ఆకు ముడత
తామర పురుగులు, పచ్చ దోమలు ఆకుల కింది భాగన రసం పీల్చడం వల్ల ఆకులు ముడ్చుకుని మొక్కలు గిడస బారిపోతాయి. ఆకుల అడుగు భాగన గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. తామర పురుగు నివారణకు క్లోరో ఫిరిపాస్ 400 మిల్లీలీటర్లు ఒక లీటర్ వేపనూనెతో కలిసి 200 లీటర్లతో ఎకరానికి పిచికారి చేయాలి. పచ్చదోమ నివారణ కోసం డైమిదేమెట్ 400 మిల్లీలీటర్లు లేదా 300గ్రాముల ఎసిఫేట్ 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఎర్ర గొంగళి పురుగు
లార్వ దశలో ఉండే పురుగులు ఆకుల్లో పత్రహరితాన్ని తింటాయి. ఎదిగిన పురుగులు ఆకులను తినేసి కొమ్మలను, మొదళ్లను మాత్రమే మిగుల్చుతాయి. వీటి నివారణకు ప్రధానంగా ఆముదం పంటను ఎరగా వేసి నివారించవచ్చు. లేదా డైమిదేమెట్ 400 మిల్లీ లీటర్లు లేదా 300గ్రాములు మోనోక్రోటోపాస్ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి.
వేరు పురుగులు
ఇసుక నేల ల్లో ఈ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. పురుగులు నేలపై నివసిస్తూ వేర్లను కొరికి వేయడం వల్ల మొక్కలు నిలువుగానే వాడి, ఎండిపోతాయి. వీటి నివారణకు 3జీ గుళికలను ఎకరానికి 10 కేజీలు చల్లాలి.
తిక్క మచ్చ తెగుళ్లు
తిక్కమచ్చ తెగుళ్లు వేరుశనగ పంటను 30 రోజుల నుంచి ఆశిస్తున్నాయి.ఆకుపై గుండ్రటి మచ్చలు ఏర్పడి గోధుమ రంగులోకి ఆకు మారుతుంది. దీని నివారణకు ఎకరానికి మ్యాంకోజెబ్ 400గ్రాములు, క్లోరోథలిన్ 400గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
వేరుకుళ్లు తెగుళ్లు
పల్లిలో వేరుకుళ్లు తెగుళ్లు 30రోజుల నుంచి ఆశిస్తుంది. వేరుకుళ్లు తెగుళ్లకు వర్షభావ పరిస్థితులు అనుకూలం. మొదట కాండంపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. త ర్వాత నలుపు రంగులోకి మారి వేరు కుళ్లిపోతుంది. నివారణకు ట్రైకోడర్మా పౌడర్‌ను చల్లాలి. లేదా మ్యాంకోజబ్‌ను 400 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి మొదళ్ల పై చల్లాలి. సకాలంలో తెగుళ్ల లక్షణాలను గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంటలను కాపాడుకోవచ్చు.
వేరుశనగలో సస్యరక్షణ
Published Tue, Nov 25 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement
Advertisement