
బర్డ్ ఫ్లూ (Bird Flu)అంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్, గుడ్ల వైపు చూడాలంటేనే వణికి పోతున్నారు. ఆందోళన అవసరం లేదు నిపుణులు చెబుతున్నప్పటకీ జనం చికెన్ తినడం మానేశారు. మరోవైపు పోషకాలు ఎలా అందోళన కూడామొదలైంది. అయితే కేవలం మాంసాహారంలోనే కాదు, శాకాహారంలో కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది ఈ నేపథ్యంలో చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలు గురించి తెలుసుకుందాం.
సంపూర్ణమైన ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అవసరం. చికెన్ ప్రత్యామ్నాయంగా ప్రొటీన్లతో కూడిన అత్యంత సాధారణమైనవి గింజలు. కూరల్లో సలాడ్‌లు , ఇతర వంటకాల్లో మంచి రుచిని అందిస్తాయి. అందుకే వీటిని చాలా మంది చెఫ్‌లు శాకాహార వంటకాలను వండేటప్పుడు వాటిని చికెన్ ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. వీటిల్లో వేరుశనగ, జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్, బఠానీ, రాజ్‌మా ఇలా చాలానే ఉన్నాయి.
బాదం: ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్ ఇలు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు బాదంపప్పులో ఉన్నాయి. 100 గ్రాముల బాదం గింజల్లో 23 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.
శనగలు: శనగలను పోషకాహార పవర్‌హౌస్ అని అంటారు. వీటి ద్వారా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు అందుతాయి.మాంసం మానేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్. 100 గ్రాముల శనగల్లో 23 గ్రాముల ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.
ఇదీ చదవండి: Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!
వాల్ నట్స్ : వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది . ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి అనేక పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. 100 గ్రాముల వాల్ నట్స్ లో 26 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి.
రాజ్ మా: పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్, ఖనిజాలతోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ లభిస్తాయి. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తినిస్తుంది. 100 గ్రాముల రాజ్ మా గింజల్లో 25 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
చదవండి: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!
జనపనార గింజలు(Hemp seeds) ఖనిజాలు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి.మంచి కొవ్వులు, ఆహార ఫైబర్స్, ఖనిజాలు, విటమిన్లు ,ప్రోటీన్లు. ఎడెస్టిన్ , అల్బుమిన్ వంటి అత్యంత జీర్ణమయ్యే ప్రోటీన్లను కలిగి ఉంటాయి, జనపనార గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల జనపనార గింజల్లో 21 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.
వీటిని నానబెట్టుకొని తినవచ్చు. లేదా సలాడ్లలో, కూరల్లో వాడుకోవచ్చు. చక్కగా నేతిలో వేయించుకొని, ఉప్పు కారం చల్లుకొని స్నాక్స్‌లాగా కూడా తినవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment