గజ్వేల్: మొక్కజొన్నలో చిక్కుడును అంతర పంటగా వేస్తూ రైతులు మంచి ఫలితాలు రాబడుతున్నారు. వర్షాలు బాగా కురిస్తే రెండు పంటల ద్వారా ఆదా యం గడిస్తున్నారు. ఒక వేళ వర్షాభావ పరిస్థితులు నెలకొంటే సమర్థవంతంగా తట్టుకునే శక్తి చిక్కుడుకు ఉంటుంది. ఖరీఫ్ సీజన్‌లో చాలా మంది రైతులు మొక్కజొన్న లో అంతర పంటగా దీన్ని వేస్తున్నారు.
దీనితో పాటు కంది, బబ్బెర, జొన్న, చిక్కుడు తదితర పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న జనాభాకు సరిపోయే మేర పప్పులు, కూరగాయల దిగుబడి ఉండడం లేదు. ఫలితంగా వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొక్కజొన్న పంటలో చిక్కుడును అంతర పంటగా వేస్తూ ఈ ప్రాంత రైతులు అధిక లాభాలు సాధిస్తున్నారు. చిక్కుడును వేయడం వల్ల మొక్కజొన్నకు ఎటువంటి న ష్టం కలగదు. మొక్కజొన్న ఏపుగా పెరిగేంత వరకు చిక్కుడు చిన్నదిగా ఉండడం వలన రైతులకు కలుపు తీయడంలో ఇబ్బందులు ఏర్పడవు. మొక్కజొన్న కోత పూర్తయిన తర్వాత చి క్కుడు తీగ ఏపుగా పెరుగుతుంది.. జూన్ నెలలో వేసిన మొక్కజొన్న అక్టోబర్ నెలలో కోతకు వస్తుంది.
చిక్కుడు నవంబర్ నెలలో కాతకు వచ్చి ఫిబ్రవరి నెల వరకు కాత కాస్తుంది. దీర్ఘకాలంగా పంట రా వడం వలన రైతులకు ఆర్థికంగా మేలు చేకూరుతుంది. మొక్కజొన్న పంట తర్వాత ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు వేసుకోవాలి. పూత దశలో ఆకుముడత, పూత నిలవడం కోసం క్రిమిసంహారక మందులు పిచికారీ చే యాలి. కాతకు వచ్చిన తర్వాత క్రిమికీటకాలు ఆశించకుండా మందులు వా డితే సరిపోతుంది. ఒక ఎకరాలో రూ.60 వేల వరకు దిగుబడి సాధించవచ్చని రైతులు చెబుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఒక ఎకరాకు రెండు పంటలు కలిపి లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
అంతర పంటలతో అధిక లాభాలు
Published Wed, Sep 10 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement