![Farmer dies while burning corn farms at Chennaraopet](/styles/webp/s3/article_images/2024/05/9/corn.jpg.webp?itok=mid6mrTD)
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాపయ్యపేటలో మొక్కజొన్న కొయ్యాలు కాల్చుతూ ప్రమాదావశాత్తు మంటల్లో చిక్కుకొని ఓ రైతు సజీవ దహనమయ్యారు.గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు(65)తన వ్యవసాయ బావి వద్ద మొక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టాడు. అనుకోకుండా మంటలు వ్యాపించి పక్కనే మరో రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోటకు వ్యాపించాయి.
దీంతో మంటలను ఆర్పేందుకు వెళ్లిన పాపారావు ప్రమాదవశాత్తు అదే మంటల్లో చిక్కుకొని ఊపిరాడక సజీవ దహనమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆత్రికి తరలించినట్లు ఎస్‌ఐ అరుణ్‌కుమార్ తెలిపారు. పాపారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment