corn
-
చిరు జల్లులు: వేడి వేడి మొక్కజొన్నపొత్తులు, ఈ విషయాలు తెలుసా?
సన్నని చిరు జల్లులు.. వేడి వేడి మొక్కజొన్న పొత్తులు. ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. కమ్మగా కాల్చిన వేడి వేడి మొక్క జొన్నపై కాస్తంత నిమ్మరసం, ఉప్పుచల్లుకొని తింటే ఆహా.. అనుకోవాల్సిందే. మరి సీజనల్‌గా లభించే మొక్కజొన్న ఆరోగ్య ప్రయోజనాలగురించి ఎపుడైనా ఆలోచించారా?మొక్కజొన్న లేదా కార్న్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన తృణధాన్యాలలో ఒకటి. సెంట్రల్ అమెరికాకు చెందిన గడ్డి కుటుంబంలోనిది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని రకాల్లో పెరుగుతుంది. సాధారణంగా పసుపు రంగులో ఉంటుంది. అలాగే ఎరుపు, నారింజ, ఊదా, నీలం, తెలుపు, నలుపు వంటి అనేక ఇతర రంగులలో కూడా లభిస్తుంది. ఫైబర్, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియంలాంటి ఖనిజాలు విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల మూలం మొక్కజొన్న. మొక్కజొన్నలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది , ప్రేగుల క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. మొక్కజొన్నలో ఇనుము ఉంటుంది. ఇది ఇనుము లోపం అనీమియాను నివారిస్తుంది. మొక్కజొన్నలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరిత శక్తిని అందిస్తాయి. మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బరువు నియంత్రణకు సహాయపడుతుంది.మొక్కజొన్నలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులోని లుటిన్ , జియాక్సంతిన్ కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడతాయి. మొక్కజొన్నలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి . కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫోలేట్, పొటాషియం , ప్లాంట్ స్టెరాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిల్లోని ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి గుణాలు ఎముకలను బలోపేతం చేస్తాయి తద్వారా ఆర్థరైటిస్ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది.మొక్కజొన్న చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మొక్కజొన్నలో విటమిన్ ఎ, విటమిన్ సీతోపాటు , ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. దీంతో మన శరీరం , చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య సంకేతాలను అడ్డుకుంటుంది. స్కిన్ పిగ్మెంటేషన్ గణనీయంగా తగ్గిందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. -
వెరైటీగా మొక్కజొన్న తినాలకుంటే జుట్టూడింది!
సోషల్ మీడియా అనేది వాకింగ్ కామెడీ షో లాంటిది. ఎవరైనా సోషల్ మీడియా సముద్రంలోకి దూకినప్పుడు వింతలు విడ్డూరాలు అనేకం కనిపిస్తాయి. ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిలో ఒక యువతి మొక్కజొన్న తినడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించి భంగపడింది. ఈ వీడియోను చూసిన వారెవరైనా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. వైరల్ వీడియోలో డ్రిల్ మెషిన్‌కు మొక్కజొన్న పొత్తు గుచ్చి, ఒక అమ్మాయి దానిని తినేందుకు ప్రయత్నిస్తుంది. కొంత సమయం వరకు అంతా బాగానే ఉంది. తరువాత ఒక్కసారిగా ఆమె జుట్టు కొద్దిమేరకు మెషీన్లో ఇరుక్కుపోయి ఊడిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (గతంలో Twitter)లో @ZeroIQPeople అనే పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ 15 వేల 600 మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్.. ‘అందుకే యువతులు పవర్ టూల్స్‌కు దూరంగా ఉండాలని చెప్పేది’ అని రాశాడు. మరో యూజర్ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు? pic.twitter.com/DQVFNWZH5P — People With 0 IQ (@ZeroIQPeople) October 1, 2023 -
మొక్కజొన్న పిండితో బిస్కెట్లు.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
కార్న్ – చాక్లెట్ కుకీస్ తయారీకి కావల్సినవి: బటర్ – 125 గ్రాములు, పంచదార – 150 గ్రాములు, నూనె – 80 మిల్లీ లీటర్లు, గుడ్లు – 2, ఉప్పు – తగినంత, వనిలిన్ పౌడర్ – పావు టీ స్పూన్(మార్కెట్లో దొరుకుతుంది), మొక్కజొన్న పిండి – 80 గ్రాములు శనగపిండి – 350 గ్రాములు, బేకింగ్ పౌడర్ – 6 గ్రాములు తయారీ విధానమిలా: ►ముందుగా బటర్, పంచదార, నూనె వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో బాగా కలుపుకోవాలి. ► అందులో గుడ్లు, ఉప్పు, మొక్కజొన్న పిండి వేసుకుని మళ్లీ కలుపుకోవాలి. ► అనంతరం వనిలిన్ పౌడర్, శనగపిండి, బేకింగ్ పౌడర్ వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ► తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్‌లో ఉండ చేసుకుని.. దాన్ని బిస్కట్లా ఒత్తుకుని.. పైభాగంలో నచ్చిన షేప్‌ని ప్రింట్ చేసి.. బేక్ చేసుకోవాలి. ► అభిరుచిని బట్టి రెండేసి కుకీస్ తీసుకుని.. మధ్యలో చాక్లెట్ క్రీమ్ పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
కొబ్బరితో కార్న్ ఇడ్లీ..రుచి మాత్రమే కాదు, చాలా బలం కూడా
కోకోనట్ – కార్న్ ఇడ్లీలు తయారీకి కావల్సినవి: మొక్కజొన్న నూక – 2 కప్పులు,కొబ్బరి పాలు – 1 కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – 1 టేబుల్ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్ చాయ పప్పు – 1 టీ స్పూన్,వేరుశనగలు – పావు కప్పు అల్లం తురుము – 2 టీ స్పూన్లు,పచ్చిమిర్చి –2 (చిన్నగా తరగాలి) ఉప్పు – తగినంత,బేకింగ్ సోడా – 1 టీ స్పూన్, నెయ్యి – కొద్దిగా తయారీ విధానమిలా: ముందుగా నూనె వేడి చేసుకుని అందులో వేరుశనగలు, శనగపప్పు, చాయ పప్పు, ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. అందులో మొక్కజొన్న నూక వేసుకుని నిమిషం పాటు గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరిపాలు, బేకింగ్ సోడా కలుపుకుని ఇడ్లీ పిండిలా చేసుకోవాలి. అనంతరం ఇడ్లీ రేకుకు నెయ్యి రాసుకుని.. కొద్దికొద్దిగా మిశ్రమం వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. ఇవి బలానికి బలాన్నీ, రుచికి రుచినీ అందిస్తాయి. -
ప్రాన్స్ కార్న్ ఫ్రిటర్స్
కావలసినవి: చిక్కటి పాలు – పావుకప్పు, గుడ్లు – 4, మొక్కజొన్న పిండి – అర కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు, రొయ్యలు – 20 లేదా 25 (ఉప్పు, కారం, మసాలా కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి), స్వీట్ కార్న్ – రెండున్నర కప్పులు (ఉడికించి మిక్సీ పట్టుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు –2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా తరగాలి), కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పాలు, మూడు గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో స్వీట్ కార్న్ గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని, ఉడికించిన ఒక్కో రొయ్యతో కలిపి.. చేత్తో చిన్నగా ఒత్తి, వడలుగా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకోవాలి. (చదవండి: ఓట్స్ – యాపిల్ లడ్డూలు) -
అంకాపూర్ @మక్కవడలు.. చికెన్‌తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అంకాపూర్ చికెన్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని ఆ దేశీ చికెన్ అంటే తెలియనివాళ్లు ఉండరు. దీన్ని తినేందుకు హైదరాబాద్ సహా వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజూ పలువురు వస్తుంటారు. దేశవిదేశాలకు సైతం ఆంకాపూర్ దేశీ చికెన్ పార్శిళ్లుగా వెళుతున్న విషయం తెలిసిందే. చికెన్‌తో పాటు పశువుల గడ్డిని పెంచేందుకు వినియోగించే ఎర్రజొన్న విత్తనానికి కూడా ఇటీవల ఈ ప్రాంతం ఫేమస్ అయింది. అంకాపూర్‌లో ఎర్రజొన్న విత్తనాన్ని బైబ్యాక్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు సైతం ఎగుమతి చేసే కంపెనీలు 40 వరకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చికెన్, ఎర్రజొన్న విత్తనంతో పాటు మరో విషయంలోనూ అంకాపూర్ ప్రత్యేకతను సాధిస్తోంది. అదే అంకాపూర్ ‘మక్క వడలు’. ఈ ఒక్క ప్రాంతంలోనే ఆ మక్క వడలు లభ్యమవుతాయి. ప్రతి ఏటా జూన్ నెల నుంచి జనవరి నెలలోపు ఈ వడలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దేశీ చికెన్‌తో మక్క వడలను నంజుకుని తింటే.. ఆ రుచే అద్భుతం అంటూ భోజన ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్నారు. మక్క వడల పార్సిళ్లు సైతం భారీగా తీసుకెళుతున్నారు. ఈ రహదారిలో వెళ్లేవారు కచ్చితంగా మక్క వడల రుచి చూడడం ఆనవాయితీగా మారింది. రోహిణి కార్తెలోనే... అంకాపూర్ గ్రామ రైతులు రోహిణి కార్తెలోనే మొక్కజొన్న విత్తడమనేది ప్రత్యేకం. బోర్లలో నీరు సమృద్ధిగా ఉన్న రైతులు మే నెల మొదటి వారంలోనే మొక్కజొన్న వేస్తారు. సుమారు 500 ఎకరాల్లో పంట వేస్తారు. జూలైలో పంట వస్తుంది. ఈ రైతులు నేరుగా పచ్చి కంకులను అమ్ముతారు. దీంతో ప్రతి ఏటా జూలై నుంచి మక్క వడలు ఇక్కడ తయారు చేస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న వానాకాలం పంటను జూన్‌లో నాటడం ప్రారంభిస్తారు. అదేవిధంగా పసుపులో అంతరపంటగానూ మొక్కజొన్న వేస్తారు. ఇలా వేసే పంట ప్రతి ఏటా మొత్తం కలిపి జిల్లాలో 30,800 ఎకరాలు ఉంటోంది. అంకాపూర్ మక్క మార్కెట్ నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్ వరకు మొక్కజొన్న ఎగుమతి చేస్తున్నారు. మధ్యవర్తులు ఎకరం లెక్కన పంట కొనుగోలు చేస్తారు. లేనిపక్షంలో ట్రాలీ ఆటోల లెక్కన కొనుగోలు చేస్తారు. మొక్కజొన్న సీజన్ జనవరి వరకు ఉంటుంది. దీంతో అంకాపూర్‌లో 7 కుటుంబాల వారు ప్రత్యేకంగా మక్క వడలను ఈ సీజన్లో తయారు చేస్తున్నారు. సీజన్లో మక్క వడలు మాత్రమే.. 15 ఏళ్ల క్రితం నుంచే మా ఊళ్లో మక్క వడలు చేసి అమ్మడం ప్రారంభమైంది. గతంలో మేము టిఫిన్ సెంటర్ నడిపేవాళ్లం. మక్క వడలు చేయడం ప్రారంభించాక వీటికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గిరాకీ విపరీతంగా ఉంటోంది. దీంతో సీజన్లో 7 నెలల (జూన్ నుంచి జనవరి వరకు) పాటు పూర్తిగా మక్క వడలు మాత్రమే చేసి అమ్ముతున్నాం. –రెగుల్వార్ సిద్ధు, కపిల దంపతులు -
స్నాక్స్ కోసం..చీజ్ కార్న్ రోల్స్ ఇలా చేసుకోండి
చీజ్ కార్న్ రోల్స్ రెసిపికి కావల్సినవి బంగాళ దుంపలు – మూడు; కార్న్ గింజలు – అరకప్పు; చీజ్ – అరకప్పు; వెల్లుల్లి తురుము – టీస్పూను; కార్న్ స్టార్చ్ – టేబుల్ స్పూను; బ్రెడ్ స్లైసులు –నాలుగు; కారం – అరటీస్పూను; గరం మసాలా – పావు టీస్పూను; ఛాట్ మసాలా – అరటీస్పూను; మిరియాల పొడి – అరటీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. తయారీ విధానమిలా.. బంగాళ దుంపలు, కార్న్ గింజలను విడివిడిగా ఉడికించాలి ∙బంగాళ దుంపల తొక్క తీసి చిదుముకోవాలి ∙దీనిలో కార్న్ గింజలు, వెల్లుల్లి తురుము, కార్న్‌స్టార్చ్, కారం, గరం మసాలా, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి ∙ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన బ్రెడ్‌స్లైసులను వేసి అన్నీ కలిసిపోయేలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలకు వేలితో రంధ్రం చేసి చీజ్‌ను సన్నగా తురిమి పెట్టాలి తరువాత రంధ్రాలని మూసేసి రోల్స్ ఆకారం లో వత్తుకోవాలి ∙ఇలా అన్ని ఉండలను రోల్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి, సాస్‌తో సర్వ్ చేసుకోవాలి. -
పీచే కదా అని తీసిపడేయకండి!
మొక్కజొన్న కంకులను తీసుకొని దానికి ఉండే దారాల్లాంటి పీచు (కార్న్ సిల్క్)ను మాత్రం తీసి పారేస్తుంటాం. అయితే, ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ పీచును ప్రపంచవ్యాప్తంగా వివిధ రపాల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని సేకరించి, ఎండబెట్టి అమ్ముకోవడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కజొన్న సాగులో ప్రపంచంలో భారత్ 6వ స్థానంలో ఉంది. 2021–22 రబీ గణాంకాల ప్రకారం ఏపీలో 4.82 లక్షల ఎకరాల్లో, తెలంగాణలో 4.74 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. మొక్కజొన్న కండెలు కోసేటప్పుడే పీచును కండె నుంచి తీసి జాగ్రత్త చేసుకోవాలి. సేకరించిన పీచును 0.1% ఉప్పు ద్రావణంతో కడిగి శుభ్రం చేసి ఎండబెట్టాలి. తేమ శాతం 7–10% మధ్యలో ఉండేలా చూసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పీచును అనేక ఆహారోత్పత్తుల్లో ఉపయోగించవచ్చు. ఒక మొక్కజొన్న పొత్తు నుంచి జాగ్రత్తగా సేకరించి ఎండబెడితే సగటున ఒక గ్రాము పీచు వస్తుందని అంచనా. ఏక పంటగా సాగు చేస్తే ఎకరానికి 32 వేల మొక్కలు వేస్తారు. అంటే, ఎకరానికి 32 కిలోల ఎండు పీచును సేకరించవచ్చన్న మాట. షుగర్, కిడ్నీ, ప్రొస్టేట్ సమస్యలకు ఉపశమనం మొక్కజొన్న పీచులో అధిక పోషక విలువలతో పాటు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ప్రొటీన్లు, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు,కాల్షియం, పొటాషియం, వంగనీసు, సిటోస్టెరాల్, స్టిగ్మాస్టెరాల్, అల్కలాయిడ్లు, సపోనిన్లు, టాన్నిన్లు, ఫ్లావనాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. దేహంలో నుంచి అధిక నీటిని బయటకు పంపుతుంది. మూత్రవిసర్జనను సులభతరం చేయటం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. మూత్రవిసర్జనలో నొప్పి, మూత్రనాళంలో/ మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపకరిస్తుంది. ప్రొస్టేట్ సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇన్సులిన్ సహజ ఉత్పత్తిని పెంపొందించి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, అధిక కొలెస్టరాల్ సమస్యలను నివారిస్తుంది. గౌట్ నొప్పిని తగ్గిస్తుంది. కొవ్వును నియంత్రించి అధిక బరువును నివారించడానికి కూడా మొక్కజొన్న పీచు ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఆహారోత్పత్తులెన్నో.. బ్రెడ్, బిస్కట్ల తయారీలో మొక్కజొన్న పీచు పొడిని కొద్ది మేరకు కలుపుతున్నారు. దీన్ని కలిపినందు వల్ల వాటి రంగు, వాసన ఏమీ మారవు. పోషక విలువలు పెరుగుతాయి. బియ్యపు పిండి, పచ్చి బొప్పాయి, నువ్వుల పిండితో మొక్కజొన్న పీచు పొడిని గరిష్టంగా 10% కలుపుతూ ఆరోగ్యదాయకమైన లడ్డూలు తయారు చేయొచ్చు. చపాతీ, పరోటా, రైతా, పప్పు వంటి వంటకాల్లో మొక్కజొన్న పీచు పొడిని కలుపుకుంటే మం పోషక విలువలు లభిస్తాయి. టాబ్లెట్లను కూడా మొక్కజొన్న పీచుతో తయారు చేయవచ్చు. బరువు తగ్గడానికి, చర్మ సౌందర్యం కోసం ఈ టాబ్లెట్లను వాడుతున్నారు. ఒక్కో మాత్రను ర.20 వరక ధర పలుకుతోందట. మొక్కజొన్న పీచు ప్రాసెసింగ్, నిల్వకు అధిక ఖర్చుతో కూడిన నిర్మాణాలు అవసరం లేదు. మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, గ్రామీణ నిరుద్యోగులకు మొక్కజొన్న పీచు సేకరణ ద్వారా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. మొక్కజొన్న రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రకృతి/సేంద్రియ రైతులకు మరింత ఉపయోగకరమని చెప్పొచ్చు. మొక్కజొన్న పీచుతో టీ ఇలా.. ఎండబెట్టిన మొక్కజొన్న పీచుతో టీ(కషాయం) కాచుకొని తాగటం ఒక మేలైన పద్ధతి. 2 కప్పుల నీటిలో 2 చెంచాల ఎండిన పీచును కలిపి, తక్కువ మంటపై 10 నిమిషాలు మరిగించి వడకడితే.. చక్కటి టీ రెడీ అవుతుంది. బెల్లం, పంచదార, తేనె తగుమాత్రంగా కలిపి రోజుకు 3 కప్పుల వరకు తాగొచ్చు. వట్టి మొక్కజొన్న పీచు టీకి కొంచెం మట్టి వాసన ఉంటుంది. అందుకని ఇతర పదార్థాలతో కలిపి టీపొడిని తయారు చేసుకొని వాడొచ్చు. ఎండిన మొక్కజొన్న పీచు, ఎండు నిమ్మ బద్దలను వేర్వేరుగా పిండి చేసి కలిపి టీ కాచుకోవచ్చు. (చదవండి: 'కిచెన్ క్వీన్స్'..వంటగదితోనే వ్యాపారం సృష్టించారు!) -
ఇంట్లోనే పనీర్ జిలేబీ చేసుకోండి ఇలా..
పనీర్ కార్న్ జిలేబీ తయారీకి కావల్సినవి: పనీర్ తురుము 300 గ్రాములు పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా కార్న్ పౌడర్ పావు కప్పు, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి పావు టీ స్పూన్, బేకింగ్ సోడా అర టీ స్పూన్, నెయ్యి సరిపడా, నీళ్లు కొన్ని పిస్తా ముక్కలు లేదా జీడిపప్పు ముక్కలు గార్నిష్‌కి తయారీ విధానమిలా.. ముందుగా పెద్ద బౌల్లో కార్న్ పౌడర్, మైదాపిండి, బేకింగ్ సోడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని, ఉండలు లేకుండా పలచగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పనీర్ తురుము వేసుకుని బాగా కలిపి.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్‌ని ఒక కవర్లో వేసుకుని, ఆ కవర్ని కోన్‌లా తయారు చేసుకోవాలి. మరుగుతున్న నేతిలో జిలేబీల్లా చుట్టుకుని, దోరగా వేయించుకోవాలి. ఈ లోపు మరో స్టవ్ మీద పంచదార, కుంకుమ పువ్వు, ఏలకుల పొడి, సరిపడా నీళ్లు పోసుకుని లేతపాకం పెట్టుకుని.. వేడివేడిగా ఉన్న జిలేబీలను అందులో వేసుకుని పాకం పట్టించాలి. అనంతరం ప్లేట్లోకి తీసుకుని, పిస్తా ముక్కలు లేదా జీడిపప్పు ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకోవాలి. -
కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా..
సాక్షి, మల్యాల(చొప్పదండి): ‘ఇంటింటికీ పింఛన్లు ఇచ్చుకుంట.. మాకు ధీముగా ఉన్న కేసీఆర్ సారు సల్లంగుండాలె బిడ్డా..’అని రోడ్డు వెంట మక్కకంకులు కాల్చి విక్రయిస్తున్న ఓ మహిళ వ్యాఖ్యానించింది. ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారులో కాసేపు ఆగారు. అక్కడే మక్కకంకులు అమ్ముతున్న ఓ మహిళ వద్దకు వెళ్లి వాటిని కొనుగోలు చేశారు. ఆమెతో మాటలు కలుపుతూ, కంకులు తింటూ సీఎం కేసీఆర్ పాలనపై కవిత ఆరా తీశారు. అయితే, తనకే కాదు ఇంటింటికీ పింఛన్ వస్తోందని ఆ మహిళ సంతోషంగా చెప్పింది. ‘కేసీఆర్ సారు పదికాలాలు సల్లంగుండాలె’అని దీవించింది. సీఎం కేసీఆర్ కూతురు కవిత తన వద్దకు వచ్చి కంకులు కొనుగోలు చేయడం చాలా సంతోషంగా ఉందని ఉబ్బితబ్బిబ్బయింది. ఎమ్మెల్సీ కవితను చూసి వచ్చిన స్థానికులు ఆమెతో సెల్ఫీలు దిగారు. -
దున్నకుండానే మొక్కజొన్న, వేరుశనగ! తక్కువ శ్రమ.. ఖర్చు ఆదా
దుక్కి దున్నకుండానే మొక్కజొన్న సాగు(జీరో టిల్లేజి) పద్ధతి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇటీవల చాలా ప్రాచుర్యం పొందింది. దీనికి ఏకైక కారణం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ అందుబాటులోకి తెచ్చిన ‘డబుల్ వీల్ మార్క్ర్’ (రెండు చక్రాలతో రంధ్రాలు వేసే పరికరం). సార్వా(ఖరీఫ్)లో వరి సాగు చేసిన భూముల్లో దుక్కి దున్నకుండా ఈ పరికరంతో రైతులు సులభంగా నేలపై రంధ్రాలు చేసి విత్తనాలు వేసుకుంటున్నారు. వరి కోసిన తర్వాత తక్కువ సమయంలోనే మొక్కజొన్న విత్తుకోవడానికి ఈ పరికరం రైతులకు ఎంతో ఉపయోగ పడుతోంది. నాలుగేళ్ల క్రితం ఈ పరికరం తొలుత అందుబాటులోకి వచ్చింది. సార్వా వరి తర్వాత మొక్కజొన్న పంటను వరుసగా మూడు దఫాలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారు. వరుసల మధ్య దూరం తగ్గించుకునే చిన్న మార్పు చేసుకొని దుక్కిలేని పద్ధతిలో వేరుశెనగ విత్తుకోవడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషిస్తున్నారు. మొక్కజొన్నతో పాటు వేరుశనగ మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం, వరుసల మధ్య 60 సెం.మీ.ల దూరంలో డబుల్ వీల్ మార్కర్‌తో రంధ్రాలు చేసి దుక్కి చేయకుండానే మొక్కజొన్న విత్తుకోవచ్చు. అదేవిధంగా వేరుశనగ విత్తుకోవడానికి మార్కర్‌లో స్వల్ప మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం, వరుసల మధ్య 40 సెం.మీ.ల దూరంలో వేరుశనగ విత్తుకోవాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గత రబీలో వరి కోసిన 48,146 ఎకరాల్లో దున్నకుండా డబుల్ వీల్ మార్కర్‌తో మొక్కజొన్నను సాగు చేశారు. 18 మండలాల్లో సుమారు 25 లక్షల వ్యంతో మండలానికి 40 చొప్పున 720 పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తెలిపింది. ఈ పరికరాలన్నీ ఎల్. సత్యనారాయణ తయారు చేసి ఇచ్చినవే. సమాన దూరంలో విత్తనాలు నాటడం వలన గాలి, వెలుతురు ధారాళంగా సోకి, పంటలకు పురుగులు, తెగుళ్ల బెడద తక్కువగా ఉంది. చేను ఏపుగా పెరిగి సాధారణ పద్ధతిలో కంటే జీరోటిల్లేజ్ పద్ధతిలో మేలైన దిగుబడులు నమోదు అవుతుండటం విశేషం. మహిళలు ఉపయోగించడానికి డబుల్ వీల్ మార్క్ర్ అనువుగా ఉండటం మరో విశేషం. మహిళా రైతులకు, ముఖ్యంగా చిన్న, సన్నకారు ఒంటరి మహిళా రైతులకు ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగకరంగా ఉంది. నెల కాలం కలిసి వస్తుంది! తొలకరి వరి చేను కోసిన తరువాత పొలంలో వరి కొయ్యకాళ్లలో దుక్కి దున్నకుండానే పదును చూసుకుని డబుల్ వీల్ మార్కర్‌ను నడిపి మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో రైతులకు దుక్కి ఖర్చులు ఆదా అవ్వటమే కాకుండా నెల రోజుల పంట కాలం కలిసి వస్తుంది. మొక్కజొన్న సాగు ప్రారంభమైన తొలినాళ్లలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో రైతులకు కొయ్యతో గాని, కొయ్యతో చేసిన పెగ్ మార్కర్ అనే పరికరంతో గాని వరి మాగాణిల్లో నేరుగా రంధ్రాలు చేసి మొక్క జొన్న విత్తనాలు విత్తేవారు. పెగ్ మార్కర్ పరికరాన్ని ఉపయోగించేటప్పుడు ఎక్కువ శ్రమ, ఎక్కువ సమయం వృథా అవుతుండేది. మగ కూలీలు మాత్రమే పెగ్ మార్కర్‌ను ఉపయోగించేవారు. 2016 నుంచి ప్రయోగాలు కూలీల ఖర్చు, శ్రమ తగ్గించుకుంటూ మొక్కజొన్న, వేరుశెనగ పంటలను దుక్కి దున్నకుండా నేరుగా ఎలా విత్తుకోవాలనే అంశంపై డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధి హరిబాబు (84999 28483) 2016 నుంచి అనేక ప్రయోగాలు చేసి ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. తొలుత ఒక చక్రం ఉన్న మార్కర్‌ను, తర్వాత ఐదు చక్రాల మార్క్ర్లను డిజైన్ చేసి రైతులకు అందించారు. వీటితో సరైన ఫలితాలు రాకపోవడంతో డబుల్ వీల్ మార్క్ర్ను డిజైన్ చేశారు. ఇది రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో మంచి స్పందన వచ్చింది. ఆముదాలవలసలోని ఏరువాక కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనల మేరకు ఉక్కుతో రెండు చక్రాల మార్కర్ (డబుల్ వీల్ మార్కర్) పరికరం దిద్దుకుంది. తుది రూపుదిద్దిన సత్యనారాయణ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ రూపొందించిన డబుల్ వీల్ మార్కెర్కు రైతు లంకలపల్లి సత్యనారాయణ (83741 02313) మార్పులు చేసి బరువు తగ్గించి 2019లో తుది రూపుదిద్దారు. సత్యనారాయణ వ్యవసాయం చేస్తూనే వెల్డర్‌గా పనిచేస్తున్నారు. ఆ అనుభవంతో సులభంగా ఒక వ్యక్తి తన పొలానికి భుజాన వేసుకొని తీసుకుని వెళ్లేందుకు వీలుగా డబుల్ వీల్ మార్కర్ పరికరాన్ని మార్చారు. మొదట తన పొలంలో ఉపయోగించి సంతృప్తి చెందిన తర్వాత, తానే తయారు చేసి రూ. 2,900కు ఇతర రైతులకు అందిస్తున్నారు. 2021 రబీ నాటికి రణస్థలం మండలంలో రైతులకు 85 డబుల్ వీల్ మార్కర్లను ఇచ్చారు. ఆ తర్వాత రైతుల్లో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. – గంగి నాగరాజు, సాక్షి, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా -
Health Tips: మొక్కజొన్న తింటే ఇన్ని ఉపయోగాలా? ఆరోగ్యంతో పాటు..
మెుక్కజొన్న అతి చౌకగా లభించే ఆహారం. దీని గింజలను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. ముసురు పట్టినప్పుడు మొక్కజొన్న కండె కాల్చుకుని తింటూ ఉంటే ఆ మజానే వేరు. మెుక్కజొన్న గింజల నుంచి పాప్‌కార్న్, కార్న్ ఫ్లేక్స్ తయారుచేస్తారు. మెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.. అవేమిటో చూద్దామా..? మంచి చిరుతిండి ►మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుంది. కంకులుగా వున్నప్పుడే వాటిని తినేయవచ్చు లేదా మసాలాలు, కారాలు కూడా తగిలించి తినచ్చు. గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తినవచ్చు లేదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో కూడా చేర్చితే సాయంకాలం వేళ మంచి చిరుతిండి. ►మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. ►మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతోంది. ఎముకలకు బలం ►పీచు పుష్కలంగా ఉంది. ఇది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. ఆహారంలో పీచు ఉండడంతో మొక్కజొన్న మలబద్ధకం, మెులలు వంటివి రాకుండా కాపాడుతుంది. పేగుకేన్సర్‌ను అరికడుతుంది. ►ఎముకల బలానికి పోషకాలైన కాపర్, ఐరన్, అవసరమైన లవణాలు, మినరల్స్ మెుక్కజొన్నలో పుష్కలంగా ఉన్నాయి. ►పసుపు రంగులో ఉండే ఈ చిన్న గింజలలో మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటివి కూడా ఉండడంతో ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. ►కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. చర్మం ఆరోగ్యంగా.. అందంగా. ►మెుక్కజొన్నలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతిమంతంగా ఉంచడమేకాదు... శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయి. ►మెుక్కజొన్న గింజల నుంచి తీసిన నూనె చర్మ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మం మీద వచ్చే మంటలను, దద్దుర్లను తగ్గిస్తుంది. ఎర్ర రక్తకణాల వృద్ధి ►రక్తహీనత ఉన్నవారికి మొక్కజొన్న అద్భుతమైన వరం. ►మెుక్కజొన్నలో ఉండే ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. గుండె ఆరోగ్యం పదిలం ►మొక్కజొన్న రక్తకణాల్లో కొవ్వుస్థాయులను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ►రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది తద్వారా గుండెపోటు, పక్షవాతం, బీపీ మొదలైన సమస్యలను అదుపులో ఉంచుతుంది. జుట్టుకు బలం ►రోజూ మొక్కజొన్న తినేవారికి జుట్టు బలంగా ఉంటుంది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి జుట్టును పట్టులా మృదువుగా... మెరుపులీనేలా చేస్తుంది. ►మొక్కజొన్న తక్షణశక్తిని ఇచ్చే ఆహారం. దీనిని తినడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇందులో ఖనిజాలు, పోషకాల శాతం కూడా ఎక్కువగానే ఉన్నాయి. సరైన ఆహారం ►మొక్కజొన్న తరచు తినడం వల్ల హైపర్ టెన్షన్ కూడా దూరం అవుతుంది. బీపీ, షుగర్, గుండె జబ్బులు అన్నిటికీ సరైన ఆహారం మొక్కజొన్న. ►అందుకే వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ సరదాకి తినడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే మొక్కజొన్నను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండచ్చు. చదవండి: Health Tips: ఈ పండ్ల గింజల్లో సైనైడ్‌ను విడుదల చేసే కారకాలు! తిన్నారంటే అంతే సంగతులు! జాగ్రత్త! Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. -
Recipe: స్వీట్ కార్న్, పాలకూర.. కార్న్ పాలక్ పకోడి తయారీ ఇలా..
ఉల్లిపాయ పకోడి బోర్ కొడితే ఈ వర్షాకాలంలో కార్న్ పాలక్ పకోడి రెసిపీ ట్రై చేయండి. కావలసినవి: ►పాలకూర – కప్పు ►స్వీట్ కార్న్ గింజలు – కప్పు ►శనగపిండి – రెండు కప్పులు ►కారం – మూడు టీస్పూన్లు ►అల్లం తరుగు – రెండు టీస్పూన్లు ►జీలకర్ర పొడి – నాలుగు టీస్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె – డీప్‌ఫ్రైకి తగినంత. తయారీ: ►ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి గిన్నెలో వేయాలి. ►పాలకూర వేసిన గిన్నెలో నూనె తప్పించి మిగతా పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి పకోడి పిండిలా కలుపుకోవాలి. ►నూనె వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించి తీసేయాలి. ►వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Idiyappam Pulihora Recipe: బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి.. ఇడియప్పం పులిహోర Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్ రింగ్స్ తయారీ ఇలా! -
Health: వర్షాకాలం కదా అని మొక్కజొన్న లాగించేస్తున్నారా? ఇందులోని లైకోపీన్..
