మొలకెత్తిన మక్కలను చూపిస్తూ రోదిస్తున్న రైతు
శివ్వంపేట: పదిరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న రైతులకు నష్టాన్ని చేకూర్చింది. చేతికి వచ్చిన పంటను చేజారిపోతుండటంతో పెట్టిన పెట్టుడి సైతం చేతికందని పరిస్థితి నెలకొంది. వర్షాధార పంటగా మొక్కజొన్నను సాగుచేశారు. పంటను కోసి జోడు పెట్టిన మొక్కజొన్న కంకులు మొలకెత్తాయి. పిల్లుట్ల పంచాయతీ లింగోజిగూడ తండాలో సుమారు 20 ఎకరాల్లో మొక్కజొన్నను కోసి జోడు ఏర్పాటు చేశారు.
రెండు రోజుల నుంచి వాతావరణం అనుకూలిస్తుండడంతో నూర్పిళ్ళకు సిద్ధమైన రైతులకు జోడు నుంచి మక్కలను తీసిన క్రమంలో మొలకెత్తాయని రైతులు చంద్రు, విఠల్, మంగ్య, స్వామి, గెమ్యా, శంకర్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులుచేసి పంట సాగుచేసుకున్న తమకు నష్టాలే మిగిలాయని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు.