Corn crop
-
వరంగల్‌లో విషాదం.. వ్యక్తి సజీవ దహనం
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాపయ్యపేటలో మొక్కజొన్న కొయ్యాలు కాల్చుతూ ప్రమాదావశాత్తు మంటల్లో చిక్కుకొని ఓ రైతు సజీవ దహనమయ్యారు.గ్రామానికి చెందిన అల్లంనేని పాపారావు(65)తన వ్యవసాయ బావి వద్ద మొక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టాడు. అనుకోకుండా మంటలు వ్యాపించి పక్కనే మరో రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోటకు వ్యాపించాయి.దీంతో మంటలను ఆర్పేందుకు వెళ్లిన పాపారావు ప్రమాదవశాత్తు అదే మంటల్లో చిక్కుకొని ఊపిరాడక సజీవ దహనమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆత్రికి తరలించినట్లు ఎస్ఐ అరుణ్‌కుమార్ తెలిపారు. పాపారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అంకాపూర్ @మక్కవడలు.. చికెన్‌తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అంకాపూర్ చికెన్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఆ దేశీ చికెన్ అంటే తెలియనివాళ్లు ఉండరు. దీన్ని తినేందుకు హైదరాబాద్ సహా వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజూ పలువురు వస్తుంటారు. దేశవిదేశాలకు సైతం ఆంకాపూర్ దేశీ చికెన్ పార్శిళ్లుగా వెళుతున్న విషయం తెలిసిందే. చికెన్‌తో పాటు పశువుల గడ్డిని పెంచేందుకు వినియోగించే ఎర్రజొన్న విత్తనానికి కూడా ఇటీవల ఈ ప్రాంతం ఫేమస్ అయింది. అంకాపూర్‌లో ఎర్రజొన్న విత్తనాన్ని బైబ్యాక్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు సైతం ఎగుమతి చేసే కంపెనీలు 40 వరకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చికెన్, ఎర్రజొన్న విత్తనంతో పాటు మరో విషయంలోనూ అంకాపూర్ ప్రత్యేకతను సాధిస్తోంది. అదే అంకాపూర్ ‘మక్క వడలు’. ఈ ఒక్క ప్రాంతంలోనే ఆ మక్క వడలు లభ్యమవుతాయి. ప్రతి ఏటా జూన్ నెల నుంచి జనవరి నెలలోపు ఈ వడలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దేశీ చికెన్‌తో మక్క వడలను నంజుకుని తింటే.. ఆ రుచే అద్భుతం అంటూ భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు. మక్క వడల పార్సిళ్లు సైతం భారీగా తీసుకెళుతున్నారు. ఈ రహదారిలో వెళ్లేవారు కచ్చితంగా మక్క వడల రుచి చూడడం ఆనవాయితీగా మారింది. రోహిణి కార్తెలోనే... అంకాపూర్ గ్రామ రైతులు రోహిణి కార్తెలోనే మొక్కజొన్న విత్తడమనేది ప్రత్యేకం. బోర్లలో నీరు సమృద్ధిగా ఉన్న రైతులు మే నెల మొదటి వారంలోనే మొక్కజొన్న వేస్తారు. సుమారు 500 ఎకరాల్లో పంట వేస్తారు. జూలైలో పంట వస్తుంది. ఈ రైతులు నేరుగా పచ్చి కంకులను అమ్ముతారు. దీంతో ప్రతి ఏటా జూలై నుంచి మక్క వడలు ఇక్కడ తయారు చేస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న వానాకాలం పంటను జూన్‌లో నాటడం ప్రారంభిస్తారు. అదేవిధంగా పసుపులో అంతరపంటగానూ మొక్కజొన్న వేస్తారు. ఇలా వేసే పంట ప్రతి ఏటా మొత్తం కలిపి జిల్లాలో 30,800 ఎకరాలు ఉంటోంది. అంకాపూర్ మక్క మార్కెట్ నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్ వరకు మొక్కజొన్న ఎగుమతి చేస్తున్నారు. మధ్యవర్తులు ఎకరం లెక్కన పంట కొనుగోలు చేస్తారు. లేనిపక్షంలో ట్రాలీ ఆటోల లెక్కన కొనుగోలు చేస్తారు. మొక్కజొన్న సీజన్ జనవరి వరకు ఉంటుంది. దీంతో అంకాపూర్‌లో 7 కుటుంబాల వారు ప్రత్యేకంగా మక్క వడలను ఈ సీజన్లో తయారు చేస్తున్నారు. సీజన్లో మక్క వడలు మాత్రమే.. 15 ఏళ్ల క్రితం నుంచే మా ఊళ్లో మక్క వడలు చేసి అమ్మడం ప్రారంభమైంది. గతంలో మేము టిఫిన్ సెంటర్ నడిపేవాళ్లం. మక్క వడలు చేయడం ప్రారంభించాక వీటికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గిరాకీ విపరీతంగా ఉంటోంది. దీంతో సీజన్లో 7 నెలల (జూన్ నుంచి జనవరి వరకు) పాటు పూర్తిగా మక్క వడలు మాత్రమే చేసి అమ్ముతున్నాం. –రెగుల్వార్ సిద్ధు, కపిల దంపతులు -
పీచే కదా అని తీసిపడేయకండి!
మొక్కజొన్న కంకులను తీసుకొని దానికి ఉండే దారాల్లాంటి పీచు (కార్న్ సిల్క్)ను మాత్రం తీసి పారేస్తుంటాం. అయితే, ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ పీచును ప్రపంచవ్యాప్తంగా వివిధ రపాల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని సేకరించి, ఎండబెట్టి అమ్ముకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కజొన్న సాగులో ప్రపంచంలో భారత్ 6వ స్థానంలో ఉంది. 2021–22 రబీ గణాంకాల ప్రకారం ఏపీలో 4.82 లక్షల ఎకరాల్లో, తెలంగాణలో 4.74 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. మొక్కజొన్న కండెలు కోసేటప్పుడే పీచును కండె నుంచి తీసి జాగ్రత్త చేసుకోవాలి. సేకరించిన పీచును 0.1% ఉప్పు ద్రావణంతో కడిగి శుభ్రం చేసి ఎండబెట్టాలి. తేమ శాతం 7–10% మధ్యలో ఉండేలా చూసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పీచును అనేక ఆహారోత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. ఒక మొక్కజొన్న పొత్తు నుంచి జాగ్రత్తగా సేకరించి ఎండబెడితే సగటున ఒక గ్రాము పీచు వస్తుందని అంచనా. ఏక పంటగా సాగు చేస్తే ఎకరానికి 32 వేల మొక్కలు వేస్తారు. అంటే, ఎకరానికి 32 కిలోల ఎండు పీచును సేకరించవచ్చన్న మాట. షుగర్, కిడ్నీ, ప్రొస్టేట్ సమస్యలకు ఉపశమనం మొక్కజొన్న పీచులో అధిక పోషక విలువలతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ప్రొటీన్లు, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు,కాల్షియం, పొటాషియం, వంగనీసు, సిటోస్టెరాల్, స్టిగ్మాస్టెరాల్, అల్కలాయిడ్లు, సపోనిన్లు, టాన్నిన్లు, ఫ్లావనాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. దేహంలో నుంచి అధిక నీటిని బయటకు పంపుతుంది. మూత్రవిసర్జనను సులభతరం చేయటం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. మూత్రవిసర్జనలో నొప్పి, మూత్రనాళంలో/ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపకరిస్తుంది. ప్రొస్టేట్ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇన్సులిన్ సహజ ఉత్పత్తిని పెంపొందించి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, అధిక కొలెస్టరాల్ సమస్యలను నివారిస్తుంది. గౌట్ నొప్పిని తగ్గిస్తుంది. కొవ్వును నియంత్రించి అధిక బరువును నివారించడానికి కూడా మొక్కజొన్న పీచు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఆహారోత్పత్తులెన్నో.. బ్రెడ్, బిస్కట్ల తయారీలో మొక్కజొన్న పీచు పొడిని కొద్ది మేరకు కలుపుతున్నారు. దీన్ని కలిపినందు వల్ల వాటి రంగు, వాసన ఏమీ మారవు. పోషక విలువలు పెరుగుతాయి. బియ్యపు పిండి, పచ్చి బొప్పాయి, నువ్వుల పిండితో మొక్కజొన్న పీచు పొడిని గరిష్టంగా 10% కలుపుతూ ఆరోగ్యదాయకమైన లడ్డూలు తయారు చేయొచ్చు. చపాతీ, పరోటా, రైతా, పప్పు వంటి వంటకాల్లో మొక్కజొన్న పీచు పొడిని కలుపుకుంటే మం పోషక విలువలు లభిస్తాయి. టాబ్లెట్లను కూడా మొక్కజొన్న పీచుతో తయారు చేయవచ్చు. బరువు తగ్గడానికి, చర్మ సౌందర్యం కోసం ఈ టాబ్లెట్లను వాడుతున్నారు. ఒక్కో మాత్రను ర.20 వరక ధర పలుకుతోందట. మొక్కజొన్న పీచు ప్రాసెసింగ్, నిల్వకు అధిక ఖర్చుతో కూడిన నిర్మాణాలు అవసరం లేదు. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, గ్రామీణ నిరుద్యోగులకు మొక్కజొన్న పీచు సేకరణ ద్వారా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. మొక్కజొన్న రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి/సేంద్రియ రైతులకు మరింత ఉపయోగకరమని చెప్పొచ్చు. మొక్కజొన్న పీచుతో టీ ఇలా.. ఎండబెట్టిన మొక్కజొన్న పీచుతో టీ(కషాయం) కాచుకొని తాగటం ఒక మేలైన పద్ధతి. 2 కప్పుల నీటిలో 2 చెంచాల ఎండిన పీచును కలిపి, తక్కువ మంటపై 10 నిమిషాలు మరిగించి వడకడితే.. చక్కటి టీ రెడీ అవుతుంది. బెల్లం, పంచదార, తేనె తగుమాత్రంగా కలిపి రోజుకు 3 కప్పుల వరకు తాగొచ్చు. వట్టి మొక్కజొన్న పీచు టీకి కొంచెం మట్టి వాసన ఉంటుంది. అందుకని ఇతర పదార్థాలతో కలిపి టీపొడిని తయారు చేసుకొని వాడొచ్చు. ఎండిన మొక్కజొన్న పీచు, ఎండు నిమ్మ బద్దలను వేర్వేరుగా పిండి చేసి కలిపి టీ కాచుకోవచ్చు. (చదవండి: 'కిచెన్ క్వీన్స్'..వంటగదితోనే వ్యాపారం సృష్టించారు!) -
అయోమయంలో రైతన్నలు... ఏ పంట విత్తుకోవాలి!
ఆర్మూర్ : వర్షాకాలం ప్రారంభ దినమైన మిరుగు దాటి రెండు వారాలు గడుస్తున్నా తొలకరి వర్షాలు ముఖం చాటేయడంతో జిల్లా రైతాంగం సోయాబీన్ లేదా మొక్కజొన్న పంటల్లో ఏ పంట విత్తుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు అందుబాటులో ఉండి సలహాలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖ సిబ్బంది జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేధింపుల కారణంగా క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండలేకపోతున్నామని అంటున్నారు. మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా సోయాబీ న్ పంటను వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించారు. ఈ వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా 58,715 ఎకరాల్లో సోయాబీన్, 32,185 ఎకరాల్లో మొక్కజొన్న పంటను పండించడానికి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వాతావరణ పరిస్థితులు అందుకు తగినట్లుగా లేకపోవడంతో రైతులకు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. సోయాబీన్ పండించే రైతులు.. వర్షాధార పంట అయిన సోయా పండించడానికి తొలకరి వర్షం కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నారు. తొలకరి వర్షాలు ప్రారంభంతోనే విత్తనాలు విత్తుకోవడానికి రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలను సిద్ధం చేసుకున్నారు. మొక్కజొన్న పంటతో పోలిస్తే కూలీల ఖర్చు తక్కువ కావడమే కాకుండా సాగుకు శ్రమ తక్కువగా ఉంటుంది. మొక్కజొన్న పండించడానికి పడిన శ్రమలో సగం శ్రమిస్తే అదే లాభం ఆర్జించడంతో పాటు వర్షాధార పంట కావడంతో రైతులు సోయాబీన్ పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. మొక్కజొన్న పండించే రైతులు.. మే చివరి వారం రోహిణి నుంచి జూలై 15 వరకు మొక్కజొన్న విత్తవచ్చు. ఇది వర్షాధార పంట. నీటి వసతి ఉన్నవారు సైతం వేయవచ్చు. 120 రోజుల పంట. నీటి వసతి ఉన్న వారు పచ్చి మక్కబుట్ట కోసం ఆర్మూర్ మండలంలో 500 ఎకరాల్లో పండిస్తున్నారు. పచ్చి బుట్ట పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. బోరు బావుల్లో నీటి వసతి ఉన్న రైతులు మాత్రం ధైర్యంగా మొక్కజొన్న విత్తుకొని సాగునీటిని అందిస్తున్నారు. వర్షంపై ఆధారపడ్డ రైతులు మాత్రం ఆకాశం వైపు వర్షం కోసం చూస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలకరి కోసం ఎదురుచూపు.. ప్రతి ఏడాది లాగే సోయాబీన్ విత్తుకుందామని అనుకున్నాము. కాని తొలకరి సకా లంలో రాకపోవడంతో బో రు బావిలో ఉన్న నీటితో రెండు మడులు మొక్కజొ న్న విత్తాను. మొక్కజొన్నకు కూడా వర్షం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో తోచడం లేదు. భూగర్భ జలాలు సైతం ఆశించిన స్థాయిలో లేవు. చేసేది లేక తొలకరి కోసం ఎదురు చూస్తున్నాము. – చిన్నయ్య, రైతు, (శ్రీరాంపూర్) ఫత్తేపూర్, ఆర్మూర్ మండల -
ధర వెరీ గుడ్డు.. పౌల్ట్రీ రైతుకు ఊరట
సాక్షి, అమరావతి: కోడిగుడ్డు ధర ఊహించని రీతిలో పెరుగుతోంది. ఫారమ్ గేటు వద్ద రికార్డు స్థాయిలో ఒక్కో గుడ్డు ధర రూ.5.25 పలుకుతుండగా.. రిటైల్‌గా రూ.6.50 వరకు విక్రయిస్తున్నారు. ఇదే ధర మరికొంత కాలం కొనసాగితే.. నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 5.60 కోట్లకు పైగా కోళ్లున్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ మేత, ఇతర ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి సంఖ్య తగ్గిపోగా.. రోజుకు 4.75 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర పరిధిలో నిత్యం 2.50 కోట్ల నుంచి 3 కోట్ల గుడ్లు వినియోగమవుతున్నాయి. కాగా, దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు గల్ఫ్ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఫారమ్ గేటు వద్ద ధర రూ.6 దాటే అవకాశం కన్పిస్తోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.7 మార్క్‌ను చేరుకునే అవకాశాలు లేకపోలేదంటున్నాయి. ఎగుమతులకు ఊపు సాధారణంగా మన రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కొంతమేర గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. విదేశాల విషయానికి వస్తే ప్రతినెలా 2 కోట్ల గుడ్లు గల్ఫ్ దేశాలకు, 50 లక్షల నుంచి 75 లక్షల వరకు ఇతర దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం టర్కీ, నెదర్లాండ్స్‌లో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత నెలలో ఏకంగా 20 కోట్ల గుడ్లు ఎగుమతి అయ్యాయి. 50 లక్షలకు మించి ఎగుమతి కాని కతార్‌కు ప్రస్తుతం 2 కోట్లకు పైగా ఎగుమతి అవుతున్నాయి. ఇతర దేశాలకు కూడా కోటిన్నరకు పైగా గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయి. ఫలితంగా గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రైతులకు ఊరట మొక్కజొన్న టన్ను గత ఏడాది రూ.20 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.24 వేలకు చేరింది. సోయాబీన్ టన్ను గతేడాది రూ.38 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ.48 వేల నుంచి రూ.51వేల మధ్య వరకు ఉంది. ఆయిల్ తీసిన తవుడు (డీవోపీ) గతేడాది కిలో రూ.9 నుంచి రూ.10 ఉండగా.. ప్రస్తుతం రూ.17–18 మధ్య ఉంది. ఇలా ఊహించని రీతిలో పెరిగిన మేత ధరల వల్ల పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశ వరకు ఒక్కో కోడికి రూ.300 నుంచి రూ.315 వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఫారమ్ గేట్ వద్ద ఒక్కో కోడిగుడ్డు ఉత్పత్తికి రూ.4.65 నుంచి రూ.4.75 వరకు ఖర్చవుతోంది. ఫిబ్రవరి నుంచి ఇదే రీతిలో ఖర్చవుతున్నా నెల రోజుల క్రితం వరకు ఫారమ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.3.90కి మించి పలకలేదు. ఫలితంగా పౌల్ట్రీ రైతులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కాగా, ప్రస్తుతం ఊహించని రీతిలో విదేశాలకు పెరిగిన ఎగుమతులు దేశీయంగా పౌల్ట్రీ రైతుకు కాస్త ఊరటనిచ్చాయి. ఎగుమతులు పెరగటం వల్లే.. చాలా రోజుల తర్వాత పౌల్ట్రీ రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇది పౌల్ట్రీ పరిశ్రమకు శుభపరిణామం. ఊహించని రీతిలో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు పెరగడం వల్లే ఫారమ్ గేటు వద్ద రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే టర్కీ, నెదర్లాండ్స్ దేశాల్లో ఉత్పత్తి తగ్గడం మన గుడ్డుకు కలిసొచ్చింది. – తుమ్మల కుటుంబరావు, చైర్మన్, ఎన్ఈసీఎస్, విజయవాడ జోన్ తొలిసారి గిట్టుబాటు ధర కృష్ణా జిల్లాలో 70 కోళ్ల ఫారాలు ఉన్నాయి. సుమారు కోటి కోళ్లను పెంచుతుండగా.. 75 లక్షల నుంచి 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. పెరిగిన ముడిసరుకు ధరల వల్ల ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక్కో కోడిపై నెలకు రూ.30 చొప్పున నష్టపోయాం. ఆ తర్వాత నెలకు రూ.10నుంచి రూ.15 మేర నష్టాలను చవిచూశాం. ప్రస్తుతం ఫారమ్ గేట్ వద్ద గుడ్డు తయారీకి రూ.4.75 వరకు ఖర్చవుతుండగా.. తొలిసారి రూ.5.25 ధర లభిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ఇదే రీతిలో కనీసం ఏడాది పాటు కొనసాగితే నష్టాల నుంచి గట్టెక్కగలం. – ఆర్.సత్యనారాయణరెడ్డి, అధ్యక్షుడు, కృష్ణాజిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (చదవండి: సీఎం జగన్ దూరదృష్టికి నిదర్శనమే ఆర్బీకేలు: బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంస) -
‘మక్క’ల్లో మస్తు తిన్నరు!
సాక్షి, హైదరాబాద్: మక్కల విక్రయాల్లో మెక్కుడు.. బడా వ్యాపారులకు మొక్కుడు.. చిన్నవ్యాపారులను తొక్కుడు.. ఇదీ మార్క్‌ఫెడ్ బాగోతం. నీకింత, నాకింత.. అన్నట్లుగా అధికారులు, బడా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ‘మార్క్‌ఫెడ్ ఎప్పుడూ నష్టాల్లోనే ఉంటుంది. కానీ, అందులో కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతార’న్నది వ్యవసాయశాఖలో సాధారణంగా వినిపించే మాట. గత రబీ మొక్కజొన్న టెండర్లలో వ్యాపారులకు లబ్ధి, తమకు అక్రమ ఆదాయం సమకూరేలా వ్యూహాన్ని రచించారు. ఒకేసారి కనీసం 80 వేల మెట్రిక్ టన్నులు కొనగలిగే సామర్థ్యం కలిగిన బడా వ్యాపారులే బరిలోకి దిగేలా నిబంధనల్లో మార్పులు చేశారు. 100 గోదాముల్లో నిల్వలు... గత యాసంగికి సంబంధించి 9.43 లక్షల టన్నుల మొక్కజొన్నలను క్వింటాకు రూ.1,760 చొప్పున రైతులకు చెల్లించి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. అందుకోసం రూ.1,659 కోట్లు వెచ్చించింది. ఆ మొక్కజొన్నలను రాష్ట్రంలో దాదాపు 100 గోదాముల్లో నిల్వ చేసింది. వాటిని తిరిగి వ్యాపారులకు విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించింది. అయితే మూలధర నిర్ణయించకుండానే టెండర్లు పిలవడం విమర్శలకు తావిస్తోంది. పంటను కొనుగోలు చేసిన ధర కన్నా చాలా తక్కువ ధరకు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. రెండు జిల్లాల్లో ఓ సంస్థ క్వింటాకు రూ.1,190 చొప్పున టెండర్ దక్కించుకొంది. అంటే.. క్వింటాకు రూ. 570 చొప్పున మార్క్‌ఫెడ్‌కు నష్టం వాటిల్లింది. ఆ టెండర్ సంస్థ ఇప్పుడు క్వింటాకు రూ.1,350 పైగా మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది. (చదవండి: తహసీల్దార్లకే ‘నాలా’ అధికారాలు!) రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన ఏజెన్సీలకే దక్కేలా మొన్నటి వరకు మార్క్‌ఫెడ్‌లో గోదాములవారీగా చిన్న, చిన్న మొత్తాల్లో గ్రూప్‌లు చేసి టెండర్లు పిలిచేవారు. దానివల్ల దాదాపు 100 గోదాముల్లోని మొక్కజొన్నల కోసం చిన్న వ్యాపారులు కూడా టెండర్లలో పాల్గొనేవారు. 8.48 లక్షల టన్నుల మొక్కజొన్న నిల్వలను పది పెద్ద విభాగాలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఒక్కో గ్రూప్‌లో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన మొక్కజొన్న నిల్వలు ఉంటాయి. క్వింటా మొక్కజొన్నలకు గరిష్ట బిడ్డింగ్ ధర రూ.1,128 కాగా, కనిష్టంగా రూ.1,001 కోట్ చేశారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని మొక్కజొన్నకు రూ.1,190 ధర ఇచ్చేలా వ్యాపారిని ఒప్పించారు. అన్నింటికీ కలిపి ఏడు ఏజెన్సీలే బిడ్డింగ్ దాఖలు చేయడం గమనార్హం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర క్వింటాకు రూ. 1,760 కాగా... హైదరాబాద్ పౌల్ట్రీ మార్కెట్ ధర ప్రస్తుతం రూ. 1,500 ఉంది. కొత్త మొక్కజొన్నలను వ్యాపారులు రూ. 1,350 చొప్పున కొంటున్నారు. ఈ మూడు ధరల్లో ఏ ఒక్కదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. (చదవండి: కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం) మూలధర నిర్ణయిస్తే ముందుకు రాలేదు: మార్క్‌ఫెడ్ ‘ఈ–టెండర్లో మొక్కజొన్నను విక్రయిస్తుంటాం. సేకరించిన ధరను బట్టి మూల ధర నిర్ణయించినా, చాలామంది బిడ్డర్లు ముందుకు రాలేదు. వర్షాల వల్ల మొక్కజొన్న చాలాచోట్ల దెబ్బతిన్నది. రంగుమారింది. విక్రయించకపోతే బూజు పట్టిపోతుంద’ని మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. అధికారులు మాయాజాలం చేస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. -
నియంత్రిత బాటలోనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవసరాలకు తోడు డిమాండ్ ఉన్న పంటలనే ప్రోత్సహించాలన్న సీఎం కేసీఆర్ సూచనకు అనుగుణంగానే ఈ వానాకాలం పంటల సాగు నియంత్రిత బాటలో సాగుతోంది. గత వానాకాలంలో సాగు పంటల వివరాలను బేరీజు వేసి ఈ వానాకాలంలో మొత్తం 1.25 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేయగా అన్నదాతలు ఇప్పటివరకు 1.13 కోట్ల ఎకరాల్లో పంటల సాగు చేపట్టారు. మక్కలు తగ్గాయి.... కందులు పెరిగాయి వ్యవసాయ శాఖ తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది రాష్ట్రంలో మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గింది. 2019లో మక్కలు రాష్ట్రవ్యాప్తంగా 10.12 లక్షల ఎకరాల్లో వేయగా గతేడాది ఇదే సమయానికి 8.38 లక్షల ఎకరాల్లో వేశారు. కానీ ఈ ఏడాది మాత్రం గతేడాది మొత్తం సాగులో కేవలం 10.6 శాతమే రైతులు మొక్కజొన్న పంట వైపు మొగ్గు చూపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.74 లక్షల ఎకరాల్లోనే మక్కలు సాగు చేయగా అందులోనూ స్వీట్ కార్న్, పాప్ కార్న్, బేబీ కార్న్ రకాలే ఎక్కువగా ఉన్నాయి. మక్కల స్థానంలో కంది సాగు చేపట్టాలన్న వ్యవసాయ శాఖ సూచనల మేరకు ఈసారి కంది సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది మొత్తం 7.38 లక్షల ఎకరాల్లో కంది పంట వేయగా ఈ ఏడాది ఇప్పటికే 9.54 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ విస్తీర్ణం ఇంకా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఆ రెండు పంటలదీ అదే బాట.. ఈ వానాకాలంలో పత్తిని వీలైనంత మేర ఎక్కువ సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రైతులకు అవగాహన కల్పించి రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 60 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఇప్పటికే 56.26 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు 40 లక్షల ఎకరాలవగా గతేడాది 54.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. కానీ ఈ వానాకాలంలో ఇప్పటికే గతేడాదికన్నా ఎక్కువ సాగు జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. వరి విషయానికి వస్తే 2019లో 41.20 లక్షల ఎకరాల్లో రైతులు నాట్లు పెట్టారు. అదే ఈ సీజన్లో దాదాపు అదే స్థాయిలో 38.35 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అయితే ఆగస్టు చివరి వరకు నాట్లు వేసే అవకాశం ఉన్నందున ఈ విస్తీర్ణం ఇంకా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు సాగయిన 38.35 లక్షల ఎకరాలకుగాను 28 లక్షల ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారమే ఫైన్ (మేలు) రకం ధాన్యం సాగు చేయడం గమనార్హం. మొత్తంమీద రాష్ట్ర ప్రభుత్వ నియంత్రిత సాగు ఆలోచన తొలి ఏడాదిలోనే కార్యరూపంలోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు -
రబీ రాజు.. మొక్కజొన్న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి అదిరిపోయింది. వ్యవసాయ రంగానికి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో పంట కోత, నూర్పిడి, రవాణా, కొనుగోళ్లకు ఎటువంటి ఆటంకం లేకుండా పోయింది. రాష్ట్రంలో రబీలో సాగు చేసిన మొక్కజొన్న విస్తీర్ణంలో పంట కోతలు వివిధ జిల్లాల్లో సగటున 70 శాతం పూర్తి కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 80, 90 శాతం వరకు పూర్తి అయ్యాయి. కాగా మొక్కజొన్న దిగుబడిలో ఆంధ్రప్రదేశ్.. దేశంలో రెండో స్థానంలో, ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది. మూడో ముందస్తు అంచనా ప్రకారం.. 2019–20 రబీలో హెక్టార్‌కు అత్యధికంగా 7,588 కిలోల దిగుబడి సాధించింది. పొరుగునున్న తెలంగాణ కంటే ఇది 490 కిలోలు అధికం. అలాగే మన రాష్ట్రంలో ఖరీఫ్ దిగుబడి కంటే ఇది 2,873 కిలోలు ఎక్కువ కావడం గమనార్హం. రబీ మొక్కజొన్నసేకరణ ఇలా.. ► ప్రభుత్వం 348 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో 228 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. మిగతా చోట్ల పంట ఎప్పుడు చేతికి వస్తే అప్పుడు కొనుగోళ్లు మొదలుపెడతారు. ► బుధవారం వరకు 1,977 మంది రైతుల నుంచి 13,029 టన్నుల మొక్కజొన్నల్ని కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.22.93 కోట్లు. ప్రస్తుత సమస్యలివీ.. ► గోనె సంచులు దొరకడం లేదు. మార్క్‌ఫెడ్ ద్వారా గోనె సంచులు అందించేందుకు డీఎంసీఎస్లతో చర్చలు జరుగుతున్నాయి. ► గ్రామ వ్యవసాయ సహాయకుల్లో (వీఏఏ) కొంతమందికి పౌరసరఫరాల సంస్థ నుంచి పాస్వర్డ్ రాలేదు. ఫలితంగా కొనుగోళ్లలో జాప్యం జరుగుతుంది. ► ధాన్యం సేకరణ కేంద్రం (పీపీసీ) యాప్‌లో ఇ–కర్షక్ డేటా కనిపించట్లేదని అక్కడక్కడా వినిపిస్తోంది. రైతుల డేటా మార్క్‌ఫెడ్, పౌరసరఫరాల సంస్థ యాప్‌ల్లో కనిపించట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తున్నామని అధికారులంటున్నారు. ► కోత యంత్రాలకు ఎకరానికి రూ.2,800ను ప్రభుత్వం నిర్దేశించగా యజమానులు రూ.3,300 నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. వ్యాపారులు మోసం చేస్తే ఉపేక్షించ వద్దు.. ► రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించినందున రైతులెవ్వరూ కంగారు పడి తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ► కరోనా నేపథ్యంలో విత్తన ఉత్పత్తి, శుద్ధికి ఇబ్బంది లేకుండా సీడ్మెన్ అసోసియేషన్‌తో సమన్వయం. ► అక్కడక్కడా ఎంఎస్పీకి మొక్కజొన్నల్ని కొనడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఏదో ఒక సాకు చూపి ఎంఎస్పీ రూ.1,760లో ఎంతో కొంత కోత వేస్తున్నట్టు, కొందరు వ్యాపారులు.. రైతులు తక్కువకు అమ్ముకునేలా చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ► పాస్ పుస్తకం ఎవరి పేరుంటే వారే కొనుగోలు కేంద్రాలకు రావాలన్న నిబంధనను మహిళల విషయంలో సడలించాలని వినతులు వస్తున్నాయి. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి మరో వారంలోపు కోతలు పూర్తవుతాయి ► ఏదైనా గ్రామంలో 85 మెట్రిక్ టన్నులకు మించి జొన్న, మొక్కజొన్నల దిగుబడి ఉంటే అక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పాం. లేదంటే.. రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక కేంద్రాన్ని పెట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించాం. ► కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,760. దీనికన్నా ఎవరన్నా తక్కువకు అడిగితే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా 1907కు ఫిర్యాదు చేయాలి. – అరుణ్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ గిట్టుబాటు ధర ప్రకటించడం హర్షణీయం నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న వేశా. లాక్‌డౌన్‌తో రవాణా లేని సమయంలో క్వింటాల్‌ను రూ.1,450కి మించి అమ్ముకోలేకపోయా. ఈ దశలో ప్రభుత్వం రూ. 1,760 గిట్టుబాటు ధరను ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయం. – తోరం పోశయ్య, సీతానగరం, తూర్పుగోదావరి జిల్లా -
సబ్బు నీటితో చెలగాటం వద్దు
మొక్కజొన్న రైతులను అల్లాడిస్తున్న కత్తెర పురుగును చంపడానికి సబ్బు, డిటర్జెంట్ నీళ్లను సుడిలో పిచికారీ చేస్తే చాలు పురుగు ఖతం అని తెలియజెప్పే వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బట్టలుతికే సబ్బు పొడి కలిపిన నీటిని పోసీపొయ్యగానే కత్తెర పురుగు విలవిల్లాడుతూ నిమిషాలలో చనిపోతుండడంలోనూ ఎటువంటి సందేహం లేదు కూడా. కానీ, సబ్బుపొడి ద్రావణం పిచికారీ వలన కత్తెర పురుగుతో పాటు మొక్కజొన్న పంట కూడా మాడిపోతున్న వాస్తవం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బట్టలు ఉతకడానికి తయారు చేసిన సబ్బులు, సబ్బుపొడులను పంటలపై ప్రయోగించడం తగదని మెదక్ జిల్లాలోని డా. రామానాయుడు–ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డా. గున్నంరెడ్డి శ్యామ సుందర్‌రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. బట్టలు ఉతకడానికి వాడే సబ్బులు, సబ్బు పొడుల తయారీలో వాడే రసాయనాలు మొక్కలపై తీవ్ర ప్రభావాలను చూపగలవన్నారు. సబ్బులు, సబ్బు పొడులను కీటకనాశనులుగా వాడటం దాదాపు 200 ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ, మొక్కలపై వాడే సబ్బు పొడుల తయారీలోనూ, ఎంపికలోనూ, వాడవలసిన మోతాదులోనూ ప్రత్యేకమైనవని గుర్తించాలి. కత్తెర పురుగు నివారణకు సబ్బు పొడి నీటిని వాడిన కొందరు రైతుల క్షేత్రాలలో మొక్కజొన్న మొక్కలు దెబ్బతినడం గమనించిన డా. శ్యామ సుందర్ రెడ్డి, కెవికె క్షేత్రంలోని మొక్కజొన్నపై లీటరు నీటికి 5 గ్రాముల సబ్బుపొడి నుంచి 50 గ్రాముల వరకు వివిధ మోతాదులలో ప్రయోగించి పరిశీలించారు. మోతాదు పెరుగుతున్నకొద్దీ.. మొక్కపై దుష్ప్రభావం కోలుకోలేనంత ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. సబ్బు ద్రావణం పిచికారీ చేసిన కొద్ది నిమిషాల తర్వాత సగం మొక్కలపై మంచి నీటిని పిచికారీ చేశారు. ఆ మొక్కల పరిస్థితి కొంచెం నయమనిపించినప్పటికీ, మిగతా మొక్కల పరిస్థితి ప్రమాదరకరంగానే ఉందని చెప్పారు. కాబట్టి, కత్తెర పురగు నివారణకు సబ్బు పొడి ద్రావణం వాడకపోవడం మంచిదనే అభిప్రాయం వెలిబుచ్చారు. మొక్కజొన్న సుడులను మట్టి, ఇసుక, రాతిపొడి, వరిపొట్టు వంటి మొక్కలకు హాని కలగని పదార్థాలతో నింపి, వాటిని మెటారైజియం లేదా ఇ.పి.ఎన్. లేదా బి.టి. బాక్టీరియా ద్రావణాలతో తడిపితే కత్తెర పురుగును సమర్థవంతంగా రసాయన రహితంగా నిర్మూలించవచ్చని గత ఏడాది తాము ప్రయోగ పూర్వకంగా నిరూపించిన విషయాన్ని డా. శ్యామ సుందర్ రెడ్డి(99082 24649) ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
ఆహాఏమిరుచి..అనరామైమరచి
సాక్షి, కొవ్వూరు (పశ్చిమ గోదావరి) : వర్షాకాలం వచ్చింది.. దాని వెంటే మొక్కజొన్న పొత్తులు వచ్చాయి. ఒక పక్క వర్షం కురుస్తుంటే మరో పక్క వేడి వేడి జొన్నపొత్తులు తింటుంటే ఆ మజానే వేరంటారు మొక్కజొన్న పొత్తుల ప్రియులు. ఏటా జులై నుంచి సెప్టెంబర్ వరకూ దొరికే మొక్కజొన్న పొత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో దొరికే మొక్కజొన్న పొత్తుల కన్నా దొమ్మేరు పొత్తుకు ఓ ప్రత్యేక రుచి ఉంటుంది. ఇక్కడ ఉండే నేల స్వభావంతో ఈ ప్రాంతంలో పండే మొక్కజొన్న పొత్తులు మంచి రుచిని కలిగి ఉంటాయి. స్థానికులకు ఉపాధి మొక్కజొన్నపొత్తుల సీజన్ పలువురికి ఉపాధిగా మారుతుంది. దొమ్మేరుతో పాటు దూర ప్రాంతాలకు సైతం పొత్తులు ఎగుమతి అవుతుండటంతో స్థానికులకు ఆదాయం సమకూరుతోంది. ఈ సీజన్లో ఇక్కడ రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకుని పొత్తులు అమ్ముతూ జీవనం సాగిస్తారు. ఒక్కో దుకాణంలో వెయ్యి పొత్తుల వరకూ కాల్చి అమ్మి ఆదాయం పొందుతారు. ఈ ప్రాంతంలో దొరికే పొత్తులను హోల్‌సేల్‌గా కొని, దుకాణాల్లో కాల్చి రిటైల్‌గా అమ్ముతుంటారు. ఒక్కో పొత్తు ప్రస్తుతం రూ. 10 నుంచి రూ. 15 వరకూ సైజును బట్టి అమ్మకాలు జరుపుతున్నారు. అయితే ప్రస్తుతం ధరలు అధికంగా ఉండడంతో ఈ ధర గిట్టుబాటు కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు ఎకరం మొక్కజొన్న చేను రూ.50 వేలు మొక్కజొన్న సీజన్ ప్రారంభం కావడంతో పొత్తులకు మంచి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎకరం మొక్కజొన్న తోటకు రూ.50 వేల వరకూ వ్యాపారులు చెల్లించి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా మంచి రేటని రైతులు చెబుతున్నారు. అయితే గత ఏడాది తయారవుతున్న మొక్కజొన్న పొత్తును పురుగు ఆశించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి లేక కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం నష్టాలను చవిచూశారు. దీంతో సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఈ ఏడాది దొమ్మేరు, పరిసర గ్రామాల్లో అతి తక్కువ సాగు ఉండడం దీనికి కారణం అని చెబుతున్నారు. ఏది ఏమైనా కేవలం వర్షాకాలంలో దొరికే దొమ్మేరు ప్రాంతంలోని మొక్కజొన్న పొత్తును ఒక్కసారైనా రుచి చూడాలని ఈ ప్రాంతం మీదుగా వెళ్లే ప్రయాణికులు, ప్రజలు భావిస్తుంటారు. దొమ్మేరు మొక్కజొన్న పొత్తులకు భలే డిమాండ్ కొవ్వూరు మండలం దొమ్మేరులో మొక్కజొన్న పొత్తుల దుకాణాలు -
అకాలవర్షంతో అతలాకుతలం
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. చేన్లలో చివరి దశ ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి మొత్తం వానకు తడిసి నేలరాలింది. పీచు దశలో ఉన్న మొక్కజొన్న పంట నేలకొరిగింది. మామిడి తోటల్లో చెట్లకు ఇప్పుడే వస్తున్న పూత మొత్తం రాలిపోయింది. పలుచోట్ల ఈదురుగాలలు, భారీ వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇండ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. మల్యాల అడ్డరోడ్డు సమీపంలో జగిత్యాల–కరీంనగర్ రహదారిపై వెళ్తున్న కారుపై ఎండిన చెట్టు కొమ్మ విరిగిపడటంతో కారు ముందుభాగం దెబ్బతిన్నది. రామడుగు మండలం తిర్మలాపూర్‌లో పొన్ను దేవయ్యకు చెందిన కోళ్లఫామ్ రేకుల షెడ్డు కూలిపోవడంతో 2,500 కోడిపిల్లలు చనిపోయి రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని రైతు తెలిపాడు. గంగాధర వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్మకానికి తెచ్చిన కందులు అకాల వర్షానికి తడిసిపోయాయి. పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో చెట్లు విరిగిపడగా, విద్యుత్ స్తంభం కూలిపోయింది. హన్మంతునిపేట వద్ద ఓ చెట్టు విరిగి రోడ్డుపై పడటంతో రాకపోకలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. మంథని నియోజకవర్గంలో మిర్చి కొన్ని చోట్ల కాయ దశలో ఉండటంతో వర్షానికి తడిసి నల్లబడే అవకాశముందని రైతులు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం దమ్మన్నపేటలో నిమ్మ మోహన్‌రెడ్డికి చెందిన బొప్పాయితోటలో దాదాపు 200 చెట్లు విరిగిపోయాయి. -
కత్తెర పురుగుకు కళ్లెం
మొక్కజొన్నను ఖరీఫ్‌లో ఆశించిన ఫామ్ ఆర్మీ వార్మ్ (కత్తెర పురుగు) తెలుగు రాష్ట్రాల్లో జొన్నకూ పాకింది. మొక్కజొన్నను అమితంగా ఇష్టపడే ఈ లద్దెపురుగు ఆ పంట అందుబాటులో లేనప్పుడు ఇతరత్రా 80 రకాల పంటలకు పాకే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతోంది. చాలా ఏళ్లుగా అమెరికా, ఆఫ్రికాలలో పంటలను ఆరగిస్తున్న ఈ పురుగు మన దేశంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే చాలా రాష్ట్రాలకు పాకింది. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఇది మొక్కజొన్న పంటను ఆశించింది. మొక్కజొన్న నుంచి కొన్ని చోట్ల జొన్నకు, ఇతర రాష్ట్రాల్లో చెరకుకు కూడా పాకినట్లు చెబుతున్నారు. రసాయనిక పురుగుమందులతో ప్రయోజనం లేదని, కషాయాలు, మట్టి ద్రావణం, రాక్ డస్ట్ వంటి రసాయనికేతర పద్ధతుల ద్వారానే సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నామని, రైతులు భయపడ వద్దని ఏపీలో పర్యటిస్తున్న ఎఫ్.ఎ.ఓ.కి చెందిన సుస్థిర వ్యవసాయ నిపుణురాలు అన్నే సోఫీ, రైతు సాధికార సంస్థలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్ జాకీర్ హుస్సేన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కత్తెర పురుగు వల్ల దిగుబడి నష్టాన్ని నిలువరించడవచ్చంటున్నారు. అంతరపంటలు, కంచె పంటగా నేపియర్ గడ్డి మొక్కజొన్న, జొన్న పొలాల్లో ఖచ్చితంగా అంతరపంటలు వేయటం మేలన్నారు. రబీలో మొక్కజొన్న వేస్తున్న రైతులు 2 సాళ్లు మొక్కజొన్న, 1 సాలు మినుము/పెసర అంతరపంటలుగా వేసుకోవాలి. కంచె పంటగా నేపియర్ గడ్డిని 4 వరుసలు వేసుకోవాలని డాక్టర్ జాకీర్ హుస్సేన్ సూచించారు. అగ్ని అస్త్రం, ఎర్రమట్టి నీరు, బూడిద, సాడస్ట్.. ఈ పురుగు సోకిన మొక్కజొన్న మొక్కల మొవ్వుల్లో అగ్ని అస్త్రం, ఎర్రమట్టి నీరు, బూడిద, సాడస్ట్ వేయడం, నీమాస్త్రం, వేపగింజల కషాయం (మార్కెట్లో అమ్మే వేపనూనె అంత బాగా పనిచేయటం లేదు) పిచికారీ ద్వారా ప్రకృతి వ్యవసాయదారులు కత్తెర పురుగు వ్యాప్తిని ఖరీఫ్‌లో సమర్థవంతంగా అరికట్టి, దిగుబడి నష్టాన్ని నివారించుకోగలిగారన్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు పురుగు సోకగానే దున్నేశారని డా. జాకీర్ హుస్సేన్ తెలిపారు. కత్తెర పురుగు లేత ఆకులను తినేస్తుందని, కండెలను ఏమీ చేయదని అంటూ ఇది కనిపించగానే రైతులు తోటలను తొలగించాల్సిన పని లేదన్నారు. గుడ్డు దశలో ఉన్నప్పుడు గుడ్లను ఆకులపై గుర్తించి, నలిపేసి నిర్మూలించుకోవడం మంచిదన్నారు. విష ముష్టి (నక్స్ వామిక) కాయలను ముక్కలు కోసి 5 రోజులు మురగబెట్టి.. 10 లీటర్ల నీటికి చిన్న గ్లాసుడు చొప్పున ఇది చల్లాలని ఆయన తెలిపారు. పంచదార పొలంలో చల్లితే చీమలు వచ్చి ఈ పురుగులను తినేస్తాయి. 16 లీటర్ల స్రేయర్ ట్యాంకు నీటిలో 20 గ్రాముల పంచదార కలిపి పంటపై పిచికారీ చేస్తే.. ఈ తీపికి వచ్చే చీమలు పురుగులను తినేస్తాయని డా. జాకీర్ హుస్సేన్(88268 97278) అన్నారు. ఇప్పట్లో నిర్మూలించలేం: ఎఫ్.ఎ.ఓ. ‘కత్తెర పురుగు చాలా ఏళ్ల నుంచే అమెరికా, ఆఫ్రికా సహా 60 దేశాల్లో ఉంది. భారత్‌లో అనేక దక్షిణాది, ఉత్తరాది రాష్టాలకు ఈ ఏడాది పాకింది. మొక్కజొన్న, జొన్న, చెరకుకు కూడా సోకింది. ఒకేసారి తుడిచిపెట్టడలేం. చాలా సంవత్సరాలు కొనసాగుతాయి. కానీ, జీవన పురుగుమందులు, ఎర్రమట్టి ద్రావణం, బయో పెస్టిసైడ్స్ తదితరాలతో అదుపు చేసుకోవచ్చు. రసాయనిక పురుగుమందులు చల్లితే సమస్య తీరదు. ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతుల ద్వారా దీన్ని సమర్థవంతంగా నివారించగలుగుతున్నట్లు రైతుల పొలాల్లో జరిపిన అధ్యయనంలో గుర్తించాం..’ అని ఎఫ్.ఎ.ఓ. సుస్థిర వ్యవసాయ నిపుణురాలు అన్నే సోఫీ(70427 22338) వివరించారు. డా. జాకీర్ హుస్సేన్, అన్నే సోఫీ -
ముగ్గురు రైతుల ఆత్మహత్య
మఠంపల్లి (హుజూర్నగర్)/కొడంగల్ రూరల్/తొగుట(దుబ్బాక): అప్పులబాధతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం భోజ్యాతండాకు చెందిన అజ్మీరా బాలు (40) సాగు పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ.6 లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడులు ఆశాజనకంగా లేక అప్పు తీర్చే మార్గం కనిపించక శనివారం ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పెద్దనందిగామకి చెందిన వెంకటయ్య(45) బోర్లు పడక పోవడం, పంటల దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. మనస్తాపం చెందిన వెంకటయ్య శనివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. సిద్దిపేట జిల్లా పెద్ద మాసాన్‌పల్లికి చెందిన దుద్దెడ మల్లేశంగౌడ్ (35) వర్షాల్లేక మొక్కజొన్న పంట దెబ్బతింది. రూ.5 లక్షల అప్పు అయింది. దీంతో విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
మొలకెత్తిన మక్కకంకులు
శివ్వంపేట: పదిరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న రైతులకు నష్టాన్ని చేకూర్చింది. చేతికి వచ్చిన పంటను చేజారిపోతుండటంతో పెట్టిన పెట్టుడి సైతం చేతికందని పరిస్థితి నెలకొంది. వర్షాధార పంటగా మొక్కజొన్నను సాగుచేశారు. పంటను కోసి జోడు పెట్టిన మొక్కజొన్న కంకులు మొలకెత్తాయి. పిల్లుట్ల పంచాయతీ లింగోజిగూడ తండాలో సుమారు 20 ఎకరాల్లో మొక్కజొన్నను కోసి జోడు ఏర్పాటు చేశారు. రెండు రోజుల నుంచి వాతావరణం అనుకూలిస్తుండడంతో నూర్పిళ్ళకు సిద్ధమైన రైతులకు జోడు నుంచి మక్కలను తీసిన క్రమంలో మొలకెత్తాయని రైతులు చంద్రు, విఠల్, మంగ్య, స్వామి, గెమ్యా, శంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులుచేసి పంట సాగుచేసుకున్న తమకు నష్టాలే మిగిలాయని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు. -
పంటనష్టంపై స్పందించని అధికారులు
వెల్దుర్తి: కుండపోత వర్షాలు, వరదల బీభత్సంతో చేతికి వచ్చిన పంటలు నాశనమైనా అధికారులు స్పందించడం లేదని వెల్దుర్తికి చెందిన రైతులు చెంద్రయ్య, రాజు, మల్లయ్య ఆరోపించారు. బుధవారం వారు మొలకెత్తిన మొక్కజొన్న కంకులను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. నాలుగు రోజులుగా రెవెన్యూ, వ్యవసాయ అధికారులకు ఫోన్లు చేస్తున్నా స్పందించడం లేదని ఆరోపించారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్టాలపై సర్వే చేయాలని కోరారు. -
పంట పశువుల పాలు
కేసముద్రం : ఆరుగాలం శ్రమించినా వరుణదేవుడు కరుణించలేదు. బావుల్లో నీళ్లు అడుగంటి పోయాయి. ఎంతో ఆశతో వేసిన పంట కళ్ల ముదే ఎండిపో యి పశువుల పాలైంది. కేసముద్రం మండలంలోని కేసముద్రం విలేజ్‌కు చెందిన కముటం కృష్ణమూర్తి తనకున్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. కొంతమేరకు పంట పెరగగానే వర్షాలు వెనుకబాటు పట్టాయి. బావిలో కూడా నీళ్లు అడుగంటి పోవడంతో పంటకు నీరు కరువైంది. పంట ఎండిపోతుండడంతో తనకున్న పశువులకైనా మేతకు పనికి వస్తుందని భా వించిన రైతు గురువారం పశువులను ఇలా పంటచేనులోకి తోలాడు. -
మొక్కజొన్నకు మాయరోగం
చిట్టాపూర్ రైతుల్లో అయోమయం ఎర్రబారిన 50 ఎకరాల పంట నష్టం అంచున 40 మంది రైతులు తెగులును గుర్తించే పనిలో వ్యవసాయాధికారులు దుబ్బాక: ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మొక్కజొన్న సేనుతో సహవాసం చేసే రైతన్నలకు కష్టమొచ్చింది. రైతన్నల ఆరుగాలం కష్టం బూడిద పాలైంది. మొక్కజొన్నకు మాయదారి రోగం రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మొలకలు విత్తడం నుంచి చేను చేతికొచ్చే సమయానికి ఒక్కొక్క మొక్క కర్ర రైతన్న కళ్లేదుటే ఎర్రబారుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఒక్కొక్క రైతు ఎకరానికి రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. ఇటు పెట్టిన పెట్టుబడి పోయే... అటు రెక్కల కష్టం బూడిద పాలు కాబట్టే... ఇది ప్రకృతి వైపరీత్యమో... మానవ తప్పిదమో తెలియక తికమక పడుతున్న తీరు దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన 40 మంది రైతుల్లో నెలకొంది. వీరికి కన్నీరే మిగిలింది.. గ్రామానికి చెందిన రైతులు గొల్ల నారాయణ- 3 ఎకరాలు, దుంపేటి సిద్ధిరాములు- 1.20, పోతనక యాదగిరి- 2, దుంపేటి రేణుక-1.20, గొల్ల మల్లయ్య- ఎకరం, రెడ్డి కవిత- 1.20, కూస సూరవ్వ-2 ఎకరాలు, కమటం రవి-1.20, జిగిరి గుట్టయ్య-1.20, మొనగారి నర్సింగ్ రావు- ఎకరం, కమటం నర్సయ్య- 2 ఎకరాలు, మంతూరి యాదయ్య- ఎకరం, నగరం లక్ష్మి- ఎకరం, జిగిరి కనకవ్వ- ఎకరం, చాకలి పోశయ్య-1.20, సిద్ధిని ఎల్లయ్య-ఎకరం, మంతూరి రాందాస్- 2 ఎకరాలు, నవ్యాతు విఠల్- ఎకరం, గంగాళ్ల పర్శయ్య-ఎకరం, గొల్ల నాగరాజు-ఎకరం, తీగల లక్ష్మి నర్సయ్య-1.20, కూస బాలయ్య- 20 గుంటలు, కూస కొండయ్య-2.00, రెడ్డి రమేశ్-1.20, దుంపేటి ఎల్లం- ఎకరంతో పాటు మరో 20 మంది రైతులకు చెందిన 50 ఎకరాల మొక్కజొన్న ఎండు బారుతోంది. యూరియా వేయగానే.. మొక్కజొన్న పంట వేసి 65 రోజులు కావస్తోంది. వేసిన మొక్కజొన్నకు కిసాన్, ఉజ్వల లాంటి యూరియాను వేశారు. యూరియా వేసిన రెండు మూడు రోజుల నుంచే మొక్క కాండం కింది భాగంలో ఉన్న ఆకులు ఎర్రబారుతున్నాయి. దీంతో లబోదిబోమంటూ వ్యవసాయాధికారులకు సదరు రైతులు తమకు జరిగిన నష్టాన్ని విన్నవించుకున్నారు. చేసిన రెక్కల కష్టం మట్టిపాలయ్యిందని వాపోతున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు వ్యవసాయాధికారులు వచ్చి యూరియా, ఎర్రబారిన మొక్కజొన్న కర్రలను సేకరించి పరీక్షల నిమిత్తం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ ప్రయోగశాలకు తరలించారు. నివేదిక వచ్చిన తర్వాతనే మొక్కజొన్నకు వచ్చిన రోగాన్ని నిర్ధారించగలమని అధికారులు తెలిపారు. పరీక్షలకు పంపించాం గ్రామంలో రైతులు వేసుకున్న మొక్కజొన్న పంటను పరిశీలించాం. తేమ లేనప్పుడు, మొక్కపై యూరియాను వేసినప్పుడే ఇలాంటి రోగం వస్తోంది. లేకుంటే కాండం తొలుచు పురుగు ఉన్నప్పుడు కూడా పంట ఎర్రబారుతుంటుంది. యూరియాలో 46 శాతం నత్రజని ఉండకపోయినా ఇలాంటి సమస్య వస్తుంది. కాండం తొలుచు పురుగును కార్భోఫిరాన్ గుళికలను పిచికారి చేసి నిరోధించవచ్చు. మొక్కజొన్నకు యూరియా వేసే ముందు తేమ సరిగ్గా ఉన్నదా లేదా సరి చూసుకోవాలి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. - ఏఓ మల్లేశం, దుబ్బాక యూరియా వేయగానే ఎర్రబారింది నాకున్న మూడెకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాను. కిసాన్, ఉజ్వల యూరియా వేయడంతోనే రెండు, మూడు రోజుల్లో మొక్కజొన్న ఆకులు ఎండు బారుతున్నాయి. మూడెకరాలకు సుమారుగా రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టాను. కళ్లెదుటే మొక్కజొన్న కర్రలు ఎండుముఖం పట్టడంతో ఏం చేయాలో తెలియడం లేదు.- గొల్ల నారాయణ, రైతు, చిట్టాపూర్ ప్రభుత్వం ఆదుకోవాలి వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగు చేశాను. పంటకు యూరియా వేయగానే ఒక్కొక్క కర్ర ఎండు బారుతోంది. మొక్కజొన్న చేతికొచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. చేతికొచ్చిన పంటను చూస్తే ఏడుపొస్తుంది. - దుంపేటి సిద్ధిరాములు, రైతు, చిట్టాపూర్ -
కలుపు మొక్కలు తీసేందుకు కాడెద్దుగా..
మర్పల్లి: పంట సాగులో పెరిగిన కలుపు మొక్కలు తీసేందుకు ఓ మహిళ కాడెద్దుగా మారింది. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన మొల్లయ్యకు వ్యవసాయ భూమి తక్కువగా ఉండడంతో అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. వర్షాలు కురవడంతో అద్దె అరకతో మొక్కజొన్న విత్తనాలు వేశాడు. మొక్కజొన్న పంటలో కలుపు మొక్కలు పెరిగాయి. ఎంతకూ కాడెడ్లు అద్దెకు దొరకకపోవడంతో అతని భార్య మొల్లమ్మ కాడుద్దుగా మారి కలుపు మొక్కలు తీసే పరికరాన్ని లాగింది. ఆదివారం ఇలా అరెకరంలో వారు కలుపు మొక్కలు తీశారు. -
70 ఎకరాల మొక్కజొన్న దగ్ధం
ఒంగోలు : ప్రకాశం జిల్లా గవిలవారిపాళెం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 70 ఎకరాల్లో మొక్కజొన్నపంట దగ్ధమైంది. దాదాపు కోటి రూపాయల వరకు ఆస్థినష్టం ఉంటుందని భావిస్తున్నారు. పరిసర పొలాల్లో క్రిమికీటకాల నివారణకు వేసిన మంటల వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధిత రైతులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు సంఘటనస్థలానికి వెళ్లి పంట నష్టం వివరాలు సేకరించారు. -
చెరుకు సాగులో జాగ్రత్త
ఈ పురుగులతో జర భద్రం పొలుసు పురుగు కణుపు ఏర్పడినప్పటి నుంచి చెరుకు నరికే వరకూ పొలుసు పురుగు ఆశిస్తుంది. నీటి ఎద్దడి ఉంటే మరింత నష్టపరుస్తుంది. నివారణకు విత్తనపు దవ్వను పొలుసు పురుగు అశించని తోటల నుంచి సేకరించాలి. మూ డు కాళ్ల చెరుకు గడలను మలాథియన్ 2.0 మిల్లీలీటర్ల లేదా థైమిథోయేట్ 1.7 మిల్లీలీట ర్ల మందును లీటర్ నీటిలో కలిపి 15 నిమిషాల్లో ముంచి నాటాలి. చెరుకులో పురుగు వ్యాప్తిని అరికట్టడానికి ఆకులు తుంచి(మొవ్వలో 8 ఆకులు ఉంచి) ైడె మిథోయేన్ 3 మిల్లీలీటర్ల నీటిలో పిచికారీ చేయాలి. కాండం తొలుచు పురుగు చెరుకు నాటినప్పటి నుంచి నరికే వరకు ఈ పురుగు సోకి పంట నష్టపరుస్తుంది. చెరుకు బాల్య దశలో పీక పురుగుగా పంటకు నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు ఎక్కువగా వర్షాధార పంటపై సోకుతుంది. నివారణకు లోతైన కాలువలో చెరుకు గడలు నాటాలి. నాటే ముందు మిథైల్ పారాథియాల్ పొడి మందును ఎకరాకు 10 కిలోల చొప్పున వేయాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గరదగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. ఎండోసల్ఫాన్ రెండు మిల్లీలీటర్ల మందును లీటరు నీటిని కలిపి నాటిన 4,6,9 వారాల్లో పిచికారీ చేయాలి. కాటుక తెగులు ఈ తెగులు సోకిన చెరుకులో మొక్కలోని మొవ్వ పొడవైన నల్లని కొరడాగా మారుతుంది. దిగుబడి, రసం నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు విత్తనపు గెనువుల ద్వారా వ్యాపిస్తుంది. మూడు కాళ్ల గెనువులను వేడి నీటిలో మూడు నిమిషాలు లేదా తేమతో మిళితమైన గాలిలో 2 గంటలు విత్తనశుద్ధి చేయాలి. గుడ్డిదుబ్బు తెగులు ఈ తెగులు ఆశించిన మొక్కల మొదళ్ల నుంచి సన్నని తెల్లని పిలకలు అధికంగా వస్తాయి. ఆకులు పొలిపోయి చిన్నవిగా కనిపిస్తాయి. మొక్కలు గడ్డిదుబ్బలు మాదిరి గా ఉంటాయి. నివారణకు తెగులు సోకిన మొక్కలను తోటల నుంచి వేరు చేయరాదు. దుబ్బలను తవ్వి తగులపెట్టాలి. విత్తనపు ముచ్చెలను వేడి నీటిలో గానీ, తేమతో మిళి తమైన వేడి గాలిలో గానీ శుధ్ది చేయాలి. కీట కాలను నివారించడానికి మలాథియాన్ లేదా డైమిథోయేట్ రెండు మిల్లీలీటర్ల మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేయాలి. అడవి పందుల నుంచి రక్షణ కందకాల తవ్వకం పొలం చుట్టూ రెండు అడుగుల వెడల్పు. ఒకటిన్నర అడుగుల లోతులో కందకాన్ని తవ్వినట్లుయితే అడవి పందులు పొలంలోకి రాకుండా నిరోధించవచ్చు. అలాగే వర్షాభావ సమయంలో కందకాల్లో నిల్వ ఉన్న నీరు పొలాన్ని తేమగా ఉంచుతుంది. దీంతో భూగర్భ జలాలు కూడా పెరుగతాయి. విషపు ఎరలు గోధుమ పిండిలో ఉల్లిపాయ, వెల్లుల్లిని మొత్తగా చూర్ణం చేసి కలిపి పొలం చుట్టూ పెట్టాలి. ఈ ఉండలను పందులు తినడం అలవాటు చేసుకుంటాయి. ఆ తర్వాత సోడియం మోనోప్లోరో ఎసిటేట్ లేదా వార్ఫెరిన్ కలిపిన ఉండలను పెట్టాలి. వీటిని తిన్న పందులు అజీర్ణానికి లోనై దరిదాపులకు రావు. రసాయనిక పద్ధతులు ఫోరేట్ గుళికలను ఇసుకలో కలిపి చిన్నచిన్న సంచుల్లో కట్టి పంట చూట్టూ అక్కడక్కడ కర్రలను నాటి వేలాడదీయాలి. గాలితో పంట చుట్టూ పరిసరాల్లో ఫోరేట్ గుళికల నుంచి ఘాటైన వాసన వస్తుంది. ఈ వాసనకు అడవి పందులు పంటలోకి వచ్చేందుకు జంకుతాయి. కుళ్లిన కోడిగుడ్ల ద్రావణాన్ని తీసుకుని నీటిని కలిపి పొలం చుట్టూ చల్లడం ద్వారా దుర్గంధం వచ్చి పందులు ఆవైపు రావు. వెంట్రుకలు వెదజల్లాలి క్షౌరశాలలో దొరికే వ్యర్థ వెంట్రుకలను సేకరించి పంట పొలం గట్లపై ఒక అడుగు వెడల్పులో చల్లాలి. పంటను తినేందుకు వచ్చిన పందులు వీటి వాసన చూడగానే వెంట్రుకలు ముక్కులోకి వెళ్లి శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతాయి. ఊర పందుల విసర్జనాలను పొలం చుట్టూ చల్లితే వచ్చే దుర్వాసనకు అడవిపందులు దూరంగా ఉంటాయి. అలాగే వేటకుక్కలతో పందులను తరమడం, టపాసుల పేల్చడంతో వంటి పద్ధతులతో కూడా పందులు రాకుండా నివారించవచ్చు. జీవ కంచెలు ఒక రకమైన పంట పొలాన్ని కాపాడుకోవాలంటే దాని చుట్టూ నాలుగు వరుసుల్లో మరో పంట మొక్కలను పెంచడంతో పందుల బారి నుంచి రక్షించుకోవచ్చు. వేరుశెనగ పంట చుట్టూ నాలుగు వరుసల్లో కుసుమ పంటను వేయడం ద్వారా ఆ మొక్కకు ఉన్న ముళ్లు అడవి పందులను గాయపర్చే అవకాశం ఉంది. అలాగే కుసుమ ఘాటుగా ఉండటంతో పం దులు వేరుశెనగ మొక్కను గుర్తించలేవు. మొక్కజొన్న పంట చుట్టూ అముదం వేసి రక్షించు కొవచ్చు. ఇనుప కంచే ఏర్పాటుతో పంట చుట్టూ బలమైన కర్రలు పాతి వీటికి ఒక అడుగు ఎత్తులో ముళ్లను కలిగి ఉన్న ఇనున తీగను ఏర్పాటు చేయాలి. ఒక ఎకరా పొలం చుట్టూ ముళ్ల కంచె వేయడానికి సూమారు రూ.10 వేల నుంచి రూ 15 వేల వరకు ఖర్చవుతుంది. వలయాకారంలో ఉండే ముళ్ల కంచెను కూడా వేయవచ్చు. పందులు కంచెను దాటే సమయంలో పదునుగా కంచె ముళ్లు పందిని గాయపరుస్తాయి. ఒకసారి గాయపడిన పంది మళ్లీ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించవు. సోలార్ ఫెన్సింగ్ పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కంచెను ఏర్పాటు చేసి పందుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. సోలార్ ప్లేట్ల నుంచి సూమారు 12 వోల్టుల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పందులు కంచెను తాకినప్పడు షాక్‌కు గురువుతాయి. ఈ దెబ్బతో అడవిపందులు పారిపోతాయి. తక్కువ సామర్థ్యం గల విద్యుత్‌తో ఇలా చేయడంతో మనుషులకు, జంతువులకు ఎలాంటి ప్రాణహాని ఉండదు. -
ఈ వారం వ్యవసాయ సూచనలు
మొక్కజొన్న ఖరీఫ్ మొక్కజొన్న పైరు గింజ పాలు పోసుకునే దశలో పక్షుల బెడద తీవ్రంగా ఉంటుంది కాబట్టి కంకులను పక్కనున్న ఆకులతో చుట్టవ లెను. పంట నలువైపులా 2- 3 వరుసలలో ఈ పద్ధతి పాటించాలి. ఎరుపు రంగు మెరిసే రిబ్బన్లను ఉత్తర- దక్షిణ దిక్కుగా పంటకు 0.5 మీటరు ఎత్తులో కట్టాలి. ఇలా చేయడం వల్ల పక్షులు పంటపై వాలవు. పక్వానికి వచ్చిన పైరులోని కండెలపై పొర ఎండిపోయి, గింజల అడుగు భాగంలో నల్లటి మచ్చ ఏర్పడినప్పుడు కోత చేపట్టాలి. కండెలను ఎండబెట్టి తేమ శాతం 20కి తగ్గిన తర్వాత నూర్పిడి చేయాలి. పత్తి పత్తి పూత, మొగ్గ సమయంలో బోరాన్ లోపం వల్ల పూల ఆకారం మారి ఆకర్షణ పత్రాలు చిన్నవై లోపలికి ముడుచుకునిపోతాయి. లోపం ఎక్కువగా ఉన్నప్పుడు పూత, మొగ్గ దశలో ఎండిపోవడం, చిన్న కాయలు రాలిపోవడం, మొక్కలు గిడసబారిపోవడం, ప్రధాన కాండంపై పగుళ్లు ఏర్పడడం, కాయలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, కాయలపై పగుళ్లు ఏర్పడటంలాంటి లక్షణాలను గమనించవచ్చును. వేరుశనగ.. ఖరీఫ్‌లో విత్తుకొన్న వేరుశనగ పంట ప్రస్తుతం కాయ తవ్వి తీసే దశలో ఉంది. 70-80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణంగా మారి, కాయ డొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు మాత్రమే కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. భూమి నుంచి మొక్కలను తీయడానికి ట్రాక్టర్‌తో నడిసే వ్యవసాయ వర్సిటీ రూపొందించిన బ్లేడు గుంటక లేక వేరుశనగ డిగ్గరును వాడుకోవాలి. విత్తనం కొరకు కావాల్సిన కాయలను నేరుగా ఎండలో ఎండబెట్టి కూడా నీడలో ఆరబెట్టాలి. కాయల్లో తేమ శాతం 9కి లోపు ఉండేటట్లు ఆరబెట్టి గోనె లేక పాలిథిన్ సంచుల్లో నిల్వ చేయాలి. చెరకు సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలల్లోనూ, వర్షాభావ పరిస్థితుల్లోనూ, మరియు అధిక వర్షాలు వచ్చినప్పుడు కూడా బోరాన్ లోపం కనిపిస్తుంది. బోరాన్ లోప నివారణకు పైరు వేసిన 60 మరియు 90 రోజులప్పుడు లీటర్ నీటికి 1.5 గ్రా. బొరాక్స్ వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయవలెను. మొర్రం గడ్డ (గెన్సు గడ్డలు) తెలంగాణ జిల్లాల్లో అక్టోబర్- నవంబర్ మాసాలు ఈ పంట సాగుకు అనుకూలం. అధిక దిగుబడినిచ్చే రకాలైన సామ్రాట్, కిరణ్. ఆర్ఎన్ఎస్పి-1లను సాగు చేసుకోవాలి. ఎకరాకు 6-8 టన్నుల దిగుబడిని తక్కువ సాగు ఖర్చుతో పొందవచ్చును. డాక్టర్ దండ రాజిరెడ్డి, పరిశోధన మరియు విస్తరణ సంచాలకులు ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్, హైదరాబాద్ -
అంతర్ పంటతో ‘అసలు’కు దెబ్బ
బాల్కొండ: పసుపు పంటలో మొక్కజొన్న పంటను అంతర్ పంటగా సాగు చేస్తారు. కేవలం పసుపు పంటకు మర్రిఆకు తెగులు సోకకుండ కాపాడుకోవడానికి మొక్కజొన్నను పలుచగా సాగు చేయాలని ఉద్యాన అధికారులు సూచిస్తారు. కానీ కొందరు రైతులు రెండు పంటలలో అధిక దిగుబడి సాధించాలన్న ఆశతో పసుపు పంటలో మొక్కజొన్నను అధికంగా సాగుచేస్తుంటారు. దీంతో పసుపు పంట పూర్తిగా దెబ్బతింటుంది. బాల్కొండ మండలంలోని చాలా గ్రామాల్లో ఇలాగే పసుపు పంట దెబ్బతింది. పసుపు మధ్యలో వేసిన మొక్కజొన్న కోసిన తరువాత పసుపు పూర్తిగా తెలుపు రంగులో మారి ఎండినట్లు అయింది. ఇలా పసుపు పంట దెబ్బతినే అవకాశం ఉందని హర్టికల్చర్ అధికారులు అంటున్నారు. మొక్కజొన్న ఎక్కువగా ఉండటం వలన సరైన గాలి, సూర్యరశ్మి లభించక పసుపు పంట ఆకులపై మచ్చలు ఏర్పాడుతాయని వారు పేర్కొంటున్నారు. పసుపుపంట ఆకుపై హరితాన్ని మొత్తం చీడలు వ్యాపించి తినేస్తాయి. దీంతో పసుపు పంట వేళ్లు వదులుగా మారి ఎండుతాయి. పసుపులో అంతర్ పంటగా మొక్కజొన్నను తక్కువ మోతాదులో సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నివారణ చర్యలు అంతరపంటగా మొక్కజొన్నను అధికంగా సాగు చే య డం వల్ల పసుపు పంట పత్ర హరితం కోల్పోయి.. ఎండిపోతుంది. ఇలా జరిగినప్పుడు.. పొటాష్ హెక్టార్‌కు 60 కిలోలు వెదజల్లాలి. కాపర్ ఆక్సైడ్ 3 గ్రా ములు లీటర్ నీటిలో, 19 :19: 10 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేయాలి. లేదా ఎకరానికి 10 లీటర్ల వేపనూనెను పిచికారి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఆదర్శ రైతులను నిలదీసిన రైతులు
సిద్దిపేట రూరల్ : మొక్కజొన్న పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు ఆదర్శరైతులు వినియోగించుకున్నారని ఆరోపిస్తూ మూడు రోజులుగా మండలంలో ని తోర్నాల గ్రామ రైతులు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. విషయం తెలుసుకున్న వ్యవసాయాధికారి అనిల్‌కుమార్, ఏఈఓ హనుమంతరెడ్డి లు కలిసి గ్రామ పంచాయతీ వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆదర్శ రైతులు రిక్కల రాజిరెడ్డి, గడ్డం రాజులను అధికారులు పిలిపించారు. వారు రాగానే రైతులు మొక్కజొన్న పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ లెక్కలు చూపాలని ఆదర్శ రైతులను నిలదీశారు. దీంతో ఆదర్శ రైతు రాజిరెడ్డి వారితో గొడవకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ ప్రసన్న కుమార్, ఎస్ఐ రాజేంద్రప్రసాద్‌లు సిబ్బందితో గ్రామానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మొక్కజొన్న పంట ఇన్సూరెన్స్‌కు సంబంధిం చిన రైతుల పేర్ల రికార్డు పోయిందన్నారు. రైతులు కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులు బ్యాంక్‌లో తక్కువ కట్టినట్లు రాజిరెడ్డి ఒప్పుకున్నారు. రికార్డు బుధవారం సాయంత్రంలోగా గ్రామ పంచాయతీలో అ ప్పగిస్తానని, తరువాత పంచాయతీ వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపాడు. పంట నష్టపోతే ప్రభుత్వం ఎంత ఇన్సూరెన్స్ చెల్లిస్తుందో ఆదర్శరైతులు కూడా తమకు అంతే మొత్తం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రైతుల వాదనకు కట్టుబడి ఆదర్శరైతులు ఉండాలని లేని పక్షంలో వారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ ఏఓ మాట్లాడుతూ గ్రామంలో 373 మం ది రైతులు మొక్కజొన్న పంటకు ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లు, బ్యాంక్‌లో రూ. 1.30 లక్షలు బ్యాంక్‌లో డీడీల రూపంలో చెల్లించినట్లు జాబితాలో ఉందన్నారు. సమావేశంలో సర్పంచ్ పరమేశ్వర్‌గౌడ్, ఎంపీటీసీ నర్సింలు పాల్గొన్నారు. -
మొక్కజొన్న దక్కేనా!
చేవెళ్ల రూరల్: ఈ ఏడాది ఖరీప్ ప్రారంభం నుంచీ వరుణ దేవుడు రైతులతో దోబూచులాడుతూనే ఉన్నాడు. అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలా మంది రైతులు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వర్షాలకు ధైర్యం చేసి మొక్కజొన్న పంట సాగు చేశారు. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పొట్ట దశలో ఉన్న మొక్కజొన్న చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, జొన్న, కూరగాయ పంటలు ప్రస్తుతం మంచి కాత దశలో ఉన్నాయి. మొక్కజొన్న కంకులు పట్టి పాల దశలో ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కురిస్తేనే కంకుల్లో విత్తులు గట్టి పడే అవకాశం ఉంది. పత్తి పంట కూడా పూత, కాత దశలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వానలు పడితే మంచి కాత వస్తుందని రైతులు అంటున్నారు. కానీ వరుణ దేవుడు కరుణ చూపించటంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎండలు మండిపోతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో ఒక పెద్ద వాన పడితేనే అన్ని పంటలు గట్టెక్కుతాయని అంటున్నారు. లేదంటే ఇన్నాళ్లూ కష్టపడి పండించిన పంటలు కళ్ల ముందే పాడయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికే వర్షాధారంగా వేసిన కూరగాయ పంటలు వానలు లేక రోగాల బారిన పడి నాశనమవుతున్నాయన్నారు. వేల రూపాయల పెట్టుబడులు మట్టిలో పోసినట్లేనని ఆవేదన చెందుతున్నారు. -
పల్లి సాగుకు తరుణమిదే
బాల్కొండ : వేరుశనగ దిగుబడిలో విత్తే సవుయుం కూడా ప్రాధాన్యత వహిస్తుంది. జిల్లాలో సెప్టెంబర్ మధ్యలోనుంచే విత్తుకుంటున్నారు. వచ్చేనెల 15వ తేదీ వరకు పల్లీలను విత్తుకోవచ్చు. నీరు నిలువని ఇసుక నేలలు, ఎర్ర నేలలు అనుకూలం. నల్లరేగడి నేలల్లో పంట వేయుకపోవడం వుంచిది. విత్తనశుద్ధి వుంచి కాయులను విత్తనాలుగా ఎంపిక చేసుకోవాలి. వుుడతలు పడిన, పగిలిన, రంగు వూరిన గింజలు పనికిరావు. మంచి విత్తనాలను ఎంపిక చేసుకుని, కిలో విత్తనానికి గ్రావుు కార్బండైజమ్‌తో శుద్ధి చేసి 24 గంటలు నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి. నేల తయారీ వేరుశనగ పంట వేసే భూమిలో ఎలాంటి కలుపు మొక్కలు ఉండకుండా ట్రాక్టర్‌తో లేదా నాగలితో మూడు నుంచి నాలుగు సార్లు దున్నాలి. సాధారణంగా జిల్లాలో మొక్కజొన్న పంట కోసిన తర్వాత రెండుసార్లు ట్రాక్టర్‌తో దున్నుతారు. పల్లి విత్తనాలను చల్లిన తర్వాత మరోసారి దున్నుతారు. కొందరు రైతులు నాగలితో దున్నుతూ సాళ్లలో విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసేముందే ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వేసి, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి. విత్తే సమయంలో 18 కిలోల యూరియాను, విత్తన 30 రోజుల తర్వాత 9 కిలోల యూరియాను వేయాలి. తగినంత తేమ ఉన్నప్పుడే నేలలో విత్తనాలు వేయాలి. విత్తన 15 రోజుల తర్వాత నీటిని అందించాలి. నేల స్వభావాన్ని బట్టి తర్వాతి తడులను అందించాలి. సాధారణంగా ఎనిమిదినుంచి తొమ్మిది తడుల్లో పంట చేతికి వస్తుంది.