కూరగాయల్లో శ్రేష్టమైన క్యారెట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. క్యారెట్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. రోగనిరోధక శక్తికినిచ్చే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అనేక బ్యూటీ సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అందుకే దీన్ని కాస్మొటిక్ వెజ్ అని కూడా అంటారు. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది. కాలేయం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు చర్మం,జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. సెప్టెంబరు 1 నుండి 7వ తేదీ జరుపుకునే నేషనల్ నూట్రిషన్ వీక్ సందర్భంగా ఈ విశేషాలు మీకోసం..
ఆఫ్ఘనిస్తాన్‌లో మొట్టమొదట పండించిన దుంప కూర క్యారెట్. మనకు తెలిసిన ఆరెంజ్ రంగులో మాత్రమే కాదు, ఊదా, పసుపు, ఎరుపు, తెలుపు లాంటి ఇతర రంగులలో కూడా లభిస్తాయి. ఆరెంజ్ క్యారెట్లు 15-16వ శతాబ్దంలో మధ్య ఐరోపాలో అభివృద్ధి చేయబడ్డాయి.
క్యారెట్లలో శక్తి అందించే విటమిన్లు ఏ, ఈ, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలతో పాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. గుండె, మూత్రపిండాలు ,కాలేయ ఆరోగ్యానికి సాయం చేస్తుంది. క్యారెట్ విటమిన్ సి, లుటిన్, జియాక్సంథిన్, విటమిన్ కె, డైటరీ ఫైబర్‌కి మంచి మూలం. క్యారెట్‌లో పిల్లల ఎదుగుదలకు అవసరమైన బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని పొందడానికి మీరు క్యారెట్‌ను ఫేస్ ప్యాక్‌ల రూపంలో కూడా ఉపయోగించవచ్చు.
మధుమేహ రోజులు కూడా వాడవచ్చు. ఇందులో సహజ చక్కెరలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. క్యారెట్‌లో విటమిన్ సి, కె, మాంగనీస్, కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా తోడ్పాటునందిస్తాయి. క్యారెట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయడటంతోపాటు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి, బీటా కెరోటిన్ లక్షణాలు చర్మంపై మొటిమలు, దద్దుర్లు మొదలైన చర్మ వ్యాధులకు నయం చేయడంలో పనిచేస్తుంది. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.
క్యారెట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులోని పీచు పదార్థం మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.వి తక్కువ కేలరీలున్న దీనిని పచ్చిగా తినవచ్చు. స్నాక్స్ లేదా డెజర్ట్ లాగా వాడుకోవచ్చు. అన్ని రకాల కూరల్లో, సలాడ్లలో చేర్చుకుంటే అనేక పోషకాలు అందుతాయి. విడిగా గానీ, బీట్ రూట్, పుదీనా లాంటివాటితో కలిపి గానీ జ్యూస్ చేసుకొని తాగవచ్చు. అంతేకాదు అందంగా కట్ చేసుకుని (గార్నిషింగ్) అలంకరించుకోవచ్చు కూడా
Comments
Please login to add a commentAdd a comment