్రం శూన్యం. - 2.2 లక్షల హెక్టార్లలో మామిడి, 1 హెక్టారు దానిమ్మ, 1 హెక్టారు చీనీ, 1 హెక్టారు జామ, 1 హెక్టారు అరటి, 1 హెక్టారు బొప్పాయి పంటలు జిల్లాలో సాగులో ఉన్నాయి. బోరుబావుల్లో నీరు అడుగంటడంతో రైతులు చెట్లను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. -
పంట పచ్చన.. కాయ పలుచన!
కరువు ప్రభావం జూన్‌లో విత్తిన వేరుశనగకు ఎకరాకు దిగుబడి వచ్చేది 2 బస్తాలే జూలై పంటకు వర్షాలు కురిస్తేనే ప్రయోజనం జిల్లాలోని పడమటి మండలాల రైతులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పంట పచ్చగా కనిపిస్తున్నా అందులో కాయల్లేవు.ఇలాంటి పచ్చ కరువును ఎప్పుడూ చూడలేదనిరైతులు వాపోతున్నారు. పంటలపై పెట్టిన పెట్టుబడి కొద్దిగానైనా చేతికందే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యవసాయాధికారులూ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.రైతులు ఎకరాకు రూ.10 వేలకుపైగా పెట్టుబడిని నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి వర్షాభావమే కారణమని స్పష్టమవుతోంది. బి.కొత్తకోట : ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలోని పడమటి ప్రాంతాల రైతులు వేరుశనగ సాగుమీదే ఆధారపడ్డారు. మే చివర్లో కురిసిన వర్షానికి పంట సాగుచేసుకోవచ్చని ఆనందపడ్డారు. ఈ నేపథ్యంలోనే జూన్‌లో వేరుశనగ పంటను విత్తారు. జిల్లా వ్యాప్తంగా 2,07,502 హెక్టార్ల సాధారణ సాగులో వేరుశనగ పంట 1,36,375 హెక్టార్లలో సాగు చేయాలి. కానీ 1,07,528 హెక్టార్లలో పంటను సాగుచేశారు. ఇందులో అధిక విస్తీర్ణం పడమటి మండలాలదే. జూన్‌లో తొలివిడత, జూలైలో రెండో విడత కలుపుకొని మూడు విడతల్లో పంటను సాగుచేశారు. ఇందులో జూన్‌లో విత్తిన పంటకు వర్షాభావం వెంటాడింది. నెల రోజులకుపైగా చినుకు రాలలేదు. జూలైలో పంట దిగుబడికి ప్రధానమైన పూతదశ వచ్చింది. ఈ సమయంలో వర్షం అవసరం. అయితే వర్షం కురవకపోవడంతో పూత దెబ్బతింది. ఊడలు పట్టలేదు. పంట దిగుబడి నాశనమైంది. ఈ పంటకు ఆగస్టులో కురిసిన వర్షమే దిక్కయింది. ఈ వర్షం పంటకు ప్రయోజనం చేకూర్చలేకపోయింది. ప్రస్తుతం పదిరోజుల్లో ఒకటికి నాలుగుసార్లు వర్షం కురిసింది. దీనికి పంట పచ్చదనంతో కళకళలాడుతోంది. చూసేవారికి ఈ సారి దిగుబడులు భారీగా వస్తాయని అంచనాలు వేస్తారు. అయితే మొక్కకు ఒక్కటంటే ఒక్క కాయా కనిపించని దుస్థితి. ఎకరాకు కనీసం 7 బస్తాలు, అధికమంటే 12 బస్తాల దిగుబడి దక్కాలి. ఇప్పుడున్న జూన్ నెలలో వేసిన పంట దిగుబడి 2 బస్తాలే. లేదంటే మూడు బస్తాలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెరిగే వీలులేదని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
కదిరి వేరుశెనగకు దేశవ్యాప్త డిమాండ్
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిశోధన సంచాలకులు కదిరి: అనంతపురం జిల్లా కదిరి వేరుశనగ పరిశోధన స్థానంలో కనుగొన్న వేరుశనగ రకాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు రాజారెడ్డి అన్నారు. ఇక్కడి వేరుశనగ రకాలు బెట్టను తట్టుకోవడంతో పాటు అధిక దిగుబడులు ఇస్తాయన్నారు. 60 రోజులు వర్షం రాకపోయినా ఇవి తట్టుకోగలవని తెలిపారు. సోమవారం ఆయన కదిరి పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడి వేరుశనగ రకాలను రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అందుకు విత్తనోత్పత్తిపై దృష్టి సారించామని, ఇందుకోసం ఎన్పీ కుంట మండలంలో ప్రభుత్వం 400 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. అందులో ఇప్పటికే 80 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశామని, మిగిలిన భూమిని చదును చేసే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రూ.60 లక్షలు మంజూరు అయిందని, నాబార్డు ద్వారా మరో రూ. కోటి మంజూరుకు ప్రయత్నిస్తామన్నారు. వేరుశనగ ద్వారా తయారు చేసే తిను బండారాలకు కూడా ఇటీవల మంచి డిమాండ్ ఉందని, మహిళా సంఘాలకు వీటి తయారీలో శిక్షణ ఇప్పించి, కుటీర పరిశ్రమల స్థాపనకు వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. అదే విధంగా 8 లక్షల హెక్టార్లకు పైగా వేరుశనగ సాగు చేసే జిల్లా ఒక్క అనంతపురమేనని, అందుకే వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పలు కళాశాలల స్థాపన ఈ జిల్లాలోనే జరిగితే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కేఎస్ఎస్ నాయక్, శాస్త్రవేత్తలు డాక్టర్ రాజాప్రసన్న, డాక్టర్. వేమన, డాక్టర్.చండ్రాయుడు, డాక్టర్.ప్రత్యూష పాల్గొన్నారు. -
పల్లి... గుండె పాలిటి తల్లి!
ఆహారం విషయంలో చాలామందికి ఒక నమ్మకం ఉంది. ఏ అవయవాన్ని పోలిన ఆహారపదార్థం తింటే... అది ఆ అవయవానికి ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. ఉదాహరణకు క్యారట్‌ను అడ్డంగా కోస్తే కనబడే ఆకృతి అచ్చం కంటి నల్లగుడ్డులోని కనుపాపను చూస్తున్నట్టే ఉంటుంది. అలాగే టమాటాను అడ్డంగా కోస్తే అవి గుండె గదుల్లాగే అనిపిస్తాయి. అందుకే క్యారట్ కంటికి మంచిది. టమాటా గుండెకు మేలు. టమాటాకు తోడుగా ఇప్పుడు పల్లీ కూడా గుండె పాలిట తల్లి కాగలదని పేర్కొంటోంది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రచురించే ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్. పన్నెండేళ్లపాటు సాగిన ఈ అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ పల్లీలు(వేరుశనగలు) తినేవారికి గుండెజబ్బులు వచ్చే రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. ఈ పరిశోధనలో అమెరికన్లు, చైనీయులు పాల్గొన్నారు.గుండెజబ్బుల నివారణ కోసం ఇది అత్యంత చవకైన, తేలికైన, రుచికరమైన, ఉత్తమమైన మార్గమని ఈ అధ్యయనం తేల్చింది. పరిశీలనగా చూస్తే... రెండు గింజల పల్లీ ఆకృతి దాదాపుగా గుండె పైగదీ, కింది గదులను పోలి ఉంటుంది. శాస్త్రీయంగా రుజువు కాకపోయినా, ఆహార పదార్థంతో శరీర అవయవం ఆకృతికీ కొంత మేర సంబంధం ఉన్నట్లే కనబడుతోంది! దేశం పరిశోధనలో పాల్గొన్న గుండె జబ్బుల రిస్క్ వారి సంఖ్య తగ్గిన శాతం అమెరికన్లు 71,764 21% చైనీయులు 1,34,265 17% -
పసుపు, వేరుశనగకు రికార్డు ధర
వరంగల్ సిటీ: వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పసుపు, వేరుశనగకాయకు బుధవారం రికార్డు ధర పలికింది. మార్కెట్‌కు సుమారు 145 క్వింటాళ్ల పసుపు రాగా.. 22 క్వింటాళ్లు తెచ్చిన వంగ రాజు అనే రైతుకు క్వింటాకు రూ.7,601 రికార్డు ధర పలికింది. రెండేళ్లుగా పసుపు మార్కెట్లో క్వింటా ధర రూ.4,500 దాటలేదు. 2012లో మాత్రం క్వింటా పసుపు రూ.9 వేల వరకు ధర పలికింది. కాగా, మార్కెట్‌కు 128 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. రుణావత్ కోటి అనే రైతు తెచ్చిన 16 క్వింటాళ్ల కాయకు క్వింటాకు గరిష్టంగా రూ.5,230 రికార్డు ధర పలికింది. మూడేళ్లుగా వేరుశనగ ధర ఏ రోజు కూడా క్వింటాకు రూ.4,300 దాటలేదు. మొత్తంగా పసుపు, పల్లికాయకు ఈ సీజన్లోనే అత్యధిక రికార్డు ధర పలికినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నారుు. ఈ ధరలు మరో వారంలో మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. -
వేరుశనగలో సస్యరక్షణ
ఆకు ముడత తామర పురుగులు, పచ్చ దోమలు ఆకుల కింది భాగన రసం పీల్చడం వల్ల ఆకులు ముడ్చుకుని మొక్కలు గిడస బారిపోతాయి. ఆకుల అడుగు భాగన గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. తామర పురుగు నివారణకు క్లోరో ఫిరిపాస్ 400 మిల్లీలీటర్లు ఒక లీటర్ వేపనూనెతో కలిసి 200 లీటర్లతో ఎకరానికి పిచికారి చేయాలి. పచ్చదోమ నివారణ కోసం డైమిదేమెట్ 400 మిల్లీలీటర్లు లేదా 300గ్రాముల ఎసిఫేట్ 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఎర్ర గొంగళి పురుగు లార్వ దశలో ఉండే పురుగులు ఆకుల్లో పత్రహరితాన్ని తింటాయి. ఎదిగిన పురుగులు ఆకులను తినేసి కొమ్మలను, మొదళ్లను మాత్రమే మిగుల్చుతాయి. వీటి నివారణకు ప్రధానంగా ఆముదం పంటను ఎరగా వేసి నివారించవచ్చు. లేదా డైమిదేమెట్ 400 మిల్లీ లీటర్లు లేదా 300గ్రాములు మోనోక్రోటోపాస్ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. వేరు పురుగులు ఇసుక నేల ల్లో ఈ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. పురుగులు నేలపై నివసిస్తూ వేర్లను కొరికి వేయడం వల్ల మొక్కలు నిలువుగానే వాడి, ఎండిపోతాయి. వీటి నివారణకు 3జీ గుళికలను ఎకరానికి 10 కేజీలు చల్లాలి. తిక్క మచ్చ తెగుళ్లు తిక్కమచ్చ తెగుళ్లు వేరుశనగ పంటను 30 రోజుల నుంచి ఆశిస్తున్నాయి.ఆకుపై గుండ్రటి మచ్చలు ఏర్పడి గోధుమ రంగులోకి ఆకు మారుతుంది. దీని నివారణకు ఎకరానికి మ్యాంకోజెబ్ 400గ్రాములు, క్లోరోథలిన్ 400గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వేరుకుళ్లు తెగుళ్లు పల్లిలో వేరుకుళ్లు తెగుళ్లు 30రోజుల నుంచి ఆశిస్తుంది. వేరుకుళ్లు తెగుళ్లకు వర్షభావ పరిస్థితులు అనుకూలం. మొదట కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. త ర్వాత నలుపు రంగులోకి మారి వేరు కుళ్లిపోతుంది. నివారణకు ట్రైకోడర్మా పౌడర్‌ను చల్లాలి. లేదా మ్యాంకోజబ్ను 400 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి మొదళ్ల పై చల్లాలి. సకాలంలో తెగుళ్ల లక్షణాలను గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంటలను కాపాడుకోవచ్చు. -
చల్లని వేళ చక్కటి ఆహారం
వేరుశనగలు వేరుశనగల్లో విటమిన్ ఇ, బి3 పుష్కలంగా ఉంటాయి. మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వేరు శన గగింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి పొడిబారకుండా కాపాడుతుంది. పాలకూర ఆకు కూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఇనుము, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ప్రతి రోజు పాలకూరను ఉడికించి లేదా సూపు, రసం రూపంలో తీస్జుకుంటే ఎంతో మంచిది. ఎముకల పటిష్టానికి దోహదం చేస్తుంది. నువ్వులు నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి చక్కటి వేడి లభిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. భోజనం తరువాత నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవడంవల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. నువ్వులవల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. జొన్నలు వారానికి ఒక్క సారైనా జొన్నతో చేసిన ఆహారం తీసుకోవాలి. జొన్నలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కండరాల కదలికలకు బాగా ఉపకరిస్తుంది. జొన్నతో చేసిన పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ. డ్రైఫ్రూట్స్ డ్రైఫ్రూట్స్‌ను చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌లోనూ పోషకాలు మెండుగా ఉంటాయి. చలికాలంలో కావలసిన శక్తి వీటివల్ల లభిస్తుంది. జీర్ణశక్తిని అధికం చేస్తాయి. రక్తాన్ని బాగా శుద్ధి చేస్తాయి. డ్రైఫ్రూట్స్ సహజంగానైనా, ఆహారంలో భాగంగానైనా తీసుకోవచ్చు. దానిమ్మ సకల పోషకాల నిధి దానిమ్మ. రక్తకణాల వృద్ధికి దోహదం చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, ఫాస్పరస్ కావలసినంత లభిస్తాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచి శరీరం అనారోగ్యం బారినపడకుండా కాపాడుతాయి. చిలగడ దుంపలు చక్కటి పోషకాహారం. ఈ దుంపలు శరీరానికి కావలిసిన వేడిని అందిస్తాయి. పిల్లలు, వయోధికులకు ఇది ఎంతో అవసరం. ఈ దుంపల్లో ఉండే పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, సీతో పాటు ఖనిజ లవణాల్ని శరీరానికి అందిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి జల్లుకొని తింటే ఆ మజాయే వేరు. దీంతో చలికాలంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలను నివారించవచ్చు. -
లబోదిబో!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘అనంత' అన్నదాత పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. రుణమాఫీపై ఆశలు అడియాసలయ్యాయి. బకాయిలు చెల్లించలేదంటూ బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వలేదు. రుణాలు ఇచ్చే పరిస్థితి ఎటూ లేకపోవడంతో రైతులు కూడా బ్యాంకులకు వెళ్లలేదు. ఈ క్రమంలోనే వాతావరణబీమా ప్రీమియం సైతం చెల్లించలేకపోయారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రైతులు ప్రీమియం చెల్లించకపోవడంతో బీమా వచ్చే పరిస్థితి లేదు. గతేడాది బీమా సొమ్ము ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. కళ్లెదుట కనిపిస్తోన్న పంట నష్టం...తలకు మించిన భారంగా ఉన్న అప్పులు..‘రుణమాఫీ’ పేరుతో మోసపోయిన వైనం...ఇలా అన్నిరకాలుగా ‘అనంత’ రైతులు నిలువునా మోసపోయారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5.06 ల క్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. వర్షాభావంతో పంట పూర్తిగా ఎండిపోయింది. సాధారణ వర్షపాతం 338 మిల్లీమీటర్లు (మి.మీ) నమోదు కావాల్సి ఉంటే.. 172.7 మి.మీకే పరిమితమైంది. దీనివల్ల పంట పూర్తిగా దెబ్బతినింది. వ్యవసాయాధికారులు కూడా 4.96 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు తేల్చారు. సర్కారు తీరుతో బీమా దూరం.. ‘అనంత’ రైతులను ఏటా అనావృష్టి గానీ, అతివృష్టి గానీ దెబ్బతీస్తోంది. రైతులు ఇన్పుట్ సబ్సిడీ, బీమాపై ఆధారపడి పంటల సాగుకు ఉపక్రమించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మాత్రం బీమా ప్రీమియం చెల్లించకుండానే సాగు చేశారు. తమ ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో అప్పుల ఊబి నుంచి ఉపశమనం లభిస్తుందని రైతులు ఆశపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి ఉంటే జిల్లాలో 6.08 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.3,093 కోట్ల పంట రుణాలతో పాటు బంగారు తాకట్టుపై 2.12 లక్షల మంది తీసుకున్న రూ.1,851 కోట్ల రుణాలు మాఫీ అయ్యేవి. ప్రభుత్వం ఏ ఒక్క రైతుకూ రూపాయి కూడా మాఫీ చేయలేదు. కనీసం రీషెడ్యూలు చేసి కొత్త రుణాలు ఇప్పించేలా బ్యాంకర్లను ఒప్పించలేకపోయింది. ఈ క్రమంలో పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు తేల్చి చెప్పారు. ప్రీమియం కట్టింది కొందరే.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,350 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే.. గతేడాదికి సంబంధించిన రూ.2,600 కోట్ల బకాయిలతో పాటు పాతబకాయిలను రైతులు చెల్లించలేకపోయారు. దీనివల్ల బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వలేదు. ఖరీఫ్‌లో రూ.350 కోట్ల పంట రుణాలు, రూ.400 కోట్ల గోల్డ్లోన్లు మాత్రమే ఇచ్చారు. ఏటా రైతులు పంట రుణాలు తీసుకునే డబ్బులోనే బీమా ప్రీమియాన్ని బ్యాంకర్లు మినహాయించుకునేవారు. ఈ ఏడాది రుణాలు తీసుకోకపోవడంతో ప్రీమియం చెల్లించే వెసులుబాటు లేకుండా పోయింది. ప్రీమియం మాత్రమే చెల్లిం చేందుకు రైతులు ముందుకెళ్లగా.. చాలాచోట్ల బ్యాంకర్లు స్వీకరించలేదు. ఫలి తంగా ఈ ఏడాది 17 శాతం మంది రైతు లు మాత్రమే వాతావరణ బీమా ప్రీమియాన్ని చెల్లించారు. త క్కిన 83 శాతం మంది బీమాకు దూరమయ్యారు. ప్రభుత్వం రుణమాఫీ చేసినా లేదా కొత్త రుణా లు ఇప్పించగలిగినా ఈ ఏడాది రైతులకు వాటిల్లిన రూ.1,600 కోట్ల పంట నష్టం లో కొంతమేర అయినా భర్తీ అయ్యేది. ఇది మరో రకమైన మోసం 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.220 కోట్ల వాతావరణ బీమా మంజూరైంది. ఈ మొత్తం విడుదలై నెల రోజులు దాటింది. అక్టోబరు 20లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని జిల్లా మంత్రులు ప్రకటించారు. ఇప్పటికీ అతీగ తీ లేదు. బీమా సంస్థ నుంచి విడుదలైన సొమ్ము నెలరోజుల పాటు రైతుల ఖాతా ల్లో జమ చేయకుండా బ్యాంకర్లు ఆపేం దుకు వీల్లేదు. అయితే.. బీమా సొమ్మును పాతబకాయిల కింద జమ చేసుకుంటున్నారు. -
జిప్సంతో దిగుబడులు అధికం
ఖమ్మం వ్యవసాయం : నూనె గింజల పంటలలో వేరుశనగ ప్రధానమైనది. ప్రస్తుత రబీలో జిల్లాలో సుమారు ఆరువేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. నీటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో వేరుశనగను రబీ పంటగా సాగు చేసే అవకాశం ఉంది. జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, బోనకల్లు, చింతకాని, మధిర, గార్ల, బయ్యారం, ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, రూరల్, టేకులపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, ముల్కలపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు తదితర మండలాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. వేరుశనగకు జిప్సం ప్రాముఖ్యతపై జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్ కుమార్(99896 23813), డాక్టర్ యం.