సన్నని చిరు జల్లులు.. వేడి వేడి మొక్కజొన్న పొత్తులు. ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. కమ్మగా కాల్చిన వేడి వేడి మొక్క జొన్నపై కాస్తంత నిమ్మరసం, ఉప్పుచల్లుకొని తింటే ఆహా.. అనుకోవాల్సిందే. మరి సీజనల్‌గా లభించే మొక్కజొన్న ఆరోగ్య ప్రయోజనాలగురించి ఎపుడైనా ఆలోచించారా?
మొక్కజొన్న లేదా కార్న్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన తృణధాన్యాలలో ఒకటి. సెంట్రల్ అమెరికాకు చెందిన గడ్డి కుటుంబంలోనిది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని రకాల్లో పెరుగుతుంది. సాధారణంగా పసుపు రంగులో ఉంటుంది. అలాగే ఎరుపు, నారింజ, ఊదా, నీలం, తెలుపు, నలుపు వంటి అనేక ఇతర రంగులలో కూడా లభిస్తుంది.
ఫైబర్, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియంలాంటి ఖనిజాలు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల మూలం మొక్కజొన్న. మొక్కజొన్నలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది , ప్రేగుల క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మొక్కజొన్నలో ఇనుము ఉంటుంది. ఇది ఇనుము లోపం అనీమియాను నివారిస్తుంది. మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరిత శక్తిని అందిస్తాయి. మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
మొక్కజొన్నలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులోని లుటిన్ , జియాక్సంతిన్ కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడతాయి. మొక్కజొన్నలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి . కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫోలేట్, పొటాషియం , ప్లాంట్ స్టెరాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిల్లోని ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి గుణాలు ఎముకలను బలోపేతం చేస్తాయి తద్వారా ఆర్థరైటిస్ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది.
మొక్కజొన్న చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మొక్కజొన్నలో విటమిన్ ఎ, విటమిన్ సీతోపాటు , ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. దీంతో మన శరీరం , చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య సంకేతాలను అడ్డుకుంటుంది. స్కిన్ పిగ్మెంటేషన్ గణనీయంగా తగ్గిందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment