బాల్కొండ : వేరుశనగ దిగుబడిలో విత్తే సవుయుం కూడా ప్రాధాన్యత వహిస్తుంది. జిల్లాలో సెప్టెంబర్ మధ్యలోనుంచే విత్తుకుంటున్నారు. వచ్చేనెల 15వ తేదీ వరకు పల్లీలను విత్తుకోవచ్చు. నీరు నిలువని ఇసుక నేలలు, ఎర్ర నేలలు అనుకూలం. నల్లరేగడి నేలల్లో పంట వేయుకపోవడం వుంచిది.
విత్తనశుద్ధి
వుంచి కాయులను విత్తనాలుగా ఎంపిక చేసుకోవాలి. వుుడతలు పడిన, పగిలిన, రంగు వూరిన గింజలు పనికిరావు. మంచి విత్తనాలను ఎంపిక చేసుకుని, కిలో విత్తనానికి గ్రావుు కార్బండైజమ్‌తో శుద్ధి చేసి 24 గంటలు నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి.
నేల తయారీ
వేరుశనగ పంట వేసే భూమిలో ఎలాంటి కలుపు మొక్కలు ఉండకుండా ట్రాక్టర్‌తో లేదా నాగలితో మూడు నుంచి నాలుగు సార్లు దున్నాలి. సాధారణంగా జిల్లాలో మొక్కజొన్న పంట కోసిన తర్వాత రెండుసార్లు ట్రాక్టర్‌తో దున్నుతారు. పల్లి విత్తనాలను చల్లిన తర్వాత మరోసారి దున్నుతారు. కొందరు రైతులు నాగలితో దున్నుతూ సాళ్లలో విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసేముందే ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వేసి, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి. విత్తే సమయంలో 18 కిలోల యూరియాను, విత్తన 30 రోజుల తర్వాత 9 కిలోల యూరియాను వేయాలి.
తగినంత తేమ ఉన్నప్పుడే నేలలో విత్తనాలు వేయాలి. విత్తన 15 రోజుల తర్వాత నీటిని అందించాలి. నేల స్వభావాన్ని బట్టి తర్వాతి తడులను అందించాలి. సాధారణంగా ఎనిమిదినుంచి తొమ్మిది తడుల్లో పంట చేతికి వస్తుంది.
పల్లి సాగుకు తరుణమిదే
Published Thu, Sep 25 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement