పసుపులో అంతర పంటగా వేసిన మొక్కజొన్నను కోయగానే కలుపు తీయాలి. పసుపులో ఉండే కలుపుతో పాటు మొక్కజొన్న ఆకులను, కొయ్యలను తీసేయాలి.
20 రోజులకొకసారి చొప్పున మూడుసార్లు కలుపు తీయాలి. కలుపు తీసిన ప్రతిసారి పొటాష్ వెదజల్లాలి.
కలుపు తీసిన తర్వాత పంటకు తడి అందించాలి. తేమ ఉన్నప్పుడు ఒక హెక్టార్ పసుపు పంటకు 60 కేజీల పొటాష్ వెదజల్లాలి. లేదా లీటర్ నీటికి కార్బండైజమ్ 1.5 మి.లీటరు, కాపర్ ఆక్సైడ్ 3 గ్రాములు, 19:19 10 గ్రాములు కలిపి 400 లీటర్ల మందును పిచికారి చేయాలి.
పసుపు ఆకుపై మచ్చలు ఉంటే మర్రి ఆకు తెగులు సోకిందని గుర్తించి 400 లీటర్ల నీటికి 200 మిల్లీ లీటర్ల మోనో క్రొటోఫాస్, వంద గ్రాముల కాపర్ ఆక్సైడ్ కలిపి ఆకులపై పిచికారి చేయాలి.
మొక్కజొన్న కోసిన తర్వాత రైతులు కాంప్లెక్స్ ఎరువు 20:20 ను పొటాష్‌తో కలిపి వేస్తారు. కానీ ప్రస్తుత దశలో పసుపు పంటకు కాంప్లెక్స్ ఎరువుతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల కాంప్లెక్స్ ఎరువులు వేయరాదు.
పసుపు పంటకు దుంపకుళ్లు సోకితే పసుపు ముదురు ఆకులు పూర్తిగా ఎండి పోతాయి. ఆకులను తీస్తే దుర్వాసన వస్తుంది.
పసుపులో నీటి నిలువ ఎక్కువగా ఉంచరాదు. నీరు తక్కువ మోతాదులోనే పంటకు అందించాలి. దుంప కుళ్లను ప్రస్తుత దశలో పూర్తిగా నివారించలేం. కేవలం వ్యాపించకుండా చర్యలు చేపట్టవచ్చు.
మక్కను కోశాక..పసుపులో సస్యరక్షణ
Published Fri, Sep 26 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM
Advertisement
Advertisement