వర్షాకాలంలో వేడి వేడి నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్న(కార్న్) పొత్తు తింటే ఆ మజానే వేరు కదా! తీపి రుచులను ఆస్వాదించే వారైతే స్వీట్‌కార్న్ తింటే సరి! కొంతమందికేమో మొక్కజొన్న గింజలు వేయించుకునో.. ఉడకబెట్టుకొనో తినడం ఇష్టం! మరి.. అందరికీ అందుబాటు ధరలో ఉండే మొక్కజొన్నను కేవలం టైమ్‌పాస్ ఫుడ్ అని తేలికగా కొట్టిపారేయకండి! దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందామా? పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక కప్పు పచ్చి మొక్కజొన్న గింజల్లో 125 కాలరీలు ఉంటాయి. 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు.. 4 గ్రాముల ప్రొటిన్లు, 9 గ్రాముల షుగర్, 2 గ్రాముల ఫ్యాట్, 75 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. రక్తహీనతకు చెక్! మొక్కజొన్నలో విటమిన్ బీ12 పుష్కలం. అంతేకాదు ఫోలిక్ యాసిడ్, ఐరన్ కూడా అధికం. ఇవన్నీ శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడతాయి. తద్వారా రక్త హీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఇది దోహదపడుతుంది. బరువు పెరగాలనుకుంటున్న వారు... ఉండాల్సిన దాని కన్నా తక్కువ బరువు ఉండి బాధపడుతున్న వారు మొక్కజొన్న తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. తగిన పరిమాణంలో కొంతకాలం పాటు వీటిని తింటే నీరసం తగ్గడంతో పాటు ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు. ఇక మొక్కజొన్నలో పీచు పదార్థం (ఫైబర్) పుష్కలం. ఆహారం జీర్ణమవడంలో ఉపకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. కంటి ఆరోగ్యానికై.. మొక్కజొన్నలో బీటా–కెరోటిన్ ఎక్కువ. వంద గ్రాముల మొక్కజొన్న గింజలను తింటే ఒక రోజులో అవసరమైన విటమిన్–ఏ లోని ఆరు శాతం మనకు సమకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విటమిన్–ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవి కూడా! విటమిన్-ఏతో పాటు మొక్కజొన్నలో విటమిన్ బీ, సీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. విటమిన్ బి–కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్ వంటి జీవక్రియలు సక్రమంగా సాగడంలో తోడ్పడతాయి. ఇక స్వీట్ కార్న్... రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మొక్కజొన్నలో ఫెలురిక్ యాసిడ్ అనే శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దీనికి ఉంది. అంతేకాదు... అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను కూడా అరికడుతుంది. ఇక గాయమైనపుడు కలిగే ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట, నొప్పి)ను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. ఏదేమైనా.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా మొక్కజొన్న అయినా... మరే ఇతర ఆహార పదార్థాలైనా.. మితంగా తింటేనే మేలు! ఇందులో పిండి పదార్థాలు కాస్త ఎక్కువే కాబట్టి మధుమేహులు దీనికి కాస్త దూరంగా ఉంటేనే బెటర్! ఆరోగ్యకరమైన చర్మం కోసం.. మొక్కజొన్నలో విటమిన్ సీతో పాటు లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే కార్న్ ఆయిల్, కార్న్ స్టార్చ్‌ను పలు సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడతారు. పొటాటో – కార్న్ సూప్ ఇలా తయారు చేసుకోండి! కావలసినవి ►బంగాళ దుంపలు – 6 (తొక్క తీసి ముక్కలు చేయాలి) ►కొత్తిమీర ఆకులు – ఒక కప్పు ►ఉల్లి తరుగు – పావు కప్పు ►మొక్క జొన్న గింజలు – రెండు కప్పులు ►ఉల్లి కాడల తరుగు – పావు కప్పు ►ఉప్పు – తగినంత తయారీ ►ఒకపెద్ద పాత్రలో బంగాళ దుంప ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు, తగినన్ని నీళ్లు జత చేసి మూత పెట్టి ఉడికించాలి. ►మొక్కజొన్న గింజలు జత చేసి పదార్థాలన్నీ మెత్తగా అయ్యేవరకు సుమారు పది నిమిషాలు ఉడికించాలి. ►ఉల్లికాడలు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేసి, వడగట్టి అందించాలి. చదవండి: Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే.. -
Viral Video: మొక్కజొన్న కంకులు బేరమాడిన మంత్రి.. షాకిచ్చిన యువకుడు
భోపాల్: రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు అమ్మే వ్యక్తితో కేంద్రమంత్రి బేరమాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రహదారి పక్కన కాల్చిన మొక్కజొన్నలు అమ్ముతున్న వ్యక్తి వద్దకు వెళ్లిన కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే.. మూడు మొక్కజొన్న కంకులను మంచిగా కాల్చి.. నిమ్మరసం, ఉప్పు రాసి ఇవ్వమన్నారు. మంత్రి చెప్పినట్టే చేసిన ఆ యువకుడు మూడు కంకులకు రూ.45 ఇవ్వమన్నాడు. దీంతో మంత్రి షాక్ అయ్యారు. ఏంటి? మూడు మొక్కజొన్న కంకులకు 45 రూపాయలా? ధర చాలా ఎక్కువ కదా? అన్నారు. కంకులమ్మే వ్యక్తి మాత్రం నవ్వుతూ.. లేదు సర్ నేను సాధారణ ధరే చెప్పాను. మీరు కారులో వచ్చారు కదా అని ఎక్కువ చెప్పడం లేదంటూ బదులిచ్చాడు. ఊర్లో ఈ మొక్కజొన్న కంకులు ఉచితంగా ఇస్తారు కదా అన్న మంత్రి.. చివరికి మూడు కంకులకు రూ.45 చెల్లించారు. आज सिवनी से मंडला जाते हुए। स्थानीय भुट्टे का स्वाद लिया। हम सभी को अपने स्थानीय किसानों और छोटे दुकानदारों से खाद्य वस्तुओं को ख़रीदना चाहिए। जिससे उनको रोज़गार और हमको मिलावट रहित वस्तुएँ मिलेंगी। @MoRD_GoI @BJP4Mandla @BJP4MP pic.twitter.com/aNsLP2JOdU — Faggan Singh Kulaste (@fskulaste) July 21, 2022 కేంద్రమంత్రి మధ్యప్రదేశ్‌లోని శివనీ నుంచి మండ్లా వెళ్తుండగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆ యువకుడు చాలా పేదవాడు. ఒక్క మొక్కజొన్న కంకికి రూ.15 అంటే మీకు చాలా ఎక్కువ అనిపిస్తుందా? సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కేకే విశ్రా విమర్శలు గుప్పించారు. మరోవైపు బీజేపీ మాత్రం మంత్రిని సమర్థించుకుంది. రోడ్డుపై కారు ఆపి మొక్కజొన్నలు అమ్ముతున్న వ్యక్తి దగ్గరకు కేంద్రమంత్రి వెళ్లారని, అతను అడిగినంత డబ్బు ఇచ్చారు కదా అని పేర్కొంది. దేశంలో నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెరిగాయని విపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. చదవండి:లక్ అంటే ఇదే.. తల్లి సలహాతో జాక్‌పాట్ కొట్టిన మహిళ.. లాటరీలో కోట్లు! -
ఈ పదార్థాలు ఉంటే చాలు.. ఈజీ పొటాటో స్నాక్.. టేస్టు అదిరిపోద్ది!
ఆలు చిప్స్ తినీతిని బోర్ కొట్టిందా! అయితే, బంగాళా దుంపతో ఈ వైరైటీ వంటకాన్ని ట్రై చేయండి. రొటీన్‌కు భిన్నంగా పొటాటో టోర్నడో రుచిని ఆస్వాదించండి. పొటాటో టోర్నడో తయారీకి కావాల్సిన పదార్థాలు: ►బంగాళ దుంపలు – 4 లేదా 5 ►మైదాపిండి – అర కప్పు ►మొక్కజొన్నపిండి – 1 టేబుల్ స్పూన్ ►బేకింగ్ సోడా – అర టీ స్పూన్ ►ఉప్పు – కొద్దిగా, నీళ్లు – కావాల్సినన్ని ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా ►గార్లిక్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ►చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►చీజ్ సాస్ – 4 టేబుల్ స్పూన్ల పైనే ►డ్రై పార్సీ – అర టేబుల్ స్పూన్ ►ఎండు మిర్చి పొడి – 1 టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్లో గార్లిక్ పౌడర్, చీజ్ తురుము, డ్రై పార్సీ.. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కో బంగాళదుంపను ఒక్కో పొడవాటి పుల్లకు గుచ్చి.. చాకుతో స్ప్రిల్స్లా (వలయంలా, మొత్తం కట్ చెయ్యకుండా చిత్రంలో ఉన్న విధంగా) కట్ చేసుకుని పెట్టుకోవాలి. ►అనంతరం వెడల్పుగా ఉండే బౌల్లో మైదాపిండి, మొక్కజొన్నపిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచటి మిశ్రమంలా చేసుకోవాలి. ►ఆ మిశ్రమంలో ఒక్కో పొటాటో స్ప్రింగ్‌ని ముంచి.. నూనెలో దోరగా వేయించాలి. అనంతరం వాటిని వరుసగా పెట్టుకుని.. అటు ఇటు తిప్పుతూ గార్లిక్–చీజ్ మిశ్రమాన్ని చల్లుకోవాలి. ►ఆ పైన చీజ్ సాస్ స్ప్రిల్స్ పొడవునా స్ప్రెడ్ చేసుకుని.. చివరిగా ఎండుమిర్చి పొడిని చల్లి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి: Summer Drink: సుగంధ షర్బత్ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
స్వీట్ కార్న్ లాలీపాప్స్, చికెన్ బీట్రూట్ సమోసా తయారీ ఇలా..
వెరైటీగా ఈ వంటకాలు ట్రై చేయండి. మీ కుటుంబానికి కొత్త రుచులు పరిచయం చేయండి. స్వీట్ కార్న్ లాలీపాప్స్ కావలసిన పదార్థాలు చిల్లీ ఫ్లేక్ మిరియాల పొడి జీలకర్ర ధనియాలు – అర టీ స్పూన్ చొప్పున పచ్చిమిర్చి – 2 స్వీట్ కార్న్ – ఒకటిన్నర కప్పులు ఉప్పు – తగినంత కార్న్ ఫ్లేక్స్ – ముప్పావు కప్పు (మరీ మెత్తడి పొడిలా కాకుండా.. చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి) బంగాళ దుంప తురుము – అర కప్పు మొక్కజొన్న పిండి – 2 టీ స్పూన్లు మైదా పిండి – 1 టీ స్పూన్ నీళ్లు – కొద్దిగా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. చిన్న మంటపైన జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ వేసుకుని బాగా వేయించాలి. అందులో చిల్లీ ఫ్లేక్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీపట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని, అందులో బంగాళదుంప తురుము, అర కప్పు కార్న్ ఫ్లేక్స్ వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకుని, చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో మైదా పిండి, మొక్కజొన్న పిండి వేసుకుని నీళ్లతో కాస్త పలచగా కలపాలి. ఆ మిశ్రమంలో బాల్స్ ముంచి, మిగిలిన కార్న్ ఫ్లేక్స్ ముక్కలని పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. టొమాటో సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ లాలీపాప్స్. చికెన్ బీట్రూట్ సమోసా కావలసిన పదార్థాలు బోన్‌లెస్ చికెన్ – పావు కప్పు (ఉప్పు, కారం, పసుపుతో పాటు మసాలా వేసి, మెత్తగా ఉడికించి, తురుములా చేసుకోవాలి) బీట్రూట్ తురుము – 4 టేబుల్ స్పూన్లు సోయా సాస్, టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున మైదా పిండి – 2 కప్పులు, గోధుమ పిండి – 1 కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్ బీట్రూట్ రసం – సరిపడా (చపాతీ ముద్ద కోసం నీళ్లకు బదులుగా బీట్రూట్ రసం కలుపుకోవాలి) ఉప్పు – సరిపడా నూనె – తగినంత తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో బీట్రూట్ తురుము, మిరియాల పొడి, చికెన్ తురుము, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దికొద్దిగా బీట్రూట్ రసం పోసుకుంటూ, ఉప్పు వేసి చపాతీ ముద్దలా చేసుకోవాలి. దానిపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా వత్తి, సమోసాలా చుట్టి అందులో చికెన్ మిశ్రమాన్ని వేసి ఫోల్డ్ చెయ్యాలి. వాటిని నూనెలో వేయించి తీస్తే.. సరిపోతుంది. చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
పత్తి.. వరి.. కంది
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్లో ఏకంగా 1.40 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించిన వ్యవసాయ శాఖ.. పత్తి, వరితో పాటు కంది పంటలను ప్రోత్సహించేలా ప్రణాళిక రూపొందించింది. దీంతో ఈసారి రాష్ట్రంలో కంది, పత్తి, వరి ఈ మూడు పంటలే అత్యధికంగా సాగు కానున్నాయి. గతంలో పత్తి, వరితో పాటు మొక్కజొన్న అధిక శాతం విస్తీర్ణంలో సాగవుతుండగా, ఈసారి మొక్కజొన్న స్థానంలో కంది పంట వచ్చి చేరింది. దేశంలో మొక్కజొన్న నిల్వలు ఎక్కువగా ఉండటం, ధర, డిమాండ్ లేని నేపథ్యంలో ఈ పంట సాగును తగ్గించాలని ప్రభుత్వం గత ఏడాదే నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన విత్తనాలను, ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి, వరికి మరింత ప్రోత్సాహం 2012–22 వానాకాలం సీజన్(ఖరీఫ్)కు సంబంధించిన సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ రూపొందించింది. గతేడాది వానాకాలంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలు కాగా, ఈ సీజన్లో ఏకంగా 1.40 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించింది. గతేడాది పత్తి 44.50 లక్షల ఎకరాలు సాధారణ సాగుగా నిర్ధారించగా, 54.45 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈసారి 70.04 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం ఉండాలని, ఆ మేరకు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. పత్తికి మంచి ధర ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సాగు నీటి వసతి ఎక్కువగా ఉండటం వల్ల ఈసారి వరి సాధారణ సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది వానాకాలం వరి సాధారణ సాగు విస్తీర్ణం 27.25 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 41.19 లక్షల ఎకరాల్లో సాగైంది. దీంతో ఈసారి వరి సాధారణ సాగు విస్తీర్ణాన్ని 41.85 లక్షల ఎకరాలుగా నిర్ధారించారు. మొక్కజొన్న 22 శాతానికే పరిమితం ఇప్పటివరకు పత్తి, వరి తర్వాత అత్యంత కీలకమైన పంటగా ఉన్న మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గనుంది. గతేడాది వానాకాలం సీజన్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 11.76 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 10.11 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈసారి మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం కేవలం 2.27 లక్షల ఎకరాలుగా నిర్ణయించారు. అంటే మొత్తం పంటల్లో దాదాపు 22.45 శాతానికే మొక్కజొన్న పరిమితం కానుంది. ఇక విత్తన కొరత, ఇతర కారణాలతో సోయాబీన్ సాగు కూడా తగ్గిపోనుంది. గతేడాది వానాకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 4.88 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 4.26 లక్షల ఎకరాల్లో సాగైంది. తాజాగా దీనిని కేవలం 1.33 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. కందికి మంచిరోజులు ఈసారి పత్తి, వరితో పాటు కంది సాగును బాగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.61 లక్షల ఎకరాలు కాగా, 7.38 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే ఈసారి వానాకాలంలో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో కందిని సాగు చేయించాలని నిర్ణయించారు. ఈసారి 20 రకాల పంటలకు సంబంధించిన 1.40 కోట్ల సాధారణ సాగు విస్తీర్ణంలో పత్తి, కంది, వరి సాధారణ సాగు విస్తీర్ణమే ఏకంగా 1.31 కోట్ల ఎకరాలు (94.13 శాతం) ఉండటం గమనార్హం. ఇలావుండగా ఈ సీజన్‌కు మొత్తం 25.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించారు. వీటిలో ప్రస్తుతం 6.77 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. చదవండి: Telangana: తొలి మాసం.. శుభారంభం -
మొక్కజొన్న మంటల్లో 6గురు చిన్నారుల సజీవ దహనం
పాట్నా: సరదాగా మొక్కజొన్నలు కాల్చుకుంటుండగా ఆ నిప్పు కాస్త పూరి గుడిసెపై పడి ఏకంగా ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకుపోయారు. చివరకు ఆ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ఈ ఘోర సంఘటన బిహార్‌లో జరిగింది. అరారియా జిల్లా కబయా గ్రామంలో మంగళవారం చిన్నారులు మొక్కజొన్న కంకులు నిప్పులపై కాల్చుకుంటున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఆ మంటలు వెళ్లి పూరి గుడిసెపై పడ్డాయి. గడ్డితో చేసిన గుడిసెలు కావడంతో వెంటనే మంటలు దావనంలా వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. దీంతో ఆ చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారు. వారి హాహాకారాలు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు మంటలు ఆర్పేందుకు విఫల ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆ చిన్నారులు మంటల్లో సజీవ దహనమయ్యారు. సరదాగా మొక్కజొన్నలు తినాల్సిన చిన్నారులు బొగ్గుల్లా మారిపోయారు. ఆ చిన్నారుల వయసు 3 నుంచి 6 ఏళ్లలోపే. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. అయితే అంతకుముందు రోజే బిహార్‌లో కాముడి దహనం చేస్తుండగా ఆ మంటల్లో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల వివరాలు గుల్నాజ్ (3) బర్కాస్ (4) అశ్రఫ్ (5) అలీ హసన్ (5) ఖుశ్ నిహార్ (5) దిల్వార్ (6) చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య చదవండి: ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం -
మొక్కజొన్న దిగుమతి చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకున్న విధానపరమైన నిర్ణయం మేరకు విదేశాల నుంచి మొక్కజొన్నను దిగుమతి తీసుకోవచ్చని విదేశీ వాణిజ్య విభాగం అదనపు డీజీ బాలసుబ్రమణ్యం హైకోర్టుకు నివేదించారు. మొక్కజొన్న దిగుమతితో స్థానిక రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారంటూ పలువురు రైతులు, వ్యాపారులు దాఖలు చేసిన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. సొంత అవసరాల కోసం వాడుకునే వారు మాత్రమే దిగుమతి చేసుకోవాలని, దిగుమతి చేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్, కారం, ఉప్పు వేసి తిరిగి ప్యాక్ చేసి అమ్మడానికి వీల్లేదని రైతుల తరఫున న్యాయవాది డొమినిక్ ఫెర్నాండెజ్ వాదనలు వినిపించారు. 2014లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం విదేశాల నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవచ్చని, గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తొలగించాలని దిగుమతిదారుల తరఫు న్యాయవాది నివేదించారు. సొంత అవసరాలకు మాత్రమే దిగుమతి చేసుకోవాలన్న నిబంధనేమీ లేదని, గతంలో హైకోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఆదేశాలను అమలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించారు. మన దేశం నుంచే పెద్ద మొత్తంలో మొక్కజొన్నను ఎగుమతి చేస్తారని, ఒక శాతం మాత్రమే దిగుమతి చేసుంటారని, సొంత అవసరాలకు మాత్రమే అన్న నిబంధన అంతర్జాతీయ వాణిజ్యం ఒప్పందాలకు విరుద్ధమని, ఇటువంటి నిబంధనలు పెడితే మనదేశ రైతులకే నష్టమని పేర్కొన్నారు. అయితే విధానపరమైన నిర్ణయాల్లో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన ఎలా కొనసాగిస్తారని, మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మొక్కజొన్న దిగుమతికి సంబంధించి స్పష్టమైన విధానం ఉండాలని, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. -
హైటెక్ సెల్వమ్మ
కర్ణాటక ,బొమ్మనహళ్లి : ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందంటూ ఒక మొబైల్ సంస్థ తయారు చేసిన ప్రకటన గుర్తుందా..ఈ ప్రకటనల్లో చూపినట్లే యువ ఇంజనీర్‌కు వచ్చిన ఒక ఐడియా ఓ వృద్ధురాలి జీవితాన్ని మార్చేసింది. బెంగళూరు నగరంలో కబ్బన్‌పార్క్ ఎంత ఫేమస్సో పార్కులో మొక్కజొన్న పొత్తులు విక్రయించే సెల్వమ్మ అనే వృద్ధురాలు కూడా అంతే ఫేమస్. అంత ఫేమస్ ఎందుకుయ్యారంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే..భద్రావతికి చెందిన సెల్వమ్మ చాలా కాలం క్రితం ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చారు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే విధానసౌధ, కబ్బన్‌పార్క్‌లో తోపుడిబండి మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే తోపుడు బండిపై మొక్కజొన్న కంకులు కాల్చడానికి ఏర్పాటు చేసుకున్న కట్టెల పొయ్యి వల్ల సెల్వమ్మ కంకులు కాల్చడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. పదేపదే నిప్పులను వేడి చేయడానికి విసనకర్రను ఊపుతూ ఉండడం సెల్వమ్మకు చాలా కష్టంగా పరిణమించింది. సెల్వ మ్మ కష్టాన్ని గుర్తించిన సెల్కో సంస్థకు చెందిన యువకుమార్ సెల్వమ్మకు చేయూత అందించడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వచ్చిన సరికొత్త ఐడియానే ఈ సోలార్ సిస్టమ్. సౌరశక్తి సహాయంతో మొక్కజొన్న కంకులు కాల్చడానికి వీలుగా అధునాతన సోలార్ యంత్రాన్ని తయారు చేసి సెల్వమ్మకు అందించారు. ఈ సోలార్ సిస్టమ్ ద్వారా మొక్కజొన్నకంకులు కాల్చడంతో పాటు బ్యాటరీ, ఫ్యా న్ , ఎల్ఇడి బల్బు కూడా పని చేస్తుండడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్క జొన్న కంకులు విక్రయిస్తుండడంతో సెల్వమ్మ ఆదాయం కూడా రెట్టింపయిం ది. హైటెక్ పద్ధతిలో పర్యాటకులకు రుచికరమైన మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ ఆదాయం పెంచుకోవడంతో పాటు పొగరహిత పద్ధతిలో మొక్కజోన్న కంకులను కాల్చుతూ పర్యావరణ రక్షణకు కూడా తన వంతు సహకారం అందిస్తున్న సెల్వమ్మను ఇక్కడికి వచ్చే రోజువారీ వినియోగదారులు హైటెక్ సెల్వమ్మగా పిలుచుకుంటున్నారు. -
మిద్దె తోటలో మొక్కజొన్న
మిద్దె తోటల్లో కూడా మొక్కజొన్నను అన్ని కాలాల్లోనూ బాగా పండించుకోవచ్చు. పెద్దగా తెగుళ్లు రావు. నాటిన రెండు నెలలకు, పొత్తులు తయారవుతాయి. మరో నెల దాకా అవసరాలకు పనికివస్తాయి. ఉదయాన్నే ఒకటో రెండో మొక్కజొన్న పొత్తులు తినండి. ఉప్పూ నూనెల తిండ్లకు దూరంగా ఉండండి. ఒక మొక్కజొన్న పొత్తు తింటే, మరే టిఫిన్ అవసరం లేదు. ఆకలి అవదు. మలబద్ధకం ఉండదు. అనేక సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. పాలిష్ చేసిన తెల్ల అన్నం తినటం కంటే, మొక్కజొన్న పొత్తును తినడం నయం. పొత్తుల్ని కాల్చుకొని తినడం కంటే, లైట్‌గా ఉడికించి తినడం మంచిది. అడుగు(ఫీటు) లోతు మట్టి ఉంటే చాలు, మొక్కజొన్నను పెంచుకోవచ్చు. ఎటు చూపినా పది అంగుళాలకు ఒక విత్తనాన్ని నాటుకోవాలి. అర అంగుళం లోతులో విత్తనాలను నాటుకోవాలి. నాటాకా మడి మొత్తం తడిసేలా నీరు పెట్టాలి. మట్టి నాలుగైదు వంతులు, ఎరువు ఒక వంతు చొప్పున కలిపి వాడాలి– మడుల్లో. ఆహార వైవిధ్యం పాటించాలి. మనం ఆరోగ్యంగా జీవించాలి. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు -
నా పంట యాప్ రైతుకు చేదోడు!
రైతులకు తోడ్పడటానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలన్న తపనతో నవీన్ కుమార్ అనే యువకుడు ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన ప్రస్థానం రైతులకు చేదోడుగా నిలుస్తోంది. సకాలంలో సమాచారం సాంకేతిక సలహా అందక పంట నష్టపోవడం, దళారీ వ్యవస్థ వల్ల పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించగలిగితే రైతుల జీవితాల్లో వెలుగులు పూయించవచ్చని నవీన్‌కుమార్ తలపెట్టాడు. ఐఐఐటీ హైద్రాబాద్, ఇక్రిశాట్ నిపుణుల తోడ్పాటుతో ‘నా పంట’ అనే మొబైల్ యాప్‌ను 2017 జూన్‌లో రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోకి గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘నా పంట’ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3,500 మార్కెట్లలో 300 వ్యవసాయోత్పత్తులకు పలుకుతున్న తాజా ధరవరలతోపాటు మూడేళ్లలో వాటి ధరల్లో హెచ్చుతగ్గులను ఈ యాప్ ద్వారా రైతులు తెలుసుకోవచ్చు. ప్రకృతి, సేంద్రియ, రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు అవసరమైన 120 పంటలకు సంబంధించిన ఎరువులు, చీడపీడల యాజమాన్య మెలకువలు, కషాయాలకు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచారు. పంటల బీమా.. కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు.. యంత్రపరికరాల లీజు సమాచారం, వ్యవసాయ డీలర్ల వివరాలు.. వంటి మొత్తం 16 రకాల సేవలను స్మార్ట్ ఫోన్ ద్వారా నిమిషంలోనే పొందవచ్చని నవీన్ వివరించారు. గ్రామీణ రైతులు ఉపయోగించుకోగలిగేలా తెలుగు భాషలోనే ఆన్లైన్ మార్కెటింగ్, ఈ కామర్స్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభించిన ఏడాదిన్నర కాలంలోనే ఈ యాప్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షా పది వేల మంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందుతున్నారని నవీన్(95059 99907) చెబుతున్నారు. బాల వికాస, రెడ్డీ ల్యాబ్స్ వంటి ప్రైవేటు సంస్థలతోపాటు ప్రభుత్వ సంస్థలతోనూ కలిసి పనిచేస్తూ రైతులకు చేరువ అవుతున్నామన్నారు. అనతికాలంలోనే అనేక అవార్డులను అందుకున్న ‘నా పంట’ యాప్‌ను ఉపయోగించుకోగలిగిన రైతులు సాగు వ్యయాన్ని తగ్గించుకోవడానికి, ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. -
జొన్నల వంటలు
జొన్న బూందీ లడ్డు కావలసినవి: గోధుమపిండి/సెనగ పిండి – ఒక కప్పు, జొన్న పిండి – ఒకటిన్నర కప్పులు ల్లం పొడి – 2 కప్పులు, ఏలకుల పొడి – ఒక టీ స్పూను, కిస్మిస్ – తగినన్ని జీడి పప్పులు – తగినన్ని, నెయ్యి /నువ్వుల నూనె – వేయించడానికి తగినంత తయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి/సెనగ పిండి, జొన్న పిండి వేసి బాగా కలపాలి. కొద్డిగా నీళ్లు జత చేసి, బూందీ పిండిలా కలపాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగనివ్వాలి. కలిపి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూసి, దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేరొక పెద్ద పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి తీగ పాకం వచ్చేవరకు ఉడికించి దింపేయాలి. తయారుచేసి ఉంచుకున్న బూందీని బెల్లం పాకంలో వేసి కలియబెట్టాలి. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు జత చేసి లడ్డులా ఉండకట్టాలి. కొద్దిగా చల్లారిన తరవాత గాలి చొరని డబ్బాలోకి తీసుకోవాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? జొన్నలు (Great Millet) నియాసిన్ (Niacin)mg (B3) 1.8 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.13 థయామిన్(Thiamine) mg (B1) 0.37 కెరోటిన్ (Carotene)ug 47 ఐరన్ (Calcium)g 0.03 కాల్షియం (Phosphorous)g 0.28 ఫాస్పరస్(Protein)g 10.4 ప్రొటీన్ (Minerals) g 1.6 ఖనిజాలు (Carbo Hydrate) g 72.4 పిండిపదార్థం (Fiber) g 1.3 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 55.69 జొన్న చుడువా కావలసినవి: జొన్న అటుకులు – ఒక కప్పు, నూనె – 3 టీ స్పూన్లు, మినప్పప్పు – ఒక టీ స్పూనుపచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను, జీలకర్ర – ఒక టీ స్పూనుపల్లీలు – ఒక టేబుల్ స్పూను, ఎండు మిర్చి – 3, పసుపు – పావు టీ స్పూనుఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను తయారీ: స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక జొన్న అటుకులను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికాస్త నూనె వేసి కాగాక పచ్చి పల్లీలు వేసి వేయించాలి. మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. పసుపు వేసి మరోమారు కలియబెట్టి, దింపేసి, జొన్న అటుకుల మీద వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలిపి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. జొన్న బాక్రావాడి మసాలా కావలసినవి: జొన్న పిండి – 50 గ్రా., సెనగ పిండి – 50 గ్రా., గోధుమ పిండి – 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – ఒక టీ స్పూను, వేయించిన నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్లుసోంపు పొడి – ఒక టీ స్పూను, జీలకర్ర పొడి – ఒక టీ స్పూనుబాదం పప్పుల పొడి – ఒక టేబుల్ స్పూను, ధనియాల పొడి – ఒక టీస్పూనుజీడిపప్పుల పొడి – ఒక టేబుల్ స్పూను, ఉప్పు – తగినంతమిరప కారం – ఒక టీ స్పూను, గసగసాల పొడి – ఒక టీ స్పూనుచాట్ మసాలా – ఒక టీ స్పూను, నూనె – ఒక టేబుల్ స్పూను, నీళ్లు – తగినన్ని తయారీ: ముందుగా జొన్న పిండి, గోధుమ పిండి, సెనగ పిండి ఒకటిగా కలిపి జల్లెడపట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రెండు టీ స్పూన్ల కాచిన నూనె వేసి పిండిని బాగా కలపాలి. తగినన్ని నీళ్లు కలిపి చపాతీ పిండిలా కలిపి ఉండలు చేసుకోవాలి. ఒక పాత్రలో అన్ని పొడులను వేసి బాగా కలియబెట్టాలి. ఒక్కో ఉండను చపాతీ మాదిరిగా ఒత్తాలి. తయారుచేసి ఉంచుకున్న పొడుల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ మీద వేసి, చపాతీని రోల్ చేయాలి. ఇలా చేయడం వల్ల పొడి అన్ని పొరలకు అంటుతుంది. రోల్ చేసిన వాటిని చాకు సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. తయారుచేసి ఉంచుకున్న వాటిని నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. జొన్నలు – జీడిపప్పు గోరుమీఠీలు కావలసినవి: జొన్న పిండి – 100 గ్రా., పెసర పిండి – 50 గ్రా. ఇడ్లీ రవ్వ – 50 గ్రా., మిరియాల పొడి – 10 గ్రా. ఉప్పు – తగినంత, జీడి పప్పులు – 20 గ్రా., నూనె – 250 గ్రా., నీళ్లు – తగినన్ని తయారీ: ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో జొన్న పిండి, పెసర పిండి, ఇడ్లీ రవ్వ వేసి అన్నీ కలిసేలా కలపాలి. మరుగుతున్న నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి. జీడిపప్పు పలుకులు జత చేసి మరోమారు కలపాలి. చేతితో చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ, బొటన వేలితో ఒత్తుతూ గోరు మీఠీలు తయారుచేయాలి. అలా అన్నీ తయారుచేసుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న గోరుమీఠీలను వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. జొన్న షర్బత్ కావలసినవి: జొన్నలు – పావు కప్పుచల్లటి నీళ్లు – 3 కప్పులుమిరియాలు – 10నిమ్మ కాయ ముక్కలు – 3బెల్లం పొడి – అర కప్పునిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్లుతాజా బత్తాయి రసం – ఒక కప్పు ఐస్ ముక్కలు – కొద్దిగా తయారీ: ముందుగా జొన్నలను మంచి నీళ్లలో శుభ్రంగా కడిగి, నీళ్లను ఒంపేయాలి. ఒక పాత్రలో తగినన్ని మంచి నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. కడిగిన జొన్నలు జత చేసి బాగా కలియబెట్టి, మంట తగ్గించి పది నిమిషాలపాటు ఉడికించి దింపేయాలి. మిరియాలు, నిమ్మ కాయ ముక్కలు, బెల్లం పొడి వేసి బాగా కలపాలి. బాగా చల్లారాక వడకట్టాలి. నిమ్మ రసం, బత్తాయి రసం, ఐస్ ముక్కలు జత చేసి బాగా కలిపి చల్లగా అందించాలి. జొన్నల కార బూందీ కావలసినవి: జొన్న పిండి – ఒక కప్పుగోధుమ పిండి లేదా సెనగ పిండి – ఒక కప్పుకి కొద్దిగా తక్కువనూనె – తగినంత, జీడిపప్పులు – 10 గ్రా.మిరప కారం – ఒక టీ స్పూను, ఉప్పు – తగినంతకరివేపాకు – 2 రెమ్మలు, నీళ్లు – తగినన్ని తయారీ: ఒక గిన్నెలో జొన్న పిండి, గోధుమ పిండి/సెనగ పిండి వేసి బాగా కలిపి, తగినంత ఉప్పు, కారం, నీళ్లు జత చేసి జారు పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. తయారుచేసి ఉంచుకున్న పిండిని బూందీ చట్రంలో వేసి నూనెలోకి బూందీ దూయాలి. దోరగా వేగిన బూందీని ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, నూనెలో వేయించిన జీడిపప్పు, కరివేపాకు జత చేసి బాగా కలపాలి. కొద్దిగా చల్లారాక తినాలి. ఇదేవిధంగా సజ్జలు, రాగులతో కూడా చేసుకోవచ్చు. -