వెంకట్రాములు(89856 20346), ఆర్. శ్రీనివాసరావు(83329 51138) వివరించారు. కాల్షియం లోపంతో అంతంత మాత్రంగా దిగుబడులు వేరుశనగలో కాయ బాగా వృద్ధి చెంది గట్టి విత్తనంతోపాటు అధిక నూనె శాతం కలిగి ఉండటానికి కాల్షియం, గంధకం పోషకాలు ప్రధానమైనవి. ఈ పోషకాలు సాధారణంగా నేలలో, పొలానికి వేసే సేంద్రియ, చాలా వరకు ప్రధాన పోషకాల కోసం వాడే రసాయన ఎరువుల్లో ఉండలం వల్ల పైర్లకు కావాల్సిన మోతాదులో అందుతుండేవి. కానీ.. ఒకే భూమిలో ఒకటి కన్నా ఎక్కువసార్లు ఒక సంవత్సరంలో పండించటం, సిఫార్సు మేరకు సేంద్రియ ఎరువులు వాడకపోవడం, ఇటీవల కాల్షియం, గంధకం లేని సంకీర్ణ ఎరువులను రైతులు విరివిగా వాడుతుండటం తదితర కారణాల వల్ల వీటి లోపాలు పైర్లపై కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేరుశనగలో కాల్షియం, గంధకం లోపాల వల్ల దిగుబడులు బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాల్షియం లోపం కాల్షియం లోపించినప్పుడు లేత ఆకులు ముడుచుకొని వంకరలు తిరగటం, ఆకులు కొసల నుంచి ఎండిపోవటం, వేరు పెరగక వేరుకుళ్లు రోగం రావడం, కాండం బలహీనంగా ఉండి తప్పకాయలు ఏర్పడడం తదితర లక్షణాల వల్ల పైరు సరిగా ఎదగక దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. గంధకం లోపం గంధకం లోపం ఏర్పడినప్పుడు లేత ఆకులు చిన్నవిగా, ముడుచుకుని కాండం పొట్టిగా సన్నగా ఉండి, వేరుబుడిపలు తక్కువగా ఉండటం వల్ల వాతావరణం నుంచి సరిగా నత్రజనిని గ్రహించలేక పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. నూనె శాతం, దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. జిప్సం వాడకం రైతులు వేరుశనగ పైరులో కాల్షియం, గంధకం పోషకాలు విరివిగా లభించే చౌకైన జిప్సంను వాడుకోవటం మంచిది. జిప్సంలో కాల్షియం 24 శాతం, గంధకం 18 శాతం ఉంటుంది. ప్రతి 100 కిలోల జిప్సంలో 24 కిలోల కాల్షియం, 18 కిలోల గంధకం ఉంటుంది. ఎకరా వేరుశనగ పంటకు నీటిపారుదల కింద 200 కిలోల జిప్సంను తొలిపూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర సాళ్లలో వేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. వర్షాభావ పరిస్థితుల్లో విత్తిన 45 రోజుల్లో అంటే.. ఊడలు దిగే సమయంలో రెండో కలుపునకు ముందు జిప్సంను వేయాలి. కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. ఈ విధంగా చేయడం వల్ల కాల్షియం, గంధకం పోషకాలు పైరుకు కావాల్సిన మోతాదులో అంది గింజ, నూనె దిగుబడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. -
‘పసుపు’ను కాపాడుకుందాం ఇలా
పసుపులో దుంపలు ఊరే ప్రస్తుత సమయంలో దుంప తొలుచు ఈగ, దుంప కుళ్లు తెగులు ఆశించే అవకాశాలుంటాయి. ఇవి ఆశిస్తే దుంపల్లో నాణ్యతతో పాటు దిగుబడి తగ్గిపోతుంది. ఇవి ఆశించిన తర్వాత నివారణ చర్యలు చేపట్టేదానికన్నా ముందుగానే వేప పిండిని వాడితే ప్రయోజనం ఉంటుంది. ముందస్తు చర్యలు పసుపు మొక్క 40 రోజుల వయసున్నప్పుడు ఒకసారి, 120 రోజులప్పుడు మరొకసారి ఎకరాకు 250-300 క్వింటాళ్ల వేప పిండిని తడిగా ఉన్న నేలపై మొదళ్ల చుట్టూ చల్లాలి. వేప పిండి నేలను అంటుకుంటుంది. తదుపరి ప్రతి నీటి తడిలోనూ వేప ఊట భూమిలోకి దిగుతుంది. ఇది పసుపు పంటకు దుంపకుళ్లు, దుంప పుచ్చు కలుగజేసే క్రిమికీటకాలు మొక్కల దరి చేరకుండా కాపాడుతుంది. ‘ఈగ’ను గమనిస్తే.. దుంపతొలుచు ఈగను పంటలో గమనించినట్లయితే ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. దుంపకుళ్లు తెగులు ఆశించినట్లయితే మడిలోని మురుగు నీటిని తీసేయాలి. తెగులు ఆశించిన మొక్కలు దాని చుట్టు పక్కల ఉండే మొక్కల మొదళ్లు బాగా తడిచేట్లుగా లీటర్ నీటికి 3 గ్రా ముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని పోయాలి. వచ్చే సీజన్‌కోసం.. వచ్చే ఏడాది పసుపు పంట వేసుకోవాలనుకునే రైతాం గం దుంపకుళ్లు తెగులు ఆశించకుండా కొన్ని చర్యలు చేపట్టాలి. వేసిన పొలంలోనే పసుపు వేయకుండా వేరుశనగ, మొక్కజొన్న, జొన్న పంటలతో పంట మార్పిడి చేయడం ఉత్తమం. లీటర్ నీటికి 3 గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ లేదా మాంకోజెబ్, 2 మిల్లీ లీటర్ల మోనోక్రొటోఫాస్ లీటర్ కలిపిన ద్రా వణంలో తెగులు సోకని విత్తనాన్ని 30 -40 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీరు మార్చి లీటరు నీటికి 5 గ్రా ముల ట్రైకోడర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి, నీడలో ఆరబెట్టాలి. తర్వాత నాటుకోవాలి. కిలో ట్రైకోడర్మాను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండిలో కలిపి వారం పాటు అనువైన పరిస్థితిలో వద్ధి చేసి, నెలరోజులకు మొదటి తవ్వకం చేశాక నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి. దుంపలు విత్తిన తర్వాత జీలుగ, జనుము, వెంపలి, కానుగ మొదలగు పచ్చి ఆకులు లేదా ఎండు వరి గడ్డి, చెరకు ఆకులను పొలంపై దుంపలు మొలకలు వచ్చేంతవరకు కప్పడం వల్ల తెగుళ్ల ఉధతిని కొంతవరకు తగ్గించవచ్చు. -
పల్లి సాగుకు తరుణమిదే
బాల్కొండ : వేరుశనగ దిగుబడిలో విత్తే సవుయుం కూడా ప్రాధాన్యత వహిస్తుంది. జిల్లాలో సెప్టెంబర్ మధ్యలోనుంచే విత్తుకుంటున్నారు. వచ్చేనెల 15వ తేదీ వరకు పల్లీలను విత్తుకోవచ్చు. నీరు నిలువని ఇసుక నేలలు, ఎర్ర నేలలు అనుకూలం. నల్లరేగడి నేలల్లో పంట వేయుకపోవడం వుంచిది. విత్తనశుద్ధి వుంచి కాయులను విత్తనాలుగా ఎంపిక చేసుకోవాలి. వుుడతలు పడిన, పగిలిన, రంగు వూరిన గింజలు పనికిరావు. మంచి విత్తనాలను ఎంపిక చేసుకుని, కిలో విత్తనానికి గ్రావుు కార్బండైజమ్‌తో శుద్ధి చేసి 24 గంటలు నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి. నేల తయారీ వేరుశనగ పంట వేసే భూమిలో ఎలాంటి కలుపు మొక్కలు ఉండకుండా ట్రాక్టర్‌తో లేదా నాగలితో మూడు నుంచి నాలుగు సార్లు దున్నాలి. సాధారణంగా జిల్లాలో మొక్కజొన్న పంట కోసిన తర్వాత రెండుసార్లు ట్రాక్టర్‌తో దున్నుతారు. పల్లి విత్తనాలను చల్లిన తర్వాత మరోసారి దున్నుతారు. కొందరు రైతులు నాగలితో దున్నుతూ సాళ్లలో విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసేముందే ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వేసి, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి. విత్తే సమయంలో 18 కిలోల యూరియాను, విత్తన 30 రోజుల తర్వాత 9 కిలోల యూరియాను వేయాలి. తగినంత తేమ ఉన్నప్పుడే నేలలో విత్తనాలు వేయాలి. విత్తన 15 రోజుల తర్వాత నీటిని అందించాలి. నేల స్వభావాన్ని బట్టి తర్వాతి తడులను అందించాలి. సాధారణంగా ఎనిమిదినుంచి తొమ్మిది తడుల్లో పంట చేతికి వస్తుంది. -
వేరుశనగలో చీడ పీడలు నివారించుకుంటే మేలు
తామర పురుగులు : పిల్ల, పెద్ద పురుగులు ఆకులపై పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు ముడుచుకుని మొక్కలు గిడసబారిపోతాయి. ఆకుల అడుగు భాగంలో గోధమ వర్ణంలో మచ్చలు ఏర్పడతాయి. పేనుబంక : తల్లి, పిల్ల పురుగులు మొక్కలు, కొమ్మల చివర, లేత ఆకుల అడుగు భాగాన, కొన్ని సందర్భాలో పూతపై గుంపులు గుంపులుగా ఏర్పడి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల మొక్కలు గిడసబారతాయి. ఇది పూత దశలో ఆశిస్తే అంతా రాలిపోతుంది. ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థం స్రవించడం వల్ల నల్లని బూజు ఏర్పడుతుంది. పచ్చదోమ : పిల్ల, తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. మొదట ఆకు అడుగు భాగాన వీ ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపి ఆకులన్నీ పసుపు రంగులోకి మారతాయి. వీటి నివారణ డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు లేదా మిథైల్-ఓ-డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎక రాకు పిచికారీ చేయాలి. అక్షింతల పురుగులు మొక్కకు 1,2 కన్నా ఎక్కువగా ఉంటే క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించాలి. కాళహస్తి తెగులు(నులి పురుగులు) నులి పురుగులు కంటికి కనిపించవు. వీటిని మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడగలం. ఇవి వేరుశనగ పంటపై పిందె, కాయ పెరిగే దశలో కాయలపై ఆశించ డం వల్ల నల్లని మచ్చలు ఏర్పడతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు పిందెలు కాయలు నల్లగా మారి లోపలి గింజలు అభివృద్ధి చెందక ముడతలు పడతాయి. దీని నివారణకు చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలి. పురుగును గమనించిన వెంటనే, నీటి తడిపెట్టిన తర్వాత అంతర వాహిక గులికల మందు వేయాలి. తిక్క ఆకుమచ్చ తెగులు త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు పంట వేసిన 30 రోజుల తర్వాత కనిపిస్తుంది. ఈ మచ్చలు గుండ్రంగా ఉండి, ఆకు పైభాగాన ముదురు గోధుమ వర్ణం కలిగి ఉంటాయి. ఆకుమచ్చ ఆలస్యంగా వస్తే మచ్చలు చిన్నవిగా, గుండ్రంగా ఉండి, ఆకు అడుగు భాగాన నల్లని రంగు కలిగి ఉంటాయి. కాండం మీద, ఆకు కాడల మీద, ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ 400 గ్రాములు, కార్బండిజం 20 గ్రాములు లేదా క్లోరోథాల్‌నిల్ 400 గ్రాములు లేదా హెక్సాకోనజెల్ 400 మీల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. అంతర పంటగా సజ్జను 7:1 నిష్పత్తిలో వేయాలి. -
అడవి పందుల నుంచి పంటల రక్షణ ఇలా..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : రైతులు ఎన్నో కష్టనష్టాలను భరించి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో అడవి పందులు దాడి చేసి తినేస్తుంటాయి. దీంతో నష్టం భరించలేక రైతులు వ్యవసాయమంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంటుంది. మరికొందరు వాటి కాపలా కోసం రాత్రివేళ నిద్రకు దూరమవుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న, వరి, జొన్న, వేరుశనగ, పొద్దు తిరుగుడు, పండ్ల తోటలపై అడవి పందుల దాడి ఎక్కువగా ఉంటుంది. పంట ఉత్పత్తులను తినడంతోపాటు వాటి సంచారంతో పంట నాశనం అవుతుంది. తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళ గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తుంటాయి. వీటికి వినికిడి, చూపు తక్కువగా ఉన్నా, గ్రహణ శక్తి అధికంగా ఉండడంతో రూర ప్రాంతాల నుంచే పంటలను గుర్తిస్తుంటాయి. నోటి భాగంతో భూమిని లోతుగా తవ్వుతూ మొక్కవేశ్లను పెకిలించి నష్టం కలుగజేస్తుంటాయి. ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామ పంచాయతీ పరిధి బిక్కుతండాకు చెందిన రైతులు రాథోడ్ సర్యనాయక్, దుర్వ మారుతి సాగు చేసిన పెసర, పత్తి పంటలపై ఈ నెల 24న రాత్రి అడవి పందులు దాడి చేశాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకోవడంపై ప్రత్యేక కథనం. కందకం ఏర్పాట్లు పొలం చుట్టూ రెండు అడుగులు వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతులో కందకాన్ని తవ్వినట్లయితే అడవి పందులు పొలంలోకి రాకుండా నిరోధించ వచ్చు. అలాగే వర్షాభావ సమయంలో కందకాల్లో నిల్వ ఉన్న నీరు పొలాన్ని తేమగా ఉండేటట్లు కూడా చేస్తుంది. రసాయనిక పద్ధతులు ఫోరేట్ గుళికలను ఇసుకలో కలిపాలి. చిన్న చిన్న సంచుల్లో కట్టి పంట చుట్టూ అక్కడక్కడా కర్రలను పాతి సంచులను వేలాడదీయాలి. గాలి వల్ల ఫోరేట్ గుళికల ఘాటు రూపంలో పంట చుట్టూ ఆక్రమించకుంటాయి. దీంతో పందులు ఆ వాసనకు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కుళ్లిన కోడిగుడ్ల ద్రావణాన్ని తీసుకుని నీటికి కలిపి పొలం చుట్టూ చల్లాలి. దుర్గంధం వల్ల పంట వాసనను గుర్తించక పందులు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. కిరోసిన్‌లో ముంచిన నవారును పంట పొలం చుట్టూ ఏర్పాటు చేస్తే ఆ ఘాటు వాసనకు పందులు పారిపోతాయి. విషపు ఎరలు గోధుమ పిండిలో ఉల్లిపాయ, వెల్లుల్లిని మెత్తగా చూర్ణం చేసి కలిపి పొలం చుట్టూ పెట్టాలి. ఈ ఉండలను పందులు తినడం అలవాటు చేసుకుంటాయి. ఆ తర్వాత సోడియం మోనో ఫ్లోరో ఎసిటేట్ లేదా వార్ఫెరిన్ కలిపిన ఉండలను పెట్టాలి. వాటిని తిన్న పందులు అజీర్ణానికి లోనై పంట దరిదాపులకు రావు. వెంట్రుకలు వెదజల్లే పద్ధతి క్షౌరశాలలో దొరికే వ్యర్థ వెంట్రుకలను సేకరించి పంట పొలం గట్లపై ఒక అడుగు వెడల్పులో చల్లాలి. పంటను నాశనం చేసేందుకు వచ్చిన పందుల ముక్కులోకి వెంట్రుకలు వెళ్లి శ్వాసకు ఇబ్బంది కలుగజేస్తాయి. వీటితోపాటు ఊరపందుల పెంటను పొలం చుట్టూ చల్లితే దుర్వాసనకు ఆ పక్కకు రావు. అలాగే వేటకుక్కలతో పందులను తరమడం, టపాసులు పేల్చడం వంటి పద్ధతుల ద్వారా పంట పొలాలను అడవి పందుల బారి నుంచి రక్షించుకోవచ్చు. జీవ కంచెలు ఒక రకమైన పంట పొలాన్ని కాపాడుకోవాలంటే దాని చుట్టూ నాలుగు వరసల్లో మరో పంట మొక్కలను పెంచడం పందుల బారి నుంచి రక్షించుకోవచ్చు. వేరుశనగ పంట పొలం చుట్టూ నాలుగు వరుసల్లో కుసుమ పంటను వేయడం వల్ల ఆ మొక్కకు ఉన్న ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. అలాగే కుసుమ మొక్క వాసన, వేరుశనగ మొక్క వాసన కన్నా ఘాటుగా ఉండడం వల్ల పందులు వేరుశనగ మొక్కను గుర్తించలేకపోతాయి. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి కూడా పంటను రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లను కలిగి ఉండే ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవాలి. -
ఏ మందు వేయాలబ్బా..?
ఈసారి జిల్లాలో పత్తి విస్తారంగా సాగయింది. ఈ పంట 40 నుంచి 80 రోజుల దశల్లో ఉంది. వర్షాలు పడినందున పైరు బాగా పెరిగి పూత, కాయ బాగా వచ్చేందుకు ఎకరాకు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్(ఎంఈపీ) వేసుకోవాలి. మొక్క మొక్కకు ఎడం ఉంటే పైపాటుగా కాకుండా పాదుకు జానెడు దూరంలో గుంత తీసి మందు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేరుశనగ 40 నుంచి 60 రోజుల దశలో ఉంది. ఈ సమయంలో ఎటువంటి ఎరువులు అవసరం లేదు. అయితే గింజ నాణ్యత బాగా పెరగడానికి (అవుటం) నూనె శాతం పెరగడానికి జిప్సమ్ అవసరం ఉంది. ఎకరాకు 200 కిలోల వేసుకుంటే దిగుబడులు పెరుగుతాయి. ఇప్పటి వరకు వర్షాభావంతో కంది ఎదుగుదల లోపించింది. బాగా పెరగడానికి ఎకరాకు 15 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ పైపాటుగా బూస్టర్ డోస్ ఇవ్వాలి. ఆముదం పంట 60 రోజుల దశలో ఉంది. ఎకరాకు 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ పైపాటుగా వేయాలి. దీంతో కొత్త కొమ్మలు వస్తాయి. అదనపు గెలలు వస్తాయి. మిరప పంట వివిధ దశలో ఉంది. ఈ పంటకు ఇప్పుడు 50 కిలోల యూరియా, 25 కిలోల ఎంఓపీ వేయాలి. చెట్టు పెరిగి పూత, పిందె ఎక్కువగా వస్తుంది. ఉల్లిలో 30 నుంచి 50 రోజుల దశలో ఉన్న పైరుకు ఎకరాకు 50 కిలోల యూరియా వేయాలి. -
కరువు మేఘం.. ఉరుముతోంది..!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే వర్షాభావ పరిస్థితులతో రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా.. ఈనెల 8వ తేదీ నాటికి 4.86 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఇందులో 90 శాతం వర్షాధారమే కావడం గమనార్హం. పత్తి 2.52 లక్షల హెక్టార్లలో సాగు చేయగా విత్తనాలకే రూ.100 కోట్లు ఖర్చు చేశారు. వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం, కందులు, ఉల్లి, మిరప తదితర పంటలపై మరో రూ.750 కోట్లు వ్యయమైంది. విత్తనాల ఖర్చే ఈ స్థాయిలో ఉండగా.. ఇక ఎరువులు, కూలీలు, ఇతరత్రాలకు చేసిన మొత్తం తలుచుకుంటే రైతుల గుండె జారిపోతోంది. సీజన్ మొత్తానికి 2.50 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఇప్పటికే 1.20 లక్షల టన్నుల ఎరువులను రైతులు వినియోగించారు. వీటి విలువ రూ.1100 కోట్ల పైమాటే. పురుగు మందులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు మరో రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. వరుణ దేవుడు కరుణించకపోవడంతో ఈ మొత్తం చేతికొచ్చే పరిస్థితి లేదనేది తేలిపోయింది. జూన్ నెలలో పత్తి, కొర్ర, మొక్కజొన్న తదితర పంటలు దాదాపు 50 వేల హెక్టార్లలో సాగయ్యాయి. ఈ పంటలు కళ్లెదుటే ఎండుతుండటంతో రైతుల వేదన వర్ణనాతీతం. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.1 మి.మీ. కాగా.. 66.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. జులై నెలలో 117 మి.మీ. సాధారణ వర్షపాతం ఉండగా 113 మి.మీ. వర్షం కురిసింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మి.మీ., కాగా.. 13 రోజులు గడిచిపోయినా 5.9 మి.మీ., మించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ ఆరంభం నుంచి జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలే కురుస్తుండటంతో అదును దాటకూడదనే ఉద్దేశంతో అంతంత మాత్రం తేమలోనే విత్తనం వేశారు. ఆ తర్వాత ఆశించిన వర్షం లేకపోవడంతో ఎదుగుదల లోపించి పంట వాడుపడుతోంది. పూత, పిందెలతో కళకళలాడాల్సిన పత్తి, వేరుశనగ పైర్లు కళతప్పాయి. కర్నూలు, ఆదోని డివిజన్లలో వర్షాధారం కింద సాగు చేసిన 2.50 లక్షల హెక్టార్ల పంట చేతికందే పరిస్థితి లేకపోవడం రైతులను కలవరపరుస్తోంది. ఇదే సమయంలో పశుగ్రాసం కొరత తీవ్రరూపం దాలుస్తోంది. పచ్చికతో కనిపించే కొండలు, బంజరు భూముల్లో ఎటు చూసినా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. రైతులకు పశు పోషణ భారం కావడంతో విధిలేని పరిస్థితుల్లో సంతల్లో తెగనమ్ముకోవడం కనిపిస్తోంది. ఇక 80 శాతం చెరువుల్లో చుక్క నీరు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో నీటి సమస్య జటిలమవుతోంది. వీటి పరిధిలోని దాదాపు 60 వేల హెక్టార్ల భూమి కూడా బీడు వారుతోంది. -
కంది, ఆముదం ఇప్పుడూ విత్తుకోవచ్చు!
కంది, ఆముదం పంటలను మొక్కల మధ్య దూరం తగ్గించి ఆగస్టు నెలలో కూడా విత్తుకోవచ్చు. ఆగస్టు మొదటి వారం వరకు రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వేరుశనగను కూడా విత్తుకోవచ్చు.కందిలో ఎల్.ఆర్.జి-30, ఎల్.ఆర్.జి -38, ఎల్.ఆర్.జి-41, ఐ.సి.పి. ఎల్- 85063, పి.ఆర్.జి-158, పి.ఆర్.జి- 100, ఎమ్.ఆర్.జి-1004, ఐ.సి.పి.ఎల్ -84031 రకాలు ఖరీఫ్ సాగుకు అనుకూలమైనవి. కందిలో ఎకరానికి 200-400 గ్రా. రైజోబియంను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఎండు తెగులు ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ట్రైకోడెర్మా విరిడిని కిలో విత్తనానికి 5గ్రా., ఫైటోఫ్తోరా ఎండుతెగులు ఉంటే మెటలాక్సిల్ 2 గ్రా. చొప్పున విత్తనశుద్ధి చేసి నాటుకోవాలి. కందిలో కలుపు నివారణకు విత్తిన వెంటనే గాని, మరుసటి రోజు గాని పెండిమిథాలిన్ 1-1.5 లీ. లేదా అలాక్లోర్ 1 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వరిలో నేరుగా విత్తిన లేదా డ్రమ్‌సీడర్‌తో విత్తిన పొలంలో నేల ద్వారా సంక్రమించిన శిలీంధ్రాల వలన మొక్కలు కుళ్లిపోవడం లేదా ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడడం గమనించడమైనది. నివారణకు, 2.5 గ్రా. కార్బన్‌డజిమ్ 25%+ మాంకోజెబ్ 50% (స్ప్రింట్) లేదా 3 గ్రా. కార్బన్‌డజిమ్ 12%+ మాంకోజెబ్ 63% (సాఫ్) మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి నాట్లు వేసే రైతులు నారుమళ్లలో కార్బొప్యూరాన్ 3జి గుళికలను 200 చ. మీ. నారు మడికి (5సెంట్లకు) ఒక కిలో చొప్పున నారు పీకే వారం రోజుల ముందు చల్లుకోవాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు, 20, 40 రోజుల వయసు గల పంటపై మోనోక్రోటోఫాస్ 1:4 (1 భాగం మందు 4 భాగాల నీళ్లు) నిష్పత్తిలో కాండం మీద మందు పూయాలి. పత్తిలో రైజాక్టోనియా వేరుకుళ్లు తెగులు సోకడం వలన ఆకులు ఎర్రబడటం గమనించడమైనది. దీని నివారణకు, 3 గ్రా. కాపర్- ఆక్సీ-క్లోరైడ్ లేదా 2.5 గ్రా. కార్బండజిమ్ 25%+ మాంకోజెబ్ 50% (స్ప్రింట్) లేదా 3 గ్రా. కార్బన్‌డజిమ్ 12% + మాంకోజెబ్ 63% (సాఫ్, కంపానియన్, మాస్టర్) మందును లీటరు నీటిలో కలిపి 7 - 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు మొక్కల మొదళ్లు బాగా తడిచేటట్టుగా చల్లాలి. మొక్కజొన్న విత్తిన 30-35 రోజులకు పైపాటుగా ఎకరానికి 20-25 కిలోల యూరియా వేసుకోవాలి.నీటి వసతి ఉంటే ఆగస్టు నెలలో టమాటా, వంగ, బెండ, తీగజాతి కూరగాయలు, చిక్కుడు, ముల్లంగి, క్యారెట్, ఉల్లి, మిరప, గోరుచిక్కుడు, ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు. టమాటా, కాలిఫ్లవర్, క్యాబేజి పంటల్లో ముదిరిన నార్లను నాటితే దిగుబడి తగ్గుతుంది.తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో నాట్లు వేసిన కూరగాయల పంటల్లో సాలు మార్చి సాలులో నీరు పెట్టాలి. తరచూ అంతర సేద్యం చేయడం ద్వారా కలుపును నివారించుకోవచ్చు. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
వేరుశనగ అన్ని ప్రాంతాల్లో విత్తుకోవచ్చు
గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తున్నది.వరి, పత్తి పంటల తర్వాత తెలుగు నాట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంట వేరుశనగ. అన్ని ప్రాంతాల్లోనూ జూలై నెలలో వేరుశనగ విత్తుకోవచ్చు.కదిరి-5,6,9, అనంత, నారాయణి, వేమన, జేసీజీ-88, అభయ, ధరణి లాంటి రకాలు తక్కువ వర్షపాత ప్రాంతాల్లోను, గ్రీష్మ, రోహిణి, కాళహస్తి, టీజీ-26, టీఏజీ-24 లాంటి రకాలు ఎక్కువ వర్షపాత ప్రాంతాల్లో సాగుకు అనువైనవి. విత్తనాన్ని గొర్రుతోకానీ, ట్రాక్టరుతో నడిచే విత్తు యంత్రంతో కానీ సాలుకు, సాలుకు మధ్య 30 సెం.మీ, మొక్కకు, మొక్కకు మధ్య 10 సెం.మీ. ఉండేటట్లుగా, 5 సెం.మీ. లోతు మించకుండా విత్తుకోవాలి.ఎకరానికి 4 నుంచి 5 టన్నుల సేంద్రియ ఎరువు, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 18 కిలోల యూరియా, మొత్తం ఎరువులను విత్తే సమయంలో ఆఖరి దుక్కిలో వేయాలి.భూమి, విత్తనం ద్వారా వ్యాప్తిచెందే శిలీంధ్రాల నివారణకు, వైరస్ తెగుళ్ల నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. మొదటగా కిలో విత్తనానికి, ఒక గ్రా. టిబ్యుకొనజోల్ లేక 3 గ్రా. మాంకోజెబ్ లేక 2 గ్రా. కార్బండిజమ్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును కూడా విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 6.5 మి.లీ.ల క్లోరోఫైరిఫాస్తో విత్తనశుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసే ప్రాంతాల్లో రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. కలుపు నివారణకు విత్తిన వెంటనే కానీ లేదా 2-3 రోజుల లోపల పెండిమిథాలిన్ 1.3-1.6 లీ. లేదా 1.25-1.5 లీ. బ్యూటాక్లోర్ 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 21 రోజుల తర్వాత మొలచిన కలుపు నివారణకు ఇమాజితఫిర్ 300 మి.లీ. లేదా క్విజలోఫాప్ ఇథైల్ 400 మి.లీ. ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఊడలు దిగే సమయంలో అంటే 45 రోజుల సమయంలో రెండోసారి కలుపు తీసి, ఎకరానికి 200 కిలోల జిప్సం వేసి మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల తర్వాత వేరుశనగలో అంతర సేద్యం చేయరాదు.వేరుశనగను కంది, ఆముదం, సజ్జ, జొన్న పంటల్లో అంతర పంటగా వేసుకోవాలి.సజ్జ, జొన్న పంటలను అంతర పంటలుగానే కాకుండా.. పొలం చుట్టూ నాలుగు వరుసలు వేసుకుంటే తామర పురుగులను నిరోధించి తద్వారా పంటను వైరస్ తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
హమ్మయ్య.. ‘వరు’ణించాడు
శ్రీకాకుళం అగ్రికల్చర్: చినుకు చుక్క కోసం ఇన్నాళ్లూ తపించిన పుడమికి నీటి తడి అందింది. ఆలస్యంగానైనా అదనులో వర్షం కురిసినందుకు రైతులోకం మురిసిపోతోంది. నెర్రెలువారిన నేలలు వాన నీటిని ఆబగా తమలోకి ఇముడ్చుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పలు మండలాల్లో విస్తారంగా, మరికొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 30.1 సగటుతో మొత్తం 1145.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అత్యధికంగా ఇచ్ఛాపురంలో 85.6 మి.మీ, కవిటిలో 75.2, పోలాకిలో 61.8, అత్యల్పంగా వంగరలో 3.4 మి.మీ.వర్షపాతం నమోదైంది. అన్ని మండలాల్లోనూ వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటలకు అనుకూలమైన సమయంలో కురిసిన ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, గోగు, సజ్జ తదితర పంటలకు ఉపయోగకరమని అంటున్నారు. వర్షాలు లేక ఇన్ని రోజులూ వరి నారుమళ్లను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. ఆయిల్ ఇంజిన్ల సహాయంతో దూరప్రాంతాల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వచ్చింది. మరో రెండు రోజులు వర్షాలు లేకపోతే వరి నారుమళ్లు పూర్తిగా దెబ్బతినేవని, ప్రస్తుత వర్షాలు వాటికి జీవం పోశాయని రైతులు చెబుతున్నారు. ఈ సీజనులో నిన్నటి వరకు వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే విత్తుకున్న మొక్కజొన్న తదితర పంటలు చాలా వరకు పాడయ్యాయి. వీటితో పాటు నీరు అందుబాటులో లేని చాలా చోట్ల వరి నారుమళ్లు కూడా పాడయ్యాయి. ప్రస్తుత వర్షాలతో మెట్టు రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సుమారు ఆరు నెలలుగా వర్షాలు లేక భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక నానా అవస్థలు పడిన ప్రజలు కూడా ఈ వర్షాలతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో వాతావరణం చల్లబడింది. మరో రెండు వర్షాలు కొనసాగితే వ్యవసాయంతోపాటు సాధారణ జన జీవనానికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. పొందూరులో ఆమ్ల వర్షం పొందూరు : జిల్లా అంతటా మామూలు వర్షాలు పడితే.. పొందూరులో మాత్రం ఆమ్ల వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో కొద్దిసేపు కురిసిన ఈ వర్షంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద, మార్కెట్ ప్రాంతంలోనూ ఆమ్ల వర్షం కురిసిందని స్థానికులు చెప్పారు. పసుపు వర్ణంలో నీటి చుక్కలు శరీర భాగాలపై పడినప్పుడు కొద్దిగా మంట పుట్టిందని వారన్నారు. వాతావరణ కాలుష్యం కారణంగా పొందూరులో ఆమ్ల వర్షం కురవడం ఇది రెండోసారి. -
సాగు..లేదు బాగు!
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా..జిల్లాలో పచ్చదనం కనిపించడం లేదు. పంట పొలాలన్నీ వర్షం కోసం నోళ్లు తెరిచి ఉన్నాయి. చెరువులు, కుంటలు అడుగంటి కళావిహీనంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొనడంతో విత్తనాలకు డిమాండ్ తగ్గింది. సబ్సిడీతో వేరుశనగ సహా వివిధ విత్తనాలను పంపిణీ చేస్తున్న వాటిని రైతులు పట్టించుకోవడం లేదు. దీంతో సబ్సిడీ విత్తన పంపిణీ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఖరీఫ్ సీజన్లో 15 లక్షల ఎకరాల్లో విత్తనం పనులు పూర్తి కావాల్సి ఉంది. గతేడాది ఈ స్థాయిలో విత్తనం పనులు పూర్తయ్యాయి. ఈ సారి జూన్ మొదటి వారం వర్షాలు ఓ మోస్తరుగా పడి ఆ తర్వాత మొండికేశాయి. ఎల్‌నినో ప్రభావంతో చినుకు జాడ కరువైంది. ఈ నేపథ్యంలో వేరుశనగకు డిమాండ్ ఉండదని వ్యవసాయ అధికారులు 5 వేల క్వింటాళ్లు మాత్రమే పొజిషన్ చేయాలని నిర్ణయించారు. ఇందులో కూడా 3700 క్వింటాళ్లు మాత్రమే పొజిషన్ అయ్యాయి. ప్రస్తుతం 1378 క్వింటాళ్లు పంపిణీ చేశారు. వర్షాలు పడకపోవడంతో ప్రస్తుతం అన్ని మండలాల్లో వేరుశనగ పంపిణీ కేంద్రాలు ఖాళీగా ఉండిపోయాయి. ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తున్న అధికారులు.. రోజులు గడుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో వ్యవసాయం సంక్షోభంలో పడినట్లయింది. వేసిన పంటలు కూడా ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిన్న, మొన్నటి వరకు ఇదిగో వర్షాలు పడతాయని ఆశలు రేకెత్తించిన అధికారులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించడంపై దృష్టి పెట్టారు. ఈనెల 15 నుంచి దీనిని అమలులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టారు. వర్షాలు మరింత ఆలస్యమైతే ఎర్ర నేలల్లో ఎటువంటి పంటలు వేసుకోవచ్చు. నల్ల నేలల్లో ఏయే పంటలు వేసుకోవచ్చు అనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జేడీఏ ఠాగూర్ నాయక్, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ డాట్ సెంటర్ సైంటిస్టులతో చర్చలు జరిపారు. -
న(అ)మ్మకాన్ని వంచించారు!
ఆదోని: వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఇంటిల్లిపాది ఆరుగాలం చెమటోడ్చి వేరుశనగ పండించారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో దిగుబడులను ఇళ్లలో దాచిపెట్టుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ గిట్టుబాటు ధరకు దిగుబడులు కొనుగోలు చేస్తోందని చెప్పడంతో రైతులు ఎంతో సంబర పడ్డారు. మార్కెట్ ధర క్వింటాల్ రూ.2200 నుంచి రూ.3300 వరకు ఉండగా..అయిల్ ఫెడ్ క్వింటాల్‌కు రూ.నాలుగు వేలు చెల్లిస్తామని చెప్పడంతో ఈ ఏడాది జనవరిలో విక్రయించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా రైతులకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా..ఇంతవరకు కొందరు రైతులకు డబ్బులు అందకపోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం పంట పెట్టుబడులకు చేతిలో డబ్బు లేక..బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామన్నారు.. అయిల్ ఫెడ్ అధికారులు జిల్లాలోని ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్, ఆలూరు, కర్నూలు మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వ్యవ,ప్రయాసాలు కోర్చి రైతులు దిగుబడులను అమ్ముకున్నారు. పత్తికొండ యార్డులో ఏర్పడిన గందరగోళంతో కొనుగోళ్లు కొన్నాళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు నాలుగైదు రోజుల పాటు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించడంతో కొనుగోలులో నిర్లక్షం చేశారనే కారణంతో ఆయిల్ ఫెడ్ మేనేజరు ఎల్లారెడ్డి, పత్తికొండ కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ బ్రహ్మేశ్వరరెడ్డిపై అప్పట్లో ప్రభుత్వం సస్సెన్షన్ వేటు వేసింది. ఎట్టకేలకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఆయిల్ ఫెడ్ సంస్థ లక్షా 45 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. అధికారులు పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని చెప్పి కొనుగోలు చేసిన వేరు శనగకు సంబందించి రైతులకు రశీదులు ఇచ్చారు. చేతికి డబ్బులు అందగానే పంట సాగు కోసం చేసిన అప్పులు చెల్లించి ఆ తరువాత తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలని అన్నదాతలు ఆశించారు. పలువురు ఖరీఫ్ పంట పెట్టుబడికి ఇక దిగులుండదని బావించారు. అయితే చెప్పిన సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో రైతులకు తెలిసొచ్చి తెల్లబోయారు. గత జనవరిలో కొనుగోలు చేయగా పక్షం రోజుల్లో రైతులందరికీ బిల్లులు చెల్లించాలి. అయితే దాదాపు రెండు నెలల తరువాత బిల్లుల చెల్లింపులు ప్రారంభించారు. అప్పటికే మార్కెట్ యార్డుల చుట్టు ఎన్నో సార్లు తిరిగి వేసారి పోయారు. ఇంకా బిల్లులు అందని రైతులు వందల్లో ఉన్నారు. ఆదోనిలోనే దాదాపు 596 మందికి రూ.4.23 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆదోని,కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్ మార్కెట్ యార్డులలో కూడా చాలా మందికి బిల్లులు అందాల్సి ఉంది. అయితే ఆదోనిలో తప్ప మిగిలిన మార్కెట్ యార్డుల పరిధిలో బకాయిలు రూ.లక్షల్లో మాత్రమే ఉందని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు పేర్కొన్నారు. వేరు శనగ అమ్మి ఇప్పటికే దాదాపు ఆరు నెలలు అవుతోంది. స్థానికంగా ఆయిల్ ఫెడ్ అధికారులు ఎవ్వరు లేక పోవడంతో తమ బకాయిల కోసం ఎవరిని సంప్రదించాలో రైతులకు దిక్కు తోచడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయి దాదాపు పక్షం రోజులు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఇంకా ఎటు తేలలేదు. బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామని బ్యాంకర్లు తెగేసి చెపుతున్నారు. ఇటు ఆయిల్ ఫెడ్ అధికారులు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో తెలీయక, అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తాము గుడ్డిగా నమ్మి చేతికి అందిన పంట దిగుబడులను అమ్ముకున్నామని, బిల్లులు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పేవారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అమ్ముకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో మకాం పెట్టిన ఆయిల్ ఫెడ్ అధికారి ఆదోని ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రం అధికారి నరేంద్రరెడ్డి తన మకాంను హైదరాబాదుకు మార్చారు. దీంతో బిల్లుల కోసం వచ్చిన రైతులకు సమాధానం చెప్పేందుకు స్థానికంగా ఎవ్వరు లేకుండా పోయారు. రైతుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆయన హైదరాబాదులో ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్ర రెడ్డిని ‘సాక్షి’ఫోన్లో సంప్రదించగా బకాయి బిల్లులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించుకోడానికి తాను హైదరాబాదులో ఉన్నట్లు చెప్పారు. నిధులు మంజూరు కాగానే రైతులకు డబ్బులు చెల్లిస్తామని, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లో వేరు శనగ అమ్మిన రైతులందరికీ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు వెల్లడించారు. -
పంట.. రుణాల మంట
పురుగు మందుల ధరలు పెరగడం.. కూలీ ఖర్చులు, బాడుగ రెట్టింపు కావడంతో పెట్టుబడి కూడా అధికంగానే అవసరమవుతోంది. వేరుశనగకు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి అవసరమని అంచనా. పత్తి సాగుకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు.. వరికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు వ్యయమవుతోంది. సాధారణంగా రైతులందరికీ కాకపోయినా కొందరికైనా బ్యాంకులు రుణాలిచ్చేవి. ఈ విడత బాబు హామీ సందిగ్ధం కారణంగా బ్యాంకర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలతో పాటు.. బంగారం కుదువపెడుతున్నారు. గతేడాది వరకు 56,300 మంది రైతులు బ్యాంకుల్లో బంగారం పెట్టి రూ.315.21 కోట్ల వ్యవసాయ రుణాలు తీసుకోగా.. ఈసారి బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోవడంతో గత రెండు నెలల్లో 12,500 మంది రైతులు దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల అప్పు తీసుకున్నారు. బయట ఎంత మేర అప్పు తెచ్చారనడానికి లెక్కల్లేవు. అయితే ఖరీఫ్ ఆరంభంలోనే ఎల్‌నినో ప్రభావం.. రుతు పవనాల జాప్యం తదితర కారణాలతో వర్షాలు ఆలస్యం కావడం రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. బకాయిలు రూ.4344.13 కోట్లు ఈ ఏడాది మార్చి నెల 31వ తేదీ నాటికి జిల్లాలో వ్యవసాయ రుణాలు రూ.4344.13 కోట్లు. ఇందులో పంట రుణాలు రూ.2819.97 కోట్లు(4,62,156 అకౌంటు) కాగా.. బంగారంపై వ్యవసాయ రుణాలు రూ.315.21 కోట్లు(56300 అకౌంట్లు), టర్మ్ లోన్లు రూ.1092.75 కోట్లు(89932 అకౌంట్లు) ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అధికారం చేపట్టిన తర్వాత విధి, విధానాలను రూపొందించేందుకు కమిటీ అంటూ తాత్సారం చేస్తుండటంతో రుణమాఫీపై రైతుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ.2888 కోట్లు 2014-15 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రైతులకు రూ.2888 కోట్లు పంట రుణాలుగా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించాయి. మామూలుగా అయితే ఈ పాటికి కనీసం రూ.200 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం రుణమాఫీని తేల్చకపోవడంతో ఇంత వరకు ఒక్క రైతురూ పంట రుణం లభించని పరిస్థితి నెలకొంది. రైతులకు నోటీసులిచ్చే పనిలో బ్యాంకర్లు గతేడాది తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సహజంగా రికవరీ సీజన్ జూన్ చివరి వరకు ఉంటుంది. అంత వరకు బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వవు. జూన్ నెల మరో పది రోజుల్లో ముగియనుండటంతో జులై మొదటి వారంలో నోటీసులు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. రుణాలు మాఫీ చేస్తే ప్రభుత్వం రైతుల అప్పులను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. లేదా రైతులైనా అప్పు చెల్లించాలి. ఎవ్వరూ చెల్లించకపోతే బ్యాంకులు మనుగడ సాగించలేవని.. అందువల్లే నోటీసులకు సిద్ధమవుతున్నట్లు ఓ బ్యాంకు అధికారి తెలిపారు. మార్గదర్శకాలు రాలేదు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. వచ్చిన తర్వాతే బ్యాంకుల్లో పంట రుణాల పంపిణీకి అవకాశం ఉంటుంది. రుణాల విషయంలో ప్రభుత్వమే చొరవ చూపాలి. - ఎల్‌డీసీఎం నరసింహారావు -
ధర తఖరారు
సాక్షి, అనంతపురం : గత ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వేరుశనగను ప్రభుత్వం మూడు నెలల కిందట క్వింటాలు రూ.4 వేలు ప్రకారం నాఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ జూన్ మొదటి వారం నుంచి మొదలవుతుండటంతో వేరుశనగ వేసేందుకు రైతులు దుక్కి దున్ని సిద్ధమవుతున్నారు. సబ్సిడీ పేరుతో ప్రస్తుతం క్వింటాలు రూ.4,600 ప్రకారం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ ఆయిల్‌ఫెడ్, ఏపీ సీడ్స్, హాకా, మార్క్‌ఫెడ్ సంస్థలు మాత్రం ఆ ధర మేరకు పంపిణీ చేసేందుకు ఒప్పుకోవడం లేదు. క్వింటాలుకు మరో వెయ్యి రూపాయలు అదనంగా చెల్లిస్త్తే గానీ తాము సరఫరా చేయలేమని ఆయా సంస్థల అధికారులు తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో దాదాపు 23 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తారు. రెండు మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి సరిగా రాకపోవడంతో చాలా మంది రైతులు వేరుశనగను సాగు చేసేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది 18 నుంచి 20 లక్షల ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీటికి దాదాపు 10 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ అవసరమవుతుంది. అయితే ఈ ఏడాది 3.5 లక్షల క్వింటాళ్ల పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో సబ్సిడీతో విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేసినా రైతుల వద్ద డబ్బులు లేక పెద్దగా నిలువ ఉంచుకోలేదు. ఈ ఏడాది మాత్రం విత్తన కాయలు కొనుగోలు చేసిన మూడు నాలుగు రోజుల తర్వాత సబ్సిడీ మొత్తం ఇస్తామని అధికారులు చెబుతుండటంతో రైతులు ఎవ్వరూ నమ్మడం లేదు.అధికారం ఇస్తే రైతులను ఆదుకుంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం సబ్సిడీ విత్తనం గురించి నోరు మెదపడం లేదు. రైతు క్వింటాలు రూ.4,600కు కొనుగోలు చేసిన తర్వాత 33 శాతం సబ్సిడీ చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా విత్తన వేరుశనగ సేకరణ మొదలే కాలేదు. ఈ నెల 26 నాటికి కనీసం 50 వేల క్వింటాళ్ల మేరకు సేకరించి గోడౌన్లలో సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చినా ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయింది. మూడు నెలల కిందట రైతులు పండించిన వేరుశనగను నాఫెడ్, ఆయిల్‌ఫెడ్ కంపెనీలు క్వింటాలు రూ.4 వేలు ప్రకారం కొనుగోలు చేసినా వాటిని శుద్ధి చేసి విత్తనం కోసం తిరిగి విక్రయించాలంటే కనీసం రూ.5,600 ధర చెల్లిస్తే తప్ప గిట్టుబాటు కాదని భీష్మించుకుని కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా సంస్థలతో జిల్లా అధికారులు సంప్రదింపులు చేసే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఈ సారి విత్తన వేరుశనగ అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాఫెడ్, ఆయిల్‌ఫెడ్ కంపెనీలు ఇటీవల రైతుల నుంచి కొనుగోలు చేసిన 1.42 లక్షల క్వింటాళ్ల వేరుశనగ గోడౌన్లలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదని ఆ కంపెనీలు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం 75 శాతం మంది రైతుల వద్ద విత్తన వేరుశనగ అందుబాటులో లేదు. అందరూ సబ్సిడీ విత్తనంపైనే ఆధారపడ్డారు. జిల్లాలో జూన్ 25లోపే వేరుశనగ వేస్తే అధిక దిగుబడులు వచ్చే పరిస్థితి ఉంది. ఆ తర్వాత సాగు చేసినా... వర్షాలు సకాలంలో వచ్చినా దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. వర్షాలు వస్తే సకాలంలో విత్తనం వేసేందుకు వీలుగా విత్తన వేరుశనగను సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
‘జీరో’ దందా జోరు!
తాండూరు, న్యూస్‌లైన్: కర్ణాటక సరిహద్దులో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారుల నిఘా కొరవడింది. సరిహద్దులో గతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును సిబ్బంది కొరత కారణంగా ఎత్తివేశారు. చెక్‌పోస్టు లేకపోవడంతో వేరుశనగల అక్రమ రవాణాకు ఆస్కారం కలుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ యార్డులో కొందరు వ్యాపారులు వేరుశనగల జీరో వ్యాపారం చేస్తూ సరకును సరిహద్దులు దాటిస్తుండడంతో కమిటీకి రావాల్సిన 1శాతం ఫీజుకు గండిపడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు జీరో వ్యాపారంతో వేరుశనగల కొనుగోళ్లపై మార్కెట్ ఆదాయానికి ఎగనామం పెడుతూ.. మరోవైపు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర కన్నా తక్కువ చెల్లించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యార్డులో గత జనవరి 10 నుంచి వేరుశనగల క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. 4300 క్వింటాళ్ల వేరుశనగల కొనుగోళ్లు ఇప్పటి వరకు తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు 4300 క్వింటాళ్ల వేరుశనగల వ్యాపారం జరిగింది. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూ.4 వేలు. కానీ ఇప్పటి వరకు వేరుశనగలకు మద్దతు ధర పలకపోవడం గమనార్హం. సీజన్ ఆరంభం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు క్వింటాలుకు గరిష్టంగా రూ.3400, కనిష్టంగా రూ.3100, సగటు (మోడల్) ధర రూ.3200 పలికింది. ఏ విధంగా ధరల తీరును పరిశీలించినా మద్దతు ధర కన్నా తక్కువ పలికినట్టు స్పష్టమవుతోంది. సగటు ధర ప్రకారమైతే క్వింటాలుకు ఒక్కో రైతు రూ.800 చొప్పున నష్టపోయినట్టు స్పష్టమవుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లపై సుమారు రూ.34.40లక్షలు రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మార్కెట్ ఫీజుకు గండి రైతుల నుంచి కొనుగోలు చేసిన వేరుశనగలపై వ్యాపారులు వంద రూపాయలకు ఒక రూపాయి (ఒక శాతం) మార్కెట్ ఫీజు కింద చెల్లిస్తారు. కొందరు వ్యాపారులు పూర్తి స్థాయిలో సరకుకు మార్కెట్ ఫీజు చెల్లిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు కొనుగోలు చేసిన వేరుశనగలను తక్కువగా చూపిస్తూ.. మిగితా సరకు జీరో చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మార్కెట్ ఫీజు కింద చెల్లించాల్సిన 1 శాతం ఫీజును ఎగవేస్తూ సరకును కర్ణాటక సరిహద్దులు దాటించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారికంగా కొనుగోలు చేసిన సరకుకు సమానంగా జీరో వ్యాపారం సాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాత్రి వేళలో అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టకపోవడంతో సరిహద్దులోని గౌతాపూర్ మీదుగా సరకును తరలిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తతంగం ఈ వ్యవహారాలన్నీ అర్ధరాత్రి 12గంటలు తర్వాత మొదలై తెల్లవారుజాము వరకు కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మండల పరిధిలోని గౌతాపూర్ మీదుగా సరకు మహారాష్ట్రలోని షోలాపూర్‌కు తరలిస్తున్నారని తెలుస్తోంది. సుమారు రూ.కోటి సరకు అక్రమంగా సరిహద్దులు దాటిందని సమాచారం. సరిహద్దులో నిఘా పటిష్టం చేయడంతోపాటు రాత్రి పూట యార్డుపై అధికారులు దృష్టిసారిస్తే జీరో వ్యాపారానికి బ్రేక్‌పడి.. మార్కెట్ ఫీజు రూ.లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బషీరాబాద్‌లో కందుల జీరో వ్యాపారం బషీరాబాద్ మండలంలో కందుల జీరో వ్యాపారం జోరుగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో ఓ వ్యాపారి కందుల కొనుగోలుపై మార్కెట్ ఫీజు చెల్లించకుండానే కర్ణాటకకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. రైతుల పేరు మీదనే ఈ తతంగాన్ని కొనసాగిస్తూ సదరు వ్యాపారి మార్కెట్ ఫీజుకు గండి కొడుతున్నాడనే ఆరోపణలున్నాయి. -
చేయి తడిపితేనే.. ‘పంట’
ఆదోని, న్యూస్‌లైన్: అరకొర దిగుబడులతో నష్టాలు మూటగట్టుకున్న వేరుశెనగ రైతులను కొంతైనా ఆదుకునే ఉద్దేశంతో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కూడా దళారులు చేతివాటం చూపుతున్నారు. రైతుల పేరుతో ఉత్పత్తులను ఆయిల్ ఫెడ్‌కు తరలించి అక్కడి సిబ్బంది సహకారంతో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దారిన కాకుండా సొంతంగా ఉత్పత్తులు తీసుకెళ్లిన రైతులకు వద్ద నిరీక్షణ తప్పడం లేదు. వేరుశెనగకు గిట్టుబాటు లేకపోవడాన్ని దృష్టిలో ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించింది. ఆదోని, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే కేంద్రంలోని కొందరు సిబ్బందితో చేతులు కలిపి మాకింత, మీకింత ఒప్పందంతో దళారులు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. మామూళ్లు ఇచ్చిన వారికే ఫలితాలు ఆదోనిలో దళారీల సిఫారస్‌తో వచ్చిన వారి ఉత్పత్తుల కొనుగోళ్ల చురుగ్గా సాగిపోతున్నాయి. కొందరు కమీషన్ ఏజెంట్లు రైతులతో ఓ ధరకు మాట్లాడుకుని ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ కేంద్రానికి తరలిస్తున్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకం, తహశీల్దారు ధృవీకరణ పత్రాలను రైతులే తెస్తున్నారు. రూ. 3400కులోపుగా మాట్లాడుకుని వెంటనే డబ్బులు ఇస్తున్నారు. తర్వాత వాటిని అయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు తరలించి అక్కడి సబ్బంది సహకారంతో రూ.4వేలకు అమ్ముకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న కేంద్రంలోని అనధికార సిబ్బందికి రూ.150 నుంచి రూ.200 వరకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఇలా ఆదివారం కొందరు ఏజెంట్లు 200 క్వింటాళ్ల వరకు ఆయిల్‌ఫెడ్ కేంద్రంలో అమ్మినట్లు తెలిసింది. రోజుల తరబడి నిరీక్షించినా... వేరుశనగసాగుతో మూట కట్టుకున్న నష్టాలను ఆయిల్ ఫెడ్ కేంద్రంలో అమ్ముకుని కొంతైనా పూడ్చుకుందామన్న ఆశతో వచ్చిన రైతులకు రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. వీఆర్ఓ, తహశీల్దారు ధృవీకరణ పత్రాల కోసం రెండు, మూడు రోజులు తిరగాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రంలో శాంపిల్స్ చూపించి తెచ్చే తేదీని నిర్ణయించేందుకు మరో రోజు పడుతోంది. తెచ్చిన తర్వాత మూడు రోజులకు కూడా అమ్మక ం కావడం లేదు. అదే దళారీల ద్వారా వెళ్తే సులువుగా కొనుగోళ్లు సాగిపోతున్నాయి. ఎందుకీ పరిస్థితి.. మార్కెట్లో క్వింటా ధర రూ. 3500 మించి పలుకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్దతుధర(రూ.4వేలు)తో 1.50 లక్షల క్వింటాళ్లు కొనుగోలు లక్ష్యంగా కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల చివరి వరకు మాత్రమే గడువు విధించడంతో రైతులు అమ్మకాలకు డిమాండ్ పెరిగింది. ఆదోనిలో సోమవారం వెయ్యి క్వింటాళ్ల వరకు రైతులు కొనుగోలుకు ఉంచినట్లు అంచనా. -
గిట్టదయ్యా!
జిల్లాలో శనగ పంటను సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గోదాముల్లో బస్తాలు మూలుగుతున్నాయి. రైతుల కష్టాలను తీర్చాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చిన్నశెట్టిపల్లె (ప్రొద్దుటూరు),న్యూస్‌లైన్: ఇది రాజుపాళెం మండలం చిన్నశెట్టిపల్లె గ్రామంలో రైతులు సాగు చేసిన శనగ పంట. ఇక్కడ సుమారు 7వేల ఎకరాల మెట్ట పొలం ఉంది. ఎకరం కూడా మాగాణి పొలం లేదు. గ్రామంలో దాదాపు 200 గృహాలు ఉండగా ప్రతి ఇంటికి ఎంతో కొంత పొలం ఉంది. గతంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేసి నష్టపోయిన గ్రామ రైతులు క్రమేణా ఆ పంటలకు స్వస్తి పలికి శనగ పంటను సాగు చేయడం మొదలు పెట్టారు. గత 15 ఏళ్లుగా శనగ పంటను సాగు చేస్తున్నారు. పంట సాగు కోసం యాంత్రీకరణ విధానాన్ని కూడా నేర్చుకున్నారు. మందుల పిచికారికి, పంట సాగుకు ఇంత చిన్న గ్రామంలో వంద ట్రాక్టర్లు ఉన్నాయంటే ఇక్కడ యాంత్రీకరణ ప్రభావం ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. శనగ పంట సాగు కారణంగా ఈ గ్రామం జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. వందల బస్తాల్లో పంట పండించే రైతులు కూడా గ్రామంలో ఉన్నారు. గ్రామంలో రెండు మూడు కుటుంబాలకు వంద ఎకరాలకు పైగా పొలం ఉమ్మడి ఆస్తిగా ఉంది. ఇలాంటి గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. గిట్టుబాటు ధర ఏదీ..! పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో శనగ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2012 సంవత్సరంలో క్వింటాలు శనగలను రూ.5,400 వరకు రైతులు అమ్మారు. గత ఏడాది వీటి ధర రూ.3,900లు మాత్రమే ఉండటంతో గ్రామంలో ఇంకా సుమారు 30 శాతం మంది రైతులు నష్టాలకోర్చుకోలేక పంట దిగుబడిని గోదాముల్లో నిల్వ చేశారు. ప్రతి ఏడాది ఎకరాకు 8 బస్తాల వరకు దిగుబడి వస్తుండగా గత ఏడాది 3, 4 బస్తాలకే పరిమితమైంది. అసలు దిగుబడి రాని రైతులు కూడా ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. కాగా ప్రస్తుతం శనగలను రూ.2,800లకు కూడా అడిగే నాధుడు కరువయ్యాడు. ఇదిలావుండగా ఇంకో వారం పది రోజుల్లో రబీ సీజన్లో సాగు చేసిన పంట దిగుబడి చేతికందుతుంది. గత ఏడాది పండించిన పంట దిగుబడినే అమ్ముకోలేక రైతులు నష్టపోతుండగా ప్రస్తుతం మళ్లీ పంట చేతికందుతుండటంతో గ్రామ రైతులు పునరాలోచనలో పడ్డారు. ఈ విషయాని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గతంలో పంట సాగుకు ఖర్చులు తక్కువగా ఉండగా కూలీల కొరత కారణంగా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలు తగ్గడం పట్ల రైతులు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఇప్పట్లో ధర పెరుగుతుందన్న నమ్మకం కనిపించడం లేదు. దీంతో ఇన్నేళ్లు శనగ పంటపైనే ఆధారపడిన వీరు ఈ ఏడాది పంట మార్పిడి చేయాలనే యోచనలో ఉన్నారు. గత ఏడాది జిల్లాలో 1,12,194 హెక్టార్లలో శనగ పంటను సాగు చేయగా, ఈ ఏడాది 94,904 హెక్టార్లలో సాగు చేసిన శనగ పంట చేతికందనుంది. ప్రస్తుతం జిల్లాలో శనగ పంట సాగు చేసిన రైతులంతా గిట్టుబాటు ధర లేక దిగాలుగా ఉన్నారు. -
అప్పుల కుప్పలు!
న్యూస్‌లైన్ నెట్వర్క్, అనంతపురం : అనంత రైతాంగాన్ని తుపాను నిండాముంచింది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కనీసం పశుగ్రాసం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా 10 వేల హెక్టార్లలో వేరుశనగ దెబ్బతింది. రాప్తాడు మండలంలో 3200 హెక్టార్లలో పంట పాడైంది. కనగానపల్లి మండలంలో బోరుబావుల కింద 550 హెక్టార్ల లో సాగు చేయగా.. చాలా వరకు పంట తొల గించారు. అప్పటి నుంచి వర్షం పడడంతో పంటంతా పొలాల్లోనే కుళ్లిపోయింది. ఆత్మకూరు మండలంలో వెయ్యి ఎకరాల్లో పంట దెబ్బతింది. చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లో 200 హెక్టార్ల వరకు రైతులు పంట నష్టపోయారు. పెద్దవడుగూరు మండలంలో 15 వేల ఎకరాల్లో పంట కుళ్లిపోయింది. సుమారు 35 వేల ఎకరాల్లో పత్తి పంట మొగ్గ, పూత రాలిపోయింది. దీంతో దాదాపు రూ.12 కోట్లు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. మొక్కజొన్న కూడా దెబ్బతినింది. మడకశిర నియోజకవర్గంలోని మడకశిర, రొళ్ల, అగళి, గుడిబం డ, అమరాపురం మండలాల్లో మే, జూన్‌లో దాదాపు 10 వేల హెక్టార్లలో పంట పెట్టారు. ఆ తర్వాత పడిన వర్షాలకు 20 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు పడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కాయలు మొలకెత్తి నల్లగా మారా యి. పశుగ్రాసం కూడా లభించే పరిస్థితి లేదు. బ్రహ్మసముద్రం మండలంలో 15,600 హెక్టార్లలో వేరుశనగ సాగైంది. మండల వ్యాప్తంగా వర్షం వల్ల పంట తుడిచిపెట్టుకుపోయింది. బుక్కపట్నం మండలంలో దాదాపు 9 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. వర్షాలు రా క మొదట్లో కొంత నష్టం జరగ్గా.. వర్షం వచ్చి మిగిలిన పంటంతా దెబ్బతింది. అమడగూరు మండలంలో దాదాపు 9 వేల హెక్టార్లలో ముందస్తుగా వేరుశనగ సాగు చేశారు. పంట పూత దశలో వ్యాధులు సోకడంతో దిగుబడి అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఉన్న పంటంతా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. హిందూపురం, చిలమత్తూరు మండలాల్లో కూ డా పంటలు దెబ్బతిన్నాయి. పెనుకొండ మండలంలో 120 హెక్టార్లలో వేరుశనగ, 120 హెక్టార్లలో మొక్కజొన్న, 40 హెక్టార్లలో వరి, 2 హెక్టార్లలో రాగి పంట నష్టపోయింది. రొద్దం మండలంలో దాదాపు 400 ఎకరాల్లో వేరుశనగ నష్టం వాటిల్లింది. అయితే అధికారులు మాత్రం 20 ఎకరాల్లోనే నష్టం జరిగిందని చెబుతుండడం గమనార్హం. ఇదే మండలంలోని డీఆర్ కొట్టాలలోనే 200 ఎకరాల్లో వేరుశనగ నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. పరిగి మండలంలో 40 ఎకరాల్లో వేరుశనగ నష్టం వాటిల్లింది. సోమందేపల్లి మండలంలో పంటంతా నష్టపోయినట్లు రైతులు చెబుతున్నారు. గోరంట్ల మండలంలో 300 ఎకరాల్లో వేరుశనగ, 50 ఎకరాల్లో వరి పంట నష్టపోయింది. కాగా వేరుశనగ రైతుకు ఇంత భారీ స్థాయిలో నష్టం వాటిల్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇంతవరకు నష్టం అంచనా వేయలేదని ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ అధికారులు పత్తా లేకుండా పోయారని విమర్శిస్తున్నారు.