![KCR Take Oath AS Gajwel MLA On Thursday February 1 - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/31/kcr.jpg.webp?itok=a6hNntcM)
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండో రోజే కేసీఆర్ బాత్రూంలో జారి పడంతో ఆయన తుంటి విరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కేసీఆర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు.
ఈ క్రమంలో అసంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానుండటంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి.
Comments
Please login to add a commentAdd a comment