పిచ్చితల్లి
గబగబా అడుగులేసుకుంటూ తన గుడిసె దగ్గరకొచ్చింది లక్ష్మమ్మ. చేతిలోని గిన్నెలో ఆమె పాచిపని చేసే యాజమానురాళ్ళు ఇచ్చిన అన్నం కూరలు, వస్తూ వస్తూ కొని కొంగులో దాచిన మొక్కజొన్న పొత్తు ఉన్నాయి. బయట ఆమె ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. తల్లిని చూడగానే, ‘‘అమ్మా! ఆకలే...’’ అంటూ ఆమెను చుట్టుముట్టారు. తల్లడిల్లిపోయింది. ఆమె తల్లిమనసు. కొంగులో ఉన్న కాల్చిన మొక్కజొన్న పొత్తును రెండుగా తుంపి చెరొక ముక్కా ఇచ్చింది. ‘‘అమ్మా! అన్నం పెట్టవే బాగా ఆకలేస్తోంది’’ అన్నారు పిల్లలు జాలిగా. గబాలున ఇద్దర్ని గుండెల్లో పొదువుకుంది ఆర్తిగా. ‘‘రండిరా పెడతాను’’ అంటూ గుడిసెలోకి దారితీసిందామె. లోపలికెళ్ళి రెండు బొచ్చెల్లో అన్నం పెట్టి కూరలేసింది. ఇద్దరు పిల్లలు ఆ చద్దన్నాన్నే ఆవురావురంటూ తిని మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. పిల్లలకింత ఉడుకుడుకుగా రోజూ అన్నం కూరలు వండిపెట్టాలనుంటుంది లక్షమ్మకి. పొద్దున్నే ఆరింటికల్లా పాచిపనికెళ్ళాలి. నాలుగు గంటలకి నిద్రలేచి పొయ్యంటించి మండని కట్టెలను ఊదుకుంటూ తాను కాసిని టీనీళ్ళు పెట్టుకుతాగి వంటచేసేసరికి ఆరుదాటి పోతుంది. పనికి ఆలస్యంగా వెళితే కేకలేస్తారు ఆమె యజమానురాళ్ళు. ఆరేడిళ్ళలో అంట్లు, బట్టలు, ఇల్లు తుడవటం, వాకిలి ముగ్గేయటం, మెట్లు చిమ్మటం చేస్తుంది లక్షమ్మ. పొద్దున్నే ఆరింటికి బయలు దేరితే అందరిళ్ళల్లో పని చేసి ఇంటికొచ్చేసరికి దగ్గరదగ్గర ఒంటిగంట దాటుతుంది. దాదాపు రోజూ ఒక ఇంట్లో కాకపోతే మరో ఇంట్లో ఎవరోఒకరు అన్నం కూరలు ఆమెకు తినమని ఇస్తారు. ఆమె అక్కడ తినకుండా గిన్నెలో ఇంటికి పట్టుకొచ్చి పిల్లలకి పెట్టి మిగిలింది తను తింటుంది. పనులతో అలసిన శరీరంతో తనింటి పని చేసుకునే సరికి నాలుగౌతుంది. మళ్ళీ సాయంత్రం అంట్లు తోమడానికెళ్ళి ఇంటికొచ్చేసరికి ఏడు. ఇంత ఉడకేసి పిల్లలకు పెట్టి తాను తినేసరికి పదిదాటుతుంది. వళ్ళు హూనమై అలసిన ఆమె శరీరం ఓ కునుకు తీసి లేచేసరికి మళ్ళీ తెల్లారుతుంది.రాత్రి మిగిలిన గుప్పెడన్నాన్ని కంచాల్లో పెట్టి పిల్లలను లేపి తినమని చెప్పి పనికెళ్ళిపోతుంది. లక్ష్మమ్మ ఇద్దరు పిల్లల్లో పెద్దపిల్ల పన్నెండేళ్ళది. సరైన పోషణ లేకపోయినా ఎదిగే వయసు కాబట్టి పిల్ల ఈడేరటానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పిల్లాడు తొమ్మిదేళ్ళవాడు. లక్ష్మమ్మ భర్త యాదగిరి తాపీపని చేసేవాడు. పెళ్ళాం బిడ్డలని చక్కగా చూసుకునేవాడు. నాలుగేళ్ళ క్రితం ఒకరోజు పెద్ద బిల్డింగ్‌పై పనిచేస్తూ పొరపాటున జారిపోయి కిందపడి చనిపోయాడు. అప్పటి వరకూ ఇంట్లో ఉండి గుట్టు చప్పుడు కాకుండా సంసారాన్ని నెట్టుకొచ్చిన లక్ష్మమ్మ ఇల్లు గడవటానికి, పిల్లల్ని పోషించటానికి పాచిపని చేయటం మొదలు పెట్టింది. వీధిబడిలో చదువుకుంటున్న పిల్లలకు పుస్తకాలు కొనడం కష్టమైపోతోంది ఆమెకు. ఆమెకు వచ్చే జీతం ఇంటి కిరాయి, వెచ్చాలు, పొయ్యిలోకి కట్టెలకే సరిపోక అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక పిల్లలకు ఏ జ్వరమో వస్తే మందుమాకో కొనాలంటే అప్పుచేయాల్సిందే. పిల్లలకు గుడ్డముక్క కొనాలన్నా భారమే లక్షమ్మకు. కూడబెట్టి దాచుకుందామనుకున్నా పదో పరకో తప్ప మిగలవు. దసరా సెలవులిచ్చారు పిల్లలకు. పండక్కి పిల్లలకు కొత్త బట్టలు కొనాలని ఆశ లక్ష్మమ్మకు.యజమానురాళ్ళు ఇచ్చిన పాతచీరలే తను కట్టుకుంటుంది. వాళ్ళ పిల్లల పాత బట్టలే లూజైనా బిగుతైనా ఆమె పిల్లలకు. భర్త బతికున్నప్పుడు ప్రతి దసరాకి పిల్లలకి కొత్తబట్టలు, లక్ష్మమ్మకు కొత్తచీర తెచ్చేవాడు. పండుగరోజున గారెలు, పాయసం వండమనేవాడు. లక్ష్మమ్మను, పిల్లలను గుడికి తీసుకెళ్ళి అట్నించటే సినిమాకు తీసుకెళ్ళేవాడు. భర్తతో పాటే అన్ని సంతోషాలు దూరమయ్యాయి లక్ష్మమ్మకు.ఆరోజు ఈదురు గాలితో కూడిన వాన బాగా పడుతోంది. లక్ష్మమ్మ ఆ వానలో పనికి వెళ్ళలేకపోయింది. గుడిసె పై కప్పునుండి రెండుమూడు చోట్ల నుండీ చినుకులు కారుతున్నాయి. కారేచోట సత్తు గిన్నెలు పెట్టి నిండగానే పారబోస్తోంది. పిల్లలిద్దరూ తడవని జాగాలో చాపేసుకు కూర్చున్నారు. రాత్రి ఉన్న బియ్యం కాస్తా వండేసింది. చాలీచాలని అన్నాన్నే తిన్నారు పిల్లలు. లక్ష్మమ్మ మంచినీళ్ళు తాగి పడుకుంది.పొద్దుటి నుండీ టీనీళ్ళు కూడా తాగక కడుపు నకనకలాడుతోంది లక్ష్మమ్మకు. పనికి పోయుంటే ఏ తల్లినన్నా అడిగి డబ్బులు తీసుకుని కాసిని బియ్యం కొనుక్కొచ్చేదే. ఇంట్లో ఉన్న డబ్బాలన్నీ వెతికింది. ఒక డబ్బాలో కాస్త పిండి ఉంది. రెండురోజుల కిందట ఒకమ్మ చాలా రోజులైందని, నిల్వ ఉందని, బావుంటే ఉపయోగించుకోమని లేదంటే పడేయమని ఇచ్చిన పిండి అది. అది తెచ్చి జల్లించి డబ్బాలో పోసింది.ఇంత జావ కాచుకుంటే ఓ పూటైనా గడుస్తుందని. పొయ్యి రాజేసింది. కట్టెపుల్లలు సరిగా మండక వచ్చే పొగతో కళ్ళుమండుతున్నాయి లక్ష్మమ్మకు. పొయ్యి మీద ఓ గిన్నెతో నీళ్ళు పెట్టింది. పిల్లలు ఆకలితో ఆ చాపమీద పడి అలాగే నిద్ర పోతున్నారు. చిరిగిన దుప్పటొకటి కప్పింది. బాగా చలిగాలి కొడుతోంది. వాన తగ్గేట్టు లేదు. ప్చ్. ఎప్పుడు తగ్గుతుందో అనుకుంది. కాసేపటికి నెమ్మదిగా కట్టెలు అంటుకొని నీళ్ళు కాగాయి. మరుగుతున్న నీళ్ళలో పిండివేస్తూ గరిటెతో జారుడుగా తిప్పింది. కాస్తంత ఉప్పు వేసి కలిపి ఒకగ్లాసులో పోసుకొని ఊదుకుంటూ తాగసాగింది. వేడివేడిగా గొంతు జారుతుంటే ప్రాణం లేచొచ్చినట్లయ్యింది లక్ష్మమ్మకు. సరుకులన్నీ నిండుకున్నాయి. ఏ పూటకాపూట గడవటం కష్టంగా ఉంది. పనికిపోతే పచ్చడి మెతుకులన్నా దొరుకుతాయి. ముసురులా పట్టుకున్న వాన తగ్గేట్టు లేదు. ఆలోచిస్తూ తలుపుతీసి చూసింది. వర్షం ఆకాశానికి చిల్లి పడిందా అన్నట్టు విజృంభించి కురుస్తోంది. వీచిన చలిగాలికి కొంగు కప్పుకుంటూ లోపలికొచ్చింది లక్ష్మమ్మ. ఇంతలో పిల్ల లేచింది కడుపు నొప్పంటూ బయటకు వెళ్ళాలని. దుప్పటిని నెత్తినేసుకొని తలుపు తీసుకెళ్ళింది. లక్ష్మమ్మ పిల్లాడిని కూడా లేపి పొయ్యి మీద పిండి జావ పెట్టి కట్టెలను ఊదుతోంది. బయటకెళ్ళిన పిల్ల ఏడుస్తూ వచ్చింది. ఎందుకని అడిగితే లంగాకంటిన నెత్తురు మరకలను చూపించింది. హతాశురాలైపోయింది లక్ష్మమ్మ. ఒక్కక్షణం నోట మాట రాలేదామెకు.విషయం గ్రహించిన ఆమె హృదయం ద్రవించింది. వెంటనే పాత బొంతొకటి పొడిగా ఉన్న చోట పరిచింది. పిల్లకు మరొక లంగా ఇచ్చి కట్టుకోమంది. తన పాత చీరను వోణీలా చింపి పిల్లకు పైటలా వేసింది. అమాయకంగా చూస్తున్న పిల్లకు ధైర్యం చెప్పింది.డబ్బాలో ఉన్న చిన్న బెల్లం ముక్కను తీసి చప్పరించమంటూ పిల్లకిచ్చింది. గ్లాసులో జావ పోసిచ్చి తాగమంది.దేవుడా! ఏమిటీ పరిస్థితి. ఇప్పుడేం చేయాలి. బయట హోరున గాలి వర్షం. ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి. తను పనికెళ్తే యజమానురాళ్ళకు విషయం చెప్పి కొంత పైకం అడగొచ్చు. బియ్యం కొనుక్కోవచ్చు. కొత్తబట్టలు కొనొచ్చు. ఈడేరిన కూతురికి పాయసం చేసి పెట్టాలి. కొబ్బరి, కొత్త బెల్లం, నువ్వులు కలిపి చిమ్మిరుండలు పెట్టాలి. ఉడుకుడుకుగా వేడన్నం పాలు పోసి పెట్టాలి. భర్త బతికుంటే ఎంత సంబరంగా వేడుక జరిపించే వాడో! అసలు దేవుడు తనలాంటి వారినెందుకు ఇన్ని కష్టాలు పెడతాడో. పిల్లల కోసమే బతుకుతూ రెక్కలు ముక్కలు చేసుకుంటోంది తను. పేదవారినసలు పుట్టించకు దేవుడా!వానతగ్గే సూచనలేవీ కనిపించటం లేదు. అంతకంతకు ఎక్కువౌతూ కురుస్తూనే ఉంది. రోడ్లు నిండి చెరువులయ్యాయి. బయటకెళ్ళే మార్గం కనిపించటం లేదు. రోడ్లమీద నీళ్ళన్నీ పల్లంగా ఉన్న లోపల గుడిసెలోపలికి వచ్చేశాయి. కూర్చోటానికి, నించోటానికి కూడా చోటు లేకుండా పోయింది. గుడిసె లోపలున్న పొయ్యిలోని కట్టెలు నీళ్ళలో తడిశాయి. చలి ఎక్కువౌతోంది.క్రమంగా చీకటి ఆవరిస్తోంది. పెద్ద తుఫాను లక్ష్మమ్మ పూరిగుడిసెని నేలమట్టం చేయడానికి వికృతంగా తన బలాన్ని చూపుతోంది.మరింత ఉదృతమయ్యాయి వాన, గాలి. బహుశా తుపాను తీరం దాటుతోందేమో.తిండి తిప్పలు సంగతి దేవుడెరుగు! బతికితే చాలు. ఈరాత్రి గడిస్తే చాలు తెల్లారితే వర్షం తగ్గుతుంది. ఎలాగోలా తను పనికి వెళుతుంది. అమ్మగార్లనడిగి ఏదో ఒకటి కచ్చితంగా తేవొచ్చు. తను ఇంకా ఓ రెండు మూడు ఇళ్ళలో పనికి ఒప్పుకోవాలి. తప్పదు. పిల్ల ఎదిగింది. ఇలా సాగుతున్నాయి లక్ష్మమ్మ ఆలోచనలు.తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది. పిచ్చితల్లి లక్ష్మమ్మ ఆశలను నెరవేర్చనంది వికృతమైన తుపాను. కుప్పగా కూలింది ఒక్కసారిగా గుడిసె. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ జోరు వానలో, హోరు గాలిలో ఆ పిచ్చితల్లి పిల్లల హృదయ విదారకర ఆర్తనాదాలు. గుడిసె పై కప్పు ఆకులన్నీ లేచిపోయాయి. కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది.రెండు పసిప్రాణాలను బలి తీసుకున్న తుపాను లక్ష్మమ్మను మాత్రం జీవచ్ఛవంగా బతకమంటూ వదిలేసింది. తెల్లవారాక కొన ఊపిరితో ఉన్న లక్ష్మమ్మను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా వారం రోజులకు కోలుకుంది. ఆసుపత్రిలో మగతలో నా పిల్లలేరని కలవరిస్తూనే ఉందా పిచ్చితల్లి.‘‘నా పిల్ల ఈడేరింది. ఇంత పాయసం చేయాలి. చిమ్మిరుండలు పెట్టాలి. కొత్త బట్టలు కొనాలి.’’‘‘ఏదీ వాన తగ్గిందా! ఛీ పాడు వర్షం. పనికి పోనీకుండా. రండిరా అన్నం పెడతాను.’’‘‘ఇదిగోండి ఈ మొక్కజొన్న పొత్తు తినండి.’’పిచ్చి దానిలా అంటూ ఉంటుంది. ఒంటరిగా కూర్చుని శూన్యంలోకి చూస్తుంటుంది. ఎవరైనా జాలిపడి ఏదైనా ఇస్తే తింటుంది. ఆడుకోవడానికి వెళ్ళిన తన పిల్లలొస్తారని ఎప్పుడూ ఎదురుచూస్తూ కూర్చుంటుందా పిచ్చితల్లి. హంసగీతి -
కిచెన్‌తో పొత్తు
పొలిటికల్ సీన్ వేడెక్కింది. ఎవరితో ఎవరికి పొత్తుంటుందన్నదే హాట్ డిస్కషన్.స్వీట్ టాక్. మీక్కూడా పొత్తుండాలిగా మరి. ఇదిగోండి కిచెన్‌లోకి మొక్కజొన్న తేండి.దానితో పొత్తు పెట్టుకుంది. చిత్తు చేసే రుచులన్నీ జుర్రుకోండి. స్పైస్డ్ సిమ్మర్డ్ కార్న్ రెసిపీ కావలసినవి: ఉడికించిన మొక్కజొన్న గింజలు – అర కేజీ; పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొత్తిమీర తరుగు – 4 టేబుల్ స్పూన్లు; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పాలు – 125 మి.లీ.; అల్లం – చిన్న ముక్క; చిలికిన పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – గార్నిషింగ్ కోసం తయారీ: ∙మొక్కజొన్న గింజలను ఉడికించిన నీటిని పక్కన ఉంచాలి ∙మిక్సీలో పచ్చి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర, ఉడికించిన నీరు వేసి మెత్తగా చేయాలి ∙బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి ∙మెత్తగా చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము మిశ్రమం జత చేసి కలపాలి ∙ఉడికించిన మొక్కజొన్న గింజలు, పాలు, పెరుగు జత చేసి సుమారు 10 నిమిషాలు ఉడికించి వేడివేడిగా అందించాలి. కార్న్ పాయసం కావలసినవి: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు – 10; కిస్మిస్ – 10; కొబ్బరి తురుము – టేబుల్ స్పూను; మొక్కజొన్న గింజలు – ఒక కప్పు; పాలు – అర లీటరు; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బాదంపప్పుల పొడి – టేబుల్ స్పూను. తయారీ ∙అర కప్పు మొక్క జొన్న గింజలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి కరిగాక, జీడిపప్పులు, కిస్మిస్, పచ్చికొబ్బరి తురుము, అర కప్పు మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి ∙పాలు, మొక్కజొన్న పేస్ట్ జత చేసి మరిగించాలి ∙మిశ్రమం బాగా చిక్కబడుతుండగా పంచదార జత చేసి మరి కొద్ది సేపు మరిగించాలి ∙చివరగా ఏలకుల పొడి వేసి కలిపి దింపేయాలి ∙బాదం పప్పులతో అలంకరించి అందించాలి. మొక్క జొన్న పులావ్ కావలసినవి: బాస్మతి బియ్యం – పావు కేజీ; మొక్కజొన్న గింజలు – ఒకటిన్నర కప్పులు; నూనె – 2 టేబుల్ స్పూన్లు;ఉల్లి తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; ధనియాల పొడి – పావు టీ స్పూను; నీళ్లు – 2 కప్పులు; ఉప్పు – తగినంత.గ్రీన్ చట్నీ పేస్ట్ కోసం.. . కొత్తిమీర – పావు కప్పు; పుదీనా ఆకులు – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 4 (సన్నగా తురమాలి);పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూనునీళ్లు – మిశ్రమాన్ని ముద్దలా చేయడానికి తగినంత;మసాలా కోసం... బిరియానీ ఆకు – 1; ఏలకులు – 2; లవంగాలు – 2; దాల్చిన చెక్క – చిన్న ముక్క; జాపత్రి – కొద్దిగా; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – 4 తయారీ ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో సుమారు అరగంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ∙గ్రీన్ చట్నీ కోసం చెప్పిన పదార్థాలను మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి. పులావ్ తయారీ ∙కుకర్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడయ్యాక, మసాలా దినుసులు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి మెత్తగా చేసిన మసాలా మిశ్రమం జత చేసి, వేయించాలి ∙మొక్క జొన్న గింజలు జత చేసి వేయించాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి వేసి మరోమారు వేయించాలి ∙బియ్యం జత చేసి బాగా కలియబెట్టాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టి మూత పెట్టి, విజిల్ పెట్టాలి ∙మూడు విజిల్స్ రాగానే స్టౌ కట్టేసి దింపేయాలి ∙పులావ్‌ను పెద్ద పాత్రలోకి తీసుకుని, కొత్తిమీరతో అలంకరించి, రైతాతో అందించాలి. హండీ కార్న్ సబ్జీ కావలసినవి :గరం మసాలా కోసం లవంగాలు – 7, మిరియాలు – 8, ఏలకులు – 3, ధనియాలు – ఒక టేబుల్ స్పూను, దాల్చిన చెక్క – చిన్న ముక్క, జీలకర్ర – ఒక టేబుల్ స్పూనుకూరలుక్యాప్సికమ్ – 2కాల్చిన మొక్కజొన్న గింజలు – 2 కప్పులుసబ్జీ కోసంనూనె – 2 టేబుల్‌స్పూన్లు, జీల కర్ర – ఒక టీ స్పూను, మినప్పప్పు – ఒక టీ స్పూను, సెన గ పప్పు – ఒక టీ స్పూను, కరివేపాకు – 5 రెమ్మలు, ఉల్లి తరుగు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 2, అల్లం తురుము – ఒక టీ స్పూను, కొబ్బరి తురుము – అర కప్పు, పసుపు – ఒక టీ స్పూను, మిరప కారం – ఒక టీ స్పూను, ధనియాల పొడి – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంతచింతపండు పులుసు – 3 టీ స్పూన్లుబెల్లం తురుము – ఒక టీ స్పూనుకొత్తిమీర – కొద్దిగాగరం మసాలా – ఒక టీ స్పూనునిమ్మరసం – కొద్దిగా గరం మసాలా తయారీ ∙బాణలిలో గరం మసాలా కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. సబ్జీ తయారీ:∙బాణలిలో నూనె కాగాక జీలకర్ర, మినప్పప్పు, సెనగ పప్పు వేసి వేయించాలి ∙కరివేపాకు, పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ∙ఉలి తరుగు, అల్లం, వెల్లుల్లి జత చేసి వేయించాలి ∙ఉల్లి పాయలు బంగారు రంగులోకి వచ్చాక, కొబ్బరి తురుము వేసి వేయించాలి ∙పసుపు, మిరప కారం, ధనియాల పొడి, అర టీ స్పూను గరం మసాలా, ఉప్పు, కొద్దిగా నీళ్లు జత చేసి కలియబెట్టాలి ∙చింతపండు రసం, బెల్లం తురుము జత చేసి మరోమారు కలిపి, మొక్కజొన్న గింజలు, గ్రిల్ చేసి క్యాప్సికమ్ తరుగు వేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు జత చేసి, మూత పెట్టి, నీళ్లు ఇగిరిపోయేవరకు ఉడికించాలి ∙ఉడికిన తరవాత దింపి, కొత్తిమీర తరుగుతో అలంకరించి, తయారుచేసి ఉంచుకున్న గరం మసాలా ఒక టీ స్పూను, కొద్దిగా నిమ్మరసం జత చేసి కలిపి అందించాలి. మొక్క జొన్న సమోసా కావలసినవి:మొక్క జొన్న గింజలు – అర కప్పుఉల్లికాడల తరుగు – పావు కప్పుఉల్లి తరుగు – అర కప్పుమిరప కారం – అర టీ స్పూనుఉప్పు – తగినంతమైదా పిండి – ముప్పావు కప్పునూనె – ఒక టీ స్పూను + ఒక టీ స్పూను + డీప్ ఫ్రైకి సరిపడానీళ్లు – తగినంత తయారీ ∙బాణలిలో టీ స్పూను నూనె కాగాక, ఉల్లి తరుగు జత చేసి వేయించాలి ∙మొక్క జొన్న గింజలు జత చేసి కొద్దిసేపు వేయించాలి ∙ఉల్లి కాడల తరుగు వేసి బాగా కలిపాక, ఉప్పు, మిరపకారం వేసి కలిపి దింపి చల్లారబెట్టాలి ∙ఒక పాత్రలో మైదాపిండి, టేబుల్ స్పూను వేడి నూనె, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలిపి, ఉండలు చేసి చపాతీలా కలపాలి ∙మధ్యకు కట్ చేసి ఒక్కో భాగాన్ని సమోసాలాగ చుట్టాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం టీస్పూన మిశ్రమాన్ని సమోసాలు ఉంచి అంచులు తడి చేసి మూసేయాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙బాణలిలో నూనె కాగాక సమోసాలు అందులో వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్‌తో అందించాలి. గుమ్మడికాయ బెల్లం రోటి పచ్చడి కావలసినవి:గుమ్మడికాయ – పావు కేజీచింతపండు – నిమ్మకాయంతపసుపు – చిటికెడుబెల్లం – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతపేస్టు కోసంపచ్చి కొబ్బరి తురుము – అర కప్పుపచ్చి మిర్చి – 2పోపు కోసం నూనె – 1 టీ స్పూనుఆవాలు – అర టీ స్పూనుమెంతులు – పావు టీ స్పూనుఎండు మిర్చి – 1 కరివేపాకు – 4 రెబ్బలు తయారీ ∙చింతపండు గుజ్జు తీయాలి ∙గుమ్మడికాయను తొక్క తీసి అర అంగుళం ముక్కలుగా తరగాలి ∙అర కప్పు నీటిలో చింతపండు గుజ్జు, గుమ్మడి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి ∙కొబ్బరి తురుము, పచ్చి మిర్చి మెత్తగా నూరి, గుమ్మడి ముక్కల్లో వేయాలి ∙బెల్లం పొడి కలిపి దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి కరివేపాకు వేసి వేయించి, పచ్చడికి జత చేయాలి ∙ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. రోటి పచ్చడి పొటాటో – కార్న్ సూప్ కావలసినవి :బంగాళ దుంపలు – 6 (తొక్క తీసి ముక్కలు చేయాలి)కొత్తిమీర ఆకులు – ఒక కప్పుఉల్లి తరుగు – పావు కప్పుమొక్క జొన్న గింజలు – రెండు కప్పులుఉల్లి కాడల తరుగు – పావు కప్పుఉప్పు – తగినంత తయారీ ∙ఒకపెద్ద పాత్రలో బంగాళ దుంప ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు, తగినన్ని నీళ్లు జత చేసి మూత పెట్టి ఉడికించాలి. ∙మొక్కజొన్న గింజలు జత చేసి పదార్థాలన్నీ మెత్తగా అయ్యేవరకు సుమారు పది నిమిషాలు ఉడికించాలి. ∙ఉల్లికాడలు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేసి, వడగట్టి అందించాలి. మొక్కజొన్న భారతదేశపు ప్రాచీన ఇతిహాసంలో ప్రస్తావించబడిన ఆహార ధాన్యాలైన వరి, గోధుమ, బార్లీ (యవలు) వంటి వర్ణనలలో ‘మొక్కజొన్న పొత్తు’ ప్రస్తావన కానరాదు. ఇది సుమారు 16, 17వ శతాబ్ద కాలంలో విదేశాల నుంచి వలసవచ్చిన ఆహార ధాన్యం మాత్రమే. దీనినే మెయిజ్ () లేదా కార్న్ () అని ఆంగ్లంలో అంటారు. ఇటీవల స్వీట్ (షుగర్) కార్న్ కూడా మనకు విరివిగా లభ్యమౌతోంది. సాధారణ మొక్కజొన్న పొత్తు (కండె) కన్నా ఎక్కువ తీయదనం కల్గి రసప్రధానంగా ఉంటుంది కనుక దీనిని స్వీట్‌కార్న్ అంటారు. పోషక విలువలు: ఆధునిక జీవ రసాయన పరిభాషలో చెప్పాలంటే దీనిలో పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా లభిస్తుంది. ఎ, బి, సి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. యాంటి ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. శర్కర, పిండి పదార్థాలు ఎక్కువగా కలిగివుండడం వల్ల మధుమేహ రోగులు వీటిని అధిక ప్రమాణంలో కాకుండా తక్కువగా తినవలసి ఉంటుంది. ఖనిజ లవణాలైన ఫాస్ఫరస్, మేంగనీస్, మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్ తగురీతిలో లభిస్తాయి. పొటాషియం, కాల్షియం బాగా తక్కువగా ఉంటాయి. స్టార్చ్ కూడా అధికంగా ఉంటుంది. నీరు శాతం కూడా అధికమే. ఆరోగ్య ప్రయోజనాలు: తగు ప్రమాణంలో కొంతకాలం తింటే నీరసం తగ్గి, బరువు పెరుగుతారు. కంటిచూపుకి చాలా ఉపయోగకరం. కడుపులోని వాయువులను తొలగించి సుఖవిరేచనం చేస్తుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. ఎలా తినాలి: పొత్తుని పైరేకలు తొలగించి నిప్పుమీద కాల్చి, కొంచెం చల్లారిన తర్వాత నమిలితింటే ఆరోగ్యానికి చాలా మంచిది.ఎండలో ఎండబెట్టి పొడిబారిన తర్వాత ‘పిండి’గా మలచుకొని రొట్టెలు తయారుచేసుకొని తినే అలవాటు ఉత్తర భారతదేశంలో ఉంది. ఆ పిండిని వంటలలో కూడా వాడుతుంటారు.ఆకర్షణీయమైన ‘పాప్‌కార్న్’లోని లోపాలు:వాస్తవానికి వరిధాన్యం నుండి ఒక పద్ధతి ప్రకారం పేలాలను తయారుచేస్తారు. వేడిచేసినప్పుడు ధాన్యం పగిలి, పేలటం ద్వారా వచ్చే పదార్థం కనుక ‘పేలాలు’ అన్నారు. ‘పాప్’కి కూడా వికసించి బయటకు వస్తుంది అని అర్థం. ఎక్కువ కేలరీలు గల నూనెలను వాడి ఈ పాప్‌కార్న్ తయారుచేస్తారు. ఉప్పు, ఇతర మసాలాలను అధికంగా కలిపి రుచిని పెంచుతారు. ఇక సరే, శీతల పానీయాలను తాగుతూ ఇవి తినడం ఒక రివాజు. ఇవన్నీ శరీరానికి హానికరమని మరిచిపోకూడదు. ఇలా తినడం వల్ల వాటి ప్రయోజనాలకన్నా అనర్థాలే అధికమని గమనించుకోవాలి.నీటి ఆవిరితో ఉడికించి తిన్నా మంచిదే.నానబెట్టడం, మొలకలు తయారుచేయడం, పులియబెట్టడం వంటి ప్రక్రియలను అరుదుగా పాటిస్తారు. వీటివల్ల దీనిలో ఉండే ‘ఫైటేట్సు’ యొక్క దుర్గుణాలు తగ్గిపోతాయి. వీటి నుంచి ఆయిల్స్, సిరప్స్ కూడా చేస్తారు. వాటికి దూరంగా ఉంటేనే మేలు. ఆయుర్వేదం: ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో దీని ప్రస్తావనే లేదు కానీ, ఇటీవల 16, 17 శతాబ్దపు ఆయుర్వేద వైద్యుడైన యోగరత్నాకరుడు దీనిని ‘యుగంధరః’ అని ప్రస్తావించి శరీరానికి చాలా మేలు చేస్తుందని, మంచి పథ్యపు ఆహారంగా పనికొస్తుందని, తీపి కల్గి ధాతు పుష్ఠికరమని, త్రిదోష (వాత, పిత, కఫ)హరని, వక్కాణించాడు.‘‘యుగంధరః త్రిదోషఘ్నః స్వాదుః పథ్యో రసాయనః’’అని యోగరత్నాకర గ్రంథంలో ఉంది. ఔషధ గుణాలు: దీనిపై గల రేకలలో మీసాల వంటి సన్నని మృదువైన ‘కేసరాలు’ ఉంటాయి. దీని కషాయం తాగితే ‘ప్రొస్టేటు’ గ్రంథి యొక్క వాపు తగ్గుతుందని ఇటీవలికాలంలో చేసిన పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే కిడ్నీలోనూ, గాల్ బ్లాడరు (పిత్తాశయం)లోనూ గల రాళ్లు కరిగి బయటకు వచ్చేస్తాయి. దీనిలో ఉంటే క్షారగుణం (ఆల్కలైన్ గుణం) ఈవిధంగా ఉపకరిస్తుందని అన్వయించారు. గుర్తుంచుకోవలసిన సారాంశం:‘బక్కచిక్కినోడ మొక్కజొన్న తినుముధాతు పుష్టి కలిగి తనువు మెరయుపాపుకార్ను మనకు వలదంచు గుర్తించిపొత్తు కాల్చి తినుగ పుష్టి కలుగు’ వంటింటి చిట్కాలు బియ్యం, తృణధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేకలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి. పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా మారితే, దాని మీద సబ్బు నీళ్లు పోసి సన్నటి సెగ మీద ఉంచి, చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది. రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్తవాటిలా మెరిసిపోతాయి. పచ్చి బఠాణీలు ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి. చపాతీలు ఒత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనె వేసి మడతలుగా చేసి కాల్చి, హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడు గంటలపాటు మెత్తగా ఉంటాయి. చపాతీ పిండిలో ఉడికిన బంగాళదుంపను వేసి బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు ఎక్కువసేపు మృదువుగా ఉంటాయి. పరగడుపున ఉసిరికాయ, భోజనం చేశాక అరటిపండు, సాయంత్రం వెలగపండు తింటే అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. పెరుగు పచ్చడి మరింత రుచిగా రావాలంటే, పోపులో టీ స్పూను నెయ్యి కలిపితే సరి. గులాబ్‌జామ్ తయారుచేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పనీర్ జత చేస్తే, మృదువుగా రుచిగా ఉంటాయి. దోసెల పిండి బాగా పులిస్తే, అందులో రెండు టీ స్పూన్ల గోధుమపిండిని కలిపితే రుచిగా వస్తాయి. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. -
టేస్టీ కార్న్ర్
రండి.. రండి.. రండి‘పిండి’ వంటలు చేయండి టేస్టీ కార్న్ వంటకాలు తినగ రండి. కార్న్‌ఫ్లోర్ హల్వా కావలసినవి: కార్న్ ఫ్లోర్ – కప్పు; పాలు – 3 కప్పులు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – 3 కప్పులు; నిమ్మరసం – టేబుల్ స్పూను; ఫుడ్ కలర్ – చిటికెడు (నారింజ రంగు); నెయ్యి – ముప్పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; తరిగిన డ్రై ఫ్రూట్స్ – తగినన్ని తయారి: ఒక పెద్ద పాత్రలో కార్న్ ఫ్లోర్, మూడు కప్పుల పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి ∙బాణలిలో రెండు కప్పుల నీళ్లు, పంచదార వేసి స్టౌ మీద ఉంచి పంచదార కరిగేవరకు కలపాలి ∙నిమ్మరసం జత చేసి పాకం బాగా ఉడుకుపట్టే వరకు కలపాలి ∙పాకం బాగా ఉడుకుతుండగా, కార్న్‌ఫ్లోర్ మిశ్రమం పోస్తూ కలపాలి ∙ఫుడ్ కలర్ జత చేసి మిశ్రమం గట్టిపడే వరకు బాగా కలపాలి ∙కొద్ది కొద్దిగా నెయ్యి జత చేయాలి ∙ఉడుకు పట్టిన తరవాత దింపేయాలి ∙డ్రైఫ్రూట్స్ తరుగు, ఏలకుల పొడి వేసి కలపాలి ∙ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి, హల్వా మిశ్రమాన్ని సమానంగా పరవాలి ∙కొద్దిగా గట్టి పడిన తరవాత చాకుతో ముక్కలుగా కట్ చేసి అందించాలి. కార్న్ ఫ్లోర్ పాటీస్ కావలసినవి: కార్న్ ఫ్లోర్ – 2 కప్పులు; మైదా పిండి – 4 టేబుల్ స్పూన్లు; బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను; ఉప్పు – టీ స్పూను; గోరు వెచ్చని నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, చీజ్ తురుము – 2 టేబుల్ స్పూన్లు; అవొకాడో – 1 (తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలు చేయాలి) తయారి: ఒక పాత్రలో కార్న్‌ఫ్లోర్, మైదాపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి ∙గోరు వెచ్చని నీరు జత చేసి చపాతీ పిండిలా కలిపి, ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి, గంటసేపు పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక కలిపి ఉంచుకున్న పిండిని వడల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి ∙చీజ్ తురుము, అవొకాడో ముక్కలను తయారుచేసి ఉంచుకున్న పాటీలపై వేసి వెంటనే అందించాలి. కార్న్ ఫ్లోర్ చికెన్ కబాబ్ కావలసినవి: చికెన్ (పెద్ద ముక్కలు) – అర కేజీ; మిరప కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; వెనిగర్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; సోయా సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – టేబుల్ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – టేబుల్ స్పూను; కార్న్ ఫ్లోర్ – టేబుల్ స్పూను; పెరుగు – టేబుల్ స్పూను. తయారి: చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీరు ఒంపేయాలి ∙ఒక పాత్రలో చికెన్ ముక్కలు వేసి, మిగతా పదార్థాలన్నీ జత చేసి బాగా కలిపి మూడు నాలుగు గంటలు పక్కన ఉంచిన తరువాత, ఒక్కో ముక్కను గ్రిల్ మీద కాని అవెన్‌లో కాని వేయించి తీసేయాలి ∙వేడివేడిగా అందించాలి. కార్న్ ఫ్లోర్ స్పినాచ్ ఆనియన్ పకోరా కావలసినవి: కార్న్ ఫ్లోర్ – ఒకటిన్నర కప్పులు; సెనగ పిండి – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – 2 కప్పులు; పుదీనా తరుగు – 2 కప్పులు; అల్లం వెల్లుల్లి ముద్ద – టేబుల్ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ – టేబుల్ స్పూను; మిరప కారం – టీ స్పూను; పసుపు – టీ స్పూను; బేకింగ్ సోడా – చిటికెడు; ఉప్పు – తగినంత; కసూరీ మే«థీ – అర టేబుల్ స్పూను; నూనె – అర టేబుల్ స్పూను; కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారి: ఒక పాత్రలో నూనె తప్పించి, మిగతా పదార్థాలన్నీ వేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙బాణలిలో నూనె కాగాక కలిపి ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసి వేయించి పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్‌తో వేడివేyì పకోడీలు అందించాలి. కార్న్ ఫ్లోర్ టోర్టిల్లా కావలసినవి: కార్న్ ఫ్లోర్ – ఒకటిన్నర కప్పులు; గోధుమ పిండి – కప్పు; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు; గోరు వెచ్చని నీళ్లు – ముప్పావు కప్పు; ప్లాస్టిక్ పేపర్లు – 2 తయారి: ఒక పాత్రలో కార్న్‌ఫ్లోర్, గోధుమపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు, నూనె జత చేసి మరోమారు కలపాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, చపాతీపిండి మాదిరిగా కలపాలి. (చేతికి అంటుతున్నట్లుగా ఉంటే, మరికాస్త పిండి జత చేసి కలుపుకోవచ్చు) ∙కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙ఒక్కో ఉండను ప్లాస్టిక్ పేపర్ మీద ఉంచి, పైన మరో ప్లాస్టిక్ పేపర్ ఉంచి, చపాతీ కర్రతో ఒత్తాలి ∙స్టౌ మీద పెనం బాగా వేడయ్యాక, ఒత్తి ఉంచుకున్న చపాతీని ప్లాస్టిక్ పేపర్ నుంచి వేరు చేసి పెనం మీద వేసి, రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చాలి. -
మొక్కవోయి జొన్న
మొక్కజొన్న... కాల్చుకు తిన్నా కాదనదు. వేపుకు తిన్నా వద్దనదు. వండుకు తిన్నా ఒదిగిపోతుంది. పెనం మీద అట్టవుతుంది. నూనెలో గారెవుతుంది. అందుకే... తినే ముందుగా...మొక్కజొన్నకు ఓ మొక్కు మొక్కుదాం. క్రిస్పీ కార్న్ కావలసినవి : మొక్కజొన్న గింజలు – ఒకటిన్నర కప్పు; కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదా – 2 టేబుల్ స్పూన్స్; వరిపిండి – 2 టేబుల్ స్పూన్స్; ఉప్పు – రుచికి సరిపడ; నల్లమిరియాల పొడి – 1 టీ స్పూన్, ఉల్లిపాయలు – పావు కప్పు; తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్; నూనె – వేయించడానికి సరిపడ. తయారీ ♦ ఒక గిన్నెలోకి మొక్కజొన్న గింజలు, కార్న్‌ఫ్లోర్, మైదా, వరిపిండి, ఉప్పు, మిరియాల పొడి, 1 స్పూన్ నీళ్లు పోసి బాగా కలపాలి. ♦ స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి బాగా కాగిన తర్వాత, స్టౌ సిమ్‌లో పెట్టి, ముందుగా కలిపి పెట్టిన మొన్న జొన్న మిశ్రమాన్ని వేసి బాణలిపై మూతపెట్టాలి. ♦ 15 సెకన్లు ఆగి మూత తీసి వేగిన కార్న్‌ను నూనె లేకుండా లేకుండా తీసుకోవాలి. ♦ వేడిగా ఉండగానే కొత్తిమీరతో అలంకరించి వెంటనే సర్వ్ చేయాలి (లేదంటే కార్న్ మెత్తబడతాయి). గ్రిల్డ్ కార్న్ కావలసినవి: తాజా మొక్కజొన్న కండెలు – 4; వెన్న – 4 టేబుల్ స్పూన్స్; మిరియాల పొడి – 1 టీ స్పూన్, చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, నిమ్మకాయలు – 2, చీజ్ – సరిపడ. తయారీ: ♦ ముందుగా మొక్క జొన్న కండెలను తీసుకుని 3 లేదా 4 పొరలు ఉంచి మిగిలినవి తీసివేసి 15 నిమిషాలు చల్లటి నీటిలో నానబెట్టాలి ∙ఒక గిన్నెలో వెన్న, మిరియాల పొడి, చిల్లీ సాస్ వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి ♦ మొక్కజొన్న పొరలను వెనక్కి మడిచి, గ్రిల్‌ను బాగా వేడయ్యాక అన్ని వైపులా బాగా కాలేలా చూసుకోవాలి (గ్రిల్ లేకపోతే స్టౌ వెలిగించి మీడియమ్ మంటపై అన్నివైపులా కాల్చుకోవచ్చు) ♦ కాలిన మొక్కజొన్న కండెలకు ముందుగా తయారు చేసుకున్న వెన్న మిశ్రమాన్ని బ్రష్‌తో అన్నివైపులా రాసి మళ్లీ 2 నిమిషాలు గ్రిల్‌పై కాల్చుకోవాలి ♦ గ్రిల్ చేసిన మొక్కజొన్న కండెలను ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం వెన్న రాసి, తరిగిన కొత్తిమీర, తురిమిన చీజ్ చల్లి, నిమ్మ చెక్కలతో సర్వ్ చేయాలి ♦ (మొక్కజొన్న కండెలను 2 అంగుళాల సైజులో కట్ చేసుకుని టూత్ పిక్‌తో గుచ్చి సర్వ్ చేయొచ్చు). మొక్కజొన్న అట్లు కావలసినవి: మొక్కజొన్న గింజలు – 1 కప్పు, నానపెట్టిన పెసరపప్పు – పావు కప్పు; వరిపిండి – పావు కప్పు; బొంబాయిరవ్వ – అరకప్పు; ఇంగువ – చిటికెడు; అల్లం – అర అంగుళం ముక్క, కరివేపాకు – 1 రెమ్మ; ఉప్పు – రుచికి సరిపడ; తరిగిన ఉల్లిపాయముక్కలు – పావు కప్పు, కొత్తిమీర తరుగు – కొంచెం; నూనె – సరిపడ. తయారీ: ♦ మొక్కజొన్న గింజలు, నానబెట్టిన పెసరపప్పు, అల్లం, కరివేపాకు, ఉప్పు, కొంచెం నీళ్లు పోసి మిక్సీజార్‌లో వేసి మెత్తని పిండిలా పట్టుకోవాలి ♦ ఒక గిన్నెలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని తీసుకుని, బొంబాయి రవ్వ, వరిపిండి, ఇంగువ వేసి బాగా కలిపి గంట సేపు నాననివ్వాలి ∙స్టౌ పైన పెనం పెట్టి ఈ పిండిని దోశెలాగ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి, చుట్టూ నూనె వేసి బాగా కాలనివ్వాలి ♦ రుచికరమైన మొక్కజొన్న దోశె రెడీ. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారప్పొడి దేనితో తిన్నా బాగుంటుంది. మొక్కజొన్న మష్రూమ్ కర్రీ కావలసినవి: మొక్కజొన్న గింజలు – కప్పు; సన్నగా తరిగిన మష్రూమ్స్ – కప్పు; తరిగిన ఉల్లిపాయలు – 2 కప్పులు, తరిగిన టమోట – 2 కప్పులు; తరిగిన కాప్సికమ్ – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు, నూనె– 5 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడ; కారం – 2 టీ స్పూన్స్; పసుపు – అర స్పూన్; జీలకర్ర – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్, లవంగాలు – 3; దాల్చిన చెక్క – చిన్న ముక్క; యాలక్కాయ– 1; ధనియాల పొడి – టీ స్పూన్; గరం మసాలా – 2 టీ స్పూన్స్. తయారీ: ♦ బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ వేయించుకోవాలి ∙అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, ఉల్లిపాయ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, ధనియాల పొడి వేసి మరికాసేపు వేయించుకోవాలి ♦ టమోటా వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత కాప్సికమ్ వేసి మరో 2 నిమిషాలు వేగనివ్వాలి ♦ ఇప్పుడు మొక్కజొన్న గింజలు, మష్రూమ్స్ వేసి 2 నిమిషాలు వేయించాక కప్పు నీళ్ళు పోసి మూతపెట్టి మీడియమ్ మంటపైన ఉడికనివ్వాలి ∙చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా వడ్డించాలి ♦ అన్నంలోకి, చపాతీకి కూడా బాగుంటుంది. మొక్కజొన్న పాకం గారెలు కావలసినవి: మొక్కజొన్న గింజలు – 2 కప్పులు; వరిపిండి – 1 కప్పు; బొంబాయి రవ్వ – అర కప్పు; తరిగిన బెల్లం – 1 కప్పు, యాలకులు – 3; వంట సోడా – చిటికెడు; నూనె – వేయించడానికి సరిపడ తయారీ: ♦ మొక్కజొన్న గింజలను జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ♦ ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకుని వరిపిండి, బొంబాయిరవ్వ, వంట సోడా వేసి బాగా కలిపి 15 నిమిషాలు నాననివ్వాలి ∙స్టౌ పైన మందపాటి గిన్నెలో తరిగిన బెల్లం, కొంచె నీళ్లు పోసి పాకం వచ్చేవరకు తిప్పుతూ ఉండాలి. చివరగా యాలకుల పొడి వేసి మూతపెట్టుకోవాలి ♦ బాణలిలో నూనెపోసి కాగనివ్వాలి ♦ అరచేతిలో నూనె రాసుకుని నిమ్మకాయ సైజులో జొన్నపిండి ముద్దను తీసుకుని గారెలుగా వత్తుకుని, మధ్యలో చిల్లుపెట్టి కాగిన నూనెలో వేసి బంగారం రంగు వచ్చేలా రెండువైపులా వేయించుకోవాలి వేయించుకున్న గారెలుగా వెంటనే బెల్లం పాకంలో వేసి 5 నిమిషాల సేపు నానిన తర్వాత సర్వ్ చేయాలి. -
మర్కటమూక మళ్లేదెట్టా?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్ల మీదికి వచ్చినయి. మొక్కలు నాటి అడవులను పెంచితే కోతులు ఊళ్ల నుంచి అడవులకు పోతయ్. వానలు కూడా వాపస్ వస్తయ్’ – మూడేళ్ల కిందట హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన మాటలివీ! అప్పట్నుంచి ప్రతి ఏటా హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నా పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. కోతులు, అడవి జంతువులు ఎప్పట్లాగే ఊళ్లపైకి దండెత్తి పంటలన్నీ నాశనం చేస్తున్నాయి. కోతులకు ఆహారంగా ఉపయోగపడే పండ్ల చెట్లను అడవుల్లో పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. హరితహారం కింద కేవలం అడవుల్లోనే 100 కోట్ల మొక్కలను పెంచాలన్న ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో కోతులు అడవి బాట పట్టిన దాఖలాలు రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు. ఒక్క కోతులే కాదు.. అడవి పందులు, నెమళ్లు, జింకలు, దుప్పులు కూడా ఆహారం కోసం ఊళ్లలోకి వస్తున్నాయి. ఎకరాల కొద్దీ వరి, మొక్కజొన్న, పత్తి, సోయా వంటి పంటలతోపాటు పండ్ల తోటలను నాశనం చేస్తున్నాయి. నామమాత్రంగా పరిహారం.. అడవి పందుల కారణంగా వరికి నష్టం జరిగితే ఎకరాకు రూ.6వేలు, మొక్కజొన్నకు రూ.4వేలు పరిహారం ఇస్తున్నారు. మిగతా పంటలకు ఆ పంటను బట్టి పరిహారాన్ని నిర్ణయిస్తారు. ఈ పరిహారం పొందాలన్నా సవాలక్ష నిబంధనలు ఉండడంతో అనేక ప్రాంతాల్లో రైతులు దరఖాస్తు చేసుకోవడం లేదు. కోతులు, చిలుకలు, నెమళ్లు కూడా పంటలకు నష్టం చేస్తున్నా పరిహారం పొందే పరిస్థితి లేదు. ఏటా వేల ఎకరాల్లో నష్టం.. రాష్ట్రంలో అడవి అంటే గుర్తుకొచ్చేది మొదట ఆదిలాబాదే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ అభయారణ్యంతోపాటు 44 శాతం అటవీ ప్రాంతం ఉంది. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం తర్వాత అత్యధిక అటవీప్రాంతం ఉన్న జిల్లా ఇదే. కానీ అడవుల్లో ఉండాల్సిన జంతుజాలం ఊళ్లపైకి దండెత్తుతోంది. అడవి పందులు, కోతులు, దుప్పులు, నెమళ్ల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఏటా వేల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న జన్నారం, దండేపల్లి, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు, ఇచ్చోడ, కడెం, చించోలి, కెరమెరి తదితర మండలాల పరిధిలో ఈ నష్టం ఎక్కువగా ఉంది. అనధికారిక లెక్కల ప్రకారం గత మూడేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఏటా 7 వేల ఎకరాల పంట అటవీ జంతువుల పాలైనట్లు తెలుస్తోంది. జంతువుల దాడితో పంట కోల్పోయినందుకు ఒక్క లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలోనే 2016–17లో రైతులు రూ.13 లక్షలు నష్టపరిహారం పొందారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అడవి పందులు, కోతుల కారణంగా ఒక్కో జిల్లాలో ఏటా కనీసం 2 వేల ఎకరాల వరకు పంట నష్టపోతున్నట్లు అంచనా. 48 శాతం అటవీ ప్రాంతం ఉన్న ఖమ్మం జిల్లాలో మాత్రం అటవీ జంతువుల బెడద పెద్దగా లేదు. అడవి పందులొస్తే సర్వనాశనమే ఇరవై వరకు గుంపుగా వచ్చే అడవి పందులు చేనులోనో, పొలంలోనో పడితే అది సర్వనాశనం అయ్యేదాకా వదలవు. అర్ధరాత్రి దాడికి దిగి మొదళ్లతో సహా పెకిలించి వేసి పంటను నాశనం చేస్తాయి. కాపలా ఉన్న రైతుపై దాడికి సైతం వెనుకాడవు. గతంలో పందులను భయపెట్టేందుకు బాణసంచా పేల్చడం, డప్పులతో చప్పుళ్లు చేయడం వంటి ట్రిక్స్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు వాటికి బెదరడం లేదు. ఇక కోతులు ఉదయం, పగటి పూట మొక్కజొన్న, పండ్లు, కూరగాయల తోటలను సర్వనాశనం చేస్తున్నాయి. రామచిలుకలు, నెమళ్ల వల్ల కూడా బాసర, ఆసిఫాబాద్‌లోని మొవాద్, నిర్మల్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో పంటలకు నష్టం జరుగుతోంది. అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు పొలాల చుట్టూ విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇది పలుచోట్ల రైతుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే జంతువులు ఆ దరిదాపులకు రావు. కానీ ఈ విషయమై అటవీశాఖ గానీ, రెవెన్యూ సిబ్బంది గానీ దృష్టి పెట్టడం లేదు. -
రెక్కల కష్టం నీటిపాలు..
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో విక్రయించేందుకు తీసు కొచ్చిన 5 వేల బస్తాల మొక్క జొన్నలు బుధవారం వర్షపునీటిలో కొట్టుకు పోయాయి. వనపర్తి మార్కెట్‌కు కొద్దిరోజులుగా మొక్కజొన్న విక్రయానికి వస్తోంది. ఈ సీజన్లో బుధవారం అత్య ధికంగా విక్రయానికి వచ్చింది. ఉదయం ఎండగా ఉండడంతో రైతులు మొక్క జొన్నను ఆరబెట్టారు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు కలసి కొనుగోలు చేసేందుకు టెండర్లు దాఖలు చేసే సమయంలో భారీ వర్షం కురిసింది. రైతులు తేరుకునే సమయానికే మొక్కజొన్న కళ్లముందే వర్షపునీటిలో కొట్టుకుపోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. -
మొక్కజొన్న కండె హెల్దీ టైమ్‌పాస్
గుడ్ ఫుడ్ సరదాగా బయటకు వెళ్లినప్పుడో లేదా ఎక్కడైనా టైమ్‌పాస్ కోసం ఏదైనా నమలాలనుకున్నప్పుడు మొక్కజొన్న కండెలు తినడం చాలామంది చేసే పనే. అయితే దాన్ని ఏదో టైంపాస్ కోసం అన్నట్లుగా తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మొక్కజొన్న కండెలతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే అలా అలా సరదాగా సమయం గడపుతూ, టైంపాస్ చేస్తున్న సమయంలోనే ఆరోగ్యాన్ని అవెలా సమకూరుస్తుంటాయో తెలుసుకుందాం. ∙ మొక్కజొన్నలో డయటరీ ఫైబర్ (పీచు పదార్థాలు) చాలా ఎక్కువ. వాటిలోని సాల్యుబుల్ ఫైబర్ మలం మృదువుగా వచ్చేలా చేస్తుంది. అందుకే అవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మలబద్దకాన్ని నివారిస్తాయి. ∙ ఒక కప్పు మొక్కజొన్న గింజల్లో 18.4 శాతం డయటరీ ఫైబర్ ఉండటం వల్ల మొలలు (పైల్స్) సమస్యను నివారిస్తాయి. పెద్ద పేగు క్యాన్సర్‌కూ నివారణగా పనిచేస్తాయి. అంతేకాదు నీళ్ల విరేచనాలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ∙ ఐరన్ లోపాలను అధిగమించేలా చేసి రక్తహీనతను తగ్గిస్తాయి. కొత్త రక్తకణాలు పుట్టేందుకు మొక్కజొన్న బాగా దోహదపడుతుంది. ∙ మొక్కజొన్నలో ఖనిజలవణాలైన ఫాస్ఫరస్, మెగ్నీషయమ్, మ్యాంగనీస్, ఐరన్, కాపర్ పాళ్లు చాలా ఎక్కువ. అంతేకాదు... అరుదైన సెలీనియమ్ పాళ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫాస్ఫరస్ ఎదుగుదలకూ, ఎముకల ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది. మెగ్నీషియమ్ మంచి గుండె ఆరోగ్యంతో, ఎముకలకు బలాన్నిస్తుంది. . దీని పసుపుపచ్చ రంగు కెరటనాయిడ్స్ పుష్కలంగా ఉండటానికి సూచన. ఇందులో విటమిన్–ఏ ను సమకూర్చేందుకు అవసరమైన బీటా–కెరటిన్ ఉంటుంది. అందుకే మొక్కజొన్న చూపును మెరుగుపరచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటిజబ్బులను నివారిస్తుంది. ∙మొక్కజొన్నలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ–ర్యాడికల్స్‌ను నిర్వీర్యం చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందున అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. -
ఉత్తరకొరియా సైనికులు.. దొంగలు..
సాక్షి, ప్యాంగ్యాంగ్: ఆనాటి నియంతల కాలం ఎలా సాగిందో.. నేడు ఎలా సాగుతోందో తెలుసుకోవడానికి పచ్చి ఉదాహరణ ఈ ఉదంతం. ఉత్తరకొరియా ఆర్మీ సైనికులు దొంగలుగా మారారు. ఉద్యోగాలు మాని వారు దొంగలుగా మారలేదు. వారిని దొంగలుగా మార్చింది ఆకలి. సైన్యం అంతటికి అవసరమైన ఆహారం ఎలా తేవాలో తెలియని అధికారులు నిస్సహాయత కింది స్థాయి సైనికులకు దొంగలుగా మారాలనే సలహా ఇప్పించింది. 1990 దశాబ్దంలో ఉత్తరకొరియా తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుంది. అది మొదలు నేటి వరకూ దేశంలోని ఏ ప్రాంతంలో పేదవాడు మూడు పూట్ల భోజనం చేసిన దాఖలాలు లేవు. ఉత్తరకొరియాలోని ఉత్తర ప్రాంతంలో ప్రతి ఏటా సెప్టెంబర్ ప్రారంభం నుంచి మొక్కజొన్న పంటను రైతులు అత్యధికంగా పండిస్తారు. దీంతో ఆ పంటను దోచుకునేందుకు కింది స్థాయి సైనికులను అధికారులు ప్రోత్సహిస్తారు. ఒకవేళ దొంగతనం చేయడానికి సైనికులు వెనుకాడితే.. యుద్ధం వస్తే ఆకలితో అలమటించిపోతారని హెచ్చరిస్తారు. దీంతో చేసేదేం లేక సైనికులు రైతులు పండించే పంట పొలాలపై పడి మొత్తాన్ని దోచుకుని వస్తారు. దళారులతో మాట్లాడి దొంగిలించిన పంటలో కొంత భాగాన్ని తక్కువ రేటుకే మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఆ తర్వాత మిగిలిన మొక్కజొన్న పంటను తమ గోడౌన్లకు తరలించి దాచుకుంటారు. తమ పంటలను కాపాడుకోవడానికి రైతులు రాత్రింబవళ్లు పంటపొలాల్లోనే కావలి ఉంటారు. అయినా కూడా నేర్పరులైన సైనికులు వారి కళ్లు కప్పి పంటను దోచుకువెళ్తూనే ఉంటారు. ఆర్మీ దుశ్చర్యపై ఉత్తరకొరియా ప్రజలు మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే ఉండడు. అదనంగా వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తారు. -
ఆరోగ్యంతో పొత్తు కుదిర్చే మొక్కజొన్న
గుడ్‌ఫుడ్ మొక్కజొన్న పొత్తును మనం సరదాగా తింటుంటాం. కానీ మనకు ఆరోగ్యంతో పొత్తు కుదిర్చే అద్భుతమైన శక్తి దానికి ఉంది. సరదాగా తినేప్పుడు సంతోషం కూడా కలుగుతుంది కదా. అందుకూ ఒక కారణం ఉంది. మొక్కజొన్నలో సంతోషభావనను పెంచే రసాయనాలైన ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. మొక్కజొన్నలో ఆరోగ్యనికి మేలు చేసే మరిన్ని అంశాలివి... ► మొక్కజొన్నలో బీటా–కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల మొక్కజొన్న గింజలను తింటే ఒక రోజులో అవసరమైన విటమిన్–ఏ లోని ఆరు శాతం మనకు సమకూరుతుంది. విటమిన్–ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. ► మొక్కజొన్నలో ఫెలురిక్ యాసిడ్ అనే శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దానికి ఉంది. అంతేకాదు... అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను అరికడుతుంది. గాయం అయినప్పుడు కలిగే ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట, నొప్పి)ను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. ► మొక్కజొన్నలో విటమిన్ బి–కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్, పైరిడాక్సిన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలో జరిగే అనేకానేక జీవక్రియల నిర్వహణకు అవి తోడ్పడతాయి.ఇక మన ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన ఖనిజాలైన జింక్, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ వంటివి కూడా మొక్కజొన్నలో చాలా ఎక్కువ. -
ముసురుతో పొత్తు...
మబ్బులు ముసిరిన వేళ బండి మీద అమ్మే మొక్కజొన్నపొత్తులు వెచ్చగా రారమ్మంటాయి. చింత నిప్పుల మీద అవి కాలుతుంటే చూసేవారి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి... వాన వేళ వేడిని పుట్టించడానికి మాత్రమే కాదు వంట గదిలో రుచులను దట్టించడానికి కూడా తొలకరి చినుకులతో మొక్కజొన్నల పొత్తు రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఆస్వాదించే ఎత్తు!! బేబీ కార్న్ బజ్జీ కావలసినవి: బేబీకార్న్ – 100 గ్రాములు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – చిటికెడు, మైదా, కార్న్‌ఫ్లోర్ – 20 గ్రాములు, బేకింగ్ సోడా – 2 గ్రాములు, నూనె – 100గ్రా. తయారి: ∙ముందుగా బేబీకార్న్‌ను ఉడికించి పక్కన ఉంచాలి. ఒకగిన్నె తీసుకుని అందులో ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరొక చిన్న గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, మిరియాలపొడి, నీళ్లు పోసి గరిటజారుగా కలపాలి. ఇందులో బేబీకార్న్‌ను ముంచి, కడాయిలో నూనె కాగాక అందులో పిండిలో ముంచిన బేబీకార్న్‌లను వేసి, గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని టొమాటో సాస్‌తో సర్వ్ చేయాలి. రుచికిరుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. మొక్క జొన్న గారెలు కావలసినవి: మొక్కజొన్నగింజలు – 2 కప్పులు, ఉల్లిపాయ– 1 (ముక్కలుగా కట్ చేయాలి), కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి – 2 (తగినన్ని), జీలకర్రæ – టీ స్పూన్, అల్లం తరుగు – టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత తయారీ: ∙మొక్కజొన్న గింజలను అల్లం, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. తర్వాత దీంట్లో పైవన్నీ కలిపి, మరికాస్త నూరి గారెలకు సిద్ధం చేసుకోవాలి. కాటన్ క్లాత్ మీద చిన్న చిన్న పిండి ముద్దలు వేసి, వెడల్పుగా అదిమి, మధ్యలో వేలితో చిల్లు పెట్టి, కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా దోరగా వేయించి, తీయాలి. వీటిని టొమాటో పచ్చడి లేదా సాస్‌తో వడ్డించాలి. కార్న్ మినీ పిజ్జా కావలసినవి: పిజ్జా బేస్ – 4 (చిన్నవి), ఉడికించిన స్వీట్ కార్న్ – పావు కప్పు, బీన్స్, క్యారట్, క్యాప్సికమ్, క్యాబేజీ తరుగు – పావు కప్పు, టొమాటో సాస్ – 3 టేబుల్ స్పూన్లు, చీజ్ తురుము – పావు కప్పు, పనీర్ ముక్కలు – టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, చిల్లీ ఫ్లేక్స్ – 2 టీ స్పూన్లు, ఉల్లికాడల తరుగు – 3 టీ స్పూన్లు తయారి: ∙చిన్న సైజు పిజ్జా బేస్ తీసుకొని పలుచగా టొమాటోసాస్ పూయాలి. దాని పైన సన్నగా తరిగిన క్యాప్సికమ్, ఉల్లికాడలు, క్యారట్, బీన్స్ ముక్కలు వేయాలి. దానిపైన చీజ్ తురుము, పనీర్ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, స్వీట్‌కార్న్ వేసి పది నిమిషాలు లేదా చీజ్ కరిగేంతవరకు బేక్ చేయాలి. అవెన్ లేకుంటే నాన్ స్టిక్ లేదా మందపాటి పాన్ వేడి చేసి అందులో ఈ పిజ్జాలు పెట్టి, పైన మూతపెట్టి పదినిమిషాలు ఉంచాలి. చీజ్ కరిగిన తర్వాత తీయాలి. క్రిస్పీ కార్న కెర్నల్స్ కావలసినవి: మొక్కజొన్న గింజలు – 80 గ్రాములు, ఉల్లిపాయ తరుగు – 20 గ్రాములు, పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు, మైదా – 15 గ్రాములు, కార్న్‌ఫ్లోర్ – రెండు టీ స్పూన్లు, రిఫైన్డ్ ఆయిల్ – వేయించడానికి తగినంత, ఉప్పు –తగినంత, నల్లమిరియాలు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు తయారి: ∙వెడల్పాటి పాత్రలో మొక్కజొన్న గింజలు, మొక్కజొన్న పిండి, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి కలపాలి. కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేయాలి. తర్వాత మొక్కజొన్న గింజలను కాగుతున్న నూనెలో వేసి, బంగారువర్ణం వచ్చేంతవరకు వేయించాలి. నూనె పీల్చుకునే పేపర్‌టవల్ పైన వేయించిన గింజలు వేయాలి. మరొక పాన్‌లో టేబుల్‌స్పూన్ నూనె వేసి, కాగిన తర్వాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తర్వాత పోపు గింజలు, వేయించిన మొక్కజొన్న గింజలు, ఉప్పు, నల్ల మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్ వేసి కలపాలి. ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. కార్న్‌ఫ్లేక్స్ టొమాటో బాస్కెట్స్ కావలసినవి: కార్న్‌ఫ్లేక్స్ – అర కప్పు, పచ్చి బఠాణీ – అర కప్పు, పచ్చికొబ్బరి కోరు – అర కప్పు, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, గరం మసాలా – కొద్దిగా, కారం బూందీ – ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దిగా, టొమాటో కెచప్ – టేబుల్‌స్పూన్, పుదీన, కొత్తిమీర, ఉప్పు – తగినంత, క్యారట్ తురుము – అర కప్పు, బెంగళూరు టొమాటోలు – ఆరు (పెద్దవి) తయారి: ∙ముందుగా టొమాటోలను ఫొటోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. కట్‌చేసిన తర్వాత లోపల ఉన్న గుజ్జుని తీసేయాలి. లోపల ఉప్పు రాసి బోర్లించాలి. ఇలా చేయడం వల్ల టొమాటోలోని నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు టొమాటో లోపల గరం మసాలా రాయాలి. ఒక పాత్ర తీసుకుని కారం బూందీ, ఉల్లిపాయ తరుగు, పచ్చి బఠాణి, పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని టొమాటో బాస్కెట్లో నింపి పైన కార్న్ఫ్లేక్స్వేసి దాని మీద కెచప్ పెట్టాలి. చివరగా కొబ్బరి తురుము చల్లి సర్వ్ చేయాలి. క్రిస్పీ కార్న్ సూప్ కావలసినవి: మొక్కజొన్న గింజలు – 1 కప్పు(పచ్చివి) (మూకుడులో టీ స్పూన్ నూనె వేసి వేయించాలి), క్యారెట్ – 1, బీన్స్ – గుప్పెడు, కార్న్‌ఫ్లోర్ – పావు కప్పు, ఉప్పు – తగినంత, మిరియాలు – 4, పంచదార – టీ స్పూను, కూరగాయ ముక్కలు లేదా పప్పు ఉడికబెట్టిన నీళ్లు – 3 కప్పులు తయారి : ∙అడుగు మందంగా వున్న పాత్రలో కూరగాయలు లేదా పప్పు ఉడికించిన నీళ్ళుపోసి వేడిచేసి మొక్కజొన్న గింజలు, కూరగాయముక్కలు, పంచదార, ఉప్పు, మిరియాలువేసి ఉడికించాలి. కూరగాయ ముక్కలు ఉడికిన తరువాత స్టౌ పై నుంచి దించి నీటిని వడకట్టాలి. వడకట్టిన కూరగాయలను గ్రైండ్‌చేసి వడకట్టిన నీటిని కూడా కలిపి మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. సూప్ కప్పులో పోసి, పైన వేయించిన మొక్కజొన్న గింజలు, సన్నగా కట్ చేసిన కీరా ముక్క వేసి సర్వ్ చేయాలి. -
పాప్‌కార్న్ రూ.200 పది కిలోల మక్కలు 150
సాక్షి, హైదరాబాద్: అందరికీ నోరూరించే పాప్‌కార్న్.. బడా షాపింగ్‌మాళ్లు, మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో పాప్‌కార్న్ ప్యాకెట్‌ను రూ.200 చొప్పున అమ్ముతున్నారు. బడా మాల్స్‌లో సినిమా టికెట్‌తో కలిపి కొంటే కాంబో ఆఫర్ పేరుతో రూ.175కు తగ్గించి ఇస్తున్నారు. గ్రేటర్లో ఖరీదైన జీవనానికి అలవాటుపడ్డ నగరవాసులకు ఇందులో వింతేముంది అనిపించొచ్చు..! కానీ పాప్‌కార్న్ తయారీకి వాడే మొక్కజొన్న(మక్కలు) పం డించిన రైతు ఈ ధర వింటే బిత్తరపోవటం ఖాయం. రైతులు 4 నెలలు చెమటోడ్చితే మొక్కజొన్న పంట చేతికందుతుంది. కంకులు ఒలిచి.. ఎండబెట్టిన మక్కలను మార్కెట్‌కు తరలించేందుకు రైతులు పడే ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. ఇప్పుడున్న ధరల ప్రకారం మార్కెట్లో క్వింటాలు మక్కలమ్మితే రైతుకు రూ.1,300 నుంచి రూ.1,500 చేతికందుతున్నాయి. ప్రభుత్వం మొక్కజొన్న కు రూ.1,365 మద్దతుధర నిర్ణయించింది. దళారుల దందా, మార్కెట్ల వరకు రవాణా ఖర్చులు, పడిగాపులన్నీ లెక్కేసుకుంటే ఈ సీజన్లో రైతుకు రూ.1,300కు మించి ధర రాలేదు. అవే మక్కలతో తయారు చేసే పాప్‌కార్న్‌ను కొనాలంటే మాత్రం కళ్లు బైర్లు కమ్ముతాయి. ఒక పాప్‌కార్న్ ప్యాకెట్లో సగటున 50 గ్రాముల నుంచి వంద గ్రాముల మక్కలుంటాయి. రైతు అమ్మిన ధరతో పోలిస్తే మక్కలకు.. పాప్ కార్న్‌కు అసలు పొంతనే లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా.. కరెంటు ఖర్చు.. చిటికెడు ఉప్పు.. ఒక స్పూన్ నూనె.. అందమైన బొకే లాంటి ప్యాకెట్.. అన్నీ కలిపినా పాప్ కార్న్ ధర పది రూపాయలు దాటదు. కానీ.. పది కిలోల మక్కలు అమ్మితే రైతుకు వచ్చేది రూ.150 కంటే.. అదనంగా మరో రూ.50 వడ్డించ డమే కార్పొరేట్ కాసుల దందా అంటే..! -
మొక్కజొన్నకు దక్కని సర్కారు చేయూత
-
గ్రామీణ ఆవిష్కర్తలకు జేజేలు!
వ్యవసాయదారులు, గ్రామీణుల అభివృద్ధికి తోడ్పడే వినూత్న ఆవిష్కరణలను వెలువరించిన వారిని గుర్తించి, సముచిత రీతిలో ప్రోత్సహించడం అత్యవసరం. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.పి.ఆర్.) ఈ విషయాన్ని గుర్తించి.. గత నెల 23,24 తేదీల్లో తొట్టతొలి సారిగా జాతీయ స్థాయి గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శనను హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇన్నోవేటర్లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. పార్వతీపురానికి చెందిన రైతు శాస్త్రవేత్త డి. బాబూరావుకు రూ. 50 వేల బహుమతి లభించింది. గ్రామీణ రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను డిజైన్ పరంగా అభివృద్ధి చేసి, వాటిని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్.ఐ.ఆర్.పి.ఆర్.లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం విశేషం. అక్కడ ప్రదర్శించిన కొన్ని వ్యవసాయ సంబంధిత ఆవిష్కరణల గురించి ఇక్కడ ముచ్చటించుకుందాం.. మొక్కజొన్న ఒలిచే / చెరకు ముచ్చెలు కత్తిరించే యంత్రం రైతు శాస్త్రవేత్త డి. బాబూరావు స్వస్థలం విజయనగరం జిల్లాలోని పార్వతీపురం. బహుళ ప్రయోజనకారి అయిన స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్‌సీడర్‌ను గతంలో ఆవిష్కరించి పేరుగడించిన ఆయన తాజాగా.. ఒకేసారి నాలుగు మొక్కజొన్న పొత్తుల్లో నుంచి గింజలు ఒలిచే యంత్రాన్ని ఆవిష్కరించారు. ఈ యంత్రానికి చిన్న బ్లేడ్లు మార్చుకొని.. చెరకు ఒంటికన్ను ముచ్చెలను లేదా 3 అంగుళాల ముక్కలను కత్తిరించడానికి కూడా వినియోగించుకోవచ్చు. బరువు 20 కిలోలు కావడంతో ఎక్కడికైనా, కొండల మీదికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. ఖరీదు రూ. 16 వేలు. చెరకు విత్తన మార్కర్ : దీనితోపాటు చెరకు విత్తన మార్కర్‌ను సైతం బాబూరావు రూపొందించారు. చెరకు సాళ్ల మధ్య 3 అడుగుల దూరం ఉంచాలి. చెరకు మొక్కలను విడి విడిగా కాకుండా.. 14 అంగుళాల రింగ్‌లో 4 చెరకు ముచ్చెలను నాటాలి. రింగ్‌కు రింగ్‌కు మధ్య 3 అడుగుల దూరం ఉంచాలి. ఇలా చేయడం వల్ల గాలులకు చెరకు పడిపోకుండా ఉంటుంది. ఎకరానికి కనీసం 300 కిలోల చెరకు విత్తనం సరిపోతుంది. బాబూరావును 94409 40025 నంబరులో సంప్రదించవచ్చు. – సేకరణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : కందల రమేష్‌బాబు, సీనియర్ ఫొటో జర్నలిస్టు మండే ఎండల్లో చెమటను చిందించే మహిళా రైతులకు గొడుగుల ద్వారా నీడ కల్పిస్తే వారి కష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చని అంటున్నారు రేపల్లె షణ్ముఖరావు (94921 13609). మహబూబ్‌నగర్ జిల్లా కంబాలపల్లి ఆయన స్వస్థలం. ఇందుకోసం రెండు రకాల పెద్ద గొడుగులను ఆయన రూపొందించారు. సాళ్ల మధ్యలో ఈ గొడుగును నిలబెట్టి.. దీని నీడలో మహిళలు పనులు చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ముందుకు జరుపుకోవచ్చు. దీని ధర రూ. 1,500. ప్రతిసారీ జరుపుకోనవసరం లేకుండా.. సౌరవిద్యుత్‌తో నడిచే సెన్సర్ల ద్వారా దానంతట అదే ముందుకు జరిగే ఆటోమేటిక్ గొడుగును కూడా ఆయన రూపొందించారు. దీని ధర రూ. 5,000. పురుగు పట్టనివ్వదు! ఎటువంటి రసాయనాలు కలపకుండా వ్యవసాయోత్పత్తులను నిశ్చింతగా భద్రపరచుకునేందుకు ఉపయోగపడే సురక్షితమైన ప్లాస్టిక్ సంచులను మహారాష్ట్ర పుణేకి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ షా రూపొందించారు. 70 మైక్రాన్ల మందాన ఉండే పారదర్శకమైన ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ సంచులలో నింపి బియ్యం, పప్పులు, ఇతర ధాన్యాలను రెండేళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చంటున్నారు. ఇథనాల్ వెనాల్ ఆల్కహాల్ (ఇ.వి.ఓ.హెచ్.) అనే అత్యాధునిక జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని తయారు చేశారు. రెండేళ్లపాటు నిల్వ చేసినా ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలకు పురుగు పట్టదని, పోషకాల నష్టం జరగదని, రుచి, రంగు మారదని షా చెబుతున్నారు. ఇంట్లో, గోదాముల్లో వ్యవసాయోత్పత్తుల నిల్వకు ఈ సంచులు ఉపకరిస్తాయని, ఎన్నేళ్లయినా పునర్వినియోగానికి అనుకూలంగా ఉంటాయన్నారు. ఒక సంచి ధర రూ. 70. తమిళనాడు తంజావూరులోని భారతీయ పంట పరిరక్షణ సాంకేతికతా సంస్థ (ఐ.ఐ.సి.పి.టి.)తోపాటు ఎఫ్.డి.ఎ., సి.ఈ. వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఈ సంచుల నాణ్యతను నిర్థారించాయని షా చెబుతున్నారు. వివరాలకు 098220 12969, 020672 73830 నంబర్లలో సంప్రదించవచ్చు. -
పరారీలో జొన్నల వ్యాపారి
–పోలీసులను ఆశ్రయించిన బాధితులు చాగలమర్రి: చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండ్ కాలనీకి చెందిన ముద్దేటి అశోక్ అనే జొన్నల వ్యాపారి రైతులకు రూ. 3 కోట్ల వరకు కుచ్చు టోపి పెట్టి పరారయ్యాడు. దీంతో బాధితులైన రైతులు, చిరువ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు లబోదిబో మంటూ మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. జొన్నలవ్యాపారి అశోక్ తోపాటు అతడి సోదరుడు ముద్దేటి హరి పై ఎస్ఐ మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముద్దేటి అశోక్, హరి గత రెండు సంవత్సరాలుగా రైతులు, కమీషన్ దారుల నుంచి జొన్నలు కొనుగోలు చేసి వ్యాపారులకు విక్రయించే వారు. ఈ నేపథ్యంలో కర్నూలు, వైఎస్సార్ కడప లోని పలు ప్రాంతాల రైతుల నుంచి రూ. 3 కోట్ల విలువ చేసే జొన్నలు తీసుకున్నాడు. వారందరికి ఈనెల 20వ తేదీన డబ్బులు ఇస్తానని నమ్మించాడు. ఆ ప్రకారం రైతులు, కమీషన్ దారులు అశోక్, హరి ఇంటి వద్దకు పోయారు. అయితే వారి ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో చుట్టు పక్కల వారిని విచారించారు. గత కొన్ని రోజులుగా వారు ఇక్కడ లేరని చెప్పడం.. ఫోన్లు పనిచేయకపోవడంతో పరారైనట్లు నిర్ధారించుకున్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐ మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ రెండు రోజుల్లోనే కర్నూలు, వైఎస్ఆర్కడప జిల్లాల నుంచి 38 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. -
23% ఎక్కువ జీర్ణమయ్యే జొన్న!
- ఆ మేరకు పాల, మాంసం దిగుబడి పెరుగుతుంది.. - మిథేన్ విడుదలనూ గణనీయంగా తగ్గించే సూటి వంగడం.. - ఇవీ గోధుమ రంగు ఈనె కలిగిన జొన్న ‘ఎస్.పి.వి. 2018’ విశిష్టతలు - ఫలించిన ఐ.ఐ.ఎం.ఆర్. శాస్త్రవేత్త డా. ఉమాకాంత్ పన్నెండేళ్ల కృషి - వచ్చే ఖరీఫ్‌లో రైతులకు అందుబాటులోకి రానున్న విత్తనాలు బాగా జీర్ణమయ్యే పశుగ్రాసంగా, మిథేన్ విడుదలను తగ్గించడానికి ఉపకరించే సరికొత్త జొన్న రకం రైతులకు త్వరలో అందుబాటులోకి రానుంది. ‘ఎస్.పి.వి. 2018’ అనే ఈ సూటి రకం వంగడాన్ని హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐ.ఐ.ఎం.ఆర్.) రూపొందించింది. ప్రధాన శాస్త్రవేత్త డా.ఆకుల వెంకట ఉమాకాంత్ 12 ఏళ్లుగా చేస్తున్న పరిశోధన ఫలించింది. కాండం, ఆకులో ఈనె గోధుమ రంగు (సాధారణ జొన్నలో తెల్లగా ఉంటాయి)లో కలిగి ఉండడం ‘ఎస్.పి.వి. 2018’ జొన్న ప్రత్యేకత. ఇదే తొలి భారతీయ బ్రౌన్ మిడ్రిబ్ సోర్గమ్ రకం కావడం విశేషం. ఈ చొప్పలో లిగ్నిన్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇతర జొన్న రకాల కన్నా తీపిగా ఉండడంతోపాటు, పశువులకు ఎక్కువగా జీర్ణమవుతుందని డా. ఉమాకాంత్ ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధికి తెలిపారు. హిస్సార్ (హరియాణా)లోని కేంద్రీయ గేదెల పరిశోధనా సంస్థ (సి.ఐ.ఆర్.బి.) అధ్యయనంలో ఈ చొప్ప మునుపటికన్నా 23 శాతం ఎక్కువగా జీర్ణమైనట్లు వెల్లడైంది. సాధారణ రకాల చొప్పను గేదెలకు మేపినప్పుడు 52% వరకు జీర్ణమైతే.. ఎస్.పి.వి. 2018 రకం చొప్ప 64% వరకు (మునుపటి కన్నా 23% ఎక్కువ) జీర్ణమైందని సి.ఐ.ఆర్.బి. గుర్తించింది. ఆ మేరకు పాల, మాంసం దిగుబడి పెరుగుతుందని డా. ఉమాకాంత్ తెలిపారు. ఖరీఫ్‌లో వర్షాధారంగా 120 రోజుల్లో 7-8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. 16 టన్నుల చొప్పతోపాటు 2 టన్నుల జొన్నల దిగుబడి వస్తుందన్నారు. క్షేత్రస్థాయి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రకాన్ని జాతీయ మొక్కల జన్యుహక్కుల నమోదు సంస్థ (ఎన్.బీ.పీ.జీ.ఆర్.)లోనూ నమోదు చేశామన్నారు. పశువుల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే మిథేన్ వాయువు వల్ల భూగోళం అమితంగా వేడెక్కుతోంది. సాధారణంగా పశువుల నుంచి విడుదలయ్యే వాయువుల్లో మిథేన్ వాటా 32% ఉంటుంది. కానీ, ఎస్.పి.వి. 2018 చొప్పను మేపితే ఇది 24% శాతానికి తగ్గిందని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైందని డా. ఉమాకాంత్ తెలిపారు. ఇథనాల్ ఉత్పత్తికి తోడ్పడే రెండో తరం జొన్న ఇది.. ప్రస్తుతం తీపి జొన్న మొక్క కాండం రసంతో జీవ ఇంధనం ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంపొందించడానికి ఉపకరించే రెండో తరం జొన్న వంగడంగా ఎస్.పి.వి. 2018 రకం ఉపయోగపడుతుందని డా. ఉమాకాంత్ తెలిపారు. లిగ్నిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి (జొన్నలు తొలగించి చొప్పను పూర్తిగా ఇథనాల్ ఉత్పత్తిలో వాడుకోవడానికి ఈ రకం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఎస్.పి.వి. 2018 ప్రత్యేక జొన్న విత్తనాలను వచ్చే ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులకు ఇవ్వనున్నట్లు ఐ.ఐ.ఎం.ఆర్. డెరైక్టర్ డా. విలాస్ తొనపి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
కొనుగోళ్లకు సిద్ధం
ఉమ్మడి జిల్లా కార్యాచరణే ఖరారు 645 ధాన్యం, 31 మక్కల కేంద్రాలు 5లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం వారంలోగా సెంటర్లు ప్రారంభం అమ్మిన రెండు రోజుల్లోనే చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లా కార్యాచరణనే ఖరారు చేశారు. గత ఖరీఫ్‌లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించారు. వారంలోగా ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటున్నారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పత్తి కొనుగోళ్లపై సీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కరీంనగర్ అగ్రికల్చర్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 645 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5లక్షల టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్... డీఆర్డీఏ, ఐకేపీ, డీసీవో, సివిల్ సప్లయిస్, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులతో ధాన్యం సేకరణ విధివిధానాలపై సమీక్షించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత ఖరీఫ్‌లో 576 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.30 లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరించారు. ఈసారి 645 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఐకేపీ 246, పీఏసీఎస్ 396, జీసీసీ 3 కేంద్రాలున్నాయి. గ్రేడ్–1 రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.1510, సాధారణ రకానికి రూ.1470 కనీస మద్దతు ధర చెల్లించనున్నారు. ప్రతి కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా పర్యవేక్షించనున్నారు. అందుకు ఒక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని నియమించనున్నారు. నగదును రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాల్సి ఉన్నందున వారి వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చే యాలని అధికారులకు జేసీ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకు ఖాతాలు లేని రైతులు వెంటనే తెరవాలని కోరుతున్నారు. నాణ్యత లేని ధాన్యం కొనుగోలు చేసినట్లయితే సదరు సెంటర్ ఇన్చార్జిపై చర్యలు తీసుకునేలా నిబంధనలు విధించారు. దిగుబడిపై దిగులు ఈ ఖరీఫ్‌లో 1.43 లక్షల హెక్టార్లలో వరి సాగుచేయగా దాదాపు సగం పంట ఎండిపోయింది. మిగిలిన పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు, వరదలు దెబ్బతీశాయి. మంథని నియోజకవర్గం మినహా అన్ని ప్రాంతాల్లో దాదాపు కోతలు కూడా మొదలవుతున్నాయి. ఈసారి దిగుబడి దాదాపు సగానికి పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అక్టోబర్ చివరి వరకు ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. మక్కల కొనుగోళ్లకు సై... జిల్లావ్యాప్తంగా 31 మొక్కజొన్న కొనుగోలు కేంద్రా ల ఏర్పాటుకు మార్క్‌ఫెడ్ సిద్ధమైంది. డీసీఎంఎస్, పీఏసీఎస్‌ల ద్వారా మక్కలను కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1365కు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది మార్క్‌ఫెడ్ ద్వారా 40 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొనుగోలు చేశారు. వ్యాపారులు మద్దతు ధర కంటే అధికంగా చెల్లించడంతో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేపట్టలేదు. ఈసారి కూడా 31 సెంటర్లలో మక్కల కొనుగోళ్లు చేపట్టనున్నారు. ప్రస్తుతం వ్యాపారులు సైతం రూ.1400 పైచిలుకు ధర పెడుతున్నారు. మక్కల రాకను బట్టి వారంలోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మార్క్‌ఫెడ్ డీఎం శ్యాంకుమార్ తెలిపారు. మక్కల కొనుగోలు కేంద్రాలివే.. కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్, హుజూ రాబాద్, చొప్పదండి, జమ్మికుంట, జగిత్యాల, పెద్దపల్లి, ధర్మారం, గొల్లపల్లి, మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, మంథని, కాల్వశ్రీరాంపూర్ సబ్‌యార్డు, బెజ్జంకి సబ్‌యార్డు, మెట్పల్లి (వెల్లుల్ల), డీసీఎంఎస్ కేంద్రాలైన ఓదెల, కోహెడ, సారంగాపూర్, ఇల్లంతకుంట, చిగురుమామిడి, రాయికల్, సిరిసిల్ల, కథలాపూర్, సుల్తానాబాద్, జూలపల్లి, మేడిపల్లి, పెగడపల్లి. -
‘కొత్త’ ఆశలు ఆవిరి!
భవిష్యత్తు ప్రశ్నార్థం పాలకులది పాత పల్లవే.. ‘మెదక్’తోనే అభివృద్ధి: మేధావులు సంగారెడ్డితో విడదీయరాని అనుబంధం: స్థానిక నేతలు ‘సాక్షి’ కథనానికి స్పందన పొద్దంతా కాయకష్టం చేసే జనం. సావైనా బతుకైనా ‘సాగే లోకం’. చెమటను పారించి.. దిగుబడి సాధించటమే వాళ్ల వ్యాపకం. నిజాం రాజుల ఏలుబడి నుంచి ఖేడ్‌కు ‘ఎద్దు– ఎవుసమే’ ఆదెరువు. స్వాతంత్య్రం వచ్చి కూడా 70 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి సంగారెడ్డితోనే నారాయణఖేడ్‌కు అనుబంధం. ఈ 70 ఏళ్ల కాలంలో ప్రాథమిక జీవన ఆధారమైన వ్యవసాయం రంగం ఏనాడూ ‘బాల్య’దశ దాటలేదు. ఈ ఏడాది మొదటి పాదం వరకు కనీసం నియోజకవర్గం కేంద్రంలోనే వ్యవసాయ మార్కెట్ లేదు. ఇక్కడి రైతును బీదర్, లాతూర్, ఉద్గీర్ వ్యవసాయ మార్కెట్లు చేరదీశాయి. కానీ సొంత జిల్లా మార్కెట్ ఏనాడూ దగ్గరకు రానివ్వలేదు. పునర్విభజనతోనైనా కొత్త ఆశలు చిగురిస్తాయకుంటే.. పాలకులు మళ్లీ పాత పల్లవినే ఎత్తుకోవడంతో ఖేడ్ రైతాంగం భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోందని వ్యవసాయ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ నియోజకవర్గం వ్యవసాయంపైనే ఆధారపడిన ప్రాంతం. పట్టా, ప్రభుత్వ, అటవీ భూములు కలుపుకుని మొత్తం 2.50 లక్షల ఎకరాలున్నాయి. దాదాపు 75 వేల రైతు కుటుంబాలున్నాయి. ఇందులో 1.85 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూములున్నప్పటికీ సాగు నీళ్లు లేక 1.20 లక్షల ఎకరాల్లో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పంట పండుతోంది. నల్లవాగు ప్రాజెక్టు కింద కలే్హర్ మండలంలో 6 వేల ఎకరాలు, 200 కుంటలు, 50 చెరువుల ద్వారామరో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. నియోజకవర్గం వ్యాప్తంగా చిన్న కమతాలు కలిగిన సన్న చిన్న కారు రైతులే ఎక్కువగా ఉన్నారు. ఉన్న కొద్దిపాటి భూమికి సాగునీటి వసతి చేసుకోలేక భూములను బీడు పెట్టి వలస బాట పడుతున్నారు. నియోజకవర్గం నుంచి యోటా కనీసం 75 వేలకు మందికి పైగా రైతులు, రైతు కూలీలు వలస పొతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. మనూరు, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో ప్రధానంగా పెసర, మినుము, కంది, జొన్న, పత్తి, సోయా, వరి, మొక్కజొన్న, ఉల్లి పంటలను సాగుచేస్తారు. కలే్హర్, పెద్దశంకరంపేట మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలు అధికంగా సాగవుతాయి. చెరువులు, కుంటలు, బోరు బావుల కింద వరి, మొక్కజొన్న, చెరకు, సాగుచేస్తారు. నియోజకవర్గం నుంచి ఏడాదికి సగటున 1352.37 టన్నుల వివిధ రకాల పంట దిగుబడి వస్తోంది. ఇందులో సోయా11094హెక్టార్లకు గాను 221.88 టన్నులు,పత్తి 13427హెక్టార్లులో 268.54 టన్నులు, వరి 25,368 హెక్టార్లకు గాను 203 టన్నులు, మొక్కజొన్న 4587 హెక్టార్లలో 321.09 టన్నులు దిగుబడితో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తరువాత స్థానంలో ఉల్లి, పప్పుధాన్యాలున్నాయి. గడిచిన పదేళ్ల మార్కెట్ విక్రయాలను రికార్డును పరిశీలిస్తే.. నారాయణఖేడ్ రైతులు పండించిన ధాన్యంలో కేవలం 5 శాతం మాత్రమే సంగారెడ్డి, జోగిపేట మార్కెట్‌కు వచ్చాయి. 20 శాతం పంటను కర్ణాటకలోని బీదర్ మార్కెట్‌కు, తరువాత వరుసగా ఔరాద్, మహారాష్ట్రలోని ఉద్గీర్, లాతూర్, దెగులూర్ మార్కెట్‌కు ధాన్యం విక్రయించినట్టు రికార్డులు చెప్తున్నాయి. భౌగోళికంగా... సాగు జలాల లభ్యతను బట్టి చూస్తే నారాయణఖేడ్ ప్రాంతం భూమలు వ్యవసాయం కంటే పారిశ్రామికంగానే అనుకూలమైనవి, చవకైన భూములు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి ఏ ఒక్క పెట్టుబడిదారుడు ముందుకు రాలేదు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల మీదనే దృష్టి పెట్టారు. ఎగుమతి, దిగుమతులకు హైదరాబాద్ అనుకూలం. మంచి రవాణా సౌకర్యంతో పాటు నాణ్యమైన పారిశ్రామిక ఉత్పత్తుల దిగుబడిని ప్రోత్సహించే వాతావరణం ఉండటంతో పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఇక నారాయణఖేడ్ ప్రాంత ఆర్థిక పరిపుష్టికి వ్యవసాయమే మూలం. నీటి వనరులు అభివృద్ధి పరుచుకొని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసుకోవటమే మార్గం. అది జరగాలంటే సంగారెడ్డి జిల్లా ఎలా అనుకూలం అవుతుంది అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో మెదక్‌జిల్లా వ్యవసాయక జిల్లాగా గుర్తింపు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఘణపురం ఆయకట్టు కింద దాదాపు 20 వేల ఎకరాల్లో భూమి సాగు అవుతుంది. ఆనకట్ట ఎత్తు పెంచి మరో 30 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు కదులుతోంది. అదే జరిగితే మెదక్ జిల్లా దక్షిణ తెలంగాణ ధాన్యాగారంగా మారడం ఖాయం. ఈ క్రమంలో జిల్లాకు మరిన్ని వ్యవసాయ రాయితీలు, ప్రోత్సాహకాలు వచ్చే అవకాశం ఉంది. పంట విధానాలపై, మేలైన వంగడాల సృష్టి కోసం విస్తృతమైన ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. ఈ సంక్షేమ, ప్రయోగా ఫలాలు సహజంగానే జిల్లా అంతటికీ విస్తరించి వ్యవసాయ రంగం మెరుగుపడే అవకాశాలు అద్భుతంగా ఉంటాయని వ్యవసాయ పరిశోధకులు అంచనా వేస్తున్నాయి. సాక్షి కథనం అప్పుడే చర్చనీయాంశంగా మారింది. మొదటి కథనంతోనే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు ‘సాక్షి’ కార్యాలయానికి ఫో¯ŒS చేసి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షట్కర్ సాక్షి కథనాలను ఖండించగా.. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్టు ఆర్ సత్యనారాయణ, మేధావులు, విద్యావంతులు, అధికారులు కథనాలను సమర్థించారు. -
బట్టలు సువాసన రావాలంటే..
ఇంటిప్స్ ఆమ్లెట్ బాగా పొంగాలంటే... కోడిగుడ్డు సొనలో చిటికెడు పంచదార కానీ, కాసింత మొక్కజొన్న పిండి కానీ కలపాలి.ఇస్త్రీ చేసేటప్పుడు ఇస్త్రీపెట్టెలో వేసే నీళ్లలో కాసింత పర్ఫ్యూమ్ వేస్తే బట్టలు మంచి సువాన వస్తాయి. కోడిగుడ్లు ఉడికించే గిన్నె నల్లబడిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే... ఉడికించేటప్పుడు నీటిలో కొద్దిగా చింతపండు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే దానిలో కొద్దిగా పసుపు కలిపి డబ్బాలో దాచిపెట్టాలి. మాంసం కాస్త ముదురుగా అనిపిస్తే... ఉడికించేటప్పుడు చిన్న బొప్పాయి ముక్క వేస్తే త్వరగా ఉడుకుతుంది. బియ్యం కడిగిన నీళ్లలో కాకరకాయ ముక్కలను కాసేపు నానబెట్టి తీసి, ఆ తర్వాత వండితే చేదు ఉండదు. -
మొక్కజొన్న రైతు గగ్గోలు
రైతుల లబోదిబో.. చిన్నశంకరంపేట : ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంటను మరో రైతు భూమి నాదంటూ ట్రాక్టర్‌తో దున్నేశాడు. వెల్దుర్తి మండలం అచ్చంపేటకు చెందిన చాకలి వెంకయ్య 351 సర్వేనంబర్‌లో మొక్కజొన్న పంట సాగుచేస్తున్నాడు. ప్రభుత్వం గతంలో అసైన్ చేసిన భూమిలో పంటను సాగు చేయగా, ధరిపల్లి గ్రామానికి చెందిన ప్రభురెడ్డి అనే రైతు శుక్రవారం ట్రాక్టర్‌తో పంటను ధ్వంసం చేశాడని బాధిత రైతు వెంకయ్య తెలిపారు.తమకు గతంలో 351|144 సర్వేనంబర్‌లో 2.20 గుంటల భూమిని మంజూరు చేయగా సాగు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నామన్నారు. ఇప్పటికే ఎనిమిదెకరాల అసైన్డ్డ్ భూమిని సాగు చేస్తున్న తనను ప్రభురెడ్డి వేధిస్తున్నాడని ఆరోపించారు. తమపై దౌర్జన్యం చేసీన ప్రభురెడ్డిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రభురెడ్డి మాట్లాడుతూ తనకు 8 ఎకరాలు అసైన్డ్ పట్టా ఉందన్నారు. అవసరమైతే న్యాయం కోసం కోర్టుకు వెళ్తానన్నారు -
పచ్చిబుట్టకు తగ్గిన ధర
మోర్తాడ్: పచ్చిబుట్ట (మొక్కజొన్న) సాగు చేసిన రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. పంట పండించిన రైతుకు గిట్టుబాటు కాకపోగా, దళారులు మాత్రం ఇష్టమొచ్చిన ధరలు నిర్ణయిస్తూ దండుకుంటున్నారు. పచ్చిబుట్టకు పట్టణాల్లో డిమాండ్ అధికంగా ఉంటుంది. కాల్చి విక్రయించే కంకులతో పాటు పచ్చి కంకులను పిండి రుబ్బుకొని పిండి పదార్థాలు చేసుకుంటారు. పచ్చి మొక్కజొన్న కంకులకు డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు ఖరీఫ్‌కు కొద్ది ముందు మే నెలలోనే మొక్కజొన్న సాగు చేశారు. అయితే, మండుటెండల్లో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పంట పండించిన రైతులకు గిట్టుబాటు కావడం లేదు. దళారులు అమాంతం ధరలు తగ్గించేస్తూ దండుకుంటున్నారు. మొన్నటి వరకు ఎకరా విస్తీర్ణం పంటకు రూ.35 వేలు చెల్లించిన దళారులు.. ఇప్పుడు రూ.25 వేలు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు. దీంతో పచ్చి బుట్ట కోసం సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూన్, జూలై నెలల్లో సాగు చేసే మొక్కజొన్నను మాత్రం పంట ఎండిన తరువాత విక్రయిస్తారు. ఈ ఖరీఫ్ సీజనుకు గాను జిల్లా వ్యాప్తంగా దాదాపు 55 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సగం పంట పచ్చిబుట్ట రూపంలోనే విక్రయిస్తారు. జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ, వేల్పూర్, ఆర్మూర్ మండలాల నుంచి హైదరాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, వరంగల్ తదితర పట్టణాలకు జోరుగా మొక్కజొన్న కంకులు ఎగుమతి అవుతున్నాయి. మెట్పల్లి, పెర్కిట్లలోని హోల్‌సెల్ వ్యాపారులు నేరుగా రైతుల నుంచి హోల్‌సెల్‌గా పంటను కొనుగోలు చేస్తున్నారు. అయితే, మొదట్లో పంట చేతికొచ్చిన రైతులకు వ్యాపారులు ఎకరాకు రూ.35 వేలు చెల్లించారు. ప్రస్తుతం పంట పెద్ద మొత్తంలో చేతికి రావడంతో వ్యాపారులు ధర తగ్గించేశారు. రూ.25 వేల కంటే ఎక్కువిచ్చేది లేదని కరాఖండీగా తేల్చి చెబుతున్నారు. ఒకేసారి ధర రూ.10 వేలు తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో 10–15 వేల కంకులు లభిస్తాయి. పచ్చి కంకిని వ్యాపారులు రూ.5కు విక్రయిస్తుండగా, కాల్చిన కంకిని రూ.10కి విక్రయిస్తున్నారు. రిటైల్ వ్యాపారులకు, వినియోగదారులకు ధరలో తేడా లేకపోయినప్పటికీ రైతుల వద్దకు వచ్చే సరికి మాత్రం భారీగా తేడా ఏర్పడింది. మార్కెట్లో మొక్కజొన్న పచ్చికంకులకు డిమాండ్ ఎంత మాత్రం తగ్గకపోయినా దళారుల కారణంగా రైతులు నష్టాలు మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండిన మక్కలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. పచ్చి కంకుల విక్రయానికి మాత్రం మార్కెట్ సౌకర్యాలు లేకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కోతకు వచ్చిన మొక్కజొన్న పంటను ఎండిబెట్టి మక్కలను విక్రయిద్దామని భావిస్తున్నా, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రైతులు వ్యాపారులు చెప్పిన ధరకు పచ్చి బుట్టను విక్రయిస్తున్నారు. రెండేళ్లుగా కరువుతో నష్టపోయిన అన్నదాతలు.. ప్రస్తుతం దళారుల దగాతో నష్టపోతున్నారు. -
రాళ్లల్లో రతనాల సేద్యం
సదాశివనగర్: ఎటు చూసినా కనిపించేవన్ని రాళ్లే.. ఎందుకూ పనికి రాని బీడు భూములే.. అలాంటి భూముల్లో రతనాల సేద్యం చేస్తున్నారు రైతులు. రాళ్ల నడుమ పంటలు పండిస్తూ సిరులు కురిపిస్తున్నారు. మండలంలోని లింగంపల్లి, జనగాం, భూంపల్లి గ్రామ శివారులోని భూములన్నీ రాళ్లురప్పలతో నిండినవే. వాటిని సైతం లెక్క చేయకుండా వివిధ రకాల పంటలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయా గ్రామాల రైతులు. ఈ గ్రామాల్లో నల్లరేగడి భూములు చాలా తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. ఎక్కువ మంది రైతులకు రాళ్లతో కూడిన భూములే అధికంగా ఉన్నాయి. ఆ రాళ్ల భూములను నమ్ముకొని రైతులు నడుం బిగించారు. మొక్కవోని దీక్షతో సేద్యానికి ఉపక్రమించారు. కలుపు తీయడానికీ ఇబ్బందిగా ఉన్నా.. పట్టుదలతో సాగు చేపట్టారు. రాళ్లతో కూడిన భూముల్లో బంగారు పంటలు పండిస్తున్నారు. ఆ రాళ్ల భూముల్లోకి కలుపు తీసే పనులకు వచ్చేందుకు కూలీలు వెనుకడుగు వేస్తున్నా.. కుటుంబ సభ్యుల సహకారంతో సమర్థవంతంగా సేద్యం చేస్తున్నారు. కరడ్‌పల్లి, మాధవపల్లి, పద్మాజివాడి, కల్వరాల్, దగ్గి గ్రామాల నుంచి కూలీలకు ఎక్కువ డబ్బులు చెల్లిస్తూ కలుపు మొక్కలను తొలగిస్తున్నారు. వారికి ఆటో చార్జీలతో పాటు కూలీ డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ఈ రాళ్ల భూముల్లో 220 ఎకరాల్లో సోయా, 180 ఎకరాల్లో మొక్కజొన్న, 80 ఎకరాల్లో కంది పంటలను సాగు చేశారు. గతేడాది వర్షాభావంతో చాలా తక్కువ విస్తీర్ణంలో ఈ రాళ్ల మధ్యన పంటలు సాగు చేశారు. కానీ ఈసారి వర్షాలు మెరుగ్గా ఉండడంతో సాగు విస్తీర్ణం రెట్టింపైంది. కొన్నేళ్లుగా బీళ్లుగా ఉన్న భూములు సైతం ప్రస్తుతం పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నాయి. పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా వర్షాలు సమృద్ధిగా కురిస్తే మంచి దిగుబడులు సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు ఆయా గ్రామాల రైతులు. -
దొమ్మేరు పొత్తులొచ్చాయ్..!
కొవ్వూరు రూరల్ : వాన చినుకులు పడుతున్న వేళ.. వేడివేడి లేత మొక్కజొన్న పొత్తు తింటే.. ఆ రుచే వేరు.. అదీ దొమ్మేరు పరిసరాల్లో పండిన మొక్కజొన్న పొల్తైతే ఇక చెప్పేదేముంది. దొమ్మేరు మొక్కజొన్నకు జిల్లాలో విపరీతమైన డిమాండ్. ప్రస్తుతం సీజన్ కావడంతో పొత్తులు రాక ప్రారంభమయ్యింది. మండలంలోని దొమ్మేరుతో పాటు చుట్టుపక్కల 10 గ్రామల్లో సుమారు 1000 ఎకరాల్లో తినే మొక్కజొన్నను రైతులు పండిస్తారు. జూలై మాసం చివరికి రావడంతో తయారైన పొత్తులను రైతులు విరుపు ప్రారంభించారు. దీంతో దొమ్మేరులోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న పొత్తులు అమ్మే దుకాణాలు వెలిశాయి. దుకాణాల్లో ఒక్కో పొత్తు రూ.10 నుంచి రూ.12 వరకూ సైజును బట్టి అమ్ముతున్నారు. అదే హోల్‌సేల్ దుకాణాల్లో 100పొత్తులు(కాల్చనివి) రూ.700 వరకూ అమ్ముతున్నారు. ఇది ఇలా ఉండగా ఎకరా మొక్కజొన్న తోటను రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకూ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వారు పొలం వద్దే పొత్తును విరిచి వ్యాపారులకు 100 పొత్తులు రూ.650 వరకూ అమ్మకాలు సాగిస్తున్నార -
కేఎఫ్‌సీ భోజనంలో పురుగులు!
కేఎఫ్‌సీ.. తన వినియోగదారులకు షాకుల మీద షాకులిస్తోంది. సాయంత్రం సరదాగా అలా బయట తిందామని వెళ్లిన వారికి కేఎఫ్‌సీ పాప్‌కార్న్ చికెన్ మీల్లో పురుగులు కనిపించడంతో ఆశ్చర్యం, అసహ్యం రెండూ కలిగాయి. ఇటీవలి కాలంలో కేఎఫ్‌సీ మీద పలు సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఇండియాలో హైదరాబాద్, మంగుళూరు తదితర ప్రాంతాల్లో కేఎఫ్‌సీ బర్గర్లలో పురుగులు రావడం, చికెన్‌లో బ్యాక్టీరియా ఉండటం కనిపించాయి. తాజాగా 27 ఏళ్ల జెన్నిఫర్ ఆల్డెర్సన్ తన కుమార్తె లిడియా హోనేతో కలసి బిషప్ ఆక్లాండ్ లోని దుర్హామ్ ప్రాంతంలో ఉన్న కేఎఫ్‌సీకి వెళ్లారు. అక్కడ చికెన్ పాప్‌కార్న్ మీల్ కోసం ఆర్డర్ ఇచ్చారు. తీరా లిడియా తింటున్న పాప్‌కార్న్‌లో పురుగు కనిపించడంతో జెన్నిఫర్ షాకయ్యింది. ఒకేవారంలో ఇలా కేఎఫ్‌సీ ఆహారంలో క్రిములు కనిపించడం ఇది రెండోసారని అక్కడే ఉన్న మరో మహిళ చెప్పడం.. అగ్నికి ఆజ్యం పోసింది. పురుగు కనిపించిన తర్వాత జెన్నిఫర్ కుటుంబ సభ్యులు.. మిగిలిన పదార్థాలను తినలేకపోయారు. పదార్థాలన్నింటినీ వాపస్ ఇచ్చేసిన ఆల్డెర్సన్.. కేఎఫ్‌సీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదార్థాలను చుట్టి ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత పురుగులు ఎలా వస్తాయని, మీ అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందని మండిపడింది. దీంతో కేఎఫ్‌సీ సిబ్బంది మరోసారి ఇలా జరగకుండా చూస్తామంటూ క్షమాపణలు చెప్పారు.. అయితే మొక్కజొన్న వంటి సహజ ఉత్పత్తుల విషయంలో దురదృష్టవశాత్తు అరుదుగా ఇలా అవుతుందని, గింజలను తొలిచి క్రిములు లోపల ఉండటంతో కనపడవని కేఎఫ్‌సీ సిబ్బంది సంజాయిషీ ఇస్తున్నారు. ఇలాంటి తప్పులు జరిగితే తాము ఆర్డర్ పూర్తిగా వాపస్ తీసుకుంటామని, తమ కస్టమర్ కేర్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తారని చెప్తున్నారు. ఆహార భద్రతాధికారులు కూడా ఒకే వారంలో రెండుసార్లు ఇలాంటి ఘటనలు జరగడంపై కేఎఫ్‌సీని వివరణ కోరారు. -
లక్ష టన్నుల మొక్కజన్న దిగుమతి: నెక్
హైదరాబాద్: పౌల్ట్రీ రైతులు లక్ష టన్నుల మొక్కజొన్నను త్వరలో దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నట్లు నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటి(ఎన్ఈసీసీ-నెక్) ఒక ప్రకటనలో తెలిపింది. మొక్కజొన్న దిగుమతి వల్ల సమంజసమైన ధరకు రైతులకు మొక్కజొన్న అందుబాటులో వుంటుందని, తద్వారా దేశీయ మార్కెట్లో ధర దిగివస్తుందని పేర్కొంది. కోళ్ల దాణాలో కీలకమైన మొక్కజొన్న ధరలు గత కొన్నేళ్లుగా బాగా పెరుగుతున్నాయని ఇది పౌల్ట్రీ రైతులపై భారాన్ని మోపుతోందని వివరించింది. లక్ష టన్నుల మొక్కజొన్న దిగుమతి వల్ల సరఫరా, డిమాండ్ల మధ్య అంతరం తగ్గి ధరలు దిగిరాగలవని పేర్కొంది. -
‘మద్దతు’ దాటిన మక్కల ధర
వరంగల్ మార్కెట్లో రికార్డు క్వింటాకు రూ.1555 వరంగల్ సిటీ: వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మక్కలకు (మొక్కజొన్న) రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్వింటా మక్కలకు రూ.1,555 ధర పలకడం విశేషం. మక్కలకు ప్రభుత్వం గత ఏడాది రూ.1,315, ఈసారి రూ.1,325 మద్దతు ధరగా ప్రకటించింది. ఈ ధరతో కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌ను సైతం రంగంలోకి దింపారు. అరుుతే, వరంగల్ మార్కెట్లో మాత్రం మద్దతు ధరకు మించి మంగళవారం క్వింటా మక్కలను ప్రైవేట్ వ్యాపారులు రూ.1,555 ధరతో కొనుగోలు చేశారు. దీంతో రైతులు మార్క్‌ఫెడ్‌కు కాకుండా వ్యాపారులకు అమ్మేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి మార్కెట్‌కు మక్కలు వస్తుండగా, మంగళవారం వరకు 38,328 క్వింటాళ్ల మక్కలు అమ్మకానికి వచ్చాయి. -
కబేళాలకు పశువులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు అనంతయ్య. రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం అల్లిపూర్. అప్పులు చేసి ఈ ఏడాది ఐదెకరాల్లో పత్తి, మొక్కజొన్న వేశాడు. వర్షాల్లేక పంట ఎండిపోయింది. దీంతో పశువులను అమ్ముకునేందుకు సిద్ధపడ్డాడు. ‘‘గట్లపై కూడా గడ్డి లేదు. వరిగడ్డి మోపు ఒక్కటి రూ.100 నుంచి రూ.150 దాక ఉంది. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలె. అందుకే అమ్ముకుంటున్నా..’’ అని ఆయన వాపోయాడు. ఈయనే కాదు చాలాచోట్ల రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు. రైతులు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి సగటున రోజుకు 1,500 పశువులు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్, జడ్చర్ల ప్రాంతాల నుంచి నిత్యం వందల కొద్ది పశువులు కబేళాలకు తరలుతున్నాయి. పాలమూరు జిల్లాలో అయితే పశువులకు మేత మాత్రమే కాదు తాగేందుకు నీళ్లూ దొరకడం లేదు. నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ పరిస్థితిని అంచనా వేసిన పశుసంవర్థక శాఖ సబ్సిడీపై గడ్డి విత్తనాలను సరఫరా చేసినా.. నీళ్లు లేక రైతులు ఆసక్తి చూపడంలేదు. -
కన్నీట ముం‘చేను’...
తెలంగాణ రైతును ముంచిన వానలు.. అకాల వర్షాలతో రైతాంగానికి అపార నష్టం వరి, నువ్వులు, మొక్కజొన్న, జొన్న పంటలకు దెబ్బ.. నేలరాలిన మామిడి... పూలు, కూరగాయలకూ నష్టంమరో మూడునాలుగు రోజులపాటు వర్షాలే.. వడగళ్లు, భారీ వర్షాలకు అవకాశముందన్న వాతావరణ శాఖ అకాల వర్షాలతో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా. చేతికొచ్చే సమయానికి వరి పైరు నేలకొరిగింది. మొక్కజొన్న. నువ్వులు, జొన్న, పొద్దు తిరుగుడు, కూరగాయలు, పూలు, పండ్ల తోటలు నాశనమయ్యాయి. మామిడి రైతులకు కన్నీరే మిగిలింది. ఈదురుగాలులు, వడగళ్ల వానలు మరో మూడు నాలుగు రోజులు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొనడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందివచ్చిన జొన్న పంట నాశనమవడంతో ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలానికి చెందిన రైతు రాథోడ్ గంగారాం చేను వద్దే పురుగుమందు తాగి మృతి చెందాడు. కాగా, ఈ రెండు రోజుల్లో పిడుగుపాటుతో ఒకరు, ఇంటి గోడకూలి మరొకరు, కరెంట్ షాక్‌తో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాల్లో అపార నష్టం ఈదురు గాలులు, అకాల వర్షాలు ఊహించని దెబ్బతీశాయి. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో జరిగిన నష్టం విలువ భారీగా ఉంటుంది. మరికొన్ని రోజుల్లో కోతకు రానున్న వరి పంట నేల కొరిగింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వరి పంటకే ఎక్కువ నష్టం వాటిల్లింది. నీటిలో తడవడం వల్ల ధాన్యం రంగు మారుతుందని, పెట్టుబడులు కూడా చేతికి రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక కుంగిపోతున్న అన్నదాతలకు అకాల వర్షాలు తీవ్ర చేటును తెచ్చిపెట్టాయి. చాలా ప్రాంతాల్లో మామిడి నేలరాలింది. మొక్కజొన్న కంకుల్లోకి వర్షం నీరు చేరడంతో అవి రంగుమారే ప్రమాదముంది. ఉడకపెట్టిన తర్వాత ఆరబెడుతున్న తరుణంలో కురిసిన వర్షాలతో పసుపు ఎరుపు రంగులోకి మారే ముప్పు తలెత్తింది. వీటి ధరలు పూర్తిగా పడిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈదురు గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. శని, ఆదివారాల్లో ఆదిలాబాద్ జిల్లాల్లోని లక్ష్మణచాంద, లోకేశ్వరం, కుంటాల మండలాల్లో రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలంలో అత్యధికంగా ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వారాంతం సెలవు దినాలు కావడంతో పంట నష్టంపై వ్యవసాయాధికారులు ఇంకా సమగ్ర అంచనా వేయలేదు. ఐదుగురి మృతి అకాల వర్షంతో పంట దెబ్బతినడంతో ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్కి చెందిన రాథోడ్ గంగారాం(70) ఆది వారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ శివారులోని కొండ ప్రాం తంలో మూడెకరాల్లో జొన్న వేసిన గంగారాం పోడు వ్యవసాయం చేస్తున్నాడు. శనివారం కురిసిన వర్షంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం చేనుకు వెళ్లి మనస్తాపం చెందిన గంగారాం అక్కడే పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మరోవైపు రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం కడుశలమడుగు తండాలో ఆదివారం ఉదయం ఓ మహిళ పిడుగుపాటుతో మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట్ మండలం హజిలాపూర్ తండాకు చెందిన సక్రిబాయి దంపతులు కడుశలమడుగు తండాకు సమీపంలోని తమ పొలంలో ఉండగా పిడుగుపాటుకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఇంటి గోడ కూలడంతో ఇన్నాబాయి(60) మృతి చెందారు. కాగా, వరంగల్ నగర పరిధిలోని కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోట కాలనీలో ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగి భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. కాలనీలో ఉంటున్న అంకతి రమేష్(50), రాజమణి(45) దంపతుల ఇంటి ఆవరణలో బట్టలు ఆరేసుకునే తీగలపై కరెంట్ తీగలు పడటంతో షాక్ తగిలి వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. రాజధానిలో మూడు రోజులుగా వర్షం రాజధాని హైదరాబాద్‌లో మూడు రోజులుగా జల్లులు పడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వరుస వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతున వర్షపు నీరు నిలిచింది. కూకట్పల్లి, గుడిమల్కాపూర్, ఉప్పల్, మోతీనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఫీడర్లు ట్రిప్పవడంతో కొన్ని గంటలపాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వచ్చే 48 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మార్కెట్‌యార్డుల్లో తడిచిన ధాన్యం నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలతో సుమారు రెండు వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. మార్కెట్లకు తీసుకువచ్చిన ధాన్యం నీటిపాలైంది. కట్టంగూరు మండలం అయిటిపాములలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 6 వేల క్వింటాళ్లు, రామన్నపేట మండలంలోని ఐదు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 12 వేల క్వింటాళ్లు, నకిరేకల్ మార్కెట్‌యార్డులో వెయ్యి బస్తాల మేర ధాన్యం తడిచింది. భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో కోతకొచ్చిన పంటలు నేలవాలాయి. సూర్యాపేట, పెన్‌పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల్లో వరి పొలాలు నేలకొరిగాయి. సంస్థాన్ నారాయణపురం మండలంలో 500 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగింది. మునుగోడులో మామిడి, నిమ్మ, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఇక మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కురిసిన వడగళ్లవానకు మామిడి కాయలు నేలరాలాయి. జిల్లావ్యాప్తంగా 24 వేల హెక్టార్లలో మామిడి సాగవగా ఇప్పటివరకు 8 వేల హెక్టార్లలో తోటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. మరో 12 వేల హెక్టార్లలోనూ తోటలకు నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. బలమైన తేమ గాలుల వల్లే రాష్ర్టవ్యాప్తంగా మూడు నాలుగు రోజులపాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశముందని సీనియర్ శాస్త్రవేత్త సీతారాం చెప్పారు. బంగాళాఖాతం నుంచి తీవ్రమైన గాలులు వీస్తున్నందున ఈ ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో అత్యధికంగా 7.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో 7.2, మద్నూరులో 7.1 సెం.మీ. మేర వర్షం పడింది. అల్పపీడన ద్రోణి, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలపైనుంచి వీస్తున్న బలమైన తేమగాలులే అకాల వర్షాలకు కారణమని ఆ శాఖ అధికారులు తెలిపారు. దెబ్బతీసిన ఈదురుగాలులు.. కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో భారీగా పంట, ఆస్తినష్టం వాటిల్లింది. దాదాపు 20 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. వరి, జొన్న పంటలతో పాటు మామిడికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. ఈదురుగాలులకు వేలాది చెట్లు, వందలాది హోర్డింగ్స్ నేలమట్టమయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. జగిత్యాల డివిజన్ పరిధిలో వందలాది గుడిసెలు కూలిపోయాయి. మల్హర్మండలంలో మిర్చి, మొక్కజొన్న, పసుపు పంటలు తడిసిపోయాయి. నువ్వులు, సజ్జ, తదితర పంటలు నేలను తాకాయి. నిజామాబాద్ జిల్లాలో వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. దాదాపు 23 వేల ఎకరాల్లో వరి నేలకొరిగింది. బోధన్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడల్లో వడగళ్ల వాన పడింది. మామిడి, మొక్కజొన్న, పసుపు, సజ్జ, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు వరంగల్ జిల్లాలో పెద్దగా పంట నష్టం లేకపోయినా నగరంలో మాత్రం ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. మిషన్ కాకతీయ పనులకు ఆటంకం ఏర్పడింది. కాగా, వ్యవసాయ శాఖ అధికారుల అంచనాల మేరకు వారం రోజుల్లో కురిసిన వర్షానికి రాష్ర్టంలో 7,317 హెక్టార్లలో ఆహార పంటలు దెబ్బతిన్నాయి. 12,216 హెక్టార్లలో మామిడి, అరటి, బొప్పాయి, కూరగాయ తోటలకు నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా కురిసిన వర్షాలకు కోత దశలో ఉన్న మొక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సారంగాపూర్, నిర్మల్, దిలావర్పూర్, లక్ష్మణచాంద, మామడ, భైంసా, తానూరు, లోకేశ్వరం, కుంటాల మండలాల పరిధిలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చెన్నూరు, జైపూర్, కోటపల్లి తదితర మండలాల్లో మామిడి రైతులకు నష్టం జరిగింది. చేతికందిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన రైతులు అకాలవర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కుంటా, కల్లూరు, లోకేశ్వరంలోని మార్కెట్ కేంద్రాల్లో మొక్కజొన్న తడిసి ముద్దయింది. జిల్లావ్యాప్తంగా సగటున 15.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
మంచి పోషకాల మొక్కజొన్న
పిల్లలకు ఏ చిరుతిండి పెట్టాలా అన్నది అమ్మ ఆలోచన. అన్ని కాలాల్లోనూ విరివిగా దొరికే స్వీట్‌కార్న్‌ను రకరకాల రుచులతో పిల్లల టిఫిన్ బాక్స్‌లలో పెట్టడం లేదా వారికి స్నాక్స్‌గా ఇవ్వడం మంచిది. ఎందుకంటే... స్వీట్‌కార్న్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే మినరల్స్, ఫోలిక్ యాసిడ్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి. స్వీట్‌కార్న్‌లో ఉండే విటమిన్ సి పంటిజబ్బులను దరిచేరనివ్వదు. అలాగే జుట్టు మృదువుగా పెరిగేందుకు దోహదపడుతుంది. స్వీట్‌కార్న్‌తో పోల్చితే మొక్కజొన్న మరికాస్త చవకైనది. ఇది మంచి సీజనల్ ఫుడ్. ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహకరిస్తుంది. మొక్కజొన్నలో ఉండే మెగ్నీషియం, ఐరన్, కాపర్ , కాల్షియం వంటి ధాతువులు పిల్లల్లో కండరాల పెరుగుదలకు, కండరాలు ఫెళుసుబారకుండా ఉండటానికి దోహదపడతాయి. జుట్టుకుదుళ్లు గట్టిగా ఉండేలా చేస్తాయి. -
‘మొక్కజొన్న’ భారం రాష్ట్రానికే
సెంట్రల్‌పూల్ నుంచి తొలగింపు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జరిగే మొక్కజొన్న క్రయవిక్రయాల నుంచి కేంద్రం పూర్తిగా తప్పుకుంది. నిర్ణీత సమయంలోగా మొక్కజొన్న కొనుగోలు ప్రణాళిక అందివ్వకపోవడం, కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల్లో జాప్యం కారణంగా.. ఇప్పటి వరకు కొనుగోలు, అమ్మకం ధరకు మధ్య ఉన్న నష్టాన్ని భరించిన కేంద్రం, ఇకపై రాష్ట్రమే ఆ భారాన్ని భరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ, భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం కొనుగోలు చేసే మొక్కజొన్న సెంట్రల్‌పూల్ కిందకు రాదని, లాభనష్టాలను రాష్ట్రమే భరించాలని స్పష్టం చేసింది. కేంద్ర నిబంధనల మేరకు ఆర్థిక సంవత్సరంలో జరిపే మొక్కజొన్న కొనుగోళ్లపై రాష్ట్రం ముందుగానే కేంద్రానికి తన కార్యాచరణ ప్రణాళికను అందిం చి, దానికి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదం లభించిన పక్షంలో కొనుగోలు జరిపే ధరకు, అమ్మకం చేసే ధరకు మధ్య వ్యత్యాసాలు ఉంటే ఆ భారాన్ని రాష్ట్రంపై మోపకుండా కేంద్రమే భరిస్తుంది. ఎఫ్‌సీఐ విధించే నిర్ణీత సమయంలోగా ఆ విక్రయాలను రాష్ట్ర మార్క్‌ఫెడ్ పూర్తి చేయాలి. లేని పక్షంలో నష్టాన్ని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. 2013-14లో క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.1,300 వరకు చెల్లించి 2.87లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ జరిపారు. అయితే గత ఏడాది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్ నేపథ్యంలో నిల్వలు పేరుకుపోవడంతో లక్ష మెట్రిక్ టన్నులను క్వింటాలుకు రూ.1,050 వరకు ధర తగ్గించి విక్రయించింది. మిగిలిన 1.87లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలో లక్ష మెట్రిక్ టన్నులను టన్నుకు రూ.10,850మేర కొనుగోలు చేసినా రూ.10వేలకే టన్ను చొప్పున విక్రయించింది. ఈ వ్యత్యాస భారం రూ. 10కోట్ల నుంచి రూ.12కోట్ల మేర కేంద్రమే భరించాల్సి వచ్చింది. ఇక ప్రస్తుత ఏడాదిలో సైతం సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న మార్క్‌ఫెడ్ ఇప్పటివరకు 2.8 లక్షల టన్నుల మొక్కజొన్నను రూ.1,310 మద్దతు ధరకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుత ఏడాది కొనుగోలు ప్రణాళికను కేంద్రానికి సమర్పించకపోవడంతో సెంట్రల్ పూల్ నుంచి మొక్కజొన్నను తొలగించారు. -
కొనుగోళ్లు చేయలేం
చేతులెత్తేసిన మార్క్‌ఫెడ్ గజ్వేల్: వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్రంగా నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న మొక్కజొన్న రైతులు... చేతికందిన కొద్దిపాటి దిగుబడులను కూడా అమ్ముకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లు గడువు ముగియనున్నదనీ, ఇప్పటికే చాలావరకు కేంద్రాలు ఎత్తేసినట్లు మార్క్‌ఫెడ్ ప్రకటించినా...ఇంకా ఆయా యార్డుల్లోకి మక్కలు వెల్లువలా వస్తున్నాయి. మరోవైపు కొనుగోలు చేసిన మక్కల బస్తాలు రెండు మూడు రోజులుగా తరలింపునకు నోచుకోకపోవడంతో కొత్తగా వస్తున్న మక్కల కొనుగోళ్లకు అడ్డంకిగా మారాయి. ఈ సమయంలో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలన్న మార్క్‌ఫెడ్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇపుడిపుడే నూర్పిళ్లు జరుగుతున్నందున మరో 15 రోజుల పాటు కొనుగోళ్లు చేపట్టాలని లేకపోతే తాము తీవ్రంగా నష్టపోక తప్పదని చెబుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 2.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. పత్తి తర్వాత ఇది ప్రధాన పంటగా ఆవిర్భవించింది. ఈసారి రైతులు మొక్కజొన్నపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ తీవ్ర వర్షాభావంతో ఈ పంటకు అపార నష్టం వాటిల్లింది. పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు 30 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చేది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎకరాకు రమారమి 8-10 క్వింటాళ్ల చొప్పను దిగుబడి లెక్కేసుకున్నా...జిల్లావ్యాప్తంగా రైతులవద్ద సుమారు 25 లక్షల క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న ఉత్పత్తులు వచ్చే అవకాశముంది. ప్రభుత్వం కొనుగోళ్ల సీజన్ ఆరంభంలో జిల్లాలో 62కిపైగా కొనుగోలు కేంద్రాలను తెరిచింది. ఈ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు ఏ- గ్రేడ్‌కు రూ.1,310, బీ-గ్రేడ్‌కు రూ.1,230, సీ-గ్రేడ్‌కు రూ.1,180 చెల్లిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.1,000కి మించి ధర చెల్లించడంలేదు. పైగా క్వింటాలుకు 2 కిలోలను తరుగు పేరిట కోత విధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తరలిస్తున్నారు. తుపాన్ల కారణంగా గతంతో పోలిస్తే నూర్పిళ్లు ఆలస్యంగా జరిగాయి. అందువల్ల మక్కలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి రావడం ఊపందుకుంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐకేపీ కేంద్రాల ద్వారా కేవలం 4 లక్షల క్వింటాళ్లు మాత్రమే అధికారులు కొనుగోలు చేయగలిగారు. ఈ లెక్కన చూస్తే కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీదు చేసిన మక్కలు పండిన ఉత్పత్తుల్లో 25 శాతం కూడా మించలేదు. చాలా కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత, రవాణా పరమైన ఇబ్బందులతో కొనుగోళ్లు వేగంగా సాగడంలేదు. గజ్వేల్ మార్కెట్ యార్డులోని కేంద్రంలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ యార్డులో కొనుగోలు చేసి తరలించకుండా 800 క్వింటాళ్ల బస్తాలు పేరుకుపోయి ఉండగా, మరో 800 క్వింటాళ్లకుపైగా మక్కలు కొనుగోళ్ల కోసం సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలో మొక్కజొన్న నూర్పిళ్లు చాలా ఆలస్యంగా సాగుతున్నాయి. నేటికీ వేలాది ఎకరాల్లో జూళ్లు కంకులు తీయకుండా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేయడం దారుణమని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
మార్క్‌ఫెడ్‌కు కన్నం
ఖమ్మం వ్యవసాయం: ‘కంచే చేను మేసిన చందం’గా స్టేట్‌వేర్ హౌసింగ్ ముఖ్య అధికారి వ్యవహరించారు. కాపాడాల్సిన ఆయనే అవినీతికి యత్నించి అడ్డంగా దొరికి పోయారు. జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. కొనుగోలు చేసిన వాటిని జిల్లాకేంద్రంలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో మార్క్‌ఫెడ్ 6,251 టన్నులు కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచింది. వాటిని మార్క్‌ఫెడ్ సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు అమ్మకానికి పెట్టి టెండర్లు పిలిచారు. టెండర్ల ద్వారా కొనుగోలు చేసిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత డెలవరీ ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ ఆర్డర్ల ఆధారంగా మొక్కజొన్న కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు గోదాముల నుంచి వాటిని తరలిస్తున్నారు. జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది 6,251 టన్నుల సరుకు కొనుగోలు చేశారు. 6,230 టన్నుల సరుకుకు మార్క్‌ఫెడ్ సంస్థ టెండర్లు పిలిచింది. అంటే 21 టన్నులు మినహా మొత్తం టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అమ్మారు. 6,230 టన్నుల్లో 49 టన్నులు మినహా మిగిలిన మొత్తానికి మార్క్‌ఫెడ్ మేనేజర్ కాంట్రాక్టర్లకు రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారు. అయితే 49 టన్నులకుగాను గోదాముల్లో 9 టన్నులు మాత్రమే ఉన్నాయని స్టేట్‌వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ తనకు సూచించారని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత చెబుతున్నారు. మిగిలిన 40 టన్నుల విషయం అడుగగా కొరత ఏర్పడినట్లు సమాధానం ఇచ్చారన్నారు. అక్రమానికి ఆజ్యం ఇలా... రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఆదివారం 550 మొక్కజొన్నల బస్తాలలోడుతో లారీ బయలుదేరింది. ఆ లారీ ప్రకాశ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు గోదాం వద్దకు చేరింది. అక్కడ దిగుమతి అయ్యే సమయంలో వ్యవహారం బయటపడింది. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారి అక్కడ అన్లోడ్ చేయవద్దని హమాలీలకు సూచించారు. అక్కడ నుంచి లారీని తరలించారు. లారీ కాల్వొడ్డులోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల ప్రాంతానికి చేరింది. ఈ సమాచారం జిల్లా కలెక్టర్ ఇలంబరితికి తెలిసింది. ఆయన రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఖమ్మం అర్బన్ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హుటాహుటిన అక్కడికి వెళ్లి లారీని పట్టుకున్నారు. అదో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన ఏపీ20 ఎక్స్-6336 నంబర్ లారీగా గుర్తించారు. ఈ లారీలో ఉన్న మొక్కజొన్నల విలువ సుమారు రూ.3 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేర్‌హౌసింగ్ అధికారే సూత్రధారి.. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నలకు రక్షణ కల్పించి తిరిగి ఆ సంస్థకు అప్పగించాల్సిన స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారే అక్రమార్గం పట్టించారు. నిల్వ ఉంచిన స్టాక్‌లో సుమారు 40 టన్నులను కొరత పేరుతో లెక్కల్లో చూపించలేదు. వాటిని బయటి వ్యాపారులకు విక్రయించి లక్షల రూపాయలు వెనుకేసుకుందామన్న ఆ అధికారి యత్నం బెడిసికొట్టింది. ఆదివారం సెలవురోజు అని..ఇదే అనుకూల సమయమని చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ వ్యవహారంపై సీరియస్ ఉన్న కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీనితో సంబంధమున్న స్టేట్‌వేర్ హౌసింగ్ అధికారుల్లో వణుకుపుడుతోంది. మార్క్‌ఫెడ్ అధికారులు తమకేమి సంబంధం లేదని చేతులెత్తేశారు. -
గుండె మండి ‘పంట’కు మంట!
పరిగి: రైతు ఉత్పత్తులకు గిట్టుబాటుధరలు కల్పించాలని రైతు కిసాన్‌సంఘ్ రాష్ట్ర కన్వినర్ అందె విజయ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబయ్య అన్నారు. శుక్రవారం రైతు కిసాన్‌సంఘ్ ఆధ్వర్యంలో పరిగి వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి, మొక్కజొన్నలు తగులబెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ మార్కెట్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు రైతుల ఉత్పత్తులకు ధరలు తగ్గుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ఆరోపించారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం నామ్‌కే వాస్తేగా మారిందన్నారు. దళారులకే దన్నుగా నిలుస్తున్నారని తెలిపారు. పత్తికి రూ. 5000, వరికి రూ.1400, మొక్కజొన్నలకు రూ.1310 కి తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని తెలిపారు. దళారుల బారినుండి రైతులను రక్షించాలన్నారు. పరిగి వ్యవసాయ మార్కెట్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవటంలేదన్నారు. అనావృష్టి కారణంగా ఈ సంవత్సరం నియోజకవర్గ రైతులు తీవ్ర నష్టం వచ్చిందని పేర్కొన్నారు. మద్దతు ధరలు పెంచి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మార్కెట్లో రైతులకు తప్పనిసరిగా తక్‌పట్టీలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తక్‌పట్టీలు ఇవ్వని కారణంగా రైతులు బీమా సౌకర్యం కోల్పోతున్నారని తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రం పరిగిలోనే ఏర్పాటు చేయటంతో పాటు తూకాలు కూడా ఇక్కడే నిర్వహించాలని కోరారు...ఈ కార్యక్రమంలో ఆయా రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కనిష్ట పరిహారం రూ.4,500
క్వింటాల్ మొక్కజొన్నకు ఈ ఏడాది రూ.1,310 చెల్లింపు రెండో వారం నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభం పీపీపీ విధానంలో అద్దెకు వ్యవసాయ పనిముట్లు మూడేళ్లలోపు రైతులందరికీ ‘సాయిల్ హెల్త్ కార్డ్’ ప్రకృత్తి విపత్తులతో తగ్గిన పంట ఉత్పాదక లక్ష్యం మంత్రి కృష్ణభైరేగౌడ బెంగళూరు : అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నష్టపోయిన రైతులకు ఈ ఏడాది హెక్టారుకు కనిష్టంగా రూ.4,500 పరిహారంగా (వర్షాధారిత పంటలు) ఇస్తామని రాష్ట్ర వ్యవసాయక శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు. ఉద్యాన పంటలకు సంబంధించి కొన్నింటికి రూ.9 వేలు, మరికొన్ని పంటలకు రూ.12 వేలను కనిష్ట మొత్తాన్ని పరిహారం రూపంలో చెల్లిస్తామన్నారు. వికాస సౌధాలో బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది క్వింటాల్ మొక్కజొన్నకు ప్రభుత్వం రూ.1,310 చెల్లించి కొనుగోలు చేస్తుందన్నారు. ఈ ప్రక్రియను ఈనెల రెండో వారంలో ప్రారంభిస్తామన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీల సమస్యను పరిష్కరించడంలో భాగంగా రైతులకు అవసరమైన పనిముట్లను అద్దెకు ఇచ్చే ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో 186 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల్లో వ్యవసాయ పనిముట్లు ఉంటాయని, అద్దె, పరికరాల ఎంపిక తదితర విషయాల్లో జిల్లా పంచాయితీ సీఈఓ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ నిర్ణయమే అంతిమమని అన్నారు. ఈ కేంద్రాలకు రెండేళ్ల పాటు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని వివరించారు. పంట ఉత్పాదక సామార్థ్యాన్ని పెంచే చర్యల్లో భాగంగా పొలాల్లోని మృత్తికకు (మట్టి రకానికి) అనుగుణంగా పంటలు వేయాల్సి ఉంటుందన్నారు. ఇందు కోసం ప్రతి రైతుకూ సాయిల్ హెల్త్ కార్డ్‌ను అందజేస్తామన్నారు. ప్రైవేటు సంస్థల సహకారంతో మూడేళ్లల్లో పూర్తి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.80 కోట్ల కంటే ఎక్కువగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రు.1,700 కోట్ల నాబార్డ్ నిధులతో దాదాపు పది లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక గోదాములను ఏడాదిన్నరలోపు నిర్మించనున్నామని తెలిపారు. మొదటిదశలో ఐదు లక్షలటన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఏడాదిలోపు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు అనువుగా రూపొందించిన ‘కృషిభాగ్య’ పథకానికి కనిష్టం రెండెకరాల పొలం ఉన్న రైతులు అర్హులని తెలిపారు. వీరు నీటి నిల్వకు అనుగుణంగా పొలంలో గుంతలు తవ్వడం దానిపై పాలిథీన్‌ను పరచడంతోపాటు సాగులో స్ప్రింక్లర్, డ్రిప్‌తోపాటు ‘పాలిహౌస్’ విధానాలు అవలంభిస్తే రూ.2 లక్షల వరకూ ప్రభుత్వం ధనసాయం అందిస్తుందన్నారు. మొత్తం ఖర్చులో ఈ మొత్తం దాదాపు 60 శాతం వరకూ ఉంటుందని మంత్రి వివరించారు. ఈ ఏడాది 135 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం నిర్ణయించుకున్నా రాష్ట్రంలో ఏర్పడిన అతివృష్టి - అనావృష్టి వల్ల 128 లక్షల టన్నులకు పరిమితం కావాల్సి వస్తుందని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. దీని వల్ల రాష్ట్రంలో అమలవుతున్న అన్నభాగ్యతోపాటు ఆహారభద్రత కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బందులు కలగవని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. -
టాన్స్‌కో జులుం..
విద్యుత్ బోరుమోటర్ సర్‌చార్జీ కట్టలేదని మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లిలో మంగళ, బుధవారాల్లో పొలాల వద్ద ఉన్న సుమారు 40 మంది రైతుల స్టార్టర్లను ట్రాన్స్‌కో సిబ్బంది ఎత్తుకెళ్లారు. మక్కలు, వరి ధాన్యాన్ని మార్కెట్లో విక్రయించామని, ఆ డబ్బు రాగానే బకాయిగా ఉన్న సర్‌చార్జీ చెల్లిస్తామని, రెండు రోజులు గడువు ఇవ్వాలని రైతులు కోరినా కరెంటోళ్లు కనికరం చూపలేదు. దీంతో ఆగ్రహించిన పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు పలువురు రాఘవాపూర్ బస్‌స్టేజీ వద్ద రాస్తారోకోకు దిగారు. వీరికి బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు పలువురు మాట్లాడుతూ, బోరుమోటార్లపైనే ఆధారపడి సాగుచేసుకుంటున్న తమపై కక్ష కట్టడం దారుణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సారు రైతుకు ఏ ఇబ్బందీ రానివ్వనని చెప్తుంటే, కరెంటోళ్లు మాత్రం కనికరం లేకుండా కనెక్షన్లు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మిన 72 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పిన అధికారులు, 15 రోజులైనా ఆ పని చేయడం లేదని, మేము మాత్రం సమయానికి కరెంటు బిల్లు కట్టలేదని స్టార్టర్లు తీసుకెళ్లడం ఎంత వరకు న్యాయమన్నారు. వారికో న్యాయం, మాకో న్యాయమా అని ప్రశ్నించారు. ధాన్యం అమ్మినా డబ్బు చేతికందలేదని, రెండు రోజులు గడువు ఇస్తే బకాయి చెల్లిస్తామని చెప్పినా వినకుండా స్టార్టర్లను ఎత్తుకెళ్లారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ పరిస్థితుల్లో బోరుబావుల కింద సాగు చేసిన పంటలు ఎండిపోతాయని వేడుకున్నా.. ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోలేదన్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్, ఏఎస్ఐ వెంకటయ్యలతో పాటు సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. బిల్లులు చెల్లించేందుకు గడువు అడిగినా స్టార్టర్లను లాక్కెళ్లిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూరల్ ఎస్ఐ రాజేంద్రప్రసాద్ రైతులను నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
రబీ సాగుకు అనువైన సమయం
ప్రస్తుతం విద్యుత్ కొరత ఉందని, ఈనేపథ్యం లో వరి సాగు జోలికి వెళ్లకుండా నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో ఆరుతడి పంటలైన వేరు శనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తుకోవచ్చు. నల్లరేగడి నేలల్లో నిల్వ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శనగ పంటను సాగు చేసుకోవచ్చు. వరి మాగాణుల్లో మినుము, మొక్కజొన్న వేసుకోవచ్చు. నవంబర్ 20 నుంచి స్వల్ప కాలిక వరి రకాలను ఎన్నుకుని నారు సిద్ధం చేసుకోవాలి. కానీ ఈ సీజన్లో వరి సాగు తగ్గించడమే మంచిది. ప్రస్తుతం జిల్లా లో సుమారు వెయ్యి హెక్టార్లలోవేరుశనగ, 164 హెక్టార్లలో మొక్కజొన్న, మినుము 500 హెక్టార్లలో సాగు చేశారు. ఇంకా ఈ పంటలకు సాగు సమయం మించి పోలేదు. ఈ పంటల సాగకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి. వేరుశనగ వేరుశనగ నూనె గింజల పంట. ఎంచుకున్న కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజమ్ లేదా మూడు గ్రాముల మాంకోజెబ్‌తో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. వేరు పురుగు ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్, లేదా 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్‌తో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 30 - 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7.5 - 10 సెంటీమీటర్ల తేడాతో విత్తనాన్ని 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లోతులో పడకుండా విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం ఎకరానికి 4-5 టన్నుల మాగిన పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. ఎకరానికి 20 కిలో ల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎ రువులు దుక్కిలో వేయాలి. ఎకరానికి 20కిలోల జింక్‌సల్ఫేట్‌ను ఫాస్పేట్ ఎరువులతో కలవకుండా ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. కలుపు నివారణ విత్తిన మూడురోజుల్లో ఎకరానికి 1.2లీటర్ల పెం డిమిథాలిన్ 200లీటర్ల నీటిలో కలిపి తడి నేల పై పిచికారీ చేసి కలుపును నివారించుకోవాలి. మొక్కజొన్న ఈ పంట సాగుకు నల్లరేగడి నేలలు అనుకూలం. నవంబర్ నెలవరకు మొక్కజొన్నను విత్తుకోవచ్చు. ముందుగా నేలను రెండుసార్లు నాగలితో లోతుగా దున్ని వారం రోజుల తర్వాత కల్టివేటర్‌తో మట్టి గడ్డలు పగులకొట్టి చదును చేయాలి. వాలుకు అడ్డంగా దున్నడం వల్ల నీరు ఇంకుతుంది. ఎకరానికి 8 కిలోల విత్తనాన్ని వేయాలి. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు కాప్టాస్తో విత్తనశుద్ధి చేస్తే తొలిదశలోనే తెగుళ్లు ఆశించకుండా నివారించవచ్చు. విత్తే పద్ధతి బోదెలను తూర్పు, పడమర దిశల్లో తీసుకుని బోదెకు దక్షిణం వైపు నుంచి 3వ వంతు ఎత్తులో విత్తనట్లయితే మొక్కకు సూర్యరశ్మి బాగా తగిలి ఎదుగుదల బాగా ఉంటుంది. ఎరువులు ఎకరానికి 50కిలోల యూరియా, 200కిలోల సూపర్ ఫాస్పేట్, 50కిలోల మ్యూరేట్ ఆఫ్ పొ టాష్ దుక్కిలో వేయాలి. 20కిలోల జింక్‌సల్ఫేట్ ఫాస్పేట్ ఎరువులతో కలపకుండా వేయాలి. ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు కంపోస్టును ఆఖరి దుక్కిలో వేయాలి. నీటి యాజమాన్యం మొక్కజొన్న పైరు బెట్ట, నీటి ముంపు రెండింటినీ తట్టుకోలేదు. పొలంలో నీరు అధికంగా ఉండి నీరు నిల్వ ఉంటే మొలకెత్తదు. మోకాలు ఎత్తు పెరిగే దశ వరకు పైరుకు అధికనీరు హానికరం. కలుపు యాజమాన్యం విత్తిన తర్వాత నేలపై తేమ తగినంత ఉన్నప్పుడు ఆట్పజిన్ 1.2 కిలోలు, 500 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. శనగ రబీ సీజన్లో నవంబర్ వరకు ఈ పంటను వేయవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరిదశలో బెట్టకు గురై అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గుతుంది. ఈ పంటకు నల్లరేగడి నేలలు అనుకూలం. నేలను మెత్తగా దున్ని నీరు నిల్వకుండా చదును చేయాలి. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 4-5 గ్రాములు ట్రైకోడెర్మావిరిడి లేదా 2.5 గ్రాముల థైరామ్ లేదా కార్బాండిజమ్తో విత్తన శుద్ధిచేయాలి. ఎరువులు ఎకరానికి 50 కిలోల డీఏపీ, 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్‌ఫాస్పేట్ వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్‌సల్ఫేట్‌ను కూడా వేయాలి. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు ప్లుక్లోరాలిన్ ఒక లీటరు లేదా పిండిమిథాలిన్ 1-1.3 లీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసి కలుపును నివారించుకోవచ్చు. -
ఈము పక్షుల పెంపకంతో మంచి లాభాలు
‘వ్యవసాయ క్షేత్రాల వద్ద ఈము పక్షుల పెంపకం చేయవచ్చు. వీటితో మంచి లాభాలు పొందవచ్చు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలోని మా బంధువులు వీటిని పెంచడాన్ని చూసి నేను కూడా ఈము పక్షుల పెంపకం చేపట్టాలనుకున్నా. దీంతో గుంటూరు ప్రాంతం నుంచి మూడు నెలల వయసున్న 50 పిల్లలను తెప్పించా’నని వెంకాగౌడ్ తెలిపారు. పెంపకం ఇలా... ఈము పక్షుల ఫాం నిర్వహణకు మొదటగా వ్యవసాయ భూమిని చదను చేసుకోవాలి. 10 ఫీట్ల ఎత్తులో 200ల మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పుతో నెట్ ఫెన్సింగ్(జాలి)ను ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం రూ.60 వేల ఖర్చు వస్తుంది. ఈము పక్షులకు దాణాగా తవుడు, కుసుమలు, సోయా, జొన్న, మక్కజొన్న, ఆముదాలు, బాదం ఆకులు అందించాలి. ప్రతి రోజూ ఒక్కో పక్షికి సుమారు 600 గ్రాముల దాణా అందించాలి. నీటిని బకెట్లలో పోసి ఉంచాలి. ఒక్క పక్షిని పెంచేందుకు రోజుకు రూ.20 చొప్పున వెచ్చించాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నా ఇవి వ్యాధుల బారిన పడవు. ఎండ, చలి, వర్షాన్ని సమర్థవంతంగా తట్టుకుంటాయి. మార్కెటింగ్... ఈము పక్షులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈము పక్షిలోని ప్రతీ భాగం విలువైనది. ఈము పక్షి మాంసం కిలోకు రూ.2వేల వరకు ఉంటుంది. వీటి గోళ్ళు, ఈకలు కిలోకు రూ.12వేల వరకు పలుకుతాయి. కొవ్వును రూ.60వేల వరకు విక్రయించవచ్చు. పక్షి కనుగుడ్లను మార్కెట్ ధర ప్రకారం రూ.1,800 వరకు విక్రయించవచ్చు. -
రబీకి సన్నద్ధం
గజ్వేల్: వర్షాభావం కారణంగా ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతులు ‘రబీ’లోనైనా కోలుకోవాలనే ఆశలతో సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే భూగర్భజలాలు పడిపోయినందువల్ల ‘వరి’కి సాగుకు స్వస్తి పలికి ఆరుతడి పంటలే వేసుకోవాలని వ్యవసాయాశాఖ సూచిస్తున్నారు. ఈ తరుణంలో రైతుల ‘ఆరుతడి’ పంటల సాగుపై దృష్టి సారించారు. రెండురోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలతో రైతులు శనగ, ఇతర ఆరుతడి పంటల సాగును వేగవంతం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. రబీకి ఊతమిచ్చిన వర్షం ఖరీఫ్‌లో నెలకొన్న వర్షాభావం రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. కళ్ల ముందే వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు ఎండుముఖం పట్టడంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ కారణంగా చేలన్నీ న్లై బారాయి. రేగడి భూముల్లోనూ తేమ కరువైంది. మొక్కజొన్న పంట కోసిన తర్వాత అదే భూమిలో రబీలో శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర ఆరుతడి పంటలు వేసుకోవాలంటే తేమ తప్పనిసరి. ఎక్కడా కూడా తేమ లేకపోవడంతో భూములన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్న తరుణంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలు‘రబీ’సాగుకు ఊతమిచ్చాయి. అంచనా తప్పింది! గతేడాది రబీలో జిల్లాలో 1.49 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈసారి 1.52 లక్షల హెక్టార్లలో శనగ, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, ఆముదం, జొన్న, మినుములు, వరి, కూరగాయలు తదితర పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసినప్పటికీ, ఇప్పటి వరకు కేవలం 27 వేల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 626.1 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 399.8 మి.మీలు మాత్రమే నమోదైంది. ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడం వల్ల కరెంట్ సరఫరా చేసినా నీరు పారే పరిస్థితి లేదు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు ‘వరి’కి దూరంగా ఉండాలని రైతులకు సూచిస్తున్నారు. ఫలితంగా వరి సాగు గణనీయంగా పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పడిపోనున్న వరి సాగు విస్తీర్ణం గజ్వేల్ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, తూప్రాన్ మండలాల్లో గతేడాది శనగ పంట 2,083 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 1,700 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 1,117 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 600 హెక్టార్లు, మొక్కజొన్న 233 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 1,000 హెక్టార్లు, ఇతర పంటలు 790 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 509 హెక్టార్లలో సాగయ్యాయి. ఇదిలావుంటే వరి మాత్రం 4,356 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 3,200 హెక్టార్లలో సాగైంది. ఈసారి వ్యవసాయశాఖ పంటలు ఇదే విధంగా సాగులోకి వస్తాయని భావించింది. ప్రధానంగా శనగ పంట 2,700 హెక్టార్లలో సాగులోకి వస్తుందని భావించి 2,000 క్వింటాళ్ల విత్తనం అవసరముంటుందని అంచనా వేసింది. ఇందులో ఇప్పటివరకు 400 క్వింటాళ్ల విత్తనం జిల్లాకు రాగా, వ్యవసాయాధికారులు ఇప్పటివరకు అతికష్టం మీద 300 క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే పంపిణీ చేయగలిగారు. 100 క్వింటాళ్ల విత్తనం కొనుగోలు చేసేవారు లేక వ్యవసాయశాఖ కార్యాలయాల్లో ఉండిపోయింది. వాస్తవానికి ఈపాటికి విత్తనాల పంపిణీ పూర్తయి, విత్తడం కూడా ముగింపు దశకు చేరుకోవాల్సి ఉండగా, అందుకుభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రెండురోజులుగా కురిసిన వర్షంతో శనగ సాగు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘వరి’కి దూరంగా ఉండాలి ఖరీఫ్‌లో ఏర్పడిన వర్షాభావం వల్ల భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి. అందువల్ల ప్రస్తుత రబీలో వరి సాగు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలి. సబ్సీడీ విత్తనాలు వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. -జేడీఏ హుక్యా నాయక్ -
కోళ్ల రైతు కుదేలు
బాన్సువాడ: కోళ్ల పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. భారీగా పెరిగిన మేతల ధరలతో కోడిని పెంచాలంటేనే కష్టంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బాన్సువాడ, ఆర్మూర్, మోర్తాడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలతో పాటు, జిల్లాలోని పలు చోట్ల పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు లక్షకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఏటా పౌల్ట్రీ పరిశ్రమ విస్తరిస్తూనే ఉంది. కాగా. గతేడాది మూడు రూపాయలు ఉన్న గుడ్డు ధర ప్రసు ్తతం నాలుగు రూపాయలకు పెరిగింది. అయినా రైతులకు మాత్రం లాభం చేకూరడం లేదు. గతంలో కంటే ప్రస్తుతం మేత ధరలలో భారీగా వ్యత్యాసం రావడమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. పౌల్ట్రీలో మేతకు ఉపయోగించే సోయా కిలోకు 45 రూపాయలకు పలుకుతోంది. వేరుశనగ కిలోకు 36 రూపాయలు, పొద్దు తిరుగుడు పిండి 29 రూపాయలు, డీఓబీ పది రూపా యలు ఉంది. మేతలో మొక్కజొన్న, నూకలు, సోయా, ఎండు చేప, మీట్ మిల్, డీఓబీవంటి ధాన్యాలు ఎక్కువగా వాడుతారు. కోళ్లకు అవసరమైన విటమన్ బి కాంప్లె క్స్ వంటివి మేతలోనే కలిపి ఇస్తారు. గుడ్లు పెట్టే కోడి రోజుకు 120 నుంచి 130 గ్రాములు వరకు మేత తింటుంది. కోళ్ల అనారోగ్య స్థితిని బట్టి నీటిలో మందులు వాడతారు. ప్రభుత్వం సోయా, మొక్కజొన్నవంటి ధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో వీటి కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని రైతులు ఆరోపి స్తున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి సోయాతోపాటు మొక్కజొన్న వంటి ధాన్యాలు అందుబాటులోకి రావని అంటున్నారు. పౌల్ట్రీ ఫారంలో వెయ్యి కోళ్ళు ఉంటే ఉం టే 800 గుడ్లు ఉత్పత్తి అవుతాయి. హోల్ సెల్ ధరలో గుడ్డు మూడు రూపాయల చొప్పున రూ. 2,400 ఆదాయం వస్తుంది. మేత కోసం వెయ్యి కోళ్లకు 2,200 వెచ్చిస్తే మిగిలేది రూ. 200 మాత్రమే. గుడ్డు పెట్టే కోళ్ల తయారీకి అవసరమైన పిల్లలను పెంచడానికి అవసరమైన పెట్టుబడిని రైతులు అదనంగా భరించాల్సిన పరిస్థితి ఉంది. ఐదు వేల మంది కార్మికుల జీవనాధారం జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమపై సుమారుగా ఐదు వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ధరల పెరుగుదలతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ప్రస్తుత ధరలను బట్టి కూలీల ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు ఇతరేతర ఖర్చులు అదనంగా భరించే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు బ్యాంకు రుణాలు సైతం భరించా ల్సిందే. కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితుల్లో మేతలు ఆడడానికి కూలీలకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. దీని వల్ల ఇద్దరు కూలీలకు 500 రూపాయలు ఇచ్చే పరస్థితి ఏర్పడింది. ఒక పక్క విద్యుత్తు కోత, మరో పక్క మేత ధరలతో పౌల్ట్రీ రంగం కోటుకోలేని నష్టాలను భరించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పౌల్ట్రీ రైతులకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
‘పసుపు’ను కాపాడుకుందాం ఇలా
పసుపులో దుంపలు ఊరే ప్రస్తుత సమయంలో దుంప తొలుచు ఈగ, దుంప కుళ్లు తెగులు ఆశించే అవకాశాలుంటాయి. ఇవి ఆశిస్తే దుంపల్లో నాణ్యతతో పాటు దిగుబడి తగ్గిపోతుంది. ఇవి ఆశించిన తర్వాత నివారణ చర్యలు చేపట్టేదానికన్నా ముందుగానే వేప పిండిని వాడితే ప్రయోజనం ఉంటుంది. ముందస్తు చర్యలు పసుపు మొక్క 40 రోజుల వయసున్నప్పుడు ఒకసారి, 120 రోజులప్పుడు మరొకసారి ఎకరాకు 250-300 క్వింటాళ్ల వేప పిండిని తడిగా ఉన్న నేలపై మొదళ్ల చుట్టూ చల్లాలి. వేప పిండి నేలను అంటుకుంటుంది. తదుపరి ప్రతి నీటి తడిలోనూ వేప ఊట భూమిలోకి దిగుతుంది. ఇది పసుపు పంటకు దుంపకుళ్లు, దుంప పుచ్చు కలుగజేసే క్రిమికీటకాలు మొక్కల దరి చేరకుండా కాపాడుతుంది. ‘ఈగ’ను గమనిస్తే.. దుంపతొలుచు ఈగను పంటలో గమనించినట్లయితే ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను 10 కిలోల ఇసుకలో కలిపి పొలమంతా సమానంగా చల్లాలి. దుంపకుళ్లు తెగులు ఆశించినట్లయితే మడిలోని మురుగు నీటిని తీసేయాలి. తెగులు ఆశించిన మొక్కలు దాని చుట్టు పక్కల ఉండే మొక్కల మొదళ్లు బాగా తడిచేట్లుగా లీటర్ నీటికి 3 గ్రా ముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని పోయాలి. వచ్చే సీజన్‌కోసం.. వచ్చే ఏడాది పసుపు పంట వేసుకోవాలనుకునే రైతాం గం దుంపకుళ్లు తెగులు ఆశించకుండా కొన్ని చర్యలు చేపట్టాలి. వేసిన పొలంలోనే పసుపు వేయకుండా వేరుశనగ, మొక్కజొన్న, జొన్న పంటలతో పంట మార్పిడి చేయడం ఉత్తమం. లీటర్ నీటికి 3 గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ లేదా మాంకోజెబ్, 2 మిల్లీ లీటర్ల మోనోక్రొటోఫాస్ లీటర్ కలిపిన ద్రా వణంలో తెగులు సోకని విత్తనాన్ని 30 -40 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీరు మార్చి లీటరు నీటికి 5 గ్రా ముల ట్రైకోడర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాలు ఉంచి, నీడలో ఆరబెట్టాలి. తర్వాత నాటుకోవాలి. కిలో ట్రైకోడర్మాను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండిలో కలిపి వారం పాటు అనువైన పరిస్థితిలో వద్ధి చేసి, నెలరోజులకు మొదటి తవ్వకం చేశాక నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి. దుంపలు విత్తిన తర్వాత జీలుగ, జనుము, వెంపలి, కానుగ మొదలగు పచ్చి ఆకులు లేదా ఎండు వరి గడ్డి, చెరకు ఆకులను పొలంపై దుంపలు మొలకలు వచ్చేంతవరకు కప్పడం వల్ల తెగుళ్ల ఉధతిని కొంతవరకు తగ్గించవచ్చు. -
రైతన్నకే మద్దతు
శరత్: మీరంతా రైతులేనా? కమీషన్ ఏజెంట్లు కూడా ఉన్నారా? రైతులు: అంతా రైతులమే సార్. శరత్: మీ పేర్లు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? రైతులు: నాపేరు నర్సింహులు సార్... నా పేరు శేషారెడ్డి.. మాది యార్రారం, నా పేరు మానయ్య, మా ఊరు కంసానిపల్లి, నా పేరు జోగిరెడ్డి.. నాది కూడా రాంసానిపల్లి సారు, నా పేరు మాణిక్‌రెడ్డి..కంసానిపల్లి మాజీ సర్పంచ్‌ను సార్....నా పేరు సత్తయ్య, నా పేరు యాదయ్య సార్. శరత్: ఎందుకు దిగులు పడుతున్నారు ? మీకున్న సమస్యలేమిటీ? నర్సింహులు: సార్, మక్కలు గింతమంచిగున్నయ్( మొక్కజొన్నలు చూపిస్తూ) రేటు మాత్రం ఇస్తలేరు శరత్: ఏమైంది... నిబంధనల ప్రకారం ఇవ్వటం లేదా? తూకంలో మోసం చేస్తున్నారా? నర్సింహులు: ఏం పాడైందో.. ఏమో..! సారు, ఏందో గేడింగ్‌లు అంటున్నరు..ఇసువంటి గేడింగులు ఎప్పుడూ లేకుండే. శరత్: గ్రేడింగ్ గురించి మీకు తెలియదా? రైతులు : గ్రేడింగ్‌లు ఎప్పుడూ లేకుండే సార్( ముక్తకంఠంతో) శరత్ : ఏం జోగిరెడ్డి నీకు కూడా తెలియదా? జోగిరెడ్డ్డి: తెల్వదు సార్.. శరత్: చిన్నసైజు గింజలు ఉన్న మక్కలు వరూ కొనటం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. రైతు పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ గ్రేడింగ్ విధానం తెచ్చింది. పెద్ద సైజు గింజలుంటే ‘ఏ’ గ్రేడ్, మధ్యరకం గింజలు ‘బీ’ గ్రేడ్, చిన్న సైజు గింజలు ‘సీ’ గ్రేడ్ గా చేస్తున్నారు. ‘ఏ’గ్రేడ్‌కు రూ.1,310, ‘బీ’ గ్రేడ్‌కు రూ.1,230, సీ గ్రేడ్‌కు రూ.1,180 మద్దతు ధర చెల్లిస్తోంది. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి? మానయ్య: ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలతోనే పండించాం, కానీ పంట సరిగా పండలేదు సారూ శరత్: పంటకు తడి బాగా అందిందా? మానయ్య: వానలు ఎక్కడివి సారు, అప్పుడింత..ఇప్పుడింత కురిసిన జల్లుకు ఈ మాత్రం పండింది. విత్తనాలు కూడా మంచియిగానట్టున్నయి సారు. శరత్ : మీ పేరేమిటి? ఏదో సమస్యల్లో ఉన్నట్లున్నావు? రైతు : నా పేరు మాణిక్‌రెడ్డి సార్, ఇక్కడ హమాలీలకు డబ్బులు మేమే చెల్లించాల్సి వస్తోంది సార్? శరత్: కొనుగోళ్లు సక్రమంగా జరగటం లేదా? నర్సింహులు: వచ్చేటపుడు డబ్బులు తెచ్చుకోలేం కదా సార్? శరత్: ధాన్యంకు సంబంధించి డబ్బులు వచ్చాయా? సత్తయ్య: ఈరోజే వచ్చాయి సారు. శరత్: ధాన్యాన్ని ఇక్కడకు ఎప్పుడు తెచ్చావు. సత్తయ్య: గత నెల 31న కొన్ని, ఈ నెల 2న కొన్ని వడ్లు తెచ్చి కేంద్రంలో కాంటా పెట్టిన. ఇవ్వాళ్ల డబ్బులు వచ్చినాయి. శరత్: హమాలీకి ఎంత డబ్బు ఇచ్చావు. సత్తయ్య: రూ.600 వరకు ఇచ్చిన. శరత్: హమాలీ డబ్బులో సగం భాగం మహిళాగ్రూపు వారు చెల్లించుకోవాలి కదా..! అనంతరం జేసీ పక్కనే ఉన్న రైతు బక్కొళ్ల యాదయ్యతో మాట్లాడారు. శరత్: ఏం యాదయ్య...ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశావు. యాదయ్య: నాలుగు ఎకరాల్లో వేశాను సార్. శరత్: ఈ నాలుగు ఎకరాల్లో గత ఏడాది ఎంత దిగుబడి వచ్చింది. ఈ సారి ఎంత వచ్చింది. యాదయ్య: గత ఏడాది 70 క్వింటాళ్ల వరకు వచ్చాయి. ఈ సారి 25 క్వింటాళ్లే వచ్చినయి సారు. -
పంటమార్పిడితో ప్రయోజనం
నిజామాబాద్ వ్యవసాయం : ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వేస్తూ ఉంటే దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. చాలామంది రైతులు నేటికీ ఒకేరకమై పంటలను పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుంటుందని జేడీఏ నర్సింహా తెలిపారు. రబీలో ఆలస్యంగా సాగుచేస్తున్న రైతులకు ‘పంటమార్పిడి విధానం’పై పలు సూచనలు చేశారు. అవగాహన అవసరం పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే తెగుళ్ల బెడద తగ్గుతుంది. దీనిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఒకరిని చూసి మరొకరు వేసిన పంటేనే వేస్తూ నష్టాలపాలవుతున్నారు. పంట మార్పు మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందుతుంది. దీని వల్ల చీడపీడల బెడద అస్పలుండదు. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. శిలీంధ్ర తెగుళ్లను దూరం చేయవచ్చు. బీజాలు వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి ఎక్కువవుతుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందవు. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. రైతులు గమనించాల్సినవి భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వు, వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. జాగ్రత్తలు పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో శనగ, బబ్బెర, మినుము, ఉలువలు, పెసర పంటలను వేయడం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని వల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు. పత్తి పైరు సాగు చేసిన నేలలో మినుము, పెసర వంటి పం టలతో మార్పు చేయడం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గించవచ్చు. వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు వంటి ఆరుతడి పంటలను పండించాలి. దీని వల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని నివారించవచ్చు. పసుపు తర్వాత వరి, జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి. దీని వల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. వరి పైరు తర్వాత పప్పు ధాన్యాల పంటలు గానీ నూనె గింజల పైర్లనుగాని పండించడం వల్ల వరి పంటను ఆశించే టంగ్రో వైరస్, దోమ పోటులను సమర్ధంగా నివారించవచ్చు. పెసర గాని పశుగ్రాసంగా జొన్నగాని సాగు చేస్తే తర్వాత వేరుశనగ పంటలు వేసుకోవాలి. సూచనలు జొన్న సాగు తర్వాత మళ్లీ అదే పంట వేయొద్దు. దీని వల్ల ఎర్ర గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు ఆశించవచ్చు. వేరుశనగ తర్వాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో వంగ, బెండ, టమాట, మినుము, పెసర పంటలు వస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి. -
హడావుడే!
మొక్కజొన్న రైతు ఆశలను ప్రభుత్వం బజారుకీడ్చింది. గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకొచ్చినా.. అంతలోనే నీళ్లు చల్లింది. ఆదేశాలు జారీ చేయకనే.. కేంద్రాలకు పచ్చజెండా ఊపేసింది. మూడు రోజులు గడిచినా.. కొనుగోళ్లు లేకపోవడంతో వ్యయప్రయాసలకోర్చి దిగు బడులు తీసుకొచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గిట్టుబాటు కాదని టెండర్‌దారు చేతులెత్తేయగా.. ఆదేశాలు లేవని అధికారులు మిన్నకుండిపోగా.. గోనె సంచులు కూడా లేవని కొనుగోళ్లకు సున్నా చుట్టడం అన్నదాతను కలవరపరుస్తోంది. నందికొట్కూరు: మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించామనే ప్రకటనతో ప్రభుత్వం హడావుడి చేసింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా గత బుధవారం కొనుగోలు కేంద్రాలను సైతం ప్రారంభింపజేశారు. ఇంకేముంది.. దిగుబడులను విక్రయించి సొమ్ము చేసుకోవచ్చనే ఉద్దేశంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు పరుగుపెట్టారు. మార్కెట్‌యార్డుకు దిగుబడులను తరలించారు. అయితే అధికారులేమో తమకు ఆదేశాలు రాలేదంటూ చేతులెత్తేశారు. ఫలితంగా రెండు రోజుల నుంచి మార్కెట్లో దిగుబడులకు కాపలాగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం. చలికి వణుకుతూ.. ఈ రోజు, రేపు అంటూ ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో టెండర్‌దారుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయలేమని తెగేసి చెప్పడంతో రైతులతో పాటు అధికారులు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఎం.లింగాపురం, పట్టణంలోని మార్కెట్‌యార్డులో ఈనెల 5న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడుల కొనుగోలు లక్ష్యంగా ఎంచుకున్నట్లు ప్రకటించారు. మాటలు చెప్పడం బాగానే ఉన్నా.. కొనుగోళ్లు ప్రారంభించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అసలు విషయం తెలియని రైతులు గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో దిగుబడులతో కొనుగోలు కేంద్రాలకు చేరుకుంటూ వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు అడంగల్ తీసుకుని రావాలని చెప్పడంతో.. ఆ పత్రం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ దిగుబడులు కొనుగోలు చేయకపోవడంతో ఈ ప్రభుత్వం తీరింతేనంటూ నిట్టూరుస్తున్నారు. ట్రాక్టర్లలో మార్కెట్‌కు దిగుబడులను తరలించేందుకు దాదాపు రూ.2వేలు ఖర్చవుతోంది. తిరిగి ఇంటికి తీసుకెళ్లాలంటే మరో రూ.2వేలు చెల్లించాల్సిందే. నాయకులు, అధికారులను నమ్ముకున్నందుకు తగిన శాస్తే జరిగిందంటూ రైతులు తమ దయనీయ స్థితికి కన్నీరు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం కానీ.. హడావుడి చేసిన అధికారులు కానీ మూడు రోజులుగా ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం. ఈళ్లని నమ్ముకుంటే ఇంతే... ఉప ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని తెలిసి సంతోషపడ్డాం. ఎంతో ఆశతో మొక్కజొన్నను విక్రయానికి తీసుకొస్తే అధికారులు ఇంకా ఆదేశాలు రాలేదంటున్నారు. అట్లాంటప్పుడు ఎందుకు ప్రారంభించినట్లు. ఈళ్లని నమ్ముకుంటే ఇంతే. మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడానికి కాకపోతే.. ఇదంతా ఎందుకు. - సయ్యద్ బాషా, మల్యాల ఎకసెక్కాలాడుతాండ్రు పంట పండించనీక నానా కస్టాలు పడినాం. ఎక్కడపడితే అక్కడ అప్పులు పెరుక్కొచ్చినం. అంతంత మాత్రం పంటే వచ్చింది. అమ్ముకుందామంటే ధర లేకపాయ. ప్రభుత్వం మేలు సేస్తాదనుకుంటే ఎకసెక్కాలాడుతాంది. మోడమైతుంటే వానొస్తాదేమోనని భయమేత్తాంది. ఇప్పటికైన ఎప్పుడు కొంటారో సెప్తే బాగుంటాది. - ప్రభాకర్‌రెడ్డి, నందికొట్కూరు అనుమతులు రాలేదు మొక్కజొన్న కొనుగోలుకు అనుమతులు రావాల్సి ఉంది. కొనుగోలు టెండరుదారుడు గిట్టుబాటు కాదని వెనక్కి వెళ్లినట్లు సమాచారం. ట్రాన్స్పోర్టర్లు కూడా ముందుకు రాలేదు. అనుమతులు వచ్చే వరకు ఏమీ చేయలేం. రైతులు ఒత్తిడి చేస్తున్నారు. విషయాన్ని జిల్లా కలెక్టర్, జేసీ దృష్టికి తీసుకెళ్లాం. - నబీ సాహెబ్, డీసీఎంఎస్ మేనేజర్ -
సాగు తీరు మారాలిక
నిజామాబాద్ వ్యవసాయం : ఆరు తడి పంటలు సాగు చేయుడం వల్ల అధిక విస్తీర్ణాన్ని సాగు చేయగలగటమే కాక ఎక్కువ లాభాన్ని కూడా పొందవచ్చు. రబీ కాలంలో వరికి బదులు గా ఆరుతడి పైర్లు సాగు వల్ల కలిగే ప్రయోజనాలు... వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమయ్యే నీరు, విద్యుత్ శక్తి, పెట్టుబడులు తక్కువ. ఒక ఎకరం వరి సాగుకు కావాల్సిన నీటితో కనీసం 2-8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పైర్లను సాగు చేయవచ్చు. ఆరుతడి పైర్లు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పుదినుసులు, నూనె గింజల కొరత తగ్గుతుంది. పంట మార్పిడి వల్ల పైర్లను ఆశించే చీడపీడలు, తెగుళ్లు తగ్గుతాయి. పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల భూసారం వృద్ధి చెందుతుంది. {పస్తుతం మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం పంటలను వరి కోసిన తర్వాత దుక్కి చేయకుండా ‘‘జీరోటిల్లేజి’’ విధానం ద్వారా విత్తే పద్ధతి వచ్చింది. వరి కోసిన తర్వాత దుబ్బులు మళ్లీ చిగురించకుండా ఉండేందుకు, అప్పటికే మొలచి ఉన్న కలుపును నివారించేందుకు ‘‘పారాక్వాట్’’ అనే కలుపు నివారణ మందును పిచికారి చేయాలి. లీటరు నీటికి 8 మి.లీ.ల కలుపు మందును(పారాక్వాట్) వరి దుబ్బులు, కలుపు మొక్కలు బాగా తడిసేలా పిచికారి చేయాలి. పారాక్వాట్ మందు వాడిన తర్వాత వెంటనే విత్తనాలు వేసుకోవచ్చు. భూమిలో సరైన తేమ ఉన్నట్లయితే వెంటనే విత్తుకోవాలి. లేదా పలుచని తడి ఇచ్చి విత్తుకోవాలి. లేదా విత్తే యంత్రాల సహాయంతో విత్తుకోవాలి. అవసరాన్ని బట్టి కలుపు నివారణ మందులను వాడాలి. మొక్కజొన్నలో అయితే అట్రజిన్ (లీటరు నీటికి 4-5 గ్రాములు) పొద్దుతిరుగుడు, శనగ, ఆముదం అయితే పెండిమిథాలిన్ (లీటరు నీటికి 5-6 మి.లీ.) కలుపు నివారణ మందులను విత్తిన 1-2 రోజులలోపు పిచికారి చేయాలి. రబీ కాలంలో వివిధ పంటలకు కావాల్సిన నీటి పరిమాణం, నీరు పెట్టడానికి ఖర్చయ్యే విద్యుత్చ్చక్తి యూనిట్లు, ఎకరం వరికి ఇచ్చే నీటితో సాగు చేయగలిగే ఆరుతడి పంటల విస్తీర్ణం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త వివరించారు. -
మక్క సాగు భలే బాగు
బయ్యారం: వరికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో సాగవుతున్న ప్రధాన పంటల్లో మొక్కజొన్న మొదటిది. రబీలో ఆరుతడి పంటలు సేద్యం చేయాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో మొక్కజొన్న యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం... అనువైన నేలలు: మొక్కజొన్న సాగుకు సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి, ఎర్ర, ఒండ్రు మట్టి ఉన్న ఇసుక, గరపనేలలు అనుకూలం. దుక్కి తయారీ: నాగలితో నాలుగు సార్లు దుక్కి దున్నాలి. చివరి దుక్కిలో మాగిన పశువుల ఎరువు కాని కంపోస్టు ఎరువు కాని వేసి దున్నాలి. ఆ తరువాత విత్తనాలను బోదె పద్ధతి, నాగలి సాళ్ళలో తగినంత తేమను చూసుకొని విత్తాలి. విత్తే కాలం: రబీ మొక్కజొన్నను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తాలి. విత్తన మోతాదు: ఎకరానికి ఏడు కిలోల విత్తనాలను విత్తుకోవాలి. ఎకరం విస్తీర్ణంలో 33 వేల మొక్కలు ఉండేలా జాగ్రత్త పడాలి. సాళ్ళ మధ్య 75 సెం.మీ, సాళ్ళలో మొక్కల మధ్య 20 సెం.మీ ఎడం ఉండేలా, బోదెకు ఒకవైపున 2 లేదా 3 సెం.మీ లోతులో విత్తాలి. పాదుకు 2 లేదా 3 మొక్కలను నాటాలి. విత్తనాలు మొలకెత్తిన తరువాత పాదుకు ఒక మొక్కను మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసివేయాలి. విత్తనశుద్ధి: కిలో విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ మందును 5 గ్రాముల చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి. అంతరపంటలు: మొక్కజొన్నలో అంతరపంటగా కంది, అలసంద, పెసర, సోయాచిక్కుడు వంటి అపరాల పంటలను వేసుకోవచ్చు. 4 లేక 5 సాళ్లు మొక్కజొన్న వేసి ఆ తర్వాత ఒక సాలు పప్పుపంట వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొక్కజొన్నకు సహజ శత్రువులైన పరాన్నజీవులు, పరాన్నభుక్తుల సంఖ్యను పెంచుకోవటమే గాక అధిక దిగుబడి, అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. కూరగాయ పంటలు ముల్లంగి, ఆకుకూరలను వేసుకొని కూడా అధికాదాయం పొందవచ్చు. ఎరువులు మొక్కజొన్న సాగుకు రెండు కట్టల యూరియా, కట్టన్నర డీఏపీ, కట్ట పొటాష్ అవసరం. డీఏపీతో పాటు కట్ట పొటాష్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. యూరియాను నాలుగు దఫాలుగా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు చల్లుకోవాలి. భూమిలో జింకు లోపముంటే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ఏ ఎరువులో కలపకుండా విడిగా వేయాలి. కలుపునివారణ: మొక్కజొన్నలో అధిక దిగుబడి సాధించాలంటే విత్తిన 45-50 రోజుల వ్యవధిలో కలుపు మొక్కలు లేకుండా తొలగించాలి. విత్తనాలు విత్తిన మూడు రోజుల వ్యవధిలో భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి కిలో అట్రాజిన్ మందును 500 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. అంతరకృషి: విత్తిన 30రోజులకోసారి, 45- 50 రోజులకు మరో సారి గొర్రుతో గాని, నాగలితో గాని సాళ్ళ మధ్య దున్నాలి. ఈ విధంగా దున్నటం వల్ల కలుపును నివారించటంతో పాటు మొక్కలకు తేమ, గాలి సక్రమంగా అందుతుంది. పంట ఏపుగా పెరుగుతుంది. తడులు: పంట మొలకెత్తిన నెలరోజుల వరకు (పంట మోకాలు ఎత్తుకు వచ్చేంత వరకు) అవసరాన్ని బట్టి, భూమి స్వభావాన్ని బట్టి నీటితడులు ఇవ్వాలి. ఈ దశలో నీటితేమ అధికంగా ఉంటే పంట ఎదుగుల తగ్గే అవకాశం ఉంది. సస్యరక్షణ చర్యలు మొక్కజొన్నలో అశించే పలు రకాల పురుగులు, తెగుళ్ళను రైతులు సరైన సమయంలో గుర్తించి, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కాండంతొలిచే పురుగు: మొక్కజొన్న మొలకెత్తిన 10 నుంచి 20 రోజుల లోపు పైరును ఇది ఆశించి ఆకుల అడుగుభాగంలో గుడ్లను సముదాయంగా పెడుతుంది. ఈ గుడ్లలో ఉన్న పురుగులు 5 రోజుల వ్యవధిలో బయటకు వస్తాయి. మొక్కజొన్న అంకురంలోకి చేరి ఎదిగే అంకురాన్ని తింటాయి. ఈ పురుగుల వల్ల మొవ్వు చనిపోయి పంటకు నష్టం వాటిల్లుతుంది. దీని నివారణకు ఎకరానికి 3 కేజీల కార్బోప్యూరాన్ 3జీ గుళికలు ఆకు సుడులలో వేయాలి. లేదా లీటర్ నీటిలో 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 0.3 మి.లీ కొరోజాన్ మందును పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు: నెలరోజులు పైబడిన పంటను మొక్కజొన్న నల్లి, పేనుబంక ఆశిస్తాయి. వీటి తల్లిపురుగులు, పిల్లపురుగులు పంటలో ఎదిగే భాగాల నుంచి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పసుపురంగుకు మారి గిడసబారుతాయి. ఈ పురుగు నివారణకు 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 1 గ్రా ఎఫిసేట్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుమాడు తెగులు: అకుమాడు తెగులు నివారణకు 2.5 గ్రాముల మాంకోజెబ్ మందును లీటర్ నీటిలో కలిపి వారానికి ఒకసారి చొప్పున మూడు పర్యాయాలు పిచికారీ చేయాలి. మొక్క ఎండు తెగులు: ఈ తెగులు నివారణకు 1 మి.లీ ప్రాఫికొనజోల్ మందును లీటర్‌నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
మక్క పంచాయితీ మొదటికే!
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ సింగిల్‌విండోలో కొనుగోలుచేసిన మొక్కజొన్న పంచాయితీ మొదటికే వచ్చింది. నాణ్యత పేరుతో జడ్చర్ల గోదాంలో తిరస్కరించిన సుమారు 9వేల బస్తాల మొక్కజొన్న కొనుగోలు వివాదం ఓ కొలిక్కిరాలేదు. తాము అమ్మిన మక్కను తిరిగి తీసుకునేది లేదని రైతులు, నాణ్యత లేని మొక్కజొన్న తీసుకోబోమని మార్క్‌ఫెడ్ డీఎం తేల్చిచెప్పడంతో పీఠముడి వీడటం లేదు. ఈ వివాదాలతో తమకు సంబంధం లేదని.. లారీలను అన్లోడ్ చేయకపోతే ఆందోళన చేస్తామని మంగళవారం ట్రాన్స్‌పోర్టు యజమానులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సింగిల్‌విండో చైర్మన్, వ్యాపార సంఘ నేతలను మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు పిలిచి చర్చలు జరిపారు. ఏం జరిగిందంటే.. కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆర్డీఓ వీరారెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 21 స్థానిక మార్కెట్లో రైతుల నుంచి సుమారు రూ.60లక్షల విలువైన 16వేల బస్తాల మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వాటిని మరుసటిరోజు జడ్చర్లలోని మార్క్‌ఫెడ్ గోదాంకు పంపించారు. ఇందులో 9వేల(నాలుగు లారీల లోడ్) బస్తాల ధాన్యం నాణ్యవంతంగా లేదని అధికారులు తిరస్కరించారు. కాగా, ఈ మొక్కజొన్నను నాటకీయ పరిణామాల మధ్య నాగర్‌కర్నూల్ మార్కెట్ షెడ్డుకు చేర్చారు. మక్కలను ఆరబెట్టి తిరిగి పంపించాలన్న మార్క్‌ఫెడ్ అధికారుల సూచనతో రైతులను పిలిచి వారికి అప్పగించాలని సింగిల్‌విండో పాలకవర్గం భావించింది. ఇందుకు రాబోమని రైతులు తెగేసి చెప్పడం, ఒకవేళ వారొస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న భావనతో వ్యాపారుల సమక్షంలో షెడ్డులోనే నిల్వచేయాలని నిర్ణయించారు. అన్లోడింగ్ ఆపాలని, ఈ విషయమై ఎమ్మెల్యే సీఎంతో మాట్లాడుతున్నారని ఆయన అనుచరులు కొందరు సింగిల్‌విండో చైర్మన్‌ను సూచించడంతో ఆ ప్రయత్నం విరమించారు. దీంతో మొక్కజొన్న ధాన్యం తిరిగి మార్క్‌ఫెడ్ గోదాంకు చేరుతుందని, సమస్య కొలిక్కి వచ్చినట్లేనని అంతా భావించారు. మంత్రి హరీష్‌రావు గోదాం డీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరించారని ఆర్డీఓ వీరారెడ్డి సింగిల్‌విండో చైర్మన్‌కు ఫోన్‌చేసి చెప్పారు. అయితే డీఎం ఫోన్‌చేసి ఎప్పటిలాగే మొక్కజొన్నను తిరిగి ఆరబెట్టి శుభ్రం చేసి పంపించాలని, అంతవరకు నాగర్‌కర్నూల్ మార్కెట్లోనే నిల్వ చేసుకోమ్మని తేల్చిచెప్పడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. సీఈఓకు మెమో జారీ 21న రాత్రి కొనుగోలు చేసిన మొక్కజొన్న వివాదానికి సంబంధించి ప్రాథమిక సహకార పరపతి సంఘం (సింగిల్‌విండో) సీఈఓ, క్యాషియర్లకు సింగిల్‌విండో చైర్మన్ వెంకట్రాములు మెమో జారీచేశారు. నిబంధనల మేరకు ఒకసారి టెండర్ వేసిన తర్వాత తిరిగి రాత్రివేళ సంఘం అనుమతి లేకుండా టెండర్లు వేసి నాణ్యత లేని మొక్కజొన్న కొనుగోలుచేసి నష్టం కలిగించే విధంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా.. జిల్లా కోఆపరేటివ్ అధికారికి లేఖరాశారు. కేసుపెడితే కోర్టులో తేల్చుకుంటాం వారం రోజులుగా మక్కల లోడ్‌తో లారీలు నిలపడం వల్ల లారీల టైర్లు పాడవుతున్నాయని, వ్యాపారులు, సింగిల్‌విండో, మార్క్‌ఫెడ్ వారెవ్వరూ అన్లోడ్ చేసుకోకపోతే తామే అమ్ముకుంటామని, కేసు పెడితే కోర్టులోనే తేల్చుకుంటామని లారీ ఓనర్ల సంఘం కార్యదర్శి ఎండీ. ఖలీలుర్ రష్మన్, ఉపాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి హెచ్చరించారు. నెలాఖరులోగా తాము వాహనాల ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉందని, ఫెనాల్టీ పడితే ఎవరు భరించాలంటూ ప్రశ్నించారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఐ రాజేశ్వర్‌గౌడ్ సూచన మేరకు వ్యాపారులు లారీ అద్దె చెల్లించేందుకు అంగీకరించడంతో ఓనర్లు అన్లోడ్ చేసేందుకు అంగీకరించారు. -
కొనెటోళ్లేరి..?
ముఖం చాటేసిన ఐకేపీ, సీసీఐ, నాఫెడ్, మార్క్‌ఫెడ్ సాక్షి, మహబూబ్‌నగర్: సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఎరువుల కొరత.. ఆ తరువాత తెగుళ్ల బెడద.. తీరా చేతికొచ్చాక పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కొద్దోగొప్పో దక్కిన పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నదాతకు మద్దతుధరలు కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వరంగ సంస్థలు ముందుకురావడం లేదు. మొక్కజొన్న, వరి, పత్తి పంట దిగుబడులు చేతికొస్తున్నా తరుణంలో జిల్లాలో ఐకేపీ, సీసీఐ, నాఫెడ్ కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. దీంతో రైతన్నలు దళారులను ఆశ్రయించి నిలువునా మోసపోతున్నారు. రైతులు పండించిన పంటను సరైన గిట్టుబాటు అందిస్తామని, పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. అంతేకాదు రైతులెవరూ దళారుల వద్దకెళ్లి మోసపోవద్దంటూ ప్రకటించినా ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో వ్యాపార కేంద్రంగా ఉన్న బాదేపల్లి వ్యవసాయమార్కెట్ యార్డుకు మొక్కజొన్న రోజుకు సగటున 10వేల క్వింటాళ్లు, ఈ సీజన్లో ఇప్పటివరకు 70వేల క్వింటాళ్లు విక్రయానికి వచ్చింది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో కేవలం తొమ్మిది కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4,458 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం దాదాపు 49వేల క్వింటాళ్లు సేకరించాల్సి ఉండగా.. అందులో పదోవంతు కూడా సేకరించలేకపోయారు. ఐకేపీ కేంద్రాల ద్వారా జిల్లాలో 27కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. దీంతో సర్కారు వైఫల్యాన్ని ఆసరా చేసుకున్న దళారులు మొక్కజొన్న రైతన్నను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.1310 మద్దతు ధర ప్రకటించినా ఆ ధర దక్కడంలేదు. కేవలం రూ.900 నుంచి రూ.1000 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. జిల్లాలో వరిధాన్యం చేతికొస్తుంది. గతేడాది పెబ్బేరు, గద్వాల ప్రాంతాల్లో ఐకేపీ, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుచేసినా ఇప్పటివరకు ఆ ఏర్పాట్లు జరగలేదు. సోమవారం జడ్చర్ల మార్కెట్ యార్డుకు రెండువేల బస్తాల వరిధాన్యం విక్రయానికి వచ్చింది. సోనామసూరి క్వింటాలుకు రూ.1,785, హంస రకానికి రూ.1,580 ధర పలికింది. ఇదిలా ఉండగా, జిల్లాలో చాలాచోట్ల రైతులు వడ్లను విక్రయానికి కల్లాల్లోనే ఉంచారు. వరుణుడు ఆగ్రహిస్తే మరింత నష్టపోవాల్సి వస్తుంది. ‘తెల్ల'బోయిన బంగారం తెల్ల బంగారంగా పేరొందిన పత్తి పరిస్థితి జిల్లాలో ఈ సారి పూర్తి నిరాశాజనకంగా మారింది. వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. దీనికితోడు ఇప్పటివరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాల జాడేలేదు. ఏటా మద్దతు ధరకు కొనుగోలు చేసే సీసీఐ ఈసారి ఇప్పటివరకు జాడేలేదు. జిల్లాలో తొమ్మిది చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌శాఖ అధికారులు సీసీఐకి లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన లేదు. గతేడాది జిల్లాలో ఎక్కడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈసారైన సీసీఐ కొనుగోలు చేపడితే మద్దతుధర అయిన లభిస్తుందేమోనని ఆశపడుతున్నారు. ఈ ఏడాది 4,31,966 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని సీసీఐ లక్ష్యం కాగా, సీజన్ ప్రారంభమై పత్తి మార్కెట్‌కు వస్తోన్న కొనుగోలుచేసే నాధుడే కరువయ్యాడు. పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.4050 అందాల్సి ఉండగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు మాత్రం కేవలం రూ.3,200 మాత్రమే ఇస్తున్నారు. పత్తికి మార్కెటింగ్ లేకపోవడంతో గ్రామాల్లోనే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీరు కేవలం క్వింటాలుకు రూ.3,200 మాత్రమే ఇస్తున్నారు. అంతేగాక తూకం విషయంలో కూడా నిలువుగా ప్రైవేట్ వ్యాపారులు దోచుకుంటున్నారు. దీంతో పత్తిరైతు కూడా దగాకు గురై, దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరిస్థితుల్లో ఇప్పటివరకు జిల్లాలో 15మంది పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మొక్కజొన్న పరిస్థితి 2013 2014 కొనాల్సిన కేంద్రాలు 06 36 ఏర్పాటు చేసింది 06 09 కొనాల్సిన లక్ష్యం 00 00 కొన్నది (క్వింటాళ్లలో) 5,73,832 4,458 పత్తి పరిస్థితి 2013 2014 కొనాల్సిన కేంద్రాలు 09 09 ఏర్పాటు చేసింది 00 00 కొనాల్సిన లక్ష్యం 3,80,000 4,31,966 కొన్నది (క్వింటాళ్లలో) 00 00 -
72 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు
మెదక్ మున్సిపాలిటీ: వరి, మొక్కజొన్న కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని జాయింట్ కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్లో వరి, మొక్కజొన్న కేంద్రాల కొనుగోలు విషయమై పాయింట్ వర్కర్స్, ఏపీఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ శరత్ మాట్లాడుతూ రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోనే సంబంధిత రైతుల బిల్లులు డీఆర్డీఏ కార్యాలయానికి చేరాలని సూచించారు. ఆవిధంగా చర్యలు తీసుకున్నప్పుడే 72గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. బిల్లులు సకాలంలో పంపించడంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్య వైఖరి అవలంబించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కసారిగా ధాన్యం పేరుకుపోకుండా ముందస్తుగానే కేంద్రాలను ప్రారంభించాలన్నారు. వరి కామన్ రకాన్ని క్వింటాల్‌కు రూ.1360, గ్రేడ్ ఏ రాకానికి రూ. 1400, మొక్కజొన్నకు రూ. 1310లు మద్ధతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏ కొనుగోలు కేంద్రాల్లోను ఈ ధర కంటే తక్కువగా చెల్లిస్తే వారి పై కేసులు నమోదు చేయాలని సూచించారు. ధాన్యంలో తేమ 15 శాతం, రంగు మారిన ధాన్యం 5 శాతం, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం, చెత్త, మట్టి పెడ్డలు 1శాతం కంటే ఎక్కువగా ఉండకూడదన్నారు. ధాన్యం కొనుగోలులో కనీస ప్రమాణాలను పాటించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తరువాత రైతుల వద్ద నుంచి సరైన బ్యాంకు ఖాతా నంబరును తీసుకోవాలని, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే కనీసం అందులో రూ.500 ఉండేలా చూడాలని రైతులకు సూచించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఏసురత్నం, డీఎం మార్క్‌ఫెడ్ నాగమల్లిక, డీఎం సివిల్ సప్లయీస్ జయరాం, ఏపీడీ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ విజయలక్ష్మి, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, ఎరియా కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్నపై సూర్యప్రతాపం
సూర్యప్రతాపంతో మొక్కజొన్న ఎండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలు ఈ పంట రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గింజపోసుకునే దశలో పంట ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బెట్ట పరిస్థితుల వల్లే పంట ఎండిపోతోందని చెబుతున్న వ్యవసాయ అధికారులు తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఎక్కువగా గిరిజన రైతులే నష్టపోతున్నారు. రుణమాఫీ నేపథ్యంలో కనీసం బీమా సౌకర్యానికీ నోచుకోక వారంతా డీలా పడుతున్నారు. ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో మొక్కజొన్న రైతుకు కష్టకాలం దాపురించింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతుండటంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. బట్టతడుపు జల్లైనా కురిస్తే పంట చేతికొస్తుందన్న ఆశతో చూస్తున్నాడు. గింజపోసుకునే దశలో పంట ఎండిపోతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితి కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో మొక్కజొన్న సాగు మేలని రైతులు దీనివైపు మొగ్గుచూపారు. జిల్లాలో మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 36 వేల ఎకరాలు కానీ ఈ ఏడాది దాదాపు 45 వేల ఎకరాల్లో (పోడు భూముల్లో సాగుతో కలుపుకొని) దీన్ని సాగు చేశారు. జిల్లాలోని ఇల్లెందు, బయ్యారం, గుండాల, టేకులపల్లి, కారేపల్లి, కామేపల్లి, గార్ల, పాల్వంచ, ముల్కలపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు, మధిర, చింతకాని, బోనకల్లు, ముదిగొండ, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లో ఈ పంటను ఎక్కువగా సేద్యం చేస్తున్నారు. చెదురుమదురుగా కురిసిన వర్షాలకు జూలై నెలలో ఈ పంటను వేశారు. 90-110 రోజుల కాల పరిమితి కలిగిన మొక్కజొన్న హైబ్రిడ్ రకాలను ఎక్కువ మంది రైతులు సేద్యం చేశారు. జూలై, ఆగస్టు చివరి వారాలు, సెప్టెంబర్ మొదటి వారాల్లో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు మొక్కజొన్న ఆశాజనకంగా ఉంది. ఆ తర్వాత దాదాపుగా నెల రోజుల నుంచి చినుకు రాలలేదు. మొక్కజొన్న పాల కంకి దశ, గింజపోసుకునే దశలో ఉంది. ఈ తరుణంలో వర్షాలు లేకపోవటం, దీనికి తోడు ఉష్ణోగ్రతలు పెరగటంతో మొక్కజొన్న పైర్లు ఎండిపోతున్నాయి. గింజపోసుకునే దశలో వాడుముఖం వర్షాలు కురవకపోవడం, అధిక ఉష్ణోగ్రతలతో గింజపోసుకునే దశలో పంట ఎండిపోతోంది. ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, గుండాల, బయ్యారంలో మొక్కజొన్నను పోడు భూముల్లో కూడా సాగుచేయడంతో పంట ఎండిపోతోంది. ప్రస్తుతం పంట పాలకంకి దశలో ఉంది. ఈ దశలో నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో పంట ఎండిపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఏజెన్సీ రైతుకు దెబ్బ.. ఈ పంటను ఎక్కువగా ఏజెన్సీ ప్రాంత రైతులే సాగు చేశారు. పోడు భూములు, నీటి సౌకర్యం లేకుండా ఉన్న ప్రాంతాల్లో రైతులు మొక్కజొన్న సాగును ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. కానీ ఆ పంటకు సరిపడా వర్షం కూడా కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో ఎక్కువగా మెట్ట భూములు ఉన్నాయి. ఈ భూముల్లో తేమ నిల్వ ఉండే అవకాశం లేకపోవడంతో రైతులు మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. ఇటీవల అసలే వర్షాలు కురవకపోవడంతో పాలకంకి దశలో ఉన్న పంట ఎండిపోతోంది. ఎకరాకు రూ. 20 వేల మేరకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి వస్తాయో రావోనని భయపడుతున్నారు. రుణమాఫీ కారణంగా బ్యాంకులో రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు తమ పంటలకు ఇన్సూరెన్స్ చేయలేకపోయారు. దీనివల్ల పంట ఎండిపోయినా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైంది. జేడీఏ దృష్టికి పంట నష్టం... జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండిపోయిన మొక్కజొన్న వివరాలను వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులు, జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వి.బి.భాస్కర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. అనుకూలమైన వర్షాలు లేని కారణంగా పంట ఎండిపోయిందని, దీనికి తోడు అధిక ఉష్ణోగ్రతలు ఉండటం కూడా కారణమైందని జేడీఏకు వివరించారు. ఈ అంశంపై జేడీని వివరణ కోరగా ‘గత కొద్ది రోజులుగా వర్షాలు లేవు. బెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న వాడిపోతోంది’ అని చెప్పారు. -
నువ్వు పంట సాగు నాలుగు విధాల బాగు
మరిపెడ : తెలంగాణ ప్రాం తంలో ఖరీఫ్ సీజన్లో పసుపు, మొక్కజొన్న తరువాత వేసవి వరి మాగాణులో నిల్వ ఉన్న తేమ కింద నువ్యు పంట సాగు చేయవచ్చు. వర్షాధారంగా పండించిన దానికంటే రబీ లేదా వేసవిలో ఆరుతడి పంటగా వేసుకుంటే చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. తద్వారా విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొం దవచ్చని మరిపెడ మండల వ్యవసాయ అధికారి సీహెచ్.యాకయ్య (88866 14594) తెలిపారు. నువ్వు పంట సాగు-యాజమాన్య పద్ధతులపై ఆయన వివరించారు. అనువైన నేలలు మురుగు నీరు నిలువని తేమ నిలిచే తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిలిచి ఆమ్ల, క్షార గుణాలు కలిగిన నేలలు పనికిరావు. నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్ని రెండు సార్లు గుంటుకతోలి చదును చేయాలి. ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి మూడింతలు ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. విత్తన రకాలు ఖరీఫ్‌లో గౌరి, మాధవి, ఎలమంచిలి-11, ఎల మంచిలి-17 రకాలు అనుకూలం. ఎలమంచిలి-66(శారద) ఖరీఫ్ లేదా రబీ, వేసవిలో వేసుకోవచ్చు. రబీలో రాజేశ్వరి, శ్వేతాతిల్, చందన, హిమ(జేసీఎస్-9426) రకాలు వేసుకోవాలి. విత్తనశుద్ధి - విత్తే విధానం కిలో విత్తనానికి 3గ్రాముల థైరం లేదా కాప్టన్-ఎ లేదా మాంకోజెబ్‌తో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఖరీఫ్‌లో జూలై చివరి వారం నుంచి ఆగస్టు తొలి వారం వరకు, రబీలో జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి తొలి వారం వరకు పంట వేసుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం ఖరీఫ్‌లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల ప శువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. రబీ లేదా వేసవిలో వీటితోపాటు 8 కిలోల నత్రజనిని అదనంగా వేసుకోవాలి. నత్రజని సగభాగం, భాస్వరం మరియు పొటాష్‌నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. మిగతా సగభాగం నత్రజని ఎరువును విత్తిన నెల రోజులకు కలపు తీసివే యాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్‌ఫాస్ఫేట్ రూపంలో వాడినప్పుడు అదనంగా కాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది. నీటి యాజమాన్యం విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అబివృద్ధి మరియు గింజకట్టు దశల్లో తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35 నుంచి 40 రోజుల నుంచి 65 నుంచి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. కలుపు నివారణ - అంతరకృషి విత్తేముందు ప్లూకోరలిన్ 45శాతం ఎకరాకు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి కలియ దున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారీ చేయాలి. మొక్కలు మొలిచిన 15 రోజులకు అదనపు మొక్కను తీసి వేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. రసం పీల్చే పురుగులు (తెల్లనల్లి, తామర పురుగులు, పచ్చడోమ) : పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేస్తాయి. పురుగులు ఆశించి న ఆకులు ముందుగా పాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి కింది వైపుకు ముడుచుకుపోయి పాలిపోతాయి. నివారణ : మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయోట్ 2మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5మిల్లీలీటర్లు లేదా డైమిథోయోట్ 2మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగులు : ఎండు తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయి. తదుపరి ఆకుల అంచులు లోనికి ముడుచుకోని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలేర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగుచారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్లిపోతాయి. ఎండుతెగులు సోకిన కాండం మీద కాయల మీద గులాబి రంగు శీలింధ్రం బీజాల సముదాయం కనిపిస్తుంది. భూమిలో అధిక ఉష్ణోగ్రత తెగులు వృద్ధికి దోహదపడుతుంది. నివారణ : పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3గ్రాముల థైరం లేదా కాప్టాన్ లేదా కార్బెండిజమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాండం ఎండు తెగులు : కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా నల్లగా మారుతుంది. నివారణ : మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లీటరు నీటితో కలిపి చల్లుకోవాలి. వెర్రితెగులు : ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఎర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగంలో చిన్న చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తిచెందుతుంది. నివారణ : రాజేశ్వరి, చందన, హిమ రకాలు ఈ తెగులును కొంత వరకు తట్టుకుంటాయి. తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. పైరుపై మిథైల్డెమోటాన్ 1మిల్లీలీరు లేదా డైమిథోయోట్ 3మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి దీపపు పురుగులను కూడా అరికట్ట వచ్చు. బూడిద తెగులు : లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలు ఏర్పడుతాయి. తెగులు ఆశించి న ఆకులు మాడి రాలిపోతాయి. నివారణ : నీటిలో కరిగే గంధకపు పొడి 3గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
కరెంట్.. కన్నీరు
నర్సంపేట : ఖరీఫ్ సాగు కర్షకుడి కంట కన్నీరు పెట్టిస్తోంది. కరువు పరిస్థితులు జిల్లా రైతాంగాన్ని వణికిస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో మురిపెంలా కురిసిన తొలకరి చినుకులు రైతుల్లో ఆశలు రేపి... ఆ తర్వాత మొహం చాటేశారుు. వర్షాభావం నేపథ్యంలో కొందరు రైతులు పంటలు సాగు చేయకుండా వెనుకడుగు వేయడంతో పంట భూములన్నీ ఖాళీగా ఉన్నారుు. ఆశతో మరికొందరు రెట్టింపు పెట్టుబడి పెట్టి పలు పర్యాయూలు విత్తనాలు నాటి, బిందె సేద్యంతో పంటలు కాపాడుకున్నారు. అదును దాటిన తర్వాత కొంత నయమనిపించేలా కురిసిన వానలు రైతుల్లో ఆశలను రేకెత్తించారుు. జిల్లాలో సాధారణ వర్షపా తం 703.09 మిల్లీమీటర్లు కాగా... 531.04 మి.మీల వర్షం కురిసింది. ఇది కూడా పంటల సాగు సవుయుం మించిన తర్వాత నమోదైన వర్షపాతమే. జిల్లా లో మొత్తం 5,02,132 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు కావాల్సి ఉండగా... 4,06,558 హెక్టార్లలో మాత్రమే సాగయ్యూరుు. కానీ.. తాజా పరిస్థితులు కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారుు. వర్షాలు కురవకపోవడానికి తోడుగా కరెంట్ కోతలు జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చే స్తున్నారుు. పట్టుమని మూడు గంటలు కూడా కరెం ట్ సరఫరా కాని పరిస్థితులు నెలకొనడంతో నీరు లేక పొలాలు నెర్రెలుబారుతున్నారుు. మక్క, పత్తి, సోయ, వరి పంటలు ఎండిపోతున్నాయి. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా పంటలకు నీరు పెట్టాలని పగలనక రాత్రనక అహర్నిశలు కష్టపడుతు న్నా... విద్యుత్ సరఫరా ప్రతిబంధకంగా మారడం తో రైతులు గుండలవిసేలా రోదిస్తున్నారు. వర్షాలు కురవడం, కరెంట్ సరఫరా గగనంగా వూరడంతో రైతన్నలు సాగుపై ఆశలు వదులుకున్నారు. ప్రస్తు తం జిల్లాలో 70 శాతం మేర వరి అక్కరకు రాకుండా పోరుునట్లు వ్యవసాయ అధికారుల అంచనా. బోసిబోరుున ధాన్యాగారం జిల్లాలోనే ధాన్యాగార కేంద్రంగా పేరొందిన నర్సంపేట ప్రాంతం వరి సాగు లేక బోసిపోరుుంది. ఖరీఫ్‌లో అనుకున్న సవుయూనికి వర్షాలు కురిస్తే పాఖాల, వూధన్నపేట, రంగాయు చెరువుల్లోకి నీరు చేరుతాయుని ఆశించి రైతులు నారు వుడులు సిద్ధ చేసుకున్నారు. వర్షాలు లేక నారు వుడులు ఎండిపోవడంతో పశువుల మేతకు వదిలేశారు. పాకాల సరస్సు కింద 22వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు కావాల్సి ఉండగా... ప్రస్తుతం ఎక్కడ చూసినా బీడు భూవుులే కనిపిస్తూ ఎండిపోరుున ఆనవాళ్లతో నారు వుడుల గుర్తులు ఉన్నారుు. -
పవర్ పంచ్!
చేవెళ్ల: పంటలు ఎండుముఖం పడుతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. ఓ వైపు తీవ్రమవుతున్న విద్యుత్ కోతలు.. మరో వైపు పెరుగుతున్న ఎండలతోపాటు చిరు జల్లులు కూడా లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ముఖ్యంగా అస్తవ్యస్త విద్యుత్ సరఫరా రైతుల కంటిపై కునుకులేకుండా చేస్తోంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్న కాస్త పంటలను కాపాడుకోవడానికి రైతులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఫలితం కన్పించడం లేదు. చేవెళ్ల వ్యవసాయ డివిజన్లో చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలో ఖరీఫ్ సీజన్లో పత్తి, మొక్కజొన్న, వరి పంటలతోపాటు కూరగాయ పంటలను సాగుచేస్తున్నారు. సీజన్ ఆరంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో దిగులుపడిన రైతన్న గత నెలలో కురిసిన వర్షాలతో ఊరట చెందాడు. ఆ సమయంలోనే రైతులు రెండో దఫా మరికొంద సాగు చేపట్టారు. ఇప్పుడాపంటన్నీ ఎండుతున్నాయి. ఓ వైపు వ్యవసాయ బోర్లు, బావులలో నీరుంది.. కానీ విద్యుత్ లేక పంటలు ఎండుతున్నారు. రోజుకు ఏడు గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి 3 నుంచి 4 గంటలకు మించి సరఫరా ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. -
మక్క దక్కేనా?
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచే వరుణుడు రైతులతో దోబూచులాడుతున్నాడు. అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలా మంది అన్నదాతలు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వానలకు ధైర్యం చేసి కొందరు మొక్కజొన్న పంటలు వేశారు. ప్రస్తుతం చేలన్నీ పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఆరుతడి పంటలకు ప్రస్తుతం వాన చాలా అవసరం. కానీ వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, కూరగాయ పంటలు ప్రస్తుతం కాత దశలో ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కురిస్తేనే కంకులు విత్తులు పట్టే అవకాశం ఉంది. కీలకమైన ఈ సమయంలో వరుణుడి జాడ లేక అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. ఎండలు మండి పోతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో ఒక్క వాన పడితే చాలు తమ కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నారు. లేదంటే ఇన్నాళ్లూ పడిన కష్టం వృథా అవుతుందని వాపోతున్నారు. వర్షం పడాలని కోరుతూ ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వానదేవుడు కరుణించాలని వేడుకుంటున్నారు. -
గొర్ల పెంపకం.. లాభదాయకం
గొర్లను పెంచే వారు తప్పకుండా మొదట షెడ్డు నిర్మించుకోవాలి. ఎండ, చలి, వర్షాల నుంచి పూర్తి రక్షణ ఉండేలా చూసుకోవాలి. పిల్లిపెసర, బబ్బెర్లు, గడ్డితో పాటు సుబాబుల్ చెట్ల పెంపకం కోఫార్ రకం గడ్డి, జొన్నను మేతగా వేయాలి. అటవీ ప్రాంతాలు ఉన్న చోట వీటిని మేతకోసం బయటకు కూడా తీసుకెళ్లవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్షకాలంలో గొర్ల కాళ్లకు పుండ్లు కావడం, ముక్కు నుంచి చీము కారడం, చిటుకు వ్యాధులు వంటివి వస్తాయి. వీటి నివారణకు ప్రతిఏటా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మందులను వేయించాలి. జీవాలు కుంటినా, ముక్కు నుంచి చీమిడి కారినా వెంటనే వెటర్నరీ అధికారులకు చూపించాలి. గొర్లు షెడ్డు లోపలకు వెళ్లే దారిలో చిన్నపాటి నీటి తొట్టిని నిర్మించుకుని పొటాషియం పర్మాంగనేట్ వేసి గొర్లు ఉదయం మేతకు వెళ్లేటప్పుడు, సాయంత్రం తిరిగి పాకలోకి వచ్చేటప్పుడు జీవాలు ఈ నీటిలో నుంచి నడిచేలా చూడాలి. దీంతో కాళ్లకు పుండ్లు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. నెల్లూరు క్రాస్ బ్రీడ్ మేలైన రకం గొర్లలో అనేక రకాలు ఉంటాయి. వీటిలో నెల్లూరు క్రాస్ బ్రీడ్ బాగుంది. ఈ రకం జీవాలను ఎనిమిదేళ్లపాటు పెంచవచ్చు. ఇవి ఏడాదికి మూడు పిల్లల చొప్పున 8 ఏళ్లకు 12 ఈతలు ఈనుతుంది. అప్పటికి ముప్పై కిలోల బరువు ఉంటుంది. ఒక్కో గొర్రెకు బహిరంగ మార్కెట్లో రూ.6వేల ధర పలుకుతుంది. ఎనిమిదేళ్లు నిండిన గొర్లు బరువు పెరగవు కాబట్టి వెంటనే వీటిని విక్రయించాలి. గొర్రెలు ఈనగానే పుట్టిన పిల్లలను 15 రోజుల పాటు పాకలోనే ఉంచాలి. తల్లిగొర్రె వెంట పంపరాదు. 15 రోజుల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే తాగించాలి. 40 గొర్లకు ఒక విత్తన పొటేలును పెంచుకోవాలి. దీన్ని కూడా ఎనిమిది ఏళ్ల వరకు విత్తన పొటేలుగా ఉపయోగించుకుని అనంతరం అమ్మేయాలి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ప్రభుత్వం గొర్ల పెంపకానికి నాబార్డ్ ద్వారా సబ్సిడీపై రుణాలు అందజేస్తోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు గొర్ల పెంపక సంఘం దారులకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. గొర్లకు మేత కోసం సబ్సిడీపై మినరల్ మిక్చర్‌తో పాటు కంది, పెసర, మినుముల పొట్టు, పల్లి చెక్కను సబ్సిడీపై అందజేస్తోంది. గొర్ల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కోదానికి నిత్యం 150 నుంచి 200 గ్రాముల వరకు బలవర్ధక ఆహారం ఇవ్వాలి. జీవాలకు విధిగా బీమా చేయించాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ హయాంలో గొర్లకు బీమా అందడం లేదు. దీంతో వీటి పోషకులు నష్టపోయే ప్రమాదముంది. -
మక్కను కోశాక..పసుపులో సస్యరక్షణ
పసుపులో అంతర పంటగా వేసిన మొక్కజొన్నను కోయగానే కలుపు తీయాలి. పసుపులో ఉండే కలుపుతో పాటు మొక్కజొన్న ఆకులను, కొయ్యలను తీసేయాలి. 20 రోజులకొకసారి చొప్పున మూడుసార్లు కలుపు తీయాలి. కలుపు తీసిన ప్రతిసారి పొటాష్ వెదజల్లాలి. కలుపు తీసిన తర్వాత పంటకు తడి అందించాలి. తేమ ఉన్నప్పుడు ఒక హెక్టార్ పసుపు పంటకు 60 కేజీల పొటాష్ వెదజల్లాలి. లేదా లీటర్ నీటికి కార్బండైజమ్ 1.5 మి.లీటరు, కాపర్ ఆక్సైడ్ 3 గ్రాములు, 19:19 10 గ్రాములు కలిపి 400 లీటర్ల మందును పిచికారి చేయాలి. పసుపు ఆకుపై మచ్చలు ఉంటే మర్రి ఆకు తెగులు సోకిందని గుర్తించి 400 లీటర్ల నీటికి 200 మిల్లీ లీటర్ల మోనో క్రొటోఫాస్, వంద గ్రాముల కాపర్ ఆక్సైడ్ కలిపి ఆకులపై పిచికారి చేయాలి. మొక్కజొన్న కోసిన తర్వాత రైతులు కాంప్లెక్స్ ఎరువు 20:20 ను పొటాష్‌తో కలిపి వేస్తారు. కానీ ప్రస్తుత దశలో పసుపు పంటకు కాంప్లెక్స్ ఎరువుతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల కాంప్లెక్స్ ఎరువులు వేయరాదు. పసుపు పంటకు దుంపకుళ్లు సోకితే పసుపు ముదురు ఆకులు పూర్తిగా ఎండి పోతాయి. ఆకులను తీస్తే దుర్వాసన వస్తుంది. పసుపులో నీటి నిలువ ఎక్కువగా ఉంచరాదు. నీరు తక్కువ మోతాదులోనే పంటకు అందించాలి. దుంప కుళ్లను ప్రస్తుత దశలో పూర్తిగా నివారించలేం. కేవలం వ్యాపించకుండా చర్యలు చేపట్టవచ్చు. -
అంతర పంటలు.. అదనపు మేలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా రైతాంగం అంతర పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సోయా పంటలో కంది, పెసర, మొక్కజొన్న వంటి పంటలు వేశారు. జిల్లావ్యాప్తంగా 1.14 లక్షల హెక్టార్లలో సోయా పంట వే సుకున్నారు. ఇందులో అంతర పంటగా ఎక్కువగా కంది విత్తుకున్నారు. 11 వేల హెక్టార్లలో కంది విత్తుకున్నట్లు తెలుస్తోంది. సోయా దిగుబడి వచ్చేలోపు మరో పంట కూడా చేతికందుతుందని రైతులు పేర్కొంటున్నారు. పత్తి పంటలో 2 వేల హెక్టార్ల వరకు కంది విత్తనం అంతర పంటగా వేసుకున్నారు. జిల్లాలో ఎక్కువగా జైనథ్, బేల, తాంసి, తలమడుగు, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ తదితర మండలాల్లో అంతర పంటలుగా కంది వేశారు. నిర్మల్ డివిజన్లో పసుపు పంటలో మొక్కజొన్న వేసుకున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తమకు మరిన్ని సలహలు సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు. అంతర పంటల సాగుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని వారు ఆశిస్తున్నారు. -
ఖరీఫ్ పంటలు.. ప్రస్తుత యాజమాన్య పద్ధతులు
కందుకూరు: ఈ ఖరీప్ పంట కాలంలో ప్రస్తుతం జిల్లా పరిధిలో సాగవుతున్న పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కంది ముఖ్యమైనవి. ఈ తరుణంలో సాగవుతున్న ఆయా ప్రధాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డా.సీహెచ్.చిరంజీవి, డా.పి.అమ్మాజీ, డా.ఎన్.ప్రవీణ్ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. వరి పంటలో.. ప్రస్తుతం వరి పంట దుబ్బు చేసే దశలో ఉంది. ఈ సమయంలో రెండో దఫా వేయాల్సిన నత్రజని ఎరువులను వేసుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులను దుబ్బు చేసే సమయంలో గాని అంకురం ఏర్పడే దశలో గాని వేయకూడదు. జిల్లాలోని కొన్ని మండలాల్లో జింకు ధాతు లోపం ఉంది. ఈ ధాతు లోపం వచ్చినప్పుడు ఆకులపై ఇటుక రంగు మచ్చలేర్పడతాయి. మొక్క దుబ్బు చేయదు. జింకు ధాతు లోపం గమనించినప్పుడు లీటర్ నీటికి 2 గ్రా. జింకు సల్ఫేటును కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు, మూడుసార్లు పిచికారీ చేస్తే ఈ లోపాన్ని నివారించవచ్చు. పత్తిలో.. పత్తి విత్తిన తొలి దశలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పెరుగుదల కొంత వరకు తగ్గినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలతో పంట ప్రస్తు తం పూత, గూడు, కాత దశలో ఉంది. పత్తిలో రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, తెల్ల దోమ, తామర పురుగులు ఆశిస్తున్నాయి. వీటి నివారణకు ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ధయోమిథాక్సామ్ 0.2 గ్రా, లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇటీవల ధారూరు, తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని మండలాల్లో 15-20 రోజులుగా తరచూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భూమిలో తేమ అధిక మై వేరుకుళ్లు తెగులు, వడలు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఈ తెగులు ఆశించినప్పుడు లేత మొక్కలు అర్ధాంతరంగా చనిపోతాయి. ఈ తెగులు ఉధృతిని తగ్గించడానికి 30 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 20 గ్రా. స్ప్రింట్‌ను 10 లీటర్ల నీటికి కలిపి ఈ ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. ప్రస్తుతం తరచుగా వర్షాలు కురవడం, మబ్బులు పట్టిన వాతావరణ పరిస్థితుల్లో నల్లమచ్చ తెగులు కూడా సోకే అవకాశం ఉంది. ఈ తెగులు సోకినప్పుడు మొదట ఆకుల మీద కోణాకారపు మచ్చలు ఏర్పడతాయి. దీనినే బ్లాక్ ఆర్మ్ అంటారు. దీని నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్, 1 గ్రా. పౌషామైసిన్ లేదా ప్లాంటోమైసిన్ మందును కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. కంది.. ప్రస్తుతం కంది పంటలో ఎండు తెగులు చాలా ప్రాంతాల్లో సోకింది. తరచుగా పడుతున్న వ ర్షాల కారణంగా పొలంలో నీరు నిలబడే అవకాశం ఉంటుంది. అధికంగా ఉన్న నీటిని పొలం నుంచి బయటకు పంపించి తేమ ఆరిన త ర్వాత దంతెలతో అంతర కృషి చేసుకోవాలి. ఈ తెగులు నివారణకు ఎటువంటి మందులు లేవు. ఎండు తెగులు సోకిన పొలాల్లో జొన్న పంటతో పంట మార్పిడి చేసుకోవాలి. తెగులు తో ఎండిపోయిన మొక్కలను పీకి వేయాలి. మొక్కజొన్న.. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో మొక్కజొన్న సా గు విస్తీర్ణం సాధారణం కంటే తగ్గింది. ప్రసు ్తతం మొక్కజొన్న కండె ఏర్పడే దశలో ఉంది. ఈ దశలో చివరి మోతాదుగా ఎకరాకు 40 కి లోల యూరియా 15 కిలోల పొటాష్‌ను కలిపి మొక్క వేరు వ్యవస్థకు దగ్గరగా వేసుకోవాలి.