బాల్కొండ: పసుపు పంటలో మొక్కజొన్న పంటను అంతర్ పంటగా సాగు చేస్తారు. కేవలం పసుపు పంటకు మర్రిఆకు తెగులు సోకకుండ కాపాడుకోవడానికి మొక్కజొన్నను పలుచగా సాగు చేయాలని ఉద్యాన అధికారులు సూచిస్తారు. కానీ కొందరు రైతులు రెండు పంటలలో అధిక దిగుబడి సాధించాలన్న ఆశతో పసుపు పంటలో మొక్కజొన్నను అధికంగా సాగుచేస్తుంటారు. దీంతో పసుపు పంట పూర్తిగా దెబ్బతింటుంది.
బాల్కొండ మండలంలోని చాలా గ్రామాల్లో ఇలాగే పసుపు పంట దెబ్బతింది. పసుపు మధ్యలో వేసిన మొక్కజొన్న కోసిన తరువాత పసుపు పూర్తిగా తెలుపు రంగులో మారి ఎండినట్లు అయింది. ఇలా పసుపు పంట దెబ్బతినే అవకాశం ఉందని హర్టికల్చర్ అధికారులు అంటున్నారు. మొక్కజొన్న ఎక్కువగా ఉండటం వలన సరైన గాలి, సూర్యరశ్మి లభించక పసుపు పంట ఆకులపై మచ్చలు ఏర్పాడుతాయని వారు పేర్కొంటున్నారు.
పసుపుపంట ఆకుపై హరితాన్ని మొత్తం చీడలు వ్యాపించి తినేస్తాయి. దీంతో పసుపు పంట వేళ్లు వదులుగా మారి ఎండుతాయి. పసుపులో అంతర్ పంటగా మొక్కజొన్నను తక్కువ మోతాదులో సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
నివారణ చర్యలు
అంతరపంటగా మొక్కజొన్నను అధికంగా సాగు చే య డం వల్ల పసుపు పంట పత్ర హరితం కోల్పోయి.. ఎండిపోతుంది. ఇలా జరిగినప్పుడు.. పొటాష్ హెక్టార్‌కు 60 కిలోలు వెదజల్లాలి. కాపర్ ఆక్సైడ్ 3 గ్రా ములు లీటర్ నీటిలో, 19 :19: 10 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారి చేయాలి. లేదా ఎకరానికి 10 లీటర్ల వేపనూనెను పిచికారి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
అంతర్ పంటతో ‘అసలు’కు దెబ్బ
Published Fri, Oct 3 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement