‘వ్యవసాయ క్షేత్రాల వద్ద ఈము పక్షుల పెంపకం చేయవచ్చు.
‘వ్యవసాయ క్షేత్రాల వద్ద ఈము పక్షుల పెంపకం చేయవచ్చు. వీటితో మంచి లాభాలు పొందవచ్చు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలోని మా బంధువులు వీటిని పెంచడాన్ని చూసి నేను కూడా ఈము పక్షుల పెంపకం చేపట్టాలనుకున్నా. దీంతో గుంటూరు ప్రాంతం నుంచి మూడు నెలల వయసున్న 50 పిల్లలను తెప్పించా’నని వెంకాగౌడ్ తెలిపారు.
పెంపకం ఇలా...
ఈము పక్షుల ఫాం నిర్వహణకు మొదటగా వ్యవసాయ భూమిని చదను చేసుకోవాలి.
10 ఫీట్ల ఎత్తులో 200ల మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పుతో నెట్ ఫెన్సింగ్(జాలి)ను ఏర్పాటు చేసుకోవాలి.
దీనికోసం రూ.60 వేల ఖర్చు వస్తుంది.
ఈము పక్షులకు దాణాగా తవుడు, కుసుమలు, సోయా, జొన్న, మక్కజొన్న, ఆముదాలు, బాదం ఆకులు అందించాలి.
ప్రతి రోజూ ఒక్కో పక్షికి సుమారు 600 గ్రాముల దాణా అందించాలి.
నీటిని బకెట్లలో పోసి ఉంచాలి.
ఒక్క పక్షిని పెంచేందుకు రోజుకు రూ.20 చొప్పున వెచ్చించాల్సి ఉంటుంది.
వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నా ఇవి వ్యాధుల బారిన పడవు.
ఎండ, చలి, వర్షాన్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి.
మార్కెటింగ్...
ఈము పక్షులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది.
ఈము పక్షిలోని ప్రతీ భాగం విలువైనది.
ఈము పక్షి మాంసం కిలోకు రూ.2వేల వరకు ఉంటుంది. వీటి గోళ్ళు, ఈకలు కిలోకు రూ.12వేల వరకు పలుకుతాయి.
కొవ్వును రూ.60వేల వరకు విక్రయించవచ్చు.
పక్షి కనుగుడ్లను మార్కెట్ ధర ప్రకారం రూ.1,800 వరకు విక్రయించవచ్చు.